Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Pulivendula Visit: రేపు పులివెందుల లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.....

Pawan Kalyan Pulivendula Visit: రేపు పులివెందుల లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. కారణం ఏంటంటే..

Pawan Kalyan Pulivendula Visit: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నాడు. ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే , మరోపక్క పార్టీ ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. జనవరి 10 నుండి వరుసగా జరగబోయే మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొని , పవర్ ఫుల్ ప్రసంగం ఇవ్వబోతున్నాడు. మరోపక్క ఆయన కొన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. అవి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా […]

Pawan Kalyan Pulivendula Visit: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నాడు. ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే , మరోపక్క పార్టీ ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. జనవరి 10 నుండి వరుసగా జరగబోయే మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొని , పవర్ ఫుల్ ప్రసంగం ఇవ్వబోతున్నాడు. మరోపక్క ఆయన కొన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. అవి ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుండి మాజీ సీఎం జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల లో ఎప్పుడూ పర్యటించలేదు. జగన్ సీఎం గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం లో తన చివరి ఎన్నికల క్యాంపైన్ ని నిర్వహించాడు. ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ జగన్ ని పులివెందుల కి వెళ్లి టార్గెట్ చేయలేదు.

కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ పులివెందుల పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. రేపు ఆయన పులివెందుల లో విస్తృతంగా పర్యటించబోతున్నారు. అక్కడ ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడబోతున్నాడు అనే దానిపై అభిమానుల్లో , రాజకీయ వర్గాల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణ అంశం లో పవన్ కళ్యాణ్ పేరు రాజకీయాల్లో వేడి ని రేపాయి. తెలంగాణ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ని టార్గెట్ చేస్తూ , ప్రతీ రోజు ఎవరో ఒకరు ప్రెస్ క్లబ్ లో మీడియా ముందుకొచ్చి , రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేస్తూ , పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ జనసేన పార్టీ నాయకులు కూడా అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు.

ఇలాంటి సందర్భం లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పులివెందుల పర్యటన అంటే ఇక రాజకీయాల్లో ఏ రేంజ్ హీట్ వాతావరణం నెలకొంటుందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి రేపు ఆయన ఏమి మాట్లాడబోతున్నాడు అనేది. రేపటి నుండి ఒక వారం రోజుల వరకు వైసీపీ నాయకులూ పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడానికి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పర్యటనకు సంబంధించిన మరికొన్ని వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper