Home Blog Page 156

బస్సు యాత్రలో కేసీఆర్.. మరి జగన్?!

KCR Bus Yatra
KCR Bus Yatra

KCR Bus Yatra: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు భిన్నంగా కొనసాగుతాయి. కానీ ఒక విషయంలో మాత్రం సారూప్యత ఉంది. ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి తీరు ఒకేలా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరిదీ ఒకటే అహంభావం. అధికారం కోల్పోయాక ఇద్దరు ఇళ్లకే పరిమితం అవుతూ వస్తున్నారు. పెద్దగా జనం మధ్యకు రావడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం మాత్రమే ఉంది. ఏపీలో మాత్రం ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది. అయితే ఇప్పుడు కెసిఆర్ జనం మధ్యకు వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. పాదయాత్ర పేరు చెప్పి ఆయన జనం మధ్యకు వచ్చే షెడ్యూల్ను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ఇప్పుడు కెసిఆర్ ప్రకటనతోనైనా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తారా? అన్నది చూడాలి.

* ఫామ్ హౌస్ కు పరిమితం..
తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న గులాబీ కాంగ్రెస్ పార్టీ చేతిలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పటినుంచి కెసిఆర్ ఎర్రబల్లిలోని ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. అసెంబ్లీకి సైతం హాజరు కావడం లేదు. కేటీఆర్ తో పాటు హరీష్ రావుతో కథ నడిపిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని మొన్న ఆ మధ్యన లీకులు ఇచ్చారు. కానీ అటువంటి సభలు ఏవి నిర్వహించిన దాఖలాలు లేవు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ హడావిడి ప్రారంభమైంది గులాబీ పార్టీలో. కనీసం ఈ బస్సు యాత్ర అయినా చేపడతారా లేదా అన్నది చూడాలి.

* జనంలోకి వస్తానని చెప్పి..
జగన్మోహన్ రెడ్డి సైతం 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. 2025 సంక్రాంతి నాటికే జనంలోకి వచ్చేస్తాను అంటూ ప్రకటనలు చేశారు. అటు తరువాత మరో సంక్రాంతి దాటిపోయింది కానీ ఆయన ప్రజల ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. వచ్చే ఏడాది జూలై నుంచి పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల వరకు ప్రజల్లో ఉంటానని చెబుతూ వచ్చారు. అంతకుముందు పార్టీ ప్లీనరీ నిర్వహించాలి. కానీ అటువంటి సన్నాహాలేవీ ప్రారంభించలేదు. మరోవైపు పాదయాత్రకు ఇంకా ఏడాది సమయం ఉంది. పాదయాత్ర తో ముడిపెట్టి జనాల్లోకి వస్తే ఎంత మాత్రం ప్రజలు హర్షించే పరిస్థితుల్లో ఉండరన్న టాక్ ఉంది. ఎందుకంటే గతం పాదయాత్ర వేరు.. ఇప్పుడు పాదయాత్ర వేరు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్ర చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారన్న సంకేతాలు కచ్చితంగా వెళ్తాయి. దానిని ప్రజలు హర్షించరు కూడా. అయితే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ చేస్తున్న రాజకీయమే అధికార పార్టీకి శ్రీరామరక్ష అన్నట్టు ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…

ఎండలు, వానలు.. ఏపీలో ఏంటీ ఉపద్రవం?!

Andhra Pradesh Weather
Andhra Pradesh Weather

Andhra Pradesh Weather Update: ఏపీలో భిన్న వాతావరణం ఉంది. ఒకవైపు ఎండలు, ఇంకోవైపు వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. మధ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ, కోస్తాంధ్ర, కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్య ఛాన్స్ కూడా కనిపిస్తోంది. పగటిపూట ఎండలు, సాయంత్రం పూట వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో మూడు రోజులపాటు ఇలానే ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఉష్ణోగ్రతలతో పాటు వర్షాలపై కూడా కీలక అప్డేట్ ఇచ్చింది. ఇంకోవైపు నైరుతి రుతుపవనాల ప్రవేశం తో ఎక్కడికక్కడే వాతావరణం మారుతోంది.

* ఉపరితల ఆవర్తన ప్రభావంతో
ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మరో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు, కొంత ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది.
* మరోవైపు బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయం నాటికి శ్రీకాకుళం జిల్లా గరికిపాలంలో 72 మిల్లీమీటర్లు, లావేరులో 64 మిల్లీమీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 48 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా రావికమతంలో 29 మిల్లీమీటర్లు, ఎస్ రాయవరంలో 28 మిల్లీమీటర్లు, విశాఖ జిల్లా పెందుర్తిలో 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
* గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 13 మండలాల్లో తీవ్రవడగాలులు, 42 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అందుకే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గట్టిగానే హెచ్చరికలు పంపుతోంది.

మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్!

APSRTC Good News For Women
APSRTC Good News For Women

APSRTC Good News For Women: ఏపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించింది. దాదాపు 5 రకాల బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం కొనసాగుతోంది గత కొంతకాలంగా. ఇప్పుడు మహిళల భద్రత, సంక్షేమం లక్ష్యంతో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో మహిళలు ఎదుర్కొనే అత్యంత సున్నితమైన, అత్యవసరమైన నెలసరి ఇబ్బందులను దూరం చేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో శానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సర్వీసులో త్వరలోనే అధికారికంగా అమలు చేయనున్నారు.

* పెరిగిన మహిళల ప్రయాణం..
ఉచిత ప్రయాణ పథకం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం పెరిగింది. సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు సైతం ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వెళ్లే సమయంలో అనుకోని విధంగా నెలసరి వస్తే బస్సుల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనిని అధిగమించేందుకు ప్రతి ఆర్టీసీ బస్సుల్లోనూ శానిటరీ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి లేఖ రాశారు. కేవలం బస్టాండ్లలోనే కాకుండా.. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఇవి దొరికితే మహిళలకు ఎంతో పోరాట కలుగుతుంది. పౌర సమాజంలో మహిళల ఆరోగ్య రక్షణకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఆమె ఆ లేఖలో ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

* మంత్రి సానుకూల స్పందన..
మహిళా కమిషన్ చైర్ పర్సన్ అరుణ చేసిన ప్రతిపాదనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మహిళల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ డిమాండ్ ను తక్షణమే ఆమోదించి.. ఆర్టీసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాయపాటి శైలజ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ.. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సుదూర ప్రాంత సర్వీసులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రత్యేక బాక్సులలో ఈ న్యాప్ కిన్స్ అందుబాటులో ఉంచేందుకు ఆర్టీసీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

కూటమికి 'కాపు గర్జన' సంకేతాలు!

Kapu Meeting
Kapu Meeting

Kapu Garjana: ఏపీలో కాపులు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా తూర్పుగోదావరిలో కాపుల మహా గర్జన జరిగింది. అయితే ఇది కూటమికి ఒక హెచ్చరిక లాంటిది. ప్రస్తుతం కాపులకు ఉన్న ఏకైక ఆప్షన్ కూడా కూటమి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్మేస్థితిలో కాపులు లేరు. ఒకసారి కాపులు ఆ పార్టీని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేయకపోగా.. కాపులకు సంబంధించి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పర్యవసానాలే ఆ పార్టీకి కాపులు దూరమయ్యారు. అప్పుడే వారంతా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయ్యారు. అలా కూటమి వైపు అడుగులు వేశారు. అయితే ఇప్పుడు కూటమి పాలన రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో కాపులు తమ సమస్యలను పరిష్కరించాలని.. తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమ బాట పడుతుండడం విశేషం.

* వైసీపీకి నో ఛాన్స్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కాపుల ఆలోచన మారే పరిస్థితి లేదు. ఎందుకంటే కాపుల రిజర్వేషన్లు అమలు చేయలేను అంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతకుముందు చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన ఐదు శాతం ఈ బి సి రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఈ ఆర్థికపరమైన రిజర్వేషన్లను ఐదు శాతం ఇచ్చారు అప్పట్లో చంద్రబాబు. కానీ నేరుగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ముద్రగడ పద్మనాభం పెద్ద ఉద్యమమే చేపట్టారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత ఉద్యమమని తదనంతర పరిణామాల్లో తెలుసుకున్నారు కాపులు. అదే ముద్రగడ రాజకీయ ప్రేరేపితంలో భాగంగానే చేశారని ఆయన వైసీపీలోకి వెళ్లిన తర్వాత అర్థం అయింది. అయితే ఇప్పుడు కాపులు ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇచ్చిన కొంతవరకు సంతృప్తి పడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అది నెరవేర్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.

* ఈ బీసీ రిజర్వేషన్లు అమలు..
ప్రస్తుతం జరుగుతున్న కాపుల ఆందోళన కార్యక్రమాల్లో ఒక అర్థం ఉంది. దానిని అర్థం చేసుకునే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. గత మాదిరిగా ఈ బీసీ రిజర్వేషన్లు ఇస్తే మిగతా సామాజిక వర్గాలు వ్యతిరేకించే అవకాశం లేదు. అయితే గతసారి ఐదు శాతం ఇచ్చారు. ఈసారి మాత్రం 10% ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఆపై నామినేటెడ్ పోస్టులతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల్లో కాపులకు సింహభాగం ప్రయోజనాలు కల్పించవచ్చు. ఒకవైపు సామాజిక వర్గానికి ఆర్థికపరమైన పథకాలు కూడా అందించవచ్చు. సామాజిక వర్గ నేతలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచవచ్చు. మరి ఇంతకంటే ఏం చేయగలరు. అయితే వైసీపీలో ఉన్న కాపు నేతలు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్ ఉన్న నేతల ప్రకటనలకు భిన్నంగా.. కూటమిని అలెర్ట్ చేసేందుకే ఈ కాపు గర్జనలు అని స్పష్టమవుతోంది. అయితే దీనిని మేల్కొని కూటమి ప్రభుత్వం కాపుల అభిమానాన్ని చూరగుంటే వైసిపి చేసే ప్రయత్నాలు ఏవి ఫలించవు కూడా.

ప్రపంచానికి షాక్.. రష్యా కొత్త ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టం.. ఉక్రెయిన్‌కు ఇక ఇత్తడే!

Russia New Air Defense System
Russia New Air Defense System

Russia New Air Defense System: రష్యా–ఉక్రెయిన్‌ వార్‌ మళ్లీ ఉధృతమవుతోంది. ప్రపంచమంతా అమెరికా–ఇరాన్‌ యుద్ధంపై దృష్టి పెట్టాగా రష్యా–ఉక్రెయిన్‌ సందెట్లో సడేమియాలా పరస్పరం దాడులు తీవ్రం చేశాయి. రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ ఎస్‌–400 సిస్టంకు చిక్కకుండా తయారు చేసిన డ్రోన్లతో ఉక్రెయిన్‌ దాడులు చేస్తోంది. ఇటీవలే కీలక ఆయిల్‌ కేంద్రంపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో రష్యా కొత్త ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను యాక్టివేట్‌ చేసింది.

నాలుగు ఫైటర్‌ జెట్ల కూల్చివేత..
ఇటీవల ఉక్రెయిన్‌కు చెందిన ఐదు ఫైటర్‌ జెట్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయాయి. లక్ష్యాలను ఛేదించే ప్రయత్నం చేశాయి. కానీ రష్యా కొత్త ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ఆ దాడిని అడ్డుకుంది. లక్ష్యాలను చేరుకోవడానికి మరికొన్ని నిమిషాల దూరంలో ఉన్నప్పుడు రష్యా నాలుగు ఫైటర్‌ జెట్లను కూల్చింది. ఒక్కటి తప్పించుకుని వెనుదిరిగింది.

అధికారిక ప్రకటన చేయని రష్యా..
ఆసక్తికరమైన విషయం ఏమంటే రష్యా ఈ కొత్త సిస్టమ్‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ప్రపంచం ఈ దాడిలో కొత్త రకం ఎలక్ట్రో మాగ్నటిక్‌ పల్స్‌ (ఈఎంపీ) టెక్నాలజీ ఉపయోగించినట్లు గుర్తించింది. రష్యా ఎస్‌–400ను కన్ఫ్యూజ్‌ చేసే డ్రోన్లు తయారు చేశామని ఉక్రెయిన్‌ ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా దానిని ఎదుర్కొనేలా కొత్త వ్యవస్థను ఉపయోగించి ప్రతిస్పందించినట్లు స్పష్టమవుతోంది.

టెన్నాలజీ కీలకం..
ఈ ఘటన రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో సాంకేతికత ఎంత కీలకమో మరోసారి నిరూపించింది. ఉక్రెయిన్‌ రాడార్‌–ఎవేడింగ్‌కన్‌ఫ్యూజన్‌ టెక్నాలజీపై ఆధారపడుతున్నా, రష్యా ఈఎంపీ వంటి డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్‌ల వైపు మళ్లింది. అయితే రష్యా అధికారికంగా ప్రకటించకపోవడం ఆసక్తికరం. ఇది తన కొత్త సామర్థ్యాలను రహస్యంగా ఉంచుకుని, శత్రువును అనిశ్చితిలో ఉంచే వ్యూహం కావచ్చు. అయితే ఒక జెట్‌ తప్పించుకోవడం రష్యా సిస్టమ్‌ ఇంకా పరిపూర్ణంగా లేదని, మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది.

ఈ సాంకేతిక యుద్ధం భవిష్యత్తులో వైమానిక దాడుల విధానాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. రాడార్‌ ఆధారిత రక్షణ వ్యవస్థలు ఇకపై ఏకైక ఆధారం కాకుండా, ఎలక్ట్రోమాగ్నెటిక్, డైరెక్ట్‌ ఎనర్జీ వెపన్‌లు యుద్ధ రంగంలో కీలక పాత్ర పోషించే దశకు చేరుకున్నట్లు ఈ ఘటన చెబుతోంది.

ఆ ఇద్దరు మాజీ మంత్రులతో జగన్ కు తలనొప్పి!

YS Jagan
YS Jagan

YS Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా జిల్లాల్లో ఇంకా కోలుకోలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తాం అంటూ ప్రకటనలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే నెల్లూరు జిల్లాలో వైసిపి నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ శ్రేణులకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. ఎన్నికలకు ముందు చాలా మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుడ్ బై చెప్పారు. టిడిపిలో చేరిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా చాలామంది పార్టీని వీడారు. అయితే ఉన్న నేతల్లో సఖ్యత లేదు. సీనియర్ నేతలు మౌనంగా ఉన్నారు. కానీ ఇద్దరు మాజీ మంత్రులు మాత్రం ఆధిపత్యం కోసం గట్టిగానే తలపడుతున్నారు. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.

* పార్టీ ఆవిర్భావం నుంచి..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తూ వస్తోంది నెల్లూరు జిల్లా. రాజకీయంగా పేరు మోసిన కుటుంబాలన్నీ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచాయి. పెద్దపెద్ద నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేసేవారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతలంతా ఎంతో నమ్మకంతో పనిచేసే వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో. కానీ వారి విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్న విమర్శ ఉంది. సీనియర్లుగా, పార్టీకి అండగా నిలిచిన వారిని కాదని జూనియర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో వీరంతా మనస్థాపానికి గురయ్యారు. అడుగడుగునా అవమానాలు పడ్డారు. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పారు.

* సీనియర్లపై నిర్లక్ష్యం..
2014, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఘన విజయం సాధించింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది కానీ.. నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీ హవా చాటింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. నెల్లూరులో తన సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు. నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు. అయితే ఆయన జగన్ అండదండలు ఉన్నాయని చెప్పి రెడ్డి సామాజిక వర్గం నేతలపై ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒకానొక దశలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై కూడా వ్యక్తిగత దూషణలకు దిగారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ తన నోటికి పని చెప్పేవారు అనిల్. అలా రెండున్నర సంవత్సరాల పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సంఘర్షణ వాతావరణంతో గడిపారు. దీంతో వైసీపీ నేతలు అంతా విసిగి వేసారి పోయారు. తరువాత అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. ఆయన వైఖరి సైతం అలానే ఉండడంతో 2024 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతలు టిడిపిలోకి క్యూ కట్టారు.

* పోటా పోటీగా ప్రకటనలు
2024 ఎన్నికల ఫలితాల్లో టిడిపి స్వీప్ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించి నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పంపించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి దూరంగా ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా వైసీపీ అంటే తనదంటే తనది అని పోటాపోటీగా ప్రకటనలు చేసుకున్నారు. ఈ నేతల ప్రవర్తన చూసి పార్టీ శ్రేణులు ముక్కున వేలేసుకున్నాయి. ఇలా అయితే కష్టమని నిట్టూరుస్తున్నాయి.

అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా?

Tara Sutaria bikini look
Tara Sutaria bikini look

మొబైల్‌ డేటా మస్తు అగ్గువ.. నాడు 1 జీబీ రూ.269.. నేడు రూ.9 మాత్రమే!

Mobile Data Price India
Mobile Data Price India

Mobile Data Price India: పెట్రోల్‌ ధరలు పెరిగాయని, డీజిల్‌ ధరలు పెరిగాయిని, గ్యాస్‌ ధరలు పెరిగాయని, కంరెటు చార్జీలు పెరిగాయని, బస్సు చార్జీలు పెరిగాయని వామపక్ష పార్టీలు, విపక్షాలు ఆందోళనలు చేయడం సహజం. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్రో, గ్యాస్‌ ధరలపైనే విపక్షాలు ఎక్కువగా ఆందోళన చేశాయి. అయితే ధరలు తగ్గినప్పుడు మాత్రం ఎవరూ స్వాగతించరు. అయితే రోజురోజుకు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. కానీ 12 ఏళ్లలో అనూహ్యంగా ఒకదాని ధర 97 శాతం తగ్గింది. అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందే మొబైల్‌ డేటా.

డిజిటల్‌ రంగంలో అపూర్వ విజయం..
కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ రంగంలో సాధించిన అపూర్వ విజయాన్ని వెల్లడించింది. 2014లో 1 గిగాబైట్‌(జీబీ) డేటా ధర రూ.269 ఉంటే, ప్రస్తుతం అది కేవలం రూ.9.2కి తగ్గింది. అంటే గత 4,399 రోజుల్లో (సుమారు 12 ఏళ్లలో) డేటా ధరలో 97 శాతం తగ్గుదల నమోదైంది.
ఇది భారత్‌ డిజిటల్‌ చరిత్రలో ఒక మైలురాయి. ఈ అద్భుత మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం నిరంతరం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం, భారత్‌నెట్‌ ప్రాజెక్ట్, ఆప్టికల్‌ ఫైబర్‌ విస్తరణ, పోటీతత్వం ప్రోత్సాహం, 2016లో రిలయన్స్‌ జియో ప్రవేశం వంటి అనేక అంశాలు కలిసి ఈ ధరల తగ్గుదలకు దోహదపడ్డాయి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను విస్తరించడం, స్పెక్ట్రం అలాట్‌మెంట్‌లో పారదర్శకత, 5జీ సేవల వేగవంతమైన రోల్‌అవుట్‌ వంటి చర్యలు డేటా సరఫరాను భారీగా పెంచి, ధరలను తగ్గించాయి.

సామాన్యుల జీవితాలపై ప్రభావం..
ఈ చౌక డేటా ధరల వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులు, విద్యార్థులు, రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు, గ్రామీణ యువతకు అధునాతన ఇంటర్నెట్‌ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. విద్యా రంగంలో ఆన్‌లైన్‌ క్లాసులు, డిజిటల్‌ లెర్నింగ్‌
ఆరోగ్య రంగంలో టెలి మెడిసిన్‌ సేవలు, ఆర్థిక రంగంలో యూపీఐ, డిజిటల్‌ బ్యాంకింగ్, చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌ ద్వారా దేశవ్యాప్తంగా మార్కెట్‌ను చేరుకోవడానికి చౌక డేటా ధరలు ప్రధాన ఆధారం అయ్యాయి.

ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా ధరలు కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. నాణ్యతతోపాటు చౌకదనం కలిపి ఇంటర్నెట్‌ను సామాన్యుని జేబులోకి తీసుకువచ్చిన దేశంగా భారత్‌ ప్రపంచం ముందు నిలుస్తోంది. మోదీ పాలనలో డేటా ధరల్లో వచ్చిన ఈ భారీ తగ్గుదల కోట్లాది భారతీయుల జీవన విధానాన్ని, అవకాశాలను మార్చిన నిజమైన డిజిటల్‌ విప్లవం. చౌకైన, నాణ్యమైన ఇంటర్నెట్‌ దేశంలోని చివరి వ్యక్తి వరకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్రయాణం భారత్‌ను ప్రపంచ డిజిటల్‌ శక్తిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

'అమరావతి' పై మారిన కేంద్రం వైఖరి!

Amaravati Central Government
Amaravati Central Government

Amaravati Central Government: అమరావతి రాజధాని కి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం మరోసారి నిరూపించుకుంది. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర క్యాబినెట్. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సిబ్బందికి సంబంధించిన వాటర్స్ నిర్మాణానికి దాదాపు 2500 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది కేంద్రం. నిజంగా ఇది గొప్ప పరిణామం. అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూనే ఉంది. చివరకు చట్టబద్ధతను సైతం ఎగతాళి చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే కేంద్రం జగన్మోహన్ రెడ్డికి ధీటైన సమాధానం చెబుతోంది. భారీగా నిధులు కేటాయించి.. అమరావతి విషయంలో తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటోంది. ఇది నిజంగా గొప్ప పరిణామం. ఎందుకంటే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ ఒకే కాంప్లెక్స్ లోకి రానున్నాయి. అత్యాధునిక హంగులతో దాదాపు 1250 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం.

* గతానికి భిన్నంగా..
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత గతానికి భిన్నంగా వ్యవహరించింది అమరావతి విషయంలో. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. రాజధాని నిర్మాణ పనులను అప్పటి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా కేంద్రం నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. పైగా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం మద్దతు ఉందని.. మూడు రాజధానులకు జై కొట్టిందంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వపరంగా అప్పట్లో జోక్యం చేసుకోలేదు. కానీ బిజెపి రాజకీయ పార్టీ పరంగా మాత్రం దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

* భారీగా నిధుల కేటాయింపు..
జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను నిర్మించలేకపోయారు. అధికారికంగా ప్రకటనకు కూడా ధైర్యం చేయలేకపోయారు. కానీ కూటమి వచ్చిన తరువాత గతానికి భిన్నంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి రాజధాని నిర్మాణానికి ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను సైతం కేటాయించింది అమరావతికి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించిన బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను ఒకే చోట నిర్మిస్తోంది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది అమరావతిలో. అంతటితో ఆగకుండా అధికారులతో పాటు ఉద్యోగులు నివాసం ఉండే వీలుగా క్వార్టర్స్ సైతం నిర్మిస్తోంది. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషప్రచారంపై మోడీ సర్కార్ తన నిధులతో గట్టిగానే సమాధానం చెబుతోంది.

నిద్ర పట్టని వారిలో ఈ సమస్య.. 'న్యూరాలజీ' జర్నల్‌ హెచ్చరిక..

Sleep Deprivation
Sleep Deprivation

Sleep Deprivation: ప్రస్తుత కాలంలో ఒత్తిడి, పని భారం, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం, అనారోగ్యకర జీవనశైలి కారణంగా చాలామంది రాత్రిళ్లు సరిగా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు నిద్రలేమి ఉండడం సాధారణమే అయినప్పటికీ, ఇది తరచుగా ఎదురైతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొన్న వారిలో డిమెన్షియా ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రతిరోజూ సరిపడా నిద్రపోని వ్యక్తుల్లో డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ‘న్యూరాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నవారిలో డిమెన్షియా ప్రమాదం సుమారు 40 శాతం వరకు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రమాదం మరింత ఎక్కువ కావచ్చని వారు పేర్కొన్నారు. సాధారణంగా నిద్ర సమయంలో మెదడు తనను తాను పునరుద్ధరించుకుంటుంది. రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించడం, అవసరం లేని వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి పనులు నిద్రలోనే జరుగుతాయి. అయితే నిద్ర సరిగా లేకపోతే ఈ ప్రక్రియలు దెబ్బతింటాయి. ఫలితంగా మెదడు పనితీరు తగ్గి, మెదడు వయసు నిజమైన వయసుతో పోలిస్తే 3.5 రెట్లు వేగంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

నిద్రలేమి కారణంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం, ఏకాగ్రత తగ్గిపోవడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం క్షీణించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టంగా మారుతుంది. అలాగే భావోద్వేగ నియంత్రణ కూడా తగ్గి చిరాకు, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రలేమి కేవలం మెదడుకే కాదు, మొత్తం శరీరానికీ హానికరం. రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదాన్ని ఇది పెంచుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా బలహీనపడటంతో తరచూ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది.

చాలామంది నిద్ర రాకపోతే వెంటనే నిద్రమాత్రల వైపు మొగ్గు చూపుతారు. అయితే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వెనుక ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. కాబట్టి మూల కారణాన్ని గుర్తించి పరిష్కరించడం ముఖ్యం.

పడుకునే ముందు మనసుకు ప్రశాంతత కలిగించే కథలు చదవడం, ఆడియో స్టోరీలు వినడం, మృదువైన సంగీతం ఆస్వాదించడం నిద్రకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా వంటి పద్ధతులు కూడా మెదడును రిలాక్స్ చేసి త్వరగా నిద్ర పట్టేలా చేస్తాయి.ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి సమయంలో మొబైల్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలి. కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలను సాయంత్రం తర్వాత తీసుకోకపోవడం మంచిది. పడకగదిని ప్రశాంతంగా, చీకటిగా ఉంచడం కూడా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

ఈరోజు పరమ ఏకాదశి... ఇలా చేస్తే చాలా నష్టం..

Param Ekadashi 2026
Param Ekadashi 2026

Param Ekadashi 2026: హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అయితే మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే పరమ ఏకాదశి మరింత విశిష్టమైనదిగా భావిస్తారు. అధిక మాసంలో కృష్ణ పక్ష ఏకాదశి రోజున వచ్చే ఈ పవిత్ర తిథిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. 2026 జూన్ 11న వచ్చే ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించి ఉపవాసం ఉండటం ద్వారా పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. పరమ ఏకాదశి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పరమ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు. ఇది శరీర శుద్ధితో పాటు మనస్సు, ఆలోచనలు, ప్రవర్తనను కూడా పవిత్రంగా ఉంచే ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. భక్తులు రోజంతా విష్ణు నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విధంగా భక్తితో గడపడం వల్ల మనశ్శాంతి, ఆత్మసంతృప్తి కలుగుతాయని విశ్వాసం.

పండితుల సూచనల ప్రకారం.. పరమ ఏకాదశి ఉపవాసాన్ని పాటించేవారు ముందురోజు నుంచే కొన్ని నియమాలు అనుసరించాలి. ముఖ్యంగా బ్రహ్మచర్యం పాటించడం, సాత్విక ఆహారం తీసుకోవడం, కోపం మరియు అనవసర వాదనలకు దూరంగా ఉండడం అవసరం. ఉపవాసం అనేది శరీర నియంత్రణతో పాటు ఇంద్రియ నియంత్రణకు కూడా ప్రతీకగా భావిస్తారు.

ఏకాదశి రోజున పగటి సమయంలో నిద్రపోవడం మంచిది కాదని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఈ రోజు వీలైనంత వరకు జపం, ధ్యానం, భజనలు లేదా పుణ్యగ్రంథాల పఠనంలో సమయాన్ని గడపాలని చెబుతారు. అలాగే అహింసను పాటించడం, జీవుల పట్ల దయా భావం కలిగి ఉండడం కూడా ఈ వ్రతంలో ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.

ఈ రోజున తులసి ఆకులను తుంచకూడదని పండితులు చెబుతున్నారు. తులసి దేవిని విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అందువల్ల ఏకాదశి రోజున తులసిని కోయడం శాస్త్ర విరుద్ధమని చెబుతారు. ముందుగానే తులసి దళాలను సేకరించి పూజలో ఉపయోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఉపవాసం చేసేవారు సాధ్యమైనంత వరకు ఉప్పు తినకుండా ఉండాలని సంప్రదాయం. కొందరు పూర్తిగా నిరాహారంగా ఉండగా, మరికొందరు పండ్లు, పాలు వంటి ఫలాహారం మాత్రమే తీసుకుంటారు. శరీరానికి ఇబ్బంది కలగకుండా తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసాన్ని ఆచరించవచ్చు.

పరమ ఏకాదశి రోజున మాటలు, ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, విమర్శించడం, అసూయ, ద్వేషం, కోపం వంటి ప్రతికూల భావాలను దూరం పెట్టాలి. అలాగే తిట్టడం, అబద్ధాలు చెప్పడం, అనవసర కలహాలు సృష్టించడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు.

పురాణాల ప్రకారం పరమ ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభించి, గత జన్మల పాపాలు కూడా తొలగుతాయని నమ్మకం. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక పురోగతి కోసం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర తిథిని ఎంతో భక్తితో జరుపుకుంటారు. అందుకే పరమ ఏకాదశిని సాధారణ ఏకాదశి కంటే మరింత మహిమాన్వితమైనదిగా హిందూ సంప్రదాయం పేర్కొంటుంది.

నీకు అవసరమా.. జగన్ తెలుగు భాష పై ట్రోల్స్!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే చాలు.. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ దర్శనం ఇస్తుంటాయి. నిన్ననే ఆయన విశాఖలో స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మరోసారి అదే తడబాటుతో అడ్డంగా బుక్కయ్యారు. అప్పటినుంచి సోషల్ మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు. గతంలో నారా లోకేష్ విషయంలో వైసీపీ సోషల్ మీడియా ఇలానే టార్గెట్ చేసేది. ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడుతారా.. ఎలా ట్రోల్స్ చేయాలా అని చూసేది. కానీ ఇప్పుడు అదే ట్రోల్స్ కు బాధితుడు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. మానవీయ కోణం అనలేక.. పక్కన ఉన్నవారు ప్రామిటింగ్ ఇవ్వడంతో అతి కష్టం మీద సర్దుకుని మాట్లాడారు.

* మాట్లాడకుండా ఉండడమే మంచిది..
జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయాలి. అచ్చ తెలుగు వ్యాఖ్యలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రెస్మీట్లో కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు. తనకు తెలుగు పెద్దగా తెలియదని మళ్లీ చెప్పుకొస్తారు. కానీ స్టీల్ ప్లాంట్ ఘటనకు సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు చాలా సీరియస్ గా ఉంటుంది పరిస్థితి. ఆవేశపూరితంగా మాట్లాడారు. ఆ మాటల్లోనే తప్పులు ధ్వనించాయి. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ట్రోల్స్ వీర లెవెల్లో దర్శనం ఇస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉండడమే మేలని సొంత పార్టీ వారే వ్యాఖ్యానించే దాకా పరిస్థితి వచ్చింది. అసలు ఆయన అచ్చ తెలుగు ఎందుకు మాట్లాడాలి? అడ్డంగా ఎందుకు బుక్ కావాలి? అన్నవారు కూడా ఉన్నారు.

* అప్పట్లో లోకేష్ టార్గెట్..
వాస్తవం మాట్లాడుకుంటే.. ఇదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నారా లోకేష్ ను ఏ విధంగా టార్గెట్ చేశాయో తెలియంది కాదు. విదేశాల్లో చదువుకొని వచ్చిన నారా లోకేష్ అప్పట్లో తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు. ఆయన ఎప్పుడు మీడియా ముందు మాట్లాడతారా.. ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని ఎదురు చూసేవారు. చివరకు మాజీ మంత్రి రోజా లాంటి వారు సైతం.. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తామని సిద్ధపడగా.. ఒకసారి మంగళగిరి అని లోకేష్ వ్యాఖ్యానిస్తే చాలు అన్నంత రీతిలో టార్గెట్ చేశారు. చివరకు లోకేష్ పాదయాత్ర సమయంలో కూడా వేలమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆయనను అనుసరించారు. అయితే ఇప్పుడు అదే లోకేష్ పరిణితి తో మాట్లాడుతున్నారు. తెలుగు చాలా అలవోకగా చెప్పేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఏవేవో మాట్లాడుతూ.. నోరు తిరగని వ్యాఖ్యలు చేస్తూ.. అడ్డంగా బుక్ అవుతుండడంతో వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి.

సముద్ర తీరంలో రెండు ఆత్మలు.. గుండె ధైర్యం ఉన్నవారే అక్కడికి వెళ్లాలి.. ఎక్కడ ఈ ప్రదేశం.. ఏమా కథ

Quirpon Island Mystery
Quirpon Island Mystery

Quirpon Island Mystery: విశాలంగా సముద్రం.. అంతకంటే స్వచ్ఛమైన తీరం.. చుట్టూ కొండలు.. వాటిని ఆనుకొని ఉన్న వృక్షాలు.. చదువుతుంటే ఆ ప్రాంతం వద్దకు వెళ్లాలి అనిపిస్తోంది కదూ.. అక్కడ హాయిగా సేదతీరి.. ఆనందంగా ఆ ప్రాంతాన్ని తనివి తీరా చూడాలని ఉంది కదూ.. కాకపోతే ఇది ఒక యాంగిల్ మాత్రమే.. ఇంకో యాంగిల్ లో దయ్యాలు ఉంటాయి. అవి చూపించే చుక్కలు కూడా ఉంటాయి.

కెనడా దేశంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో న్యూ ఫౌండ్ ల్యాండ్ అనే తీరం ఉంటుంది. దానికి అవతలి భాగంలో క్విర్పాన్ ఐలాండ్ అనే దీవి ఉంటుంది. ఈ దీవిలోకి మొన్నటి వరకు ఎవరు వెళ్లేవారు కాదు. దీని వెనక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ దీవికి దయ్యాల పేరు రావడానికి ఒక కారణం ఉంది. సరిగ్గా 16వ శతాబ్దంలో ఫ్రెంచ్ నావికుడు కెప్టెన్ ఫ్రాంక్ యిస్ 1542లో తన సైనికులతో కలిసి నౌక యాత్రకు వెళ్లిపోయాడు. ఆ నౌకలో ఫ్రాంకోయిస్ బంధువు మార్గరెట్ కూడా ఉంది. అయితే ఆమె మీద ఫ్రాంకోయిస్ కు ప్రేమ ఉండేది. అతడి ప్రేమ ఆమెకు నచ్చేది కాదు.

ఈ నౌకలో ప్రయాణిస్తున్నప్పుడే ఆమె ఆ సైన్యంలో పనిచేసే ఒక యువ సైనికుడు మీద ప్రేమ పెంచుకుంది. అది కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. తనను కాదని ఒక సైనికుడిని ఆమె ప్రేమించడం.. శారీరకంగా సాన్నిహి త్యం పెంచుకోవడం.. ఫ్రాంకోయిస్ కు ఏమాత్రం నచ్చలేదు. పైగా తాను నచ్చిన అమ్మాయిని అతడు ప్రేమించడం.. వశం చేసుకోవడం అతడు తట్టుకోలేకపోయాడు. అంతే వారిద్దరిని ఈ దీవిలో పడేసి వెళ్లిపోయాడు.

ఎటు వెళ్లాలో తెలియక.. బతికి బట్ట కట్టే మార్గం అర్థం కాక వారిద్దరు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. బయటికి వచ్చే ప్రయత్నం చేసే క్రమంలో ఆకలికి తట్టుకోలేక చనిపోయారు. అప్పటినుంచి వారిద్దరి ఆత్మలు అక్కడ సంచరించేవి. ఆ ప్రాంతంలోకి వెళ్లే వారిని తీవ్రంగా హింసించేవి. కొన్ని సందర్భాలలో క్రూరంగా చంపేసేవి. రాత్రి సమయాల్లో వింత శబ్దాలు.. వింత వింత మాటలు.. వింత ఆకారంలో ఉన్న జంతువులు కనిపించేవని అక్కడివారు చర్చించుకుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతాన్ని కొంతమంది సందర్శిస్తున్నారు. అయితే పగటిపూట మాత్రమే వారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. రాత్రిపూట ఉండడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అకస్మాత్తుగా ఇక్కడ గాలులు రావడం.. సముద్రపు అలలు పొంగడం.. వింత వింత శబ్దాలు వినిపించడం.. వంటివి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఔత్సాహికులు కూడా పగటిపూట వరకే తమ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం అక్కడ ఆత్మలు లేవని.. దయ్యాలు కూడా లేవని వాదిస్తున్నారు. ప్రత్యక్షంగా ఆ అనుభవాలను ఎదుర్కొన్న వారు మాత్రం మరోసారి ఆ ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.

ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఏదంటే అది జరుగుతుంది..

Today 4 July 2026 Horoscope
Today 4 July 2026 Horoscope

Today 11 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోకుండా ధన లాభం జరగనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈ రోజు అన్ని అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తొలగిపోవడంతో మనశ్శాంతి ఉంటుంది. అవసరమైన మీరకే ఖర్చులు పెట్టాలి. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తను వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు ఉండడంతో ఉద్యోగులు మనశాంతితో గడుపుతారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అధికారుల నుంచి ఉద్యోగులకు కాస్త ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసే సమయంలో తోటి వారి సహకారం తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన పనులను పూర్తిచేసుకోగలుగుతారు

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాల వల్ల భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెడతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెద్దల అండదండలతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు. గ్రహాలు అనుకూలంగా ఉండడంతో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆగిపోయిన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అపారమైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి నిరుద్యోగులు ఈరోజు కొత్త శుభవార్తలు విని అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు తొలగిపోవడంతో మనశ్శాంతి ఉండే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బకాయిలను తిరిగి వసూలు చేసుకుంటారు. స్నేహితుల సహకారంతో దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అపారమైన లాభాలు ఉంటాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పనులకు సంబంధించి బిజీగా ఉంటారు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని సానుకూల ఫలితాలే ఉంటాయి. కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తారు. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. తల్లిదండ్రులు అండదండలతో కొత్త పెట్టుబడులు పెడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులు తోటి వారి సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.

9 నెలల్లో 900 కోట్లు.. చరిత్ర తిరగరాసిన మెగా హీరోలు.. కం బ్యాక్ అదుర్స్..

Mega Heroes Comeback
Mega Heroes Comeback

Mega Heroes Comeback: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో కం బ్యాక్ ఇవ్వడం మెగా ఫ్యామిలీ కి కొత్తేమి కాదు. భోళా శంకర్ , గేమ్ చేంజర్ , బ్రో , హరి హర వీరమల్లు , ఇలా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మెగా ఫ్యాన్స్ ని టార్చర్ చేశారు ఈ ముగ్గురు మెగా హీరోలు. ఇలాంటి సినిమాలు తీయడం కంటే , ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాం కదా అని సోషల్ మీడియా లో ట్వీట్లు కూడా వేసేవారు. అలాంటి సమయం లో ‘ఓజీ’ చిత్రం నుండి మెగా ఫ్యామిలీ కి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రానికి , ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది , సెకండ్ హాఫ్ అసలు బాలేదంటూ కామెంట్స్ చేశారు.

కానీ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల, ఆ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. హిందీ వెర్షన్ లో ఈ చిత్రం నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల కాలేదు , లేదంటే 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఓపెనింగ్స్ లో మెగా ఫ్యాన్స్ మరోసారి గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఈ చిత్రం. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది , ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను ప్రీమియర్స్ నుండి రాబట్టి , సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా విడుదలైన మూడు నెలలకే మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ సంక్రాంతి కానుకగా విడుదలై 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రాంతీయ బాషా చిత్రాల విభాగం లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా కూడా నిల్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదట రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు అదిరిపోయాయి , ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కేవలం 6 రోజుల్లోనే రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే కేవలం 9 నెలల్లోనే 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మెగా హీరోల సినిమాల నుండి వచ్చాయి అన్నమాట. ఈ కం బ్యాక్ మెగా ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఊపు ని తీసుకొచ్చింది.

నాకు అవకాశాలు లేని సమయంలో అన్నం పెట్టింది వాళ్ళే అంటూ హీరో అబ్బాస్ ఎమోషనల్ కామెంట్స్..

Abbas Emotional Comments
Abbas Emotional Comments

Abbas Emotional Comments: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు అబ్బాస్. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈయనకు ఉన్నటువంటి క్రేజ్ , అప్పట్లో ఏ హీరో కి ఉండేది కాదు. ప్రేమ దేశం చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన , తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆయన హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు కానీ , స్టార్ స్టేటస్ ని మాత్రం సంపాదించలేకపోయాడు. ఒకానొక సమయం లో ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం వల్ల, ఫేడ్ అవుట్ అయిపోయాడు. దీంతో ఆయన్ని హీరో గా పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు ధైర్యం చెయ్యలేని పరిస్థితి రావడం తో , ఇతర హీరోల సినిమాల్లో క్యారక్టర్ రోల్స్ చేయడం మొదలు పెట్టాడు. కొన్నాళ్ళకు ఆ క్యారెక్టర్ రోల్స్ కూడా రావడం ఆగిపోయాయి .

ఆ సమయం లో తనకు ఎదురైనా సంఘటన గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు అబ్బాస్. ఆయన మాట్లాడిన ఈ మాటలు వింటే , అయ్యో పాపం అనిపించక తప్పదు. ఆయన మాట్లాడుతూ ‘ఒకానొక సమయం లో నాకు సినిమా అవకాశాలు రావడం పూర్తిగా ఆగిపోయాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి కఠినమైన సమయం లో హార్పిక్ బ్రాండ్ కి నేను చేసిన యాడ్ నా జీవితానికి ఎంతో ఉపయోగపడింది. దాదాపుగా ఆ యాడ్ కాంట్రాక్టు కి 8 సంవత్సరాలు పని చేసాను. దాని ద్వారా వచ్చిన డబ్బుతోనే నేను ఆర్థికంగా స్థిరపడ్డాను అని గర్వం గా చెప్పుకోగలను. ఆ బ్రాండ్ యాజమాన్యం అన్నేళ్లు నన్ను పెంచి పోషించింది. సమాజం ఏమనుకున్నా సరే, హార్పిక్ యాడ్ వాళ్ళ నా కంచం లోక్ అన్నం ముద్ద వచ్చింది. వాళ్ళే నాకు అన్నం పెట్టారు , జీవితం లో ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు అబ్బాస్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే రీసెంట్ గానే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. జీవీ ప్రకాష్ కుమార్ హీరో గా నటించిన ‘హ్యాపీ రాజ్’ అనే చిత్రం లో అబ్బాస్ ఒక కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. ఓటీటీ లో కూడా ఆడియన్స్ నుండి ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. హ్యాపీ రాజ్ లో నాకు అద్భుతమైన పాత్ర దొరికిందని , భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు . మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ అబ్బాస్ కి ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

రామ్ చరణ్ , సుకుమార్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా.. ? మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్న చరణ్..

Ram Charan And Sukumar
Ram Charan And Sukumar

Ram Charan And Sukumar: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ . డైరెక్టర్స్ సరిగ్గా ఉపయోగించుకోవాలి కానీ , పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయగల సత్తా రామ్ చరణ్ కి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన టాలీవుడ్ కి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొని రాగల అరుదైన సంపద రామ్ చరణ్. ఇలాంటి సూపర్ స్టార్ ఏడాది కనీసం రెండు సినిమాలైనా చేస్తే , ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంటుంది , థియేటర్స్ కళకళలాడుతాయి. కానీ అది జరగడం లేదు , ఈయన ఒక్కో సినిమా చేయడానికి రెండు నుండి మూడేళ్ళ సమయం తీసుకుంటున్నాడు , ఆ కారణం చేత రామ్ చరణ్ అప్పుడప్పుడు రేస్ లో వెనకబడినట్టుగా మన అందరికీ అనిపిస్తూ ఉంటుంది. #RRR తర్వాత దాదాపుగా మూడేళ్లు ‘గేమ్ చేంజర్ ‘ చిత్రానికి డేట్స్ కేటాయించాడు.

ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన మరో ఏడాదిన్నర ‘పెద్ది’ చిత్రానికి కేటాయించాడు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండి , లాంగ్ రన్ వరకు అద్భుతాలు నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తుంది. 6 రోజుల్లోనే 275 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి , 300 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికీ సుకుమార్ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేయలేదట, ఏ జానర్ లో సినిమా చెయ్యాలి అనేది కూడా ఫిక్స్ అవ్వలేదట.

ఈ ఏడాది అక్టోబర్ ,లేదా నవంబర్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అవ్వుద్దని , వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి షూటింగ్ కార్యక్రమాలు మొదలు అవుతాయని అంటున్నారు. సుకుమార్ తన ప్రతీ సినిమాని పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి కూడా ఆయన కనీసం రెండేళ్ల సమయం తీసుకునే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే రామ్ చరణ్ అభిమానులు మరోసారి నిరాశ చెందక తప్పదు. ఇలా ఒక్కో సినిమాని పూర్తి చేయడానికి ఇన్నేళ్ల సమయం తీసుకుంటే , జెన్ జీ ఆడియన్స్ మనకి కనెక్ట్ అవ్వరని , రాబోయే రోజుల్లో వాళ్ళ రాజ్యమే సినీ ఇండస్ట్రీ లో నడుస్తుందని , రామ్ చరణ్ ఇది అర్థం చేసుకోకుంటే కష్టమని , చేసిన తప్పునే మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.