Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: నారా లోకేష్ ఫిదా..ఏంటీ స్బేర్ టెక్నాలజీ.. ఏపీలో అవకాశం ఉందా..

Nara Lokesh: నారా లోకేష్ ఫిదా..ఏంటీ స్బేర్ టెక్నాలజీ.. ఏపీలో అవకాశం ఉందా..

Nara Lokesh: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. అనేక రకాల ఒప్పందాలు కుదర్చుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి కంపెనీ ప్రతినిధులను కోరుతున్నారు. తిరుపతి సమీపంలో ఏకంగా స్పేస్ సిటీ ఏర్పాటుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రష్యా కంపెనీలను ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25000 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రష్యా కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోవడం లేదు. రష్యాలో […]

Nara Lokesh: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యాలో పర్యటిస్తున్నారు. అనేక రకాల ఒప్పందాలు కుదర్చుకుంటున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి కంపెనీ ప్రతినిధులను కోరుతున్నారు. తిరుపతి సమీపంలో ఏకంగా స్పేస్ సిటీ ఏర్పాటుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రష్యా కంపెనీలను ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25000 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రష్యా కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక్కడితోనే నారా లోకేష్ ఆగిపోవడం లేదు.

రష్యాలో స్బేర్ సిటీ పేరుతో అత్యాధునిక సాంకేతిక నగరి ఒకటుంది. ఇది అమెరికా వల్ల కాలేదు. చైనా అందిపుచ్చుకోలేదు. జపాన్, కొరియా వల్ల కూడా ఇది సాధ్యం కాలేదు. రష్యాలో అమల్లో ఉన్న ఈ టెక్నాలజీ ఏపీలో అమలైతే గేమ్ ఛేంజర్ అవుతుంది. ఎందుకంటే ఆసియాలో ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ లేదు. రష్యాలో స్బేర్ సిటీ ని నిర్వహిస్తున్నారు.

స్బేర్ సిటీ లో వ్యాధి నిర్దారణ అత్యంత కచ్చితమైన విధానాలలో, అత్యాధునిక టెక్నాలజీతో చేస్తారు. దీని వల్ల వ్యాధి నిర్ధారణ అత్యంత కచ్చితంగా తెలుస్తుంది. దానికి చికిత్స ,వాడే మందులు కూడా అంతే కచ్చితత్వంతో ఉంటాయి. ఇది పూర్తిగా హెల్త్ కేర్, టెక్నాలజీ సమ్మిళితంతో నడుస్తూ ఉంటుంది. దీనివల్ల వ్యాధి నిర్ధారణతో పాటు దాని తీవ్రత కూడా వెంటనే తెలిపోతోంది. అది రావడానికి గల కారణాలను తెలుసుకోవచ్చు. స్బేర్ టెక్నాలజీకి అనుసంధానంగా రష్యా పాఠశాలలు కూడా నిర్వహిస్తోంది. ఆ పాఠశాలలకు రష్యా స్కూల్ 21 అనే పేరు పెట్టింది. ఆ పాఠశాలలను కూడా నారా లోకేష్ సందర్శించారు.

స్బేర్ టెక్నాలజీని పరిశీలించిన లోకేష్ కు అక్కడి అధికారులు క్వాంటం టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇతర అంశాల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటని కూడా లోకేష్ జాగ్రత్తగా పరిశీలించారు. ఇప్పటికే ఏపీలో గూగుల్ డేటా సెంటర్, క్వాంటంటెక్నాలజీ కేంద్రాలకు శంకుస్థాపన జరిగింది. త్వరలోనే ఏపీలో స్బేర్ టెక్నాలజీ ఏపీలో అంకురార్పణ కాబోతుంది. నారా లోకేష్ ఎక్స్ లో చేసిన పోస్ట్ దానినే బలపరుస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper