KCR and KTR: సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారిపోయింది. జాతీయ పార్టీగా ఎదిగేందుకు కలలు కన్నది. ఆంధ్ర ప్రదేశ్లో శాఖను కూడా ఏర్పాటు చేసింది. తోట చంద్రశేఖర్ ను అధ్యక్షుడిని చేసింది. ఏపీలో కార్యాలయం కూడా ప్రారంభించింది. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయడానికి కూడా సింగరేణి ముందు వరుసలో నిలిపింది. ఇలా ఎన్నో చేసింది. కానీ సొంత రాష్ట్రంలోని గెలవలేకపోయింది. అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పంజాబ్, బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించారు. అక్కడి రైతులకు చెక్కులు కూడా ఇచ్చారు. ఇలా ఎన్నో రకాలుగా జాతీయ వాదాన్ని ఆయన వినిపించారు.
చివరికి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి భారతదేశంలో అధికారంలోకి రాలేకపోయింది. సొంత రాష్ట్రమైన తెలంగాణలో పట్టు నిలుపుకోలేకపోయింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలకు పరిమితం అయిపోయింది. రాజకీయంగా తీవ్రమైన ఒడిదుడులను ఎదుర్కొంటున్నది. మరోవైపు పార్టీ నుంచి కవిత వెళ్లిపోయింది. గులాబి పార్టీకి బలంగా ఉన్న తెలంగాణ పేరును తన పార్టీకి పెట్టుకుంది. అటు తెలంగాణ వాదాన్ని దూరం చేసుకోవడం.. జాతీయ రాజకీయాల మోజులో పడి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో కెసిఆర్ పరిస్థితి దారుణంగా మారింది.
2027 ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి గులాబీ పార్టీ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసిఆర్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం లేదు. అప్పట్లో తెలంగాణ మూమెంట్ సాగుతున్నప్పుడు ఆయన కొద్ది రోజులపాటు పాదయాత్ర చేశారు. అయితే ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి వయసు రీత్యా ఆయన పాదయాత్ర చేసే అవకాశం లేదు.
వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన ఆయన ఇప్పుడు బస్సు యాత్ర చేస్తారని తెలుస్తోంది. కార్యకర్తలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలబృతం చేసేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. దీనికోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. మన వైపు కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తారని సమాచారం. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు.
అటు తండ్రి.. ఇటు కొడుకు రెండు వ్యూహాలతో ఒకేసారి జనంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యాత్రలకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ వస్తుందని సమాచారం. ఇప్పటికే పార్టీలోని కీలక నాయకులకు కేసిఆర్.. కేటీఆర్ వర్తమానం పంపారని.. కొద్దిరోజులుగా దీని గురించి చర్చలు జరుగుతున్నాయని.. సమాచారం. ఇటీవల కేటీఆర్ మలేషియా వెళ్లారు. అక్కడ జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.. గతంలో కూడా కేటీఆర్ తన పాదయాత్ర గురించి బయటకు చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా కెసిఆర్ నుంచి మీడియాకు లీకులు వస్తున్న నేపథ్యంలో.. కచ్చితంగా పాదయాత్ర.. బస్సు యాత్ర ఉంటుందని తెలుస్తోంది.
















పాకిస్థాన్ పై కోహ్లీ చెలరేగుతుంటే.. డివిలియర్స్ డ్యాన్సులు వేశాడు..
Virat Kohli 82 Runs Against Pakistan: సహజంగానే విరాట్ కోహ్లీని మనం రన్ మిషన్ అంటాం. ఎందుకంటే పరుగులు తీయడంలో అతడు ఆ స్థాయిలో దూకుడు చూపిస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ కేవలం రన్ మిషన్ మాత్రమేకాదు, ఛేజింగ్ మాస్టర్ కూడా. బీభత్సంగా పరుగులు తీయడంలో.. కఠినమైన లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఎవరైనా. విరాట్ ఆటకు మన జాతీయ జట్టులోని ప్లేయర్లు మాత్రమేకాదు, ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు కూడా ఫిదా అవుతుంటారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ ఏబీ డివిలియర్స్ ముందువరుసలో ఉంటాడు.
డివిలియర్స్ ను మైదానంలో మిస్టర్ 360 అని పిలుస్తుంటారు. అతడు బంతిని మైదానం నలుమూలలవైపు కొడుతూ ఉంటాడు. ఎంతటి తోపు బౌలర్ అయినా సరే అతడి ముందు తలవంచాల్సిందే. అందరి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయిపోయాడు. అతడు ఆడుతుంటే తీన్మార్ డ్యాన్స్ వేశాడు. ఆ విషయాన్ని ఇటీవల అతడు పంచుకున్నాడు.
ఓ ఇంటర్వ్యూలో డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు..”ఇప్పటివరకు నేను చూసిన అత్యుత్తమ టి20 ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడింది. అతడు ఆ మ్యాచ్లో 82 పరుగులు చేశాడు. అప్పుడు జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టుతో భారత్ ఆడుతోంది. ఆ మ్యాచ్లో భారత్ కష్టాల్లో పడింది. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గట్టిగా నిలబడ్డాడు. ఏ మాత్రం కంగారు పడలేదు. నమ్మకాన్ని కోల్పోకుండా బ్యాటింగ్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ బౌలింగ్లో సిక్సర్లు కొట్టాడు. అప్పుడే ఆట స్వరూపం పూర్తిగా మారిపోయింది. అతని ఓపిక.. సమయమనం ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. అతడు ఆ స్థాయిలో ఆడటం వల్లే ప్రపంచ స్థాయి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడని” డివిలియర్స్ పేర్కొన్నాడు.
డివిలియర్స్ ఐపీఎల్ లో బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. అతడు ఆడినప్పుడు బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. గత సీజన్ లో విజేతగా నిలిచినప్పుడు బెంగళూరు జట్టును డివిలియర్స్ అభినందించాడు. ఈ సీజన్లో కూడా బెంగళూరు విజేతగా నిలవడంతో.. డివిలియర్స్ ఆనందం వ్యక్తం చేశాడు. తాను జట్టులో ఉన్నప్పుడు బెంగళూరు ట్రోఫీ గెలిచి ఉంటే బాగుండేదని డివిలియర్స్ వ్యాఖ్యానించాడు. అయినప్పటికీ తన జట్టు రెండుసార్లు విజేతగా నిలిచిందని.. ఇది ఆనందకరమైన విషయమని డివిలియర్స్ పేర్కొన్నాడు.