spot_img
Homeఅంతర్జాతీయంForbes 250 Immigrants List: ఉత్తమ వలస వాదుల్లో మనోళ్లు.. 250 మందిలో 27 మంది...

Forbes 250 Immigrants List: ఉత్తమ వలస వాదుల్లో మనోళ్లు.. 250 మందిలో 27 మంది ఎన్నారైలు!

Forbes 250 Immigrants List: భారత్‌ లేకుంటే అమెరికా లేదు.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ మూడు దశాబ్దాల క్రితం చేసిన ప్రకటన ఇది. ఇది నూటిని నూరుపాళ్లు నిజం. భారతీయులు అమెరికాకు వెళ్లి.. తక్కువ వేతనాలతో మన మేధాశక్తిని అమెరికా అభివృద్ధికి ధారపోశారు.. ఇప్పటికీ పోస్తున్నారు. అమెరికా ఎదుగుదలలో భారతీయుల పాత్రను ఎవరూ కాదనలేరు. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా వలస వచ్చి స్థిరపడిన ఎలాన్‌ మస్క్‌ వంటి వారు కూడా అగ్రరాజ్యాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. అమెరికా ఏర్పడి జూలై 5 నాటికి 250 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్‌ 250 మంది ఉత్తమ వలసదారుల జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్‌లో 27 మంది భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకోవడం, భారతీయల ప్రపంచ స్థాయి ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. ఇందులో వ్యాపారం, సాంకేతికత, సంస్కృతి, రాజకీయాలు వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వలసదారులు ఉన్నారు.

టాప్‌లో ఆస్ట్రియా నటుడు..
250 మంది ఉత్తమ వలసవాదుల జాబితాలో ఆస్ట్రియా నుంచి వచ్చిన నటుడు–రాజకీయ నాయకుడు ఆర్నాల్డ్‌ ష్వాజ్‌నెగ్గర్‌ టాప్‌ స్థానంలో ఉన్నారు. ఈ జాబితా అమెరికా అభివృద్ధిలో వలసదారుల పాత్రను హైలైట్‌ చేస్తుంది. 27 మంది భారత సంతతి వ్యక్తుల్లో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, పెప్సికో మాజీ సీఈవో ఇంద్రా నూయి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరు తమ నాయకత్వంలో ప్రపంచ స్థాయి కంపెనీలను మరింత బలోపేతం చేశారు. సాంకేతిక రంగంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఈ జాబితాలో భారత్‌ టాప్‌ స్థానాల్లో ఒకటిగా నిలవడానికి కారణమైంది.

భారతీయుల విజయానికి ప్రతీక..
భారత సంతతి వ్యక్తులు ఈ స్థాయిలో విజయం సాధించడం కేవలం యాదృచ్ఛికం కాదు. భారతదేశంలోని ఉన్నత విద్యా వ్యవస్థ, గణితం–సైన్స్‌లో బలమైన పునాది, పని కఠినత్వం వంటివి వారిని ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేశాయి. అమెరికా వంటి దేశంలో అవకాశాలు, ఇన్నోవేషన్‌కు అనుకూలమైన వాతావరణం ఈ ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లాయి. వీరు కేవలం వ్యక్తిగత విజయం సాధించలేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలను గ్లోబల్‌ లీడర్లుగా మార్చడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీగా సహకరించారు. ఇది ‘బ్రెయిన్‌ గెయిన్‌’ అనే భావనను బలపరుస్తుంది. అయితే, భారత్‌ నుంచి ప్రతిభావంతులు వలస వెళ్లడం వల్ల దేశంలోని నైపుణ్యాల కొరత గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.

250 సంవత్సరాల చరిత్రలో వలసదారులు ఎప్పుడూ కీలక భూమిక పోషించారు. భారత సంతతి వ్యక్తులు టెక్, బిజినెస్‌ రంగాల్లో ఆధునిక ఇన్నోవేషన్‌లకు నాంది పలికారు. వీరి నాయకత్వం వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, సాంకేతిక పురోగతి వేగవంతమైంది. ఈ లిస్ట్‌ ద్వారా ఫోర్బ్స్‌ అమెరికా అభివృద్ధి వలసదారుల సహకారం లేకుండా సాధ్యం కాదని సూచిస్తోంది. మొత్తంమీద, ఈ ఫోర్బ్స్‌ లిస్ట్‌ భారత సంతతి వ్యక్తుల విజయ గాథను మాత్రమే కాకుండా, ప్రపంచీకరణ యుగంలో నైపుణ్యాలు, అవకాశాలు ఎలా మిళితమవుతాయో చూపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper