Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Twitter Talk: 'పెద్ది' మూవీ ట్విట్టర్ టాక్ ఇదే .. ప్రీమియర్ షోస్...

Peddi Movie Twitter Talk: ‘పెద్ది’ మూవీ ట్విట్టర్ టాక్ ఇదే .. ప్రీమియర్ షోస్ టాక్ కి రెగ్యులర్ షోస్ టాక్ కి చాలా తేడా ఉందిగా..

Peddi Movie Twitter Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. నిన్న రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి గ్రాండ్ గా ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్ నుండి సోషల్ మీడియా లో ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకి జేజేలు పలుకుతున్నారు. బుచ్చి బాబు కాస్త శ్రద్ద తీసుకొని ఉండుంటే బాగుండేది , […]

Peddi Movie Twitter Talk: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. నిన్న రాత్రి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి గ్రాండ్ గా ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్ నుండి సోషల్ మీడియా లో ఆడియన్స్ నుండి ఈ చిత్రానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనకి జేజేలు పలుకుతున్నారు. బుచ్చి బాబు కాస్త శ్రద్ద తీసుకొని ఉండుంటే బాగుండేది , రామ్ చరణ్ మాత్రం సింగిల్ హ్యాండ్ తో ఈ చిత్రాన్ని లాగేశాడు , రాబోయే రోజుల్లో ఆయనకు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అంటూ సోషల్ మీడియా లో ప్రీమియర్ షోస్ చూసిన వాళ్ళు కామెంట్స్ చేశారు. అయితే రెగ్యులర్ షోస్ మొదలు అయ్యేసరికి కాస్త టాక్ లో తేడా వచ్చింది. ఇలా గతం లో చాలా సినిమాలకు జరిగాయి , పెద్ది కి కూడా అదే జరిగింది.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయం లో ప్రీమియర్ షోస్ కి , రెగ్యులర్ షోస్ కి టాక్ చాలా తేడా గా ఉంది. ప్రీమియర్ షోస్ నుండి సెకండ్ హాఫ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ కి వేరే లెవెల్ లో ఊగిపోయారు. కానీ రెగ్యులర్ షోస్ మొదలయ్యేసరికి టాక్ మారిపోయింది. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని , సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఓవర్ అయ్యాయని , రామ్ చరణ్ కి అసలు కాళ్ళు కట్ చెయ్యాల్సిన అవసరమే లేదని , బుచ్చి బాబు రొటీన్ భిన్నం గా ప్రయత్నం చేసాడు కానీ , ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదని , మాస్ ఆడియన్స్ లో ఈ చిత్రం నిలబడడం కష్టమే అని అంటున్నారు. కానీ రామ్ చరణ్ నటన మీద మాత్రం ఆడియన్స్ నుండి రెస్పాన్స్ లో ఎలాంటి మార్పు లేదు.

ప్రీమియర్ షోస్ కి ఎలాంటి టాక్ అయితే చెప్పారో, రెగ్యులర్ షోస్ కి కూడా అదే రేంజ్ టాక్ చెప్పారు. ఈ సినిమాని రామ్ చరణ్ తన నటన తో నిలబెట్టేశాడని , ఈ చిత్రం నుండి ఎంత కలెక్షన్స్ వచ్చినా రామ్ చరణ్ నటన పుణ్యమే అని , డైరెక్టర్ బుచ్చి బాబు కాస్త కేరింగ్ తీసుకొని ఉండుంటే వెయ్యి కోట్ల బొమ్మ అని అంటున్నారు. మరి ఈ టాక్ తో ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ జాన్వీ కపూర్ పాత్రకు చిరాకు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి సంబంధించిన టాక్ కి సంబంధించిన ట్వీట్లు కొన్ని మీకోసం అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper