Home Blog Page 176

ఆర్కే కొత్త పలుకు: టిడిపి, జనసేన తెలంగాణకు దూరంగా ఉండటమే మంచిది

RK Kotha Paluku
RK Kotha Paluku

RK Kotha Paluku: చాలాకాలం తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేశారు. తనలో ఉన్న జర్నలిస్టును బయటకు తీసుకొచ్చారు. మార్మికంగా ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టే విధంగా రాశారు. ఫలితంగా ఈ ఆదివారం కొత్త పలుకు చాలామందికి గడ్డి పెట్టే విధంగా ఉంది. కొందరికి అయితే కర్రు కాల్చి వాతపెట్టినట్టుగా ఉంది.

కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాలలో మళ్ళీ ప్రాంతీయవాదం కనిపిస్తోంది. ఓ రాజకీయ విశ్లేషకుడి మాటలు.. అవి కాస్త వివాదాస్పదమైన తీరు.. దానికి తెలంగాణ సెంటిమెంట్ పూయడం.. ఇంకా రకరకాల విషయాలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి ఆ విశ్లేషకుడి మాటలకు కొంతమంది కావాలని తెలంగాణ వాదాన్ని పూశారు. జనసేన అధినేత పవన్ సరిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో సమావేశం పెట్టడం.. దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పడం.. కొంతమంది మంత్రులు స్థాయి దాటి పవన్ మీద విమర్శలు చేయడం వంటి పరిణామాలు జరిగిపోయాయి.

ఈ లోగానే కొంతమంది యూట్యూబర్లు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ కోడి చెరువును ఆక్రమించారని తెరపైకి వచ్చారు. వారి తర్వాత కల్వకుంట్ల కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన చెరువు శిఖాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇలా వరుసగా జరిగిపోతూనే ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఔత్సాహికులు మరింత రెచ్చిపోతున్నారు. తెలంగాణ సెటిల్మెంట్ విషయంలో మరింత అగ్గి రాజేస్తున్నారు. వారందరికీ రాధాకృష్ణ గట్టిగానే గడ్డి పెట్టారు. కాంగ్రెస్ నుంచి మొదలుపెడితే గులాబీ పార్టీ నాయకుల వరకు అందరికీ కర్రు కాల్చి వాతపెట్టారు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ ఈ స్థాయిలో రాసిన సంపాదకీయం లేదు.

తెలంగాణ ఏర్పాటును సిపిఎం వ్యతిరేకించింది. ఆ పార్టీకి నాగేశ్వర్ సానుభూతిపరుడు. అటువంటి నాగేశ్వర్ తెలంగాణ వాదుల సహకారం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోలేదు.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను కబ్జా చేశారు. నాడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పదేపదే ఈ స్థాయిలో విమర్శలు చేశారు.. కానీ ఈ నాటికి కూడా రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాదులకు టార్గెట్ గా లేరు.

కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతే అది గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో ఉన్నప్పటికీ అది బీఆర్ ఎస్ కు ప్రయోజనం కలిగిస్తుంది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారంటే.. దానివల్ల రేవంత్ రెడ్డి నష్టపోవడం గ్యారంటీ.

తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన ప్రవేశిస్తే ప్రతిఘటన ఉంటుందని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకోకపోవడమే మంచిది. అయితే ఇది కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారి సంస్థలకు తెలంగాణలో కాంట్రాక్టర్లు ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అలాంటప్పుడు ఆ కంపెనీలు వెళ్లిపోతే పనులు ఎవరు చేస్తారు

విదేశీ కంపెనీలకు భారీగా రాయితీలిచ్చి.. అన్ని రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆంధ్ర కంపెనీల మీద ద్వేషాన్ని ప్రదర్శించడం ఏంటి.. ఇక్కడ ఆంధ్ర కంపెనీలు పన్నులు చెల్లిస్తున్నాయి కదా

భారత రాష్ట్ర సమితి తమ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లను.. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది.. తెలంగాణ వాదులు దీనికోసం పోరాటం చేయాలి.. అనవసరంగా ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. దీనివల్ల లాభం కూడా ఉండదు

ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు సంపాదకీయ పరంపర. వాస్తవానికి ఈ స్థాయిలో ఏ పాత్రికేయుడు కూడా విశ్లేషణ చేయలేదు. న్యూట్రల్ గా రాసుకుంటూ రాలేదు. అందువల్లే రాధాకృష్ణ కొత్త పలుకు ఈ వారం మిస్సైల్ లాగా పేలింది.

ఈ రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం.. వ్యాపారులకు అపారమైన లాభాలు..

Today 7 June 2026 Horoscope
Today 7 June 2026 Horoscope

Today 7 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అపారమైన అవకాశాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యంగా ఉంటారు. గతంలో అనుకున్న కోరికల్లో ఒకటి నెరవేరుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల అండదండలు ఉండడంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల అండదండలతో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంతో ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారులకు మాత్రం ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. ఇదే సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యాలు ఎదురవుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ముఖ్యమైన సమాచారం అందుతుంది. లక్ష్మీదేవి అండదండలతో ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అంచనాలకు మించి లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులకు గురువుల అండదండలు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శుభవార్తను వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్తగా ఆస్తి కొనాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో కంటే ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సాఫీగా సాగుతుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. త్వరలో చేసే విహారయాత్రల కోసం ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు అధికారుల అండదండలతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా అనుకున్నది సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా ఉంటుంది. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు నిరుద్యోగులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రానికి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రీమియర్ షోస్ లో అత్యధిక గ్రాస్ ని రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇవే.. 'పెద్ది' ఏ స్థానంలో ఉందంటే..

Highest Grossing Premiere Shows
Highest Grossing Premiere Shows

Highest Grossing Premiere Shows: ఒకప్పుడు ప్రీమియర్ షోస్ అంటే కేవలం ఓవర్సీస్ లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఇండియా లో కూడా వచ్చేసింది. చిన్న సినిమా , పెద్ద సినిమా అని తేడా లేదు, ప్రతీ సినిమాకు ప్రీమియర్ షోస్ వేసేస్తున్నారు నిర్మాతలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రీమియర్ షోస్ ద్వారా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. ఈ ట్రెండ్ లో అందరూ ఊహించినట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ భారీ అంచనాల నడుమ గత ఏడాది విడుదలై ఎంతటి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇదే ఇప్పుడు నెంబర్ స్థానం లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాతి స్థానం లో ‘ధురంధర్ 2’ చిత్రం నిల్చింది. ‘ధురంధర్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడం తో ఈ చిత్రానికి హిందీ మార్కెట్ లోనే కాదు , సౌత్ మార్కెట్ లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ కారణం చేతనే ఈ చిత్రానికి మేకర్స్ ప్రీమియర్ షోస్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేశారు. ఓవర్సీస్ లో కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 61 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం రెండవ స్థానం లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం కొనసాగుతుంది. భారీ క్రేజ్ తో విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఆ తర్వాత నాల్గవ స్థానం లో లేటెస్ట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రం నిల్చింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ద్వారా 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో కాస్త తగ్గింది , లేదంటే ఈ చిత్రం 50 కోట్ల మార్కుని దాటి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక 5 వ స్థానం లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం కొనసాగుతుంది. ఈ చిత్రానికి దాదాపుగా 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చాయి. నైజాం ప్రాంతం లో ప్రీమియర్ షోస్ పడలేదు , లేదంటే ఈ చిత్రం కూడా 50 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఉండేది. ఇక ఆ తర్వాత ఆరవ స్థానం లో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం కొనసాగుతోంది.

రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా?

Rashmi Gautam photos
Rashmi Gautam photos

3వ రోజు అంచనాలను మించిపోయిన 'పెద్ది'.. ఇదేమి కుమ్ముడు సామీ.. కళ్ళు చెదిరిపోయే రేంజ్ గ్రాస్..

Peddi Box Office Collection
Peddi Box Office Collection

Peddi Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రోజురోజుకి అంచనాలను దాటి అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకువెళ్తోంది. ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ ని చూస్తుంటే తలపండిన ట్రేడ్ పండితులకు సైతం మతి పోతుంది. ఈ రేంజ్ గ్రాస్ ని ఒక పెద్ద హీరో సినిమాకు చూసి ఎన్ని రోజులైందో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. కరువు లో ఉన్న టాలీవుడ్ కి ‘పెద్ది’ ఇచ్చిన పెద్ద ధైర్యం సాధారణమైనది కాదు , ఇందుకే పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి కనీసం రెండు మూడైనా విడుదలైతే థియేటర్స్ ని మూసివేసే పరిస్థితి రాదనీ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ చిత్రానికి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 155 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 97 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక వీకెండ్ మొదలు అవ్వడం తో రామ్ చరణ్ ఉగ్ర రూపాన్ని దాల్చేశాడు . చిన్న సెంటర్, పెద్ద సెంటర్, మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అని తేడా లేదు, ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని సెంటర్స్ లో అయితే ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన గ్రాస్ వసూళ్లకంటే నేడు నమోదైన గ్రాస్ వసూళ్లు ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో బయ్యర్స్ అప్పుడే సేఫ్ జోన్ లోకి కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. రేపటి నుండి వచ్చే ప్రతీ పైసా లాభమే అనే సెంటర్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ చిత్రానికి నేడు నమోదైన గ్రాస్ వసూళ్లు చూస్తుంటే , ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి కనిపిస్తున్న ట్రెండ్ ని చూస్తుంటే నేడు 45 కోట్ల గ్రాస్ మార్కుని కచ్చితంగా ఈ చిత్రం రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అదే కనుక జరిగితే మూడు రోజుల్లో 200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది. రేపు కూడా ఇదే రేంజ్ గ్రాస్ ని నమోదు చేసుకుంటే తొలి వీకెండ్ లో 250 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాగా నిలుస్తుంది. మరోవైపు బలహీనంగా ఉన్నటువంటి ఓవర్సీస్ మార్కెట్ కూడా నేడు పుంజుకుంది. యావరేజ్ అనిపించుకుంటున్న నైజాం కూడా ఇరగకుమ్మేస్తోంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ నెంబర్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది. హిందీ మార్కెట్ కాస్త సహకరిస్తే ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల మార్కుని అవలీలగా daati ఉండేది , ప్రస్తుతానికి అయితే ఆ రేంజ్ వసూళ్లు కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

'వారణాసి' లో 'కుంభకర్ణుడు' తో యుద్ధం.. రాజమౌళి విజన్ కి దండం పెట్టాల్సిందే..

Varanasi Movie
Varanasi Movie

Varanasi Movie: అందరూ ఆలోచించే విధంగా రాజమౌళి ఆలోచించడు , అందుకే అతను రాజమౌళి అయ్యాడు. తన కొత్త రకమైన ఆలోచనకు తోడు , తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన రైటింగ్ తోడై , బాక్స్ ఆఫీస్ వద్ద వెండితెర అద్భుతాలు ఆవిష్కరింపబడుతూ ఉంటాయి. అలా ఆయన లేటెస్ట్ గా సృష్టిస్తున్న వెండితెర అద్భుతం ‘వారణాసి’. మనం ఎంతో పవిత్రం గా భావించే రామాయణం కి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని జోడించడమే కాకుండా, అద్భుతమైన ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ని కూడా కలిపి , ఇప్పటి వరకు ప్రపంచం లో ఎవ్వరూ చూడని సరికొత్త జానర్ సినిమాని చూపించబోతున్నాడు. ఇది రామాయణం కి సంబంధించిన స్టోరీ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. సాధారణంగా రామాయణం అంటే ఏమి చూపిస్తారు?, రాముడు , రావణుడి మధ్య పోరాటం , సీతని అపహరించుకొని వెళ్లడం, హనుమంతుడి విన్యాసాలు, వానరసైన్యం భీభత్సం ఇవే కదా చూపిస్తారు?.

కానీ మొట్టమొదటిసారి రామాయణం లో శ్రీ రాముడు , కుంభకర్ణుడి మధ్య జరిగిన భీకర పోరాటాన్ని వెండితెర పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. ఈ ఎపిసోడ్ సినిమాలో దాదాపుగా 30 నిమిషాల వరకు ఉంటుందట. రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉండే ఈ సీక్వెన్స్ ని ఆడియన్స్ తరతరాలుగా గుర్తించుకుంటారట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి , ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా , ఆగస్టు 9 న శ్రీరాముడి లుక్ లో ఉండే మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట రాజమౌళి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా బయటకు రానుంది.

ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా , మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఇక విలన్ గా మలయాళం టాప్ స్టార్ పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే , ఈ చిత్రం లో కుంభకర్ణుడు , హనుమంతుడు , లక్ష్మణుడు పాత్రలను ఎవరు చేస్తున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్నీ విదేశీ భాషల్లోనూ విడుదల కాబోతుంది . ఈసారి రాజమౌళి ఏకంగా హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు , ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

కమెడియన్ చమ్మక్ చంద్ర కి వీడియో కాల్ చేసిన జాన్వీ కపూర్.. చివరికి ఏమైందంటే..

Chammak Chandra
Chammak Chandra

Chammak Chandra: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , నేడు బడా పాన్ ఇండియన్ సినిమాల్లో కూడా నటించేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ షో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధానమైన కారణాల్లో చమ్మక్ చంద్ర కూడా ఒకడు. ఆయన స్కిట్స్ కి యూట్యూబ్ లో వందల మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. డిఫరెంట్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ చమ్మక్ చంద్ర లోని స్పెషల్ లక్షణాలు. ఇవే టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ని , హీరోలను ఆకర్షించింది. అందుకే ఆయనకు వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆయన ‘పెద్ది’ మూవీ లో నటించాడు. ఈ చిత్రం లో ఆయన హీరోయిన్ జాన్వీ కపూర్ కి అసిస్టెంట్ గా చేశాడు.

నటనలో స్కోప్ తక్కువే కానీ , ప్రేక్షకులు మాత్రం ఆయన గెటప్ ని ఎప్పటికీ మర్చిపోలేరు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే డైరెక్టర్ బుచ్చి బాబు హీరోయిన్ జాన్వీ కపూర్ మరియు చమ్మక్ చంద్ర మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒకరోజు మాకు చమ్మక్ చంద్ర అందుబాటులో లేడు, అదే రోజున జాన్వీ కపూర్, చంద్ర కాంబినేషన్ లో మేము షూట్ ప్లాన్ చేశాము. సినిమాలో హీరోయిన్ పాత్ర ఉన్నంత సేపు చంద్ర ఉంటాడు , అంత కీలకమైన పాత్ర డేట్స్ దొరక్కపోతే ఎలా అని భయపడ్డాము. జాన్వీ కపూర్ షూటింగ్ కోసం ఫోన్ చేస్తే, చంద్ర డేట్స్ దొరకలేదని చెప్పాము. అప్పుడు జాన్వీ నేరుగా చమ్మక్ చంద్ర కి వీడియో కాల్ చేసింది. ఏంటి చంద్ర డేట్స్ లేవని డైరెక్టర్ తో చెప్పావంట, ముందు నువ్వు షూటింగ్ కి వచ్చేయ్ అని అన్నిందట. ఆమె ఫోన్ చేసినప్పుడు నేను చొక్కా కూడా వేసుకోలేదని చమ్మక్ చంద్ర చెప్పాడు’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ బుచ్చి బాబు.

ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక పెద్ది విషయానికి వస్తే రోజు రోజుకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేస్తున్న వసూళ్లను చూస్తుంటే , ఈ చిత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రెండు రోజుల్లో దాదాపుగా 155 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 97 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి మరో 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి , మరి ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది చూడాలి.

నారా లోకేష్ ఫిదా..ఏంటీ స్బేర్ టెక్నాలజీ.. ఏపీలో అవకాశం ఉందా..

Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. అనేక రకాల ఒప్పందాలు కుదర్చుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి కంపెనీ ప్రతినిధులను కోరుతున్నారు. తిరుపతి సమీపంలో ఏకంగా స్పేస్ సిటీ ఏర్పాటుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రష్యా కంపెనీలను ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25000 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రష్యా కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోవడం లేదు.

రష్యాలో స్బేర్ సిటీ పేరుతో అత్యాధునిక సాంకేతిక నగరి ఒకటుంది. ఇది అమెరికా వల్ల కాలేదు. చైనా అందిపుచ్చుకోలేదు. జపాన్, కొరియా వల్ల కూడా ఇది సాధ్యం కాలేదు. రష్యాలో అమల్లో ఉన్న ఈ టెక్నాలజీ ఏపీలో అమలైతే గేమ్ ఛేంజర్ అవుతుంది. ఎందుకంటే ఆసియాలో ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ లేదు. రష్యాలో స్బేర్ సిటీ ని నిర్వహిస్తున్నారు.

స్బేర్ సిటీ లో వ్యాధి నిర్దారణ అత్యంత కచ్చితమైన విధానాలలో, అత్యాధునిక టెక్నాలజీతో చేస్తారు. దీని వల్ల వ్యాధి నిర్ధారణ అత్యంత కచ్చితంగా తెలుస్తుంది. దానికి చికిత్స ,వాడే మందులు కూడా అంతే కచ్చితత్వంతో ఉంటాయి. ఇది పూర్తిగా హెల్త్ కేర్, టెక్నాలజీ సమ్మిళితంతో నడుస్తూ ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిర్ధారణతో పాటు దాని తీవ్రత కూడా వెంటనే తెలిపోతోంది. అది రావడానికి గల కారణాలను తెలుసుకోవచ్చు. స్బేర్ టెక్నాలజీకి అనుసంధానంగా రష్యా పాఠశాలలు కూడా నిర్వహిస్తోంది. ఆ పాఠశాలలకు రష్యా స్కూల్ 21 అనే పేరు పెట్టింది. ఆ పాఠశాలలను కూడా నారా లోకేష్ సందర్శించారు.

స్బేర్ టెక్నాలజీని పరిశీలించిన లోకేష్ కు అక్కడి అధికారులు క్వాంటం టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇతర అంశాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటని కూడా లోకేష్ జాగ్రత్తగా పరిశీలించారు. ఇప్పటికే ఏపీలో గూగుల్ డేటా సెంటర్, క్వాంటంటెక్నాలజీ కేంద్రాలకు శంకుస్థాపన జరిగింది. త్వరలోనే ఏపీలో స్బేర్ టెక్నాలజీ ఏపీలో అంకురార్పణ కాబోతుంది. నారా లోకేష్ ఎక్స్ లో చేసిన పోస్ట్ దానినే బలపరుస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.

ఓడిపోయిన బాధలో ఉంటే.. ఆ పని చేయమన్నారు.. మమతా బెనర్జీ పార్టీలో లో సంక్షోభానికి ఇదా కారణం

Abhishek Banerjee
Abhishek Banerjee

Abhishek Banerjee: 15 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించారు. ప్రతిపక్షం అనేది లేకుండా తొక్కిపడేశారు. భౌతిక దాడులు చేయించారు. రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాని.. చెప్పుకోలేని పనులు కూడా చేయించారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉంటే.. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యవస్థీకృత శక్తి లాగా తయారయ్యాడు. షాడో ముఖ్యమంత్రిగా బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. శాంతిభద్రతల విషయంలో పదేపదే వేలు పెడుతూ బెంగాల్ రాష్ట్రాన్ని రావణ కాష్టం లాగా మార్చేశాడు.

ఎన్ని రకాల గొడవలు జరిగినా.. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా అభిషేక్ బెనర్జీని మమత వెనకేసుకొచ్చారు. అతడి కోసం పార్టీలో సీనియర్ నాయకుల రాజకీయ భవితవ్యాన్ని మమత బలి పెట్టారు. వారికి మంత్రి పదవులు ఇవ్వకుండా.. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా.. రకరకాల కేసులు పెట్టి వేధించారు. చివరికి వారంతా బయటకు రావడంతో మమత పీఠం కూలిపోయింది. 15 సంవత్సరాలుగా బెంగాల్ రాష్ట్రంలో ఆమె నిర్మించుకున్న సామ్రాజ్యం మొత్తం పడిపోయింది.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి ఓడిపోయిన తర్వాత.. ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. వాస్తవానికి 15 సంవత్సరాలపాటు బెంగాల్ రాష్ట్రంలో పరిపాలన సాగించిన టిఎంసి ఇలా మారిపోవడానికి అసలు కారణాన్ని ఆ పార్టీ తిరుగుబాటు నేత రిత బ్రత బెనర్జీ బయటపెట్టారు. అభిషేక్ బెనర్జీ వల్లే పార్టీలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

“మమతా బెనర్జీని మేము గౌరవిస్తున్నాం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అభిషేక్ పెత్తనం పెరిగిపోయింది. అతడి నాయకత్వాన్ని మేము ఒప్పుకోము. పార్టీ కోసం అతడు ఏమి చేయలేదు. కానీ అతడికి ఉన్నత స్థానాన్ని మమత ఇచ్చారు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల కోసం కాకుండా.. అభిషేక్ కోసం లేచి నిలబడి చప్పట్లు కొట్టాలని మమత మాకు చెప్పారు. అప్పటికే మేము ఓటమిలో ఉన్నాం. బాధలో ఉన్నాం. అది చాలా ఇబ్బంది కలిగించింది. పైగా ఆ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలతో సంతకాలు కూడా తీయించుకున్నారు. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేల పేర్లు రాసుకున్నారు. అవినీతి మా పార్టీలో పెరిగిపోయింది. దానిని తొక్కి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 61 ఎమ్మెల్యేలు మా చేతిలో ఉన్నారు.. భవిష్యత్ కాలంలో మరింతమంది మాతో చేతులు కలుపుతారు.. ఇక ముందు మీరు చాలా చూస్తారు అంటూ” రిత బ్రత బెనర్జీ ఆవేశంగా మాట్లాడారు.

కేవలం రిత బ్రత మాత్రమే కాకుండా, చాలామంది ఎమ్మెల్యేలు అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలి మీద ఆగ్రహంగా ఉన్నారు. సువేందు అధికారి కూడా అభిషేక్ బెనర్జీ వల్లే బయటికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఆయన బయటికి వెళ్లిపోయిన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో బిజెపి బలోపేతం అయింది. ఇప్పుడు ఏకంగా ఆయన బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.. అభిషేక్ బెనర్జీ ఐపాక్ లాంటి సంస్థ చేతిలో పార్టీని పెట్టడం వల్లే ఇటువంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న నేపథ్యంలో అభిషేక్ బెనర్జీని ఏం చేస్తారు.. మమత ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రేపు పులివెందుల లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. కారణం ఏంటంటే..

Pawan Kalyan Fans
Pawan Kalyan Fans

Pawan Kalyan Pulivendula Visit: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నాడు. ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే , మరోపక్క పార్టీ ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. జనవరి 10 నుండి వరుసగా జరగబోయే మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొని , పవర్ ఫుల్ ప్రసంగం ఇవ్వబోతున్నాడు. మరోపక్క ఆయన కొన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. అవి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల లో ఎప్పుడూ పర్యటించలేదు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో తన చివరి ఎన్నికల క్యాంపైన్ ని నిర్వహించాడు. ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ జగన్ ని పులివెందుల కి వెళ్లి టార్గెట్ చేయలేదు.

కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ పులివెందుల పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రేపు ఆయన పులివెందుల లో విస్తృతంగా పర్యటించబోతున్నారు. అక్కడ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడబోతున్నాడు అనే దానిపై అభిమానుల్లో , రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణ అంశం లో పవన్ కళ్యాణ్ పేరు రాజకీయాల్లో వేడి ని రేపాయి. తెలంగాణ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని టార్గెట్ చేస్తూ , ప్రతీ రోజు ఎవరో ఒకరు ప్రెస్ క్లబ్ లో మీడియా ముందుకొచ్చి , రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేస్తూ , పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ జనసేన పార్టీ నాయకులు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు.

ఇలాంటి సందర్భం లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పులివెందుల పర్యటన అంటే ఇక రాజకీయాల్లో ఏ రేంజ్ హీట్ వాతావరణం నెలకొంటుందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి రేపు ఆయన ఏమి మాట్లాడబోతున్నాడు అనేది. రేపటి నుండి ఒక వారం రోజుల వరకు వైసీపీ నాయకులూ పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడానికి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పర్యటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

అన్నామలై.. 14 లక్షలు.. తమిళనాడు రాజకీయాలు షేక్ అయిపోతున్నాయి

Annamalai
Annamalai

Annamalai: తమిళనాడు రాజకీయాలు షేక్ అయిపోతున్నాయి. మొన్నటిదాకా విజయ్ చుట్టూ తిరిగిన అక్కడి పాలిటిక్స్ ఇప్పుడు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి. అన్నామలై నామస్మరణ చేస్తున్నాయి. బిజెపి అతడిని సరిగా వాడుకోలేదు గాని.. అతడు బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన స్టామినా ఏమిటో నిరూపించుకుంటున్నాడు. దీంతో అధికార టీవీకే నేతలు.. మొన్నటిదాకా అన్నమలైతో స్నేహం చేసిన బిజెపి నేతలు సైలెంట్ అయిపోయారు. ఏం జరుగుతుందో చూస్తూ ఉండిపోతున్నారు.

బిజెపి నుంచి అన్నామలై బయటకు వచ్చారు. ఆయన రాజీనామా చేసిన కేవలం 24 గంటల్లోనే 14 లక్షల మందికి పైగా ప్రజలు చేతులు కలిపారు. ఆయన చేపట్టబోయే వుయ్ ది లీడర్స్ ఉద్యమంలో చేతులు కలుపుతామని ప్రతిజ్ఞ చేశారు.

అన్నామలై ఆన్లైన్ లింక్ we the leaders ను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో.. అది కాస్త సంచలనగా మారింది. ఈ కథనం రాసే సమయం వరకు అందులో 14 లక్షలకు పైగా ప్రజలు అందులో చేరారు. ఇప్పటికీ సభ్యత్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2020లో ఇదే పేరుతో ఆయన ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడితోనే అన్నామలై ఆగిపోవడం లేదు. తమిళనాడుకు పారిశ్రామిక రాజధానిగా పేరుపొందిన కోయంబత్తూరులో ఆయన మాజీ రాష్ట్రపతి కలాం పేరు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో నైతిక రాజకీయాలను పెంపొందించే దిశగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నామలై ఐపీసీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. దేశానికి సేవ చేయాలని.. తమిళనాడులో ద్రావిడ రాజకీయాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన బలంగా సంకల్పించుకున్నారు. కానీ బిజెపి అధిష్టానం ఆయన సేవలను సరిగా వాడుకోలేకపోయింది.. అన్నాడీఎంకేతో జతకలిసి అన్నమలైని దూరం పెట్టింది. దానిని తట్టుకోలేక ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు.. సామాన్యులకు తన పార్టీలో విస్తృతంగా అవకాశాలుంటాయని ఆయన ప్రకటించారు..

ప్రజలు నాయకుల వద్దకు కాకుండా.. నాయకులే ప్రజల వద్దకు వెళ్లే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు.. వంశపారంపర్య రాజకీయాలకు తమిళనాడును దూరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.. అదే దిశగా ప్రణాళికలు రూపొందించినట్టు.. త్వరలోనే పార్టీ ఏర్పాటు.. కార్యచరణ సిద్ధమవుతుందని అన్నామలై ప్రకటించారు. ఈ ప్రకారం చూసుకుంటే తమిళనాడు రాజకీయాలలో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

లక్ష కాక్రోచ్ ల మీద ఉక్కు పాదం.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే..

Cockroach Seizure Australia
Cockroach Seizure Australia

Cockroach Seizure Australia: మనదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు నిరసన చేపట్టింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేసింది. ఇది జరుగుతుండగానే.. ఓ సంఘటన చోటుచేసుకుంది. కాక్రోచ్ పార్టీకి అధికారిక సింబల్ అయిన బొద్దింకకు సంబంధించిన ఒక వార్త మీడియాలో వచ్చింది. అది కాస్త ఇప్పుడు చర్చకు దారి తీసింది.

మనదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తుంటే.. ఆస్ట్రేలియా అధికారులు బొద్దింకల మీద ఉక్కు పాదం మోపారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు.. ఆస్ట్రేలియాలో అక్రమంగా కొంతమంది బొద్దింకలను పెంచుతున్నారు.. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో ఒక వ్యాపారి వీటిని అక్రమంగా పెంచుతున్నట్టు ఇటీవల అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి బొద్దింకలను సీజ్ చేశారు. ఆ దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో బొద్దింకలను స్వాధీనం చేసుకోవడం తొలిసారి.

అధికారులు స్వాధీనం చేసుకున్న బొద్దింకలలో మడగాస్కర్ హిస్సింగ్, దూబియా జాతులకు చెందినవి ఉన్నాయి. ఇవి వన్యప్రాణులకు.. జీవ వైవిధ్యానికి హాని కలిగిస్తాయని ఆస్ట్రేలియా అధికారులు చెబుతున్నారు. వాటిని దిగుమతి చేసుకోవడం.. పెంచడం.. అమ్మడం ఆస్ట్రేలియా చట్టాలకు వ్యతిరేకమని అధికారులు చెప్పారు.

కాక్రోచ్ లు ఒకటిన్నర అంగుళం వరకు పెరుగుతుంటాయి.. మడగాస్కర్ హిస్సింగ్ మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధింక. ఒక్కొక్కటి 8 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఇది మనిషి వేలు కంటే పొడవుగా ఉంటుంది. పైగా దీని శరీరం గోధుమ వర్ణంలో ఉంటుంది.. అయితే వీటిని పాములు ఇతర సరి సృపాలకు ఆహారంగా వేస్తూ ఉంటారు.

ఈ బొద్దింకల వల్ల ఇతర జాతులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇవి రకరకాల వ్యాధులను కలగజేస్తుంటాయి. అందువల్ల వీటిని పెంచడాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధించింది. బొద్దింకలను పెంచుతున్నఆ వ్యాపారి పై అస్ట్రేలియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మనదేశంలో కాక్రోచ్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తుండగా, ఆసీస్ లో కాక్రోచ్ లను స్వాధీనం చేసుకోవడం, కేసులు నమోదు చేయడం నిజంగా విశేషమే.

నారా లోకేష్ తీర్చిదిద్దిన కడప ఇది.. రెండు కళ్ళూ కాదు, వైసిపి వాళ్లకు వేయి కళ్ళు కావాలి..

Nara Lokesh Kadapa Vision
Nara Lokesh Kadapa Vision

Nara Lokesh Kadapa Vision: “విజన్ ఉన్నవాడు ఏదైనా చేస్తాడు. భవిష్యత్తును ముందుగానే ఊహించి అడుగులు వేస్తాడు.. అతడు రావడం ఆలస్యం కావచ్చు. ఒక్కసారి వచ్చాడా మార్పు చూస్తుండగానే మొదలవుతుంది. అది చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. విజన్ లేని వాడు బటన్ నొక్కుతాడు. కేవలం పంచుడు పథకాలు మాత్రమే అమలు చేస్తాడు. సొంత జిల్లాను కూడా పట్టించుకోడు.. అటువంటి వాళ్లకు.. విజన్ ఉన్న వాళ్లకు చాలా తేడా ఉంటుంది..” ఇదిగో ఇలా సాగిపోతున్నాయి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు.

కడప జిల్లాలో విస్తృతమైన వనరులు ఉన్నాయి. వాటన్నిటికీ మించి మానవ వనరులు అధికంగా ఉన్నాయి. చదువుకున్న యువత ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. కానీ వాళ్లకు సరైన అవకాశాలు లేవు. అవకాశాల కోసం పక్కనే ఉన్న బెంగళూరుకు వెళ్ళిపోతున్నారు. ఇంకా కొందరు ముంబై.. హైదరాబాద్ లో స్థిరపడుతున్నారు. పండగలప్పుడు.. ఫంక్షన్లకు మాత్రమే కడప వస్తున్నారు. సొంత ఊరికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. వస్తున్నప్పుడు ఎంత ఆనందంతో అయితే ఉంటున్నారో.. వెళ్తున్నప్పుడు ఉన్న ఊరు జ్ఞాపకాలను తలుచుకుని బాధతో వెళ్లిపోతున్నారు.

ఇకపై కడప యువతకు అటువంటి బాధ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కడప రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోంది. 2024 ఎన్నికల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థి రెడ్డప్ప గారి మాధవి విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యంగా కడప మీద ఫోకస్ పెట్టారు. కడపలో ఇప్పటివరకు సున్నపు రాళ్లను చెర బట్టి.. దోచుకున్న వాళ్లు.. తరతరాలుగా ఇక్కడ హత్య రాజకీయాలు చేసిన వారు.. మనుషులను కేవలం అవసరాలకు మాత్రమే వాడుకున్నారు. కానీ నారా లోకేష్ మాత్రం మనుషులకు అపర్చునిటీస్ కల్పించడం మొదలు పెట్టారు.

కడప జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా ఆయన ఒక ఆలోచన చేశారు. అది కాస్త ఇప్పుడు ఇక్కడికి యువతకు బలమైన ఆశను కల్పిస్తోంది. అది మరేంటో కాదు స్టార్టప్ కడప. ఈ భవనం పూర్తి కావచ్చింది. “కడపలో యువత సరికొత్త ఆలోచనలకు.. సరికొత్త ఆవిష్కరణలకు ఇది వేదికగా మారబోతోంది. చంద్రబాబు నాయుడు ముందుచూపు.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి చొరవతో కూటమి ప్రభుత్వం కడప ను ఐటి హబ్ గా మార్చుతోందని” కడప ఎమ్మెల్యే మాధవి ట్విట్టర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. దానిని నారా లోకేష్ రీ ట్వీట్ చేశారు. అంతేకాదు, హత్యా రాజకీయాలతో ఇన్నాళ్ళ వరకు అట్టుడికి పోయిన కడపను ఎలా మార్చుతామో జస్ట్ రెండు ముక్కల్లో చెప్పేశారు నారా లోకేష్. ఈ ప్రకారం చూసుకుంటే కడప ఇకపై వేరే విధంగా మారబోతోంది. సింపుల్గా చెప్పాలంటే ఐటీ సిటీగా రూపాంతరం చెందబోతోంది. అప్పుడు ఇక్కడ యువత బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదు. ముంబై వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఉన్న ఊర్లో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతకచ్చు. చుట్టపు చూపుగా రావాల్సిన కర్మ లేదు. చుట్టాల్లోనే కలిసిపోయి దర్జాగా ఉండవచ్చు.

సుకుమార్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

Ram Charan Next Movie
Ram Charan Next Movie

Ram Charan Next Movie: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఒకరిని మించి మరొకరు సక్సెస్ లను సాధిస్తుంటే వాళ్లకంటే మనం కొత్తగా ఏం చేయాలి అని ఒక నటుడు విపరీతమైన ఆవేదన పడుతుంటాడు. వారసత్వపరంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో వాళ్ల మనుగడను కొనసాగించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు వారసత్వంగా వచ్చిన వాళ్ళకంటూ ఒక టాలెంట్ లేకపోతే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టమవుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సైతం చిరంజీవి కొడుకుగా వచ్చినప్పటికి ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన పెద్ది సినిమాతో సైతం మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్లో ‘రంగస్థలం’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేసింది. అలాంటి కాంబినేషన్ లో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందనేది మెగా అభిమానుల్లో చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇంకెవరితో సినిమా చేయబోతున్నాడు అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాను చేయాలని చూస్తున్నాడట. టెక్నికల్గా స్ట్రాంగ్ గా ఉండే దర్శకులైతేనే అతనికి బెస్ట్ అని అనుకుంటున్నాడట. ఇక ఈ రకంగా చూసుకుంటే తర్వాత సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేసే అవకాశాలైతే ఉన్నాయి.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడట. ఆ సినిమా ముగిసిన తర్వాత రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు పట్టలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…

ప్రొడ్యూసర్ గా మారుతున్న జూనియర్ ఎన్టీఆర్... మొదటి మూవీ ఆ డైరెక్టర్ తోనేనా..?

Junior NTR Producer

Junior NTR Producer: తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచిన వాళ్ళలో నందమూరి తారక రామారావు గారు మొదటి స్థానం లో ఉంటాడు. ఆయన తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక నందమూరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ముందుకు దూసుకెళుతున్న వారిలో బాలయ్య బాబు మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరో గానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి తన లక్కును పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం చాలామంది హీరోలు పాన్ ఇండియాలో సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను స్టార్ట్ చేసి తెలుగులో కూడా సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్న ప్రదీప్ రంగనాథన్ ను హీరోగా, దర్శకుడుగా పెట్టి ఎన్టీఆర్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికి సంబంధించిన కథ చర్చలను కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా మంచి డిసిజన్ తీసుకున్నాడు.

ఎందుకంటే ఆయన బ్యానర్ ద్వారా మరి కొంతమంది కొత్త దర్శకులకు కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా హీరోగా రాణించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ గా ఏ మేరకు రాణిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ ను సాధించినా కూడా జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ ను స్టార్ట్ చేసిన చాలా తక్కువ సమయం టాప్ హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. కాబట్టి అటు హీరోగా తన ఇమేజ్ ను కాపాడుకుంటూనే ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు…

అకౌంట్ లో ఊహించని నగదు.. ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే

Mumbai auto driver honesty
Mumbai auto driver honesty

Mumbai auto driver honesty: నీతి అనేది లేదు. నిజాయితీ అనేది కనిపించడం లేదు. పాప భీతి మనుషుల్లో మచ్చుకైనా అగుపించడం లేదు. అందువల్లే రోజులు ఇలా మారిపోతున్నాయి. సాటి మనిషి మీద నమ్మకం కోల్పోయిన దుర్ధినాలు దాపురించాయి. ఇలాంటి రోజుల్లో కూడా నిజాయితీగా ఉండేవారు ఉన్నారు. కాకపోతే వారు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఈ కథనంలో మన చెప్పుకునే ఆ వ్యక్తి కూడా అటువంటి వాడే.

మనది కాని డబ్బు ఖాతాలో పడితే ఎలా ఉంటుంది.. మిగతా వాళ్ళకి ఏమో గాని ఇతడికి మాత్రం ఆ డబ్బు పాములాగా అనిపించింది. ఎందుకంటే పరుల సొమ్మును పాము లాగానే భావించాలని పెద్దలు చెప్పేవారు. ఇతడు కూడా అదే విధంగా అనుకున్నాడు. మరో మాటకు తావు లేకుండా అలా వచ్చిన సొమ్మును వెంటనే అలానే పంపించాడు. తన నిజాయితీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాడు.

ఇటీవల మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో శుభం అనే వ్యక్తి ఆటోలో ప్రయాణించాడు. దీనికిగాను అతడు 156 రూపాయలు చార్జి చెల్లించాల్సి ఉంది. అయితే 156 రూపాయలకు గాను 15,682 బదిలీ చేశాడు. ఆ తర్వాత శుభం తన దారిన తాను వెళ్లిపోయాడు. వెంటనే తను చేసిన తప్పును గుర్తించి శుభం ఎక్కడైతే దిగాడో అక్కడికి వచ్చాడు. అక్కడే డ్రైవర్ అల్తాఫ్ ఉన్నాడు. జరిగిన విషయాన్ని శుభం చెప్పాడు.

వెంటనే ఆల్తాఫ్ ఆ డబ్బును తిరిగి పంపించాడు. డ్రైవర్ నిజాయితీ తనను కదిలించిందని శుభం చెప్పాడు. అంతేకాదు ఆ డబ్బులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా 500 ఇవ్వబోతే ఆటో డ్రైవర్ తీసుకోలేదని.. బలవంతంగా అతను జేబులో పెట్టి వచ్చారని శుభం పేర్కొన్నాడు. అతడు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. అది కాస్త ఇప్పుడు విపరీతమైన చర్చకు దారితీస్తోంది.

“నిజాయితీ అనేది మనుషుల్లో ఉంది. కాకపోతే తగ్గిపోయింది. ఈ ఆటో డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ సొమ్ము తనది కాదని తెలిసిన వెంటనే తిరిగి పంపించాడు. చాలామంది ఇలా చేయరు. ఎందుకంటే ఒకసారి ఆయాచితంగా డబ్బులు ఖాతాలో పడితే ఎవరు కూడా ఇవ్వడానికి ఒప్పుకోరు. కానీ ఇతడు మనుషుల్లో ఉన్న మాణిక్యం అంటూ” సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

చండీగఢ్ టెస్ట్ అనుకున్నట్టుగానే.. తొలి రోజు టీమిండియా ఎంత కొట్టింది అంటే

Chandigarh Test Day 1 India score
Chandigarh Test Day 1 India score

Chandigarh Test Day 1 India score: అనుకున్నట్టుగానే చండీగఢ్ టెస్ట్ సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూసుకుపోతోంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండడంతో టీమ్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న ఈ టెస్ట్ లో భారీ విజయాన్ని సాధించాల్సి ఉంది. దానిని మనసులో పెట్టుకున్న భారత బ్యాటర్లు దూకుడుగా పరుగులు సాధిస్తున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

ఓపెనర్ కేఎల్ రాహుల్ (100), సాయి సుదర్శన్ (81) కదం తొక్కితే.. కెప్టెన్ గిల్ (103*), రిషబ్ పంత్ (50*) సత్తా చూపించారు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. రెండో రోజు కూడా ఇదే జోరు కొనసాగించి ప్రత్యర్థి జట్టు మీద మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తోంది. టీమిండియా ప్లేయర్లు తమకు లభించిన జీవధానాలను సద్వినియోగం చేసుకోవడంతో.. భారీ స్కోర్ సాధ్యమైంది.

కొంతకాలంగా తెలుపు రంగు బంతిలో మాత్రమే భారత ఆటగాళ్లు మ్యాచులు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్ బాల్ ఫార్మాట్ లో సెట్ అవ్వడానికి టైం తీసుకుంటారని అభిమానులు అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండా టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగానే బ్యాటింగ్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ లోపాలను సద్వినియోగం చేసుకొని పరుగులు రాబట్టారు. జైస్వాల్ (24) మినహా మిగతా బ్యాటర్లు మాత్రం దుమ్మురేపారు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ చేయగలిగింది.

ఈ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. పైగా ఐపీఎల్ సాగుతున్నప్పుడు బ్యాటర్లకు స్వర్గధామంగా ఈ మైదానం ఉంది. అయితే భారత బ్యాటర్లు మాత్రం ఆఫ్గనిస్తాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆఫ్ఘనిస్తాన్ లో రషీద్ ఖాన్ లేకపోవడంతో.. ఆ లోటు స్పష్టంగా కనిపించింది. బౌలర్లు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ స్థాయిలో బంతులు వేయలేకపోవడంతో.. భారత బ్యాటర్లు పండగ చేసుకున్నారు. కొన్ని సందర్భాలలో భారత బ్యాటర్లను అవుట్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఉపయోగించుకోలేకపోయారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.

రెడ్ బాల్ ఫార్మాట్లో ఈ కాలపు రాహుల్ ద్రావిడ్ లాగా పేరు తెచ్చుకున్నాడు కేఎల్ రాహుల్. మరోసారి తాను ఎందుకు అంత స్పెషలో నిరూపించుకున్నాడు. క్లాసిక్ షాట్లు ఆడుతూ అదరగొట్టాడు. కెప్టెన్ గిల్ కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. పిచ్చి బంతులను బౌండరీలకు తరలించిన అతడు.. ఇబ్బంది పెట్టే బంతులకు రెస్పెక్ట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ ఐపీఎల్ విఫలమైనప్పటికీ.. రెడ్ బాల్ ఫార్మాట్లో మాత్రం అదరగొట్టాడు. ఇప్పటికైతే 70 బంతుల్లో 50 పరుగులు చేసిన అతడు.. రెండవ రోజు ఇదే దూకుడు కొనసాగిస్తే సెంచరీ పూర్తి చేసుకుంటాడు.