Home Blog Page 17

'రావు బహదూర్' చిత్రాన్ని వదులుకున్న యంగ్ హీరో అతనేనా..? చేసుంటే డిజాస్టర్ అయ్యేది..

Rao Bahadur
Rao Bahadur

Rao Bahadur: రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలై కాస్త ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ తెచ్చుకున్న చిత్రాల్లో ఒకటి ‘రావు బహదూర్’. టాక్ డివైడ్ గా వచ్చినప్పటికీ మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి డీసెంట్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. కానీ ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు లేవు , ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే , ఈ చిత్రం కేవలం యావరేజ్ రేంజ్ లోనే నిలిచేట్టు ఉంది. ఇకపోతే ఈ సినిమాలో హీరో సత్యదేవ్ ఎంత అద్భుతంగా నటించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు డైరెక్టర్ వెంకటేష్ మహా ని కాస్త బాగా తీసుంటే బాగుండేది అన్నారు కానీ , సత్యదేవ్ ని మాత్రం ఒక రేంజ్ లో పొగిడారు.

ఆయన నటనకు నేషనల్ అవార్డు ఇచ్చినా తక్కువే అని విమర్శకులు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ముందుగా సత్యదేవ్ తో చెయ్యాలని అనుకోలేదట. నేచురల్ స్టార్ నాని తో చెయ్యాలని అనుకున్నారట డైరెక్టర్ వెంకటేష్ మహా. నాని ని కలిసి స్టోరీ ని వివరించగానే , ఆయనకు కాన్సెప్ట్ నచ్చింది కానీ , సినిమాలో ఎక్కడో ఎదో మ్యాజిక్ మూమెంట్స్ మిస్ అవుతోంది, ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ లో ఉన్న మ్యాజిక్ ఈ స్క్రిప్ట్ లో లేదు , పైగా స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంది , ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎంత వరకు ఆదరిస్తారో తెలియదు , పైగా ఇప్పుడు మార్కెట్ ని పెంచుకునే సినిమాలు చేస్తున్న సమయంలో , ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదని నాని ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అనంతరం ఇది సత్యదేవ్ వద్దకు వెళ్ళింది.

నాని జడ్జిమెంట్ లో ఎలాంటి లోపం లేదని ఈ సినిమాని చూస్తే అర్థం అవుతోంది. ఒకవేళ నాని ఈ సినిమా చేసుంటే పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. ఎందుకంటే ఆయన మార్కెట్ కి భారీ గా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాని నాని చేసుంటే 20 కోట్ల షేర్ వసూళ్లు రావడం కూడా కష్టమే , కాబట్టి కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యేది. ఇప్పుడు ‘రావు బహదూర్’ చిత్రానికి విడుదలకు ముందు కేవలం 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బాక్స్ ఆఫీస్ నుండి ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే 40 శాతం రీకవరీ అయ్యింది అన్నమాట. ఫుల్ రన్ లో మరో 20 శాతం రీకవరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మరో రెండు రోజుల్లో లెనిన్ చిత్రం విడుదల కాబోతుంది , అత్యధిక శాతం థియేటర్స్ మొత్తం ఆ సినిమాకే వెళ్లనున్నాయి. దీంతో ‘రావు బహదూర్’ రన్ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.

'ఆచార్య' మూవీ సెట్స్ లో 'ఫౌజీ' మూవీ షూటింగ్.. పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Prabhas Fauji
Prabhas Fauji

Prabhas Fauji: ‘ఆచార్య’ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా పేరు తీస్తే అభిమానులు మహా పాపం లాగా భావిస్తుంటారు. వాళ్లకు ఆ స్థాయి పీడకల గా మారింది ఈ చిత్రం. అంతే కాకుండా అప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్న డైరెక్టర్ కొరటాల శివ సక్సెస్ స్ట్రీక్ కి కూడా ఈ సినిమా అడ్డుకట్ట వేసింది. రామ్ చరణ్ కి కూడా #RRR తర్వాత ఈ సినిమా ఒక చేదు అనుభవాన్ని మిగిలించింది. ఇలా ఇంతమందికి చేదు అనుభవాన్ని మిగిలించిన ఈ సినిమా , ఇతర చిత్రాలకు ఉపయోగపడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా సెట్స్ ని ఇంకా పీకేయలేదు. ఇప్పటికీ పెద్ద సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం ఈ మూవీ సెట్స్ ని వాడుకుంటూ ఉన్నారు. గతం లో ఇక్కడ ఎన్నో సినిమాల షూటింగ్స్ జరిపారు.

ఇప్పుడు లేటెస్ట్ గా ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ ఈ సెట్స్ లో జరగబోతోంది. ఈ నెల 10 నుండి సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు మేకర్స్. షూట్ కి వెళ్లే ముందు రిహార్సల్స్ నిర్వహిస్తారట. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరిన తర్వాత షూటింగ్ మొదలుపెడుతారట. సినిమాకు పెద్ద హైలైట్ గా నిలవబోతున్న ఈ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్ నేతృత్వం వహించనున్నారు. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ లో యాక్షన్, ఎలివేషన్ తో పాటు, ఎమోషన్స్ కూడా గట్టిగా ఉంటాయట. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ కెరీర్ లో బెస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి అని అడిగితే, కొంతమంది ఛత్రపతి అని చెప్పేవారు , మరికొంతమంది సలార్, మిర్చి , రెబల్, బాహుబలి 2 పేర్లు చెప్పేవారు , ఇక నుండి ‘ఫౌజీ’ పేరు చెప్తారట.

ఆ రేంజ్ లో ఈ సీక్వెన్స్ ని డైరెక్టర్ హను రాఘవపూడి డిజైన్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆ చిత్రానికి కాస్త గ్యాప్ ఇచ్చి ‘ఫౌజీ’ పై ఫోకస్ పెట్టనున్నారు. వచ్చే నెలాఖరు లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారం లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. ఒకవేళ డిసెంబర్ మిస్ అయితే , వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తారట. కానీ అదే సమ్మర్ కానుకగా ప్రభాస్ ‘స్పిరిట్ ‘ చిత్రం మార్చి 5 న విడుదల కాబోతుంది. మరి ఈ రెండు సినిమాల మధ్య ఎంత గ్యాప్ ఉండనుందో చూడాలి.

నెక్స్ట్ టార్గెట్ ప్రకాష్ రాజ్!

Prakash Raj
Prakash Raj

Prakash Raj: ఏపీలో నెక్స్ట్ టార్గెట్ నటుడు ప్రకాష్ రాజ్ అని తెలుస్తోంది. ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్టు జరిగింది. ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన చట్టపరమైన కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీంతో తెర వెనుక చాలా తతంగం జరిగినట్లు అర్థం అవుతోంది. అంతర్జాతీయ కుట్రగా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బిజెపి పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ జాతీయ స్థాయిలో సైతం భారతీయ జనతా పార్టీతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జోసెఫ్ రావణ్ కేసులు అడ్డంగా బుక్కయ్యారు. ఆయన వెనుక ఉండి స్క్రిప్ట్ అందించింది ప్రకాష్ రాజ్ అని స్పష్టంగా తెలుస్తోంది ఆడియోలో. మరోవైపు కర్ణాటక ధర్మస్థల వివాదంలో సైతం ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకాష్ రాజు విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

* కఠిన చట్టం కింద కేసులు..
ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్టు జరిగింది. ఆయనపై దేశద్రోహం, ఉపా చట్టం కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టు ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసులో త్వరలోనే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ తిరగబోతోందని ప్రచారం సాగుతోంది. జోసెఫ్ రావణ్ వెనుక ఉండి సహకారం అందిస్తున్న వారి విషయంలో పోలీసులు ప్రాథమికంగా ఒక దర్యాప్తు పూర్తి చేశారు. ఇందులో ప్రముఖంగా ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. ఆయనకు సంబంధించిన ఒక ఆడియో బయటకు వచ్చింది. జోసెఫ్ రావణ్ కు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ అందించింది ప్రకాష్ రాజ్ అని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తాజాగా ఈ కేసులో ప్రకాష్ రాజ్ కు నోటీసులు అందించేందుకు పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

* కేంద్రానికి ఇదే అవకాశం..
ప్రకాష్ రాజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇది అనుకోని అవకాశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అంతలా టార్గెట్ చేశారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ పేరుతో జాతీయస్థాయిలో సైతం చాలా అంశాలను ప్రస్తావిస్తూ బిజెపి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి బిజెపితో పొత్తు పెట్టుకున్నారన్న భావనతోనే టార్గెట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్. అంతకుముందు చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్ కు అండగా నిలబడింది మెగా ఫ్యామిలీ. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజును నిలబెట్టింది. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ పవన్ గురించి గొప్పగా చెప్పేవారు. అటువంటి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక బిజెపి కారణం. బిజెపి పై ఉన్న వ్యతిరేకతను పవన్ పై చూపించారు ప్రకాష్ రాజ్.

* జాతీయ స్థాయిలో కుట్ర..
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు కు అనుగుణంగా.. జాతీయస్థాయిలో సైతం మతవివాదాన్ని తెరపైకి తెచ్చేందుకు ఒక కుట్ర జరుగుతోందన్న అనుమానం కేంద్రంలో ఉంది. దీనిపై స్పష్టమైన సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జోసఫ్ రావణ్ పై దేశద్రోహం కేసు నమోదయింది. అయితే దేశస్థాయిలో మత విధ్వంశాలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉన్నందున.. జోసెఫ్ రావణు వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారన్న సమాచారంతోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

బలపడతున్న చైనా–పాక్‌ బంధం.. అమెరికా ఇండో–పసిఫిక్‌ వ్యూహానికి సవాల్‌

China Pakistan Relations
China Pakistan Relations

China Pakistan Relations: అమెరికాతో ఒకవైపు సత్సంబంధాలు కొనసాగిస్తున్న పాకిస్తాన్‌.. ఇదే సమయంలో అమెరికా బద్ధ శత్రువు అయిన చైనాతోనూ దోస్తానీ చేస్తోంది. డ్రాగన్‌ కంట్రీతో బంధం బలపర్చుకుంటోంది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, సీపీఈసీ వంటి సున్నితమైన అంశాలపై చైనా విధానాలకు ఇస్లామాబాద్‌ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. ఈ పొత్తు బలపడటంతో అమెరికా నేతృత్వంలోని ఇండో–పసిఫిక్‌ వ్యూహం, అలాగే వాషింగ్టన్‌–ఢిల్లీ మధ్య దీర్ఘకాలిక భాగస్వామ్యం ప్రభావితం అవుతున్నాయి.

ఉమ్మడి ప్రకటనలో కీలక సందేశాలు..
మే నెలలో చైనా పర్యటన సందర్భంగా పాకిస్తాన్‌ సైన్యాధ్యక్షుడు ఆసిమ్‌ మునీర్, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తో జరిగిన చర్చల తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటనలో బీజింగ్‌కు ఇస్లామాబాద్‌ పూర్తి మద్దతు వ్యక్తం చేసింది. ‘వన్‌ చైనా’ సూత్రానికి తన నిబద్ధతను గట్టిగా పునరుద్ఘాటించిన పాకిస్తాన్, తైవాన్‌ను చైనాలో విడదీయరాని భాగంగా అభివర్ణించింది. తైవాన్‌ స్వాతంత్య్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. షింజియాంగ్, టిబెట్, హాంకాంగ్, దక్షిణ చైనా సముద్రం వంటి అంశాలపై చైనా తీసుకుంటున్న వైఖరికి కూడా పూర్తి మద్దతు ఇచ్చింది.

అమెరికా వ్యూహానికి ఇబ్బంది..
అమెరికా ఇండో–పసిఫిక్‌ వ్యూహం ప్రాంతీయ స్థిరత్వం, నౌకాయాన స్వేచ్ఛ, బలాబలాల సమతుల్యత, తైవాన్‌పై బలవంతపు విలీనాన్ని నిరోధించడం వంటి లక్ష్యాలపై ఆధారపడి ఉంది. అయితే పాకిస్తాన్‌ చైనా వైపు మొగ్గు చూపడం ఈ వ్యూహానికి నేరుగా సవాల్‌గా మారుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ప్రతిపాదించిన ‘షేర్డ్‌ ఫ్యూచర్‌ ఫర్‌ హ్యుమానిటీ’, గ్లోబల్‌ డెవలప్‌మెంట్, గ్లోబల్‌ సెక్యూరిటీ, గ్లోబల్‌ సివిలైజేషన్, గ్లోబల్‌ గవర్నెన్స్‌ ఇనిషియేటివ్‌లకు పాకిస్తాన్‌ మద్దతు ఇస్తోంది. అమెరికా ఏకపక్ష చర్యలను పరోక్షంగా విమర్శించిన ఈ ప్రకటన, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫాసిజం, మిలిటరిజం పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని కూడా పిలుపిచ్చింది.

సీపీఈసీ, బీఆర్‌ఐలో సహకారం..
బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)లో భాగమైన చైనా–పాక్‌ ఆర్థిక నడవా (సీపీఈసీ) ప్రాజెక్టులో రెండు దేశాలు మరింత సహకారానికి సిద్ధంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ‘చిన్న, అందమైన’ ప్రాజెక్టులను మరింతగా చేపట్టాలని నిర్ణయించాయి. కశ్మీర్‌ విషయంలో చైనా పాకిస్తాన్‌ వైఖరిని సమర్థించడం, సరిహద్దు నదుల సహకారం గురించి చర్చించడం జరిగింది.

అమెరికా ఏం చేస్తుంది..
ఇటీవల ఢిల్లీకి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలంగా నొక్కి చెప్పారు. పాకిస్తాన్‌తో అమెరికా సంబంధాలు నిర్దిష్టమైన, తాత్కాలిక ప్రయోజనాల కోసమేనని, అవి భారత్‌తో ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక పొత్తుకు ఎలాంటి ఆటంకం కలిగించవని ఆయన స్పష్టం చేశారు. వివిధ దేశాలతో తాత్కాలికంగా కలిసి పని చేయడం సాధారణమేనని, కానీ ఇండియాతో ఉన్న సంబంధం ప్రత్యేకమైనదని రూబియో పేర్కొన్నారు.

పాకిస్తాన్‌ చైనా వైపు మొగ్గు చూపడంతో అమెరికా తన ఇండో–పసిఫిక్‌ వ్యూహాన్ని, ముఖ్యంగా తైవాన్‌ విషయంలో తన ప్రయోజనాలను జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాల్సి వస్తోంది. ఒకవైపు ట్రంప్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌ నేతలను ప్రశంసిస్తుండగా, మరోవైపు ఇస్లామాబాద్‌ బీజింగ్‌ ఆధిపత్య లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం వాషింగ్టన్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఈ పరిస్థితి భారత్‌తో అమెరికా వ్యూహాత్మక సంబంధాలను బలహీనపరచకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

సిందూ జలాల కోసం రంగంలోకి పాక్‌ ఆర్మీ.. భారత్‌ చూస్తూ ఊరుకుంటుందా?

Indus Waters Treat
Indus Waters Treat

Indus Waters Treaty: 2025 ఏప్రిల్‌ 22న కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. హిందువులు అని నిర్ధారించి మరీ కాల్పులు జరిపారు. ముస్లింలను వదిలేశారు. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. లష్కర్‌–ఎ–తయ్యబా ప్రాక్సీ సంస్థ అయిన రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఈ దాడికి బాధ్యత తీసుకుంది. భారత్‌ దీన్ని పాకిస్తాన్‌ మద్దతు ఉన్న ఉగ్రవాదంగా ఖండించింది.

దాడి తర్వాత భారత్‌ చర్యలు..
ఉగ్రదాడి తర్వాత రోజు (ఏప్రిల్‌ 23, 2025) భారత్‌ 1969లో జరిగిన సిందూ జలాల ఒప్పందాన్ని హోల్డ్‌లో పెట్టింది. రక్తం నీరు కలిసి పారవని, పాకిస్తాన్‌ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం నిలిపివేసేవరకు సిందూ నుంచి చుక్క నీరు కూడా పాకిస్తాన్‌ అవసరాలకు ఇవ్వమని స్పష్టం చేసింది. అటారీ–వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్థాన్‌ దౌత్యవేత్తలను బహిష్కరణ, దౌత్య సంబంధాలు తగ్గింపు వంటి చర్యలు కూడా తీసుకుంది.

సిందూ ఒప్పందం ఏమిటి..
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు (రవి, బియాస్, సట్లెజ్‌) భారత్‌కు, పశ్చిమ నదులు (ఇండస్, జీలం, చీనాబ్‌) పాకిస్థాన్‌కు ప్రాధాన్యత ఇచ్చాయి. ఉగ్రదాడి తర్వాత భారత్‌ డేటా షేరింగ్‌ ఆపేసింది. పశ్చిమ నదులపై డ్యాములు, హైడ్రో ప్రాజెక్టులు వేగంగా నిర్మించడానికి అవకాశం కల్పించింది. ఇది పాకిస్థాన్‌కు నీటి ప్రవాహంపై భారత్‌ నియంత్రణను పెంచుతుంది.

పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం..
ఈ నదులపై పాకిస్తాన్‌ వ్యవసాయంలో 80–90 శాతం ఆధారపడి ఉంది. హైడ్రోపవర్‌ ఉత్పత్తికి కూడా కీలకం. ఒప్పందం నిలిపివేత వల్ల ఖరీఫ్‌ పంటలకు నీటి కొరత ఏర్పడింది. కొన్ని నివేదికల ప్రకారం 13 శాతం వరకు నీటి లోటు నమోదైంది. వాతావరణ మార్పులతో పాటు ఈ పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తోంది.

రంగంలోకి సాకిస్తాన్‌ సైన్యం..
2026 జూలైలో జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ అధ్యక్షతన జరిగిన 276వ కార్ప్‌స్‌ కమాండర్ల సమావేశంలో సిందూ జలాలపై చర్చ జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజల ఆకాంక్షల మేరకు ఒప్పందం ప్రకారం తమ వాటా నీటిని సాధించడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. 2025 ఏప్రిల్‌ 24న జాతీయ భద్రతా కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలను పునరుద్ఘాటించింది. నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగా భావిస్తామని, ఇది జాతీయ భద్రతకు కీలకమని తెలిపింది. అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ నియంత్రిత ప్రాంతాల నుంచి ఉగ్రవాద బెదిరింపులపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

చుక్క కూడా వదలమన్న భారత్‌..
జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఇటీవల ‘‘భారత్‌ వాటాకు చెందిన ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్లకుండా చూస్తాం’’ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పని చేస్తున్నామని, 1.5 నుంచి 2 సంవత్సరాల్లో పూర్తి వినియోగం సాధ్యమవుతుందని, 2028 జూన్‌ నాటికి పూర్తి నిలిపివేత సాధించవచ్చని వ్యాఖ్యానించారు. ఈ చర్యను అక్రమం, యుద్ధ సమానమైనదిగా ఖండించింది. నీటిని ఆయుధంగా వాడకూడదని, ఇది ప్రాంతీయ శాంతికి ముప్పు అని హెచ్చరికలు చేసింది. కొందరు మంత్రులు యుద్ధం వరకు వెళ్లవచ్చని బెదిరింపులు చేశారు. సైన్యం నీటిని ‘‘రెడ్‌ లైన్‌’’గా ప్రకటించి, 24 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి ఇది కీలకమని నొక్కి చెప్పింది.

తాజా పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. భారత్‌ ఉగ్రవాద మద్దతు విరమణను ప్రధాన షరతుగా పెట్టగా, పాకిస్తాన్‌ నీటి హక్కును రక్షించడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తోంది.

సముద్రంలో పుట్టిన పులస.. గోదావరికి ఎందుకొస్తుంది.. పుస్తెలమ్మయినా కొనేది అందుకే..

Godavari Pulasa
Godavari Pulasa

Godavari Pulasa: వర్షాకాలం ప్రారంభంలో దేశంలో మిగతా ప్రాంతాలు ఒక ఎత్తు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి తీర ప్రాంతాలు మరొక ఎత్తు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో జరిగే చర్చ మొత్తం ఒక చేప చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ చేప వలకు పడిందా మత్స్యకారుల పంట పడినట్టే.. ఎందుకంటే దానికి ఉండే డిమాండ్ అలాంటిది. దానికోసం మహామహులు సైతం ఎదురుచూస్తుంటారు. దానిని తినాలని పరితపిస్తూ ఉంటారు. దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ లో పనులు జరగాలంటే ఈ చేపల కూర తీసుకెళ్తే సరిపోతుంది.. అనే టాక్ అప్పట్లో ఉండేది. దీనినిబట్టి ఆ చేపకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ చేప ట్యూనా కాదు.. అంతకుమించిన సొర కాదు.. కేజీ కి మించి బరువు పెరగని పులస.. పుస్తెలు అమ్మయినా సరే పులస కొనుగోలు చేయాలని ఉభయ గోదావరి జిల్లాలలో ఒక సామెత ఉంటుంది. ఎందుకంటే ఈ చేప రుచి అలా ఉంటుంది మరి. పులస సముద్రంలో పుడుతుంది. కాలక్రమంలో గోదావరి నదికి ఎదురు ఈదుతూ వస్తూ ఉంటుంది. సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది. గోదావరి నదిలో నీరు అత్యంత తీయగా ఉంటుంది. ఆ తీపి రుచి కోసం పులస గోదావరి నదికి వస్తూ ఉంటుంది. వర్షాలు కురిసేటప్పుడు గోదావరి నదిలోకి కొత్త నీరు వస్తుంది. ఆ నీరు మొత్తం ఎర్రగా ఉంటుంది. ఆ నీటికి ఎదురు ఈదుతూ వచ్చిన పులస సరికొత్తగా మారుతుంది. కొత్తనీరు అందులోను తీపి నీరు స్వీకరించడం వల్ల దాని శరీరం లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ చేప మాంసం ఆ స్థాయిలో రుచిగా ఉండడానికి కారణం కూడా అదే. గోదావరి నదికి ఎదురు ఈదుతూ వచ్చిన ఈ చేప ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది.

మత్స్యకారుల వలకు చిక్కిన తర్వాత పులసలను వేలం వేస్తూ ఉంటారు. వేలం 3000 నుంచి మొదలవుతుంది.. కొన్ని సందర్భాల్లో అది రికార్డు స్థాయికి చేరుకుంటుంది.. గరిష్టంగా 50,000 వరకు కూడా వెళ్తూ ఉంటుంది. గోదావరి నీరు వల్ల పులస చేప తన రూపును మార్చుకుంటుంది. అందువల్లే దాని మాంసానికి అంత రుచి ఉంటుంది. ఉభయగోదావరి జిల్లాలో పులస చేపను ప్రత్యేకంగా వండుతుంటారు. పచ్చి మామిడి లేదా బెండకాయలు వేసి.. చింతపులుసు.. ఇతర పదార్థాలు వేసి చేపల కూరను మరింత గొప్పగా వండుతారు. ఈ కాలంలో గోదావరి కొత్త నీరు వచ్చినప్పుడు పులస చేపలు విరివిగా పడుతూ ఉంటాయి. ఎండి పులస చేపలు పడినా సరే డిమాండ్ ఏ మాత్రం తగ్గదు.. పైగా ముందుగానే ఆర్డర్లు ఉంటాయి. కొన్ని సందర్భాలలో అమెరికా వంటి దేశాలకు కూడా పులస చేపను ఎగమతి చేస్తారు. పులస చేపలు వలలో పడితే మత్స్యకారుల పంట పండినట్లే. ఎందుకంటే దానికి ఉండే డిమాండ్ అటువంటిది మరి.

చివరికి ఫుట్ బాల్ నూ వదలని ట్రంప్.. ఇంతటి కంపు చేశాడు..

Donald Trump
Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు.. ప్రపంచం మీద పెత్తనం సాగించవచ్చు.. ఏదైనా చేయవచ్చు. ఎలాగైనా చేయవచ్చు. ఇరాన్ నుంచి మొదలు పెడితే ఇరాక్ వరకు.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెడితే అంటార్కిటికా వరకు ఏమైనా చేయవచ్చని నిరూపిస్తున్నాడు ట్రంప్..

ప్రపంచ రాజకీయాలలో వేలు పెడుతూ.. ప్రపంచ దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ట్రంప్ నిత్యం వార్తలోనే ఉంటాడు. యుద్ధాలు.. ఒప్పందాలు.. ఆంక్షలు.. పదాలు మాత్రమే మారుతాయి.. అమెరికా అధ్యక్షుడి వ్యవహార శైలి మారదు. మారితే అతడు అమెరికా అధ్యక్షుడు ఎందుకు అవుతాడు..

ప్రపంచ దేశాల మీదనే కాదు.. చివరికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసే ఫుట్ బాల్ మీద కూడా ట్రంప్ తన పెత్తనం సాగిస్తున్నాడు. ఏకంగా ఫుట్ బాల్ విధివిధాలను అతడు మార్చేశాడు. వాస్తవానికి ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు రిఫర్ తీసుకున్న నిర్ణయమే అంతిమమవుతుంది. ఒక్కసారి గనుక రిఫరీ రెడ్ కార్డ్ జారీ చేస్తే ఆటగాడు ఏం చేసినా సరే అవకాశం ఉండదు. కానీ ఈ నిబంధన మొత్తాన్ని ట్రంప్ మార్చేశాడు.

ఇటీవల బోస్నియో జట్టుతో జరిగిన మ్యాచ్లో అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఆటగాడు బలోగన్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడి యాంకిల్ తొక్కేశాడు. దీంతో రిఫరీ రెడ్ కార్డు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బలోగన్ బెల్జియం జట్టుతో జరిగే కీలక మ్యాచ్ కు దూరం కావలసి వచ్చింది. ఇది ట్రంప్ కు కోపం తెప్పించింది. వెంటనే ఫిఫా ప్రెసిడెంట్ జియాని కి ఫోన్ చేశాడు. అంతేకాదు అమెరికాకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చాడు. ట్రంప్ ఫోన్ చేయడంతో ఫిఫాల్ లీగల్ కమిటీ భయపడిపోయింది.

వెంటనే ఫిఫా డిసిప్లినరీ కోడ్ ఆర్టికల్ 27 ను తెరమీదకి తీసుకొచ్చింది. దీంతో బలోగన్ పై నిషేధం తొలగిపోయింది. అతడు ఆడేందుకు అవకాశం ఏర్పడింది. 1962 అనంతరం ఒక ఆటగాడి మీద రెడ్ కార్డు సస్పెన్షన్ వేటు ఎత్తేయడం ఇది మొదటిసారి. దీనిపై అంతర్జాతీయ ఫుట్బాల్ ప్రపంచం ఆశ్చర్య వ్యక్తం చేసింది. జూలై ఐదున ఫిఫా ఆఫీసులకు ఏప్రిల్ ఫూల్ డే వచ్చిందా అంటూ సెటైర్లు వేసింది. ఫిఫా నిర్ణయాన్ని యూరోపియన్ ఫుట్ బాల్ సమాఖ్య తీవ్రంగా తప్పు పట్టింది. ఇదేం క్రీడా స్ఫూర్తి అంటూ మండిపడింది.

వీ మిస్ యూ రోనాల్డో.. గుండె పలిగింది.. ఇలాంటి వీడ్కోలు కల్లో ఊహించలేదు..

Cristiano Ronaldo Retirement
Cristiano Ronaldo Retirement

Cristiano Ronaldo Retirement: ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఒక ఆటగాడికి ఇలాంటి వీడ్కోలు దక్కడం హృదయ విదారకం.. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే ఒక సువర్ణమైన ఆటగాడిగా.. అనితర సాధ్యమైన రికార్డులు సాధించిన యోధుడిగా పోర్చుగీసు జట్టు ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోకు పేరుంది. ప్రస్తుత ఫిఫా కప్ లో కూడా అతడు అదరగొట్టాడు. కానీ.. ఈసారి అదృష్టం అతడి వెంట లేదు. ఫలితంగా అతడు కన్న కలలు నెరవేరలేదు. అతడి జట్టు కీలక దశలో గెలవలేదు. ఫలితంగా సగటు ఫుట్ బాల్ అభిమాని గుండె పగిలింది. కన్నీరు మిగిలింది.

తన కెరియర్ చివరి ఫిఫా కప్ కావడంతో రోనాల్డో తన జట్టుకు ట్రోఫీ అందించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోవాలని అనుకున్నాడు. 41 సంవత్సరాల వయసులోనూ.. శరీరం సహకరించకపోయినప్పటికీ.. తన దేశం కోసం రోనాల్డో చివరిదాకా పోరాడాడు. కానీ ఆ కల సాకారం కాలేదు. నెరవేరని కలతో ఫుట్ బాల్ నుంచి నిష్క్రమించాడు.

రోనాల్డో మైదానంలో చిరుత పులి మాదిరిగా దూసుకుపోయేవాడు. తన పాదాలతో వేగంగా పరుగులు పెట్టేవాడు.. కాలంతో పోటీపడి తన జట్టుకు విజయాలు అందించాడు. అటువంటి రోనాల్డో తన కథను ముగించాడు. స్పెయిన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత.. కన్నీటి పర్యంతమయ్యాడు.

ఈ టోర్నీ ప్రారంభానికి ముందు.. నాకు ఇదే చివరి ఫిఫా కప్ అని రోనాల్డో ప్రకటించాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పటివరకు తన జట్టుకు విజయాలు అందించాడు. అతి కీలకమైన మ్యాచ్ లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో.. రోనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. మైదానంలోనే కూర్చొని భావోద్వేగానికి గురయ్యాడు.. ఈ మ్యాచ్లో స్పెయిన్ తరఫున మైకేల్ మెరీనో గోల్ కొట్టాడు. ఈ విజయం ద్వారా స్పెయిన్ ఏకంగా క్వార్టర్ ఫైనల్ దాకా వెళ్ళింది స్పెయిన్ 2010లో ప్రపంచ కప్ టైటిల్ అందుకుంది. దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆ జట్టు క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.

ఫుట్ బాల్ కు గుడ్ బై చెప్పడంతో రోనాల్డో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వీ మిస్ యు రోనాల్డో అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.. రోనాల్డో ఆధునిక ఫుట్బాల్ చరిత్రలో అత్యధికంగా అధికారిక గోల్స్ చేసిన ఆటగాడు. ఇతడి ఖాతాలో 900+ గోల్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా.. ఇటలీ.. ఇంగ్లాండ్.. స్పెయిన్ వంటి భిన్నమైన లీగ్లలో అతడు సత్తా చూపించాడు. భిన్నమైన పరిస్థితుల్లో అదరగొట్టాడు. యు ఎఫ్ ఎఫ్ చాంపియన్స్ లీగ్ టైటిళ్లను ఐదుసార్లు సొంతం చేసుకున్న చరిత్ర అతడిది. ఇతడిని ఛాంపియన్ లీగ్ చక్రవర్తి అని పిలుస్తుంటారు.

పోర్చుగల్ జట్టు కోసం యూఈఎఫ్ఏ యూరో 2016, యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ టైటిల్స్ అందించిన చరిత్ర ఇతడికి ఉంది.. ఇతడు కేవలం పోర్చుగల్ జట్టుకు మాత్రమే పరిమితమైన ఆటగాడు కాదు. ఎందుకంటే ఇతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతడు మైదానాన్ని వీడి వెళ్ళిపోతుంటే స్పెయిన్ అభిమానులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అది రొనాల్డో అంటే..

రామ్ చరణ్ ను కొట్టిన స్టార్ హీరో ఎవరు..?

Ram Charan
Ram Charan

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చాలా మంచి ఇమేజ్ ఉంది. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. ప్రేక్షకులు ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటారు. అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. రామ్ చరణ్ చిన్నతనంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అతని బాగోగులు చూసుకునేవారట. చిరంజీవి షూటింగ్ కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉండేవాడు.

కాబట్టి రామ్ చరణ్ ని తనే ఎత్తుకొని ఆడిస్తూ స్కూల్ కి కూడా తనే తీసుకెళ్లేవాడట. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్పిన హోంవర్క్ చేయకపోతే పవన్ కళ్యాణ్ తనని కొట్టారట. ఆ విషయాన్ని రామ్ చరణ్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.

నిజానికి పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ కి చాలా భయం అని చిన్నప్పుడు అంత భయపెట్టేవాడని ఒక ఇంటర్వ్యూలో ఫన్నీగా చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ విషయం మీద రామ్ చరణ్ ను కొట్టిన స్టార్ హీరో అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. నిజానికి వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది. చిరంజీవి షూటింగ్లో ఉండటం వల్ల ఇంట్లో పవన్ కళ్యాణ్ ఎక్కువసేపు ఉండటంతో రామ్ చరణ్ తో ఎక్కువ సేపు గడిపే అవకాశమైతే అతనికి దొరికింది.

అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పటికి రామ్ చరణ్ ను కొడుకుగా కంటే కూడా తనకి ఒక తమ్ముడిగా భావిస్తూ ఉంటాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ కుదరడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… వీళ్ళిద్దరు ఎప్పటికి ఇలానే ఉండాలని పవన్ కళ్యాణ్ అటు రాజకీయ రంగం లో రాణిస్తూనే అవకాశం దొరికినప్పుడు సినిమాలు చేస్తూ టాప్ పొజిషన్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నారు…

ఆ నలుగురితోనే జగన్ నిర్ణయాలు!

YS Jagan
YS Jagan

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. ఎటువంటి సూచనలు, అభిప్రాయాలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడం పై ఎక్కువమంది అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్ణయాల్లో కనీసం భాగస్వామ్యం కల్పించడం లేదు సీనియర్లకు. ఇప్పుడు కూడా ఆ నలుగురే అన్నట్టు పరిస్థితి ఉంది. ఇటీవల మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు రాజధాని విషయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది మొన్నటి ఎన్నికల్లో. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా.. పదే పదే దాని జోలికి వెళ్తూ అనవసరంగా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి పై సీనియర్లకు ఉన్న అభిప్రాయం. ఆపై కుల వివాదాలు కూడా ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర పార్టీపై పడుతోంది. ఇటీవల మతంపై, హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో సీనియర్లు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. ఇక ఉండలేం అని తేల్చి చెబుతున్నారు.

* రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు సైతం పనిచేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానం.. కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోవడం.. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం.. తదితర కారణాలతో జగన్ వెంట ఉండిపోయారు. అటువంటి వారు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ దానిని అచేతనంగా ఉంచేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మాదిరిగా వైసీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఒక్కసారిగా కూడా ఆ కమిటీ సమావేశం అయిన దాఖలాలు లేవు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో సీనియర్లను కలవడం తప్ప.. ఎప్పటికప్పుడు పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ అత్యున్నత కమిటీ సమావేశం కావడం లేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

* అత్యున్నత కమిటీ ఉన్న..
ప్రస్తుతం ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సభ్యులుగా తమ్మినేని సీతారాం, ముద్రగడ పద్మనాభం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి సీనియర్లు 33 మంది వరకు ఉన్నారు. కానీ ఒక్క నిర్ణయంలో కూడా ఈ కమిటీ భాగస్వామ్యం లేదు. ఇప్పటికీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఒకరిద్దరూ తప్ప.. మిగతా వారికి అస్సలు విధానపరమైన నిర్ణయాలు అస్సలు చోటు లేదు. దీంతో సీనియర్లంతా రగిలిపోతున్నారు. అటువంటప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో.. జనసేన సైతం అత్యున్నత కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ రెండు పార్టీల అధినేతలు సీనియర్ల అభిప్రాయాలను గౌరవించి.. వారి అభిప్రాయాలకు పెద్ద పీట వేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

ఆ 38 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులకు తగిన శాస్తి.. ఇన్నాళ్లకు అహ్మదాబాద్ మృతుల ఆత్మ కు శాంతి

Ahmedabad Bomb Blasts Verdict
Ahmedabad Bomb Blasts Verdict

Ahmedabad Bomb Blasts Verdict: అది మామూలు దారుణం కాదు. మాటలకందని విషాదం. కనీ విని ఎరుగని రక్తపాతం. అయిన వాళ్ళని కోల్పోయి.. ఆర్త నాదాలు పెడుతూ.. అహ్మదాబాద్ నగరం శోక సంద్రంలో మునిగిపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 56 మంది చనిపోయారు.. ఉగ్రవాదులు బాంబులు పేల్చివేసి అహ్మదాబాద్ నగరంలో నరమేధం సృష్టించారు. ఈ దారుణం భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం లాగా.. నెత్తుటి జ్ఞాపకంలాగా మిగిలిపోయింది.

ఈ వ్యవహారం అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఉగ్రవాద వ్యతిరేక బృందాలు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేశాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను పట్టుకున్నాయి. మొత్తం 49 మందిని దర్యాప్తు బృందం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనేక రకాలుగా దర్యాప్తు చేపట్టారు. కీలక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత న్యాయస్థానాలలో ఆధారాలను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.. అనేక దఫాలుగా విచారణ పూర్తయిన తర్వాత.. ఆ 49 మంది విషయంలో గుజరాత్ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సంచలన తీర్పును వెల్లడించింది.

2008 జూలై 26న అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు వరుసగా బాంబు పేలుళ్లు జరిపారు. ఈ దారుణంలో 56 మంది చనిపోయారు. రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. 70 నిమిషాల వ్యవధిలో ఏకంగా 21 బాంబులను పేల్చేశారు. ఈ దారుణం మాపని అని హర్కత్ ఉల్ అల్ ఇస్లామి అనే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ దీనికి బాధ్యత వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా గుజరాత్ కోర్టు కీలకతీర్పును వెల్లడించింది. 38 మందికి మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 11 మందికి జీవిత ఖైదు విధించింది.

ఆ 38 మంది దేశంలో దారుణానికి పాల్పడ్డారని.. అమాయకులను ప్రజలను చంపేశారని.. అటువంటి వ్యక్తులకు కనీసం బతికే హక్కు కూడాలేదని న్యాయస్థానం తన తీర్పులో ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాదు ఇటువంటి వ్యక్తులు సమాజానికి బద్ధ శత్రువులు అని పేర్కొంది. ఈ తీర్పుతో నాడు అహ్మదాబాద్ ఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని.. వారి బంధువులు పేర్కొంటున్నారు. కోర్టు తీర్పు అనంతరం వారు సంతృప్తి వ్యక్తం చేశారు. చనిపోయిన వాళ్లను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

లెనిన్ మూవీ మొదటి రోజు ఎంత కలెక్షన్స్ ను రాబట్టే అవకాశం ఉందంటే...

Lenin Movie Collections
Lenin Movie Collections

Lenin Movie First Day Collections: అక్కినేని నట వారసుడైన అఖిల్ హీరోగా లెనిన్ సినిమా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. మొత్తానికైతే ఈ సినిమాలో వాయిస్ ఓవర్ ఎన్టీఆర్ తో చెప్పిస్తున్నట్టుగా నిన్న అఫీషియల్ గా అఖిల్ సైతం ఫోటోలను రిలీజ్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద రోజు రోజుకి బజ్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుడిని మెప్పించే విధంగా ఈ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. తద్వారా ప్రేక్షకులు ఈ సినిమా నుంచి ఎలాంటి అంశాలను కోరుకుంటున్నారు.

ఈ మూవీ వాళ్ళను పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీకి వస్తున్న క్రేజ్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు దాదాపు 20 నుంచి 25 కోట్ల వరకు కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలైతే ఉన్నాయి…దానికి తగ్గట్టుగానే అఖిల్ ఇంతకుముందు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ ను సాధించలేదు. కాబట్టి ఆయన క్రేజ్ కొంతవరకు తగ్గింది.

ఇక ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకొని టాప్ లెవెల్ కి దూసుకుపోవాలని ఉద్దేశ్యంతో అతను ఉన్నట్టుగా తెలుస్తుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది మొదటి రోజు ఈ సినిమాకి వచ్చే టాక్ ను బట్టి డిసైడ్ అవుతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తుందా అఖిల్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోతాడా లేదా అనేది…

ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బెస్ట్ ఫ్రెండ్ సురేష్ ఒక్కడేనా.? ఇంతకీ సురేష్ ఎవరు..?

Jr NTR
Jr NTR

Jr NTR: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులంతా ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురుచూస్తూ ఉంటారు. వివి వినాయక్ దర్శకత్వంలో చేసిన ‘ఆది’ సినిమాతో మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన సింహాద్రి సినిమాతో బీ,సీ సెంటర్ లోని ఆడియన్స్ అందరిని తన ఫ్యాన్స్ గా మార్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏదో ఒక కారణం చేత ఆయన సినిమాలు ఆశించిన మేరకు విజయాలనైతే సాధించలేకపోతున్నాయి. ఇక తన తోటి హీరోలు ఇండస్ట్రీ హిట్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్న కూడా ఒక మోస్తరు సక్సెస్ గానే మారుతున్నాయి తప్ప ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం లేకుండా పోతుంది. ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఇలా మారుతున్నాయి ఆయన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు అన్నింటి విషయంలోనూ తను స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. నటనపరంగా కూడా ఆయన చాలావరకు మెలకువలను పాటిస్తూ ప్రతి క్యారెక్టర్ కి వేరియేషన్స్ ను చూపిస్తున్నాడు.

అయిన కూడా ఆయన టాప్ హీరోగా మారలేకపోతున్నాడు. నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకోవాలి అంటే వరుస సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ లను సాధించే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ కి చిన్నప్పటి నుంచి కూడా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవారట.

స్కూల్లో పరిచయమైన స్నేహితులతోనే తను ఎక్కువగా గడిపేవాడని చెబుతుంటారు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో రాజీవ్ కనకాలతో తను చాలా బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పటికి వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ ఇండస్ట్రీకి రాక ముందు నుంచి కూడా అతనికి సురేష్ అనే ఒక ఫ్రెండ్ అయితే ఉండేవాడట. చిన్నతనంలో తన స్కూల్ మెట్ కావడం వల్ల అతనితో తన విషయాలని షేర్ చేసుకునేవాడు.

కాలేజీలో చదువుకున్న రోజుల్లో కూడా అతను తన పక్కనే ఉండేవాడట. సురేష్ ఎప్పుడు ఫోటోలు దిగడానికి వీడియోల్లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడడు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన బిజినెస్ పనులను చూసుకుంటూ ఉండటం, ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనడం వల్ల వీళ్ళిద్దరికి ఎక్కువగా కలుసుకునే అవకాశామైతే రావడం లేదంటూ గతంలో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ ఒక ఈవెంట్లో చెప్పడం విశేషం…

ఏపీలో ఐదు రోజులు.. బిగ్ అలెర్ట్!

AP Rain Alert
AP Rain Alert

AP Rain Alert: వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఐదు రోజులపాటు వర్ష వాతావరణం ఉంటుందని తేల్చి చెప్పింది. ఏపీతోపాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు రెండు రాష్ట్రాల్లోనూ కొనసాగుతాయని చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేక వాతావరణ పరిస్థితులతో ఈ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఏపీకే కాదు తెలంగాణలో సైతం చాలా జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

* అల్పపీడన ప్రభావం..
ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో వర్షాలు కూడా పడ్డాయి. అయితే తీరం దాటిపోయింది అల్పపీడనం. బలహీనంగా కూడా మారింది. దీంతో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో ప్రధానంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈనెల 11 వరకు ఈ ఈదురుగాలుల తీవ్రత కొనసాగనుంది. బలమైన గాలుల వల్ల చెట్లు, స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటలపాటు ఏపీతోపాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఈ వర్షాలు కొనసాగనున్నాయి.
* ప్రధానంగా తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండనుంది.
* ఏపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యంలో సైతం ఈ వర్షాలు కొనసాగుతాయి. మిగిలిన జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమై.. అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఏపీ విపరీత నిర్వహణ సంస్థ ప్రత్యేక సూచనలు జారీ చేసింది.

కుల పోరాటాల వైపు వైసిపి మొగ్గు!

YSRCP
YSRCP

YSRCP Caste Politics: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల సమీకరణలకు తెరతీసింది. దూరమైన వర్గాలను దరిచేసుకునే పనిలో పడింది. ప్రధానంగా కాపులతోపాటు బీసీలపై ఫోకస్ పెట్టింది. గతంలో బీసీలకు రాజకీయంగా అగ్ర తాంబూలం ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తోంది. అదే సమయంలో కాపులు కూటమి వైపు వెళ్లారని భావించి.. వారిలో చీలిక తేవాలని చూస్తోంది. మొన్ననే గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇప్పుడు విశాఖలో సమావేశం కావాలని నిర్ణయించింది. రాష్ట్రస్థాయి కాపు నేతలంతా విధిగా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది.. సమావేశానికి పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్, జోగి రమేష్ హాజరయ్యారు. ఒకవైపు బీసీ, మరోవైపు కాపు సామాజిక వర్గాల ద్వారా పూర్వ వైభవం పొందాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

* విశాఖలో వైసీపీ కాపు నేతల సభ..
కాపు సామాజిక వర్గం విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు అనేది వైసిపి నుంచి వస్తున్న ఆరోపణ. మొన్నటి ఎన్నికల్లో కాపులు పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిని ఆదరించారని.. కానీ అదే కాపులకు అన్యాయం జరుగుతోంది అంటే పవన్ మాత్రం పట్టించుకోవడంలేదని వైసిపి ఆరోపించడం ప్రారంభించింది. ఇటీవల కాపుల అంశాల చుట్టూ రాజకీయాలు చేస్తూ.. కాపు నేతల ఆత్మీయ సమావేశాలు పెట్టాలని భావించింది. గోదావరి జిల్లాలో సభ జరిగింది. ఇప్పుడు విశాఖలో ఆ పార్టీ తలపెట్టింది కాపుల సభను. ప్రధానంగా విశాఖ, ఉభయగోదావరి, విజయనగరం జిల్లాలను టార్గెట్ చేసుకుంది వైసిపి. అక్కడ కాపుల్లో యూటర్న్ తీసుకురావాలన్నది ఆలోచన.

* బీసీ నినాదం..
మరోవైపు బీసీల సదస్సు కూడా జరపాలని నిర్ణయించింది. దానికి సన్నాహక సమావేశంగా తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు బీసీ నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన విషయాన్ని రాజమండ్రి మాజీ ఎంపీ భారత్ ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్యలో టిడిపి డిప్యూటీ సీఎం పదవి బీసీలకు ఇచ్చిందని.. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. అయితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అప్పట్లో వైసీపీ విధానం ఫెయిల్యూర్ అయింది. కానీ ఇప్పుడు ఒక వైపు కాపులు, మరోవైపు బీసీ నినాదాన్ని తీసుకొచ్చి పూర్వ వైభవం పొందాలన్నది వైసిపి వ్యూహంగా తెలుస్తోంది. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

ఓజీ 2 వల్ల నాని కి సుజిత్ కి గొడవ అయిందా..? అలా చేయడం కరెక్ట్ కాదు కదా...

Sujeeth And Nani
Sujeeth And Nani

Sujeeth And Nani: సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా గత సంవత్సరం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ లాంటి నటుడు నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ‘ఓజీ 2’ సినిమాని కూడా పట్టాలెక్కించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. తర్వాత ‘బ్లడీ రొమియో’ అంటూ నానితో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలను కూడా జరుపుకుంది. ఇక రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది అనుకున్న సందర్భంలోనే ఈ సినిమాని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా సమాచారమైతే అందింది.

ఇక ఇప్పుడు మళ్లీ ఓజీ 2 వెలుగులోకి రావడంతో నాని సుజిత్ తో బ్లడీ రొమిఒ సినిమా ఎప్పుడు చేద్దాం అని అడిగారట. దానికి సుజీత్ సరైన సమాధానం చెప్పలేకపోయాడట. కారణం ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డేట్స్ ఇస్తే ‘ఓజీ 2’ సినిమాని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు ‘బ్లడీ రోమియో’ సినిమాని ఎందుకు స్టార్ట్ చేసినట్టు అంటూ నాని సైతం సుజిత్ తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది.

దానికి సుజిత్ దగ్గర సమాధానం లేక మనం పక్క సినిమా చేద్దాం అన్న అని నానితో చెప్పారట. అయినప్పటికి నాని సంతృప్తిగా లేడని తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం నాని ప్యారడైజ్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చూపించుకోవాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే సుజీత్ తో బ్లడీ రొమియో అనే సినిమా చేస్తే సుజీత్ పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి ఆ ఇమేజ్ తన సినిమాకి బాగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే నాని ఆ సినిమాకు కమిట్ అయ్యాడు.

కానీ ప్రస్తుతం సుజీత్ తనకి హ్యాండ్ ఇవ్వడంతో నాని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నాని తన తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నాడు. సుజీత్ తో ఇప్పుడప్పుడే ‘బ్లడీ రోమియో’ సినిమా ఉండే అవకాశాలు లేవా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

బండ్ల గణేష్ కు భయపడుతున్న ప్రకాష్ రాజ్!

Bandla Ganesh vs Prakash Raj
Bandla Ganesh vs Prakash Raj

Bandla Ganesh vs Prakash Raj: పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడంలో ముందుంటారు ప్రకాష్ రాజ్. మరి ఆయనకు పవన్ కళ్యాణ్ పై కోపమో.. లేకుంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే వస్తే లాభమో.. తెలియదు కానీ అదే పనిగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్రశ్నిస్తాను అంటూ పెద్ద పెద్దగా ప్రశ్నలు వేస్తుంటారు. ప్రతిరోజు ఉదయం ఓ ట్వీట్ చేయడం.. అందులో పవన్ ని టార్గెట్ చేయడం.. ఇదో రొటీన్ కథగా మారిపోయింది. చివరకు అందరూ మరిచిపోయారు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై చేసే కామెంట్లను. పవన్ కళ్యాణ్ తప్పితే ప్రకాష్ రాజ్ కు మరొకరు దొరకరా అని వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ ఎలానూ ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడుతుంటారు. అయితే ఇప్పుడు బండ్ల గణేష్ డైరెక్టుగా లైన్లోకి వస్తున్నాడు. ప్రకాష్ రాజ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నాడు. బండ్ల ట్విట్టర్ తెరిస్తే.. అందులో సగానికి పైగా ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించినవే.

* ఇచ్చి పడేసిన బండ్లన్న..
బండ్ల గణేష్ ఈరోజు ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజును ఉద్దేశించి ఇంకా ట్వీట్ వేయలేదేంటి? డబ్బులు ముట్టలేదా? అకౌంట్ చెక్ చేసుకోలేదా? అంటూ కవ్విస్తూ మాట్లాడాడు. రాత్రి తాగడం.. పొద్దున్నే వాగడం అంటూ కౌంటర్ అటాచ్ చేశాడు. పనికిరాని పోస్టులు… పనికిరాని మాటలు.. పనికిరాని గొడవలు.. ఇదే నీ దినచర్య.. హాయిగా నీ పని నువ్వు చేసుకుని సంతోషంగా బతుకు.. అనవసరంగా ఇతరుల గురించి నోరు పారేసుకుని.. నీ విలువను నువ్వే తగ్గించుకోకు… అంటూ ట్విట్టర్ లో హితబోధ చేశాడు.

* గతంలో సైతం..
అయితే బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ విషయంలో ఇంత ఘాటుగా స్పందించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా కౌంటర్ అటాక్ చేశాడు. అయితే బండ్ల గణేష్ తనకు సరి జోడి కాదు అనుకున్నాడో.. లేకుంటే భయపడ్డాడో తెలియదు కానీ.. ఒక్కసారి కూడా బండ్ల గణేష్ కు సమాధానం చెప్పలేదు. కనీసం తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి కూడా చూడలేదు. బండ్ల గణేష్ దూకుడుగా ఉంటారు. ఆ దూకుడు తనం సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. రాజకీయాల్లో కూడా అదే దూకుడుతో వ్యవహరిస్తారు. అవసరం అనుకుంటే ప్రకాష్ రాజ్ జీవితాన్ని బయటకు పెట్టేస్తాడు గణేష్. అనవసరంగా ఆయన జోలికి వెళ్లడం ఏంటి? అనే ఆలోచనను తప్పకుండా చేస్తాడు.. అందుకే సమాధానం చెప్పలేదని నెటిజెన్లు సైతం భావిస్తున్నారు.