Home Blog Page 191

గెలిచింది తొలిసారే.. కానీ 28 ఏళ్ల పార్టీనే రెండుగా చీల్చాడు!

TMC Split Crisis
TMC Split Crisis

TMC Split Crisis: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 28 ఏళ్ల ప్రస్థానం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఇప్పటివరకు ఎదుర్కొనని తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఎదుర్కొంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీలో చెలరేగిన అసంతృప్తి, ఒక కొత్త ఎమ్మెల్యే నేతృత్వంలో భారీ తిరుగుబాటుగా మారింది. 80 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 60 మంది మద్దతుతో రీతాబ్రత్‌ బెనర్జీ ప్రతిపక్ష నేతగా ఎదగడం టీఎంసీ చరిత్రలోనే అసాధారణ ఘటన.

ఎవరీ రీతాబ్రత్‌ బెనర్జీ..?
’రీతాబ్రత్‌ బెనర్జీ 1979 నవంబర్‌ 15న న్మించాడు. విద్యార్థి రాజకీయాల ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. ఎస్‌ఎఫ్‌ఐ కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిది ఏళ్లు చురుగ్గా పని చేశారు. 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికై జాతీయ స్థాయి గుర్తింపు సాధించారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి బహిష్కరించబడ్డారు. తర్వాత టీఎంసీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమయ్యాడు. ఇటీవలి ఎన్నికల్లో ఉలుబేరియా పూర్వ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తిరుగుబాటుకు మూల కారణాలు..
టీఎంసీలో తిరుగుబాటు సిద్ధాంతపరమైనది కాదు. ఇది నాయకత్వం, అధికార పంపకాలు నిర్ణయాల కేంద్రీకరణపై ఉన్న తీవ్ర అసంతృప్తి నుంచి ఉద్భవించింది. ఎన్నికల ఓటమి తర్వాత మమతా బెనర్జీ నివాసంలో జరిగిన కీలక సమావేశానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం, ఆమె నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి తక్కువ హాజరు ఇవి పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టాయి. ముఖ్యంగా మమతా–అభిషేక్‌ బెనర్జీ ద్వయం చేతుల్లో నిర్ణయాలు పూర్తిగా కేంద్రీకృతం కావడం, సీనియర్, మధ్యస్థ స్థాయి ఎమ్మెల్యేలు సైడ్‌లైన్‌ అవుతున్నారనే భావన బలంగా పెరిగింది.

టర్నింగ్‌ పాయింట్‌ ఇదే..
అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నియామకం విషయంలో వచ్చిన గందరగోళం ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు. సంతకాల ఫోర్జరీ ఆరోపణలు, ఫిర్యాదులు, బహిష్కరణలు ఈ క్రమంలో రీతాబ్రత్‌ బెనర్జీతో పాటు మరికొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఇది తిరుగుబాటు వర్గాన్ని మరింత బలోపేతం చేసింది. రీతాబ్రత్‌ తనను తాను పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మమతా బెనర్జీని ఇప్పటికీ అధినేత్రిగా గౌరవిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా నేరుగా ఆమెపై దాడి చేయకుండా, అభిషేక్‌ బెనర్జీ పెత్తనాన్ని లక్ష్యం చేసుకున్నారు. ఇది అసంతృప్త ఎమ్మెల్యేలను ఒకేచోట చేర్చడంలో కీలకం అయింది.

రీతాబ్రత్‌ వ్యూహం ఎలా సక్సెస్‌ అయింది?
ఎన్నికల ఓటమి తర్వాత ఉన్న సాధారణ అసంతృప్తిని సమర్థవంతంగా వాడుకోవడం. అనుభవం ఉన్న ‘‘అవుట్‌సైడర్‌’’ ఇమేజ్‌తో సీనియర్‌ నాయకులను ఆకర్షించడం, ఫోర్జరీ వివాదాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం, జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో ముందుగానే నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కలిసి ఒక కొత్త ఎమ్మెల్యేకు ఇంత పెద్ద సంఖ్యలో మద్దతు తెచ్చిపెట్టాయి.

ఏం జరగబోతోంది?
టీఎంసీలో చీలిక భవిష్యత్తుపై పెద్ద సందేహాలు రేకెత్తిస్తోంది. రీతాబ్రత్‌ వర్గం మమతాను ప్రధాన సలహాదారుగా కోరుతున్నప్పటికీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, అధికార వ్యవస్థ, రాజకీయ వ్యూహాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో విపక్షం ఇంకా బలహీనపడితే బెంగాల్‌ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

ట్రంప్‌కు షాక్‌.. యుద్ధ స్పీడ్‌కు కాంగ్రెస్‌ బ్రేక్‌!

US Congress Blocks Trump Military Action
US Congress Blocks Trump Military Action

US Congress Blocks Trump Military Action: పశ్చిమాసియాలో అగ్గి రాజేసి.. చివరకు ఇరాన్‌పై గెలవలేక చతిలికబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో గట్టి షాక్‌ తగిలింది. విదేశాంగ విధానానికి ప్రతినిధుల సభ ట్రంప్‌ దూకుడుకు బ్రేక్‌ వేసింది. ఇరాన్‌తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అధ్యక్షుడు ఏకపక్షంగా సైనిక చర్యలు చేపట్టకుండా నియంత్రించే ‘వార్‌ పవర్స్‌’ తీర్మానాన్ని హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ 215–208 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఇది ట్రంప్‌ ప్రభుత్వం మీద కాంగ్రెస్‌ అసంతృప్తి ఎంత లోతుగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

తీర్మానం ఎందుకు?
డెమోక్రటిక్‌ సభ్యుడు గ్రెగరీ మీక్స్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ప్రకారం, ఇరాన్‌పై యుద్ధం కొనసాగించాలంటే లేదా కొత్త సైనిక చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్‌ అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం అధ్యక్షుడికి కాదు, కాంగ్రెస్‌కు చెందుతుందని ఇది మరోసారి గుర్తు చేస్తోంది. ఈ తీర్మానానికి నలుగురు రిపబ్లికన్‌ సభ్యులు కూడా మద్దతు ఇవ్వడం ఆశ్చర్యకరమైన అంశం. ఇది రిపబ్లికన్‌ పార్టీలోనే ట్రంప్‌ విధానాలపై అసంతృప్తి ఉందనడానికి నిదర్శనం.

ట్రంప్‌పై తిరుగుబాటు?
ఫిబ్రవరి చివరి నుంచి ఇరాన్‌తో ముదిరిన ఘర్షణల్లో ట్రంప్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే సైనిక చర్యలు చేపట్టిందని విమర్శలు ఎగసిపోతున్నాయి. యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక భారం పెరగడం కారణంగా అమెరికా ప్రజాభిప్రాయం కూడా వ్యతిరేక దిశగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే డెమోక్రాట్లతోపాటు కొంతమంది రిపబ్లికన్లు కూడా కాంగ్రెస్‌ అధికారాలను బలపరిచే తీర్మానానికి మద్దతు ఇచ్చారు. గతంతో పోలికఇదే తరహా తీర్మానం మే నెలలో సభ ముందుకు వచ్చినప్పుడు 212–212తో సమం కావడంతో విఫలమైంది. కానీ ఈసారి అదనపు మద్దతు లభించడంతో హౌస్‌లో విజయం సాధించింది. ఇది ట్రంప్‌ వ్యతిరేక శక్తులకు ముఖ్యమైన రాజకీయ విజయం.

ఏం జరగబోతోంది?
హౌస్‌ ఆమోదించిన తీర్మానం ఇప్పుడు సెనెట్‌కు వెళ్తుంది. అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్ల మద్దతు ఉన్నప్పటికీ, తుది ఫలితం ఇంకా అనిశ్చితంగా ఉంది. సెనెట్‌ కూడా ఆమోదించినా, అధ్యక్షుడు ట్రంప్‌ వీటో విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలు తక్షణం ఆగిపోవు. అయితే కాంగ్రెస్‌ అనుమతి లేకుండా యుద్ధం కొనసాగించడంపై ట్రంప్‌ ప్రభుత్వంపై రాజకీయ, రాజ్యాంగపరమైన ఒత్తిడి భారీగా పెరుగుతుంది.

ఇది కేవలం ఒక తీర్మానం ఆమోదం కాదు. అధ్యక్షుడి యుద్ధ అధికారాలపై కాంగ్రెస్‌ తన నియంత్రణను బలంగా పునరుద్ఘాటించిన ఘట్టం. ట్రంప్‌ దూకుడు విధానాలకు కొంత మేరకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు దీన్ని అభివర్ణిస్తున్నారు.ఈ తీర్మానం ట్రంప్‌ ప్రభుత్వం, కాంగ్రెస్‌ మధ్య అధికార పోరును మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో సెనెట్‌ ఓటింగ్, ట్రంప్‌ వీటో నిర్ణయం అమెరికా రాజకీయాల్లో కీలక మలుపుగా నిలవనుంది.

అవి సినిమాకి అవసరం లేదని రామ్ చరణ్ చెప్పినా బుచ్చి బాబు వినిపించుకోలేదా..?

Ram Charan Suggestions To Buchi Bab
Ram Charan Suggestions To Buchi Bab

Ram Charan Suggestions To Buchi Babu: కొన్ని సినిమాల విషయంలో దర్శకులు తీసుకునే నిర్ణయాలు సినిమా సక్సెస్ సాధించడానికి కారణం అవుతాయి. ఇక మరికొన్ని సినిమాల్లో హీరోలు చెప్పే సజెషన్లు కూడా సినిమా సక్సెస్ కి చాలా వరకు హెల్ప్ అవుతుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పెద్ది సినిమా విషయంలో రామ్ చరణ్ కొన్ని సజెషన్స్ అయితే చెప్పారట. ఆ సజెషన్స్ విషయంలో బుచ్చిబాబు కొన్ని పాటించాడు.

కొన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫైనల్ అవుట్ పుట్ చూసిన తర్వాత ప్రతి సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్ అంత పెద్దగా ఎస్టాబ్లిష్ కాలేదని కొన్ని సన్నివేశాలు తీసి పక్కన పెట్టేస్తే బాగుంటుందని సినిమా ఫ్లో కూడా సెట్ అవుతుందని చెప్పారట. కానీ బుచ్చిబాబు మాత్రం సినిమా చూడటానికి వచ్చే వాళ్లలో ఎక్కువ మంది బీ,సీ సెంటర్ ఆడియన్స్ ఉంటారు.

కాబట్టి జాన్వీ కపూర్ ఉంటేనే వాళ్ళు సినిమాని రిపీటెడ్ గా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తద్వారా కలెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తాయనే ఉద్దేశ్యంతో రామ్ చరణ్ చెప్పిన మాటను పక్కనపెట్టి ఆమె సన్నివేశాలను ఎక్కువగానే ఉంచారట. దాంతో సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ ఎందుకు ఆమె సినిమాకి అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ చెప్పిన మాటే నిజమైంది అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు పెద్ది సినిమా సక్సెస్ ని సాధించింది అంటూ కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది. రామ్ చరణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వీకెండ్ గడిస్తే గాని ఈ సినిమా జన్యూన్ టాక్ ఏంటి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ ను రాబట్టింది అనే విషయాల మీద సరైన క్లారిటి రాదు…

పెద్ది మూవీలో ఆ రెండు విషయాల మీద స్పెషల్ కేర్ తీసుకొని ఉంటే బాగుండేదా..?

Ram Charan Peddi Movie Analysis
Ram Charan Peddi Movie Analysis

Ram Charan Peddi Movie Analysis: రామ్ చరణ్ హీరోగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి క్రమం లోనే ఇవాళ్ళ రిలీజైన పెద్ది సినిమా విషయంలో కూడా చాలావరకు తను సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకలోకాన్ని మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే మొదటి షో తోనే ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రావడం ఒకరకంగా మంచి పరిణామం అనే చెప్పాలి. అయితే పెద్ది సినిమా సూపర్ సక్సెస్ సాధించకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమాలో రెండు విషయాల్లో చాలా వరకు తప్పులు చేశారనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో లాజిక్స్ అయితే చాలా వరకు మిస్ అయ్యాయి. వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

ఒక దాంతో పాటుగా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని అనవసరమైన సన్నివేశాలు కూడా ఈ సినిమాని బాగా ఇబ్బంది పెట్టినట్టుగా తెలుస్తుంది. నిజానికి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు కొన్నిచోట్ల బోర్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ బోరింగ్ సన్నివేశాలన్నింటిని ఎడిటింగ్ లో తీసేసి ఉంటే బాగుండేది.

ముఖ్యంగా ఈ రెండు విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేదని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబడుతుంది. కాబట్టి మరో రెండు రోజులు గడిస్తే గాని ఈ సినిమా జన్యున్ ఏంటి అనేది తెలియదు.

కాబట్టి ఈ క్రమంలోనే ఈ సినిమా ఎంతవరకు వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు రామ్ చరణ్ కెరియర్ లో ఒక్కటి కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమాలైతే లేవు. మరి ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందనేది తెలియాల్సి ఉంది…

పెద్ది మూవీ చూసి రామ్ చరణ్ కి కాల్ చేసిన మహేష్ బాబు ఏం చెప్పాడంటే..?

Mahesh Babu Reaction To Peddi
Mahesh Babu Reaction To Peddi

Mahesh Babu Reaction To Peddi: మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు రామ్ చరణ్…అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన రామ్ చరణ్ ఇండియాలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక పెద్ది సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను సగటు ప్రేక్షకులతో పాటు కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా చూశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాని చూసి అద్భుతంగా ఉంది అంటూ రామ్ చరణ్ కి ఫోన్ చేసి మాట్లాడట. ఇక తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కూడా చాలా బాగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కుస్తీ ఫైట్లో తన బాడీ అద్భుతంగా ఉందని అంత బాడీని బిల్డ్ చేయడమంటే మామూలు విషయం కాదని అందులో నువ్వు చాలా వరకు సక్సెస్ అయ్యావు అంటూ రామ్ చరణ్ ను పొగిడినట్టుగా తెలుస్తుంది.

నటన కూడా అద్భుతంగా ఉందని చెప్పాడట. క్లైమాక్స్ లో నిజంగా ఏడిపించేసావు చరణ్ అంటూ మహేష్ బాబు ఒక 30 నిమిషాల పాటు సినిమా గురించి మాట్లాడినట్టుగా ఫిలిం నగర్ సర్కిల్ లో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు లాంటి నటుడు రామ్ చరణ్ తో ఎప్పుడు సన్నిహితంగానే ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. ఒక సినిమా గురించి మరొకరు డిస్కస్ చేసుకునే అంత క్లోజ్ నెస్ కూడా ఉండటం వల్లే మహేష్ బాబు ఈ సినిమాని మొదటి రోజే చూసి అతనికి కాల్ చేసి చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…

ఓవరాల్ గా ఈ సినిమా సగటు ప్రేక్షకులను మెపిస్తూ ముందుకు సాగుతుంది. మరి ఫైనల్ గా ఈ సినిమా మంచి రిజల్ట్ ను రాబడుతోంది. అలాగే ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ రికార్డులను కొల్లగొట్టే విధంగా కలెక్షన్స్ ని రాబడుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

పెద్ది మూవీ ని రిజెక్ట్ చేసి ఆ ఇద్దరు స్టార్ హీరోలు సేఫ్ అయ్యారా..?

Peddi Movie Success
Peddi Movie Success

Peddi Movie Rejected Star Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు రిలీజ్ అయి చాలా రోజులు అవుతుంది. ఇక ఇపంటో క్రమంలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా చేసిన ‘పెద్ది’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా ఈ సినిమాకు మొదటి నుంచి కూడా భారీ హైప్ ఉండడం వల్ల ఈ సినిమాని ప్రీమియర్ షోస్ చూడడానికే చాలామంది ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు సినిమాని ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది అనే ఒక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకులందరు ఈ సినిమాని చూడాల వద్ద అనే ఒక డైలమాలో పడిపోయారనే చెప్పాలి. అయితే ఈ సినిమాని రామ్ చరణ్ కంటే ముందే ఒక ఇద్దరు హీరోలకైతే చెప్పారట. కానీ ఆ హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఎట్టకేలకు రామ్ చరణ్ దగ్గరికి వచ్చింది. ఇక సుకుమార్ సహాయంతో రామ్ చరణ్ కి కథను వినిపించిన బుచ్చిబాబు సింగల్ సిటింగ్ లోనే కథను ఓకే చేయించుకున్నాడు.

సుకుమార్ ఉన్నాడనే ధైర్యంతో రామ్ చరణ్ సైతం బుచ్చిబాబ కిు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే మొదట బుచ్చిబాబు ఈ కథను ఎవరికి వినిపించాడు. వాళ్లు ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేశారు అనే విషయంలోనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తితో నెలకొంది.

అయితే ఈ సినిమా కథని మొదట బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. ఎన్టీఆర్ ఈ కథ విషయంలో కొన్ని సందేహాలను వ్యక్తం చేశారట. కొన్ని మార్పులు చేర్పులు చేయమని కూడా చెప్పారట.అయినప్పటికి బుచ్చిబాబు వినకపోవడంతో ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ తర్వాత ఈ కథని తమిళ్ స్టార్ హీరో సూర్యకి వినిపించారు.

సూర్య సైతం ఈ కథ విషయంలో అంత సాటిస్ఫై అవ్వకపోవడంతో అతను ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఇక ఎట్టకేలకు రామ్ చరణ్ వద్ద కైతే వచ్చింది. ఈ సినిమాని చూసిన కొంత మంది ప్రేక్షకులు ఎన్టీఆర్, సూర్య ఈ సినిమా చేయకపోవడమే మంచిదయింది అంటూ వాళ్ళు ఈ సినిమా నుంచి తప్పించుకున్నారు అంటూ కామెంట్లు అయితే చేస్తున్నారు…

2026 మే నెల టాప్ 10 కార్ల లిస్టు ఇదే.. వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ ను వెనక్కి నెట్టిన కారు ఏదో తెలుసా..

May 2026 Top Selling Cars In India
May 2026 Top Selling Cars In India

May 2026 Top Selling Cars In India: భారత కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి కంపెనీ తన అద్భుతమైన కార్ల అమ్మకాలతో ఎప్పుడూ టాప్ ప్లేసులో ఉంటుంది. ఈ కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ కార్లు విజేతలుగా నిలుస్తూ ఉంటాయి. అయితే ఈ కార్ల అమ్మకాలు ఇప్పుడు వెనుకబడిపోయాయి. వీటిని మరో కారు దాటింది. అయితే ఆ కారు కూడా మారుతి కంపెనీదే కావడం విశేషం. ఇటీవల విడుదలయిన 2026 మే నెల సేల్స్ ప్రకారం టాప్ లెవల్లో విక్రయాలు జరుపుకున్నకార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

20026 మే నెలలో జరిగిన హ్యాచ్ బ్యాక్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి కంపెనీకి చెందిన డిజైర్ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ మోడల్ ఈ నెలలో మొత్తం 24,546 యూనిట్లు విక్రయించి దేశంలోనే అగ్ర కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. గత ట్రెండ్స్‌ను చూస్తే డిజైర్ నిరంతరం విశ్వసనీయ ఫ్యామిలీ సెడాన్‌గా ప్రాచుర్యం పొందినా, ఈ స్థాయిలో అమ్మకాలు సాధించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆ తరువాత రెండో స్థానంలో 20,686 యూనిట్ల విక్రయాలతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ నిలిచింది. ఫ్రాంక్స్‌ కూడా మార్కెట్‌లో బలమైన అభిరుచిని సంపాదించడంతో, వినియోగదారులకు అందుబాటు ధరతో ఉంది. మూడో స్థానంలో ఇదే కంపెనీకి చెందిన ఎర్టిగా 20,350 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది.

మే నెలలో టాటా కంపెనీ కూడా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. టాటా పంచ్ ఈ నెలలో 20,208 యూనిట్లతో నాల్గో స్థానాన్ని, టాటా నెక్సాన్ 19,100 యూనిట్లతో ఐదో స్థానాన్ని ఆక్రమించాయి. టాటా పంచ్ యొక్క స్థిరమైన పెరుగుదల, నెక్సాన్ యొక్క బలమైన సేఫ్టీ మరియు ఫీచర్ సెటప్ వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించాయి.

మారుతి సుజుకి బాలెనో మే నెలలో 18,396 యూనిట్లతో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. అయితే హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఇది టాప్ లెవల్లో ఉంది. దీంతో ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని సాగించిన వ్యాగన్ ఆర్, స్విప్ట్ లను ఇది వెనక్కి నెట్టేసింది. ఈ విజయానికి కారణంగా వేగంగా అభివృద్ధి చెందిన డిజైన్ భాష, సమర్థవంతమైన ఇంజిన్ ఎంపికలు, ఫీచర్-రైచ్డ్ ఇన్నర్ కలపికలు మరియు బ్రాండ్ అపీల్ ప్రధాన పాత్ర వహించాయి.

వ్యాగన్ఆర్ 18,076 యూనిట్లతో ఏడో స్థానంలో, స్విఫ్ట్ 17,519 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాయి. మహీంద్రా స్కార్పియో 15,774 యూనిట్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా.. SUV విభాగంలో మాత్రం స్థిరత్వాన్ని చూపించింది. హ్యుందాయ్ క్రెటా 15,235 యూనిట్లతో టాప్-10లో నిలిచింది. ముగించింది. ఈ రెండు SUVల విజయాలు వినియోగదారుల మన్ననలను పొందాయి.

అయితే మారుతి వ్యాగన్ ఆర్, స్విప్ట్ కంటే బాలెనోకి వినియోగదారులు ఇంత ఇష్టపడటానికి ఉద్దేశించిన ప్రధాన కారణాలలో స్టైలింగ్ ముందు నిలుస్తుంది. సరికొత్త అగ్రెసివ్ బాడీ డిజైన్, ఏరోడైనమిక్ ప్రొఫైల్ మరియు బోల్డ్ ఫ్రంట్ గ్రిల్ కలుసుకొని ఇది నగర చుట్టూ చూసే కారు అని స్పష్టంగా తెలియజేస్తుంది. ముందు భాగంలో షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ డే‌టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs) దీని ఫ్యుయెల్ ట్రెండ్‌ను పెంచుతున్నాయి.

'పెద్ది' మూవీ ట్విట్టర్ టాక్ ఇదే .. ప్రీమియర్ షోస్ టాక్ కి రెగ్యులర్ షోస్ టాక్ కి చాలా తేడా ఉందిగా..

Peddi 28 Days Collections
Peddi 28 Days Collections

Peddi Movie Twitter Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. నిన్న రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి గ్రాండ్ గా ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్ నుండి సోషల్ మీడియా లో ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకి జేజేలు పలుకుతున్నారు. బుచ్చి బాబు కాస్త శ్రద్ద తీసుకొని ఉండుంటే బాగుండేది , రామ్ చరణ్ మాత్రం సింగిల్ హ్యాండ్ తో ఈ చిత్రాన్ని లాగేశాడు , రాబోయే రోజుల్లో ఆయనకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ సోషల్ మీడియా లో ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళు కామెంట్స్ చేశారు. అయితే రెగ్యులర్ షోస్ మొదలు అయ్యేసరికి కాస్త టాక్ లో తేడా వచ్చింది. ఇలా గతం లో చాలా సినిమాలకు జరిగాయి , పెద్ది కి కూడా అదే జరిగింది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయం లో ప్రీమియర్ షోస్ కి , రెగ్యులర్ షోస్ కి టాక్ చాలా తేడా గా ఉంది. ప్రీమియర్ షోస్ నుండి సెకండ్ హాఫ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ కి వేరే లెవెల్ లో ఊగిపోయారు. కానీ రెగ్యులర్ షోస్ మొదలయ్యేసరికి టాక్ మారిపోయింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని , సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఓవర్ అయ్యాయని , రామ్ చరణ్ కి అసలు కాళ్ళు కట్ చెయ్యాల్సిన అవసరమే లేదని , బుచ్చి బాబు రొటీన్ భిన్నం గా ప్రయత్నం చేసాడు కానీ , ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదని , మాస్ ఆడియన్స్ లో ఈ చిత్రం నిలబడడం కష్టమే అని అంటున్నారు. కానీ రామ్ చరణ్ నటన మీద మాత్రం ఆడియన్స్ నుండి రెస్పాన్స్ లో ఎలాంటి మార్పు లేదు.

ప్రీమియర్ షోస్ కి ఎలాంటి టాక్ అయితే చెప్పారో, రెగ్యులర్ షోస్ కి కూడా అదే రేంజ్ టాక్ చెప్పారు. ఈ సినిమాని రామ్ చరణ్ తన నటన తో నిలబెట్టేశాడని , ఈ చిత్రం నుండి ఎంత కలెక్షన్స్ వచ్చినా రామ్ చరణ్ నటన పుణ్యమే అని , డైరెక్టర్ బుచ్చి బాబు కాస్త కేరింగ్ తీసుకొని ఉండుంటే వెయ్యి కోట్ల బొమ్మ అని అంటున్నారు. మరి ఈ టాక్ తో ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ జాన్వీ కపూర్ పాత్రకు చిరాకు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి సంబంధించిన టాక్ కి సంబంధించిన ట్వీట్లు కొన్ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

పెద్ది మూవీ వెనక చిరంజీవి హస్తం ఉందా..?

Peddi Movie Chiranjeevi Role
Peddi Movie Chiranjeevi Role

Peddi Movie Chiranjeevi Role: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడనే చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ వెనక చిరంజీవి కూడా ఉన్నాడనే టాక్ అయితే వినిపిస్తుంది. మొదట ఈ సినిమా రషెస్ మొత్తాన్ని చూసిన చిరంజీవి అతనికి అంత ఎఫెక్టివ్ గా అనిపించకపోవడంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేయించారట. దాంతో సినిమా చాలా బాగా ఎఫెక్టివ్ గా వచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే చిరంజీవికి చాలా సీనియార్టీ ఉంది కాబట్టి అతని సీనియారిటీ వల్లే ఆయన కొన్ని చేంజెస్ చెప్పడం అవి సినిమాకి చాలా ప్లస్ గా మారడం జరిగాయట.

కాబట్టి మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ తన సత్తా ఏంటో చూపించాడు. బుచ్చిబాబు డైరెక్షన్ పరంగా కొంతవరకు ఇంకా ఎఫెక్టివ్ గా సినిమా ను తీర్చిదిద్దితే బాగుండేది. కానీ ఆయన అక్కడక్కడ తడబడ్డాడు…

మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ వెనకాల చిరంజీవి ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్న మెగా అభిమానుల సైతం ఆనందపడుతున్నారు. ఇక సుకుమార్ సైతం బుచ్చిబాబు వెనకాల ఉన్నాడు. కాబట్టి బుచ్చిబాబుకి ఈ ప్రాజెక్టు అయితే వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ను ఆయన కొంతవరకు సక్సెస్ ఫుల్ గా డీల్ చేశారనే చెప్పాలి. సుకుమార్ సైతం ఈ సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నాయని ముందే చెప్పారట.

కానీ బుచ్చిబాబు వాటిని పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడని అవి కూడా ఈ సినిమా కొంతవరకు మైనస్ గా మారాయి అనే వార్తలైతే వస్తున్నాయి… మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తున్నారు. అసలు జన్యున్ టాక్ ఏంటి అనేది తెలియాలంటే మరొక రెండు మూడు రోజులపాటు వెయిట్ చేయాల్సిందే…

పెద్ది మూవీతో రామ్ చరణ్ నేషనల్ అవార్డ్ గెలుస్తాడా? ఇండియా లో నెంబర్ వన్ హీరో అయినట్టేనా..?

Ram Charan Peddi Collections
Ram Charan Peddi Collections

Ram Charan Peddi Movie: ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ‘రామ్ చరణ్’ ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. అప్పటినుంచి స్టార్ హీరోగా మారిపోయానా రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ‘పెద్ది’ మూవీతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం ఆయన ఎంతగా కష్టపడ్డాడో అతని బాడీని చూస్తే మనకు అర్థం అయిపోతుంది. ఆ క్యారెక్టర్ కోసం ఒక హీరో అంతలా కష్టపడతాడా అనేది కూడా మనం రామ్ చరణ్ ను చూసి నేర్చుకోవచ్చు. అయితే ఈ సినిమాతో ఆయన నెంబర్ వన్ హీరోగా మారిపోవడం ఖాయం అంటూ చాలామంది చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

ఇక దాంతో పాటుగా అతనికి నేషనల్ అవార్డు కూడా వస్తుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఒక క్యారెక్టర్ కోసం ఇంతలా కష్టపడడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అలాంటి రామ్ చరణ్ రాబోయే రోజుల్లో కూడా డిఫరెంట్ సినిమాలను చేసి ప్రేక్షకుల్లో ఒక కొత్త అనుభూతిని నింపాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

కెరియర్ స్టార్టింగ్ లో రొటీన్ సినిమాలను చేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎక్స్పరిమెంటల్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. ఇక పెద్ది సినిమా కథ రొటీన్ గా ఉన్నప్పటికి తన ఎగ్జిక్యూషన్ కొంతవరకు ఎఫెక్టివ్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ క్యారెక్టర్ లో బుచ్చిబాబు రామ్ చరణ్ ని చాలా బాగా పోట్రే చేశాడు. బుచ్చి బాబు సినిమాను నడిపించిన విధానాన్ని పక్కన పెడితే రామ్ చరణ్ క్యారెక్టర్ మీద ఆయన పెట్టిన ఫోకస్ కూడా చాలా బాగుంది.

ప్రతి మూమెంట్లో రామ్ చరణ్ ను ఎలివేట్ చేసిన విధానం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది… మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో నేషనల్ అవార్డు గెలవడం పక్క అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

బి*కి*నీలో మాల్దీవ్స్ లో జార్జియా అందాల జాతర

Giorgia Andriani's Maldives Photos
Giorgia Andriani's Maldives Photos

పెద్ది మూవీలో ప్లస్ లు మైనస్ లు ఇవే...

Peddi Plus Points
Peddi Plus Points

Peddi Plus Points: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ది సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను ఇస్తున్నప్పటికి సినిమాలో కొన్ని నెగెటివ్ పాయింట్లు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? నెగెటివ్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకుందాం…

ప్లస్ పాయింట్స్

రామ్ చరణ్ ను ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆయన ఆధ్యాంతం ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో తనను తాను చాలా బాగా పోట్రే చేసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ లో కూడా ఆయన ఒదిగిపోయి నటించాడు.

ఇక తన బాడీ బిల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని ఇండస్ట్రీలో అంతటి మంచి బాడీని ఎవరు బిల్డ్ చేయలేరు అనేంతలా కష్టపడి తన బాడినైతే బిల్డ్ చేసుకున్నాడు. ఇక తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ అయితే తెప్పించాడు. పెద్ది క్యారెక్టర్ లో తను తప్ప ఎవరు ఆపా ను చేయలేరు అనేంతలా నటించి మెప్పించాడు.

ఇక ఫస్టాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి…హాస్పిటల్ సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా బాగా కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది…

మైనస్ పాయింట్స్

ఈ మూవీలో విలేజ్ సెట్ అప్ అనేది ప్రాపర్ గా సెట్ అవ్వలేదు. ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది అంత బాగా సెట్ చేయలేకపోయారు… సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా అంత పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఒక టైమ్ కి వెళ్ళిన తర్వాత రామ్ చరణ్ దేనికోసం ఇదంతా చేస్తున్నాడు అనేది ఒక చిన్న డైలమా అయితే మనకు కనిపిస్తుంది.క్లైమాక్స్ ఎపిసోడ్ ఓకే అనిపించినప్పటికి అది ముందే మనకు రివిల్ అయిపోవడం వల్ల అందులో ఉన్న సస్పెన్స్ ను మనం ఎంజాయ్ చేయలేకపోయాం…

డీఎస్సీ 2025 పై పేకాట ముద్ర.. అడ్డంగా బుక్కైన వైసిపి!

DSC 2025 Controversy
DSC 2025 Controversy

DSC 2025 Controversy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ప్రస్టేషన్లో ఉన్నారు. ఎప్పుడు కూటమి ప్రభుత్వంపై బురద జల్లుదామా.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అపరిపక్వత మాటలతో ప్రజల్లో అయోమయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. డీఎస్సీ 2025 పై కూడా ఇదే మాదిరిగా విషప్రచారం చేస్తున్నారు. ఎంతలా అంటే పేకాట ఆడే వారికి సైతం ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారనేదాకా. వారి పరిస్థితిని చూసి నవ్వాలో.. ఏడవాలో కూడా తెలియడం లేదు. బ్రిడ్జ్ అనే క్రీడాంశాన్ని తీసుకొని.. క్లబ్బుల్లో ఆడే పేకాట అని భ్రమించారు. దానినే ప్రచారం చేసి నవ్వుల పాలయ్యారు. ఎంతలా అంటే ప్రభుత్వంపై కౌంటర్ అటాక్ చేసే మాజీ మంత్రి పేర్ని నాని కూడా అది పేకాట అని తేల్చేశారు. అడ్డంగా బుక్కయ్యారు.

* అంతర్జాతీయంగా గుర్తింపు..
అంతర్జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ చెస్ మాదిరిగా మేధో సంపత్తితో కూడిన బ్రిడ్జ్ అనే క్రీడను గుర్తించింది. అన్ని దేశాలకు ఈ క్రీడల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మన దేశం కూడా ఆ క్రీడాంశాన్ని జత చేసింది. క్రీడా కోట కింద భర్తీ చేసే పోస్టుల విషయంలో ఈ క్రీడను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కల్పించారు. అలా ఆ జాబితాలో 4వ క్రీడగా బ్రిడ్జ్ క్రీడను చేర్చారు. వైసీపీ నేతలు ఇవేవీ గుర్తించకుండా అది పేకాటగా తేల్చేశారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అయితే ఏపీ ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. బ్రిడ్జ్ క్రీడాంశం పేకాట కాదని.. అది మేధో సంపత్తితో కూడుకున్న క్రీడ అని తేల్చింది. అసలు బ్రిడ్జ్ కోటా కింద ఏ ఒక్కరికి ఉపాధ్యాయ పోస్టు మంజూరు చేయలేదని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నెటిజెన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.

* వైసిపి ఆందోళనలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ 2025 పై ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. డీఎస్సీ ప్రశ్న పత్రం లీక్ చేశారని.. అవకతవకలు జరిగాయని.. నియామకాల్లో అడ్డగోలుగా వ్యవహరించారని.. వెబ్సైట్లో వివరాలను డిలీట్ చేశారని ఏవేవో ఆరోపణలు చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. కేవలం డిఎస్సీ అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి రాజకీయ మైలేజ్ పొందాలన్నది వారి ఆలోచన. ఉద్యోగాలు పొందిన 16 వేల కుటుంబాలు అయితే.. డీఎస్సీ పరీక్ష రాసిన వారు ఆరు లక్షల మందికి పైగా. అందుకే వారిలో గందరగోళం సృష్టించి పొలిటికల్ మైలేజీ పొందాలన్నది వైసిపి ఆలోచన. డీఎస్సీ 2025 పై క్రెడిట్ దక్కకుండా చేసేందుకు టిడిపి పై ఆడుతున్న గేమ్ గా తెలుస్తోంది.

ఒకే ఒక్కడు నరేంద్రమోడీ..నెహ్రూను దాటి దేశ చరిత్రలోనే సిసలైన నాయకుడు

Narendra Modi
Narendra Modi

Narendra Modi: మనదేశ చరిత్రలో సుదీర్ఘకాలం పాలించిన ప్రధానమంత్రిగా జవహార్ లాల్ నెహ్రూ అరుదైన ఘనత నెలకొల్పారు. ఆయన తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులుగా పని చేశారు. కానీ, నెహ్రూ స్థాయిని ఎవరూ అందుకోలేకపోయారు. ఇన్నాళ్లకు నెహ్రూ స్థాయిని మించి పోయారు దేశ ప్రధాని నరేంద్రమోడీ. ఈనెల పదవ తేదీతో నెహ్రూ రికార్డును నరేంద్రమోడీ నెలకొల్పనున్నారు.

ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ 4,399 రోజులలో అత్యంత ఎక్కువకాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తిగా నిలిచారు. మనదేశ ప్రధానిగా నెహ్రూ 4,398 రోజులు పని చేశారు. 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2014 మే 26న తొలిసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆయన అదేపదవిలో కొనసాగుతున్నారు.

2014లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్రమోడీ.. 2019 ఎన్నికల్లో బీజేపీ భారీగా సీట్లు సాధించడంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించడంతో బీజేపీ కి మిత్ర పక్షాల అవసరం పడింది. చంద్రబాబు, నితీష్ కుమార్ సహకారంతో కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఆర్థిక రంగంలో దూకూడు సాగించడం మొదలైంది. రోడ్ల నిర్మాణం, విమనాశ్రయాలు, ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు.. ఇలా ప్రతిరంగంలో దేశం దూసుకుపోతోంది. కాకపోతే మనదేశ కరెన్సీ విలువ పడిపోవడం ప్రధాని నరేంద్రమోడీ దూకుడుకు బ్రేక్ వేస్తోంది. ధరలు పెరగడం..ఇంకా అనేక రకాల అవరోధాలు ప్రధాని నరేంద్రమోడీకి ఇబ్బందికరంగా మారాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నపరిణామాలు కూడా దేశ ఆర్థిక ప్రగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. కాగా, ఈ సమస్యలను అధిగమించగలిగితే నరేంద్రమోడీకి తిరుగుండదు.

దౌత్య సంబంధాల ద్వారా దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు నరేంద్రమోడీ అడుగులు వేస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో యుద్ధం మొదలుకావడం.. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హార్మూజ్ జలసంధి నుంచి కాకుండా, ప్రత్యామ్నయంగా చమురు రవాణా చేసే విధంగా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చకుంటున్నది భారత్. ఒకవేళ ఇది కనుక కార్యరూపం దాల్చితే భారత్ మీద ఆర్థికంగా ఒత్తిడి తగ్గుతుంది. ఫారెక్స్ నిల్వలు పెరిగే అవకాశం ఉంది. నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాలు సత్వర ఫలితాలు వస్తే భారత్ కు ఆర్థికంగా సానుకూలంగా అడుగులు వేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

వారసుల ప్రకటనపై వైసీపీలో అసంతృప్తి జ్వాల!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వాతావరణం నడుస్తోంది. పార్టీలో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించుతామంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవడం లేదు. కానీ పార్టీలో వివాదాస్పద నేతలు మాత్రం తమ వారసులను ఇట్టే ప్రకటిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు సీనియర్లు. అంత వింతలా ఉందని చెబుతున్నారు. తమకు మాత్రం ఆంక్షలు విధించి.. బూతులు మాట్లాడే నేతలకు మాత్రం ఏంటి స్వేచ్ఛ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసుడిని ప్రకటించారు మరో మాజీ మంత్రి పేర్ని నాని. 2034 ఎన్నికల్లో కొడాలి నాని సోదరుడు కుమారుడు అర్జున్ గుడివాడ నుంచి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇదే కొడాలి నాని గత ఎన్నికలకు ముందు మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు కిట్టు పేరును ప్రకటించారు. అదే సమయంలో కొందరు సీనియర్లు అడిగితే మాత్రం జగన్ నో చెప్పారు. ఇప్పుడు తాజాగా కొడాలి నాని వారసుడు ప్రకటనతో సీనియర్లు రగిలిపోతున్నారు.

* సీనియర్లకు మొండి చేయి..
2024 ఎన్నికల్లో తమ వారసులను పోటీ చేయించాలని చూశారు చాలామంది నేతలు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాసు, తమ్మినేని సీతారాం.. ఇలా ఈ జాబితాలో చాలామంది నేతలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారికి మాత్రం తమ వారసులను బరిలో దించేందుకు అనుమతి ఇచ్చారు. అప్పట్లోనే సీనియర్లు మండిపడ్డారు. తాము క్రియాశీలకంగా ఉండగా వారసులను రాజకీయంగా యాక్టివ్ చేస్తాం అనుకుంటే అధినేత అనుమతి ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. లోలోపల బాధ పడిపోయారు.

* అలా ఎలా చేస్తారు?
ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నాని వారసుడిని ప్రకటించేశారు. అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా.. కనీసం అధినేతను సంప్రదించకుండా ఈ ప్రకటన చేయడం ఏంటనేది ఇప్పుడు వైసీపీ సీనియర్ల నుంచి వస్తున్న మాట. అసలు కొడాలి నాని గత రెండేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అక్కడ టిడిపి ఎమ్మెల్యే దూకుడుతో ఉన్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇప్పుడు వచ్చి ఆయన పోటీ చేస్తారు.. తరువాత వారి అన్న కుమారుడు పోటీ చేస్తాడు అంటూ ప్రకటన చేయడం ఏంటి అనేది వైసిపి సీనియర్ల నుంచి వినిపిస్తున్న మాట. పేర్ని నానికి ఉన్న స్వేచ్ఛ తమకు లేదా అని చాలామంది సీనియర్లు మండిపడుతున్నారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం లాంటి నేత అయితే.. తనను నియోజకవర్గ ఇన్చార్జి నుంచి తప్పించి జూనియర్ కు అప్పగించడం పై రుస రుసలాడుతున్నారు. ఆయన ఒక్కరే కాదు సీనియర్లంతా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొడాలి నాని వారసుడిని పేర్ని నాని ప్రకటించిన తర్వాత సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయ్యింది.

ఏపీకి ఉపద్రవమే.. బిగ్ అలెర్ట్!

Andhra Pradesh Weather
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather Alert: ఏపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు పిడుగులతో కూడిన వానలు కూడా కొనసాగుతున్నాయి. ఒకవైపు నైరుతీ రుతుపవనాల రాక ఆలస్యం అవుతుండగా.. ఇంకోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో చల్లటి వాతావరణం కూడా ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో అయితే 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అదే సమయంలో ఇంకొన్ని జిల్లాల్లో చిరుజల్లులతోపాటు ఉరుములతో కూడిన వాన పడుతోంది. ఈ పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సరైన వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.

* ఈరోజు ఎండల తీవ్రత..
ఈరోజు ఎండల తీవ్రత కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 46 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 79 మండలాల్లో వేడి గాలులు కొనసాగుతాయని చెప్పింది. ఏలూరు, పోలవరం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుంచి బయటకు రావద్దని సూచిస్తోంది. అయితే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.

* ఈ జిల్లాల్లో వర్షాలు..
మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. పిడుగులు పడతాయని కూడా హెచ్చరిస్తోంది. విద్యుత్ స్తంభాలు, చెట్లు కింద నిలబడకూడదని సూచిస్తోంది. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. ఈరోజు కూడా పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

ఇది ప్రపంచంలో ఎనిమిదో వింత.. ఎందుకంటే నియంత కిమ్ నవ్వాడహో

Kim Jong un
Kim Jong un

Kim Jong un: ప్రపంచంలో ఏడు వింతలుంటాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. తెలియని వింతలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఆ వింతలన్నీ లెక్కేస్తే వాటికి మించింది ఇది. దానిని ఎనిమిదో వింత జాబితాలో కూడా చేర్చవచ్చు. అలాగని అది ఈ జగత్తులో ఉన్నది కాదు, మనుషులు రూపొందించింది అంతకన్నా కాదు.. మరి ఆ వింత ఏంటంటే..

ప్రపంచంలో ఎనిమిదో వింతగా చెప్పాల్సింది మనిషి గురించి..అతడు మరెవరో కాదు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్. కిమ్ మాములు మనిషికాదు.. నియంత.. క్రూరుడు. వెనుకటి కాలంలో హిట్లర్ వంటి వాళ్లు ఉండేవారని..మనుషులను దారుణంగా చంపేవాడని మనం చదువుకున్నాం. కానీ, నేటి ఆధునిక కాలంలో హిట్లర్ ను మించిపోతున్నాడు కిమ్. దేశ ప్రజలకు నరకం చూపించుకుంటూ తాను స్వర్గ సుఖాలలో విహరిస్తున్నాడు.

కొరియాలో తను చెప్పిందే మాట. తను గీసిందే గీత. తన కట్టును మత్రమే దేశ ప్రజలుఅనుసరించాలి. తన ఫొటోలను ఇంట్లో పెట్టుకోవాలి. తనను మాత్రమే పూజించాలి. తనను మాత్రమే వారు ఆరాధించాలి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. తనకు నచ్చితే పక్కలోకి రావాలి. ఒకప్పుడు ఉత్తర కొరియా అనేది దేశం. కొంతకాలం నుంచి అది ఆయనకు సామ్రాజ్యం.

కిమ్ ఎప్పటికీ కోపంగానే ఉంటాడు. కనీసంనవ్వను కూడా నవ్వడు. ఎటువంటి హావాభావాలను ప్రదర్శించడు. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇదే వరస. ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిసినప్పుడు కూడా కిమ్ నవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు కిమ్ నవ్వాడు. తాను కూడా మనిషేనని, తనకు కూడా నవ్వు అనేదిఒకటి ఉంటుందని..తాను కూడా నవ్వగలనని..నవ్వితే అందంగా ఉంటానని అనుకున్నాడేమో.. అందుకే నవ్వడం మొదలు పెట్టాడు.

ఇటీవల ప్రతిష్టాత్మక ఏఎఫ్ సీ ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని నాగోహ్యాంగ్ ఫుట్ బాల్ క్లబ్ చరిత్ర నెలకొల్పింది. నార్త్ కొరియా చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీంతో ఆ జట్టు ప్లేయర్లను కిమ్ జోంగ్ అభినందించారు. అందరికీ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కిమ్ తో షేక్ హ్యాండ్ తీసుకున్న తర్వాత ప్లేయర్లు ఆనందంతో గంతులు వేశారు. ఇంకొంతమంది భావోద్వేగతంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. సౌత్ కొరియాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టోక్యో జట్టుపై ఉత్తర కొరియా విజయం సాధించింది.
image.png