Homeఎంటర్టైన్మెంట్Peddi Box Office Collection: 3వ రోజు అంచనాలను మించిపోయిన 'పెద్ది'.. ఇదేమి కుమ్ముడు సామీ.....

Peddi Box Office Collection: 3వ రోజు అంచనాలను మించిపోయిన ‘పెద్ది’.. ఇదేమి కుమ్ముడు సామీ.. కళ్ళు చెదిరిపోయే రేంజ్ గ్రాస్..

Peddi Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రోజురోజుకి అంచనాలను దాటి అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకువెళ్తోంది. ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ ని చూస్తుంటే తలపండిన ట్రేడ్ పండితులకు సైతం మతి పోతుంది. ఈ రేంజ్ గ్రాస్ ని ఒక పెద్ద హీరో సినిమాకు చూసి ఎన్ని రోజులైందో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. కరువు లో […]

Peddi Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రోజురోజుకి అంచనాలను దాటి అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకువెళ్తోంది. ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ ని చూస్తుంటే తలపండిన ట్రేడ్ పండితులకు సైతం మతి పోతుంది. ఈ రేంజ్ గ్రాస్ ని ఒక పెద్ద హీరో సినిమాకు చూసి ఎన్ని రోజులైందో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. కరువు లో ఉన్న టాలీవుడ్ కి ‘పెద్ది’ ఇచ్చిన పెద్ద ధైర్యం సాధారణమైనది కాదు , ఇందుకే పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి కనీసం రెండు మూడైనా విడుదలైతే థియేటర్స్ ని మూసివేసే పరిస్థితి రాదనీ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ చిత్రానికి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 155 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 97 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక వీకెండ్ మొదలు అవ్వడం తో రామ్ చరణ్ ఉగ్ర రూపాన్ని దాల్చేశాడు . చిన్న సెంటర్, పెద్ద సెంటర్, మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అని తేడా లేదు, ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని సెంటర్స్ లో అయితే ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన గ్రాస్ వసూళ్లకంటే నేడు నమోదైన గ్రాస్ వసూళ్లు ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో బయ్యర్స్ అప్పుడే సేఫ్ జోన్ లోకి కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. రేపటి నుండి వచ్చే ప్రతీ పైసా లాభమే అనే సెంటర్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ చిత్రానికి నేడు నమోదైన గ్రాస్ వసూళ్లు చూస్తుంటే , ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి కనిపిస్తున్న ట్రెండ్ ని చూస్తుంటే నేడు 45 కోట్ల గ్రాస్ మార్కుని కచ్చితంగా ఈ చిత్రం రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అదే కనుక జరిగితే మూడు రోజుల్లో 200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది. రేపు కూడా ఇదే రేంజ్ గ్రాస్ ని నమోదు చేసుకుంటే తొలి వీకెండ్ లో 250 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాగా నిలుస్తుంది. మరోవైపు బలహీనంగా ఉన్నటువంటి ఓవర్సీస్ మార్కెట్ కూడా నేడు పుంజుకుంది. యావరేజ్ అనిపించుకుంటున్న నైజాం కూడా ఇరగకుమ్మేస్తోంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ నెంబర్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది. హిందీ మార్కెట్ కాస్త సహకరిస్తే ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల మార్కుని అవలీలగా daati ఉండేది , ప్రస్తుతానికి అయితే ఆ రేంజ్ వసూళ్లు కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper