Homeఎంటర్టైన్మెంట్Arjun Blast movie box office collections: సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ సృష్టించిన అర్జున్...

Arjun Blast movie box office collections: సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ సృష్టించిన అర్జున్ ‘బ్లాస్ట్’ మూవీ.. ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే..

Arjun Blast movie box office collections: ప్రస్తుత జనరేషన్ లో ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఇస్తున్నటువంటి ఆదరణ అద్భుతం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ ఓటీటీ యుగం లో ఒక సినిమాకు థియేటర్ కి వెళ్లి ప్రేక్షకుడు చూడడం అనేది చాలా అరుదు. అంత తేలికైన విషయం కూడా కాదు , కానీ కచ్చితంగా థియేట్రికల్ అనుభూతి చెందాల్సిన సినిమా అని ప్రేక్షకుడికి అనిపిస్తే మాత్రం , హీరో ఎవరు అనేది అసలు పట్టించుకోవడం లేదు , వెంటనే టికెట్స్ తెంచేస్తున్నారు. అలా ఈమధ్య కాలం లో ఎంతమంది సీనియర్ హీరోలు కం బ్యాక్ ఇచ్చి , నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానమైన కలెక్షన్స్ ని రాబట్టడం చాలానే చూశాము. రీసెంట్ గా సీనియర్ హీరో , యాక్షన్ కింగ్ అర్జున్ కూడా గ్రాండ్ గా కం బ్యాక్ ఇచ్చాడు.

ఈయన హీరో పాత్రలకు దూరమై , క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి చాలా కాలం అయ్యింది. అలాంటి ఆయన , హీరో గా చాలా కాలం గ్యాప్ తర్వాత చేసిన చిత్రం ‘బ్లాస్ట్’. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా మామూలుగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ కలెక్షన్స్ లో కూడా కనిపిస్తోంది. బుక్ మై షో యాప్ నుండి ఈ చిత్రానికి దాదాపుగా 1 మిలియన్ కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. తెలుగు వెర్షన్ లో కూడా ఈ చిత్రం సైలెంట్ గా పికప్ అయ్యింది. చూస్తుంటే ఈ ఏడాది హీరోల కం బ్యాక్ కి బాగా కలిసొచ్చింది అనే చెప్పొచ్చు. చాలా కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న తమిళ స్టార్ హీరో సూర్య ‘కరుప్పు’ చిత్రం తో భారీ కం బ్యాక్ ఇచ్చాడు.

అదే విధంగా రీసెంట్ గానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘పెద్ది’ చిత్రం తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తూ , హిస్టారికల్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు సీనియర్ హీరో అర్జున్ కూడా కం బ్యాక్ ఇవ్వడం ఆసక్తికరమైన విషయం. ఈ చిత్రం లో అభిరామి , ప్రీతీ ముకుందన్ హీరోయిన్స్ గా నటించారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రేంజ్ లో క్లిక్ అవుతుందని బహుశా అర్జున్ కూడా ఊహించి ఉండదు. రీసెంట్ గానే ఆయన తన కూతురు ఐశ్వర్య ని పెట్టి ‘సీత పయనం’ అనే చిత్రం తీసాడు. ఈ సినిమాకు దర్శకుడు , నిర్మాత ఆయనే. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు ‘బ్లాస్ట్ ‘ చిత్రం ఆ పరాజయాన్ని మర్చిపోయేలా చేసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper