Home Blog Page 204

పహల్గాం దాడికి పాక్‌ బ్యాంకు ఫైనాన్స్‌.. ఫోన్‌లో గుర్టు రట్టు!

Pahalgam Terror Attack Pakistan Bank Finance
Pahalgam Terror Attack Pakistan Bank Finance

Pahalgam Terror Attack Pakistan Bank Finance: బ్యాంకులు.. వ్యాపారానికి, వ్యవసాయానికి, ఇళ్ల నిర్మాణానికి, వాహనాల కొనుగోలుకు సాధారణంగా ఫైనాన్స్‌ చేస్తుంటాయి. కానీ ఉగ్రదేశం.. పాకిస్తాన్‌లోని బ్యాంకులు మాత్రం ఇందుకు భిన్నం. పై వాటికి రుణాలు ఇవ్వడంతోపాటు భారత్‌పై దాడిచేసే ఉగ్రవాదులకు కూడా ఫైనాన్స్‌ చేస్తున్నాయి. పహల్గాం ఉగ్రవాద దాడికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడిలో ఉపయోగించిన మొబైల్‌ ఫోన్ల కొనుగోలు, దిగుమతి లావాదేవీలకు పాకిస్తాన్‌లోని ఫైసల్‌ బ్యాంక్‌ ఫైనాన్సింగ్‌ చేసినట్లు దర్యాప్తు ఏజెన్సీలు గుర్తించాయి.

ఉగ్రదాడులకు ఫైనాన్సింగ్‌..
ఉగ్రవాద ఫైనాన్సింగ్‌లో బ్యాంకింగ్‌ సంస్థల పాత్రపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫోన్ల ట్రయిల్‌ ద్వారా బ్యాంక్‌ సంబంధందాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు షావోమి హ్యాండ్‌సెట్ల దిగుమతి వివరాలు పరిశీలించగా ఈ లింక్‌ బయటపడింది. కరాచీకి చెందిన టెక్‌ సిరత్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ 2021లో ఈ ఫోన్ల కన్సైన్‌మెంట్‌ను దిగుమతి చేసుకుంది. ఆ లావాదేవీలకు ఫైసల్‌ బ్యాంక్‌ ఆర్థిక సహాయం అందించినట్లు ఆధారాలు లభించాయి. అయితే, ఈ దాడిలో బ్యాంక్‌ నేరుగా పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఫోన్లు మాత్రమే బ్యాంక్‌ ఫైనాన్స్‌ ద్వారా వచ్చాయని, మరిన్ని విషయాలు దర్యాప్తు చేస్తున్నారు.

ఉగ్రవాది వద్ద ఫోన్లు లభ్యం..
పహల్గాం దాడిలో పాల్గొన్న ఫైసల్‌ జాట్‌ అనే ఉగ్రవాది తన వద్ద రెండు షావోమి ఫోన్లను (రెడ్మీ 9టి, నోట్‌ 12) ఉంచుకున్నాడు. ఈ ఫోన్లు 2021, 2023లో దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దాడి జరిగే వరకు ఈ ఫోన్లను ఎక్కడా ఆన్‌ చేయలేదు. ఎంపిక చేసిన ఉగ్రవాదులకు అప్పగించేందుకు మాత్రమే సిద్ధంగా ఉంచి, స్విచ్‌ ఆఫ్‌ స్థితిలోనే భద్రపరచి ఉంచారని దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి.

ఫైసల్‌ బ్యాంక్‌పై పాత్ర ఆరోపణలు
ఫైసల్‌ బ్యాంక్‌ పేరు ఇది మొదటి సారి కాదు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది. లష్కర్‌–ఎ–తయ్యిబా, లజ్నత్‌ అల్‌ దవా వంటి పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలు, అల్‌–ఖైదాతో ముడిపడిన ఒక కువైట్‌ సంస్థ ఈ బ్యాంక్‌తో లావాదేవీలు చేసినట్లు వివరాలు ఉన్నాయి. 2007లో ఒక అమెరికన్‌ పత్రిక ఈ బ్యాంక్‌లో ఉగ్ర సంస్థల డిపాజిట్ల గురించి రిపోర్ట్‌ చేసింది.

ఉగ్ర ఫైనాన్సింగ్‌లో బ్యాంకుల పాత్రఈ సమాచారం ఉగ్రవాదులు ఎలా అధునాతన సాంకేతిక సాధనాలను ఉపయోగించి దాడులు చేస్తున్నారో చూపిస్తోంది. ఫోన్లను దీర్ఘకాలం స్విచ్‌ ఆఫ్‌లో ఉంచడం ద్వారా ట్రాకింగ్‌ను నివారించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌లోని బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉగ్రవాద ఫైనాన్సింగ్‌కు మార్గాలు అందిస్తున్నదా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఫైసల్‌ బ్యాంక్‌ కేసు కేవలం ఒక ఫోన్‌ దిగుమతి మాత్రమే కాకుండా, ఉగ్ర సంస్థలతో దీర్ఘకాలిక సంబంధాలను సూచిస్తోంది. భారత్‌తోపాటు అంతర్జాతీయ సంస్థలు ఈ బ్యాంక్, ఇలాంటి లావాదేవీలపై కఠిన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర విభజనకు 'పుష్కరం'.. ఉభయ రాష్ట్రాల పురోగతి ఇదే!

Telugu States Economic Progress
Telugu States Economic Progress

Telugu States Economic Progress: రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం అవుతోంది. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన అధికారికంగా జరిగింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని ఎవరు ఊహించలేదు. విడిపోతే రెండు రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయి అన్న భావన ఎక్కువగా ఉండేది. కానీ 12 సంవత్సరాల తరువాత వెనక్కి తీసుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాయి. ఉమ్మడి రాష్ట్రపరంగా దక్షిణాది రాష్ట్రాల్లో వెనుకబాటు కనిపించినా.. రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. ఇక రాజకీయంగా సైతం తనదైన మార్కు చాటుకున్నాయి రెండు రాష్ట్రాలు. రెండు రాష్ట్రాల ప్రజలు రాజకీయంగా భిన్న వైఖరి ప్రదర్శించారు. అయినా సరే తన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు.

* రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ కు ఛాన్స్ ఇచ్చారు. రాజధాని లేని ఏపీని చంద్రబాబు అయితేనే అభివృద్ధి చేయగలరని ప్రజలు ఆశించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కెసిఆర్ ను గుర్తించి.. అదే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లగలరని భావించి అవకాశం కల్పించారు. అయితే ఏపీలో ఐదేళ్లకే అధికార మార్పిడి చేశారు. తెలంగాణలో మాత్రం కెసిఆర్ కు తొమ్మిదేళ్లపాటు అవకాశం కల్పించారు. మూడోసారి ఛాన్స్ ఇవ్వకపోగా.. ఏపీలో చంద్రబాబుకు మాత్రం రెండో ఛాన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేశారు.
* తెలంగాణకు విద్యుత్ సమస్యలు, ఆంధ్రకు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయని ఎక్కువ మంది అంచనా వేశారు. కానీ ఆ సమస్యలన్నింటినీ రెండు రాష్ట్రాలు అధిగమించాయి అని చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రపరంగా వెనుకబాటు ఉన్నా.. విభజిత రాష్ట్రాలుగా మిగతా దక్షిణాది రాష్ట్రాలకు గట్టి పోటీ ఇచ్చాయి.
* ఏపీలో మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. తెలంగాణలో రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను గుర్తించి ఛాన్స్ కల్పించారు. ఇలా రాజకీయంగా కూడా బ్యాలెన్స్ చేశారు ఉభయ రాష్ట్రాల ప్రజలు.

* రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పుష్కర కాలంలోనే అంతరం పోయింది. మళ్లీ పాత రోజులు మాదిరిగానే సోదర భావం పెరిగింది. పారిశ్రామికంగా తెలంగాణ అభివృద్ధి సాధించగా.. ఏపీ కూడా నవనిర్మాణ దిశ గా అడుగులు వేసింది. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
* ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని రకాల విభజన సమస్యలు ఉండిపోయాయి. చంద్రబాబు, కెసిఆర్ సమయంలో జరగలేదు. కెసిఆర్ కు మిత్రుడైన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోక్షం కలగలేదు. కానీ ఇటు చంద్రబాబు, అటు రేవంత్ వచ్చిన తర్వాత మాత్రం పురోగతి పెరిగింది.
* రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజలు బాధపడ్డారు మొదట్లో. కానీ పుష్కరకాలం తర్వాత మాత్రం మంచిదే అన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రారంభంలో సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఉమ్మడిగా ఉంటేనే కొంత కలిసి వచ్చేదేమో అనే రీతిలో ఆలోచన చేస్తున్నారు.
* ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ అనేది అక్కడి ప్రజల్లో తగ్గింది. ఆ సెంటిమెంట్తో రాజకీయాలు చేసిన పార్టీల హవా కూడా తగ్గింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రజల ఆకాంక్ష కూడా అదే.

టిడిపి కార్యకర్తలకు తలొగ్గిన హోం మంత్రి అనిత.. ఆ సీఐ వీఆర్లోకి!

Home Minister Anitha
Home Minister Anitha

Home Minister Anitha: తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు సైన్యం. మొండి పట్టుదలతో పాటు అనుకున్నది సాధించే వరకు పోరాటం చేసే తత్వం వారిది. చివరకు రాజకీయ ప్రత్యర్థులపై సైతం అదే స్థాయిలో ఉంటుంది పసుపు సైన్యం. పార్టీ ఓడిపోయిన ప్రతిసారి పసుపు సైన్యం చేసే ప్రయత్నం తోనే మళ్లీ అధికారం సొంతం అవుతూ వస్తోంది. అటువంటి పసుపు సైన్యం ఒక్కోసారి సొంత పార్టీతో పాటు ప్రభుత్వంతోనూ పోరాటం చేస్తుంది. అటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో కనిపించింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తమను ఇబ్బంది పెట్టిన ఓ సి ఐ కు విఆర్ కు పంపించే వరకు విశ్రమించలేదు. గత కొద్దిరోజులుగా పోస్టింగ్ లో లేని ఆయన ఏకంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఇలాకాలో నియమితులయ్యారు. దీన్ని సహించుకోలేకపోయారు టిడిపి శ్రేణులు. దీంతో హోంశాఖ మంత్రి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తిరిగి ఆ సీఐను విశాఖ రేంజ్ కు వీఆర్లోకి పంపించారు.

* రాజకీయ వివాదాలు..
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా కీలక నియోజకవర్గం పలాస. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నిత్యం రావణకాష్టంలా ఉండేది. దానికి కారణం అక్కడ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి అయిన డాక్టర్ సిదిరి అప్పలరాజు. ఆయనకు ప్రత్యర్థిగా టిడిపి నుంచి గౌతు లచ్చన్న మనుమరాలు శిరీష ఉండేవారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దూకుడుగా ఉండేవి. వారికి ధీటుగా టిడిపి నిలిచేది. ఈ క్రమంలో తరచూ వివాదాలు, వివాదాస్పద ఘటనలు జరిగేవి. అప్పట్లో సిఐ గా ఉండే సాకేటి శంకరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులా పనిచేసేవారు. టిడిపి శ్రేణులపై సైతం విరుచుకుపడేవారు. చివరకు గౌతు శిరీష తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిగత దాడిని కూడా సిఐ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారు. దానిని జీర్ణించుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సీఐ శంకర్రావు పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

* విశాఖ రేంజ్ కు..
2024 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. పలాస ఎమ్మెల్యేగా టిడిపి అభ్యర్థి గౌతు శిరీష గెలిచారు. తమను ఎంతగానో ఇబ్బంది పెట్టిన సిఐ శంకర్రావును వీఆర్లోకి పంపించారు. గత రెండేళ్లుగా ఆయనకు ఎక్కడా పోస్టింగ్ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల కిందట ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఏకంగా హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో అవకాశం కల్పించారు. ఈ విషయం పలాస టిడిపి శ్రేణులకు తెలిసింది. తమను అంతగా ఇబ్బంది పెట్టిన సిఐ శంకర్రావును మళ్లీ పోస్టింగ్ ఇస్తారా అంటూ గత రెండు రోజులుగా రగిలిపోతున్నారు టిడిపి శ్రేణులు. సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ హై కమాండ్ వరకు ఈ విషయం వెళ్లినట్లు తెలుస్తోంది. పాయకరావుపేటలో పోస్టింగ్ ఇచ్చిన శంకర్రావు ను తిరిగి విశాఖ రేంజ్ కు వీఆర్లోకి పంపిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పలాస టిడిపి శ్రేణుల ఉడుం పట్టు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

కల్లు తాగిన చంద్రబాబు తరువాత ఏం చేశాడంటే.. వీడియో వైరల్!

Chandrababu Viral Video
Chandrababu Viral Video

Chandrababu Viral Video: ఏపీ సీఎం చంద్రబాబు చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఆహారం విషయంలో సైతం చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఏడు పదుల వయసులో కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. రోజుకు 16 గంటలు పని చేసినా ఎక్కడా బడలిక ఉండదు. మితాహారం తీసుకుంటారు. యోగా చేస్తారు. ఇక వ్యసనాలు అంటూ ఏమీ లేవు. అందుకే ఈ వయసులో కూడా చాలా ఆరోగ్యంగా కనిపిస్తారు. అయితే ఉన్నట్టుండి చంద్రబాబు కల్లు తాగుతూ కనిపించారు. సోషల్ మీడియాలో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే ఆయన తాగాలని కాదు. జస్ట్ రుచి చూశారట. ఏది ఏమైనా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

* గతానికి భిన్నంగా..
గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. వీలైనంతవరకు సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రారంభం, ప్రతి నెల పింఛన్ల పంపిణీకి గాను ఏదో ఒక జిల్లాను ఎంచుకొని.. నేరుగా పింఛన్ అందించడమే కాదు సామాన్యులతో మమేకం అవుతున్నారు. జూన్ నెల కు సంబంధించి పింఛన్ నిన్ననే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని రామవరం లో అందించారు. ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది మాత్రం చామవరాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం.

* గీత కార్మికుడి ఇంటికి..
ఈసారి చంద్రబాబు కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లారు. గ్రామంలో పూరి గుడిసెలో నివసిస్తున్న సింహాచలం సీఎం చంద్రబాబు తమ ఇంటికి రావడంతో ఆనందంతో మురిసిపోయాడు. సీఎం చంద్రబాబు సింహాచలం మనవడిని ఆత్మీయంగా ముద్దాడారు. ఇంటి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. సింహాచలం కోడలు చదువుకోవడంతో ఆమెకు ఉద్యోగం కల్పించాలని అక్కడ ఉన్న అధికారులను ఆదేశించారు. అనంతరం సింహాచలం నుంచి కల్లుగీతకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. సింహాచలం తమ కష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇంతలో సింహాచలం మేనల్లుడు తాటి చెట్టు ఎక్కి కల్లు తీశాడు. దానిని పరిశీలించిన చంద్రబాబు.. కల్లును రుచి చూసే ప్రయత్నం చేశారు. సింహాచలం తాటి బొరిగలో కల్లు వేసి ఇవ్వగా.. చంద్రబాబు రుచి చూశారు. బాగుంది అని అభినందించారు. సింహాచలం కుటుంబం ఉండేందుకు ఇల్లు, ఆపై మౌలిక వసతులు కల్పించాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

న్యూజెర్సీలో ఘనంగా తానా పికిల్‌బాల్ టోర్నమెంట్

TANA Pickleball Tournament New Jersey
TANA Pickleball Tournament New Jersey

TANA Pickleball Tournament New Jersey: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తానా పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘన విజయాన్ని సాధించింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలకు తెలుగు కుటుంబాలు, క్రీడాభిమానులు, తానా సభ్యులు విశేషంగా హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు.

TANA Pickleball Tournament New Jersey
TANA Pickleball Tournament New Jersey

టోర్నమెంట్‌లో జరిగిన మ్యాచ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాల్గొన్న ఆటగాళ్లు అత్యుత్తమ నైపుణ్యం, క్రీడాస్ఫూర్తి, జట్టు సమన్వయాన్ని ప్రదర్శించి పోటీలను రసవత్తరంగా మార్చారు. న్యూజెర్సీలో పికిల్‌బాల్ క్రీడకు పెరుగుతున్న ఆదరణకు ఈ టోర్నమెంట్ నిదర్శనంగా నిలిచింది.

TANA Pickleball Tournament New Jersey
TANA Pickleball Tournament New Jersey

పోటీల ముగింపు సందర్భంగా విజేతలు, రన్నరప్‌లు, ద్వితీయ రన్నరప్‌లకు నగదు బహుమతులు మరియు ట్రోఫీలను అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 500 డాలర్లు, రన్నరప్‌లకు 250 డాలర్లు, ద్వితీయ రన్నరప్‌లకు 150 డాలర్ల నగదు బహుమతులతో పాటు ప్రత్యేక ట్రోఫీలు ప్రదానం చేశారు.

TANA Pickleball Tournament New Jersey
TANA Pickleball Tournament New Jersey

ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ, అమెరికా మరియు భారతదేశంలో తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. విద్య, ఆరోగ్యం, యువత అభివృద్ధి, విపత్తు సహాయం, ఆహార పంపిణీ, విద్యార్థుల మార్గదర్శకత్వం, రైతు సంక్షేమం వంటి అనేక రంగాల్లో తానా విశేష సేవలు అందిస్తోందని తెలిపారు. తానా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.

TANA Pickleball Tournament New Jersey
TANA Pickleball Tournament New Jersey

తానా అధ్యక్షులు డా. నరేన్ కోడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు, కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ చంద్ నారేపలుపు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావా, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, తానా ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీష్ మేక తదితరుల సహకారంతో ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమ సమన్వయంలో హరి బాబు గంగవరపు, ప్రవీణ్ కల్వకొల్లు, రవి మాచర్ల కీలక పాత్ర పోషించారు.

TANA Pickleball Tournament New Jersey
TANA Pickleball Tournament New Jersey

టోర్నమెంట్ విజయవంతం కావడానికి కృషి చేసిన ఆటగాళ్లు, వాలంటీర్లు, ప్రేక్షకులు, స్పాన్సర్లు మరియు మద్దతుదారులందరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సమాజంలో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తి, ఆరోగ్యకరమైన జీవనశైలి, సామాజిక ఐక్యత మరియు క్రీడాస్ఫూర్తిని ఈ కార్యక్రమం మరోసారి ప్రతిబింబించింది.

TANA Pickleball Tournament New Jersey
TANA Pickleball Tournament New Jersey

ఈ ఐదు రాశుల వారికి ఈరోజు అనుకున్న ప్రతి పని విజయమే అవుతుంది..

Today 20 June 2026 Horoscope
Today 20 June 2026 Horoscope

Today 2 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాసులపై మూలా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు కెరీర్ విషయంలో పురోగతి లభిస్తుంది. మరికొన్ని రాశుల వారు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడుపుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల సహకారంతో అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. గ్రహాల అనుకూలత ఉండటంతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహాయం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషంగా గడుపుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు అపారమైన ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో డబ్బులు పొదుపు చేయడం అలవర్చుకోవాలి. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మాటలను పొదుపు చేసుకోవాలి. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొన్ని సమస్యలు తొలగిపోవడంతో మానసికంగా సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడంతో సమస్యలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వస్తాయి. దీంతో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల కోటి పరీక్షలో పాల్గొంటే సులభంగా విజయం సాధించగలుగుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక పనిని పూర్తి చేయడానికి ప్రణాళికా ప్రకారంగా ముందుకు వెళ్లాలి. కొందరు తప్పుడు దారులని చూపిస్తారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాలను పాటించాలి. ఇంట్లో విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వాహనాల కొనుగోలు కలిసి వస్తుంది. ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. దూరపు బందులను కలవడంతో సంతోషంగా గడుపుతారు. కొత్త వస్తువుల కొనుగోలు పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావచ్చు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంతో వ్యాపారులకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో నాణ్యమైన ఆహారాన్ని తీసుకుని ప్రయత్నం చేయాలి. ఆర్థిక పరిస్థితిపై తల్లిదండ్రుల సూచనలను పాటించాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు చేసే పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణాలు చేయాల్సివస్తే కలిసి వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూలమైన ఫలితాలే ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. గతంలో కంటే ఇప్పుడు ఆలోచన విధానం మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులు కలవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొంటే రాణిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు ఫలితాలను ఇస్తాయి.

ప్రియుడిపై మోజు.. ఏడాదిన్నర కుమారుడిని.. ఈ తల్లి ఏం చేసిందంటే..

Kerala child murder

toddler abuse case Kerala : ఆ బాలుడు వయసు ఏడాదిన్నర.. వచ్చిరాని మాటలతో.. తప్పటడుగులతో ఇల్లంతా సందడి చేసేవాడు.. అటువంటి ఆ బాలుడి ఒంటిమీద 51 గాయాలున్నాయి. దేహం మీద సిగరెట్ వాతలు ఉన్నాయి. అంతర్గతంగా రక్త స్రావం జరిగింది. అతడిని రోజుల తరబడి కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. దీంతో ఆ బాలుడు కన్నుమూశాడు. ఆ బాలుడు చనిపోవడానికి ప్రధాన కారణం తల్లి అయితే.. రెండవ కారణం ఆమె ప్రియుడు.

కేరళ రాష్ట్రంలో మే 29న ఒక బాలుడి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. నెడుమంగాడు అనే ప్రాంతంలో అఖిల అనే మహిళకు గతంలోనే వివాహం జరిగింది. వీరికి హర్షత్ అనే బాబు పుట్టాడు. బాబు పుట్టిన కొద్ది రోజులకే అఖిల భర్త చనిపోయాడు. దీంతో ఆమె అష్కర్ అనే వ్యక్తికి దగ్గర అయింది. ఇతడికి కూడా గతంలో వివాహం జరిగింది. భార్యను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆమె విడాకులు తీసుకుంది. అఖిలను ట్రాప్ చేసి అతడు.. తన వశం చేసుకున్నాడు.

అతడి మాయ నుంచి బయటికి రాలేకపోయిన అఖిల తన కుమారుడిని తల్లిదగ్గర వదిలేసి వెళ్ళింది. తన అమ్మమ్మ దగ్గర ఉన్నంతవరకు హర్షత్ బాగానే ఉన్నాడు.. కానీ, ఎప్పుడైతే అఖిల అతడిని తన వెంట తీసుకెళ్లిందో అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. అష్కర్ పదేపదే ఆ బాలుడిని కొట్టేవాడు. అఖిల కూడా అదే పని చేసేది. తమ ఇద్దరి మధ్య అతడు అడ్డుగా ఉన్నాడని భావించి.. తీవ్రంగా హింస పెట్టేవారు. చిన్న బాలుడు అని చూడకుండా విపరీతంగా కొట్టేవారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు అతడి అంతర్గత అవయవాలలో రక్తం గడ్డకట్టుకుపోయింది. సరిగ్గా ఈనెల 27న బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సమీపంలో ఉన్న ఆసుపత్రికి అఖిల తీసుకెళ్లింది. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చనిపోయాడని నిర్ధారించారు.

ఆహారం తింటుండగా గొంతులో ఇరుక్కొని అతడు చనిపోయాడని అఖిల చెప్పింది. ఆమె చెప్పిన మాటలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో వారు అఖిల, అష్కర్ వ్యవహారం మీద దృష్టి తరించారు. ఆ తర్వాత ఆ బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. 51 గాయాలు ఉన్నట్టు.. సిగరెట్ల తో కాల్చినట్టు.. బాబు రెండు కాళ్లు.. చేతులు విరిగినట్టు గుర్తించారు. బాబు రెండు కాళ్ల పాదాల కింద దారుణమైన గాయాలు ఉన్నట్టు వారిని నిర్ధారించారు.

ఈ వ్యవహారం తెలిసిన స్థానికులు అష్కర్ మీద దాడి చేయడానికి ప్రయత్నించారు.. బాలుడి తల్లిని కూడా అంతం చేయడానికి యత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఏడాదిన్నర బాబు విషయంలో ఇంత పైశాచికంగా వ్యవహరించిన అఖిల, ఆమె ప్రియుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు రేవంత్ మాస్టర్ స్ట్రోక్.. ఇలా చేస్తాడనుకోలేదు

Pawan Kalyan Telangana meeting

Pawan Kalyan Telangana meeting : గచ్చిబౌలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ కు ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. ఇప్పటికే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఎమ్మెల్యేలు సామేలు.. అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ జరగడం అనుమానమేనని అందరికీ అనిపించింది. దానిని నిజం సోమవారం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.

హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ కు అనుమతులు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. శాంతిభద్రతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సభను వ్యతిరేకిస్తూ మంత్రులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు.

టిఆర్ఎస్ అధినేత్రి కవిత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని కట్టుకోలేదు గాని.. తెలంగాణలో నవ నిర్మాణం చేసేందుకు వస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మీద మండిపడ్డారు. తెలంగాణ దమ్ము అంటే ఏమిటో గతంలో చూపించామని.. ఈసారి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలి అనుకుంటే మూతి పళ్ళు రాలుతాయని కవిత తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ మీద ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో రాజకీయాల జరుగుతున్నాయి. అమిత్ షాను కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ జగన్ అరెస్టు గురించి ప్రస్తావించారని.. దానికి కేంద్ర హోం శాఖ మంత్రి ఒప్పుకోలేదని ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై రక రకాలుగా విమర్శలు వచ్చాయి. చివరికి నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అయినప్పటికీ ఈ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాన్ని మర్చిపోకముందే పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం సంచలనం కలిగిస్తోంది. ఒకవేళ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటే అప్పుడు సభకు ప్రభుత్వం సహకరిస్తుందా.. లేదా అనేది చూడాల్సి ఉంది.

బీజేపీకి అన్నామలై ఎందుకు రాజీనామా చేస్తున్నాడు.. కారణమేంటి..

Annamalai
Annamalai

Annamalai BJP resignation : బిజెపి కి తమిళనాడులో ఒక ఊపు తీసుకొచ్చిన నాయకుడు అన్నామలై. ఇతడు ఒక ఐపీఎస్ అధికారి. రాజకీయాల మీద ఆసక్తి.. తమిళ గడ్డకు ఏదైనా చేయాలి అనే ప్రేమతో తన సర్వీస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రతి అంశం మీద లోతైన విశ్లేషణ చేయడం.. ప్రజా సమస్యల మీద మాట్లాడటం అన్నా మలై కి అలవాటు. అదే అతడిని తమిళనాడులో తిరుగులేని నాయకుడిగా చేసింది. వాస్తవానికి అన్నామలై లాంటి నాయకుడు మరొక పార్టీలో ఉంటే నెత్తిన పెట్టుకునేవి. కానీ, తమిళనాడులో బిజెపికి అది చేతకాలేదు. అధిష్టానానికి అర్థం కాలేదు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తమిళనాడులో 13% ఓటు బ్యాంకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం అన్నామలై. ఎన్డీఏ కూటమి మొత్తానికి 17% శాతం ఓటు బ్యాంకు నమోదయింది. కానీ, 2026 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ అధిష్టానం అన్నామలై విషయంలో స్టాండ్ మార్చుకుంది. అన్నా డీఎంకే అధినేత “ఈపీఎస్” ఒత్తిడికి తలవంచి అన్నామలై ని బిజెపి అధ్యక్షుడి స్థానం నుంచి తొలగించింది. ఇది తమిళనాడులో కమలం పార్టీకి మొదటి దెబ్బ. ఆ తర్వాత అన్నా డీఎంకే చెప్పిన స్థానాలలోని బిజెపి పోటీ చేయాల్సి వచ్చింది. అవన్నీ అత్యంత బలహీనమైన స్థానాలు. పనికిమాలిన అన్నా డీఎంకే ఒత్తిడి వల్ల బిజెపి గెలిచే స్థానాలు కోల్పోవడంతో పాటు.. పోటీ చేసే స్థానాల్లో కూడా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.

బిజెపి తమిళనాడు అధ్యక్షుడు నుంచి మొదలు పెడితే తమిళ సై సౌందర రాజన్ వరకు తమ స్థానాలను మార్చకుండా అన్నా డీఎంకేతో లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే వారు కూడా విజయం సాధించలేకపోయారు. చివరికి పార్టీని కూడా బతికించలేకపోయారు. ఎన్నికల్లో బిజెపికి రెండు శాతం ఓటు బ్యాంకు వచ్చిందంటే దానిని ఎలా అర్థం చేసుకోవాలో కమలం పెద్దలే నిర్ణయించుకోవాలి.

బిజెపి అధిష్టానం వ్యవహరించిన తీరుతో అన్నామలై తీవ్ర అంతర్మదనంలో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బిజెపికి రాజీనామా చేసి.. ఆరు నెలల పాటు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకొని.. పార్టీని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలై బిజెపి పెద్దలకు వర్తమానం పంపినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు బిజెపి పెద్దలు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు తమిళనాడులో ద్రావిడ వాదానికి సంబంధం లేకుండా రాజకీయాలను రూపొందించాలని అన్నామలై భావిస్తున్నారు. బిజెపి ద్వారా దానిని భర్తీ చేయాలని అనుకున్నారు.

ఇటీవల ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో ద్రావిడ వాదంతో తమిళ ప్రజలను పిచ్చోళ్లను చేసే ఆ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాయి. చివరి నిమిషంలో విజయ్ మేల్కోవడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. ద్రావిడ వాద సెంటిమెంట్ నిత్యం రగిలిస్తూ.. తమిళ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నాయి ఆ రెండు పార్టీలు. వాటికి ప్రత్యామ్నాయంగా బిజెపిని రూపొందించాలని అన్నామలై భావించారు. కానీ అధిష్టానం తలతిక్క వ్యవహార శైలి వల్ల ఆయన పార్టీకే దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా బిజెపి అధిష్టానం మేల్కొంటుందా.. అన్నామలైకి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

ఇప్పుడు త్రివిక్రమ్ తో పాన్ ఇండియా సినిమాలు చేయడం రిస్క్ ఏనా..?

Star Director Andhra University
Star Director Andhra University

Trivikram pan India movie : కెరీర్ మొదట్లోనే రైటర్ గా తన సత్తా చాటుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆ తర్వాత దర్శకుడిగా మారి భారీ విజయాలను సాధించాడు. ఇంతకు ముందు ఆయన చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో చేసిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా మీదనే అందరి ఫోకస్ అయితే ఉంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే త్రివిక్రమ్ మరోసారి లైమ్ లైట్ లోకి వస్తాడు. లేకపోతే మాత్రం తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనే అవకాశం ఉంది… ఇప్పటివరకు త్రివిక్రమ్ కు ఉన్న బ్రాండ్ ను కాపాడుకోవాలంటే ఇప్పుడు వరుసగా సక్సెస్ లను సాధించాలి. ఇక ఈ క్రమంలోనే త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు చేయడం వృధా అంటు కొంతమంది వాదిస్తుంటే త్రివిక్రమ్ ఫోకస్ పెట్టి మూవీ చేస్తే పాన్ ఇండియాలో కూడా భారీ సత్తాని చాటుకొని పాన్ ఇండియాలో టాప్ డైరెక్టర్ గా మారే అవకాశం కూడా ఉందని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడనేది వాస్తవం…

‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో మెప్పిస్తే జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్టు మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడతాయి. లేకపోతే మాత్రం ప్రాజెక్ట్ కూడా మెటీరియలైజ్ అయ్యే అవకాశమైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు దర్శకులు అవుట్ స్టాండింగ్ మేకింగ్ వాల్యూస్ తో ప్రేక్షకులకు విజువల్ వండర్స్ ని క్రియేట్ చేసి పెడుతున్నారు.

కాబట్టి త్రివిక్రమ్ సైతం ఇప్పటికి అదే మూస ధోరణిలో వెళ్లకుండా మేకింగ్ విషయంలో కసరతులు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఒకటే దారిలో ముందుకు వెళ్తే మాత్రం ఆయన మరోసారి భారీ విమర్శలను ఎదురుకుంటాడు. ఆయన కెరియర్ కూడా చెడిపోయే ప్రమాదం ఉంది… కాబట్టి అతనితో పాన్ ఇండియా సినిమా చేయడం బెటర్ అని కొంతమంది అనుకుంటే మరి కొంత మంది మాత్రం ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాడు.

కాబట్టి అతనితో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయాలి అలా అయితేనే అతను తన సత్తాను చూపించుకోగలుగుతారని వాదిస్తున్నారు… ఫైనల్ గా ఏమవుతుంది త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతుందా పాన్ ఇండియాలో తను కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు ను సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

బీజేపీలోకి విజయ్‌ మాజీ భార్య.. రాజకీయ వ్యూహమా?

Vijay Wife Divorce News
Vijay Wife Divorce News

Vijay ex wife BJP : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దళపతి విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ అద్భుత విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విజయ్‌ సీఎం అయ్యారు. ఈ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలను ప్రజలు ఓడించారు. ఈ క్రమంలో తాజాగా తమిళ రాజకీయాల్లో కొత్తగా మొదలైన ఒక హాట్‌ టాపిక్‌ విజయ్‌ మాజీ భార్య సంగీతా బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని. ఈ ప్రచారం ప్రకారం, విజయ్‌ రాజకీయ ప్రభావాన్ని బలహీనపరచడానికి బీజేపీ ఈ వ్యూహం చేస్తోందని, పార్టీలోని ఒక ప్రముఖ నటి ఈ ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. ఇది కేవలం రూమర్‌ మాత్రమే కావచ్చు, కానీ తమిళనాడు పొలిటికల్‌ తెరపై ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విజయ్‌ రాజకీయ ప్రవేశం తర్వాత కుటుంబ సమస్యలు, విడాకులు వంటి వ్యక్తిగత అంశాలు కూడా రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయి.

విజయ్‌ రాజకీయ ప్రయాణం…
విజయ్‌ సినిమా నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత అతని వ్యక్తిగత జీవితం ప్రజల దృష్టికి ఎక్కువగా వచ్చింది. సంగీతతో దాదాపు 27 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడాకుల కేసు, అనుకోని ఆరోపణలు రాజకీయ విమర్శలకు దారితీశాయి. విజయ్‌ కూడా తన సమీప వ్యక్తులను ఉపయోగించి తనను టార్గెట్‌ చేస్తున్నారని పరోక్షంగా స్పందించారు. ఇలాంటి సమయంలో సంగీతా బీజేపీ వైపు మొగ్గు చూపడం గురించిన రూమర్లు రావడం ఆసక్తికరం. ఇది విజయ్‌ రాజకీయ వ్యూహాలకు ఎదురుదెబ్బ కావచ్చని భావిస్తున్నారు.

బీజేపీ ఎందుకు ఆసక్తి చూపుతోంది?
విజయ్‌ టీవీకే ద్వారా తమిళనాడులో కొత్త శక్తిగా ఎదిగాడు. అతని ప్రభావాన్ని చీల్చడానికి కుటుంబ సభ్యులను ఉపయోగించడం ఒక తెలివైన వ్యూహం కావచ్చు. అయితే ఇలాంటి రూమర్లు పబ్లిసిటీని పెంచుతాయి. సంగీతా బీజేపీలో చేరితే అది తమిళ సినిమా–రాజకీయాల మధ్య మరింత సంబంధాన్ని బలపరుస్తుంది. బీజేపీలో ఉన్న ఒక నటి ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పడం రూమర్‌కు మరింత ఆకర్షణీయతను ఇస్తోంది.

ఇది నిజమవుతుందా?
ఇప్పటికి ఇది కేవలం రూమర్‌ మాత్రమే. సంగీత వైపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. రాజకీయాల్లో వ్యక్తిగత సంబంధాలు తరచుగా ఉపయోగపడతాయి, కానీ అవి ఎలాంటి ఫలితాలిస్తాయో చెప్పడం కష్టం. విజయ్‌ అభిమానులు ఇలాంటి వార్తలను తీవ్రంగా తీసుకుంటారు, అదే సమయంలో వ్యతిరేకులు దీన్ని ఆయుధంగా మలుచుకోవచ్చు. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినిమా గ్లామర్‌తో ముడిపడి ఉంటాయి కాబట్టి ఇలాంటి డెవలప్‌మెంట్లు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు.

ఈ రూమర్‌ తమిళనాడు రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాలు ఎంతగా రాజకీయ సాధనాలుగా మారుతున్నాయో చూపిస్తుంది. సంగీతా బీజేపీలో చేరడం నిజమైతే అది పెద్ద ట్విస్ట్‌ అవుతుంది. ప్రస్తుతం ఇది కేవలం ఊహాగానాలు మాత్రమే. అధికారిక నిర్ధారణ కోసం వేచి చూడాలి. రాజకీయాలు అనేవి అనూహ్యమైనవి. ఈ డెవలప్‌మెంట్‌ విజయ్‌ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే చెప్పాలి.

అన్నామలై తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీకి శ్రీకారం?

Annamalai BJP resignation

Annamalai BJP resignation : అన్నామలై.. జాతీయ టీవీ వార్తల్లో బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆల్ మోస్ట్ ఖాయమైపోయిందని అనుకోవాలి. అన్నామలై క్లోజ్ సర్కిల్స్ నుంచే ఈ వార్త లీక్ అయినట్టుగా తెలుస్తోంది.

అన్నామలై ఈ తీవ్రమైన నిర్ణయానికి ఎందుకొచ్చినట్టు తెలుసుకుందాం. ఓ అనామలై.. ఓ తుఫాన్.. తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యంలో ఈస్థాయికి గణనీయమైన ఫాలోయింగ్ సంపాదించిన ఏకైక నాయకుడు అన్నామలైనే..

ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ప్రస్తుత సీఎం విజయ్. వీరందరూ సినీ నేపథ్యమే. ఓ ఐపీఎస్ అధికారిగా ఉండి రాజీనామా చేసి తమిళ పాలిటిక్స్ లోకి వచ్చిన మేధావి అన్నామలై. కానీ బీజేపీలో ఆయన ఎదగలేకపోయారు. బీజేపీని ఆదరించే స్థాయికి ఆయన తీసుకొచ్చారు.బీజేపీకి 11 శాతం ఓట్లు తీసుకొచ్చిన ఘనత అన్నామలైదే..

అన్నామలై తమిళనాడులో మరో ప్రాంతీయ పార్టీకి శ్రీకారం? దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

నేనైతే మంచిదాన్ని కాదు.. ఆంధ్రోళ్లను హెచ్చరించిన కవిత

Kavitha political statement
Kavitha political statement

Kavitha political statement: తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సేన వ్యవస్థాపకురాలు, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవిత మరోసారి హీట్‌ పెంచారు. హైదరాబాద్‌లో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏజెంట్‌ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడంతో ఇది జరుగుతుందన్నారు. ‘నేనైతే మంచిదాన్ని కాదు’ అంటూ పాత నాయకులను ప్రస్తావిస్తూ, విగ్రహాల సంస్కృతిని తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఆ విగ్రహాలను తొలగించి ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామని స్పష్టం చేశారు.

రావొచ్చు.. పోవచ్చు..
ఆంధ్రా నాయకులు, వ్యాపారాలు తెలంగాణకు రావచ్చు పోవచ్చన్నారు. ఇక్కడ కంపెనీలు పెట్టి స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రావాళ్లు తెలంగాణలో రొయ్యలు అమ్ముకోవచ్చని, షూటింగ్‌లు చేసుకోవచ్చని, సినిమాలు తీసుకోవచ్చాన్నారు. వ్యాపారులకు అయితే రెడ్‌ కార్పెట్‌ వేసి స్వాగతం పలుకుతామని తెలిపారు. కానీ తెలంగాణ సెక్రెటేరియట్‌లో ఆంధ్రవాళ్లు గరిట తిప్పే ప్రయత్నం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.

విగ్రహాల సంస్కృతి మీద దాడి
కవిత ప్రధాన టార్గెట్‌ విగ్రహాల నిర్మాణం. తాను ‘‘పాత నాయకులంత మంచిదాన్ని కాదు’’ అని చెప్పడం ద్వారా కొత్త తరం రాజకీయాలు, ప్రాక్టికల్‌ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని సంకేతం. ప్రాంతీయ సంబంధాలుకవిత రెండు ముఖ్యమైన పాయింట్లు చెప్పారు. విదేశీయుల కంటే భారతీయ (తెలుగు) వ్యాపారులను ఆహ్వానించి, భూములు ఇచ్చి పరిశ్రమలు స్థాపించాలని. ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతమైన శ్రీసిటీ నిర్మాతను తెలంగాణకు ఆహ్వానించడం ద్వారా ప్రాంతీయ సంబంధాలను మెరుగుపరచాలని సంకేతం.

రాజకీయ ప్రభావం ఏమిటి?
విగ్రహాలకు బదులు ఉపాధి, వాణిజ్యం, సినిమా పరిశ్రమకు ప్రాధాన్యం – యువత, వ్యాపారులలో ఆకర్షణీయం కావచ్చు. అయితే కవిత ఆంధ్ర–తెలంగాణ మధ్య ఉద్రిక్తతలు పెంచే హెచ్చరికలు చేశారు. ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నంలా కవిత మాటలు ఉన్నాయి.

కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ హల్‌చల్‌ సృష్టించాయి. ఆంధ్ర–తెలంగాణ సంబంధాలు వంటి సున్నితమైన అంశాలను ఒకేసారి తాకాయి. ఇవి కేవలం హెచ్చరికలు మాత్రమేనా లేదా భవిష్యత్‌ రాజకీయ వ్యూహాల భాగమా అనేది కాలమే చెప్పాలి.

ఎండ్లబండిపై ఎమ్మెల్యే..ఆటో డ్రైవర్ కుమార్తెతో పెళ్లి.. చివర్లో ట్విస్ట్ అదిరింది..

BJP MLA Dipesh Sahu marriage
BJP MLA Dipesh Sahu marriage

BJP MLA Dipesh Sahu marriage: చమురు ధరలు బీభత్సంగా ఉన్నాయి. నిత్యావసరాల ధరలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో సగటు మనిషి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్ పెండేంచర్ విపరీతంగా ఉంటున్నది. ధరలు ఈస్థాయిలో ఉండటంతో ఎలా బతకాలి? ఈ ఖర్చులను అధిమించాలో తెలియక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే అరుణాచల్ ప్రదేశ్ వరకు మొత్తం ఇదే పరిస్థితి. ధరల మీద మన్నువడ.. ఇదేం ఇబ్బంది రా నాయనా అని పాడుకునే దుస్థితి.

పెరిగిన ధరలు సామాన్యులను మాత్రమే కాదు.. రాజకీయ నాయకులను సైతం ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటి ఖర్చు ఇబ్బందిని జయించేందుకు ఒక ఎమ్మెల్యే చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు ఖర్చు తగ్గించుకోవాలని.. కాన్వాయ్ లో ఉన్న వాహనాలను తగ్గించాలని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకొని చత్తీస్గడ్ ప్రాంతానికి చెందిన బిజెపి ఎమ్మెల్యే దీపేష్ సాహు తన పెళ్లి విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు దేశాంతంగా ఉన్న ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శంగా నిలిచారు.

దీపేష్ “ముఖ్యమంత్రి కన్య వివాహ యోజన” అనే పథకం ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం సామూహికంగా వివాహాలు జరపడం.. అయితే దీపేష్ ఒక డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు వివాహ వేదిక వద్దకు ఆయన ఎద్దుల బండిమీద వచ్చారు. ఎద్దుల బండిని ఉప ముఖ్యమంత్రి సావ్ స్వయంగా నడుపుకుంటూ తీసుకొచ్చారు. ఎటువంటి హంగు కనిపించలేదు. ఆర్భాటం కూడా దర్శనమివ్వలేదు. అనవసరమైన ఖర్చు లేకుండా ఎమ్మెల్యే అత్యంత సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన సతీమణితో అదే ఎద్దుల బండి మీద కలిసి ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి ఆ ఎద్దుల బండిని ముందుండి నడిపారు.

ఎద్దుల బండిమీద ఎమ్మెల్యే రావడం.. ఉప ముఖ్యమంత్రి దాన్ని నడపడం సంచలనంగా మారింది. ప్రజా ప్రతినిధులు ఎక్కడికైనా వెళ్తే ప్రోటోకాల్ వాహనాలతో సందడి చేస్తారు. కానీ ఎమ్మెల్యే హోదాలో ఉండి ఆయన ఆ వాహనాలను వాడుకోలేదు. ఉప ముఖ్యమంత్రి తన స్థాయిని పక్కనపెట్టి ఎడ్ల బండి నడిపారు. దీని వెనుక పిఆర్ స్టంట్.. ఇంకా ఏదైనా ఉన్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఇటువంటి వ్యవహారాలు చాలా బలమైన ముద్రవేస్తాయి.

చేతికి కోటి.. మెడలో లక్ష.. సీఎం కాకముందే మొదలెట్టిన డీకే శివకుమార్

DK Shivakumar assets and lifestyle
DK Shivakumar assets and lifestyle

DK Shivakumar assets and lifestyle: అనేక నాటకీయ పరిణామాల మధ్య..చివరి వరకుసాగిన ఉత్కంఠ మధ్య..కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నియమితులయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకులు హాజరవుతారని సమాచారం.

డీకే శివకుమార్ ఆర్థికంగా బలమైన నాయకుడు. బీజేపీ పెట్టిన అనేక కేసులను ఎదుర్కొన్నారు. చివరికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మొన్నటి దాకా ఉపముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. సీఎం అవుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ లైఫ్ స్టైల్ మీద విపరీతమైన చర్చ నడుస్తోంది. డీకే శివకుమార్ మెడలో ఎప్పటికీ ఒక స్కార్ఫ్ లాంటిది ఉంటుంది. సహజంగా ఇటువంటి వాటిని ఉత్తర భారతదేశ రాజకీయ నాయకులు ధరిస్తూఉంటారు. దక్షిణాదిలో డీకే శివకుమార్ ఆ తరహాలో స్కార్ప్ ధరిస్తారు.

శివకుమార్ ధరించే స్కార్ప్ ఆశామాషీది కాదు. అది ఎంతో ఖరీదైనది. కాశ్మీర్ ప్రాంతంలో LOUIS VUITIONకు చెందిన దీని ధర మార్కెట్ లో లక్ష వరకు ఉంటుంది. శివకుమార్ ధరించే CARTIER SANTOS కంపెనీ వాచీ ధర 50 లక్షల వరకు ఉంటుంది. రోలెక్స్ కాస్మోగ్రాఫ్ వాచ్ ధర రూ. కోటి వరకు ఉంటుందని సమాచారం.

డీకే రాజకీయాల్లోకి రాకముందు నుంచి రాయల్ లైఫ్ స్టైల్ కొనసాగించేవారు. ఆయన ఆస్తులు 1400 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.డీకే లగ్జరీ లైఫ్ స్టైల్ మీద బీజేపీ నాయకులు నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ డీకే పట్టించుకోరు. పైగా తన లగ్జరీ ని మరింత పెంచుతుంటారు. అప్పుడప్పుడూ వెస్ట్రన్ సూట్ లలో కూడా డీకే కనిపిస్తుంటారు. -తనకుమాత్రమే సాధ్యమైన విధంగా ఆయన లగ్జరీ లైఫ్ ఆస్వాదిస్తూ ఉంటారు. త్వరలో సీఎం అవబోతున్న నేపథ్యంలో డీకే ఇంకా తన రేంజ్ ఎలా ప్రదర్శిస్తారో చూడాల్సి ఉందని రాజకీ య విశ్లేషకులు అంటున్నారు.

స్లోగా నడిచేవారిలో వినికిడి లోపం ఉంటుందా..

Slow walking and Hearing loss link
Slow walking and Hearing loss link

Slow walking and Hearing loss link: సాధారణంగా ఎవరైనా నెమ్మదిగా నడుస్తుంటే దానికి వయసు పెరగడం.. మోకాళ్ల నొప్పులు.. కండరాల బలహీనత లేదా ఇతర శారీరక సమస్యలే కారణమని చాలామంది భావిస్తారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక పరిశోధన ఈ అభిప్రాయానికి కొత్త కోణాన్ని జోడించింది. వినికిడి శక్తి తగ్గిపోవడం కూడా ఒక వ్యక్తి నడక వేగాన్ని ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ షాకింగ్ వివరాల్లోకి వెళితె..

అమెరికాలోని University of Michigan పరిశోధకులు ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ సహకారంతో 57,000 మందికి పైగా ఐఫోన్ వినియోగదారుల ఆరోగ్య సంబంధిత డేటాను విశ్లేషించారు. ఇందులో పాల్గొన్న వారి వినికిడి సామర్థ్యం, నడక వేగం, శారీరక చురుకుదనం వంటి అంశాలను పరిశీలించారు. ఈ అధ్యయనం ద్వారా వినికిడి లోపం ఉన్న వ్యక్తులు సాధారణ వినికిడి కలిగిన వారికంటే గణనీయంగా నెమ్మదిగా నడుస్తున్నట్లు తేలింది.

వినికిడి అనేది కేవలం శబ్దాలను గుర్తించడానికే పరిమితం కాదు. మన శరీర సమతుల్యతను కాపాడడంలో కూడా చెవులలోని అంతర్గత వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. చెవుల పనితీరు దెబ్బతింటే మెదడుకు వచ్చే సమాచారం తగ్గిపోతుంది. ఫలితంగా సమతుల్యత కోల్పోయే ప్రమాదం పెరుగుతుంది. దీంతో వ్యక్తులు జాగ్రత్తగా, నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తారు.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. వినికిడి లోపం ఉన్నవారు చుట్టుపక్కల పరిస్థితులను అర్థం చేసుకోవడానికి మెదడును ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుంది. శబ్దాలను గుర్తించడం, సంభాషణలను అర్థం చేసుకోవడం వంటి పనులకే మెదడు అధిక శక్తిని ఖర్చు చేస్తుంది. దీంతో నడక వంటి ఇతర శారీరక కార్యకలాపాలపై దృష్టి కొంత తగ్గి, నడక వేగం మందగించవచ్చని వారు వివరించారు.

నడక వేగం తగ్గడం అనేది కేవలం ఒక చిన్న మార్పు మాత్రమే కాదు. ఇది భవిష్యత్తులో పడిపోవడం, ఎముకలు విరగడం, శారీరక చురుకుదనం తగ్గిపోవడం వంటి సమస్యలకు సంకేతంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.

వినికిడి సామర్థ్యం తగ్గుతున్నట్లు అనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది. అవసరమైతే హియరింగ్ ఎయిడ్స్ లేదా ఇతర వైద్య సలహాలను పాటించడం ద్వారా వినికిడి నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు. ఇది కేవలం వినికిడిని మాత్రమే కాకుండా శారీరక చురుకుదనం, నడక వేగం మరియు జీవన నాణ్యతను కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నడక వేగం ఒక వ్యక్తి మొత్తం ఆరోగ్య స్థితిని సూచించే ముఖ్యమైన సూచికగా పరిగణించబడుతోంది. గుండె ఆరోగ్యం, కండరాల బలం, మెదడు పనితీరు, సమతుల్యత వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తాజా అధ్యయనం వినికిడి ఆరోగ్యాన్ని కూడా ఈ జాబితాలో చేర్చింది.

కోహ్లికి ఏమైంది.. ఎందుకు అలా మాట్లాడాడు..

Virat Kohli controversial statement
Virat Kohli controversial statement

Virat Kohli controversial statement: ఐపీఎల్ లో మరోసారి విజేతగా నిలిచింది బెంగళూరు. ఫైనల్లో గిల్ జట్టు మీద గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్లో బెంగుళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ 75* పరుగులు చేశాడు . ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ట్రోఫీ గెలిచిన తర్వాత తీన్మార్ డాన్స్ కూడా చేశాడు విరాట్ కోహ్లీ.

ఫైనల్ మ్యాచ్లో 75 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అనుకున్నాడు. గత ఫైనల్ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో బెంగళూరుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ దక్కింది. ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఆసక్తికర కామెంట్లు చేశాడు. అవి కాస్త సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారి తీస్తున్నాయి.

గత ఏడాది మాదిరిగా ఈసారి బెంగళూరు జట్టు మీద ఒత్తిడి లేదట.. జట్టు కోసం కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే ఒక్కడిగా నిలబడలేదట.. అతడి బాధ్యతను పంచుకునేందుకు అద్భుతమైన బృందం దొరికిందట.. అది అతడికి సంతోషం కలిగించిందట.. ఒత్తిడి లేకపోవడం వల్ల స్వేచ్ఛగా ఆడగలిగాడట. అందువల్లే పరుగులు వచ్చాయట. విజయాలు కూడా సాధ్యమయ్యాయట. విరాట్ కోహ్లీ ఈ మాటలు చెప్పడంతో.. ఈసారి బెంగళూరు జట్టు పకడ్బందీ ప్రణాళికతోనే ఐపిఎల్ లోకి వచ్చిందని అభిమానులు అంటున్నారు. అందువల్లే ఈసారి కూడా బెంగళూరు విజేత గా నిలిచిందని చెబుతున్నారు..

గత ఫైనల్ మ్యాచ్ మాదిరిగా విరాట్ కోహ్లీ ఈసారి ఆ స్థాయిలో తన విశ్వరూపాన్ని చూపించలేదు.. జట్టు గెలిచిన తర్వాత మామూలుగానే మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. తోటి ప్లేయర్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు.. కానీ గుజరాత్ జట్టును ఇబ్బంది పెట్టే విధంగా సంకేతాలు ఇవ్వలేదు. రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేయలేదు. హావ భావాలు ప్రదర్శించలేదు.. మొత్తానికి ఈసారి విరాట్ సరి కొత్తగా కనిపించాడు. అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు.