అవంతిక.. నీలుక్స్ కేక..
మన జాతీయ పార్టీల్లోకి పాకిస్థానీ దురంధర్ లు.. ఇలా బయటపడింది
Pakistani Operatives In National Parties: నిత్యం మన దేశంలో మంట పుట్టించాలి. అగ్గి రగిలించాలి. దేశం కాలిపోతుంటే ఆనందించాలి
.. ఇలానే ఉంటుంది పాకిస్తాన్ పాలకుల వ్యవహార శైలి. అభివృద్ధిలో పోటీ పడరు. ప్రజలకు సదుపాయాలు కల్పించే విషయంలో.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో పోటీ పడరు. కేవలం విద్వేషాన్ని రగిలించడం.. విషాన్ని.. చిమ్మడం.. దేశంలో అల్ల కల్లోలం సృష్టించడమే పాకిస్తాన్ పాలకుల పని.
మనతో విడిపోయిన నాటి నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ అన్ని రకాలుగా వెనుకబడిపోయింది. కానీ ఉగ్రవాద విషయంలో మనకంటే కోట్ల రెట్లు ముందుంది. మనం చదువును.. అభివృద్ధిని నమ్ముకుంటే.. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని నమ్ముకుంది. అందువల్లే మనదేశంలో గతంలో అనేక దారుణాలకు పాల్పడింది. ఇటీవల కాలంలో మన దేశం అంతర్గత భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పాకిస్థాన్ పప్పులు ఉడకడం లేదు.
పుల్వామా.. పహల్గాం వంటి దాడుల తర్వాత పాకిస్థాన్ నుంచి అక్రమ చొరబాట్ల విషయంలో భారత్ అత్యంత కఠినంగా ఉండడం మొదలుపెట్టింది. ఉగ్రవాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. నిఘా వర్గాలకు.. భద్రతా దళాలకు విశేషమైన అధికారాలు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఐఎస్ఐ సరికొత్త తెలివిని ఉపయోగిస్తోంది. ఇటీవల శ్రీనగర్ ప్రాంతంలో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. వారిని విచారించారు. వారు చెప్పిన మాటలు ఆందోళన కలిగించాయి. మనదేశంలో ఉన్న జాతీయ రాజకీయ పార్టీలలోకి పాకిస్థానీ దురంధర్ లను ప్రవేశపెడుతున్నట్టు ఆ వ్యక్తులు చెప్పారు. దీని వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తము ఉన్నట్టు చెప్పారు.
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు.. ఐ ఎస్ ఐ అత్యంత కీలకమైన ప్రాంతాలలో ఓవర్ గ్రౌండ్ వర్కర్లను నియమించింది. వీరంతా కూడా రాజకీయ పార్టీలలో చేరుతారు.. తనిఖీల సమయంలో.. వారు రాజకీయ పార్టీల గుర్తింపు కార్డులను చూపిస్తారు. తద్వారా భద్రతా దళాల కన్ను కప్పుతారు. ఆ తర్వాత దాడులకు పాల్పడతారు. దీనివల్ల పాకిస్తాన్ పేరు తెరపైకి రాదు. ఆ వ్యక్తుల వెనుక ఉన్న ఐఎస్ఐ పేరు కూడా వెలుగులోకి రాదు. ఉగ్రవాద సంస్థల సంబంధించిన వివరాలు కూడా పోలీసు తెలుసుకోలేరు. ఎంతసేపటికి రాజకీయ పార్టీల కోణంలోనే ఆలోచిస్తారు.
విధ్వంసం సృష్టించడంతోపాటు.. ఆధారాలు కూడా లేకుండా చేయడం వల్ల పని ఈజీ అయిపోతుందని పాకిస్తాన్ ఐఎస్ఐ భావిస్తుందని ఇటీవల శ్రీనగర్ ప్రాంతంలో అరెస్ట్ అయిన యువకులు పోలీసుల విచారణలో చెప్పారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారంతా కూడా సరిహద్దు ప్రాంతంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. జాతీయ పార్టీలలో పనిచేసే కార్యకర్తల వివరాలను ఇవ్వాలని కోరారు.
వారు వాడే ఫోన్ నెంబర్లు.. వాట్సప్ ఖాతాలు.. సోషల్ మీడియా ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ఎవరైనా సంఘవిద్రోహకంగా.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తేలితే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.. పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదం ఎలా ఉంటుందో ఇటీవల దురంధర్ అనే సినిమా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇదే విధానాన్ని పాకిస్తాన్ రివర్స్ లో మన మీద ప్రయోగించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఆ మ్యూజిక్ డైరెక్టర్ రోజుకు ఫుల్ బాటిల్ తాగుతాడా.? సంచలన విషయాన్ని బయట పెట్టిన స్టార్ డైరెక్టర్...
Music Director Alcohol Habits: ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి ఆ మూవీ మ్యూజిక్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే ప్రేక్షకుడు మ్యూజిక్ ద్వారానే ఆ సినిమాని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రతి సినిమా సక్సెస్ వెనుక ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఒకానొక సందర్భంలో చక్రి చేసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది.ఆయన పాటలకు వీరాభిమానులు ఉన్నారు. దాంతో అతనికి మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ హీరోలందరితో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే వచ్చాయి… ఇక రైటర్ బివిఎస్ రవి చక్రి గురించి మాట్లాడుతూ ఆయన రోజుకు ఫుల్ బాటిల్ మందు తాగేవాడంటూ కామెంట్స్ చేశాడు. సత్యం సినిమా సమయంలో బీవీఎస్ రవి, డైరెక్టర్ రవి కిరణ్ తో పాటు అన్నపూర్ణ స్టూడియోలోని ఒక కాటేజీలో వీళ్ళు ఉండేవారు.
అక్కడికి చక్రి మందు వేసి వచ్చేవాళ్ళని అలాగే అక్కడి నుంచి బయటికి వెళ్లిన తర్వాత అయిన సరే మందు తాగేవాడని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజానికి చక్రి అలా తాగడం వల్లే ఆయన హెల్త్ పాడైపోయి మరణించాడని మరికొంతమంది చెబుతుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినంత మాత్రాన సరిపోదు.
దాన్ని సక్రమంగా వాడుకుంటూ సక్సెస్ లను కూడా ఎంజాయ్ చేస్తూ హెల్త్ ని కాపాడుకుంటూ ముందుకు సాగినప్పుడే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ కాలాలపాటు తమ మనుగడను కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వ్యసనాలకు అలవాటు పడిపోతే మాత్రం ఇండస్ట్రీలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చక్రి వంటి వారిని చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం అనేది ఒకెత్తయితే దాన్ని సక్రమంగా నిలబెట్టుకోవడం అనేది మరొక ఎత్తుగా భావిస్తుంటారు… చక్రి జీవితాన్ని కనుక చూసినట్లయితే ఇండస్ట్రీకి వస్తున్న వారు ఆయనలా కాకుండా కెరియర్ ను బాగా బిల్డ్ చేసుకుని హెల్త్ ని కాపాడుకుంటూ ముందుకు సాగితే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
నాభి రూపంలో శివుడు దర్శనం.. ఈ క్షేత్రానికి ఎలా వెళ్లాలి..
Madhyamaheshwar Temple: భారతదేశంలో ఆలయాలకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కొన్ని ఆలయాలు ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడితే.. మరికొన్నింటిని పురాతన కాలంలో నిర్మించారు. అయితే దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కొన్ని ఆలయాల్లో విశేష చరిత్ర దాగి ఉంది. అలాంటి ఆలయాల్లో పంచ కేదారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ పంచ కేదారాల్లో మధ్య మహేశ్వర్ ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు నాభి రూపంలో దర్శనం ఇస్తాడు. ఇలా ప్రత్యేకంగా దర్శనం ఇవ్వడం వెనుక పురాణ గాథ దాగి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రసిద్ధ ఆలయాలు కొలువైన ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర శైవ క్షేత్రమే Madhyamaheshwar Temple. హిమాలయ పర్వతాల నడుమ ప్రకృతి సోయగాల మధ్య వెలసిన ఈ ఆలయం పంచ కేదారాల్లో రెండవదిగా భావిస్తారు. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, పురాణ ప్రాశస్త్యం కలిసిన ఈ క్షేత్రం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.
శివుడి జాడ కోసం..
హిందూ పురాణాల ప్రకారం.. మహాభారత యుద్ధం అనంతరం తమకు అంటుకున్న పాప విమోచనం కోసం పాండవులు పరమశివుడి దర్శనం కోరుకున్నారు. అయితే వారిని కలవడానికి ఇష్టపడని శివుడు వృషభం (ఎద్దు) రూపంలో హిమాలయాలకు వెళ్లాడని కథనం. పాండవులు ఆయనను గుర్తించడంతో శివుడు భూమిలోకి అంతర్ధానం అయ్యాడు. ఆ సమయంలో ఆయన శరీర భాగాలు ఐదు ప్రాంతాల్లో ప్రత్యక్షమయ్యాయని, ఆ ప్రాంతాలనే పంచ కేదారాలుగా పూజిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.
ప్రత్యేక ఆకారంలో..
పంచ కేదారాల్లోని ప్రతి ఆలయం శివుడి ఒక శరీర భాగానికి ప్రతీకగా భావించబడుతుంది. మధ్య మహేశ్వర్‌లో శివుడి నాభి భాగం ప్రత్యక్షమైందని విశ్వాసం. అందువల్ల ఇక్కడి శివలింగం సాధారణ లింగాకారంలో కాకుండా నాభి ఆకృతిని పోలి ఉంటుంది. ఈ విశిష్టతే ఈ ఆలయాన్ని ఇతర శైవ క్షేత్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆలయం సమీపంలో ప్రవహించే స్వచ్ఛమైన హిమజలాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని స్థానికులు విశ్వసిస్తారు. ఈ నీటితో స్నానం చేయడం లేదా తీర్థంగా స్వీకరించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతాయని భక్తులు నమ్ముతారు. మంచు పర్వతాల మధ్య నుంచి ప్రవహించే ఈ జలాలు ఎంతో నిర్మలంగా ఉంటాయి.
ఎలా చేరుకోవాలి?
మధ్య మహేశ్వర్ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా ఉత్తరాఖండ్‌లోని Rishikesh లేదా Haridwar చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో Ukhimath మీదుగా రాంసీ (Ransi) గ్రామానికి వెళ్లాలి. రాంసీ గ్రామం వరకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రాంసీ గ్రామం నుంచి మధ్య మహేశ్వర్ ఆలయానికి సుమారు 16 నుంచి 18 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మార్గమంతా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. గుర్రాలు, ఖచ్చర్లు కూడా అందుబాటులో ఉంటాయి. సాధారణంగా భక్తులు ఒకటి లేదా రెండు రోజుల ట్రెక్కింగ్ ద్వారా ఆలయానికి చేరుకుంటారు.
ఆరు నెలలు మాత్రమే..
హిమాలయ ప్రాంతంలో తీవ్రమైన మంచు కారణంగా ఈ ఆలయం సంవత్సరమంతా తెరిచి ఉండదు. సాధారణంగా మే నెలలో ఆలయ ద్వారాలు తెరుస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ వరకు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. అనంతరం శీతాకాలంలో ఆలయాన్ని మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని సమీప గ్రామానికి తరలిస్తారు. అక్కడే శీతాకాల పూజలు నిర్వహిస్తారు.
ఆయిల్ ఫుడ్ తిన్నాక వీటిని తీసుకోవద్దు.. లేదంటే పోతారు...
Oil Food Side Effects: నేటి జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ స్నాక్స్, బిర్యానీలు, ఫ్రైడ్ చికెన్ వంటి ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం సాధారణమైపోయింది. అయితే ఇలాంటి ఆహారం తిన్న వెంటనే కొందరు ఐస్‌క్రీమ్, స్వీట్స్, కూల్‌డ్రింక్స్ లేదా కొన్ని రకాల పండ్లు తింటూ ఉంటార. ఈ కాంబినేషన్ రుచికరంగా అనిపించినా.. ఆరోగ్యపరంగా అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత ఐష్ క్రీం తింటే ఏం జరుగుతుంది?
ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం జీర్ణం కావడానికి సాధారణ ఆహారం కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే చక్కెర అధికంగా ఉండే ఐస్‌క్రీమ్, స్వీట్స్ లేదా కూల్‌డ్రింక్స్ తీసుకుంటే జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. కడుపులో ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండటం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆయిల్ ఫుడ్‌లో ఉండే కొవ్వులను జీర్ణం చేయడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో చక్కెరలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటే లివర్ రెండింటినీ ఒకేసారి ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. దీంతో లివర్‌పై పని భారం పెరిగి, దీర్ఘకాలంలో మెటబాలిజం సంబంధిత సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత వెంటనే చల్లటి పానీయాలు లేదా ఐస్‌క్రీమ్ తీసుకోవడం వల్ల కడుపులో ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ కొంత మందగించవచ్చు. దీనివల్ల గ్యాస్ ఏర్పడటం, పుల్లటి తేన్పులు రావడం, కడుపులో అసౌకర్యం కలగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నూనె పదార్థాలు, అధిక చక్కెర కలిగిన ఆహారాల కలయిక కొందరిలో యాసిడ్ రిఫ్లక్స్‌ను ప్రేరేపించవచ్చు. దీంతో కడుపులోని ఆమ్లం పైకి వచ్చి గుండెల్లో మంట, గొంతులో మంట, ఛాతీలో అసౌకర్యం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. తరచూ ఇలా జరిగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఏవి తినాలి?
ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత మజ్జిగ, గోరువెచ్చని నీరు లేదా గ్రీన్ టీ తీసుకోవడం మంచి ఎంపికగా భావిస్తారు. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. గ్రీన్ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను అందించి కొవ్వు జీవక్రియకు కొంత మద్దతు ఇస్తుంది. అలాగే తగినంత నీరు తాగడం కూడా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల పెద్ద సమస్యలు రాకపోవచ్చు. అయితే ఇది రోజువారీ అలవాటుగా మారితే అజీర్తి, గ్యాస్, గుండెల్లో మంట, బరువు పెరగడం వంటి సమస్యల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత తేలికపాటి, జీర్ణానికి సహాయపడే పానీయాలను ఎంచుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పవన్ ఎంత మందికి అమ్ముడుపోవాలి?!
Pawan Kalyan Telangana Politics: పవన్ కళ్యాణ్ విషయంలో ఓ ప్రచారం నిత్యం కొనసాగుతూ ఉంటుంది. ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అనే ముద్ర వేస్తూ ఉంటారు. వీరు వారు అని కాకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు దానిని వాడేస్తున్నారు. ప్రారంభంలో అది ప్రజల్లోకి వెళ్ళింది కానీ పవన్ అసలు తత్వం బోధపడింది. పవన్ వ్యక్తిత్వం ప్రజలకు తెలిసింది. ఇప్పుడు తెలంగాణ నేతలు పవన్ విషయంలో వ్యక్తిగత దాడి చేస్తున్నారు. అది సైతం తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ ను దగ్గర చేస్తుందన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదే మాదిరిగా పవన్ ను తిట్టి పోశారు. పదేపదే అవే మాటలు చెబుతుండడంతో ప్రజలు కూడా వాటిని తప్పుడు వ్యాఖ్యలుగా చూశారు. పవన్ కళ్యాణ్ విషయంలో ప్రజలు సానుకూలంగా చూడడం ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ విషయంలో సైతం అక్కడి నేతలు అదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు.
* తెలంగాణ పై ఫోకస్..
ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ నేపథ్యంలో తెలంగాణలో జనసేన ను యాక్టివ్ చేయాలని చూసారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ అక్కడి నేతలు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. దానిపై జన సైనికులు కూడా మండిపడ్డారు. దీంతో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ సభకు అనుమతి ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో జనసేన కోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈరోజు హైదరాబాదులో తన నివాసం నుంచి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు పవన్. కచ్చితంగా ఈరోజు సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.
* మంత్రి పొన్నం కామెంట్స్..
ముఖ్యంగా తెలంగాణ నేతలు ఇప్పుడు పవన్ పై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే బిజెపి కోసమే పవన్ తెలంగాణ వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. బిజెపి ఇచ్చిన డబ్బులతోనే ఇక్కడ నటిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అయితే ఇప్పటివరకు పావలా వస్తారని.. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అలవాటు పడ్డారని లేనిపోని ఆరోపణలు చేస్తూ వచ్చారు వైసీపీ నేతలు. అందుకు ఏపీ ప్రజలు చెయ్యి కాల్చి వాతలు పెట్టారు. ఏపీలో దారుణంగా ఓడించారు. ఇప్పుడు కొత్తగా బిజెపి ప్యాకేజీ అందుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బులు తీసుకునే రకం పవన్ కళ్యాణ్ కాదు. విపరీతమైన స్టార్ డం ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకునే హీరో ఆయన. అటువంటి సినిమా కెరీర్ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. చాలా హుందా రాజకీయాలు చేస్తున్నారు. ఆర్భాటాలకు పోదలుచుకోలేదు. అటువంటి నేతపై తెలంగాణ నేతలు ఈ స్థాయిలో విరుచుకుపడుతుండడం నిజంగా బాధాకరం.
* తెలంగాణ సమాజానికి ఉపయోగం..
తెలంగాణ సమాజానికి పవన్ కళ్యాణ్ చాలా విధాలుగా ఉపయోగపడ్డారు. రాష్ట్ర విభజనను ఎన్నడు తప్పు పట్టలేదు. విభజించే తీరును మాత్రమే తప్పుపట్టారు. విభజన తరువాత కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రభావం చూపాలని అనుకోలేదు. అప్పట్లో తెలంగాణలో కౌలు రైతులకు సాయం కూడా చేశారు. అక్కడి కళాకారులను ప్రోత్సహించారు. వారిని అన్ని విధాలా ఆదుకున్నారు. అటువంటి నేతపై అమ్ముడుపోయారు అంటూ తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం మాత్రం సరికాదు. ఏపీలో వైసిపి మాదిరిగానే ఇలా ఆరోపణ చేస్తున్న నేతలు మూల్యం చెల్లించుకోక తప్పదు.
‘నీకు పిచ్చి పట్టింది’.. నెతన్యాహుకు ఇచ్చిపడేసిన ట్రంప్.. ఏమైంది..
Trump Netanyahu Phone Call: పశ్చిమాసియా దేశం ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ కలిపి దాడులు చేస్తున్నాయి. 50 రోజుల భీకర దాడిలో ఇరువైపులా నష్టం జరిగింది. అయినా ఇరాన్ లొంగిపోలేదు. దీంతో సీజ్‌ఫైర్ ఒప్పందం కుదిరింది. మరోవైపు ఇరాన్–అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. శాశ్వత ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రాక్సీ దేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ తీవ్రమైన వివాదానికి దారి తీసింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వైట్‌హౌస్ వర్గాల ధృవీకరణ..
ట్రంప్–నెతన్యాహూ ఫోన్ సంభాషణను వైట్ హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి. ట్రంప్ నెతన్యాహుతో స్పష్టమైన, కఠినమైన భాషలో మాట్లాడారు. నెతన్యాహును ‘‘నీకు పిచ్చి పట్టింది..నేను లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి,. అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు.. నీవల్ల ఇజ్రాయెల్‌కు చెడ్డ పేరు వస్తోంది’’ అని మండిపడినట్లు సమాచారం. ‘‘నేనే నిన్ను కాపాడుతున్నాను’’ అని కూడా వెల్లడించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ సంభాషణ ఇజ్రాయెల్ లెబనాన్‌లో హెజ్బొల్లా లక్ష్యాలపై దాడులు మరింత తీవ్రతరం చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో జరిగింది. ట్రంప్ ఈ దాడులు తన ఇరాన్‌తో జరుపుతున్న దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తాయని భావించారు.
ట్రంప్ కోపానికి కారణం ఏంటి?
ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేస్తే ఇరాన్ అమెరికాతో జరుపుతున్న చర్చలను నిలిపివేస్తుందని హెచ్చరికలు వచ్చాయి. ఇది మధ్యప్రాచ్యంలో మరిన్ని సంక్షోభాలకు దారి తీస్తుందని ట్రంప్ భయపడ్డారు. ఇజ్రాయెల్ చర్యల వల్ల అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత పెరుగుతోందని, దాని వల్ల అమెరికాకు కూడా నష్టం వస్తోందని ఆయన అభిప్రాయం. ట్రంప్ శైలి ఎప్పుడూ స్పష్టమైనది. సూటిగా ఉంటుంది. ఈసారి కూడా అదే భాషలో మాట్లాడటం ఆయన స్వభావానికి అనుగుణంగానే ఉంది.
ఇజ్రాయెల్–అమెరికా సంబంధాల్లో కొత్త పరిణామం?
ఇజ్రాయెల్ అమెరికా సంబంధాలు ఎప్పుడూ బలమైనవిగా ఉంటాయి. అయితే ఈ ఘటన ఆ సంబంధాల్లో కొంత అసౌకర్యాన్ని బయటపెట్టింది. నెతన్యాహు తన దేశ భద్రతా ప్రాధాన్యతలను ట్రంప్ దౌత్య వ్యూహాలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన సూచిస్తోంది. ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలోనూ నెతన్యాహుతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, తన ప్రధాన లక్ష్యమైన మధ్యప్రాచ్య శాంతి, ఇరాన్‌తో ఒప్పందం కోసం ఇజ్రాయెల్‌ను కట్టుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
రెండు విషయాలు స్పష్టం..
ట్రంప్ తన ఎజెండాను (ముఖ్యంగా ఇరాన్‌తో దౌత్యం) ఎవరికైనా రాజీ పడకుండా అమలు చేస్తారు. నెతన్యాహు తన దేశ భద్రతా ఆందోళనలను ఎంత మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది ఇజ్రాయెల్ రాజకీయాల్లో నెతన్యాహు స్థానం మరింత క్లిష్టంగా మారవచ్చు. ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిడి, మరోవైపు స్వంత దేశంలో రాజకీయ ఒత్తిడి ఈ రెండింటి మధ్య నెతన్యాహు ఎలా సమతుల్యం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్–నెతన్యాహు మధ్య జరిగిన ఈ తీవ్రమైన సంభాషణ మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త టెన్షన్‌ను సృష్టించింది. ఇది కేవలం రెండు దేశాల అధినేతల మధ్య వ్యక్తిగత విభేదం కాదు.. ప్రపంచ రాజకీయాల్లో శక్తి సమీకరణాలు ఎలా పని చేస్తాయో చూపించే ఒక ముఖ్యమైన సంఘటనగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తత ఎలా ముగుస్తుందనేది ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ఏపీలో కొత్త పింఛన్లు.. ఆ ధ్రువపత్రాలను రెడీ చేసుకోండి!
Andhra Pradesh New Pensions 2026: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలలోనే కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించనుంది. ఐదు రకాల పింఛన్లకు సంబంధించి కొత్తగా దరఖాస్తులను స్వీకరించనుంది. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. తమ దరఖాస్తులతో పాటు ఐదు రకాల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్, ఆధార్ నెంబర్ తో అనుసంధానించిన ఫోన్ నెంబర్, రేషన్ కార్డ్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు తో పాటు వాటిని తప్పకుండా జత చేయాలి. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో దరఖాస్తు చేయదలుచుకున్న వారు తప్పనిసరిగా ఈ ధ్రువీకరణ పత్రాలు ముందుగానే సమకూర్చుకోవాలి.
* ఐదు రకాల పత్రాలు తప్పనిసరి..
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులకు సంబంధించి కొత్త పింఛన్లు మంజూరు కానున్నాయి. వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆ ఐదు రకాల పత్రాలతో పాటు 60 సంవత్సరాలు దాటినట్టు ధ్రువీకరణ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధార్ కార్డులు పుట్టిన తేదీ, సంవత్సరం తప్పనిసరిగా ఉండాలి. వితంతు పింఛన్ దరఖాస్తుదారులు ఆ ఐదు రకాల ధ్రువపత్రాలతో పాటు భర్త చనిపోయినట్టు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఒంటరి మహిళకు సంబంధించి భర్త నుంచి విడిపోయి ఉంటే కోర్టు ద్వారా తీసుకున్న విడాకులకు సంబంధించిన ధ్రువపత్రం తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ పింఛన్లకు సంబంధించి ఐదు రకాల ధ్రువపత్రాలతో పాటు డాక్టర్ ఇచ్చే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి.
* రెండేళ్లుగా ఎదురుచూపు.
గత రెండేళ్లుగా కొత్త పింఛన్ల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురు చూశారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం భర్త పింఛన్ లబ్ధిదారుడు అయి ఉండి.. చనిపోతే అదే నెలలో భార్యకు పింఛన్ అందించే స్పౌజ్ కోటాను అమలు చేసింది. కానీ కొత్త పింఛన్ల విషయంలో ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్టి, ఎస్సీ వారికి పింఛన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని చూస్తోంది. ఇలా కొత్త పింఛన్ల ద్వారా 15 లక్షల మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అయితే ధ్రువపత్రాలతో కూడిన దరఖాస్తులను ఈనెల 12 నుంచి సచివాలయాల్లో అందించాలని సూచిస్తోంది ప్రభుత్వం.
పంజాబ్‌లో బీజేపీ మాస్టర్ ప్లాన్.. బెంగాల్ తరహా వ్యూహం అమలు!
BJP Punjab Strategy 2027 Elections: ఉత్తర భారత దేశం, తూర్పు, ఈశాన్య, పశ్చిమ భారత్‌లో బీజేపీకి మంచి పట్టు ఉంది. ఈ రాష్ట్రాల్లో ఒక్కసారైనా అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే పంజాబ్ ఎప్పుడూ బీజేపీకి సులభమైన భూమి కాదు. సిక్కు రాజకీయాలు, రైతు ఉద్యమాలు, కాంగ్రెస్–అకాలీ దళ్ ఆధిపత్యం ఇవన్నీ బీజేపీకి గట్టి అడ్డంకులు. అయితే ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఆ అడ్డంకులు క్రమంగా తొలగుతున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. 2027 అసెంబ్లీ ఎన్నికల ముందు పంజాబ్ రాజకీయ దృశ్యం నెమ్మదిగా మారబోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2026, మే నెలలో జరిగిన 1,977 వార్డుల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 172 సీట్లు గెలిచింది. 2021లో కేవలం 49–59 సీట్లు మాత్రమే సాధించిన పార్టీ ఇప్పుడు దాదాపు మూడింతలు పెంచుకోవడం సాధారణ విజయం కాదు.
ఇది నిశ్శబ్ద విప్లవం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీపార్టీ(ఆప్) 958 సీట్లతో అగ్రస్థానంలో ఉంది. కానీ అధికార పార్టీగా ఉన్నప్పటికీ సగం సీట్లు కూడా గెలవలేకపోవడం ఆ పార్టీకి పెద్ద హెచ్చరిక. ఉద్యోగాలు, అభివృద్ధి, డ్రగ్స్ సమస్యలపై ప్రజల అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 397 సీట్లు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. లోక్‌సభలో మంచి ఫలితాలు సాధించినా, స్థానిక ఎన్నికల్లో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల వలసలు (సిద్ధూ వంటివారు) పార్టీని బలహీనపరిచాయి. అకాలీ దళ్ 192 సీట్లతో మూడో స్థానంలో ఉండటం దాని క్షీణతను మరింత బయటపెట్టింది. జాట్ సిక్కులకు మాత్రమే పరిమితమై, హిందూ, ఇతర సామాజిక వర్గాలను కోల్పోతోంది. ఇక బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 172 సీట్లు గెలవడం వెనుక ఉన్నది కేవలం సంఖ్యలు కాదు.. వ్యూహాత్మక విస్తరణ. అబోహర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 50లో 28 సీట్లు గెలిచి మొదటిసారి మెజారిటీ సాధించింది.
పఠాన్‌కోట్‌లో బలమైన ప్రదర్శన. రైతు ఉద్యమానికి కీలకమైన మన్సాలో ఖాతా తెరిచింది. బటిండా కార్పొరేషన్‌లో చరిత్ర సృష్టించింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా సత్తా చాటడం విశేషం.
అన్ని ప్రాంతాల్లో ప్రభావం..
హిందూ ఓటర్లతోపాటు వివిధ సామాజిక వర్గాల్లోకి బీజేపీ వ్యాప్తి చెందుతోందని తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ నాయకత్వం పశ్చిమబెంగాల్‌లో అనుసరించిన నెమ్మది, స్థిరమైన వ్యూహాన్ని పంజాబ్‌లో అమలు చేస్తోంది. ఒక్కసారి అధికారం కోసం ఆతృత చూపకుండా, సామాజిక బలం, స్థానిక సమస్యలు, డ్రగ్స్, అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. ఆప్ కూడా ఇదే తరహాలో నెమ్మదిగా బలపడి 2022లో అధికారం చేపట్టింది. అదే మోడల్ బీజేపీకి కూడా పని చేయవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 2027లో బీజేపీ సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమే కావచ్చు. కానీ 2032 నాటికి పంజాబ్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడానికి ఈ ఫలితాలు బలమైన పునాది వేస్తున్నాయి.
ప్రజలకు ఏం సంకేతం?
పంజాబ్ రాజకీయాలు ఇక రెండు–మూడు పార్టీలకు పరిమితం కావడం లేదు. అధికార ఆప్‌పై అసంతృప్తి, కాంగ్రెస్–అకాలీదళ్‌ల బలహీనతలు, బీజేపీ యొక్క వ్యూహాత్మక విస్తరణ ఈ మూడు కలిసి కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. పంజాబ్‌కు అవసరం ఒక బలమైన, స్థిరమైన ప్రత్యామ్నాయం. బీజేపీ ఆ ఖాళీని నింపగలదా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. కానీ ఒక విషయం స్పష్టం.. పంజాబ్ రాజకీయాలు ఇక ఏకపక్షం కావడం లేదు.
పంజాబ్‌లో మార్పు గాలులు వీస్తున్నాయి. ఈ మార్పు పంజాబ్‌ను మరింత బలోపేతం చేస్తుందా లేదా కొత్త సంక్షోభాలకు దారి తీస్తుందా అనేది 2027 ఎన్నికలు నిర్ణయిస్తాయి. ప్రస్తుతానికి బీజేపీ స్పష్టమైన పురోగతిని సాధించిందనడంలో సందేహం లేదు.
టిడిపి రాజ్యసభ పదవులు వారికే.. చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి!
TDP Rajya Sabha Seats 2026: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ పదవులకు విపరీతమైన పోటీ ఉంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి.. ఆశావాహులు పెద్ద ఎత్తున చంద్రబాబును కలుస్తున్నారు. తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే చంద్రబాబు చివరి నిమిషం వరకు తేల్చే మనిషి కాదు. అన్ని రకాల సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఎవరికీ అనేది చంద్రబాబుతో పాటు లోకేష్ కు మాత్రమే తెలుస్తుంది. కానీ అది బయటపడదు కూడా. చివరివరకు గోప్యత ప్రదర్శించి.. అన్ని రకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని.. పార్టీకి ప్రయోజనం కలిగించే నిర్ణయాలే ఉంటాయి చంద్రబాబు నుంచి. ఇప్పుడు కూడా రాజ్యసభ పదవుల విషయంలో చంద్రబాబు పెద్ద కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుంటున్నారు. జూన్ 8 నాటికి ఒక నిర్ణయానికి రానున్నారు.
– సామాజిక వర్గాలకు ప్రాధాన్యం..
చంద్రబాబు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు రాజ్యసభ విషయంలో సైతం సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ జనసేన లింగమనేని రమేష్ కు కేటాయిస్తే కమ్మ సామాజిక వర్గానికి టిడిపి నుంచి అవకాశం లేదు. ఒకవేళ జనసేన వేరే వర్గానికి ఇస్తే మాత్రం కమ్మ సామాజిక వర్గానికి టిడిపిలో ఛాన్స్ దక్కడం ఖాయం. ప్రముఖంగా కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వారు ఆ సామాజిక వర్గం నుంచి ఆశావహులుగా ఉన్నారు. మరోవైపు బీసీలకు ఇవ్వాలనుకుంటే యనమల రామకృష్ణుడు ముందు వరుసలో ఉంటారు. లేకుంటే స్పీకర్ అయిన పాత్రుడు కుమారుడు విజయ్ పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
* సతీష్ కు మరో ఛాన్స్..
అయితే టిడిపి నుంచి పదవి విరమణ చేస్తున్న సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అందుకే ఈసారి అతనికి కొనసాగింపు ఉంటుంది. మిగతా రెండు పదవులు మిగిలితే.. అందులో బీసీలకు కానీ.. కమ్మ సామాజిక వర్గం వారికి కానీ కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే మిగిలిన ఒక్కగా నొక్క రాజ్యసభ పదవి ఈసారి బీసీ మహిళకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది. మొన్ననే మహానాడులో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తామని కీలక ప్రకటన చేశారు. పైగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా 33 శాతం మంది మహిళల కి టికెట్లు ఇస్తామని నారా లోకేష్ ప్రకటన చేశారు. అందుకే ఈసారి బీసీ మహిళకు రాజ్యసభ సీటు ఇస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు... పార్టీలు బీ రెడీ!
AP Local Body Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పంచాయితీతోపాటు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీల పాలకవర్గం ముగిసింది. కొత్తగా ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. మున్సిపాలిటీలకు సైతం ఆర్డీవో స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా వచ్చారు. అయితే ముందుగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రెండేళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కూటమి భావిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఇదే సమయం అని అంచనా వేస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం స్థానిక ఎన్నికలకు సిద్ధపడుతోంది. ప్రతిచోట వైసీపీ అభ్యర్థి బరిలో ఉండాల్సిందేనని.. లేకుంటే మాత్రం వైసిపి ఇన్చార్జ్ పై వేటు వేస్తామని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు.
* ఇదే నెలలో సంక్షేమ పథకాలు..
కూటమి ప్రభుత్వపరంగా ఈనెల కీలకం. ముఖ్యంగా ఇదే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దీంతో ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. మరోవైపు కొత్త పింఛన్లకు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కొత్త పింఛన్లు మంజూరు చేసి.. ప్రజల్లో మరింత సంతృప్తి సాధించి.. ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో కూటమి ఉంది. అయితే జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* ముందుగా పంచాయతీలకు..
ముందుగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా పంచాయతీలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ నాలుగు తో పదవీకాలం గడువు ముగిసింది. అప్పటినుంచి ప్రత్యేక అధికారులను నియమించారు. మరోవైపు ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం గడువు ప్రారంభం అయింది. పంచాయితీలకు పాలకవర్గాలు ఉంటేనే ఆర్థిక సంఘం నిధులు దక్కేవి. అందుకే ముందుగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వీలైనంతవరకు పంచాయితీలను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు ఒప్పుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే చెప్పారు. అయితే క్యాడర్ మాత్రం విముఖత వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎన్నికలు అంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. పైగా ఆర్థిక భారం తప్పేలా లేదు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తుంటే తప్పనిసరిగా బరిలో ఉండాల్సిందేనని చెబుతున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం పులివెందుల జడ్పిటిసి ఎన్నికలను గుర్తుచేసుకొని భయపడుతున్నారు.
* 100కు పైగా మున్సిపాలిటీలకు..
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 110 కి పైగా మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు ఉన్నాయి. పట్టణాలతో పాటు నగరాల్లో కూటమికి సంతృప్తికర వాతావరణముంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతుండడంతో అక్కడి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కూడా కూటమి సత్తా చాటాలని చూస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు కాకుండా పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసిపి ఉంది. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం అందుకు సుముఖంగా లేదు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.
బిజెపిని కట్ చేసిన చంద్రబాబు!
Chandrababu Naidu BJP Rajya Sabha Seats: ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద సాహసమే చేస్తున్నారు. ఈసారి కేంద్ర పెద్దలకు ఆయన నో చెప్పారు. రాజ్యసభ పదవుల విషయంలో ఈసారి అవకాశం ఇవ్వలేమని తేల్చి చెప్పారు. కానీ బిజెపి పెద్దలు మాత్రం తమ ప్రతిపాదన పంపించారు. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు టిడిపికి చెందిన సానా సతీష్ పదవీ విరమణ చేస్తారు. వీరి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నిక జరగనుంది. ఈనెల 8 నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. అయితే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది చంద్రబాబుకు తలనొప్పిగా మారనుంది. ముఖ్యంగా నాలుగు పదవులను కూటమిలోని మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం పెద్ద కసరత్తు. అయితే టిడిపిలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో బిజెపికి ఈసారి అవకాశం ఇవ్వలేమని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కు సమాచారం అందించగా… ఆయన కేంద్ర పెద్దలకు నివేదించారు.
* దేశవ్యాప్తంగా 24 ఖాళీలు..
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల నుంచి 24 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో 11 రాజ్యసభ సీట్లు నేరుగా బిజెపికి దక్కే అవకాశం ఉంది. ఆరు చోట్ల మాత్రం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు దక్కనున్నాయి. అందులో ఏపీలో నాలుగు సీట్లు ఉన్నాయి. అయితే ఈ నాలుగింటిలో ఒకదానిని జనసేనకు కేటాయించి.. టిడిపి మూడు తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల రాజ్యసభ పదవుల ఎంపికపై బిజెపి కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఏపీ నుంచి ఒక పదవి తీసుకోవాల్సిందేనని నేతలు అభిప్రాయపడ్డారు. కానీ ఇచ్చేందుకు మాత్రం తెలుగుదేశం పార్టీ సుముఖంగా లేదు. ఎందుకంటే ఇంతకుముందు రెండుసార్లు రాజ్యసభ పదవులను బిజెపికి కేటాయించింది టిడిపి.
* రెండుసార్లు ఛాన్స్..
ఓ ముగ్గురు సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికల్లో.. బిజెపికి ఒకటి, టిడిపికి రెండు రాజ్యసభ పదవులు దక్కాయి. తర్వాత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పుడు కూడా బిజెపి ఆ పదవిని తీసుకుంది. ఇప్పటివరకు రెండు బిజెపికి, రెండు టీడీపీకి దక్కాయి. జనసేనకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. అందుకే ఈసారి నాలుగింటిలో మూడు పదవులను తీసుకోవాలని చూస్తోంది టిడిపి. జనసేనకు ఒకటి కేటాయించనుంది. బిజెపికి రాజ్యసభలో మెజారిటీ మార్కు దగ్గరలోకి వచ్చింది. ఈసారి రాజ్యసభ పదవుల భర్తీతో పూర్తి ఆధిపత్యం రానుంది. అందుకే ఏపీ విషయంలో పట్టుబట్టి అవకాశం లేదు. కానీ చివరి వరకు మాత్రం ప్రయత్నంలో ఉంటుంది. మరి చంద్రబాబు మెత్తబడతారా? లేకుంటే పదవి కేటాయిస్తారా? అన్నది చూడాలి.
ఏపీ బీజేపీకి ఏమైంది?.. పెద్దలు ఫైర్!
AP BJP Crisis: ఏపీలో బిజెపి ప్రక్షాళన దిశగా హై కమాండ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పార్టీ నేతల వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అభివృద్ధిపై నేతలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పైగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. పార్టీని బలోపేతం చేయడం లేదు. దీనిపై హై కమాండ్ కు స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే నేతల తీరుపై పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ ముఖ్యమైన నేతను పిలిచి గట్టిగానే క్లాసు పీకినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడి ఎదుట నేతల పనితీరు, వ్యవహార శైలి బయట పెట్టినట్లు సమాచారం. అందుకే మొత్తం మార్పు దిశగా అడుగులు వేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
* సొంతంగా ఉనికి ఏది?
ఏపీలో భారతీయ జనతా పార్టీ కనీసం సొంతంగా ఉనికి చాటుకునే పరిస్థితిలో లేదు. తెలుగుదేశం పార్టీతో కలిసిన సమయంలో మాత్రమే ఓట్లతో పాటు సీట్లు పెరుగుతున్నాయి. ఒంటరిగా పోరాటం చేస్తున్న ప్రతిసారి ఒక్క నియోజకవర్గంలో కూడా డిపాజిట్లు రావడం లేదు. 2014లో టిడిపి తో కలిసి పోటీ చేస్తే ఎమ్మెల్యే తో పాటు ఎంపీ స్థానాలను దక్కించుకుంది బిజెపి. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎనిమిది ఎమ్మెల్యేలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు ఆ పార్టీకి దక్కాయి. అయితే ఇప్పుడు కూడా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. కనీసం పార్టీ కోసం పట్టించుకునే వారు కరువవుతున్నారు.
* మాధవ్ పై అసంతృప్తి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన పివిఎన్ మాధవ్ పార్టీని అభివృద్ధి చేస్తారని హైకమాండ్ భావించింది. ఆయనపై చాలా రకాలుగా అంచనాలు పెట్టుకుంది. కానీ ఎందుకో ఆయన ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. ప్రారంభంలో హడావిడి చేశారు. తరువాత ప్రెస్ మీట్ లకే పరిమితం అవుతున్నారు. దీంతో పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరన్న విమర్శలు ఉన్నాయి. పార్టీకి పెద్దదిక్కుగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఆయనకు ఢిల్లీలో పరపతి ఉంది. సీఎం చంద్రబాబు వద్ద గౌరవం ఉంది. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వపరంగా, రాష్ట్ర ప్రభుత్వపరంగా పనులు చేసుకుంటున్నారు. స్థానికంగా పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరన్న విమర్శ ఉంది. దగ్గుబాటి పురందేశ్వరి పరిస్థితి కూడా అదే. మొన్నటి ఎన్నికల వరకు ఆమె బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండేవారు. ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా కూడా ఉన్నారు. కనీసం వారంలో ఒక్కరోజు కూడా ఆమె అందుబాటులో ఉండడం లేదు. ఆమె తరుపున కూడా ఎవరు లేకుండా పోయారు పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇవన్నీ పార్టీ దృష్టికి వెళ్లాయి కూడా.. అందుకే హై కమాండ్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
* త్వరలో స్థానిక ఎన్నికలు..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మూడు పార్టీలు కలిసి వెళ్తాయి. కానీ క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీకి బలం లేదు. ఆ బలం పెంచుకునే ప్రయత్నం కూడా జరగలేదు. జిల్లా కమిటీలు ఉన్నాయంటే ఉన్నాయి. కనీసం గ్రామస్థాయి కమిటీలు లేవు. మండల కమిటీలు కానరావు. నియోజకవర్గాలు ఇన్చార్జులు ఉన్న ఫలితం లేదు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో బూత్ లెవెల్ లో బలమైన కమిటీలు ఉంటాయి. కానీ ఏపీ విషయానికి వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఇలానే కొనసాగితే ఏపీ బీజేపీలో ప్రక్షాళనకు హైకమాండ్ ప్రయత్నించే అవకాశం ఉంది. కచ్చితంగా చాలా రకాల మార్పులకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
జనసేనపై కమ్మ ముద్ర.. అయినా ఆయనకే రాజ్యసభ!
Jana Sena Rajya Sabha Seat: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా మొండితనం ప్రదర్శిస్తారు. ఎవరైనా రెచ్చగొడితే ఆయన రెచ్చిపోరు. చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకు పోతారు. తన పనితోనే వారికి ధీటైన సమాధానం చెబుతారు. మొన్న రాజమండ్రిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ముందుగా కాపు అనే అంశంపై స్పష్టతనిచ్చే క్రమంలో.. తాను కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తానని.. నాదెండ్ల మనోహర్ కు ఎలా ప్రాధాన్యం ఇస్తారని.. లింగమనేని రమేష్ ను ఎందుకు చేరదీస్తున్నారని చాలామంది కాపు నేతలు తనను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు పవన్. నేను కష్టంలో ఉండగా అండగా నిలిచింది వారు అని.. 2019లో ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పుడు మాట్లాడుతున్న కాపు నేతలు ఏమయ్యారు అని ప్రశ్నించడం ద్వారా కొన్ని రకాల సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యసభ పదవి లింగమనేని రమేష్ కు అని తేల్చేశారు. రాజమండ్రి సభను అలా వాడుకున్నారు. నా ఇష్టం పార్టీని ఇలానే నడుపుతాను.. తనకు కష్టంలో అండగా నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తానని తేల్చి చెప్పారు పవన్.
* కాపు నేతల విమర్శలు..
ఇటీవల జనసేనపై కాపు నేతలు విమర్శలు చేస్తున్నారు. కాపు ముసుగులో పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాపులు ఓట్లు వేసి జనసేన ను గెలిపిస్తే ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి గట్టిగానే బదులు ఇచ్చారు పవన్. 2019లో పోటీ చేస్తే తనకు అసలు అండగా నిలబడలేదు కాపు నేతలు అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అండగా నిలిచిన వారికి తాను అండగా నిలబడతానని తేల్చి చెప్పారు. అయితే ఇదంతా రాజ్యసభ పదవి కోసమే అని తేలిపోయింది. ఇప్పటికే జనసేనలో నెంబర్ 2 గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. 2018లో వైసీపీలోకి వెళ్లకుండా జనసేనలో చేరారు. అప్పటికే వైసీపీ నుంచి ఆయనకు ఆహ్వానం ఉంది. కానీ పవన్ పై ఇష్టంతో ఆయన చేసే రాజకీయాలకు జై కొట్టారు. అప్పట్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. అప్పుడు ఏ కాపు నేత అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 2019లో అదే నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇస్తే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 2024లో గెలిచి మంత్రిగా అవకాశం కల్పించేసరికి మాత్రం పవన్ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు.
* ఓటమిలో సైతం మద్దతు..
వాస్తవానికి జనసేన ఓడిపోతుంది అని తెలిసినా మద్దతు తెలిపింది నాదెండ్ల మనోహర్. ఆర్థికంగా అండగా నిలిచింది లింగమనేని రమేష్. దానిని కాపు ముసుగులో చూపి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న వారు అధికమవుతున్నారు. అటువంటి వారికి గట్టి సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్. అలా చెప్పడం ద్వారా లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని రాజ్యసభకు ఖరారు చేస్తారని తెలుస్తోంది. అయితే ఇటీవల కాపులకు రాజ్యసభ పదవి ఇవ్వాలని పవన్ పై డిమాండ్ పెరుగుతోంది. కానీ అందుకు తలొగ్గే ఛాన్స్ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ఒక రాజ్యసభ పదవి రావడం ఖాయం. లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారు చేయడం ఖాయమైపోయిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే కమ్మ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తున్నారన్న విమర్శల కు సైతం పవన్ పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.
















రామ్ చరణ్ కి ఇష్టమైన కోలీవుడ్ హీరో... అతని కోసం ప్రాణమైన ఇస్తాడా..?
Ram Charan Favourite Kollywood Hero: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్… ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. రెండోవ మూవీతోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన ఘనత కూడా తనకే దక్కింది. ‘మగధీర’ లాంటి సినిమాతో ఆయన క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న సినిమాలతో కొంతవరకూ తడబడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్నారు… ఇక రామ్ చరణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని వదిలేస్తే తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరో అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే సూర్య కావడం విశేషం…
మొత్తానికైతే సూర్య సినిమాలన్నింటిని క్రమం తప్పకుండా చూస్తూ వచ్చానని గజిని అంటే తనకు చాలా ఇష్టమని ఆ తర్వాత కూడా ఆయన చేసిన డిఫరెంట్ సినిమాలను చూస్తూ ఆదరిస్తున్న తమిళ్ తెలుగు ప్రేక్షకులకు కూడా అతను చాలా సందర్భాల్లో కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక సూర్య కోసం తను ఏదైనా చేస్తానని చెప్పాడు.
రామ్ చరణ్ ఇండస్ట్రీకి రాకముందు సూర్య సినిమా రిలీజ్ రోజే చూసే వాడినని పలు సందర్భాల్లో రామ్ చరణ్ చెప్పడం విశేషం… ఇక ఏదేమైనా కూడా ఇప్పుడు సూర్య కంటే రామ్ చరణ్ టాప్ హీరో కావడం అలాగే సూర్య కూడా రామ్ చరణ్ అంటే ఇష్టపడుతూ ఉంటాడు. మరి మొత్తానికైతే వీళ్ళ మధ్య చాలా మంచి బాండింగ్ కుదిరింది.
సూర్య హైదరాబాదు వచ్చిన ప్రతిసారి రామ్ చరణ్ ను కలుస్తాడని షూటింగ్స్ లో ఏదైనా విరామం దొరికితే అతను రామ్ చరణ్ వాళ్ల ఇంటికి వచ్చి మరి కలిసిపోతూ ఉంటారని గతంలో సూర్య కూడా చెప్పాడు. మొత్తానికైతే వీరిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…