Homeబిజినెస్Maruti Suzuki bumper offer: చిన్న కార్లు కొనేవారికి బంపర్ ఆఫర్..

Maruti Suzuki bumper offer: చిన్న కార్లు కొనేవారికి బంపర్ ఆఫర్..

Maruti Suzuki bumper offer: Maruthi Suzuki కార్లు కొనేవారికి కంపెనీ ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా కార్ల ధరల పెంపు నుంచి ఉపశమనం కల్పించడంతో పాటు, కారు కొనుగోలును సులభతరం చేసేందుకు సరికొత్త ఆర్థిక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేంటో చూద్దాం..

మారుతీ సుజుకీ తన పాపులర్ ఎంట్రీ లెవల్ మోడళ్లపై ప్రైస్ ప్రొటెక్షన్ ను ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన ఆల్టో కే10 , ఎస్‌-ప్రెస్సో , సెలేరియో, వ్యాగన్-ఆర్ కార్లపై త్వరలో అమలు కానున్న రూ.30,000 ధరల పెంపు నుంచి వినియోగదారులకు మినహాయింపునిచ్చింది. ఈ ప్రయోజనం పొందాలంటే, వినియోగదారులు జూన్ 14వ తేదీలోపు పైన పేర్కొన్న కార్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువులోపు బుక్ చేసుకున్న వారికి పాత ధరలకే వాహనాలను అందజేస్తామని సంస్థ స్పష్టం చేసింది.

‘సుహానా సఫర్’ పేరుతో సరికొత్త పథకం
కార్ల కొనుగోలును సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు మారుతీ సుజుకీ ‘సుహానా సఫర్’ పేరుతో ఒక ప్రత్యేకమైన ఆర్‌డీ తరహా పథకాన్ని ప్రారంభించింది. కారు కొనాలనుకునే వారు ఈ పాలసీలో చేరి, నిర్ణీత కాల వ్యవధి (3 నుంచి 6 నెలల పాటు) ప్రతి నెలా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

డౌన్ పేమెంట్‌గా వినియోగం
ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మారుతీ సుజుకీ సంస్థ వడ్డీతో కలిపి తిరిగి చెల్లిస్తుంది. ఇలా పొదుపు చేసిన మొత్తం (అసలు + వడ్డీ)ను వినియోగదారులు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు ‘డౌన్ పేమెంట్’ (Down Payment) కింద వాడుకోవచ్చు. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని, ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు చెల్లించాల్సిన భారం తగ్గుతుందని సంస్థ పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
Oktelugu Epaper