Homeక్రీడలుWorld Football Tournament: ప్రపంచ ఫుట్‌బాల్‌ సమరం.. 48 జట్లతో సరికొత్త చరిత్ర!

World Football Tournament: ప్రపంచ ఫుట్‌బాల్‌ సమరం.. 48 జట్లతో సరికొత్త చరిత్ర!

World Football Tournament: ప్రపంచవ్యాప్త ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌ కప్‌–2026 రేపు(జూన్‌ 11) నుంచి ప్రారంభం అవతుంది. జులై 19 వరకు పోటీలు జరుగుతాయి. 39 రోజుల సంరంభం ఫుట్‌బాల్‌ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈసారి వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అతి పెద్ద టోర్నమెంట్‌. మొదటి సారి 48 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో, కెనడా కలిసి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే తొలిసారి. మొత్తం 104 మ్యాచులు 16 […]

World Football Tournament: ప్రపంచవ్యాప్త ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌ కప్‌–2026 రేపు(జూన్‌ 11) నుంచి ప్రారంభం అవతుంది. జులై 19 వరకు పోటీలు జరుగుతాయి. 39 రోజుల సంరంభం ఫుట్‌బాల్‌ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈసారి వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అతి పెద్ద టోర్నమెంట్‌. మొదటి సారి 48 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మెక్సికో, కెనడా కలిసి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఇదే తొలిసారి. మొత్తం 104 మ్యాచులు 16 వేదికల్లో జరగనున్నాయి. గతంలో 32 జట్లతో జరిగిన టోర్నమెంట్‌ ఇప్పుడు 48కి పెరగడంతో గ్రూప్‌ స్టేజ్‌ నుంచి నాకౌట్‌ దశ వరకు ఉత్కంఠ మరింత పెరిగింది.

కొత్త ఫార్మాట్‌ ఇలా..
48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు (ప్రతి గ్రూపులో 4 జట్లు). ప్రతీ జట్టు గ్రూప్‌ స్టేజ్‌లో 3 మ్యాచులు ఆడాలి. ప్రతీ గ్రూపు నుంచి టాప్‌–2 జట్లు + అన్ని గ్రూపుల నుంచి 8 ఉత్తమ 3వ స్థాన జట్లు మొత్తం 32 జట్లు నాకౌట్‌ దశకు (రౌండ్‌ ఆఫ్‌ 32) చేరుకుంటాయి. ఇది గత టోర్నమెంట్ల కంటే ఒక అదనపు నాకౌట్‌ రౌండ్‌ను తీసుకొచ్చింది. ఓపెనింగ్‌ మ్యాచ్‌ జూన్‌ 11న మెక్సికో సిటీలోని ప్రసిద్ధ ఎస్టాడియో అజ్టెకాలో మెక్సికో, సౌత్‌ ఆఫ్రికా మధ్య జరుగుతుంది. ఫైనల్‌ జులై 19న న్యూయార్క్‌ సమీపంలోని మెట్‌లైఫ్‌ స్టేడియం (న్యూయార్క్‌/న్యూజెర్సీ)లో జరగనుంది.

ఈసారి ఫేవరెట్లు ఎవరు?
ప్రస్తుత ఫామ్, యువ ఆటగాళ్ల సత్తా, గత ప్రదర్శనల ఆధారంగా విశ్లేషకులు, బెట్టింగ్‌ ఏజెన్సీలు స్పెయిన్‌ను టాప్‌ ఫేవరెట్‌గా ఉంది. తర్వాత ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌ జట్టు బలంగా ఉన్నాయి. బ్రెజిల్, పోర్చుగల్, డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా కూడా ఫేవరెట్‌ రేసులో ఉన్నాయి.

ఈ టోర్నమెంట్‌కు భారత్‌ అర్హత సాధించలేదు. ఏషియా క్వాలిఫయర్స్‌లోనే భారత జట్టు ముందస్తుగా నిష్క్రమించింది. అయినప్పటికీ భారతీయ ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌ ఈ టోర్నమెంట్‌ను టీవీల ద్వారా ఉత్సాహంగా వీక్షించనున్నారు. ఫిఫా వరల్డ్‌ కప్‌–2026 చరిత్రలో ఒక మైలురాయి. 48 జట్లు, మూడు దేశాల ఆతిథ్యం, 104 మ్యాచులు, కొత్త ఫార్మాట్‌… ఈ నాలుగు వారాలు ప్రపంచ ఫుట్‌బాల్‌ అభిమానులకు నిజమైన పండగగా మారనుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper