Patanjali investment in Uttarandhra: ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. పెట్టుబడులను చాలా వేగంగా ఆకర్షిస్తోంది. సింగిల్ విండోలో అనుమతులు, భూ కేటాయింపులు కూడా జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు పతాంజలి సంస్థ ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తోంది. అది వచ్చిన మరుక్షణం తమ కార్యకలాపాలు మొదలు పెట్టాలని భావిస్తోంది. అదే జరిగితే ఉత్తరాంధ్రకు ఒక గేమ్ చేంజర్ గా నిలవనుంది పతాంజలి ఉత్పత్తుల సంస్థ.
దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల్లో..
దేశీయ ఆయుర్వేద ఉత్పత్తుల్లో పతాంజలి అగ్రగామిగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం పతాంజలి సంస్థ విన్నపం మేరకు విజయనగరం జిల్లా కొత్తవలసలో దాదాపు 171 ఎకరాల భూమిని కేటాయించింది. దాదాపు 370 కోట్ల రూపాయలతో పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తి సంస్థను ఏర్పాటు చేయాలని భావించింది. తద్వారా ప్రత్యక్షంగా రెండు వేల మందికి, పరోక్షంగా 20 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే అప్పట్లో ప్రతిపాదనల దశ దాటింది. కానీ ఇంతలో అధికారం మార్పిడి జరిగింది ఏపీలో. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతాంజలి ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు.
మరోసారి ప్రతిపాదనలు..
తాజాగా పతాంజలి మరోసారి తమ ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే కొత్తవలస ప్రతిపాదిత స్థలంలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పింది. ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు వస్తాయని భావిస్తోంది. 1000 కోట్ల రూపాయల వ్యయంతో ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు దిశగా అడుగులు వేస్తోంది పతాంజలి. ఆయుర్వేద వైద్యాన్ని మరింత అభివృద్ధి చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి అంశాలను మరింత అభివృద్ధి చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనులకు, సాధారణ రైతులకు సంబంధించిన పంటలకు గిట్టుబాటు కలిగే అవకాశం ఉంది. వేలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయన్నమాట.
















సీజ్‌ఫైర్ అంటే యుద్ధం ఆపడం కాదట.. ట్రంప్ కొత్త నిర్వచనం!
Trump new definition of ceasefire: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్–పాకిస్తాన్ మధ్య సీజ్‌ఫైర్ జరిగింది. దీంతో ఇరువైపులా యుద్ధం ఆగిపోయింది. కాంబోడియా, థాయ్‌లాండ్ మధ్య ఆలయం కోసం యుద్ధం జరిగింది. తర్వాత ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్ కుదిరింది. యుద్ధం ఆగింది. తాజాగా అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం జరిగింది. తర్వాత పాకిస్తాన్ చొరవతో సీజ్‌ఫైర్ కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే సీజ్‌ఫైర్ అంటే యుద్ధం ఆపడం కాదట. కొత్త నిర్వచనం చెప్పి మళ్లీ ఒక్కసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. డొనాల్డ్ ట్రంప్. సీజ్‌ఫైర్(కాల్పుల విరమణ) అంటే యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, కేవలం తీవ్రత తగ్గుతుంది అని ట్రంప్ వెల్లడించారు. దీంతో ఆయన శాంతి భావనను తన స్వంత శైలిలో మార్చేశారు.
ట్రంప్ చెప్పిన కొత్త నిర్వచనం ఏమిటి?
ఇటీవలి ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఒక రిపోర్టర్ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇలా అన్నారు. ‘‘ఆ ప్రాంతంలో సీజ్‌ఫైర్ అంటే పూర్తి విరామం కాదు. అది తక్కువ తీవ్రతతో కాల్పులు జరపడం.’’ఈ ఒక్క వాక్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సంప్రదాయకంగా ‘సీజ్‌ఫైర్’ అంటే కాల్పులు పూర్తిగా ఆగిపోవడం, శాంతి చర్చలు మొదలవడం అని అర్థం. కానీ ట్రంప్ దానిని ‘‘నియంత్రిత యుద్ధం’’గా మార్చేశారు.
ట్రంపును ఆటాడుకుంటున్న నెటిజన్లు..
ట్రంప్ చెప్పిన కొత్త నిర్వచనం సోషల్ మీడియా వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందించారు:‘‘ట్రంప్ ప్రకారం ప్రపంచంలో ఎక్కడా నిజమైన సీజ్‌ఫైర్ ఉండదు. రోజూ యుద్ధాలే ఉంటాయి, కేవలం తీవ్రత మారుతుంది.’’ అని కొందరు, ‘‘ఇకపై యుద్ధం అంటే ఏమిటి? సీజ్‌ఫైర్ అంటే ఏమిటి? రెండూ ఒకటే అని ట్రంప్ చెప్పేశారు.’’
‘‘శాంతి ప్రవచనాలు చేస్తూ యుద్ధాలు కొనసాగించడానికి కొత్త సాకు ఇచ్చారు.’’ అని మరికొందరు, కామెంట్ చేశారు.
ట్రంప్ వ్యాఖ్యల వెనుక రాజకీయం..
మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతల్లో ఒప్పందాలు జరిగినా, పూర్తి శాంతి సాధించడం చాలా కష్టం. రెండు వైపులా చిన్న చిన్న దాడులు, ఎదురుదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ దీనిని ‘‘తక్కువ తీవ్రత యుద్ధం’’గా అభివర్ణించి, దీన్ని సాధారణీకరించారు. ఈ వాదనలో కొంత వాస్తవం ఉంది. అనేక యుద్ధాలు (ఉక్రెయిన్, గాజా, సిరియా మొదలైనవి) పూర్తి ఆగకుండా తక్కువ తీవ్రతలోనే కొనసాగుతున్నాయి. కానీ దీన్ని అధికారికంగా ‘‘సీజ్‌ఫైర్’’ అని పిలవడం శాంతి ఆశలను బలహీనపరుస్తుంది. ఇది యుద్ధాన్ని సాధారణీకరించి, శాంతిని అసాధ్యం చేసే లాజిక్‌గా కనిపిస్తోంది.
సీజ్‌ఫైర్‌ను ‘‘తక్కువ తీవ్రత యుద్ధం’’గా నిర్వచించడం ద్వారా యుద్ధం శాశ్వతం కావడానికి మార్గం సుగమం చేస్తున్నట్లు అనిపిస్తుంది. నిజమైన శాంతి అంటే కాల్పులు పూర్తిగా ఆగడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారం. తక్కువ తీవ్రత కాల్పులు కేవలం ‘‘నియంత్రిత హింస’’ మాత్రమే. అది శాంతి కాదు. ట్రంప్ ఈ మాటలు చెప్పిన సమయం కూడా ముఖ్యం. ప్రపంచం ఇప్పటికే బహుళ యుద్ధాలతో అలసిపోయి ఉంది. ఇలాంటి సమయంలో నాయకులు శాంతికి కొత్త ఆశలు కల్పించాలి కానీ, కొత్త సాకులు ఇవ్వకూడదు. చివరికి ఒక ప్రశ్న మిగులుతుంది.