Home Blog Page 143

విధ్వంసం నుంచి వికాసం వైపు.. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏం చేసిందంటే..

AP Coalition Government Achievements
AP Coalition Government Achievements

AP Coalition Government: విధ్వంసం నుంచి వికాసం వైపు.. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే ఇదే మాట మాట్లాడుతున్నారు. నిజంగా రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో ఏపీ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందిందా.. సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడి సృష్టిస్తుందా.. దీనికి క్షేత్రస్థాయిలో గణాంకాలు సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

లక్ష కోట్ల వరకు ఖర్చు

ఉదాహరణకు రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏపీలో సంక్షేమ పథకాల కోసం లక్ష కోట్ల వరకు ఖర్చు చేసింది. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా.. అందరికీ ఈ పథకాలు అమలవుతున్నాయి.. ఉదాహరణకు అన్న క్యాంటీన్ల ను తీసుకుంటే.. ఇవి నూటికి నూరు శాతం విజయవంతమయ్యాయి. ఇప్పటివరకు 230 కోట్లను ప్రభుత్వం వీటి మీద ఖర్చుపెట్టింది. స్త్రీ శక్తి పథకం ద్వారా 71 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించారు. 2565 కోట్ల మేర లబ్ధి పొందారు.

సామాజిక పింఛన్లు

గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఎన్టీఆర్ భరోసా పేరు మీద ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఇచ్చింది. 65,887 కోట్లను పేదలకు పంచింది. ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవని ఏపీ ప్రభుత్వ పేదలు చెబుతున్నారు. దీపం పథకంలో భాగంగా 4.26 కోట్ల సిలిండర్లను పేదలకు అందించారు. దీనికోసం 3100 కోట్లను ఖర్చుపెట్టారు. అన్నదాత సుఖీభవ పథకానికి దాదాపు 8 వేల 985 కోట్లు ఖర్చు చేశారు. 46 లక్షల మంది రైతులకు భరోసా కల్పించారు. ఒక్కో రైతు ఖాతాలో 20వేల చొప్పున జమ చేశారు. ఆటో డ్రైవర్లకు 15000 చొప్పున ఇప్పటివరకు 435 కోట్లను జమ చేశారు. మత్స్యకార సేవలో భాగంగా మత్స్యకారులకు ఏడాదికి 20వేల చొప్పున కూటమి ప్రభుత్వం ఇస్తోంది. దీనికోసం 250 కోట్లు ఖర్చుపెట్టింది. తల్లికి వందనం పథకం ద్వారా 65.27 లక్షల మంది పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా 4-5 లక్షల మంది తల్లుల ఖాతాలో ఇప్పటివరకు పదివేల కోట్లను జమ చేసింది..

రోడ్లు వేసింది.. ఉద్యోగాలు భర్తీ చేసింది..

గ్రామీణ ప్రాంతాల్లో 2000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లను వేసింది కూటం ప్రభుత్వం. పదివేల కిలోమీటర్ల పరిధిలో తారు రోడ్లలో నిర్మించింది. ఏజెన్సీ ప్రాంతంలో వెయ్యికోట్లతో రోడ్లు నిర్మించింది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. అంతేకాదు పోలీస్ శాఖలో 6100 మంది ఉద్యోగులను నియమించింది. అంతేకాదు విద్యుత్ చార్జీలను ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పెంచలేదు. దీనికి తోడు ట్రూ డౌన్ ద్వారా తగ్గించడం ప్రజలకు ఊరట కల్పించింది. డీఎస్సీ ద్వారా దాదాపు 16 వేలకు పైగా టీచర్ పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. నాసిరకమైన మద్యానికి చరమగీతం పాడింది. అస్తవ్యస్తమైన మద్యం విధానాన్ని చెత్తబుట్టలో పడేసింది. పారదర్శకతకు పెద్దపీట వేసింది. నూతన ఎక్సైజ్ విధానానికి అమల్లోకి తెచ్చింది.

14 గంటల్లో 52 లక్షల వ్యూస్.. 'వారణాసి' రికార్డు ని బద్దలు కొట్టిన 'ఓజీ 2'..ఇదేమి మాస్ సామీ..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2: పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ అనే పేరు తీస్తే చాలు, వాళ్ళ శరీరాల్లో వెయ్యి వోల్ట్స్ ఎనర్జీ పాస్ అవుతుంది. గతం లో ‘గబ్బర్ సింగ్’ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గొప్ప ఎమోషన్. కానీ ‘ఓజీ’ చిత్రం అంతకు మించిన ఎమోషన్ గా వాళ్లకు మారిపోయింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి ‘ఓజీ’ గొప్ప చిత్రమేమి కాదు, కేవలం రెండు మూడు సన్నివేశాలు మాత్రమే ఆ చిత్రం లో బాగుంటాయి, వాటికే అభిమానులు పిచోళ్లు అయిపోయారు, డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 321 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టారు. కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ‘ఓజీ’ క్రేజ్ ఇంకా తారా స్థాయికి చేరింది. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ ‘ఓజీ’ సినిమాల్లోని సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని అప్లోడ్ చేయకుండా ట్వీట్లు , పోస్టులు వేయలేకపోతున్నారు. ఆ రేంజ్ లో వాళ్లకు ఎక్కేసింది.

‘ఓజీ 2’ వస్తే బాగుంటుంది అని అభిమానులతో పాటు, జెన్ జీ మామూలు ఆడియన్స్ కూడా చాలా బలంగా కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, చాలా బిజీ గా గడుపుతున్నాడు , ఇలాంటి సమయం లో ఆయన నుండి సినిమాలు ఊహించడం కష్టం , ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రమే ఆయన చివరి చిత్రం గా నిలుస్తుందేమో అని అంతా అనుకున్నారు. అభిమానులు రెండు మూడు రోజుల క్రితం , పవన్ కళ్యాణ్ రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అంటూ చాలా బాధ పడ్డారు కూడా. సరిగ్గా అలాంటి సమయం లోనే ఆయన నుండి ‘ఓజీ 2’ చిత్రం రాబోతుందని నిన్న ట్విట్టర్ లో ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిన్న ట్వీట్ సృష్టించిన ప్రకంపనలు సాధారణమైనవి కాదు.

కేవలం 14 గంటల్లోనే ఈ ట్వీట్ కి 52 లక్షల వ్యూస్ , 14 వేల రీట్వీట్స్, 35 వేల లైక్స్ వచ్చాయి. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ చిత్రం ప్రకటనకు , మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ ప్రకటన కు కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు. ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం లైఫ్ టైం వ్యూస్ కూడా ఈ రేంజ్ లో లేవు. అలాంటిది కేవలం ఒక్క చిన్న ట్వీట్ తో ఈ రేంజ్ రీచ్ వచ్చిందంటే, ఇక రాబోయే రోజుల్లో ‘ఓజీ 2’ కి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు రీచ్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి అంటూ పవన్ ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు .ఇక 24 గంటలు గడిచిన తర్వాత ఈ ట్వీట్ కి ఇంకా ఎంత రీచ్ , వ్యూస్ వస్తాయో చూడాలి.

'ట్రాన్స్ జెండర్' గా కనిపించబోతున్న రవితేజ..కెరీర్ లోనే సరికొత్త ప్రయోగం..ఆడియన్స్ ఎలా తీసుకుంటారో..

Ravi Teja Transgender Role
Ravi Teja Transgender Role

Ravi Teja Transgender Role: మన తెలుగు హీరోలు , తమ ఇమేజ్ నుండి బయటకు వచ్చి , నేటి తరం జెన్ జీ ఆడియన్స్ ని అలరించేందుకు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. రీసెంట్ గానే మనమంతా ‘పెద్ది’ చిత్రాన్ని చూశాం. వంద మంది శత్రువులను నరికి చంపే హీరోయిజాన్ని గతం లో రామ్ చరణ్ లో మనం చూశాం , అలాంటి హీరో అవిటి వాడిగా నటిస్తే జనాలు రిసీవ్ చేసుకుంటారని మనం కలలో అయినా ఊహించుకొని ఉంటామా ?, కానీ జనాలు ఆ పాత్రని రిసీవ్ చేసుకున్నారు , వందల కోట్ల వసూళ్లను ఇస్తున్నారు. ఇప్పుడు హీరో ఇమేజ్ ని ఎవ్వరూ చూడడం లేదు , కంటెంట్ ని మాత్రమే చూస్తున్నారు , కంటెంట్ ఆడియన్స్ కి నచ్చితే స్టార్ హీరోలు ఎలాంటి పాత్రలు చేసినా ఆదరిస్తారు అనేది రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ మరోసారి నిరూపించి చూపించింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యమో ఏమో తెలియదు కానీ , మాస్ మహారాజ రవితేజ కూడా ఇలాంటి ప్రయోగమే ఒకటి చేయబోతున్నాడు.

రీసెంట్ గానే ఆయన దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘స్వాగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన హషిత్ గోలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం లో రవితేజ ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతున్నాడు అట. ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఆయన ఆ పాత్రలోనే కనిపిస్తాడట. ఇది విన్న అభిమానులు, రవితేజ లాంటి మాస్ హీరో, ఇలాంటి పాత్ర ని చేయడానికి ఒప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, నిజంగా ఆయనలో చాలా మార్పు వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కథ ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ , ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరూ చూడని అద్భుతమైన , విభిన్నమైన స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అట.

ప్రస్తుతానికి రవితేజ ‘ఇరుముడి’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి అవ్వగానే , రవితేజ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వబోతున్నట్టు సమాచారం. రవితేజ కి ఇలాంటి ప్రయోగాలు చేయడం కొత్తేమి కాదు. గతం లో ఆయన ‘రాజా ది గ్రేట్’ చిత్రం గుడ్డివాడిగా నటించి భారీ హిట్ ని అందుకున్నాడు. అయితే అందులో గుడ్డివాడు అయినప్పటికీ కూడా తన మార్క్ మాస్ హీరోయిజాన్ని చూపించడం లో రవితేజ ఎక్కడా తగ్గలేదు. మరి ఈ ట్రాన్స్ జెండర్ పాత్ర కూడా అలాగే ఉంటుందా, లేదా పూర్తి భిన్నంగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

వన్డే వరల్డ్ కప్ 2027: షెడ్యూల్ వచ్చేసింది.. జట్లు, మ్యాచ్ లు, వేదికలు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

ODI World Cup 2027 Schedule
ODI World Cup 2027 Schedule

ODI World Cup 2027 Schedule: ఐపీఎల్ సంబరం ముగిసిపోయింది. అంతకంటే ముందు టి20 వరల్డ్ కప్ విజయవంతంగా సాగింది. ఇప్పుడు అందరి దృష్టి వన్డే ప్రపంచ కప్ 2027 గురించి. అయితే దీనికి సంబంధించి అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసింది.. అహ్మదాబాదులో ఐసీసీ బోర్డు సమావేశంలో మ్యాచ్ నిర్వహణ తేదీలను ప్రకటించారు.

అక్టోబర్ 4 నుంచి మొదలు

వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 అంటే దాదాపు 48 రోజులపాటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కొనసాగుతూ ఉంటుంది. చాలా వరకు మ్యాచులు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. టోర్నమెంట్లో మొత్తం 54 మ్యాచులు జరిగే అవకాశం ఉంది. ఇందులో 41 మ్యాచ్లు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. 8 స్టేడియాలలో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తారు. జింబాబ్వే లో ఎనిమిది నుంచి పది మ్యాచ్లు జరుగుతాయి. మిగతా మూడు మ్యాచ్లను నమీబియాలో నిర్వహిస్తారు. జింబాబ్వేలో క్వీన్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, విక్టోరియా ఫాల్స్ మైదానాలలో మ్యాచులు నిర్వహిస్తారు.

పాత విధానంలోనే నిర్వహణ

సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇచ్చింది. 2003లో సౌత్ ఆఫ్రికా మెన్స్ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. నాడు కంగారు జట్టు విజేతగా నిలిచింది. ఈసారి మెన్స్ వన్డే వరల్డ్ కప్ పాత విధానంలోనే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల మిగతా జట్లు కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. అవసరమైతే సంచలన ప్రదర్శన చేస్తాయి. దీనివల్ల ట్రోఫీ మీద అంచనాలు పెరిగిపోతాయి. రేటింగ్స్ కూడా అధికంగా నమోదవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఐసిసికి దండిగా ఆదాయం వస్తూ ఉంటుంది. అందువల్లే ఐసీసీ ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గతంలో ఏం జరిగిందంటే..

గతంలో రెండు ఎడిషన్లలో 10 జట్లు మాత్రమే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొన్నాయి. 2027లో మళ్లీ 14 జట్ల విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రెండు గ్రూపులలో 14 జట్లను విభజిస్తారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు సూపర్ సిక్స్ అవకాశం ఉంటుంది.. ఐసీసీ సభ్య దేశాలుగా ఉన్న దక్షిణాఫ్రికా.. జింబాబ్వే ట్రోఫీలో ఆడేందుకు నేరుగా అర్హత సాధించాయి. నమీబియా క్వాలిఫై మ్యాచ్ ఆడాలి. అందులో గెలిస్తేనే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉంటుంది.

బండి సంజయ్ అజ్ఞాతంలో ఉంది అందుకే.. అసలు నిజం ఇప్పుడు తెలిసింది..

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay: కొడుకు మీద ఫోక్సో కేసు నమోదైన తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. పైగా ఆయన తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు. ఒకప్పటి మాదిరిగా ప్రత్యర్ధుల మీద ఆయన ఆగ్రహం గా ఉండడం లేదు. తీవ్రస్థాయిలో మాట్లాడటం లేదు. కార్యకర్తలను కలుస్తున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ లేదా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆయన దగ్గరగా ఉంటున్నారు.

కొద్దిరోజుల క్రితం బండి సంజయ్ ఆ మాత్రం కూడా అందుబాటులో లేకుండా పోయారు. సన్నిహితులకు కూడా ఆయన సమాచారం తెలియదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి ఏమైంది.. ఆయన ఏమైపోయారు.. ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయారు అనే చర్చ నడిచింది. ఇక నమస్తే తెలంగాణ అయితే బండి సంజయ్ మీద టన్నులకొద్దీ బురద కథనాలు రాయడం మొదలుపెట్టింది. అయితే బండి సంజయ్ ఎట్టకేలకు బయటికి వచ్చారు. తాను ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయానో వివరించారు.

బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లలేదు. ఎవరికీ కనిపించకుండా పోలేదు. ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ పాలు తాగడం వల్ల ఆయన ఆరోగ్యం పాడైంది. దీంతో ఆయన చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. గర్జన 20 సంవత్సరాలుగా బండి సంజయ్ కానీ దగ్గు లేదా జ్వరంతో కూడా బాధపడలేదు. హైదరాబాద్ నగరంలో కల్తీ పాలు తాగడం వల్ల ఐదు రోజులు ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఇదే విషయాన్ని ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట లోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ రైతు సమ్మేళనంలో వెల్లడించారు.

రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని.. ప్రకృతి సిద్ధ మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సేంద్రీయ సాగుతో రైతుల కోటీశ్వరులు కావచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను ప్రకృతిసిద్ధమైన ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు 10,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడాన్ని బండి సంజయ్ అభినందించారు.

ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల వినియోగం పెరిగిపోయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడులలో ఈ విషయాలు వెలుగుచూస్తున్నాయి. చివరికి కేంద్రమంత్రి కూడా కల్తీ పాల వల్ల అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని బట్టి హైదరాబాదు నగరంలో ఆహార పదార్థాలు నాణ్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర హోం మంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అవగతం చేసుకోవచ్చు.

కేంద్ర క్యాబినెట్ లోకి జనసేన.. ఆయనకే ఛాన్స్!

Janasena Central Cabinet
Janasena Central Cabinet

Janasena Central Cabinet: కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది రాజకీయపరంగా. ఎందుకంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలాన్ని అందించింది ఏపీ. కూటమిపరంగా 21 పార్లమెంట్ స్థానాలు అందించింది. టిడిపి 16 ఎంపీలతో ఎన్డీఏలో రెండో స్థానంలో నిలిచింది. అందుకే ఆ పార్టీకి రెండు కేంద్ర మంత్రి పదవులు లభించాయి. అయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షాలకు మంత్రి పదవులు దక్కాయి. రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న జనసేనకు మాత్రం ఒక్క పదవి లేదు కేంద్ర మంత్రివర్గంలో. అందుకే ఈసారి జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని తెలుస్తోంది. ఇటీవల ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరైన పవన్ కు కేంద్ర పెద్దలు ఈ విషయాన్ని చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే జనసేన నుంచి ముగ్గురు ఎంపీలు ఉంటారు. ఇద్దరు లోక్సభ సభ్యులు ఉన్నారు. తాజాగా రాజ్యసభకు జనసేన తరఫున లింగమనేని రమేష్ ప్రాతినిధ్యం వహించనున్నారు.

* జనసేనకు ముగ్గురు ఎంపీలు..
ఒకవేళ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తే ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ప్రశ్న. అయితే ఆ పార్టీకి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఉన్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా లింగమనేని రమేష్ ఎంపికయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వల్లభనేని బాలశౌరికి పవన్ ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఆయన సీనియర్ నాయకుడితో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కలిసి వచ్చే అంశం.

* సుదీర్ఘ నేపథ్యం..
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది వల్లభనేని బాలసౌరికి. 2004లో తెనాలి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తెనాలి పార్లమెంట్ స్థానం కనుమరుగయింది. దీంతో 2009 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మాత్రం మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే బాలశౌరి సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఆయనకు కేంద్రమంత్రి పదవికి పవన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

ఆ చిన్నారిపై పెద్ద మనసు చాటుకున్న లోకేష్!

Lokesh Helping Student
Lokesh Helping Student

Lokesh Helping Student: నారా లోకేష్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన ఓ పేద విద్యార్థి సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా సమస్యపై సామాన్యులు తనకు ట్యాగ్ చేస్తే.. సమస్య తీవ్రతను బట్టి ఇట్టే స్పందిస్తారు. ముఖ్యంగా వీడియో, ఫోటో తో తమ గోడును వెల్లబోసుకుంటే.. అలాంటి పోస్టులకు వెంటనే రియాక్ట్ అవుతారు. రాజ్యాంగ ఓ చిన్నారి లోకేష్ మామ నాకు సీటు కావాలి అంటూ పెట్టిన వీడియో చూసిన మంత్రి లోకేష్ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించారు. సమస్యకు పరిష్కారం చూపించి ఆకట్టుకున్నారు.

* సీటు రాకపోవడంతో..
కర్నూలు జిల్లాకు చెందిన మానస అనే చిన్నారి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం పాఠశాలలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ చిన్నారికి సీటు రాలేదు. దీంతో తనకు ఎలాగైనా కేజీబీవీలు సీటు వచ్చేలా చేయాలంటూ ఆ చిన్నారి ఒక వీడియోను విడుదల చేసింది. నేరేడుప్పల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన మానస ఐదో తరగతి పూర్తి చేసింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం కేజీబీవీ పరీక్ష రాసినా అందులో సెలెక్ట్ కాలేదు. ఈ క్రమంలో పొలం పనులు చేస్తూ.. ఆ పొలంలో నుంచి తన ఆవేదనను వీడియో తీసి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ వీడియో పై స్పందించిన మంత్రి నారా లోకేష్ మానస చదువుకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

* నిరుపేద కుటుంబం
మానస తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో తన చదువు మధ్యలోనే ఆగిపోతోందన్న ఆందోళన మానసలో పెరిగింది. ఈ క్రమంలోనే లోకేష్ మామ అంటూ మానస చేసిన విజ్ఞప్తి ప్రతి ఒక్కరిని కదిలించింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. సంబంధిత అధికారులను ఆదేశించారు. మానసకు హాస్టల్ సీటు ఇప్పించడమే కాకుండా.. ఆమె చదువుకు సహాయం చేస్తానని కూడా మాట ఇచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అంటూ చిన్నారి మానసకు ఆశీస్సులు అందించారు. దీనిపై మానస తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

డీఎస్సీ పై జగన్ బురద రాజకీయం!

YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: ఏదైనా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగితే న్యాయస్థానాలకు వెళ్లి.. ఉపశమనం పొందుతుంటారు. తప్పకుండా అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటారు. కానీ ఏపీలో డీఎస్సీ 2025 పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఏవేవైతే సాక్షిలో డీఎస్సీ నియామకాలపై వచ్చిన అక్రమాల కేస్ స్టడీలపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ డీఎస్సీ 2025 పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. తలా తోకాలేని ఆరోపణలు చేస్తున్నారు.

* ప్రెస్ మీట్ లో హడావిడి
నిన్ననే వారాంతపు ప్రెస్ మీట్ తో తాడేపల్లిలో ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. తన పక్కన ఒక డీఎస్సీ అభ్యర్థిని కూర్చోబెట్టారు. అతడికి గోల్డ్ మెడల్ ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు అంటూ పెద్ద హడావిడి చేశారు. అయితే ఆ అభ్యర్థి తన డీఎస్సీ ఆన్లైన్ అప్లికేషన్ లో తనకు గోల్డ్ మెడల్ ఉందనే విషయాన్ని అస్సలు పేర్కొనలేదు. దరఖాస్తు లోనే చూపించని అర్హతలను అధికారులు పరిశీలన సమయంలో ఎలా పరిగణలోకి తీసుకుంటారని కనీస స్పృహ లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంక్ సాధించాడు అంటూ చేసిన ఆరోపణలపై ఇదివరకే విద్యాశాఖ ఆధారాలతో సహా వివరణ ఇచ్చింది. అతడు ఎన్వోసీ తీసుకోనందునే ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయినా సరే జగన్ పదేపదే డీఎస్సీ పై విషం చిమ్ముతూనే ఉన్నారు.

* కోర్టుకు వెళ్లకుండా.
డీఎస్సీలో అక్రమాలు జరిగితే.. ఆధారాలు ఉంటే వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయకుండా బురదజల్లేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డీఎస్సీ పూర్తి పారదర్శకంగా జరిగిందన్నది మెజారిటీ అభ్యర్థుల అభిప్రాయం. కానీ అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి రాజకీయం చేయాలన్నది జగన్ ఆలోచన. అందుకే అదే పనిగా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు తెలుసు. ఎవరెవరు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదో వారికి తెలుసు. కానీ ఆరు లక్షల మంది డిఎస్సీ పరీక్షలు రాశారు. అందులో 16 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మిగతా వారి కుటుంబాల ఓట్ల కోసం ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడ ఆడుతున్నారు జగన్. అయితే ఇది వర్క్ అవుట్ అవుతుందా? అంటే మాత్రం కాదు అనే సమాధానం వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఉత్తమ వలస వాదుల్లో మనోళ్లు.. 250 మందిలో 27 మంది ఎన్నారైలు!

Forbes 250 Immigrants List
Forbes 250 Immigrants List

Forbes 250 Immigrants List: భారత్‌ లేకుంటే అమెరికా లేదు.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ మూడు దశాబ్దాల క్రితం చేసిన ప్రకటన ఇది. ఇది నూటిని నూరుపాళ్లు నిజం. భారతీయులు అమెరికాకు వెళ్లి.. తక్కువ వేతనాలతో మన మేధాశక్తిని అమెరికా అభివృద్ధికి ధారపోశారు.. ఇప్పటికీ పోస్తున్నారు. అమెరికా ఎదుగుదలలో భారతీయుల పాత్రను ఎవరూ కాదనలేరు. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా వలస వచ్చి స్థిరపడిన ఎలాన్‌ మస్క్‌ వంటి వారు కూడా అగ్రరాజ్యాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అమెరికా ఏర్పడి జూలై 5 నాటికి 250 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్‌ 250 మంది ఉత్తమ వలసదారుల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో 27 మంది భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకోవడం, భారతీయల ప్రపంచ స్థాయి ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. ఇందులో వ్యాపారం, సాంకేతికత, సంస్కృతి, రాజకీయాలు వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వలసదారులు ఉన్నారు.

టాప్‌లో ఆస్ట్రియా నటుడు..
250 మంది ఉత్తమ వలసవాదుల జాబితాలో ఆస్ట్రియా నుంచి వచ్చిన నటుడు–రాజకీయ నాయకుడు ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌ టాప్‌ స్థానంలో ఉన్నారు. ఈ జాబితా అమెరికా అభివృద్ధిలో వలసదారుల పాత్రను హైలైట్‌ చేస్తుంది. 27 మంది భారత సంతతి వ్యక్తుల్లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరు తమ నాయకత్వంలో ప్రపంచ స్థాయి కంపెనీలను మరింత బలోపేతం చేశారు. సాంకేతిక రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఈ జాబితాలో భారత్‌ టాప్‌ స్థానాల్లో ఒకటిగా నిలవడానికి కారణమైంది.

భారతీయుల విజయానికి ప్రతీక..
భారత సంతతి వ్యక్తులు ఈ స్థాయిలో విజయం సాధించడం కేవలం యాదృచ్ఛికం కాదు. భారతదేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ, గణితం–సైన్స్‌లో బలమైన పునాది, పని కఠినత్వం వంటివి వారిని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేశాయి. అమెరికా వంటి దేశంలో అవకాశాలు, ఇన్నోవేషన్‌కు అనుకూలమైన వాతావరణం ఈ ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లాయి. వీరు కేవలం వ్యక్తిగత విజయం సాధించలేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలను గ్లోబల్‌ లీడర్లుగా మార్చడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా సహకరించారు. ఇది ‘బ్రెయిన్‌ గెయిన్‌’ అనే భావనను బలపరుస్తుంది. అయితే, భారత్‌ నుంచి ప్రతిభావంతులు వలస వెళ్లడం వల్ల దేశంలోని నైపుణ్యాల కొరత గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.

250 సంవత్సరాల చరిత్రలో వలసదారులు ఎప్పుడూ కీలక భూమిక పోషించారు. భారత సంతతి వ్యక్తులు టెక్, బిజినెస్‌ రంగాల్లో ఆధునిక ఇన్నోవేషన్‌లకు నాంది పలికారు. వీరి నాయకత్వం వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, సాంకేతిక పురోగతి వేగవంతమైంది. ఈ లిస్ట్‌ ద్వారా ఫోర్బ్స్‌ అమెరికా అభివృద్ధి వలసదారుల సహకారం లేకుండా సాధ్యం కాదని సూచిస్తోంది. మొత్తంమీద, ఈ ఫోర్బ్స్‌ లిస్ట్‌ భారత సంతతి వ్యక్తుల విజయ గాథను మాత్రమే కాకుండా, ప్రపంచీకరణ యుగంలో నైపుణ్యాలు, అవకాశాలు ఎలా మిళితమవుతాయో చూపిస్తోంది.

ట్రంప్‌ భయపడ్డాడా? రాత్రి ఇరాన్‌పై దాడి హెచ్చరిక.. గంటల వ్యవధిలో కూల్‌!

Trump Warning Iran Deal
Trump Warning Iran Deal

Trump Iran Tension: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై దాడికి భయపడ్డాడా.. గంటల వ్యవధిలోనే తన వైఖరిని ఒక్కసారిగా మార్చుకోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాత్రికి ఇరాన్‌పై తీవ్రమైన దాడులు చేస్తామని, వెనెజువెలా తరహాలో ఇరాన్‌ కథ ముగిస్తామని ప్రకటించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాత్రి ఏం జరుగుతుందో అన్న టెన్షన్‌ నెలకొంది. కానీ రాత్రి కాగానే దాడులు ఆపేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ప్రపంచ ఊపిరి పీల్చుకుంది. అయితే ట్రంప్‌ వైఖరిలో సడెన్‌ మార్పు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇరాన్‌కు బలమైన హెచ్చరిక..
ట్రంప్‌ ముందుగా ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని కఠినమైన సందేశం పంపారు. ఈ రాత్రి బలమైన దాడులు చేస్తామని, ఖర్గ్‌ ద్వీపం సహా ఇతర ముఖ్యమైన ఆయిల్‌ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఆ దేశ ఆయిల్, గ్యాస్‌ మార్కెట్లను వెనిజులా తరహాలో తమ నియంత్రణలోకి తెచ్చుకుంటామని చెప్పారు. ఇరాన్‌ రక్షణ వ్యవస్థ ఇప్పటికే బలహీనపడిందని అభిప్రాయపడ్డారు.

దాడులు ఆపేస్తున్నట్లు ప్రకటన..
గంటల తర్వాతే ట్రంప్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇరాన్‌ అగ్రనాయకత్వంతో చర్చలు ఉన్నత స్థాయిలో ముందుకు సాగుతున్నాయని, ఒప్పందానికి సంబంధించిన ముఖ్య అంశాలపై తుది ఒప్పందం దాదాపు పూర్తయిందని తెలిపారు. ఈ అంశాలను పాకిస్తాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ సహా మిత్ర దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. దీంతో రాత్రి షెడ్యూల్‌ చేసిన దాడులను నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.

నావల్‌ బ్లాకేడ్‌ కొనసాగుతుంది…
ఒప్పందం పూర్తిగా ఖరారు కాకుండా అమెరికా నావల్‌ బ్లాకేడ్‌ను కొనసాగిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇరాన్‌తో డీల్‌ సంతకం అయ్యే వరకు ఈ బ్లాకేడ్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రకటనల్లోని ఈ వేగవంతమైన మార్పు ఇరాన్‌ సంక్షోభంలో అమెరికా వైఖరి ఎంత వేగంగా మారుతోందో చూపిస్తోంది. హెచ్చరికల నుంచి చర్చల వైపు మళ్లడం ద్వారా పరిస్థితిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఒప్పందం ఎంత వేగంగా ఖరారవుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియాలి.

మీ సార్ అంత ఇంగ్లీష్ నాకు రాదు..టీ న్యూస్ రిపోర్టర్ ను ఓ ఆట ఆడుకున్న రేవంత్.. వైరల్ వీడియో

CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: రాజకీయ నాయకులు సీరియస్ గా మాట్లాడుతుంటే జనాలకు అంతగా చూడబుద్ధి కాదు. సీరియస్గా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు టంగ్ స్లిప్ అవుతుంటారు. ఆ సమయంలో బూతులు వచ్చేస్తుంటాయి. పేగుల మెడలో వేసుకుంటా.. తొక్కుకుంట పోతా.. హౌలా.. ఇలాంటి బూతులు చాలానే వస్తుంటాయి. చిన్నపిల్లలు చూసేందుకు ఇటువంటి వాటిని ఇష్టపడరు. అలాగని పెద్దలు కూడా అంతగా ఆసక్తి చూపించరు.

రాజకీయ నాయకులు ఇలాంటి బూతులు కాకుండా సమయానికి తగ్గట్టుగా పంచులు వేసుకుంటూ.. లౌక్యంతో మాట్లాడితే చూడడానికి చాలా బాగుంటుంది. వినడానికి అంతకంటే బాగుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కొంతమంది రాజకీయ నాయకులు సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతుంటారు. ఆవేశంలో వారు మాట్లాడే బూతులను పక్కన పెడితే.. లౌక్యంగా మాట్లాడే మాటలు.. సమయానికి తగ్గట్టుగా వేసే పంచులు చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలానే మాట్లాడుతుంటారు. ఆయన ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలా బాగుంటుంది. అలాంటి మాటలే ఇటీవల రేవంత్ మాట్లాడారు.

కెసిఆర్ అంటే చాలు రేవంత్ మండిపడుతుంటారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో లైన్ తప్పి మాట్లాడుతుంటారు. ఇలాంటి రాజకీయాలు అవసరమా.. ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు.. వీటిని ఒకసారి రేవంత్ ప్రశ్నించుకోవాలి. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావుకు కూడా ఇది వర్తిస్తుంది..ఇటీవల ఓ సమావేశంలో రేవంత్ మాట్లాడారు . అక్కడ టీ న్యూస్ విలేకరి నరేంద్ర మోడీ ప్రస్తావన తీసుకొచ్చారు. అదే సమయంలో ఆయనను బడే బాయ్ అని ప్రస్తావించారు.

దానికి రేవంత్ తనదైన శైలిలో స్పందించారు.. ఈ దేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అని.. ఆయన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బడే బాయ్ అని.. ముఖ్యమంత్రిలు చోటాబాయ్ అని.. అందులో తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు. “నువ్వు కనపడితే పలకరిస్తా సూరజ్. నువ్వు టీ న్యూస్ లో పనిచేస్తున్నామని నీ ముఖంలో కేసీఆర్ ను చూడను కదా. నీలో ఉన్న జర్నలిస్టును మాత్రమే చూస్తాను. మీ సార్ లాగా నేను ఇంగ్లీష్ మాట్లాడలేను. బడే బాయ్ ని ఇంగ్లీష్ లో బిగ్ బ్రదర్ అని పిలుస్తుంటారని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. అయితే ఈ వీడియో ఇటీవల బయటికి వచ్చింది. అది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

 

 

ప్రియుడి మైకంలో పడి.. కన్న కూతురినే అలా చేసింది.. చివరికిలా దొరికిపోయింది..

Priyanka Praveen Case
Priyanka Praveen Case

Priyanka Praveen Case: రోజురోజుకు సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. తాత్కాలిక సంబంధాల కోసం.. శాశ్వత అనుబంధాలను వదిలేసుకుంటున్నారు. క్షణకాలంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరికి జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈమె కథ కూడా ఇటువంటిదే. పైగా ఆమె ఉన్నత విద్యావంతురాలు. న్యాయవాదిగా పని చేస్తోంది. అయినప్పటికీ విచక్షణ మర్చిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలో ఐదు సంవత్సరాల కుమార్తెను తల్లి అంతం చేసింది. ఈ సంఘటన కేవలం ఆ రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రియుడితో కలిసి ఉండడానికి కూతురు అడ్డుగా ఉందని భావించిన ఆమె ఈ దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన చాలా రోజుల క్రితమే జరిగింది. పోలీసుల కళ్ళు కప్పి ఆ తల్లి పరారీలో ఉంది. ఆమెను ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు హాసన ప్రాంతానికి తీసుకొచ్చారు.

కర్ణాటక రాష్ట్రంలోని దావనగరి ప్రాంతానికి చెందిన ప్రియాంక, ప్రవీణ్ కు 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రియాంక లాయర్ గా పనిచేస్తోంది. వీరికి 11 సంవత్సరాల కుమారుడు, ఐదు సంవత్సరాల వయసున్న కుమార్తె ఉన్నారు. వీరు కాడుగూడి ప్రాంతంలో ఉండేవారు. అప్పుడు మోహన్ అనే వ్యక్తి ఈమెని కలిశాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఆ పరిచయంతోనే వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది.

ప్రవీణ్ కు ఈ విషయం తెలిసింది. దీంతో వారిద్దరినీ అతడు హెచ్చరించాడు. భర్త మాటలు తట్టుకోలేక ప్రియాంక తన కుమార్తెను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మోహన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలుపెట్టింది. అంతేకాదు భర్తకు డైవర్స్ నోటీసులు కూడా పంపించింది. అయితే ఇటీవల ప్రియాంక తన కుమార్తె వెన్నెల చనిపోయిందని భర్తతో చెప్పింది. ఇదే సమాచారం తన సోదరుడికి కూడా చేరవేసింది. అంత్యక్రియల అనంతరం పోస్టుమార్టం రిపోర్ట్ భర్తకు పంపించింది. అందులో అనేక రకాల అనుమానాలు ఉండడంతో ప్రవీణ్ రిపోర్టును విదేశాల్లో ఉంటున్న తన స్నేహితుడికి పంపించాడు. ప్రవీణ్ స్నేహితుడు విదేశాలలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఆ పోస్టుమార్టం నివేదికలో అన్ని తప్పులు ఉన్నట్టు అతడు గుర్తించాడు. దీంతో ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరపగా.. కీలక విషయాలు బయటకు వచ్చాయి.

వెన్నెలను ప్రియాంక, మోహన్ గొంతు నులిమి చంపేశారని తేలింది. వారిద్దరి ఏకాంతానికి అడ్డుగా ఉందని ఆమెను చంపినట్టు సమాచారం. మోహన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి ప్రియాంక పరారీలో ఉంది. కొద్దిరోజులుగా ఆమె హాసన ప్రాంతంలో తలదాచుకుంటున్నది. దీంతో పోలీసులు ఆమెను గుర్తించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.. మరోవైపు మోహన్ మాయమాటలు నమ్మి ప్రియాంక నిండా మునిగిపోయింది.

మోహన్ డబ్బున్న వ్యక్తి కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అంతకంటే కాదు. అతడు అద్దెకు ఇల్లు సమకూర్చే బ్రోకర్. ఈ విషయాన్ని తెలుసుకోలేక.. తాత్కాలిక వ్యామోహానికి అలవాటు పడి ప్రియాంక జీవితాన్ని నాశనం చేసుకుంది. ప్రియాంక వ్యవహార శైలి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఆమె తీరు పట్లనెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు

ఈ ఐదు లక్షల వారిపై ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం..

Today 12 June 2026 Horoscope
Today 12 June 2026 Horoscope

Today 12 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో అనుకోకుండా ధన లాభం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు పాల్గొనడానికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. రోజువారి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెద్దల అండదండలతో ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సొంత వాహనాలపై వెళ్లే ప్రయత్నం చేయొద్దు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులు ఈరోజు అనేక ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇతరులకు దానధర్మాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల అండదండలతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారులకు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన పనుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా ధన లాభం ఉంటుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. స్నేహితుల నుంచి సపోర్ట్ ఉండటంతో కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు ధన లాభం ఉంటుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు నాణ్యమైన సమయాన్ని స్నేహితులతో గడుపుతారు. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. ఎవరికైనా డబ్బు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడంతో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. వ్యాపారులకు కొత్తగా లాభాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. శక్తి సామర్ధ్యాల మేరకు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అనుకోకుండా వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయం. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మార్చురీలో ఉన్న పురుషుల ప్రైవేట్ పా** ను వదిలిపెట్టలేదు ఈ లేడీ డాక్టర్.. వెలుగులోకి దారుణం

Lady Doctor Remarks
Lady Doctor Remarks

Lady Doctor Remarks: వైద్యులను మనం దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. ఎందుకంటే తల్లి మనకు జన్మనిస్తుంది. మన ఎదుగుదలలో తండ్రి తోడ్పడుతుంటాడు. కానీ వైద్యులు మనకు పునర్జన్మ అందిస్తూ ఉంటారు. మనం జబ్బు పడినప్పుడు.. తిరిగి కోలుకోవడంలో సహాయపడుతుంటారు. అందువల్లే వైద్యులను కనిపించే దేవుళ్ళు అని అంటుంటాం.

ఎంతో పవిత్రమైన వైద్య వృత్తికి చాలామంది సరికొత్త వన్నె తీసుకొచ్చారు. వైద్యరంగంలో సరికొత్త మార్పులకు బీజం వేశారు. కానీ కొంతమంది వైద్యులు మాత్రం ఆ వృత్తికి తీవ్రమైన మకిలి తీసుకొస్తున్నారు. అటువంటి వారి వల్ల వైద్యులు అంటేనే సమాజం చీ కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. అయితే ఈ జాబితాలో ఈ మహిళ వైద్యురాలు అందరికంటే ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఆమె చేసిన పని అంత పనికిమాలినది కాబట్టి. పైగా ఈ విషయాన్ని తనే బయటపెట్టుకుంది.

ఇటీవల కాలంలో స్టాండ్ అప్ కామెడీ షో లు పెరిగిపోయాయి. అందులో బీ గ్రేడ్ కంటెంట్ కూడా ఎక్కువైపోయింది. దీనివల్ల చాలామంది నవ్వుకుంటున్నారు గాని.. పచ్చి బూతుల వల్ల ఎంత ఇబ్బందిగా ఉంటుందో మిగతా వాళ్లకు తెలుసు. ఆ వైద్యురాలు స్టాండప్ కామెడీలో లైన్ తప్పింది.. అనకూడని మాట అనేసింది.. మార్చురీలో ఉండే పురుషుల శవాల ప్రైవేట్ పార్ట్స్ పరిమాణాల మీద తాము జోకులు వేసుకుంటామని ఆ వైద్యులు చెప్పింది.. ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయడంతో ఆమె వెంటనే క్షమాపణ చెప్పింది..

ఇటీవల కాలంలో ఈ తరహా లేకి వ్యాఖ్యలు చేసే వారు చాలామంది పెరిగిపోతున్నారు. దానికి స్టాండ్ అప్ కామెడీ అని పేరు పెడుతున్నారు.. ఇక గురుగ్రామ్ ప్రాంతంలో ఐటీ ఇంజనీర్ గా పనిచేసే హిమాన్షు అనే వ్యక్తి.. స్టాండ్ అప్ కామెడీలో బిర్యానీ వ్యాఖ్యలు కూడా వివాదాన్ని సృష్టించాయి.”నేను ఒక అమ్మాయికి 370 రూపాయలు పెట్టి బిర్యానీ కొనిచ్చాను.. దానికి బదులుగా ఆమె ఏమిస్తుంది.. నేను ఏం కోరుకుంటాను. శారీరక సుఖాన్నే కదా” అంటూ పనికిమాలిన మాటలు మాట్లాడాడు.

అతడు మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వివాదాన్ని సృష్టించాయి. దీంతో ఆ కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించింది. వీరు మాత్రమే కాదు అప్పట్లో కొంతమంది ఏపీ రాజకీయాల గురించి కూడా చెత్త వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ.. చంద్రబాబు మీద అడ్డగోలుగా మాట్లాడారు. వారిపై కేసులు కూడా నమోదు అయ్యాయి. స్టాండప్ కామెడీ పేరుతో వీరు చేస్తున్న లేకి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి.

డైరెక్టర్ గా మారిన కిరణ్ అబ్బవరం.. మొదటి సినిమాలో హీరో ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు..

Kiran Abbavaram
Kiran Abbavaram

Kiran Abbavaram: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు కిరణ్ అబ్బవరం . ‘రాజా వారు రాణి వారు’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈయన ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’, ‘క’, ‘k ర్యాంప్’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. మధ్యలో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి కానీ , చాలా తొందరగానే కం బ్యాక్ ఇచ్చి తన సత్తా చాటాడు. అయితే హీరో గా తనని తానూ నిరూపించుకున్న కిరణ్ అబ్బవరం , ఇప్పుడు డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇది ఆయన 13 వ సినిమా అట. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.

చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈ చిత్రం లో హోటల్ ఓనర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సుధాకర్ చాగంటి నిర్మిస్తున్నాడు. జాయ్ ఫిలిమ్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే కిరణ్ అబ్బవరం మంచిగా హీరో గా కొనసాగుతున్నాడు కదా, ఇప్పుడు ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా అని సోషల్ మీడియా లో కొంతమంది అంటున్నారు. కానీ కిరణ్ అబ్బవరం కేవలం హీరో మాత్రమే కాదు , ఒకప్పుడు రైటర్ గా కూడా పని చేశాడు. తన మొట్టమొదటి కమర్షియల్ సూపర్ హిట్ ‘SR కళ్యాణ మండపం’ కి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ రాసింది మరెవరో కాదు , కిరణ్ అబ్బవరమే. ఈ సినిమా టైటిల్స్ పడేటప్పుడు ఈ విషయాన్నీ గమనించొచ్చు. అంతే కాకుండా , హీరో అవ్వకముందు ఆయన ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అందుకే ఈ చిత్రాన్ని స్వయంగా ఆయనే డైరెక్షన్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా పై ఆడియన్స్ లో ఆయన ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇండీ కూటమిలో పేరుకే 25 పార్టీలు నిజానికి 14 మాత్రమే

India aliance

INDIA Alliance దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఇండియా (INDIA) కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూటమిలో పేరుకే 25కు పైగా పార్టీలు ఉన్నప్పటికీ, వాస్తవంగా చురుకుగా పనిచేస్తున్నవి దాదాపు 14 పార్టీలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా పార్టీలు కేవలం పేరు కోసం మాత్రమే కూటమిలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అంతేకాదు, కూటమిలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలకు తమ తమ రాష్ట్రాల్లోనే ఆశించిన స్థాయిలో బలం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని పార్టీలు వరుస ఎన్నికల్లో పరాజయాలు ఎదుర్కొంటుండగా, మరికొన్ని పార్టీలు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే శక్తి ఇండియా కూటమికి ఉందా అనే సందేహం వ్యక్తమవుతోంది.

కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విధానపరమైన విభేదాలు, నాయకత్వంపై స్పష్టత లేకపోవడం, రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాల్లో తలెత్తే వివాదాలు కూడా కూటమి బలహీనతలుగా కనిపిస్తున్నాయి. ఒకే లక్ష్యం కోసం కలిసిన పార్టీలు ఎన్నికల తర్వాత కూడా ఐక్యంగా కొనసాగగలవా అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.

అందుకే రాజకీయ ప్రత్యర్థులు ఇండియా కూటమిని “అతుకుల బొంత”గా అభివర్ణిస్తున్నారు. కూటమి మనుగడ, ప్రభావం పూర్తిగా పార్టీల ఐక్యత, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం, బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించడంపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇండీ కూటమిలో పేరుకే 25 పార్టీలు నిజానికి 14 మాత్రమే దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

'ఓజీ 2' పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్.. ఊగిపోతున్న సోషల్ మీడియా..

Pawan Kalyan OG 2
Pawan Kalyan OG 2

Pawan Kalyan OG 2: పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ’ అనేది కేవలం ఒక చిత్రం కాదు , ఎమోషన్. వరుసగా రీమక్స్ చేస్తూ, పాన్ ఇండియన్ హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ లేడు , ఆయన స్థాయికి తగ్గ సినిమాలు చేయడం లేదని అభిమానులు బాధపడుతున్న సమయం లో విడుదలైన ఈ చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ సాధారమైనది కాదు. విడుదలకు ముందు జెన్ జీ యూత్ మొత్తాన్ని ఒక ఊపు ఊపింది. ఎక్కడ చూసిన దీని గురించే చర్చ, అప్పట్లో జానీ సినిమాకు ఎలాంటి హైప్ ఉండేదో , ఈ సినిమాకు కూడా అదే రేంజ్ హైప్ ఏర్పడింది. అలాంటి హైప్ తో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో #RRR తో సమానమైన ఓపెనింగ్ వచ్చింది. ఓవర్సీస్ లో అయితే ఏకంగా 5 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ వచ్చింది.

అందులో ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ కేవలం ప్రీమియర్ షోస్ నుండి వచ్చాయి. అయితే ప్రీమియర్ షోస్ నుండి ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడం తో , కాస్త పొటెన్షియల్ తగ్గినా విషయం వాస్తవమే కానీ , సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా కేవలం తెలుగు వెర్షన్ నుండి 321 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహం అభిమానుల్లో ఉండేది. స్వయంగా పవన్ కళ్యాణ్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించినప్పటికీ , ఉప ముఖ్యమంత్రి గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఆయన షెడ్యూల్స్ ని చూసి , ఈ సినిమా ఉంటుందో లేదో అనే అనుమానం అభిమానుల్లో కలిగింది.

అంతే కాకుండా రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ సినిమాలకు శాశ్వతంగా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు అనే టాక్ కూడా అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. సరిగ్గా ఇలాంటి సమయం లోనే కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సేషనల్ అప్డేట్ ఒకటి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి వచ్చింది. ‘ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజీ 2 చేస్తున్నాడు. సుజిత్ ప్రస్తుతం ఫారిన్ లో ఉన్నాడు , ఇండియా కి తిరిగి రాగానే ఇక ఓజీ 2 గురించి మాట్లాడుకుందాం’ అంటూ ఒక ట్వీట్ పడింది. అంతే ఇక, సోషల్ మీడియా మొత్తం ఊగిపోయింది , అరగంట లోపే 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టీ ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ నెల నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.