Homeహెల్త్‌Health Benefits Of Figs: చూసేందుకు బాగోలేదని పక్కన పెట్టకండి.. దీన్ని తింటే ఎన్ని లాభాలో...

Health Benefits Of Figs: చూసేందుకు బాగోలేదని పక్కన పెట్టకండి.. దీన్ని తింటే ఎన్ని లాభాలో తెలుసా..

Health Benefits Of Figs: ఆ పండు చూసేందుకు మామిడి పండులాగా మెరిసిపోదు. ద్రాక్ష పళ్ళ లాగా ఆసక్తిగా ఉండదు. నలుపు.. ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. కొనడానికి అంతగా మనసు ఒప్పుకోదు. దానిని తినాలంటే కూడా అంతగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే దానిని మొత్తం ఒలిచి చూస్తే మేడిపండు లో పురుగుల మాదిరిగా ఉంటుంది. కానీ దానిని తింటే ఉంటుంది.. చాలామందికి పై ఉపోద్ఘాతం చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఆ పండు మరి […]

Health Benefits Of Figs: ఆ పండు చూసేందుకు మామిడి పండులాగా మెరిసిపోదు. ద్రాక్ష పళ్ళ లాగా ఆసక్తిగా ఉండదు. నలుపు.. ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. కొనడానికి అంతగా మనసు ఒప్పుకోదు. దానిని తినాలంటే కూడా అంతగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే దానిని మొత్తం ఒలిచి చూస్తే మేడిపండు లో పురుగుల మాదిరిగా ఉంటుంది. కానీ దానిని తింటే ఉంటుంది..

చాలామందికి పై ఉపోద్ఘాతం చాలా సందర్భాల్లో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఆ పండు మరి ఏంటో కాదు అంజీర్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో నీటి సరఫరా అధికంగా ఉన్న ప్రాంతాలలో పండుతూ ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఔత్సాహిక రైతులు వేరే ప్రాంతాల నుంచి మొక్కలను తీసుకొచ్చి అంజీర్ సాగు చేస్తున్నారు. అంజీర్ మామూలు పండ్ల మొక్క కాదు.. ఇది తక్కువ ఎత్తులో పెరుగుతుంది. నాటిన ప్రతి కాలం నుంచే కాపుకు వస్తుంది. దీని కాయలు పక్వానికి వచ్చినప్పుడు ముదురు నలుపు ఆకుపచ్చ రంగులోకి మారుతాయి.. అందులో ఉన్న గుజ్జు ఎర్రగా కనిపిస్తుంది.. దానిని తింటే పోషకాలు విపరీతంగా లభిస్తుంటాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. గుండె జబ్బులతో ఇబ్బంది పడేవారు.. కండరాలను బలోపేతం చేసుకోవాలి అనుకునేవారు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అనుకునేవారు.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనుకునేవారు.. చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవాలి అనుకునేవారు.. కచ్చితంగా ప్రతిరోజు రెండు నుంచి నాలుగు వరకు అంజీర్ పండ్లను తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను అధిక మోతాదులో తీసుకుంటే విరోచనాలు.. కడుపు ఉబ్బరం వంటి సమస్య ఎదురవుతుందని వైద్యులు అంటున్నారు.

అంజీర్ పండ్లు రుచికి తీపిగా ఉంటాయి.. ఈ పండులో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. మధుమేహం.. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ పండ్లను వైద్యుల సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.

గమనిక

ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైద్యుల చికిత్సకు ప్రత్యామ్యాయం కాదు. దీనిని పాఠకులు గుర్తించాలని మనవి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper