Homeఎంటర్టైన్మెంట్Ram Charan Next Movie: సుకుమార్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఆ స్టార్ డైరెక్టర్...

Ram Charan Next Movie: సుకుమార్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా..?

Ram Charan Next Movie: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఒకరిని మించి మరొకరు సక్సెస్ లను సాధిస్తుంటే వాళ్లకంటే మనం కొత్తగా ఏం చేయాలి అని ఒక నటుడు విపరీతమైన ఆవేదన పడుతుంటాడు. వారసత్వపరంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో వాళ్ల మనుగడను కొనసాగించలేకపోతున్నారు. […]

Ram Charan Next Movie: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఒకరిని మించి మరొకరు సక్సెస్ లను సాధిస్తుంటే వాళ్లకంటే మనం కొత్తగా ఏం చేయాలి అని ఒక నటుడు విపరీతమైన ఆవేదన పడుతుంటాడు. వారసత్వపరంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో వాళ్ల మనుగడను కొనసాగించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకు వారసత్వంగా వచ్చిన వాళ్ళకంటూ ఒక టాలెంట్ లేకపోతే మాత్రం వాళ్ళు ఇండస్ట్రీకి రావడం చాలా కష్టమవుతుందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సైతం చిరంజీవి కొడుకుగా వచ్చినప్పటికి ఆయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసిన పెద్ది సినిమాతో సైతం మరోసారి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

అలాంటి రామ్ చరణ్ ఇప్పుడు సుకుమార్ తో మరో సినిమా చేస్తున్నాడు. ఇంతకు ముందే వీళ్ళ కాంబినేషన్లో ‘రంగస్థలం’ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను సైతం బ్రేక్ చేసింది. అలాంటి కాంబినేషన్ లో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందనేది మెగా అభిమానుల్లో చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఇంకెవరితో సినిమా చేయబోతున్నాడు అనే ధోరణిలో కూడా మరికొన్ని అభిప్రాయాలైతో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో తన నెక్స్ట్ సినిమాను చేయాలని చూస్తున్నాడట. టెక్నికల్గా స్ట్రాంగ్ గా ఉండే దర్శకులైతేనే అతనికి బెస్ట్ అని అనుకుంటున్నాడట. ఇక ఈ రకంగా చూసుకుంటే తర్వాత సినిమా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేసే అవకాశాలైతే ఉన్నాయి.

ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లలేదు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తాడట. ఆ సినిమా ముగిసిన తర్వాత రామ్ చరణ్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు పట్టలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper