Homeక్రీడలుక్రికెట్‌Spin Bowling Weakness India: గింగిరాలు తిరిగే బంతులు.. టీమిండియా నేర్వాలి పాఠాలు..

Spin Bowling Weakness India: గింగిరాలు తిరిగే బంతులు.. టీమిండియా నేర్వాలి పాఠాలు..

Spin Bowling Weakness India: టెస్ట్ క్రికెట్లో మిగతా జట్లు వేరు.. టీమిండియా వేరు. ఆస్ట్రేలియా ప్రభంజనం మిగతా ఫార్మాట్లలో ఎదురులేకుండా సాగుతుంటే.. టీ మీడియా మాత్రం వైట్ బాల్ ఫార్మాట్లో దుమ్ము రేపేది. ప్రపంచ స్థాయి బౌలర్లు ముత్తయ్య మురళీధరన్.. షేన్ వార్న్ వంటి వారి బౌలింగ్ ను సైతం టీమ్ ఇండియా బ్యాటర్లు తుక్కుతుక్కు కొట్టేవారు. ప్రతి బంతికి బౌండర్ లైన్ దారి అంటూ చూపించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది టీమిండియా ప్లేయర్లు టి20 […]

Spin Bowling Weakness India: టెస్ట్ క్రికెట్లో మిగతా జట్లు వేరు.. టీమిండియా వేరు. ఆస్ట్రేలియా ప్రభంజనం మిగతా ఫార్మాట్లలో ఎదురులేకుండా సాగుతుంటే.. టీ మీడియా మాత్రం వైట్ బాల్ ఫార్మాట్లో దుమ్ము రేపేది. ప్రపంచ స్థాయి బౌలర్లు ముత్తయ్య మురళీధరన్.. షేన్ వార్న్ వంటి వారి బౌలింగ్ ను సైతం టీమ్ ఇండియా బ్యాటర్లు తుక్కుతుక్కు కొట్టేవారు. ప్రతి బంతికి బౌండర్ లైన్ దారి అంటూ చూపించేవారు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది టీమిండియా ప్లేయర్లు టి20 క్రికెటర్లుగా మారిపోయారు. నాటి సచిన్ లేడు. ద్రావిడ్ లేడు. ఐపీఎల్ లాంటి టోర్నీలు ఆడుతున్న ప్లేయర్లు మాత్రమే ఇప్పుడు టీమిండియా లో ఉన్నారు. అందువల్లే టీమిండియా వైట్ బాల్ ఫార్మాట్లో అదరగొట్టలేకపోతోంది. పైగా గతంలో రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ దాకా వెళ్లిన టీమిండియా.. గత సీజన్లో ఆ స్థాయి దాకా వెళ్ళలేకపోయింది. అంతేకాదు ఇప్పుడు డబ్ల్యూటీసి పాయింట్లు జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. దీనిని బట్టి టీమిండియా బ్యాటింగ్ ఎలా ఉందో.. ఆట తీరు ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోతున్నారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. న్యూజిలాండ్ నుంచి మొదలు పెడితే మొన్నటి ఆస్ట్రేలియా సిరీస్ ల వరకు టీమిండియా ఆటగాళ్లు స్పిన్ బౌలర్ల ఉచ్చులకు ఎలా చిక్కిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే మేనేజ్మెంట్ ప్రత్యేకంగా స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా శిక్షకుడిని నియమించింది. అతడు మరెవరో కాదు సాయిరాజు బహుతులే.

సాయి రాజ్ నియామకం వెనుక బీసీసీఐ గట్టి ప్లాన్ చేసింది. ఎందుకంటే ఇతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 630 వికెట్లు తీశాడు. అనేక రాష్ట్రాల క్రికెట్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించాడు. ఐపీఎల్ లో ఇతడు పంజాబ్.. రాజస్థాన్ జట్లకు సేవలందించాడు.. డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఆఫ్గనిస్తాన్ జట్టుతో ఒక టెస్ట్.. ఆ తర్వాత శ్రీలంక, న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. న్యూజిలాండ్, శ్రీలంక మైదానాలు స్పిన్ బౌలింగ్ కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. పైగా న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో భారత్ వైట్ వాష్ కు గురైంది. అందువల్లే బహుతులే ను మేనేజ్మెంట్ ప్రత్యేకంగా నియమించింది. అజిత్ అగర్కర్.. ఇతర ముఖ్యులు సమావేశమయ్యారు. టీమిండియా బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులను ప్రధానంగా చర్చించారు. బహుతులే కు బృహత్తరమైన బాధ్యతను అప్పగించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper