Home Blog Page 175

బుచ్చి బాబు ని విమర్శిస్తూ జాన్వీ కపూర్ కి సపోర్టుగా నిల్చిన యంగ్ హీరోయిన్..

Buchi Babu
Buchi Babu

Buchi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , కరువులో టాలీవుడ్ ని కాసుల కనకవర్షం తో నింపేసింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే ఇప్పుడు చర్చ. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ గురించి , చివరి 45 నిమిషాల గురించి ఆడియన్స్ ఎంతలా అయితే మాట్లాడుకుంటున్నారో , హీరో జాన్వీ కపూర్ గురించి కూడా అదే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్ బుచ్చి బాబు ఆమె పాత్రని మలచిన తీరుపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కేవలం డైరెక్టర్ ని మాత్రమే కాదు, మహానటి శ్రీదేవి కూతురు అయ్యుండి , ఇలాంటి పాత్రలు చేయడానికి సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ జాన్వీ కపూర్ మీద కూడా తీవ్రమైన ట్రోల్స్ వేస్తున్నారు.

అయితే ఈ అంశం పై ఇప్పుడు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. నిన్ననే యాంకర్ అనసూయ , దర్శకులు ఒక సినిమా ని తీసేటప్పుడు , కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఈ చిత్రంలోని జాన్వీ కపూర్ పాత్రపై వస్తున్న కామెంట్స్ కి రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘దయచేసి హీరోయిన్లను అనవసరంగా నిందించకండి. చిత్రానికి సంబంధించిన దర్శక నిర్మాతలను నిందించండి. మా లాంటి హీరోయిన్స్ కి పెద్ద హీరోల సినిమాల్లో భాగం అవ్వాలని , ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని ఉంటుంది. ఈ క్రమం లోనే అందుబాటులోకి వచ్చే అవకాశాల మేరకు పనిచేస్తాము. డైరెక్టర్ మహిళా పాత్రలను సరిగా రాయబడలేదని మీకు అనిపిస్తే, ఆ పాత్రలను రాసే రచయితలకు , డైరెక్టర్స్ కి ఎంత బాధ్యత ఉంటుంది అనేది గుర్తించండి’ అంటూ చెప్పుకొచ్చింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే , ఎందుకు మీరంతా అనవసరంగా జాన్వీ కపూర్ ని నిందిస్తున్నారు , ఆ పాత్ర ని క్రియేట్ చేసిన బుచ్చి బాబు ని తిట్టండి అంటూ చెప్పుకొచ్చింది ఆషికా రంగనాథ్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. కన్నడ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ కుర్ర హీరోయిన్ , తెలుగు లోకి అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘నా సామి రంగ’ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది , ఇక రీసెంట్ గా ఈమె మాస్ మహారాజ రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం లో నటించింది. ఇప్పుడు ఈమె ముఖ్యపాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

'లెనిన్' చిత్రం లో ఉప్పెన , పెద్ది లను మించిన భారీ ట్విస్ట్.. అయ్యగారి నటవిశ్వరూపం లోడింగ్..

Lenin 10 Days Collection
Lenin 10 Days Collection

Lenin Movie Twist: ఈమధ్య కాలం లో డైరెక్టర్స్ థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులను థ్రిల్ కి గురి చెయ్యాలని కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడానికి భయపడేవారు. ఎందుకంటే అప్పట్లో కమర్షియల్ హంగులకు ఆడియన్స్ బాగా అలవాటు పడ్డారు కాబట్టి. హీరో చనిపోతే అసలు తట్టుకునేవారు కాదు , సినిమాని డిజాస్టర్ చేసేవారు, కేవలం అదొక్కటే కాదు , విచారకరమైన ఎండింగ్ తో వచ్చే ఏ సన్నివేశాన్ని కూడా ఆడియన్స్ తీసుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు ఆరోజులు పోయాయి , ఇప్పుడంతా జెన్ జీ యుగం. ఇలాంటి సరికొత్త ప్రయోగాలను వాళ్ళు ఒక రేంజ్ లో స్వాగతిస్తున్నారు. మేకర్స్ కి ఫ్రీ హ్యాండ్ దొరికేలోపు , వాళ్ళ ఆలోచలను చాలా స్వేచ్ఛగా వెండితెర పై పెట్టేందుకు ఏ మాత్రం మొహమాటం చూపించడం లేదు. ‘ఉప్పెన’ చిత్రం లోని క్లైమాక్స్ ట్విస్ట్ ప్రతీ ఒక్కరికి పెద్ద షాక్.

ఇలాంటి క్లైమాక్స్ ని టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేదు. ఇక ‘ఉప్పెన’ ని తెరకెక్కించిన బుచ్చి బాబు , రీసెంట్ గా ‘పెద్ది’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలోని క్లైమాక్స్ కూడా ఆడియన్స్ కి ఒక పెద్ద షాక్. ఒక స్టార్ హీరోని ఇలాంటి ప్రయోగం లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ ఈ క్లైమాక్స్ ని కూడా స్వీకరించారు. ఇలా ఈ ట్రెండ్ ని ఆడియన్స్ బాగా ఆదరిస్తుండడం తో , మేకర్స్ కూడా ఈ విధంగా మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ‘లెనిన్’ చిత్రం లో కూడా అలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘ఏజెంట్’ వంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అక్కినేని అఖిల్ హీరో గా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ద్వారా మురళి కిషోర్ అబ్బూరి అనే నూతన డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు.

ఈ సినిమా లో హీరో అక్కినేని అఖిల్ కి కళ్ళు పోతాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కోసం ఆయన తన నేత్రాలను దానం చేస్తాడట, లేటెస్ట్ గా విడుదల చేసిన మూడవ పాటలో కూడా డైరెక్టర్ చిన్న చిన్న హింట్స్ ఇచ్చాడు. అక్కినేని అఖిల్ కి నటించడానికి ఫుల్ స్కోప్ ఉన్న పాత్ర ఇది. కంటెంట్ కూడా ఈసారి చాలా బలంగా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. విడుదల చేసిన రెండు పాటలకు , టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది , చూస్తుంటే అయ్యగారు ఈసారి గట్టిగానే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ఉన్నాడు , ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఉన్నప్పటికీ , సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ , ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడుతాడనే నమ్మకం తో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్.

'పెద్ది' సక్సెస్ పై స్టార్ హీరోలు మౌనం వహించడానికి కారణం అదేనా.. ? ఇది చాలా అన్యాయం..

Peddi Movie Success
Peddi Movie Success

Peddi Movie Success: పక్క రాష్ట్రంలో ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి అయితే , మన ఇండస్ట్రీ కి చెందిన టాప్ హీరోలంతా క్యూలు కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కానీ సొంత ఇండస్ట్రీ లో ఎవరైనా సక్సెస్ కొడితే అభినందించడానికి మాత్రం ముందుకు రారు. ఒకప్పుడు ఇలాంటి వాతావరణం ఉండేది కాదు , ఈమధ్య కాలం లో ఏమైందో ఏమో తెలియదు కానీ , స్టార్ హీరోలు పరస్పరం అభినందించుకోవడం మానేశారు. రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం విడుదలై , మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు కేవలం అభిమానులు మాత్రమే కాదు , ఇతర హీరోల అభిమానులు కూడా ఫిదా అయిపోయారు.

అద్భుతమైన నటన , ఈసారి రామ్ చరణ్ కి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని పోస్టులు కూడా పెడుతున్నారు. ఆ రేంజ్ నటన కనబరిస్తే , స్టార్ హీరోల నుండి ఒక్క పోస్ట్ కూడా ఇప్పటి వరకు పడలేదు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే , కనీసం మీడియం రేంజ్ హీరోలు , యంగ్ హీరోలు కూడా ఈ సినిమా పై సోషల్ మీడియా లో కామెంట్స్ చేయలేదు. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ కుటుంబం మొత్తం ప్రీమియర్ షో లోనే చూశారు. అదే విధంగా రాజమౌళి కుటుంబం కూడా చూసింది , హీరో శ్రీవిష్ణు దొంగ చాటుగా ఈ చిత్రాన్ని వీక్షించి థియేటర్ నుండి బయటకు వస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే వీళ్లంతా ‘పెద్ది’ గురించి ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. కేవలం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ సినిమా గురించి మాట్లాడాడు.

ప్రతీ సూపర్ హిట్ సినిమాకు టీం అభినందిస్తూ ట్వీట్లు వేసే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ‘పెద్ది’ పై మౌనం వీడలేదు. ఎందుకు వీళ్లంతా ఇంత సైలెంట్ గా ఉన్నారు ?, రామ్ చరణ్ నటన చూసి , అతను నేషనల్ అవార్డు కచ్చితంగా కొట్టేస్తాడని అభద్రతాభావం తో ఉన్నారా ?, అందుకే ఈ సినిమా విజయం పై పెదవి విప్పడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతం లో రంగస్థలం లో రామ్ చరణ్ అద్భుతమైన నటనకు గానూ , సోషల్ మీడియా ద్వారా సినీ సెలబ్రిటీలందరూ మెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు వాలంతా ఎందుకు సైలెంట్ ఉన్నారు?, కనీసం భవిష్యత్తులో అయినా ఈ సినిమా గురించి స్పందిస్తారో లేదో చూడాలి.

రామ్ చరణ్ కి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు క్లిన్ కారా.. ఇంత చిన్న వయస్సులో ఎంత పెద్ద మనసు..

Ram Charan daughter Klin Kaara
Ram Charan daughter Klin Kaara

Ram Charan daughter Klin Kaara: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఎందుకో అందరికీ తెలిసిందే. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఏ పని మీద అయినా మనస్ఫూర్తిగా శ్రద్ద పెట్టి , తమ వైపు నుండి నూటికి నూరు శాతం ది బెస్ట్ ఇచ్చి , ఆ పని ని ఎదుటివాళ్ళు మెచ్చుకుంటే వచ్చే కిక్కే వేరు. రామ్ చరణ్ ప్రస్తుతం అలాంటి కిక్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ‘పెద్ది’ చిత్రం లో ఆయన ఎంత కష్టపడ్డాడో మన కళ్లారా చూశాము . ఆరంభం నుండి ఎండింగ్ వరకు రామ్ చరణ్ కష్టం , అద్భుతమైన నటన మాత్రమే కనిపించింది.

సినిమాని తన రెండు భుజాల మీద మోశాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ రేంజ్ నటన ఈమధ్య కాలం లో స్టార్ హీరోల నుండి రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా నటించాడు రామ్ చరణ్. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ కాసుల కనకవర్షం కురిపిస్తూ ముందుకు దూసుకొని పోవడానికి ముఖ్య కారణం , రామ్ చరణ్ మాత్రమే. ఇకపోతే ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా , తన తండ్రి కి ఒక స్వీట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆ చిన్నారి మాట్లాడుతూ ‘నాన్న.. థిస్ ఈజ్ ఫర్ యూ.. లవ్ యూ సో మచ్’ అంటూ ఒక వీడియో ని చేయించింది. తన ఇంట్లో పని చేసేవాళ్లను , తన తండ్రి స్టాఫ్ ని , బాడీ గార్డ్స్ ని అందరినీ ఒక దగ్గరకు చేర్చి ‘చికిరి చికిరి’ పాటకు డ్యాన్స్ చేయించింది.

వీరిలో రీసెంట్ గా బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి రామ్ చరణ్ బాడీ గార్డ్ ‘కెవిన్’ కూడా ఉన్నాడు. ఈ వీడియో ని సోషల్ మీడియా లో ఉపాసన షేర్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అంతే కాదు , క్లిన్ కారా వాయిస్ చాలా ముద్దుగా ఉందని, ఆ చిన్నారి కి ఇంత చిన్న వయస్సు లో తన తండ్రికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన రావడం అద్భుతం అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

హర్షిత్ రానా లో గంభీర్ కు ఏం నచ్చిందో..మరీ ఇంత ప్రేమా..

Harshit Rana Selection
Harshit Rana Selection

Harshit Rana Selection: ఈ ఐపీఎల్లో ఒక్కసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ప్రదర్శన చూస్తే ఎవరైనా సరే జాతీయ జట్టులోకి తీసుకుంటారు. అక్కడిదాకా ఎందుకు హేజల్ వుడ్ ఐపీఎల్లో చేసిన ప్రదర్శన చూసి ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ అతడికి రెడ్ కార్పెట్ వేసింది. అంతేకాదు 2027 వరల్డ్ కప్ లో ఆడేందుకు అతడి మీద వర్క్ లోడ్ కూడా తగ్గించింది. కమిన్స్, స్టార్క్ విషయంలో కూడా ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ ఇదే నిర్ణయాన్ని తీసుకుంది.

ఇదేం దరిద్రమో లేదు గాని.. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం ఐపీఎల్లో సత్తా చూపించిన బౌలర్ల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. హర్షిత్ రానా మీద మాత్రం విపరీతమైన ప్రేమను చూపిస్తోంది. అతడేమి గొప్పగా వికెట్లు తీయలేదు. పేరుపొందిన ఎకానమీ బౌలర్ కూడా కాదు. కీలక సమయాలలో వికెట్లు పడగొట్టి జట్టుకు అడ్వాంటేజ్ స్థాయి కూడా అతనికి లేదు. అతనిలో ఏం నచ్చిందో తెలియదు.. గౌతమ్ గంభీర్ మాత్రం విపరీతమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఈ ప్రేమకు అర్థం ఏంటో కూడా తెలియడం లేదు. గతంలో అనేక పర్యాయాలు హర్షిత్ మీద గౌతమ్ ఇదే స్థాయిలో ఆప్యాయత కనబరిచాడు. అతడికి అవకాశాల మీద అవకాశాలు కల్పించాడు.

ఇటీవల కాలంలో హర్షిత్ గాయం వల్ల ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడలేదు. వన్డేలలో కొంతమేర పరవాలేదనుకున్నా.. టి20 లలో రికార్డ్ ఏమంత గొప్పగా లేదు. ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ బెంగళూరు జట్టు తరఫున అద్భుతంగా రాణించాడు. వికెట్లు పడగొట్టాడు. సూపర్ ఎకానమీ నమోదు చేశాడు. అతడిని పక్కనపెట్టి హర్షిత్ ను తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు హర్షిత్ ను తీసుకొని పాండ్యా కడుపు మీద కొట్టాడని గంభీర్ మీద క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు..

హార్దిక్ పాండ్యా 2024 t20 వరల్డ్ కప్.. ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో అదరగొట్టాడు. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయినప్పటికీ అతడిని పక్కన పెట్టారు. అతడిని దూరం పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని మేనేజ్మెంట్ ఇంతవరకు చెప్పలేదు. హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి.. అతడి స్థానాన్ని భవిష్యత్తు కాలంలో హర్షిత్ తో భర్తీ చేస్తారా అని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. హర్షిత్ కోసం ఏకంగా నిబంధనలు కూడా మార్చారని మండిపడుతున్నారు. దీనిపై గౌతమ్ గంభీర్ ఎటువంటి రిప్లై ఇస్తాడో చూడాల్సి ఉంది.

'పెద్ది' పై యాంకర్ అనసూయ హాట్ కామెంట్స్.. డైరెక్టర్ బుచ్చి బాబు పై కౌంటర్..

Anchor Anasuya
Anchor Anasuya

Anchor Anasuya: సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే యాంకర్ అనసూయ , తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా , ముక్కు సూటితనం మనస్తత్వం తో ఎలా మాట్లాడుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే , మొహమాటం లేకుండా వాళ్ళని ప్రశ్నిస్తుంది , నిలదీస్తుంది. ఆ కారణం చేత ఆమె తీవ్రమైన నెగెటివిటీ ని ఎదురుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా ‘పెద్ది’ వివాదం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో డైరెక్టర్ బుచ్చి బాబు హీరోయిన్ ని చూపించిన విధానం పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి, ఒక అమ్మాయిని ఇంత దారుణంగా చూపిస్తారా?, అమ్మాయిల మీద మీకు ఉన్నటువంటి గౌరవం ఇదేనా ? అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. బుచ్చి బాబు క్షమాపణలు కూడా చెప్పాడు. ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సన్నివేశాలను సినిమా నుండి తొలగిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ అంశంపై యాంకర్ అనసూయ కూడా రెస్పాన్స్ వచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం , కానీ సమాజం లో జరిగే ప్రతీ ఒక్కటి సినిమా ప్రభావితం చేస్తుంది అనడం కరెక్ట్ కాదు. సినిమా మంచిని చూపిస్తుంది చెడు ని కూడా చూపిస్తుంది , ఏది తీసుకోవాలి అనేది ప్రేక్షకుడి విచక్షణ పైనే ఉంటుంది. సినిమాలు చూసి పిల్లలు చెడిపోతున్నారు అనడం సరికాదు. క్రియేటివ్ రంగం లో దర్శకుడికి తాను చెప్పాలనుకున్న కథని చెప్పే స్వేచ్ఛ ఉండాలి. అదే సమయం లో సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలి, ఇకనైనా క్రియేటర్లు బాధ్యతతో వ్యవహరించి సినిమాలను తెరకెక్కిస్తారని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ‘పెద్ది’ చిత్రం లో హీరోయిన్ ని చూపించిన విధానం ని చూసి పిల్లలు ఏమి నేర్చుకోవాలి అనే చర్చ కి అనసూయ ఇచ్చిన సమాధానం ఇది.

ఒకపక్క పిల్లలు సినిమాల కారణంగా చెడిపోతారు అనడం కరెక్ట్ కాదు అంటూనే , డైరెక్టర్లు కూడా కాస్త బాధ్యత తో సినిమాలు తీయాల్సిన అవసరం ఉందంటూ బుచ్చి బాబు పై సైలెంట్ గా కౌంటర్ వేసింది. అనసూయ మాట్లాడిన ఈ మాటలను సామర్దించే వాళ్ళు ఉన్నారు , విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. సోషల్ మీడియా లో ఆమెకు తీవ్రమైన నెగెటివిటీ ఉంటుంది కాబట్టి, విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ‘జబర్దస్త్’ పదేళ్లకు పైగా పని చేశావు , ఆ కామెడీ షో లో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి , అలాంటి షో కి యాంకర్ గా చేసి , నువ్వు కూడా ఎన్నో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొట్టి , ఇప్పుడొచ్చి నీతులు చెప్తున్నావు , నీకు లేదా సమాజం మీద బాధ్యత ?, కేవలం డైరెక్టర్స్ కి మాత్రమే ఉండాలా ? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

213ఐదు నెలలు.. లక్షమంది.. ఇది మామూలు సంక్షోభం కాదు

IT Layoffs
IT Layoffs

IT Layoffs: ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగం అంటే చాలామంది గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. రెండు రోజులు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. పైగా భారీగా జీతం.. అంతకు మించిన బోనస్ లు.. ఇవన్నీ కూడా ఐటీ విభాగంలో పనిచేసే వారికి క్లౌడ్ నైన్ అనుభూతిని ఇచ్చేవి.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని కంపెనీలు వారంలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడం లేదు. పైగా విపరీతమైన పని ఒత్తిడి పెంచుతున్నాయి. నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి. ఉద్యోగం చేయాలి కాబట్టి.. కుటుంబాన్ని సాకాలి కాబట్టి చాలామంది ఎన్ని రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ భరిస్తున్నారు. మరో అవకాశం లేక ఇబ్బంది పడుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంత హింస పెట్టినా సరే ఐటీ కంపెనీలకు ఉద్యోగుల మీద పగ చల్లారడం లేదు. అడ్డగోలుగా తీసిపడేస్తున్నాయి.. ఉద్యోగాల నుంచి బయటికి వెళ్లిపోండంటూ మెడ పట్టి గెంటివేస్తున్నాయి.

అందువల్లే ఐటీ పరిశ్రమ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో భారీగా తొలగింపులు కొనసాగుతున్నాయి.. లే ఆఫ్. ఎఫ్ వై అనే సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం గడచిన ఐదు నెలల్లో దాదాపు 1.16 లక్షల మంది ఐటీ రంగ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది మే నెలలో 10, 577 మంది ఉద్యోగులను తొలగిస్తే.. ఈ సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే రెట్టింపు అయింది. దాదాపు 28,889 మంది ఉద్యోగులను అన్ని కంపెనీలు తొలగించాయి. ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంటూ ఇట్, క్లౌడ్ ఫెయిర్, విక్స్ అనే సంస్థలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాయని తెలుస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోవడం.. టెక్నాలజీ ద్వారానే ఉద్యోగులు చేయాల్సిన పనిని కంపెనీలు చేయిస్తున్నాయి. దీంతో పరిస్థితులు మారిపోతున్నాయి. అందువల్లే ఉద్యోగుల అవసరం లేకుండానే కంపెనీలు మనుగడ సాగించాలని నిర్ణయానికి వచ్చాయి. టెక్నాలజీ వాడకం వల్ల ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల కంపెనీల మీద ఆర్థిక భారం తగ్గుతుంది. పైగా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ఉండడంతో కంపెనీలు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. అయితే ఉద్యోగుల తొలగింపు ఇక్కడితోనే ఆగదని.. ఇంకా అది మరింత ఎక్కువగా ఉంటుందని పలు సంస్థలు చెబుతున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే భవిష్యత్ కాలంలో మొత్తం గడ్డు పరిస్థితులే. ఒకప్పుడు పచ్చగా వెలుగొందిన ఐటీ పరిశ్రమ ఇలా మారిపోవడం నిజంగా ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియకుండా ఉంది.

అడ్డంగా దొరికిపోయిన ప్రకాష్ రాజ్!

Prakash Raj
Prakash Raj

Prakash Raj Controversy: నటుడు ప్రకాష్ రాజ్ లేనిపోని వివాదాల్లో వేలు పెడుతున్నారు. అనవసరంగా వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ కూడా వివాదాస్పద ముద్ర వేసుకుంటున్నారు. తనకు తాను మేధావి అని భావించుకునే ప్రకాష్ రాజ్ ఆలోచింపజేసే పోస్టులు సోషల్ మీడియాలో పెడుతుంటారు. కానీ మెగా బ్రదర్ నాగబాబు పెట్టిన పోస్ట్ పై తాజాగా ఆయనకు సంబంధం లేకపోయినా.. వేలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అసలు నాగబాబు ఆ పోస్ట్ ఏ సందర్భంలో పెట్టారు? దాని వెనుక జనసేన అంతర్గత క్రమశిక్షణ గురించి అయినా.. అదేదో తన గురించి నాగబాబు అన్నట్టు భావించి వెంటనే కౌంటర్ ఇవ్వడం తో అడ్డంగా బుక్కయ్యారు.

* నాగబాబు ట్వీట్ పై..
ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సీజన్ నడుస్తోంది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో పార్టీలో భిన్న స్వరం వినిపిస్తోంది. సామాజిక వర్గాలను తెరపైకి తీసుకొస్తూ కొందరు అతిగా వ్యవహరిస్తున్నారు. అటువంటివారిని ఉద్దేశించి నాగబాబు తన అధికారిక అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. అనుమానాలను పక్కన పెట్టండి.. ఎలాంటి ప్రశ్నలు లేకుండా అధినేతను అనుసరించండి అంటూ ఒక ఇంగ్లీష్ కొటేషన్ షేర్ చేశారు. కేవలం జనసేన అంతర్గత క్రమశిక్షణ పై మాత్రమే నాగబాబు ఈ పోస్ట్ చేశారు. దీనికి వెంటనే ప్రకాష్ రాజ్ స్పందించారు. నాగబాబు గారు.. ప్రశ్నించడం మా హక్కు ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయ్యిందా? మేం గొర్రెలం కాదు.. బానిస బతుకులు బతకడానికి.. ఈ బెదిరింపులు వద్దు అంటూ ట్వీట్ చేశారు.

* రాజకీయ అభిమానం..
అయితే ఎందుకో ప్రకాష్ రాజ్ క్రమేపి కట్టు దాటుతున్నారు. రాజకీయ ప్రేరేపిత ట్వీట్లు అన్నట్టు ముందుకు సాగుతున్నారు. ఆయనకు నచ్చిన భారత రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, వామపక్షాలు ఓటమి దిశగా వెళ్లడంతో ఆయన భారతీయ జనతా పార్టీ పై పడ్డారు. ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు. పెద్ద అభ్యుదయ వాదినని అనిపించుకునేందుకు పరితపిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజాస్వామ్య బద్దంగా ఆయన ప్రశ్నించడంతో కొంతవరకు గౌరవం దక్కింది. కానీ ఇప్పుడు ఒక పార్టీ లైన్ లేదా అంతర్గత క్రమశిక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా దూరిపోయి మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటివరకు ఆయనపై ఉన్న క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పటివరకు ఒక పద్ధతి ప్రకారం మాత్రమే ఆయన పోస్టులు పెడుతున్నట్లు అంతా భావించారు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా పెడుతున్నారని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అయితే ప్రకాష్ రాజ్ పోస్టులను పట్టించుకోకపోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చారు నెటిజన్లు.

టిడిపి సీనియర్లకు ఎలా న్యాయం చేస్తారు?!

Telugu Desam Party Rajya Sabha Selection
Telugu Desam Party Rajya Sabha Selection

Telugu Desam Party Rajya Sabha Selection: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపికను పూర్తి చేశారు చంద్రబాబు. పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేరు ఖరారు చేశారు. సామాజిక సమతూకం పాటిస్తూ.. యువతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ ఎంపిక పూర్తి చేశారు. అయితే ఈ పదవులపై చాలామంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ సీనియారిటీ కంటే సామాజిక సమతూల్యత, యువతకే ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నేతలను వేరే అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే కాపులకు ఒక పదవి.. బీసీలకు ఒక పదవి.. అగ్రవర్ణాలకు ఒక పదవి అన్నట్టు కేటాయించారు. ఇందులో సానా సతీష్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకాగా.. భాష్యం రామకృష్ణ కమ్మ.. చింతకాయల విజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.

* పాపం యనమల..
టిడిపిలో చాలామంది సీనియర్లు రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనకు అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన కొనసాగుతున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత విధేయుడు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో స్పీకర్ గా ఉండి చంద్రబాబు కు అండగా నిలిచారు. అందుకే చంద్రబాబు సైతం పార్టీతో పాటు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంచి అవకాశాలు ఇస్తూ వచ్చారు. ఏడు పదుల వయసు దాటిన యనమల గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకున్నారు. తనకు పెద్దల సభకు వెళ్లాలని ఉంది అని అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఈసారి ఆయనకు అవకాశం దక్కలేదు. అయితే ఇంకా మూడేళ్ల వ్యవధి ఉండడంతో.. తప్పకుండా యనమల రామకృష్ణుడు కు అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

* గల్లా జయదేవ్ సైతం..
మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ పదవి పై ఆశలు పెట్టుకున్నారు. గుంటూరు ఎంపీగా ఉన్న ఆయన గడిచిన ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా గెలవడమే కాదు కేంద్ర మంత్రి అయ్యారు. వాస్తవానికి గల్లా జయదేవ్ పొజిషన్ కూడా అదే. ఈసారి పోటీ చేసి గెలిచి ఉంటే ఆయన కేంద్ర మంత్రి అయ్యేవారు. అయితే రెండుసార్లు టిడిపి తరఫున ఎంపీగా గెలిచిన జయదేవ్ తనకు రాజ్యసభకు ఎంపిక చేస్తారని ఆశించారు. కానీ ఈసారి ఆ అవకాశం దక్కలేదు. రాజ్యసభ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈసారి కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు బీసీ సామాజిక వర్గానికి చెందిన చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపారు. దీంతో వర్ల రామయ్య కు ఛాన్స్ లేకుండా పోయింది.

* తెలంగాణ నేతలు సైతం..
మరోవైపు తెలుగుదేశం పార్టీని అట్టి పెట్టుకున్న తెలంగాణ నేతల్లో కంభంపాటి రామ్మోహన్ రావు ఒకరు. ఆయన సైతం ఈసారి రాజ్యసభ పదవి ఆశించారు. కానీ ఛాన్స్ దక్కలేదు. ఏపీ నుంచి తెలంగాణ నేతలకు అవకాశం ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసి చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సైతం రాజ్యసభ పదవి ఆశించారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. మొన్నటి ఎన్నికల్లో మైలవరం సీటును వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేశారు దేవినేని ఉమామహేశ్వరరావు. రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే ఈసారి రాజ్యసభ పదవికి కనీసం దేవినేని ఉమామహేశ్వరరావు పేరును పరిగణలోకి తీసుకోకపోవడం ఆయన అనుచరుల్లో అసంతృప్తి నింపింది. అయితే ఈ సీనియర్ లందరికీ హై కమాండ్ నుంచి సమాచారం ఉంది. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామన్న హామీ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

హమ్మయ్య.. ఏపీ చల్లబడనుంది!

Heavy Rainfall In Telugu States
Heavy Rainfall In Telugu States

Andhra Pradesh Monsoon: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. గత కొంతకాలంగా భానుడి భగభగలతో ఉడికిపోతోంది రాష్ట్రం. ఒకవైపు వేడి గాలులు, మరోవైపు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఏపీలోని అనంతపురం, శ్రీ సత్య సాయి, చిత్తూరు జిల్లాలకు నైరుతి రుతుపవనాలు తాకినట్లు వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పదో తేదీ నాటికి ఏపీలో సగానికి పైగా భూభాగాన్ని రుతుపవనాలు తాకే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరో మూడు రోజుల్లో తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

* మూడు రోజుల కిందట..
ఈనెల 4న కేరళకు నైరుతి రుతుపవనాలు తాకాయి. సాధారణంగా జూన్ 1 కేరళలోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే రుతుపవనాల సీజన్లో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. అయితే రుతుపవనాలు తాకినా ఏపీకి మాత్రం ఎండల తీవ్రత వెంటాడుతూనే ఉంది. దక్షిణ కోస్తాకు వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఉక్క పోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

* విస్తరించే అవకాశం..
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో నైరుతీ రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు రాయలసీమను తాకడంతో అక్కడ వాతావరణ పరిస్థితి మారింది. చల్లటి వాతావరణం నెలకొంది. గత ఏడాది ముందుగానే రుతుపవనాలు తాకాయి. వాటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో పడవని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఊపందుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

డీఎస్సీ అక్రమాలు.. వైసిపి అసలు లక్ష్యం అదే!

YSR Congress Party
YSR Congress Party

YSR Congress Party Protest: డీఎస్సీ అక్రమాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది. రచ్చ కే ప్రాధాన్యమిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం అధికారులతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. వైసిపి తో పాటు డీఎస్సీ అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేస్తోంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెత్తబడటం లేదు. డీఎస్సీ అక్రమాలపై మరింత గొడవ చేయాలని భావిస్తోంది. అయితే ఈ విషయంలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపికైన వేలాదిమంది ఉపాధ్యాయుల కంటే.. ఎంపిక కాని లక్షలాదిమంది నిరుద్యోగుల పక్షాన నిలిచి వారి ఓట్లను కొల్లగొట్టాలని చూస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. డీఎస్సీలో అసలు అక్రమాలకు అవకాశం లేదు అని విద్యాశాఖ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వినే పరిస్థితిలో లేదు.

* ప్రభుత్వ మెడికల్ కాలేజీ అంశంలో..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ అంశం పైన పోరాటం చేద్దామంటే సరైనది దొరకడం లేదు. మొన్న మధ్యాహ్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. కట్టని మెడికల్ కాలేజీలు కట్టినట్లు.. తాము కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కట్టు కథలు అల్లింది. అయితే అది కేంద్రం పరిధిలో ఉన్న విషయం అని తెలిసినా అదే పనిగా రాజకీయం చేసింది. ప్రజల నుంచి కోటి సంతకాల పేరుతో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ కొద్ది రోజులకే ఆ ఉద్యమాన్ని మధ్యలో వదిలేసింది. అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశం విషయంలో అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలు అంటూ లేనిపోని హంగామా చేస్తోంది.

* ప్రభుత్వం నివృత్తి చేస్తున్నా..
అయితే ఎన్ని రకాల విమర్శలు వచ్చినా డీఎస్సీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం డీఎస్సీ నియామకాలు జరగడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఎందుకంటే వైసిపి హయాంలో సచివాలయ ఉద్యోగాలను నియమించారు. కేవలం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి. ఎవరికి ఏ ర్యాంకు వచ్చిందో తెలియదు. ఎలా నియమించారో కూడా అప్పట్లో తెలియదు. అయితే అప్పట్లో అది నిరుద్యోగుల అంశం కావడంతో టీడీపీ కూడా చూసి చూడనట్లుగా వదిలేసింది. ఎలా నియామకాలు చేపట్టారని కనీసం అడగలేదు కూడా. అసలు అర్హత సాధించని చాలామందికి పోస్టులు మిగిలిపోవడంతో నియమించారు అప్పట్లో. కానీ అవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుర్తున్నాయి. రాజకీయం చేయాలి కాబట్టి డీఎస్సీ పై అదే పనిగా బురద జల్లుతోంది. ఇప్పుడు ఏకంగా డీఎస్సీ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసింది నాయకత్వం. పైగా లీగల్ సెల్ ఏర్పాటు చేసి న్యాయపోరాటానికి సైతం సిద్ధపడుతున్నట్లు ప్రకటిస్తోంది. అయితే పక్కా ఆధారాలు ఉంటే.. వాటితో నేరుగా కోర్టుకు వెళ్ళవచ్చు కదా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే డీఎస్సీ లో అక్రమాలు కంటే గందరగోళం సృష్టించాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.

చివరికి విజయ్.. రాజ్యసభకు చంద్రబాబు మార్క్ ఎంపిక!

Chandrababu Naidu Rajya Sabha Selectio
Chandrababu Naidu Rajya Sabha Selectio

Chandrababu Naidu Rajya Sabha Selection: ఏపీలో రాజ్యసభ లెక్క తేలింది. టిడిపి నుంచి ముగ్గురు.. జనసేన నుంచి ఒకరు ఖరారు అయ్యారు. టిడిపి నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేరు ఖరారు చేశారు. వారు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజ్యసభ స్థానాలకు సంబంధించి టిడిపి నుంచి ఉత్కంఠకు తెరదించుతూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కసరత్నం ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ ముగ్గురు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్లకు సంబంధించి చివరి రోజు కావడంతో టిడిపి నేతల నడుమ ఈ ముగ్గురు నామినేషన్లు దాఖలు చేస్తారని తెలుస్తోంది.

* పక్కాగా లెక్కలతో..
టిడిపి అధినేత చంద్రబాబు రాజ్యసభ ఎన్నికలో పక్కా వ్యూహం అమలు చేసినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ప్రాంతాలవారీగా బ్యాలెన్స్ చేయడం, పార్టీకి ఉన్న నమ్మకమైన కేడర్ కు ప్రాధాన్యత ఇవ్వడం అనే అంశాల ఆధారంగా ఈ ముగ్గురి ఎంపిక జరిగింది. కాపు బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూనే.. విద్యారంగంలో గుర్తింపు ఉన్న వ్యక్తులకు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన యువనాయకత్వానికి ఈసారి పెద్దపీట వేశారు. బిజెపి, జనసేన నాయకత్వంతో మాట్లాడిన తర్వాత మాత్రమే తుది నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఎంపిక వెనుక పార్టీ పట్ల విధేయత దాగి ఉంది. ముఖ్యంగా ముగ్గురు నారా లోకేష్ కు అత్యంత సన్నిహితులు కావడం విశేషం.

* మరోసారి కొనసాగింపు..
సానా సతీష్ కు మరోసారి కొనసాగింపు లభించింది. గత కొంతకాలంగా పార్టీలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. పారిశ్రామిక వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉంది. నిత్యం నారా లోకేష్ వెంట ఉండేవారు. ఆయన పాదయాత్ర చేసిన సమయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. భాష్యం రామకృష్ణ తెర వెనుక రాజకీయ సేవలు అందిస్తూ వచ్చారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సహకారం అందించారు. మొన్నటి ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు. కానీ వీలు పడలేదు. రాజ్యసభ పదవి దక్కింది. ఇక చింతకాయల విజయ్ గురించి చెప్పనవసరం లేదు. తండ్రి మాదిరిగానే దూకుడు కలిగిన నేత. ఐటీడీపీకి విశేష సేవలు అందించారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా యువతకు, పార్టీ నమ్మకస్తులకు చంద్రబాబు సరైన గుర్తింపు ఇచ్చారని చర్చ జరుగుతోంది.

* యువతకు ప్రాధాన్యం..
ఈ ముగ్గురి ఎంపిక వెనుక ఉన్న అసలు వ్యూహం లోకేష్. పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. మొన్న పొలిట్ బ్యూరోతో పాటు అన్ని రకాల కార్యవర్గాల్లో యువతను నియమించారు. ఇప్పుడు రాజ్యసభలో సైతం ఈ ముగ్గురు యువ నాయకులను తీసుకున్నారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నియామకం చేపట్టారు. ఉత్తరాంధ్ర నుంచి విజయ్ ను తీసుకోవడం విశేషం. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, యువనేత కావడంతో చివరి నిమిషంలో ఆయన వైపు మొగ్గు చూపారు చంద్రబాబు. మొత్తానికి అయితే సుదీర్ఘ కసరత్తు తరువాత చంద్రబాబు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయడం విశేషం.

ఆర్కే కొత్త పలుకు: టిడిపి, జనసేన తెలంగాణకు దూరంగా ఉండటమే మంచిది

RK Kotha Paluku
RK Kotha Paluku

RK Kotha Paluku: చాలాకాలం తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేశారు. తనలో ఉన్న జర్నలిస్టును బయటకు తీసుకొచ్చారు. మార్మికంగా ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టే విధంగా రాశారు. ఫలితంగా ఈ ఆదివారం కొత్త పలుకు చాలామందికి గడ్డి పెట్టే విధంగా ఉంది. కొందరికి అయితే కర్రు కాల్చి వాతపెట్టినట్టుగా ఉంది.

కొద్దిరోజులుగా రెండు రాష్ట్రాలలో మళ్ళీ ప్రాంతీయవాదం కనిపిస్తోంది. ఓ రాజకీయ విశ్లేషకుడి మాటలు.. అవి కాస్త వివాదాస్పదమైన తీరు.. దానికి తెలంగాణ సెంటిమెంట్ పూయడం.. ఇంకా రకరకాల విషయాలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి ఆ విశ్లేషకుడి మాటలకు కొంతమంది కావాలని తెలంగాణ వాదాన్ని పూశారు. జనసేన అధినేత పవన్ సరిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణలో సమావేశం పెట్టడం.. దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు చెప్పడం.. కొంతమంది మంత్రులు స్థాయి దాటి పవన్ మీద విమర్శలు చేయడం వంటి పరిణామాలు జరిగిపోయాయి.

ఈ లోగానే కొంతమంది యూట్యూబర్లు అత్యుత్సాహంతో పవన్ కళ్యాణ్ కోడి చెరువును ఆక్రమించారని తెరపైకి వచ్చారు. వారి తర్వాత కల్వకుంట్ల కవిత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన చెరువు శిఖాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ ఇలా వరుసగా జరిగిపోతూనే ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఔత్సాహికులు మరింత రెచ్చిపోతున్నారు. తెలంగాణ సెటిల్మెంట్ విషయంలో మరింత అగ్గి రాజేస్తున్నారు. వారందరికీ రాధాకృష్ణ గట్టిగానే గడ్డి పెట్టారు. కాంగ్రెస్ నుంచి మొదలుపెడితే గులాబీ పార్టీ నాయకుల వరకు అందరికీ కర్రు కాల్చి వాతపెట్టారు. ఇటీవల కాలంలో రాధాకృష్ణ ఈ స్థాయిలో రాసిన సంపాదకీయం లేదు.

తెలంగాణ ఏర్పాటును సిపిఎం వ్యతిరేకించింది. ఆ పార్టీకి నాగేశ్వర్ సానుభూతిపరుడు. అటువంటి నాగేశ్వర్ తెలంగాణ వాదుల సహకారం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోలేదు.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల భూములను కబ్జా చేశారు. నాడు ఉద్యమ నాయకుడిగా ఉన్న కేసీఆర్ పదేపదే ఈ స్థాయిలో విమర్శలు చేశారు.. కానీ ఈ నాటికి కూడా రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ వాదులకు టార్గెట్ గా లేరు.

కాంగ్రెస్ నేతలు పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతే అది గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఏ రూపంలో ఉన్నప్పటికీ అది బీఆర్ ఎస్ కు ప్రయోజనం కలిగిస్తుంది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారంటే.. దానివల్ల రేవంత్ రెడ్డి నష్టపోవడం గ్యారంటీ.

తెలంగాణ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన ప్రవేశిస్తే ప్రతిఘటన ఉంటుందని అర్థమవుతుంది. అలాంటప్పుడు ఆ రెండు పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకోకపోవడమే మంచిది. అయితే ఇది కూడా గులాబీ పార్టీకి అనుకూలంగా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారి సంస్థలకు తెలంగాణలో కాంట్రాక్టర్లు ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అలాంటప్పుడు ఆ కంపెనీలు వెళ్లిపోతే పనులు ఎవరు చేస్తారు

విదేశీ కంపెనీలకు భారీగా రాయితీలిచ్చి.. అన్ని రకాల వసతులు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆంధ్ర కంపెనీల మీద ద్వేషాన్ని ప్రదర్శించడం ఏంటి.. ఇక్కడ ఆంధ్ర కంపెనీలు పన్నులు చెల్లిస్తున్నాయి కదా

భారత రాష్ట్ర సమితి తమ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కాలంలో ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లను.. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది.. తెలంగాణ వాదులు దీనికోసం పోరాటం చేయాలి.. అనవసరంగా ఆంధ్ర వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. దీనివల్ల లాభం కూడా ఉండదు

ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ కొత్త పలుకు సంపాదకీయ పరంపర. వాస్తవానికి ఈ స్థాయిలో ఏ పాత్రికేయుడు కూడా విశ్లేషణ చేయలేదు. న్యూట్రల్ గా రాసుకుంటూ రాలేదు. అందువల్లే రాధాకృష్ణ కొత్త పలుకు ఈ వారం మిస్సైల్ లాగా పేలింది.

ఈ రాశుల వారికి ఈరోజు అనుకోని అదృష్టం.. వ్యాపారులకు అపారమైన లాభాలు..

Today 7 June 2026 Horoscope
Today 7 June 2026 Horoscope

Today 7 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా అదృష్టం వరించనుంది. మరికొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అపారమైన అవకాశాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యంగా ఉంటారు. గతంలో అనుకున్న కోరికల్లో ఒకటి నెరవేరుతుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల అండదండలు ఉండడంతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. స్నేహితుల సహకారంతో అప్పులను తీరుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల అండదండలతో పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంతో ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారులకు మాత్రం ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. ఇదే సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించడానికి కష్టపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యాలు ఎదురవుతాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈరోజు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారికి ఈరోజు ముఖ్యమైన సమాచారం అందుతుంది. లక్ష్మీదేవి అండదండలతో ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అంచనాలకు మించి లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులకు గురువుల అండదండలు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శుభవార్తను వింటారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్తగా ఆస్తి కొనాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో కంటే ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సాఫీగా సాగుతుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. త్వరలో చేసే విహారయాత్రల కోసం ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగులు అధికారుల అండదండలతో అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ నైపుణ్య ప్రదర్శన ద్వారా అనుకున్నది సాధిస్తారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయం గణనీయంగా ఉంటుంది. నాణ్యమైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు నిరుద్యోగులు కొత్త విషయాలను నేర్చుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రానికి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రీమియర్ షోస్ లో అత్యధిక గ్రాస్ ని రాబట్టిన టాప్ 5 సినిమాలు ఇవే.. 'పెద్ది' ఏ స్థానంలో ఉందంటే..

Highest Grossing Premiere Shows
Highest Grossing Premiere Shows

Highest Grossing Premiere Shows: ఒకప్పుడు ప్రీమియర్ షోస్ అంటే కేవలం ఓవర్సీస్ లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఇండియా లో కూడా వచ్చేసింది. చిన్న సినిమా , పెద్ద సినిమా అని తేడా లేదు, ప్రతీ సినిమాకు ప్రీమియర్ షోస్ వేసేస్తున్నారు నిర్మాతలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రీమియర్ షోస్ ద్వారా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల లిస్ట్ ఒకసారి చూద్దాం. ఈ ట్రెండ్ లో అందరూ ఊహించినట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్నాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ భారీ అంచనాల నడుమ గత ఏడాది విడుదలై ఎంతటి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇదే ఇప్పుడు నెంబర్ స్థానం లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాతి స్థానం లో ‘ధురంధర్ 2’ చిత్రం నిల్చింది. ‘ధురంధర్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడం తో ఈ చిత్రానికి హిందీ మార్కెట్ లోనే కాదు , సౌత్ మార్కెట్ లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ కారణం చేతనే ఈ చిత్రానికి మేకర్స్ ప్రీమియర్ షోస్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేశారు. ఓవర్సీస్ లో కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 61 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం రెండవ స్థానం లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం కొనసాగుతుంది. భారీ క్రేజ్ తో విడుదలైన ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇక ఆ తర్వాత నాల్గవ స్థానం లో లేటెస్ట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రం నిల్చింది. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ద్వారా 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో కాస్త తగ్గింది , లేదంటే ఈ చిత్రం 50 కోట్ల మార్కుని దాటి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక 5 వ స్థానం లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం కొనసాగుతుంది. ఈ చిత్రానికి దాదాపుగా 39 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చాయి. నైజాం ప్రాంతం లో ప్రీమియర్ షోస్ పడలేదు , లేదంటే ఈ చిత్రం కూడా 50 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఉండేది. ఇక ఆ తర్వాత ఆరవ స్థానం లో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం కొనసాగుతోంది.

రష్మీ సంప్రదాయ అందాలు చూడతరమా?

Rashmi Gautam photos
Rashmi Gautam photos

3వ రోజు అంచనాలను మించిపోయిన 'పెద్ది'.. ఇదేమి కుమ్ముడు సామీ.. కళ్ళు చెదిరిపోయే రేంజ్ గ్రాస్..

Peddi Box Office Collection
Peddi Box Office Collection

Peddi Box Office Collection: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం రోజురోజుకి అంచనాలను దాటి అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకువెళ్తోంది. ప్రతీ సెంటర్ లోనూ ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ ని చూస్తుంటే తలపండిన ట్రేడ్ పండితులకు సైతం మతి పోతుంది. ఈ రేంజ్ గ్రాస్ ని ఒక పెద్ద హీరో సినిమాకు చూసి ఎన్ని రోజులైందో అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. కరువు లో ఉన్న టాలీవుడ్ కి ‘పెద్ది’ ఇచ్చిన పెద్ద ధైర్యం సాధారణమైనది కాదు , ఇందుకే పెద్ద హీరోల సినిమాలు ఏడాదికి కనీసం రెండు మూడైనా విడుదలైతే థియేటర్స్ ని మూసివేసే పరిస్థితి రాదనీ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ చిత్రానికి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 155 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 97 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక వీకెండ్ మొదలు అవ్వడం తో రామ్ చరణ్ ఉగ్ర రూపాన్ని దాల్చేశాడు . చిన్న సెంటర్, పెద్ద సెంటర్, మాస్ థియేటర్, క్లాస్ థియేటర్ అని తేడా లేదు, ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని సెంటర్స్ లో అయితే ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన గ్రాస్ వసూళ్లకంటే నేడు నమోదైన గ్రాస్ వసూళ్లు ఎక్కువ. కొన్ని ప్రాంతాల్లో బయ్యర్స్ అప్పుడే సేఫ్ జోన్ లోకి కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. రేపటి నుండి వచ్చే ప్రతీ పైసా లాభమే అనే సెంటర్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈ చిత్రానికి నేడు నమోదైన గ్రాస్ వసూళ్లు చూస్తుంటే , ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రస్తుతం ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా ఈ చిత్రానికి కనిపిస్తున్న ట్రెండ్ ని చూస్తుంటే నేడు 45 కోట్ల గ్రాస్ మార్కుని కచ్చితంగా ఈ చిత్రం రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అదే కనుక జరిగితే మూడు రోజుల్లో 200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది. రేపు కూడా ఇదే రేంజ్ గ్రాస్ ని నమోదు చేసుకుంటే తొలి వీకెండ్ లో 250 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన సినిమాగా నిలుస్తుంది. మరోవైపు బలహీనంగా ఉన్నటువంటి ఓవర్సీస్ మార్కెట్ కూడా నేడు పుంజుకుంది. యావరేజ్ అనిపించుకుంటున్న నైజాం కూడా ఇరగకుమ్మేస్తోంది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ నెంబర్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది. హిందీ మార్కెట్ కాస్త సహకరిస్తే ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల మార్కుని అవలీలగా daati ఉండేది , ప్రస్తుతానికి అయితే ఆ రేంజ్ వసూళ్లు కష్టమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.