Ram Charan Next Movie: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఒకరిని మించి మరొకరు సక్సెస్ లను సాధిస్తుంటే వాళ్లకంటే మనం కొత్తగా ఏం చేయాలి అని ఒక నటుడు విపరీతమైన ఆవేదన పడుతుంటాడు. వారసత్వపరంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో వాళ్ల మనుగడను కొనసాగించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు వారసత్వంగా వచ్చిన వాళ్ళకంటూ ఒక టాలెంట్ లేకపోతే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టమవుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సైతం చిరంజీవి కొడుకుగా వచ్చినప్పటికి ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన పెద్ది సినిమాతో సైతం మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్లో ‘రంగస్థలం’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేసింది. అలాంటి కాంబినేషన్ లో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందనేది మెగా అభిమానుల్లో చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇంకెవరితో సినిమా చేయబోతున్నాడు అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాను చేయాలని చూస్తున్నాడట. టెక్నికల్గా స్ట్రాంగ్ గా ఉండే దర్శకులైతేనే అతనికి బెస్ట్ అని అనుకుంటున్నాడట. ఇక ఈ రకంగా చూసుకుంటే తర్వాత సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడట. ఆ సినిమా ముగిసిన తర్వాత రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు పట్టలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…
















చిరంజీవి విషయంలో తప్పుగా ఆలోచించిన దర్శకుడు..
Director misjudged Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక అలాంటి సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా వస్తాయనే చెప్పాలి. చిరంజీవి చేసిన సినిమాలన్నింటిలో కొన్ని గొప్ప సినిమాలుగా నిలిస్తే మరికొన్ని ప్లాపులుగా కూడా మిగిలాయి. అయితే ఒక దర్శకుడు చిరంజీవి తనతో సినిమా చేయడనే ఒక అపోహతో ఉండేవారట. కానీ అదిరిపోయే కథ చెబితే చిరంజీవి ఎవరితోనైనా సరే సినిమా చేస్తారని తన సన్నిహితులు చెప్పడంతో ఒక మంచి కథను తీసుకెళ్లి చిరంజీవికి వినిపించాడు. ఇక దాంతో చిరంజీవి అతనికి అవకాశం అయితే ఇచ్చాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే గుణశేఖర్ కావడం విశేషం…
గుణ శేఖర్ అంతకుముందే లాఠీ, సొగసు చూడతరమా, బాల రామాయణం లాంటి సినిమాలు చేశాడు. అయితే అతని దగ్గర ఒక మంచి కథ ఉంది. అది చిరంజీవి రేంజ్ కి సరిపోతుంది కానీ చిరంజీవి నాతో సినిమా చేయడు కదా అని తన సన్నిహితులు దగ్గర చెబితే వాళ్లు చిరంజీవి కి నచ్చితే ఆయన ఎవరితో నైనా సినిమాలు చేస్తాడు అని తనకు సలహాలు ఇచ్చి చిరంజీవి దాకా ఆ కథను చేరవేసే ప్రయత్నం చేయమని చెప్పారట.
దాంతో అశ్విని దత్ కి కథను వినిపించి ఆ తర్వాత అతని సహాయంతో చిరంజీవికి చెప్పాడట. చిరంజీవికి ఆ కథ నచ్చడంతో ఆ సినిమా వర్కౌట్ అయింది. ‘చూడాలని ఉంది’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 100 రోజులకు పైన ఆడి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘మృగరాజు’ అనే సినిమా వచ్చింది.
అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మరోసారి చిరంజీవి గుణశేఖర్ తో సినిమా అయితే చేసే ప్రయత్నం చేయలేదు…మొత్తానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి…ప్రస్తుతం గుణ శేఖర్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…