Home Blog Page 21

మొబైల్ వినియోగదారులకు షాక్..

Mobile Recharge Price Hike
Mobile Recharge Price Hike

Mobile Recharge Price Hike: నిత్యావసర వస్తువులు, ఇతర సేవల ధరల పెరుగుదలతో ఇప్పటికే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు టెలికం రంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు కూడా వినియోగదారులకు గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ పరిశోధనా సంస్థ Centrum Institutional Research తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రానున్న రోజుల్లో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అవెలా ఉంటాయంటే?

రాబోయే 3 నుండి 4 నెలల కాలంలో టెలికం కంపెనీలు తమ టారిఫ్ (రీఛార్జ్ ప్లాన్ల) ధరలను 12 నుండి 15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్‌పై అదనపు భారం పడే అవకాశం ఉంది. టెలికం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి మరియు నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా 4G మరియు 5G నెట్‌వర్క్‌ల విస్తరణ వేగంగా జరగడమే ధరల పెంపునకు గల ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల సాధారణ వినియోగదారుల డేటా వినియోగం మునుపెన్నడూ లేనంతగా భారీగా పెరిగింది. ఈ పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని, నాణ్యతను మెరుగుపరచడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది.

మరోవైపు, ప్రస్తుత జూన్ త్రైమాసికంలో టెలికం కంపెనీల ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ – ప్రతి వినియోగదారుడి నుండి వచ్చే సగటు ఆదాయం) 1 నుండి 1.5 శాతం వరకు పెరగొచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. అయితే, కంపెనీలు దీర్ఘకాలికంగా లాభాల్లో కొనసాగాలన్నా, తదుపరి సాంకేతికతను తట్టుకోవాలన్నా ARPU మరింత పెరగడం అవసరమని భావిస్తున్నాయి. అందుకే, రానున్న పండుగల సీజన్ లేదా తదుపరి త్రైమాసికం లోపు వినియోగదారులపై టారిఫ్ పెంపు భారాన్ని మోపడానికి టెలికం దిగ్గజాలు రంగం సిద్ధం చేస్తున్నాయి.

అబ్బాయిలు 28.. అమ్మాయిలు 26.. ఇదొక్కటి చాలు ప్రపంచానికి భారత్ ఎంత ఆదర్శమో చెప్పడానికి..

India Marriage System
India Marriage System

India Marriage System: నిజమే భారత్ ఒక సనాతన దేశం. కొంతమంది ఉదారవాదులు.. ఎర్రి భావజాలం ఉన్నవాళ్లు.. మన దేశ ధర్మాన్ని.. సంస్కృతిని విమర్శిస్తూ ఉంటారు. అదేపనిగా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. కానీ భారత్ అంటే ఏంటి.. భారతదేశం గొప్పతనం.. భారతదేశానికి సంబంధించిన సంస్కృతి ఇప్పటికి చరిత్ర పుటల్లో భద్రంగానే ఉంది.

మన దేశానికి గొప్ప పేరును తీసుకొచ్చిన అనేక అంశాలలో ప్రధానమైనది వివాహ వ్యవస్థ. ఇప్పటికీ మనదేశంలో 85% వివాహాలు పెద్దలు కుదిర్చినవే. అంతటి అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయుల్లో చాలామంది పెద్దలు కుదిరించిన వివాహాలు చేసుకోవడం విశేషం. పెద్దలు కుదిరించి చేసిన వివాహాలలో చాలావరకు బలంగా ఉంటున్నాయి. నేటి కాలంలో ప్రేమ వివాహాలు విఫలమవుతున్న వేళ.. పెద్దలు కుదిరించి చేసిన వివాహాలు మాత్రం బలంగా నిలబడుతున్నాయి.

ఇటీవల మనదేశ వివాహ వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం మనదేశంలో 85% వివాహాలు ఇప్పటికీ పెద్దలు కుదిరించి చేసినవే కావడం విశేషం. 15 సంవత్సరాల క్రితంతో పోల్చి చూస్తే భారతీయుల సగటు వివాహ వయసు రెండు సంవత్సరాలు.. పెరిగింది. ఇందులో అబ్బాయిలకు 28.. అమ్మాయిలకు 26 ఏళ్ల వయసులో వివాహాలు చేస్తున్నారు. 65% కుటుంబాలు కాబోయే వధూవరుల బయోడేటా తో పాటు జాతక చక్రాలను కోరుతున్నాయి. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే అత్యంత చిన్న వయసులో వివాహం జరుపుకుంటున్న పురుషులు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియా దేశంలో పురుషుల యావరేజ్ మ్యారేజ్ ఏజ్ 39.3 సంవత్సరాలు కావడం విశేషం.

ప్రేమ వివాహాలు కూడా మనదేశంలో బాగానే జరుగుతున్నాయి. గతంతో పోల్చి చూస్తే వీటి సంఖ్య పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం.. ఉద్యోగం.. కెరియర్.. ఇతర వ్యవహారాలతో యువత తమకు కావలసిన భాగస్వాములను ఎంచుకున్నప్పటికీ.. అంతిమంగా వివాహం ప్రస్తావన వచ్చేసరికి పెద్దల నిర్ణయానికి ఓటు వేయడం విశేషం. పెద్దల కట్టుబాట్లు.. సంస్కృతి.. సంప్రదాయాలు.. ఇతర వ్యవహారాలు భారతీయ వివాహ వ్యవస్థను మిగతా దేశాలతో పోల్చి చూస్తే భిన్నంగా నిలుపుతున్నాయి. అందువల్లే సర్వే నిర్వహించిన సంస్థ ఆసక్తికరమైన విషయాలను బయటకు వెల్లడించింది.

“ప్రేమ వివాహాలు చేసుకోవడానికి యువత ఆసక్తిగా ఉన్నారు. కొంతమంది పెద్దలు కుదిరించి చేసిన వివాహాలకు ఆసక్తి చూపిస్తున్నారు. కులాల కట్టుబాట్లు చాలా వరకు తగ్గిపోయాయి. సంస్కృతి సంప్రదాయాలను పాటించే క్రమంలో కొత్త కొత్త విధానాలు తెరమీదికి వచ్చాయి. వెస్ట్రన్ కల్చర్ మన జీవితంలోకి వేగంగా దూసుకుని వచ్చినప్పటికీ.. సనాతన సంస్కృతిని అధిగమించే స్థాయిలో అయితే కాదని” సర్వే నిర్వహించిన వారు చెబుతున్నారు. కాకపోతే ఈ సర్వే ద్వారా భారతీయ వివాహ వ్యవస్థ గురించి అనేక రకాలైన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కార్లు కొంటే రూ.2 లక్షలు మాఫీ.. పాత కారు ఇస్తే లక్ష.. ఏంటీ ఈ పాలసీ..

Delhi EV Policy 2.0
Delhi EV Policy 2.0

Delhi EV Policy 2.0: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం Delhi EV Policy 2.0 (2026-2030) ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త విధానం ద్వారా ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల కొనుగోలుకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించి 2030 నాటికి ఢిల్లీని గ్రీన్ మొబిలిటీ నగరంగా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. ఈ పాలసీ ద్వారా కార్లు కొనేవారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఎంత వరకు డబ్బు ఆదా అవుతుంది?

ఈ కొత్త ఢిల్లీ పాలసీ ప్రకారం.. రూ. 30 లక్షతల లోపు ఎక్స్ షోరూమ్ ధర ఉన్న ప్రతి బ్యాటరీ ఎలక్ట్రిక్ కారుకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల నుండి 100% పూర్తి మినహాయింపు లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల కొనుగోలుదారులకు ఆన్ రోడ్ ధరపై నేరుగా రూ. 1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఆర్థిక ఉపశమనం కలుగుతుంది. తమ కుటుంబం కోసం మొదటి లేదా రెండవ కారుగా ఈవీని ఎంచుకోవాలని చూస్తున్న వారికి ఈ ఆఫర్ ఒక గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది.

ఈ సరికొత్త ఈవీ విధానం జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మార్చి 31, 2030 వరకు కొనసాగుతుంది. ఈ పాలసీ వల్ల అన్నింటికంటే ఎక్కువగా లబ్ధి పొందేవి ఫోర్ వీలర్స్ కావడం విశేషం. అయితే, కొనుగోలుదారులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వంద శాతం పన్ను మినహాయింపు కేవలం పూర్తి ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ మరియు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వాహనాలకు ఈ రాయితీలు వర్తించవు.

భారతదేశంలో అత్యంత నమ్మదగిన, బడ్జెట్ అనుకూల ఎలక్ట్రిక్ కార్లు ప్రస్తుతం రూ. 15 లక్షల విభాగంలోనే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయోజనాలన్నింటినీ అందుకోవడానికి మార్కెట్లో ప్రస్తుతం ఎనిమిది ప్రముఖ మోడళ్లు రేసులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా టాటా టియాగో ఈవీ (Tata Tiago EV), ఎమ్‌జీ కామెట్ ఈవీ (MG Comet EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ (Citroen eC3X), టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), మహీంద్రా ఎక్స్ యూవీ 3 ఎక్స్ వో ఈవీ(Mahindra XUV3XO EV) ప్రముఖంగా ఉన్నాయి.

పన్ను మినహాయింపులతో పాటు, పాత వాహనాలను వదిలించుకోవాలనుకునే వారికి ప్రభుత్వం అదనపు గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైనా తమ పాత BS-IV లేదా అంతకంటే పాత ఢిల్లీ-రిజిస్టర్డ్ పెట్రోల్ లేదా డీజిల్ కారును స్క్రాప్ (రద్దు) చేసి, ఆ తర్వాత ఆరు నెలల లోపు అర్హత గల కొత్త ఈవీని కొనుగోలు చేస్తే.. వారికి రూ. 1 లక్ష వరకు అదనపు స్క్రాపింగ్ ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, ఈ అదనపు లబ్ధి కేవలం మొదటి ఒక లక్ష మంది దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది.

వైయస్ జగన్ కోసం జడ శ్రావణ్ 25 కోట్ల ఖర్చు.. వెలుగులోకి బ్లాస్టింగ్ వీడియో

Jada Sravan
Jada Sravan

Jada Sravan Kumar: నిజమే.. మీరు చదివింది ముమ్మాటికి నిజమే. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు. నేను కావాలని స్ప్రెడ్ చేస్తున్న ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ అంతకంటే కాదు. ఈ విషయాన్ని స్వయంగా జడ శ్రావణ్ చెప్పారు. అది రికార్డు అయింది. యూట్యూబ్ ద్వారా బయటికి వచ్చింది. రకరకాల చర్చలకు కారణమైంది. అంతేకాదు, జడ శ్రవణ్ అసలు రంగు బయటపడుతోంది.

కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాలలో జడ శ్రవణ్ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కదా.. పైగా ఆయన ఓ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. పది ఫెయిల్ అయిన నువ్వు డిప్యూటీ సీఎం అవ్వంగా లేంది.. జడ్జి చదువుకున్న నేను డిప్యూటీ సీఎం కాకూడదా అంటూ ప్రశ్నించారు. వాస్తవానికి జడ్జి అనేది ఒక చదువు కాదు. అది ఒక ఉద్యోగం మాత్రమే. అనుభవం ద్వారానే అది ఇస్తారు. ఆ విషయాన్ని మర్చిపోయి శ్రవణ్ మాట్లాడారు. జనసేన నాయకుల చేతిలో తీవ్రస్థాయిలో విమర్శలకు గురయ్యారు. జడ శ్రవణ్ ఎప్పుడైతే ఆ విమర్శ చేశారో.. అప్పట్నుంచి జన సైనికుల చేతిలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జడ శ్రవణ్ గురించి జనసేన నాయకులు కొత్త కొత్త వీడియోలు బయటపెడుతున్నారు.

జనసేన నాయకులు బయటపెట్టిన వీడియోలలో ఒకటి మాత్రం సంచలనం కలిగిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో బ్లాస్టింగ్ కు కారణమవుతోంది. ఆ వీడియోలో జడ శ్రవణ్ జగన్ గురించి చెప్పారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద కేసులు వేయడానికి దాదాపు 25 కోట్ల వరకు శ్రావణ్ ఖర్చు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 కేసులు వేశానని శ్రావణ్ చెప్పుకొచ్చారు. దళిత వైద్యుడు సుధాకర్ చనిపోయినప్పుడు.. దళితుల హత్యలు జరిగినప్పుడు శ్రావణ్ ఏనాడు కూడా బయటికి రాలేదు. కనీసం బాధితుల తరఫున స్వరం కూడా వినిపించలేదు. అటువంటి వ్యక్తి 25 కోట్లు ఖర్చుపెట్టి 500 కేసులు వేసాడు అంటే నమ్మశక్యంగా లేదని జనసేన నాయకులు అంటున్నారు.

తన వ్యక్తిగత జీవితంలో నిజాయితీని మాత్రమే నమ్ముకున్నానని పదేపదే చెప్పే శ్రావణ్.. 25 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని.. ఆ నగదు ఎలా సమీకరించారని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. పాటికి పదిసార్లు పవన్ కళ్యాణ్ ను విమర్శించే శ్రావణ్.. తాను 25 కోట్లు ఏ రూపంలో సంపాదించారో చెప్పాలని అడుగుతున్నారు. ఒక జడ్జిగా ప్రభుత్వం ఆయనకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తుందని.. జీతం కూడా భారీగానే ఇస్తుందని.. ఎంతటి భారీ జీతం ఇచ్చినప్పటికీ ఆ స్థాయిలో నగదు ఎలా సమీకరిస్తారని జనసేన నాయకులు అడుగుతున్నారు. మరి దీనికి జడ శ్రావణ్ ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.

యాపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ మోడల్స్ పై రూ.14 వేల డిస్కౌంట్..

Apple iPhone 17 Pro Discount
Apple iPhone 17 Pro Discount

Apple iPhone 17 Pro Discount: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026’లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు కొనాలనుకునే వారికి ఒక సువర్ణావకాశాన్ని అందించింది. ముఖ్యంగా మార్కెట్లో అత్యంత క్రేజ్ ఉన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లైన యాపిల్ ఐఫోన్ 17 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్ లపై మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. మరి ఆ ఆఫర్లు ఏవో చూద్దాం.. త

యాపిల్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ప్రో పై ఈ సేల్‌లో ఏకంగా రూ. 14,000 వరకు భారీ తగ్గింపు అందిస్తోంది. సాధారణంగా రూ. 1,34,900 ధర కలిగిన ఐఫోన్ 17 ప్రో (256GB బేస్ వేరియంట్) పై అమెజాన్ ఫ్లాట్‌గా రూ. 10,000 డిస్కౌంట్ ఇస్తోంది. దీనికి తోడు ఎస్‌బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే మరో రూ. 4,000 అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో దీని ఎఫెక్టివ్ ధర రూ. 1,20,900 కే దిగివచ్చింది. ఈ ఫోన్ పవర్‌ఫుల్ A19 ప్రో చిప్‌సెట్, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు సరికొత్త AI ఫీచర్లతో వస్తుంది.

మరోవైపు ఆండ్రాయిడ్ విభాగంలో రారాజుగా నిలిచిన Samsung Galaxy S26 పై కూడా అమెజాన్ అదిరిపోయే డీల్స్ ప్రకటించింది. ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్ అయిన ‘గెలాక్సీ ఎస్26 అల్ట్రా’ తో పాటు గెలాక్సీ ఎస్26 ప్లస్‌లపై 11 శాతం నుంచి 25 శాతం వరకు ధరల తగ్గింపు అందుబాటులో ఉంది. సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, అద్భుతమైన 200MP క్వాడ్ కెమెరా సెటప్, గెలాక్సీ AI వంటి నెక్స్ట్-లెవెల్ ఫీచర్లతో వచ్చే ఈ ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌ల ద్వారా మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు, ఐఫోన్ 16, ఐఫోన్ 17 బేస్ మోడల్స్, శామ్‌సంగ్ గెలాక్సీ A56 5G వంటి మిడ్ రేంజ్ ఫోన్‌లపై కూడా 20 నుంచి 35 శాతం వరకు డిస్కౌంట్లు నడుస్తున్నాయి.

ఒకే బైక్ మీద పదిమంది.. పాకిస్తాన్ అంటే అలానే ఉంటుంది..

Bike Viral Video
Bike Viral Video

Bike Viral Video: పాకిస్తాన్ గురించి వచ్చే వార్తలు చాలా వింతగా ఉంటాయి. ఆ దేశంలో జరిగే సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియాలో పాకిస్తాన్ గురించి జరిగే చర్చ ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల గురించి ఒక విధంగా జరుగుతూ ఉంటే.. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో మరో విధంగా సాగుతూ ఉంటుంది. పాకిస్తాన్ దేశంలో జరిగే సంఘటనలు.. ప్రపంచానికి ప్రెస్ నుంచి విముక్తి కలిగిస్తాయి. ఒక ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ అనేది ప్రపంచానికి స్ట్రెస్ బస్టర్ లాంటిది. అలాగని పాకిస్తాన్ గొప్ప దేశమని చెప్పడం లేదు. కామెడీ పీస్ అని చెప్పడం మా ఉద్దేశం.

పాకిస్తాన్ దేశంలో రోడ్లు సరిగా ఉండవు. రోడ్లు ధ్వంసం అయితే పట్టించుకునే వాడు ఉండడు. బాంబులు పేలి మనుషులు చనిపోతే వాళ్ల కర్మకు వాళ్ళు పోయారు అనుకుంటారే తప్ప.. ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని ఏమాత్రం సమీక్షించరు. పైగా ప్రజల మీద పన్నులు వీర లెవల్లో వేసి వసూలు చేయడంలో పాకిస్తాన్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీని మించిపోతారు. ఆ స్థాయిలో పన్నులు వసూలు చేసినప్పటికీ పాకిస్తాన్లో అభివృద్ధి.. మనుషుల్లో మెరుగైన జీవనం అంజనం వేసి వెతికినా కనిపించదు.

పాకిస్తాన్ దేశంలో ట్రాఫిక్ నిబంధనలు పెద్దగా ఉండవు. వాస్తవానికి అక్కడ రోడ్లు సక్రమంగా ఉంటే కదా. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్ వంటి ప్రాంతాలను మినహాయిస్తే మిగతా చోట్ల దారుణంగా ఉంటుంది పరిస్థితి. పాకిస్తాన్ దేశంలో ఒక్కో ద్విచక్ర వాహనం మీద ముగ్గురు లేదా నలుగురు.. కొన్ని సందర్భాల్లో అంతకుమించిన జనం కూర్చుంటారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్ దేశంలో ఒక వీధిలో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బైక్ మీద పదిమంది ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది..

సాధారణంగా ఒక ద్విచక్ర వాహనం మీద ఇద్దరు ప్రయాణిస్తారు. కానీ ఆ బైక్ మీద ముగ్గురు మహిళలు.. వారి చేతులలో మరో ఆరుగురు పిల్లలు.. మొత్తం పది మంది కూర్చోవడంతో చూసేవాళ్ళు విస్తు పోయారు. పాకిస్తాన్లో ఇది కామన్ అయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో వెలుగులోకి రావడంతో..చూసే నెటిజన్ల కు దిమ్మ తిరిగిపోయింది. ఈ బండి నడుపుతున్న వ్యక్తి ఏకంగా ఫ్యూయల్ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉండటం విశేషం. ప్రాణాలు తెగించి వారు చేస్తున్న ఈ ప్రయాణం పై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అంతమంది ఒకే బైక్ మీద ప్రయాణించకుంటే నష్టం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.

ఒక్క ముద్దుతో ఐదు ప్రయోజనాలు.. ఆరోగ్యం..

World Kiss Day
World Kiss Day

World Kiss Day: ప్రేమ, ఆప్యాయత, అనుబంధం, విశ్వాసం వంటి భావాలను మాటలకంటే అందమైన స్పర్శ ద్వారా వ్యక్తపరిస్తే ఆ వ్యక్తుల మద్య ప్రేమ మరింత బలపడుతుంది. అయితే ఈ స్పర్శ ముద్దు(Kiss)ద్వారా ఉంటే అత్యంత సహజమైన భావోద్వేగ వ్యక్తీకరణగా దీనిని భావిస్తారు. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో భాగస్వాముల మధ్య అందమైన స్పర్శ అనేది చాలా అవసరం. ఈ అనుబంధానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ కిస్ డే (World Kiss Day) ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ కిస్ డేను ఎప్పుుడ ప్రారంభించారు? ఈరోజు ఏం చేస్తారు?

ప్రపంచ కిస్ డే ఎలా ప్రారంభమైంది?
ప్రపంచ కిస్ డేకు 1990ల చివర్లో బ్రిటన్‌లో బీజం పడింది. 2000 సంవత్సరం నుంచి ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఖరీదైన బహుమతులు, ఆర్భాటాల కంటే ప్రేమను నిజాయితీగా వ్యక్తపరచడం ఎంత ముఖ్యమో గుర్తు చేయడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. జీవిత భాగస్వాములు, ప్రేమికులు మాత్రమే కాదు.. తల్లిదండ్రులు-పిల్లలు, కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్య కూడా ప్రేమాభిమానాలకు ముద్దు ఒక ప్రతీకగా నిలుస్తుంది.

1. ముద్దుతో క్యాలరీలు కూడా ఖర్చవుతాయా?
నిపుణుల అంచనా ప్రకారం.. ఒక నిమిషం పాటు ఇచ్చే ముద్దు ద్వారా సుమారు 2 నుంచి 6 క్యాలరీలు వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇది వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాకపోయినా, శరీరంలోని కొన్ని కండరాలు చురుకుగా పనిచేయడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ముఖంలోని అనేక కండరాలు ఒకేసారి కదలడం వల్ల వాటికి సహజమైన వ్యాయామం లభిస్తుంది.

2. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది
ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి “హ్యాపీ హార్మోన్లు” విడుదలవుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు సంతోష భావన పెరుగుతుంది. ఆందోళన, టెన్షన్ తగ్గి భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

3.గుండె ఆరోగ్యానికి కూడా మేలు
ప్రేమతో ఇచ్చే ముద్దు వల్ల గుండె వేగం కొద్దిగా పెరగడంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇది ఒత్తిడిని తగ్గించడం ద్వారా రక్తపోటు (BP) నియంత్రణకు కూడా కొంతవరకు సహాయపడే అవకాశం ఉంది. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి.

4.ముఖ కండరాలకు సహజ వ్యాయామం
ముద్దు పెట్టుకునే సమయంలో ముఖంలోని 30కి పైగా కండరాలు పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ముఖ కండరాలకు సహజమైన వ్యాయామం లభించి, రక్తప్రసరణ మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ముఖ చర్మం తాజాగా కనిపించడానికీ పరోక్షంగా సహాయపడుతుంది.

5.రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం
పరస్పర ప్రేమాభిమానాలతో ముద్దు పెట్టుకోవడం వల్ల కొన్ని సూక్ష్మజీవుల పరిచయం ద్వారా రోగనిరోధక వ్యవస్థ స్పందించే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇంకా విస్తృతమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ జలుబు, ఫ్లూ, నోటి ఇన్ఫెక్షన్లు లేదా ఇతర అంటువ్యాధులు ఉన్నప్పుడు ముద్దు ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

EMI ఒక్కరోజు ఆలస్యమైతే ఏం జరుగుతుందో తెలుసా..

EMI Payment Delay
EMI Payment Delay

EMI Payment Delay: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు చాలా మందికి అందుబాటులో ఉంటోంది. అయితే ప్రతి నెల లోన్ లేదా క్రెడిట్ కార్డు EMI చెల్లించే వారు ఒక్కరోజు ఆలస్యమైనా తమ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. అయితే ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. EMI ఒక్కరోజు ఆలస్యమైందంటే వెంటనే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందని భావించాల్సిన అవసరం లేదు. అసలు ప్రభావం ఎంత ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు EMI గడువు దాటిన వెంటనే క్రెడిట్ బ్యూరోలకు సమాచారం పంపవు. చాలా సందర్భాల్లో 3 నుంచి 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో బకాయిని పూర్తిగా చెల్లిస్తే ఆలస్య రుసుములు లేదా పెనాల్టీ పడే అవకాశం ఉన్నప్పటికీ, క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే ప్రతి బ్యాంకు లేదా రుణ సంస్థ నిబంధనలు ఒకేలా ఉండవు. కొన్ని సంస్థలు చాలా తక్కువ గ్రేస్ పీరియడ్ ఇస్తే, మరికొన్ని ఎక్కువ సమయం ఇవ్వొచ్చు. అందువల్ల లోన్ తీసుకున్న బ్యాంకు లేదా NBFC నిబంధనలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. EMI ఆలస్యమైతే ఎలాంటి ఛార్జీలు, వడ్డీ లేదా పెనాల్టీలు వర్తిస్తాయో కూడా పరిశీలించాలి.

ఒకవేళ EMI చెల్లింపులో ఆలస్యం ఎక్కువ రోజులు కొనసాగితే పరిస్థితి మారుతుంది. 30 రోజులకుపైగా బకాయి ఉంటే చాలా బ్యాంకులు దానిని క్రెడిట్ బ్యూరోలకు లేట్ పేమెంట్ గా నివేదిస్తాయి. దీంతో క్రెడిట్ స్కోర్ గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత కొత్త లోన్ లేదా క్రెడిట్ కార్డు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ తగ్గితే దాని ప్రభావం భవిష్యత్ ఆర్థిక లావాదేవీలపై కనిపిస్తుంది. గృహ రుణం, వ్యక్తిగత రుణం, వాహన రుణం వంటి వాటికి దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు ముందుగా క్రెడిట్ స్కోర్‌ను పరిశీలిస్తాయి. స్కోర్ తక్కువగా ఉంటే రుణం తిరస్కరించే అవకాశం లేదా ఎక్కువ వడ్డీ రేటుతో రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది.

EMI చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా ఉండేందుకు ఆటో-డెబిట్, ECS లేదా ఆటోపే వంటి సదుపాయాలను ఉపయోగించడం ఉత్తమం. బ్యాంక్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచడం, గడువు తేదీకి ముందే చెల్లింపులు పూర్తి చేయడం, రిమైండర్లు సెట్ చేసుకోవడం వంటి అలవాట్లు క్రెడిట్ స్కోర్‌ను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.

జోసెఫ్ రావణ్ తప్పించుకోలేరు.. ఏంటి ఉపా చట్టం?!

Joseph Ravan
Joseph Ravan

Joseph Ravan: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనం ప్రశ్న రావణ్ అరెస్ట్. ఆయనపై అత్యంత ప్రమాదకర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలే కారణమని భావించారు కానీ.. ఈ కఠినమైన చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ఆయన గతాన్ని సైతం తవ్వారు. కేవలం ఇలానే ఊరుకుంటే మరింతగా రెచ్చిపోతారని భావించి.. సమాజంలో ఉద్రిక్తతలకు దారి తీసే వ్యాఖ్యలు చేస్తున్నారని.. దేవుళ్లతో పాటు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతూ అత్యంత ప్రమాదకర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇది జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు దారి తీస్తోంది. ఇంతటి ప్రమాదకరమైన చట్టం కింద ఎందుకు కేసులు నమోదు చేశారు.. అసలు ఈ చట్టం ఎలా పుట్టుకొచ్చింది? అనే దానిపై బలమైన చర్చ నడుస్తోంది.

* ఆ కారణాలతోనే..
భారతదేశంలో పుట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను వ్యతిరేకిస్తూ ప్రశ్న రావణ్.. హిందూ దేవుళ్ళతో పాటు దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక విధంగా ఇది ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించేదిగా ఉంది. అందుకే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ( UAPA) కింద కేసులు నమోదు చేశారు. 2004లో వివాదాస్పద పోటా చట్టాన్ని రద్దు చేసిన తర్వాత.. యూపీఏ హయాంలో ఉగ్రవాద నిరోధక చట్టంగా మార్చారు. నాటి నుంచి నేటి వరకు కేవలం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఉద్దేశంతోనే సాగింది ఈ చట్ట ప్రయాణం. అయితే అటువంటి బలమైన చట్టం కింద ప్రశ్న రావణ్ పై కేసు నమోదు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ హిందుత్వ వాదాన్ని అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒక కుట్రగా అనుమానిస్తున్నారు. పైగా జోసెఫ్ రావణ్ వెనుక నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వారు ఉన్నారని కొన్ని రకాల ఆడియోలు బయటపడ్డాయి. సమాజంలో అలజడులు సృష్టించి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా జోసెఫ్ రావణ్ చర్యలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆయనపై ఈ కఠినమైన చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

* బెయిల్ దాదాపు అసాధ్యం..
సాధారణంగా ఈ చట్టం కింద నమోదవుతున్న కేసులలో నిందితులకు బెయిల్ లభించడం దాదాపు అసాధ్యం. చట్టంలోని సెక్షన్ 43d (5) ప్రకారం ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు.. పాము నిర్దోషులమని ప్రాథమికంగా నిరూపించుకునే వరకు న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేయవు. గతంలో చాలామంది విషయంలో ఇది అర్థం అవుతుంది. దేశ సార్వభౌమత్వాన్ని, భద్రతను కాపాడేందుకు ఈ కఠిన చట్టాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు జోసెఫ్ రావణ్ వెనుక ఈ కేసులు నమోదు చేయడం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆయన చేసిన వీడియోలు, దేవుళ్ళపై కామెంట్స్ మాత్రం ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటువంటి కఠినమైన చట్టాలు ద్వారా కేసులు నమోదు చేయడం సహేతుకం అన్న మాట వినిపిస్తోంది. జోసెఫ్ రావణ్ అరెస్టు వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చు కానీ.. ప్రశ్నించే వారి గొంతు నొక్కి పెడుతున్నారని అనిపించవచ్చు కానీ.. సమాజంలో అశాంతిని రేపాలనుకున్న వారికి మాత్రం ఇది ఒక గుణపాఠంగా చెప్పవచ్చు.

హిందూ ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్లకు జగన్ మద్దతు దేనికి సంకేతం?

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy : రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రభుత్వాలను ప్రశ్నించడం, విధానాలను వ్యతిరేకించడం ప్రజాస్వామ్యంలో భాగం. కానీ మతాలను, దేవుళ్లను అవమానించే వ్యాఖ్యలు చేయడం మాత్రం ప్రజాస్వామ్య స్వేచ్ఛ పరిధిని దాటే అంశం. అలాంటి సందర్భాల్లో రాజకీయ పార్టీలు మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది.

ఇటీవలి కాలంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా వరుస వివాదాల మధ్య నిలుస్తున్నారు. రాజధాని అమరావతి అంశంపై మారుతున్న వైఖరితో ఇప్పటికే రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్న ఆయన, ఇప్పుడు మరో సున్నితమైన అంశంలోనూ చర్చకు కారణమయ్యారు. దళిత శంఖారావం పేరుతో నిర్వహించిన సభ నేపథ్యంలో హిందూ మతం, హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే అభిప్రాయం ప్రత్యర్థులు వ్యక్తం చేస్తున్నారు.

భారతదేశం భిన్న మతాలు, భిన్న సంప్రదాయాలు కలిసిమెలిసి జీవించే దేశం. ఒక మతాన్ని మరో మతానికి చెందిన వ్యక్తులు అవమానించేలా మాట్లాడితే సహజంగానే సామాజిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాఖ్యలను రాజకీయ రంగుతో సమర్థించడం లేదా వాటిని ఖండించకుండా ఉండటం మరింత వివాదాలకు దారి తీస్తుంది. ప్రజాప్రతినిధుల నుంచి ప్రజలు ఆశించేది బాధ్యతాయుతమైన స్పందనే కానీ, మతపరమైన విభేదాలను పెంచే సంకేతాలు కాదు.

ఏ రాజకీయ నాయకుడైనా తన మద్దతుదారులను కాపాడాలని భావించవచ్చు. అయితే ఆ ప్రక్రియలో మత విశ్వాసాలను దెబ్బతీసే వ్యాఖ్యలను సమర్థిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక మతానికి చెందిన ప్రజల మనోభావాలు దెబ్బతింటే, దానిపై స్పష్టమైన వైఖరి ప్రకటించడం రాజకీయ నాయకుల బాధ్యత.

ఈ వివాదం మరో విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. మతపరమైన వ్యాఖ్యల విషయంలో రాజకీయ నాయకులు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఒక మతానికి సంబంధించి జరిగిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించే వారు, మరో మతానికి సంబంధించిన అంశాల్లో మాత్రం మౌనం పాటిస్తే ప్రజల్లో అనుమానాలు తలెత్తడం సహజం. చట్టం ముందు అందరూ సమానమే అయితే, మతాలను అవమానించే వ్యాఖ్యల విషయంలోనూ ఒకే ప్రమాణం ఉండాలి.

రాజకీయాలు ఓట్ల కోసం కావచ్చు. కానీ మత విశ్వాసాలు కోట్లాది ప్రజల భావోద్వేగాలకు సంబంధించినవి. వాటిని దెబ్బతీసే వ్యాఖ్యలను ఎవరైనా చేసినా ఖండించాల్సిందే. అదే నిజమైన లౌకికవాదం. అదే రాజ్యాంగ స్ఫూర్తి.

ఈ నేపథ్యంలో జగన్ సహా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తాత్కాలిక రాజకీయ లాభాల కోసం మతపరమైన వివాదాలకు అవకాశం ఇవ్వడం సమాజానికి మేలు చేయదు. ప్రజలు ఇప్పుడు నాయకుల మాటలకంటే వారి వైఖరిని ఎక్కువగా గమనిస్తున్నారు. అందుకే ఏ మతాన్నైనా అవమానించే వ్యాఖ్యలపై స్పష్టమైన, సమానమైన, బాధ్యతాయుతమైన స్పందనే ప్రజాస్వామ్యానికి అవసరం.

హిందూ ద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్లకు జగన్ మద్దతు దేనికి సంకేతం? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పాకిస్తాన్ క్రికెట్ కు బ్యాడ్ న్యూస్.. ఒరేయ్ ఆజాం.. మళ్లీ వచ్చావా..

Babar Azam
Babar Azam

Babar Azam: ఎక్కడ ఎవడూ దిక్కు లేనప్పుడు అక్క మొగుడే దిక్కు అవుతాడు.. అనే ఓ మోటు సామెత ఉంది. ఈ సామెత పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నూటికి నూరు శాతం సరిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు.. అమలు చేస్తున్న విధానాలు అలా ఉన్నాయి కాబట్టి. యావత్ ప్రపంచం ఏమనుకున్నా.. ఎలాంటి విమర్శలు వచ్చినా సరే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లెక్కపెట్టదు. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ను ఎవరూ పట్టించుకోరు కాబట్టి.

పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ సారధిని మేనేజ్మెంట్ ప్రకటించింది. కొంతకాలంగా పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్లో అంత గొప్పగా ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోతోంది. స్వదేశంలో సిరీస్ లు కోల్పోతున్న పాకిస్తాన్ జట్టు.. విదేశాలలో కూడా అదే ధోరణి కొనసాగిస్తోంది. అందువల్లే ఆ జట్టు మేనేజ్మెంట్ సమూల మార్పులు తీసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే జట్టు సారధిని మార్చేసింది. వాస్తవానికి సమస్యలను పరిష్కరించకుండా.. కేవలం జట్టు సారధిని మాత్రమే మార్చివేస్తే ప్రయోజనం ఏముంటుందో పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ కే తెలియాలి.

పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ అంత గొప్పగా ఆడటం లేదు. పైగా స్వదేశంలో ఓడిపోతుంది. విదేశాలలో కూడా ఓడిపోతోంది. ఆమధ్య పాకిస్తాన్ సొంత దేశంలో బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. తాజాగా బంగ్లాదేశ్ గడ్డమీద కూడా వైట్ వాష్ బారిన పడింది. టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ జట్టుతో పోల్చి చూస్తే బంగ్లాదేశ్ కు అంత గొప్ప రికార్డు లేదు. అయినప్పటికీ బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడం
.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ జాబితాలో పాకిస్తాన్ ర్యాంక్ దిగువ స్థాయిలో ఉండడంతో.. మేనేజ్మెంట్ బాబర్ అజాం కు మళ్లీ సారధ్య బాధ్యతలు అప్పగించింది. బాబర్ నాయకత్వంలో గతంలో పాకిస్తాన్ జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొన నేపథ్యంలోనే మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టుకు ఎవరూ దిక్కు లేకపోవడంతో మళ్లీ బాబర్ కు ఆహ్వానం పలికింది. కెప్టెన్సీ అప్పగించింది. అయితే గతంలో విఫలమైన అతడు.. ఇప్పుడు జట్టును ఏ మేరకు విజయ పదంలో నడిపిస్తాడు చూడాల్సి ఉంది.

తొక్కిసలాట కేసులో కోర్టుకి హాజరైన అల్లు అర్జున్.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Allu Arjun
Allu Arjun

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ముగిసిన అధ్యాయం అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఈ అంశం పై కోర్టు విచారణ చేపడుతూనే ఉంది. రీసెంట్ గానే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని నాంపల్లి హై కోర్టులో విచారణకు రావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆయన ముంబై లో షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ప్రత్యక్షంగా రాలేకపోయారు , వీడియో కాల్ ద్వారా అద్బుబాటులోకి వచ్చారు. గత వాయిదా లో వ్యక్తిగత హాజరు నుండి అల్లు అర్జున్ మినహాయింపు కోరారు, అందుకు కోర్టు ఆయన్ని వర్చువల్ గా హాజరు అయ్యేందుకు అనుమతి ఇవ్వగా, నేడు ఆయన విచారణలో పాల్గొన్నారు. ఈ కేసులో అల్లు అర్జున్ ని A11 ముద్దాయిగా కోర్టు గుర్తించగా, ఆయనతో పాటు మరో 23 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చింది.

కోర్టు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులందరికీ దాదాపుగా 500 పేజీలతో కూడిన ఛార్జ్ చీట్ కాపీలను అధికారికంగా అందజేశారు. ఛార్జ్ షీట్ పంపిణీ అనంతరం న్యాయ స్థానం కేసు తదుపరి విచారణ ను ఈ నెల 29 కి వాయిదా వేశారు. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అని ఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఘటన లో రేవతి అనే మహిళా చనిపోవడం , ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోకపోవడం , అతని తండ్రి ప్రతీ నెల చికిత్స కి లక్షల రూపాయిలు ఖర్చు చేయడం వంటివి తీవ్రమైన మనస్తాపానికి గురి చేసే విషయం. కానీ అల్లు అర్జున్ కుటుంబం వీళ్ళని మర్చిపోలేదు , ఇప్పటికీ ఆ కుటుంబానికి అండగా నిలిచే ఉన్నారు. అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉన్నారు. భవిష్యత్తులో శ్రీతేజ్ మామూలు అవ్వాలని ప్రార్థిద్దాం.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. ప్రస్తుతానికి ముంబై లోనే ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, థీమ్ మ్యూజిక్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రం లో దీపికా పదుకొనే , జాన్వీ కపూర్ , మృణాల్ ఠాకూర్ వంటి వారు హీరోయిన్స్ గా నటిస్తుండగా, రష్మిక మందాన విలన్ గా నటిస్తోంది.

ఈ రెండు కార్లలో ఏది బెస్ట్.. ఫీచర్లు, ఇంజిన్, ఈఎంఐ పోలిక ఎలా ఉంది..

Renault Kwid vs Maruti Suzuki S-Presso
Renault Kwid vs Maruti Suzuki S-Presso

Renault Kwid vs Maruti Suzuki S-Presso: భారతదేశంలో కార్లు కొనాలని అనుకునేవారు ఒక నిర్ణీత బడ్జెట్ ను ఏర్పాటు చేసుకుంటారు. కంపెనీలు సైతం వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని వారికి అనుగుణంగా తక్కువ ధరలో వెహికల్స్ ను తీసుకువస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో ఒక కారు మాదిరిగా మరో కారును తీసుకువస్తూ పోటీ ఇస్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి Renault Kwid, Maruti Suzuki S-Presso ప్రధాన ఎంపికలుగా ఉంటున్నాయి. ఈ రెండు కార్లు చిన్న కుటుంబాలు, నగరంలో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటాయి. అయితే, ఇంజిన్, ఫీచర్లు, మైలేజ్, నిర్వహణ ఖర్చు, ఈఎంఐ వంటి అంశాల్లో కొన్ని కీలక తేడాలు ఉన్నాయి. మరి ఏ కారు కొనడం మంచిదో తెలుసుకుందాం.

తరెండు కార్లలోనూ దాదాపు ఒకే సామర్థ్యం కలిగిన 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. Renault Kwidలో 999cc ఇంజిన్ ఉండగా, S-Pressoలో 998cc ఇంజిన్ ఉంటుంది. రెండింటిలోనూ 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే Maruti S-Presso ఇంజిన్ కొద్దిగా ఎక్కువ రిఫైన్డ్‌గా ఉండటంతో పాటు స్పందన కూడా మెరుగ్గా ఉంటుంది.

రెండు కార్లలోనూ 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Android Auto, Apple CarPlay, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ స్టీరింగ్, AC, ఫ్రంట్ పవర్ విండోలు వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే Renault Kwidలో రియర్ పార్కింగ్ కెమెరా, TPMS, ESP, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కొన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి. S-Pressoలో మాత్రం హై సీటింగ్ పొజిషన్, విశాలమైన క్యాబిన్, Maruti సేవా నెట్‌వర్క్ ప్రధాన ఆకర్షణలు.

ఇంధన సామర్థ్యం విషయంలో మారుతి S-Presso స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. పెట్రోల్ వేరియంట్ లీటర్ కు 25 కిలోమీటర్ల మైలేజ్ ఉండగా.. CNG వేరియంట్ 32 కిలోమీటర్లుగా ఉంి. Renault Kwid మాత్రం సుమారు 22 kmpl వరకు మైలేజ్ అందిస్తుంది. ఎక్కువగా రోజువారీ ప్రయాణాలు చేసే వారికి S-Presso ఇంధన ఖర్చు తగ్గిస్తుంది.

Maruti Suzuki S-Presso ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Renault తాజాగా విడుదల చేసిన 2026 Kwid ధర రూ.4.53 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ వేరియంట్లలో రెండింటి ధరలు రూ.6 లక్షల వరకు చేరుకుంటాయి. రెనాల్ట్ క్విడ్ కారు నెలకు సుమారు రూ.7,500 నుంచి రూ.9,000 వరకు, మారుతి సుజుకీ ఎస్ ప్రెస్సో నెలకు సుమారు రూ.6,000 నుంచి రూ.8,000 వరకు ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేయొచ్చు.

మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చు, విశ్వసనీయ సర్వీస్, రోజువారీ నగర ప్రయాణాలు ముఖ్యమైతే Maruti Suzuki S-Presso ఉత్తమ ఎంపిక. ఆకర్షణీయమైన SUV తరహా డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు కావాలంటే Renault Kwid కొనవచ్చు.

గేమింగ్ ల్యాప్ టాప్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు బడ్జెట్ ధరలోనే.. వెంటనే తెలుసుకోండి..

Budget Gaming Laptops
Budget Gaming Laptops

Budget Gaming Laptops: ప్రస్తుతం భారతీయ మార్కెట్లో బడ్జెట్ గేమింగ్ ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ఇవి తక్కువ ధరకు ఉన్నప్పటికీ ఇందులో డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్‌లు , హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, వేగవంతమైన NVMe SSD స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉంటున్నాయి. అలాగే 1080p (Full HD) రిజల్యూషన్‌ను అందిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి ఫీచర్లు ఉన్న ల్యాప్ ట్యాప్స్ రూ. లక్షా యాభై వేలకు పైగానే ఉంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్లో రూ.80 వేల లోపై అందుబాటులో ఉన్నాయి. అలాంటి ల్యాప్ ట్యాప్స్ ఏ కంపెనీవి? అందులో ఇంకా ఉండే అదనపు ఫీచర్లు ఏవి?

Asus TUF Gaming A15:
బడ్జెట్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్‌లో Asus TUF Gaming A15 ఒకటి. ఇందులో పవర్‌ఫుల్ AMD Ryzen 7 ప్రాసెసర్‌తో పాటు 4GB VRAM కలిగిన Nvidia GeForce RTX 3050 గ్రాఫిక్స్ కార్డును ఉంచారు. అలాగే ఇందులో 15.6 అంగుళాల Full HD IPS డిస్‌ప్లేను అందించారు, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడంతో గేమింగ్ విజువల్స్ చాలా స్మూత్‌గా ఉంటాయి. దీనికి అదనంగా 16GB DDR5 RAM, 512GB PCIe 4.0 SSD స్టోరేజ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్, లోడింగ్ స్పీడ్ అద్భుతంగా ఉంటుంది. దీని ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 73,000 నుంచి రూ. 77,000 ధరలో లభిస్తోంది.

Lenovo LOQ:
లెనోవో సంస్థకు చెందిన LOQ సిరీస్ ల్యాప్‌టాప్‌లు అసూస్ మోడల్స్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో సాధారణంగా Intel Core i5 లేదా AMD Ryzen 5 ప్రాసెసర్లతో వస్తాయి. ఇందులో 6GB మెమరీ కలిగిన Nvidia GeForce RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్ ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 100 శాతం sRGB కలర్ గేమట్ కలిగిన డిస్‌ప్లే దీని సొంతం. గేమింగ్‌తో పాటు వీడియో ఎడిటింగ్ చేసే క్రియేటర్లకు కూడా ఇది బాగా సరిపోతుంది. ఇందులో ఉండే హైపర్‌ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీ ల్యాప్‌టాప్ వేడెక్కకుండా చూస్తుంది. కాన్ఫిగరేషన్‌ను బట్టి దీని ధర రూ. 68,000 నుంచి రూ. 75,000 మధ్య ఉంది.

రూ. 80,000 లోపు రేంజ్‌లో కేవలం ఇవే కాకుండా Acer Aspire 7, MSI Thin 15 వంటి ఇతర ల్యాప్‌టాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. Acer Aspire 7 మోడల్ Intel Core 7 ప్రాసెసర్, 6GB RTX 3050 గ్రాఫిక్స్ కార్డ్‌తో దాదాపు రూ. 75,000 ధరలో లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లన్నీ కూడా విండోస్ 11 హోమ్ ఓఎస్‌తో పాటు గేమింగ్ కోసం ప్రత్యేకంగా బ్యాక్‌లిట్ కీబోర్డులను కలిగి ఉన్నాయి.

ఈ ఫోన్ ఫీచర్స్ ప్రీమియం.. ధర మిడ్ రేంజ్.. రేపే లాంచ్..

Nothing Phone 4b
Nothing Phone 4b

Nothing Phone 4b: మార్కెట్లో తనదైన ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లతో Nothing మొబైల్ కంపెనీ సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ కంపెనీ నుంచి తాజాగా మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రావడానికి సిద్ధమైంది. Nothing Phone 4b. ఇప్పటివరకు వచ్చిన ఫ్లాగ్‌షిప్ ‘a’ సక్సెస్ తరుతవా సరికొత్తగా ‘b’ సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన లాంచ్ డేట్, ఫీచర్లు, ధర మరియు స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నథింగ్ కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. Nothing Phone 4b భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జూలై 7న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. దీనిని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ లాంచ్‌లో భారతీయ క్రికెట్ అభిమానుల కోసం నథింగ్ ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ RCBతో కుదుర్చుకున్న భాగస్వామ్యానికి గుర్తుగా, ప్రత్యేకమైన Nothing Phone 4b RCB Edition ను కూడా కంపెనీ ప్రదర్శించింది.

నథింగ్ ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది డిజైన్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఎల్‌ఈడీ లైట్లు. Phone 4b లో కూడా నథింగ్ మార్క్ గ్లిఫ్ బార్ డిజైన్ సరికొత్త మెటాలిక్ స్ట్రిప్ అందించారు. డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.77 అంగుళాల Full HD ప్లస్ AMOLED స్క్రీన్‌ను చేర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో రావడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ వీడియో కంటెంట్ ఎక్స్‌పీరియన్స్ అత్యంత స్మూత్‌గా ఉండబోతోంది.

ఈ సరికొత్త మిడ్‌రేంజ్ ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 6 Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాటరీ లైఫ్ ఆదా అవ్వడమే కాకుండా మల్టీటాస్కింగ్ సులువుగా సాగుతుంది. ఇందులో 8GB RAM, 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా, ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ బేస్డ్ Nothing OS క్లీన్ అండ్ బ్లోట్‌వేర్-ఫ్రీ ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే.. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరాను అమర్చారు. ఈ మొబైల్ లో 5400 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉండగా.. దానికి సపోర్ట్‌గా 33W లేదా 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించనున్నారు. Nothing Phone 4b బేస్ వేరియంట్ ధర భారతదేశంలో రూ. 22,999 నుంచి రూ. 25,999 మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే స్పెషల్ RCB ఎడిషన్ ధర సుమారు రూ. 25,999 లేదా కొద్దిగా అదనపు ప్రీమియం ధరతో లభించవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.

టీవీ ఛానెళ్ల TRP రేటింగ్స్ పై నిషేధం.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

TRP Ratings Ban
TRP Ratings Ban

TRP Ratings Ban: టీవీ చానెల్స్ కి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. టీవీ చానెల్స్ ఆదాయానికి కొలమానం గా నిలిచే TRP రేటింగ్స్ పై నిషేధం విధిస్తు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రేటింగ్స్ ఆధారంగానే టీవీ చానెల్స్ కి కమర్షియల్ యాడ్స్ వస్తుంటాయి. రేటింగ్స్ ని బట్టే టీవీ చానెల్స్ యాజమాన్యాలు భారీ రేంజ్ యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇకపై అలాంటి అవకాశాలు తగ్గిపోనున్నాయి. దేశం లోని అన్ని రకాల టీవీ చానెల్స్ ర్యాంకింగ్స్ , రేటింగ్స్ ని నిలిపివేస్తూ కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతం లో ఈ టీఆర్ఫీ రేటింగ్స్ వ్యవహారం లో తీవ్రమైన వివాదాలు తలెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం న్యూస్ చానెల్స్ రేటింగ్స్ ని నిలిపివేసింది.

ఇప్పుడు లేటెస్ట్ గా జనరల్ ఎంటర్టైన్మెంట్ , సినిమా , స్పోర్ట్స్ సహా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ చానెల్స్ కి కూడా రేటింగ్స్ ని నిలిపివేసింది. ఈ కఠిన నిర్ణయం వెనుక కారణాలు ఉన్నాయి. కొన్ని ఛానళ్ళు అనుచిత , అక్రమ పద్ధతులు అనుసరించడమే అందుకు ప్రధాన కారణం. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ లెక్కిస్తున్న ప్రస్తుత బార్-ఓ-మీటర్ల వ్యవస్థను కొన్ని పెద్ద నెట్ వర్కులు మేనేజ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. తప్పుడు పద్ధతుల్లో రేటింగ్స్ ని పెంచుకొని ప్రకటనదారులు మోసం చేస్తున్నాయనే ఆరోపణలు ఈమధ్య కాలం లో ఎక్కువగా వెల్లువెత్తాయి. కేవలం రేటింగ్స్ రేసులో ముందంజలో ఉండడం కోసం ఛానళ్ళు కంటెంట్ లోని నాణ్యత ని దిగజారుస్తున్నారని , అది సమాజం పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ టీఆర్ఫీ రేటింగ్స్ విధానానికి ప్రత్యామ్నాయంగా పారదర్శకతతో కూడిన వ్యవస్థని తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతిక నిపుణులు , ఐటీ రంగ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం డిజిటల్ సెట్-టాప్ బాక్సుల ద్వారా వచ్చే డేటాను రియల్-టైమ్‌లో పారదర్శకంగా చూసే విధానాన్ని ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం పరిశీలిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం టెలివిజన్ ఇండస్ట్రీ ని , అడ్వర్టైజింగ్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ప్రతీ ఏటా వేల కోట్ల రూపాయిల ఆదాయం యాడ్స్ రూపం లో వచ్చేవి , ఇవన్నీ రేటింగ్స్ ఆధారంగానే జరిగేవి. ఇప్పుడు కొత్త వ్యవస్థ అమ్మల్లోకి వచ్చే వరకు రేటింగ్స్ నిలిపివేయడం వల్ల వంద కోట్ల నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.

తమిళ హీరో శింబు వల్ల ఆ డైరెక్టర్ కెరియర్ నాశనమైందా..?

Simbu
Simbu

Simbu: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళు ఏం చేసిన కూడా అదొక పెను సంచలనంగానే మారింది. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న కొంతమంది హీరోలు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ రేటు ను సాధిస్తున్నారు. ఇక తమిళంలో శింబు సైతం ‘మన్మధ’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. తను చేసిన మొదటి సినిమాతోనే గొప్ప విజయాన్ని అందుకోవడంతో తమిళంతో పాటు తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయింది.

శింబు చేసిన మన్మధ సినిమాకి ఏ జే మురుగన్ దర్శకుడు అయినప్పటికి ఆ సినిమా మొత్తాన్ని శింబు లీడ్ చేశారట. తను రాసుకున్న చాలా సన్నివేశాలను తీసేసి మరి శింబు తనకు తగ్గట్టుగా సినిమాను డైరెక్టు చేశారు అంటూ అప్పట్లో ఆయన కొన్ని సంచలమైన కామెంట్లయితే చేశాడు.ఇక మొత్తానికైతే మన్మధ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించింది. కాబట్టి క్రెడిట్ అంత శింబుకు వెళ్ళిపోయింది.

ఒకవేళ ఫ్లాప్ అయి ఉంటే దర్శకుడి ఖాతాలో పడిపోయేది. ఇక ఏది ఏమైనా కూడా ఏజే మురుగన్ మాత్రం ఈ సినిమా తర్వాత మరొక సినిమా చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే మన్మధ సినిమా చేయడం శింబు తన ఐడెంటిటిని లాక్కోవడం లాంటివి చేయడం వల్లే అతని కెరీర్ అనేది స్పాయిల్ అయిపోయిందని ఆ తర్వాత కూడా తనతో సినిమా చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదని అతను పలు సందర్భాల్లో తెలియజేశాడు.

ఇక ఏది ఏమైనా కూడా శింబు వల్లే ఒక దర్శకుడి జీవితం నాశనం అయిపోయిందనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలను చేస్తున్నారు. అయినప్పటికీ భారీ విజయాన్ని మాత్రం సాధించలేకపోతున్నారు… ఒకరకంగా సినిమా సూపర్ సక్సెస్ ని సాధించాలంటే మాత్రం పెను ప్రభంజనాలను క్రియేట్ చేయగలిగాలి అంటే వాళ్ళు మంచి కథలను రెడీ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే హీరోలు, దర్శకులు మంచి విజయాన్ని సాధిస్తారు…