Home Blog Page 205

జీతాలపై బ్రేకింగ్ న్యూస్.. ఇక తేడా వస్తే తిప్పలే

Telangana government salary news
Telangana government salary news

Telangana government salary news: ప్రభుత్వంలో ఉన్న శాఖలలో రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. వివిధ విధానాలలో కూడా ఉద్యోగులు పనిచేస్తుంటారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానం లేకుండా.. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని నాడు కెసిఆర్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలలో ఉద్యోగులు నేటికీ పనిచేస్తూనే ఉన్నారు.

ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన విచారణలో చాలావరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలలో ఉద్యోగులు లేకపోయినప్పటికీ వారికి వేతనాలు చెల్లించారని.. ఇవన్నీ నాటి గులాబీ పార్టీ పెద్దల ఖాతాలలోకి వెళ్లాయని తేలింది. దీంతో ఆ కాంట్రాక్ట్ సంస్థలను.. ఔట్ సోర్సింగ్ విభాగాలను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టింది.. ఇప్పుడిక ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్, కాంట్రాక్ట్ కార్మికులకు నగదు రూపంలో జీతం ఇస్తే ఊరుకునేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఏ విభాగంలోనైనా సరే నేరుగా బ్యాంకు ఖాతాలోనే వేతనాన్ని వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కనీస వేతనాలను పూర్తిస్థాయిలో పెంచుతూ.. సెలవు రోజుల్లో పనిచేస్తే కార్మికులకు కచ్చితంగా అధిక వేతనం ఇవ్వాలని నిబంధన విధించింది. వేతనాలు ఇవ్వకుండా థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ కనుక ఇబ్బంది పెడితే.. మెయిన్ కంపెనీ బాధ్యత తీసుకోవాలని.. వేతనాల వ్యవహారాలను సెటిల్ చేయాలని సూచించింది.

చాలావరకు ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించే విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఖాతా ద్వారా కాకుండా నేరుగా వేతనాన్ని ఇస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. నేరుగా ఇచ్చే వేతనంలో కూడా కోతలు విధిస్తున్నాయి కంపెనీలు. ఇటువంటి ఫిర్యాదు ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షల మంది ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు లాభం చేకూర్చనుంది. అంతేకాదు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది.. ఖాతాలలో వేతనాలు వేయడం వల్ల సక్రమంగా పిఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. కార్మికులకు చెల్లించాల్సిన ప్రయోజనాలను కూడా ఖాతాలో వేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు, కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది.

అధినేత ఆదేశాలతో ఫుల్ సైలెంట్ లోకి ఆ వైసీపీ నేత!

Tammineni Sitaram
Tammineni Sitaram

Tammineni Sitaram silent mode: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫుల్ సైలెన్స్ పాటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనడం లేదు. ప్రస్తుతం ఆయన ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ కాదు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం వైసిపి ఇన్చార్జిగా ఉన్నారు. మొన్న మధ్యన గట్టిగానే సౌండ్ చేశారు. కానీ ఇటీవల మాత్రం సైలెంట్ అయ్యారు. ఈ సైలెన్స్ వెనుక అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంపై జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ గా తేల్చేసినట్లు ప్రచారం నడుస్తోంది. తప్పనిసరిగా తన ఆదేశాలను పాటించాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అప్పటినుంచి ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు తమ్మినేని. రాజకీయంగా ఆయనకు ఏం చేయాలో కూడా ఇప్పుడు పాలు పోవడం లేదు.

తప్పని ఓటమి..
స్పీకర్ గా ఐదేళ్లపాటు కొనసాగారు తమ్మినేని సీతారాం. మొన్నటి ఎన్నికల్లో ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. ఆయనపై స్వయానా మేనల్లుడు కూన రవికుమార్ గెలిచారు. అయితే ఆమదాలవలసలు కుటుంబ రాజకీయంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తమ్మినేని సీతారాం ను పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు అప్పగించారు బాధ్యతలు. అయితే ఈ పరిణామంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు తమ్మినేని. జగన్మోహన్ రెడ్డి మాత్రం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు తమ్మినేనికి కట్టబెట్టారు. ఆమదాలవలస అసెంబ్లీ నుంచి తన కుమారుడిని పోటీ చేయించాలి అనేది తమ్మినేని ఆలోచన. కనీసం తన కుమారుడిని ఇన్చార్జిగా నియమించి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వినిపించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆమదాలవలస పై ఆశలు వదులుకోండి.. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయండి అంటూ తమ్మినేనికి సూచించారు. అయితే అధినేత మనసు మారుతుందని.. తనకే ఛాన్స్ దక్కుతుందని తమ్మినేని భావించారు. అయితే రోజురోజుకు ఆమదాలవలస నియోజకవర్గంలో చింతాడ రవికుమార్ స్ట్రాంగ్ అవుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని మరోసారి సంప్రదిస్తే తమ్మినేని సీతారాంకు పెద్ద రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది.

అధినేత ఆదేశాలతో..
ఇటీవల తమ్మినేని సీతారాం ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఆయన తన కుమారుడిని తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. కుమారుడి కోసం ఆమదాలవలస నియోజకవర్గాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఖరాఖండిగా తేల్చేశారట. చేస్తే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి చెయ్యండి. లేకుంటే గౌరవంగా తప్పించుకోవచ్చు. కీలక నిర్ణయం తీసుకోవచ్చని సెలవు ఇచ్చారట. అప్పటినుంచి ఏం చేయాలో తెలియక ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు తమ్మినేని. మున్ముందు తమ్మినేని సీతారాం నిర్ణయాలు ఎలా ఉండబోతాయో చూడాలి

అనిల్ రావిపూడి సంక్రాంతిని వదిలిపెట్టడా..?

Anil Ravipudi Sankranti release movies
Anil Ravipudi Sankranti release movies

Anil Ravipudi Sankranti release movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక దానికి తోడుగా వరుసగా సక్సెస్ లను సాధించే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. అందులో అనిల్ రావిపూడి ఒకరు… రాజమౌళి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సక్సెస్ లను సాధించిన దర్శకులలో అనిల్ రావిపూడి ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటాయి. అందుకే టాప్ హీరోల నుంచి కూడా ఆయన అవకాశాలను అందుకుంటున్నాడు. ఇప్పటివరకు తను చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు 9 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన పదోవ సినిమాతో సైతం సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. తన నుంచి వచ్చే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నిజానికి అనిల్ రావిపూడి సినిమాలన్నీ పండుగను బేస్ చేసుకుని వస్తున్నాయి. కాబట్టి సక్సెస్ లను సాధిస్తున్నాయి.

లేకపోతే అతని సినిమాలకు ప్రేక్షకుడి నుంచి పెద్దగా ఆదరణ దక్కదు అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో కూడా నిలుస్తున్నాడు. ఎందుకని ఆయన సంక్రాంతి కే సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు అంటే అతని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని బేస్ చేసుకుని వస్తాయి.

కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఎక్కువ రీచ్ పొందాలి అంటే ఏదైనా పండుగ సీజన్లో వస్తేనే బెటరు అని ఆలోచిస్తున్నాడట. ఇక సంక్రాంతి సీజన్ లో అయితే రెండు రాష్ట్రాల్లో ప్రేక్షకులు సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తారనే ఉద్దేశ్యంతో ఆయన అలాంటి స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ వస్తున్నారట…

మొత్తానికైతే వచ్చే ఏడాది కూడా అతను సంక్రాంతి బరిలో నిలవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సక్సెస్ ను సాధిస్తే వరుసగా మూడు సంవత్సరాలుగా సంక్రాంతికి సక్సెస్ లను అందించిన హ్యాట్రిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు…

అంతా ఫోన్ తోనే ఖర్చుపెట్టారు.. మే నెలలో ఎన్ని కోట్లంటే..

Digital Payments India
Digital Payments India

Digital Payments: Unified Payments Interface (UPI) మే నెలలో సరికొత్త రికార్డు సృష్టించిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. ఈ నెలలో యూపీఐ ద్వారా మొత్తం రూ.29.90 లక్షల కోట్ల విలువైన టాప్-అప్ లావాదేవీలు జరిగాయి. అలాగే మొత్తం లావాదేవీలు సంఖ్యా పరంగా 2,320 కోట్లకు చేరాయి. ఇది దేశీయోల ఆన్‌లైన్ పేమెంట్స్‌లో భారీ పెరుగుదలకు సంకేతమని NPCI తెలిపింది. అయితే ఈ లావాదేవీలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. అవేంటంటే?

NPCI వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 మే నెల లావాదేవీలు గత ఏప్రిల్ కంటే పెరిగింది. గత ఏడాది ఇదే మే నెలలో నమోదైన రూ.25.14 లక్షల కోట్లతో పోల్చితే ఇప్పుడు ఏడాదిలో యూపీఐ లావాదేవీల విలువ సుమారు 19 శాతం వృద్ధి చెందింది. సంఖ్యా పరంగా కూడా గతేడాది 1,867 కోట్లు కాగా.. ఈసారి 2,320 కోట్లకు చేరి 24 శాతం వృద్ధి కనబరిచింది.

ఈ సందర్భంగా క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్ సిన్హా మాట్లాడుతూ వేసవి సెలవుల్లో పెరిగిన ప్రయాణాలు, ఐపీఎల్ సీజన్ కారణంగా టికెట్ , ఫుడ్, ట్రావెల్ ఫై కార్డుల ద్వారా విపరీతంగా ఆర్థిక లావాదేవీల జరిగాయి. అలాగే నెలవారీ యూపీఐ లావాదేవీలు పెరిగి ఈ రికార్డు స్థాయిని తాకాయన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నివేదిక ప్రకారం.. యూపీఐలో సగటు లావాదేవీ పరిమాణం 2021లో సుమారు రూ.1,848 ఉండగా.. 2025 నాటికి అది రూ.1,313 వరకు తగ్గింది. దీంతో యూపీఐ ఎకోసిస్టమ్ బలోపేతానికి చేసిన కృషి ఫలితానికి తాజాగ నివేదికలే నిదర్శనమని తెలుస్తోంది.

అంతేకాకుండా మే 2026లో నమోదైన యూపీఐ లావాదేవీ రికార్డు విలువ ఆర్థిక వృద్ధి లక్షణాలను చూపుతున్నాయి. సీజనల్ ఈవెంట్లు, వినియోగపు మార్పులు, పెరిగిన డిజిటలైజేషన్ కారణంగా ఈ వృద్ధి నమోదవుతున్నట్లు NPCI మరియు పరిశీలకులు పేర్కొంటున్నారు.

పవన్ కళ్యాణ్ కు భూకబ్జా చేయాల్సిన కర్మ ఏంటి.. అసలు వాస్తవాలు ఇవి కదా

Pawan Kalyan land issue controversy
Pawan Kalyan land issue controversy

Pawan Kalyan land issue controversy: ఊసుపోని వ్యక్తులకు ఊరివారందరి వ్యవహారాలు కావాలి. వారి మీద ఇంత మన్ను పోయడానికి అవకాశం కావాలి. ఇప్పుడు ఇలానే ఉంది కొంతమంది పరిస్థితి. తెలంగాణ ప్రాంతం నుంచి రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నవారు.. పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతున్నారు. పవన్ కళ్యాణ్ భూమి కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీలో ఉన్న ఓ ఎమ్మెల్యే హైదరాబాదులో భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డాడు. గండిపేట లో ఉన్న ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలతో కొట్టేసేందుకు ప్రయత్నించాడు. ఆ భూమి విలువ అచ్చంగా 1500 కోట్లు. ఇప్పటికే ఈ దందాలో నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ అనే వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ దందాకు పాల్పడిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. బొల్లా రమేష్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.

వాస్తవానికి వైసీపీ మీద విమర్శలు చేస్తూ.. తెలంగాణ ప్రాంతంలో భూ కుంభకోణాలకు పాల్పడిన వీరి మీద ఆగ్రహం వ్యక్తం చేయాలి. కానీ తెలంగాణలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అలా వ్యవహరించడం లేదు. పైగా పవన్ కళ్యాణ్ భూమి కబ్జాకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు శంకర్పల్లి ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారు.

2014 డిసెంబర్ 15న ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 182 సెక్షన్ 54 ఆధారంగా ఆ భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు.

రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 17 ఆధారంగా రిజిస్టర్డ్ సేల్ డీడ్ నమోదు చేసుకున్నారు. ఇక్కడ రిజిస్టర్ డాక్యుమెంట్ అంటే యాజమాన్యానికి చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వు.

ఇక్కడ ఎఫ్టిఎల్ నిబంధనలు అనేవి నిర్మాణాల మీద మాత్రమే వర్తిస్తాయి. యాజమాన్య హక్కుల మీద వర్తించవు.

వ్యక్తిగత యాజమాన్య హక్కులు కలిగి ఉన్న భూమిని శిఖం పట్టా భూమి అంటారు. కొంతమంది వీటిని ప్రభుత్వ భూమిగా చెబుతుండడం నిజంగా అజ్ఞానం.

తెలంగాణ రెవెన్యూ చట్టాల ప్రకారం మ్యుటేషన్లు.. ఖాతా నెంబర్లు.. ఒకే వ్యక్తికి ఒకే ఖాతాలో ఉండాలని లేదు.

ఇవన్నీ కూడా ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. చట్టబద్ధమైన పత్రాల ఆధారంగా పవన్ కళ్యాణ్ భూములు కొనుగోలు చేస్తే.. కొంతమంది అమ్ముడుపోయిన వ్యక్తులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.

భూకబ్జా గురించి పదే పదే చెబుతున్న వ్యక్తులు ఒక ఆధారమైనా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చూపించాలని జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా పొందిన భూమిని కబ్జా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని వారి ప్రశ్నిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించి.. ప్రజలను మభ్యపెట్టే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు.

Microsoft నుంచి కొత్త ల్యాప్ ట్యాప్.. AI వాడేవారికి సూపర్ డివైజ్..

Surface Laptop Ultra NVIDIA features
Surface Laptop Ultra NVIDIA features

Surface Laptop Ultra NVIDIA features: Microsoft తన అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్ Surface Laptop Ultraని ప్రకటించింది. ఇది NVIDIAతో కలిసి అభివృద్ధి చేసిన అత్యాధునిక ల్యాప్‌టాప్. AI తో పాటు 3D రెండరింగ్, భారీ కంటెంట్ క్రియేషన్ వంటి పనులకు అనుకూలంగా ఉండే ఇందులో ఊహకందని ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లతో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చని టెక్ నిపుణులు అంటున్నారు. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? దీని ధర ఎంతో తెలుసుకుందాం..

Surface Laptop Ultra NVIDIA రెంట్ షార్క్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫామ్ పై రావడం Microsoft ల్యాప్‌టాప్‌లలో ఇదే మొదటిసారి. ఇందులో ఎన్విడా బ్లాక్ వెల్ RTX GPU ఉంటుంది. ఇది పూర్తి CUDA సపోర్ట్‌తో పెటాఫ్లాప్ వరకు AI కంప్యూటింగ్ పవర్‌ను అందిస్తుంది. దీంతో 120 బిలియన్ పారామీటర్ల వరకు గల AI మోడల్‌లను క్లౌడ్‌పై ఆధారపడకుండానే లోకల్‌గా రన్ చేయగలదు.

ఈ ల్యాప్‌టాప్‌లో వరకు 128GB వరకు యూనిఫైడ్ మెమరీ ఉంది. ఇది సీపీయూ, జీపీయూ రెండూ ఒకే మెమరీ పూల్‌ను యాక్సెస్ చేసుకునేలా చేస్తుంది. యూనిఫైడ్ మెమరీ ఆర్కిటెక్చర్ AI వర్క్‌లోడ్స్, రెండరింగ్ టాస్క్స్, పెద్ద డేటాసెట్‌లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సాంప్రదాయక ల్యాప్‌టాప్ ఆర్కిటెక్చర్‌ల కంటే భిన్నంగా, వేర్వేరు మెమరీలను వేరు చేయకుండా ఏకీకృతం చేస్తుంది.

Surface Laptop Ultraలో 15 అంగుళాల పిక్సెల్ సెన్స్ అల్ట్రా టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంది. ఇది మినీ ఎల్ ఈడీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ డిస్ప్లే 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. 262 PPI పిక్సెల్ డెన్సిటీ, హై-ప్రెసిజన్ కలర్ రిప్రొడక్షన్‌ను అందిస్తుంది.

ఇతర ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే, Surface Laptop Ultraలో USB-C యాడాప్టర్లపై ఆధారపడకుండా HDMI, USB-C, USB-A, SD కార్డ్ స్లాట్, హెడ్‌ఫోన్ జాక్ వంటి వైడ్ రేంజ్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది డెవలపర్స్ AI బిల్డర్స్ , క్రియేటర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. భారీ 3D సీన్స్, పొడవైన కంపైల్ టైమింగ్స్, బహుళ మోడల్‌లను రన్ చేయడం వంటి కఠినమైన వర్క్‌లోడ్స్‌ను హ్యాండిల్ చేయగలదు.Microsoft Surface Laptop Ultra ధర మరియు విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అంది ఇది 2026 చివరిలో అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 కోసం ఆప్టిమైజ్ చేయబడిన NVIDIA DGX షార్క్ మిని-పీసీ వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

20లో చేసే ఈ 5 పొరపాట్లే లైఫ్ కి కోలకోలేని దెబ్బ.. అవేంటంటే..

Common mistakes in early 20s
Common mistakes in early 20s

Common mistakes in early 20s: జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని.. మంచి స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే అందరూ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరు. దీనికి అదృష్టం కంటే ఎక్కువగా ప్రభావం చూపేది ఆర్థిక క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు, ముందుచూపు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలే భవిష్యత్తు జీవితానికి బలమైన పునాది వేస్తాయి. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువతలో చాలామంది తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు తర్వాత పెద్ద నష్టాలకు దారి తీస్తుంటాయి. ఆ పొరపాట్లు ఏవో చూద్దాం..

లైఫ్‌స్టైల్ కోసం అధికంగా ఖర్చు చేయడం..
ఉద్యోగం వచ్చిన వెంటనే చాలామంది తమ ఆదాయాన్ని జీవనశైలిని మెరుగుపరచుకోవడానికే ఎక్కువగా వినియోగిస్తారు. ఖరీదైన మొబైళ్లు, బ్రాండెడ్ దుస్తులు, తరచూ బయట భోజనాలు, విలాసవంతమైన ప్రయాణాలు వంటి ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులు కూడా పెంచుకోవడం వల్ల పొదుపులకు అవకాశం తగ్గిపోతుంది. ఈ అలవాటు భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఒత్తిడికి కారణమవుతుంది.

పెట్టుబడులను ఆలస్యం చేయడం
“ఇంకా వయసుంది, తర్వాత పెట్టుబడులు పెడదాం” అనే ఆలోచన యువతలో చాలా సాధారణం. కానీ పెట్టుబడుల విషయంలో సమయమే అత్యంత విలువైన ఆస్తి. చిన్న మొత్తాలతో అయినా తొందరగా పెట్టుబడులు ప్రారంభిస్తే చక్రవడ్డీ ప్రభావం వల్ల దీర్ఘకాలంలో భారీ సంపదను సృష్టించుకోవచ్చు. ఆలస్యం చేసిన ప్రతి సంవత్సరం భవిష్యత్తులో వచ్చే లాభాలను తగ్గిస్తుంది.

క్రెడిట్ కార్డుల వినియోగంలో నియంత్రణ లేకపోవడం
క్రెడిట్ కార్డు సౌకర్యవంతమైన ఆర్థిక సాధనం అయినప్పటికీ, అదుపు లేకుండా వాడితే అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. అవసరం లేని కొనుగోళ్లు చేయడం, కనీస బిల్లు మాత్రమే చెల్లించడం, ఒక కార్డు బకాయిని మరో కార్డుతో తీర్చడం వంటి అలవాట్లు ప్రమాదకరం. అధిక వడ్డీ రేట్ల కారణంగా చిన్న అప్పు కూడా కాలక్రమేణా పెద్ద భారం అవుతుంది.

ట్రెండ్స్ వెనుక పరిగెత్తడం
సోషల్ మీడియా ప్రభావంతో చాలామంది తాజా ట్రెండ్స్‌ను అనుసరించేందుకు ప్రయత్నిస్తుంటారు. కొత్త గాడ్జెట్లు, ఫ్యాషన్ ఉత్పత్తులు, వైరల్ పెట్టుబడులు లేదా అందరూ చేస్తున్నారనే కారణంతో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు తరచూ నష్టాలకు దారి తీస్తాయి. వ్యక్తిగత అవసరాలు, లక్ష్యాలు, ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ట్రెండ్‌ను అనుసరించడం సరైన పద్ధతి కాదు.

ఇన్సూరెన్స్‌ను పెట్టుబడిగా భావించడం
చాలామంది ఇన్సూరెన్స్ పాలసీలను పెట్టుబడులుగా చూస్తుంటారు. కానీ ఇన్సూరెన్స్ ప్రధాన ఉద్దేశం ఆర్థిక రక్షణ కల్పించడం మాత్రమే. సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు, స్టాక్స్ లేదా ఇతర పెట్టుబడి మార్గాలను పరిశీలించడం మంచిది. ఇన్సూరెన్స్ మరియు పెట్టుబడిని వేర్వేరుగా చూడడం ద్వారా మెరుగైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవచ్చు.

వైసీపీలో జాడలేని ఆ మాజీ మంత్రి!

Vijayanagaram Politics
Vijayanagaram Politics

Anil Kumar Yadav missing: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు ఒక వెలుగు వెలిగారు. మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఆర్థికంగా బలోపేతమైన వారు ఉన్నారు. అయితే పార్టీ కష్టకాలంలో ఉండగా చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. మరికొందరు ఫుల్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న వారు ఉన్నారు. కొడాలి నాని లాంటివారు ఇటీవల ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. కానీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడ మాత్రం ఇంతవరకు లేదు. అందరూ నేతలు కనిపిస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ ఎందుకో కనిపించడం లేదు. మొన్న కోఆర్డినేటర్ల సమావేశానికి సైతం హాజరు కాలేదు. అప్పుడప్పుడు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి కనిపించే ఆయన ఇప్పుడు బొత్తిగా జాడ లేకుండా పోయారు. అసలు ఆయన యాక్టివ్ అవుతారా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. లేకుంటే క్రమేపి పార్టీకి, రాజకీయాలకు దూరం అవుతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

తీవ్ర నైరాస్యంలో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నైరాస్యంలో పడిపోయాయి. దీనికి తోడు పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారు సైతం ఫుల్ సైలెంట్ అయ్యారు. దీంతో అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని యాక్టివ్ చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే అధికారానికి దూరమై రెండేళ్లు అవుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వంపై గట్టి ఆందోళనలకు పిలుపునిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈనెల 4 నుంచి 12 వరకు వరుసగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు హాజరయ్యాయి. దాదాపు మాజీ మంత్రులతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడ మాత్రం లేదు.

వారందరూ యాక్టివ్ అయినా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఆయన ఒక్కడు మాత్రమే కాదు. పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ లాంటివారు అప్పట్లో గట్టిగానే మాట్లాడేవారు. వారిపై బూతు అనే ముద్ర కూడా ఉంది. అయితే వైసిపి అధికారానికి దూరమైన తర్వాత చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అయితే వైసీపీలో ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న వారికి మాత్రం కూటమి పార్టీల్లో ఆప్షన్ లేదు. వేరే పార్టీల్లో అవకాసం లేదు. అందుకే అలానే ఉండిపోయారు. అయితే కొడాలి నాని లాంటి వారు కూడా అనారోగ్యానికి గురై తిరిగి యాక్టివ్ అవుతూ కనిపిస్తున్నారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అలా కాదు. ఆయన ఎందుకో మన రాష్ట్రంలో కూడా కనిపించడం లేదు. పక్క రాష్ట్రంలో వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయన నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. ఓటమి చవిచూశారు. కానీ ఆయన తిరిగి నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలను కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడంతోనే పక్క రాష్ట్రంలో వ్యాపారాలకు పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

20, 30, 50.. అంకెలు కాదు.. ఆధార్, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డు రేట్లు!

Government ID card fees list
Government ID card fees list

Government ID card fees list: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని అక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. బంగ్లాదేశ్‌ నుంచి వలసలను ప్రోత్సహిస్తూ మమతా బెనర్జీ వరుసగా మూడు పర్యాయాలు సీఎం అయ్యారు. వలస వచ్చిన వారికి స్థానికంగా ఆధార్, ఓటర్‌ ఐడీ, చివరకు రేషన్‌ కార్డు కూడా ఇవ్వడంతో వలసవాదులు మమతకు మద్దతుగా నిలిచారు. అయితే ఎన్నికల సంఘం బెంగాల్‌లో చేపట్టిన ఎస్‌ఐఆర్‌తో 90 లక్షల నకిలీ ఓటర్లను గుర్తించారు. వారిని తొలగించారు. మరోవైపు టీఎంసీ నేతల అరాచకాలు పెరగడంతో మమత పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. దీంతో ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. బీజేపీకి పట్టం కట్టారు. సువేందు అధికారి నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు టీఎంసీ అరాచకాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.

డాక్యుమెంటుకో రేటు..
ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన మినార్‌ ఖాన్‌ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీఎంసీ నాయకురాలు సుల్తానా కొలకత్తా మెటియాబ్రుజ్‌ ప్రాంతంలో అక్రమంగా భారతీయ డాక్యుమెంట్లు సమకూర్చేవారని ఆయన ఆరోపించారు. ఆధార్‌ కార్డుకు రూ.20 వేలు, ఓటర్‌ ఐడీకి రూ.30 వేలు, రేషన్‌ కార్డుకు రూ.50 వేలు వసూలు చేసేవారని తెలిపాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి, రాజకీయ వేడిని మరింత పెంచాయి. దీనిని బీజేపీ ఆయుధంగా మార్చుకుంది.

బెంగాల్‌లో అక్రమ వలసలు..
పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలు చాలా కాలంగా చర్చనీయాంశమయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా లోపాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఆర్థిక లాభాలు – ఇవన్నీ ఈ సమస్యకు కారణాలుగా చెబుతారు. ఇటీవల కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త పాలన, సర్వేలు, డీపార్టేషన్‌ ప్రక్రియలు మొదలవడంతో అనేక మంది అక్రమ వలసదారులు తమ స్వదేశానికి తిరిగి వెళ్తున్నారని నివేదికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మినార్‌ ఖాన్‌ వ్యాఖ్యలు వచ్చాయి.

ఆరోపణలపై విచారణ..
మినార్‌ ఖాన్‌ ఆరోపణలపై బీజేపీ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఆరోపణలు నిజమైతే ఇది కేవలం ఒక వ్యక్తి లేదా ఒక నాయకురాలి సమస్య కాదు. ఇది వ్యవస్థాగత అవినీతి, జాతీయ భద్రతకు ముప్పు. ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితంగా అక్రమ వలసదారులకు భారతీయ డాక్యుమెంట్లు ఇవ్వడం వల్ల సరిహద్దు భద్రత, స్థానిక ఉపాధి, సామాజిక సమతుల్యం దెబ్బతినవచ్చు.

ఆరోపణలను ఖండించిన టీఎంసీ..
మినార్‌ఖాన్‌ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. ఎప్పటికప్పుడు రాజకీయ ప్రేరితమని, ఎన్నికల సమయంలో విపక్షాలు రేపే అభియోగాలుగా తోసిపుచ్చింది. ఆరోపణలు నిజమైతే, ఇది సరిహద్దు నిర్వహణ, ఆధార్, ఓటర్‌ ఐడీ వంటి కీలక డాక్యుమెంట్ల జారీ వ్యవస్థలో లోపాలను బయటపెడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా జాతీయ భద్రత, సమాజ స్థిరత్వం కంటే ఓటు బ్యాంకును ప్రాధాన్యం ఇవ్వడం ప్రమాదకరం. అయితే, ఈ ఆరోపణలు నిరూపణ చేయాల్సిన బాధ్యత చట్ట అమలు సంస్థలది. అదే సమయంలో అక్రమ వలసలను అరికట్టడానికి కఠిన చర్యలు, సరిహద్దు భద్రత బలోపేతం, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియలు కూడా అనివార్యం.

ఈసారి రష్యా కు లోకేష్.. ఏం చేస్తాడో ఏమో..

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh Russia visit: ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు లోకేష్ మరోసారి భారీ ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఆయన రష్యా బయలుదేరి వెళ్లారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వంలో పాలనాపరమైన ముద్ర. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలు. మరోవైపు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు నారా లోకేష్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాలికి బలపం కట్టుకొని మరి విదేశాలు చుట్టేసి వస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని ఫలితాలు ప్రజల ఎదుట ఇట్టే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రష్యా లో ఒక అంతర్జాతీయ సదస్సుకు లోకేష్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో రష్యా బయలుదేరి వెళ్లారు లోకేష్. ఈసారి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అత్యున్నత సదస్సుకు..
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. దావోస్ పెట్టుబడుల సదస్సుతో సమానంగా ఈ సదస్సు జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది రష్యాలో జరుగుతున్న ఈ సదస్సుకు ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. జూన్ రెండు నుంచి ఏడు వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ సదస్సులో పాల్గొనున్నారు లోకేష్. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల పరిణామాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వపరంగా ఇచ్చే రాయితీల గురించి ఈ అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు లోకేష్.

ఆరు రోజులపాటు బిజీ బిజీ..
ఆరు రోజుల రష్యా పర్యటనలో లోకేష్ బిజీబిజీగా గడపనున్నారు. సదస్సుకు హాజరయ్యే అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, వివిధ దేశాల పారిశ్రామిక దిగ్గజాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లతో వన్ బై వన్ సమావేశాలు నిర్వహించనున్నారు లోకేష్. ఏపీ ప్రభుత్వం ఐటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఆ రంగానికి సంబంధించి దిగ్గజాలతో మాట్లాడనున్నారు. మరోవైపు లాజిస్టిక్స్, తయారీ రంగానికి సంబంధించిన పరిశ్రమలను సైతం ఏపీకి తెచ్చేందుకు ఆయన ఈ రష్యా పర్యటనను వినియోగించుకోనున్నారు. ఒకవైపు పెట్టుబడులను ఆకర్షించడమే కాదు మానవ వనరుల శాఖ మంత్రిగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి లోకేష్ రష్యా పర్యటన పైనే ఉంది.

పవన్ కళ్యాణ్ పై దాడి వెనక రాజకీయ కుట్ర?

Pawan Kalyan political conspiracy

Pawan Kalyan political conspiracy : పవన్ కళ్యాణ్ పై గత వారం పది రోజుల నుంచి అటు ఆంధ్రాలో.. ఇటు తెలంగాణలో ఏకకాలంలో దాడి జరుగుతోంది. తెలంగాణలో తెలంగాణవాదులు, వామపక్షవాదులు, ఏపీలో కాపులు, వైసీపీ నేతలు కలగలపి అందరూ కలిపి ముప్పేట దాడి జరుగుతోంది. ఇది కావాల్సి చేసినట్టుగా అనిపిస్తోంది.

మరో వైపు పవన్ ఏం మాట్లాడారా? అంటే అదీ లేదు. పార్టీ నిర్మాణంపై దృష్టిసారించారు. ఆంధ్రాలో సాక్షి, ప్రజాశక్తి పేపర్లు పవన్ కళ్యాణ్ ను ఆంధ్రా నెతన్యాహుగా పిలిచింది. కాపు కుల నాయకులు పవన్ పై చేసిన కామెంట్స్ ను వాళ్లు హైలెట్ చేస్తున్నారు.

తెలంగాణ వాదులు, కవిత , రౌండ్ టేబుల్ లో మేధావులు, ఎంతో మంది జర్నలిస్టులు పవన్ పై విరుచుకుపడ్డారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కేంద్రంగా పవన్ పై పెద్దదాడినే జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ పై దాడి వెనక రాజకీయ కుట్ర? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా–ఇరాన్‌ దాడులు తీవ్రం!

US Iran War
US Iran War

US Iran tensions latest news: తన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలిపేందుకు, సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పశ్చిమాసియాలో అగ్గి రాజేశాడు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టాడు. దాదాపు 50 రోజులపాటు తీవ్ర దాడులు జరిగాయి. అయితే ఇరాన్‌ ఎక్కడా లొంగలేదు. మరోవైపు అమెరికాకు తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ శాంతి చర్చలు అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పాకిస్తాన్‌ను మధ్యవర్తిగా నిలబెట్టాడు. తాత్కాలిక సీజ్‌ఫైర్‌ అంటూ ప్రకటనలు చేశారు. కానీ ఒప్పందం కుదరలేదు. తాజాగా సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించిన అమెరికా ఇరాన్‌పై వరుస దాడులతో విరుచుకుపడుతోంది. మరోవైపు ఇరాన్‌ మాత్రం శాంతి ఒప్పందానికి మొగ్గు చూపుతోంది. అమెరికా మాత్రం దాడులతో ఇరాన్‌ను దారిలోకి తెచ్చుకోవాలనుకుంటోంది. మళ్లీ భీకర దాడులు చేస్తోంది. తాజాగా అమెరికా దళాలు ఇరాన్‌లోని కీలక సైనిక లక్ష్యాలపై దాడులు చేయడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు కొత్త మరింత పెరిగాయి. ఇరు వైపులా ప్రతిదాడులు, రక్షణ వ్యవస్థల సక్రియతతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఆత్మరక్షణ చర్యలా?
అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించిన ప్రకారం, ఇరాన్‌లోని గురుక్‌ నగరం, ఖేష్‌ ద్వీపంలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ జలాల్లో తమ ఎంక్యూ–1 డ్రోన్‌ను కూల్చివేయడం, ఇతర దాడి చర్యలకు స్పందనగా ఇవి జరిగినట్లు వివరించింది. దాడుల్లో ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, గ్రౌండ్‌ స్టేషన్లు, రెండు అటాక్‌ డ్రోన్లు నాశనమైనట్లు అమెరికా తెలిపింది. ఈ వ్యవస్థలు తమ యుద్ధ నౌకలకు ప్రమాదం కలిగించే స్థాయిలో ఉన్నాయని ఆరోపించింది. ఇది స్వచ్ఛమైన ఆత్మరక్షణ చర్య అని వాదిస్తున్నప్పటికీ, ప్రాంతీయ సమీకరణాలపై దీని ప్రభావం భారీగా ఉంటుంది.

ఇరాన్‌ ప్రతిస్పందన…
అమెరికాడులకు ప్రతిగా ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ) ప్రతిదాడులు మొదలు పెట్టింది. సిరిక్‌ ద్వీపంలోని టెలికామ్‌ టవర్లపై అమెరికా దాడి చేసినందుకు ప్రతీకారంగా ఒక అమెరికన్‌ ఎయిర్‌బేస్‌ను లక్ష్యం చేసుకున్నట్లు ప్రకటించింది. ఏ బేస్‌ అనేది స్పష్టం చేయకపోయినా, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ముందు కువైట్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు సక్రియమైనట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్‌ ఏరోస్పేస్‌ ఫోర్సెస్‌ ప్రతిదాడి చేశాయని ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఈ పరస్పర దాడులు ఘర్షణను మరింత విస్తృతం చేసే అవకాశం ఉంది.

ఖేష్‌ ద్వీపం ఎందుకు కీలకం?
హార్ముజ్‌ జలసంధిని నియంత్రించడంలో ఖేష్‌ ద్వీపం ఇరాన్‌కు వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇక్కడ అండర్‌గ్రౌండ్‌ సౌకర్యాల్లో యాంటీ–షిప్‌ క్రూజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ మిసైల్స్‌ సిద్ధంగా ఉన్నాయి. గడా–380, హై–2 సిల్క్‌వార్డ్‌ వంటి క్షిపణులతోపాటు, 800 కి.మీ. పరిధి గల ఖియామ్‌–1, ఖైబర్‌ షెకన్, ఘద్ర్, ఎమాద్‌ వంటి బాలిస్టిక్‌ క్షిపణులు ఇక్కడ మోహరించబడి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేగవంతమైన స్పీడ్‌ బోట్లు, తీరప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఈ ప్రాంతంలో ఇరాన్‌ సిద్ధతలో ఉన్నాయి. జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. అందువల్ల ఈ ద్వీపాన్ని నిష్క్రమించడం అమెరికాకు కూడా వ్యూహాత్మక అవసరంగా మారింది.

ఈ ఘర్షణలు ఇప్పటికే సున్నితమైన పశ్చిమాసియా పరిస్థితిని మరింత అస్థిరం చేశాయి. హార్ముజ్‌ జలసంధి ప్రపంచ తైల సరఫరాకు కీలకమైనది కావడంతో, ఏదైనా విస్తృత యుద్ధం గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇరాన్‌ తన భూభాగంపై దాడులను సహించదని స్పష్టం చేస్తుండగా, అమెరికా తన మిత్రదేశాల భద్రతను కాపాడుతుందని నొక్కి చెప్పుతోంది. ప్రస్తుతం రెండు వైపులా దాడులు జరుగుతున్న నేపథ్యంలో దౌత్య ప్రయత్నాలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ప్రపంచం ఈ పరిణామాలను ఆందోళనతో పర్యవేక్షిస్తోంది.

ఫైనల్ గా 2027 సంక్రాంతి బరిలో నిలుస్తున్న స్టార్ హీరోలు..

Sankranti 2027 movie releases
Sankranti 2027 movie releases

Sankranti 2027 movie releases: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మన స్టార్ హీరోలు వరుస సక్సెస్ లను సాధిస్తుండడం విశేషం… ఇప్పటివరకు మనవాళ్లు పాన్ ఇండియాలో క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాసే హీరోలు ఎవరు లేకపోవడంతో ఇండియా వైడ్ గా మన హవానే ఎక్కువగా కొనసాగుతుంది. ఇక రాబోయే సినిమాలతో కూడా మన స్టార్ హీరోలందరు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారు… ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ అనేది చాలా పెద్ద పండుగ ప్రేక్షకులందరు పండగపూట సినిమాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి సంక్రాంతి పండుగకు పెద్ద మొత్తంలో సినిమాలైతే రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అయితే ఐదు సినిమాలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వచ్చే ఏడాది బరిలో నిలువబోతున్న సినిమాలేంటి అనే ధోరణి లో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందట. ఇక అనిల్ రావిపూడి -వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న మల్టీస్టారర్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుంది. ఇక బాలయ్య బాబు – గోపీచంద్ కాంబోలో వస్తున్న సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవడం విశేషం…

నాగార్జున తన వందో సినిమాని సైతం సంక్రాంతి బరిలోనే నిలపాలని చూస్తున్నారట. మొత్తానికైతే ఈ నలుగురు సీనియర్ హీరోలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలబడుతున్నారు. ఇక వీళ్లతో పాటుగా మరి కొంతమంది హీరోలు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

ఫైనల్ గా ఈ హీరోలతో పాటు విజయ్ దేవరకొండ కూడా తన రౌడీ జనార్ధన్ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే ఏ సినిమా సక్సెస్ఫుల్ టాక్ ను సంపాదించుకుంటుందో ఆ సినిమా సంక్రాంతి సీజన్ లో ఎక్కువ కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సక్సెస్ ని సాధించి ఈ ఏడాది ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న అనిల్ రావిపూడి సైతం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండటం ప్రతి ఒక్కరిని ఆనందపరుస్తుంది. ఎందుకంటే అతని సినిమాలు మినిమం గ్యారంటీగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారైనా చూడొచ్చు అనే ఉద్దేశ్యంతోనే ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు…

ఇలా చేస్తే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్టార్ హీరోలు నటించలేరా..?

Sandeep Reddy Vanga direction
Sandeep Reddy Vanga direction

Sandeep Reddy Vanga direction: సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉంటాయి. అతను ఒక కథని చాలా పర్ఫెక్ట్ గా చెప్పడంలో సిద్ధహస్తుడు. అందుకే ఆయన నుంచి సినిమాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ సినిమాలను చూస్తుంటాడు. ఇప్పటివరకు ఆయన చేసినవి కేవలం మూడు సినిమాలే అయినాప్పటికి ఆ మూడు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబట్టాయి. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక అలాంటి సందీప్ రెడ్డి వంగ ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పలువురి సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారట. పార్టీ మూవీలో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయని వాటిని ప్రభాస్ తో చేయించడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ మాత్రం తప్పకుండా ఆ సీన్లు చేయాలని చెబుతున్నాడట.

దీంతో ప్రభాస్ కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో సందీప్ రెడ్డి వంగతో నటించడం కష్టమవుతుందని కొంతమంది అంటుంటే మరి కొంతమంది మాత్రం అతని సినిమాలో నటిస్తే హీరోలకు ప్రత్యేకమైన క్రేజ్ దక్కుతుందని చెబుతున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం వస్తేనే చాలు అనుకుంటున్న ఈ రోజుల్లో వచ్చిన అవకాశాన్ని స్టార్ హీరోలు ఎందుకు వదిలేసుకుంటారని ఇంకొంతమంది చెబుతూ ఉండటం విశేషం…స్పిరిట్ సినిమా సక్సెస్ ను బట్టి అతని కెరియర్ అనేది బిల్డ్ అవుతుంది.

స్పిరిట్ మూవీతో ప్రభాస్ కి భారీ విజయాన్ని అందిస్తే సందీప్ రెడ్డివంగా ఓవర్ నైట్ లో పాన్ వరల్డ్ లో సైతం తన సత్తాను చూపించిన వాడవుతాడు. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు డీలా పడిపోతాడు. ఇక తన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయంలో సరైన క్లారిటీ లేదు. కానీ మొత్తానికైతే స్పిరిట్ సినిమా మీదనే తను పూర్తి ఫోకస్ చేస్తున్నాడు…

వామ్మో జూన్.. వీరికి ఖర్చులు.. వారికి లాభాలు..

June month financial predictions
June month financial predictions

June month financial predictions: జూన్ నెల రాకతో కుటుంబాల ఆర్థిక ప్రణాళికల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఈ నెల ఖర్చుల నెలగా మారుతుంది. ఒకవైపు పాఠశాలలు ప్రారంభం కావడంతో పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతుండటంతో వ్యవసాయ రంగంలోనూ డబ్బు చలామణి ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో కొన్ని వ్యాపార రంగాలు భారీగా లాభపడుతుంటే, కుటుంబాలపై మాత్రం అదనపు ఆర్థిక భారం పడుతుంది. అసలు ఈ నెలలో ఎలాంటి ఖర్చులు ఉంటాయి? ఏ వ్యాపారులకు లాభాలు ఉంటాయి?

జూన్ అంటే విద్యా సంవత్సరం ప్రారంభం. పిల్లల స్కూల్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, షూస్ వంటి అవసరాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది. అందువల్ల జూన్ నెలను చాలా కుటుంబాలు ‘ఎడ్యుకేషన్ ఎక్స్‌పెన్స్ సీజన్’గా భావిస్తాయి.

జూన్ నెలలో ఎక్కువ లాభాలు పొందే వారిలో పుస్తకాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, యూనిఫామ్ తయారీదారులు ముందుంటారు. స్కూల్ ప్రారంభానికి ముందు నుంచే తల్లిదండ్రులు కొనుగోళ్లు ప్రారంభించడంతో ఈ రంగాల్లో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, జ్యామెట్రీ బాక్సులు, ఇతర విద్యా సామగ్రికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.

తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు జూన్‌లోనే ఖరీఫ్ సాగు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్ అద్దెలు, కూలీల ఖర్చులు వంటి వ్యవసాయ వ్యయాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చేందుకు రైతులు బ్యాంకులు, సహకార సంఘాలను ఆశ్రయిస్తారు.

విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు విక్రయించే దుకాణాలకు జూన్ అత్యంత కీలకమైన నెల. రైతులు పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేయడంతో ఈ వ్యాపారాల్లో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయి. ట్రాక్టర్లు, రోటావేటర్లు, స్ప్రేయర్లు అద్దెకు ఇచ్చే వారికీ మంచి ఆదాయం లభిస్తుంది.

జూన్‌లో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో గొడుగులు, రెయిన్‌కోట్లు, వాటర్‌ప్రూఫ్ ఫుట్‌వేర్, ప్లాస్టిక్ షీట్లు వంటి వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద రిటైల్ దుకాణాల వరకు అందరికీ ఈ సీజన్ లాభదాయకంగా మారుతుంది.

వర్షాకాలం ప్రారంభానికి ముందు చాలా కుటుంబాలు ఇళ్ల పైకప్పులు, డ్రైనేజీ వ్యవస్థలు, నీటి లీకేజీల మరమ్మతులు చేపడతాయి. దీంతో సిమెంట్, ఇసుక, పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రంగాల్లో పనిచేసే కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.

వర్షాకాలం మొదలయ్యే సమయంలో జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబాలు ఆరోగ్య సంరక్షణపై కూడా కొంత అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఔషధ దుకాణాలు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లకు ఈ సమయంలో రద్దీ పెరుగుతుంది.

మొత్తం మీద జూన్ నెల కుటుంబాలకు ఖర్చుల నెల అయినప్పటికీ, అనేక రంగాల వ్యాపారులకు ఆదాయాన్ని పెంచే కాలంగా మారుతుంది. విద్య, వ్యవసాయం, వర్షాకాల అవసరాలు, ఆరోగ్య రంగాల్లో భారీగా డబ్బు చలామణి జరుగుతుంది. అందుకే ఆర్థిక నిపుణులు జూన్ నెలకు ముందుగానే కుటుంబ బడ్జెట్ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. సరైన ప్రణాళికతో ఖర్చులను నియంత్రించగలిగితే ఈ నెల ఆర్థిక ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవచ్చు.

డ్రాగన్ లో ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్స్ మీద కామెంట్స్ చేస్తున్న దర్శకుడు..

NTR Dragon movie action episodes
NTR Dragon movie action episodes

NTR Dragon movie action episodes: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ను చూసిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా డ్రాగన్ సినిమా గురించి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విమర్శకులు సైతం ఈ సినిమా చాలా గొప్పగా ఉండబోతుంది అంటూ కొన్ని కామెంట్లను చేస్తున్నారు. మొత్తానికైతే ఈ సినిమా మీద అటు ఎన్టీఆర్, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక రీసెంట్ గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లలో ఎన్టీఆర్ స్పెషల్ కేర్ తీసుకోవడమే కాకుండా చాలా వరకు డూప్ లేకుండా నటించాడు అంటూ ఆయన కొన్ని సంచలమైన విషయాలను చెప్పాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు ఉన్న సినిమాల్లో లుక్కు ఒకరకంగా ఉంటే ఈ సినిమాలో తన లుక్కు మొత్తం కంప్లీట్ గా మారిపోయిందనే చెప్పాలి.

ఆ క్రెడిట్ మొత్తం ప్రశాంత్ నీల్ కే దక్కుతుంది. ఇక ప్రశాంత్ నీల్ సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాడు. కాబట్టి ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. మరి డ్రాగన్ సినిమా విషయంలో ఆయన ఎలాంటి ఎక్స్పరిమెంట్లు చేయబోతున్నాడు.

తద్వారా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ సినిమా ఉండబోతుందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రతి సినిమా విషయంలో చాలావరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా విషయంలో భారీగా దెబ్బ పడ్డాడు. దాంతో ఆయన నుంచి వచ్చే సినిమాలు సక్సెస్ ఫుల్ సినిమాలు గా నిలవాలి తప్ప ప్లాప్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఒకటికి రెండుసార్లు కథలను సెలెక్ట్ చేసుకొని మరి సినిమాలను చేస్తున్నాడు…

ఇక ఈ క్రమంలోనే డ్రాగన్ సినిమాను సైతం అలాగే సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ ఇంతకుముందు సలార్ సినిమాతో ప్రభాస్ కి ఎలాగైతే సక్సెస్ ని సాధించి పెట్టాడో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి సైతం అలాంటి సక్సెస్ ని అందించడానికి సిద్ధమవుతున్నాడు…