Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలవరం ప్రారంభం అయ్యింది. జోసెఫ్ రావణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ప్రజల్లోకి భిన్నంగా వెళ్తోంది. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడుతోంది. సమాజంలో అరాచకాలు సృష్టించే వారి కులం, మతాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని అనుకుంటుందని అభిప్రాయం పెరుగుతోంది. అందుకే వరుస పెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ముందుకు వస్తున్నారు. జోసెఫ్ రావణ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్తున్నారు. కేవలం భయంతోనే ఇప్పుడు స్పష్టత ఇస్తున్నారు. ఈనెల 1న జోసెఫ్ రావణ్ అరెస్టయ్యారు. అయితే ప్రారంభంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసిన తప్పేంటి అన్నట్టు మాట్లాడింది. తీరా ఆయన చేసిన తప్పిదాలు, చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో ఆందోళన ప్రారంభం అయింది. అప్పటినుంచి దిద్దుబాటు అన్నట్టు మాట్లాడుతున్నారు.
* నీళ్లు చల్లిన మాజీ నేత..
తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లేశారు విజయసాయిరెడ్డి. జోసెఫ్ రావణ్ అరెస్ట్ ప్రస్తావన తీసుకొచ్చి ఓ సుదీర్ఘ ట్విట్ చేశారు. మతమార్పిడిలను సమర్థించడం, మన సంస్కృతి పై దాడి చేయడం కొందరికి ఫ్యాషన్ గా మారిపోయిందని.. ఆ వ్యాఖ్యలను సమర్థించే వారికి గుణపాఠం చెప్పాలని విజయసాయిరెడ్డి కోరారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలను తప్పుపట్టారు విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి అలా మాట్లాడారో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన పెరిగింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటివారు రంగంలోకి దిగారు. జోసెఫ్ రావణ్ తో వైసీపీకి సంబంధం లేదని ప్రకటించారు.
* సలహాగా తీసుకుంటే..
విజయసాయిరెడ్డి ట్వీట్ ను ఒక విధంగా సలహాగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన కీలక సూచన చేసినట్లు అయింది. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. దానిని మరింత రెట్టింపు చేసింది ఈ వ్యవహారం. అందుకే జోసెఫ్ రావణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గితే మంచిది అన్నట్టు విజయసాయిరెడ్డి ట్వీట్ ఉంది. సాధారణంగా ప్రభుత్వ వైఫల్యం ఏమాత్రం కనిపించినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతోంది. మరి వైసీపీ చర్యలను నిశితంగా గమనిస్తుంది కూటమి. వైసీపీపై హిందుత్వ వ్యతిరేకం ముద్ర ఉండడంతో ఇప్పుడు జోసెఫ్ రావణ్ వ్యవహారాన్ని వాడుకుంటుంది. టిడిపి కంటే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలు రేపుతోంది.
















ఏమి మాట్లాడాలన్నా భయం వేస్తోంది అంటూ నాగార్జున హాట్ కామెంట్స్..
Nagarjuna: అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని నేడు ఏర్పాటు చేశారు మూవీ టీం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న అక్కినేని అఖిల్ , ఈ సినిమాతో ఎలా అయినా కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం అఖిల్ కి ఎంత ముఖ్యమో , హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈమె కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఆమె కెరీర్ కి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీళ్లిద్దరికీ ఈ సినిమా సక్సెస్ అత్యంత అవసరం. ఇకపోతే నేడు ప్రెస్ మీట్ లో నాగార్జున మీడియా గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను చూస్తుంటే నాకు నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆరోజుల్లో సినిమా ప్రొమోషన్స్ అంటే కేవలం ఆరుగురు జర్నలిస్టులు , ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉండేవారు. అప్పట్లో ఇప్పటి లాగా చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు , నిరంతరం రికార్డింగ్ చేసే కెమెరాలు , డిజిటల్ రికార్డ్స్ వంటివి లేకపోవడం తో మాలో ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. హాయిగా ప్రొమోషన్స్ , ప్రెస్ మీట్స్ వంటివి పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏ కెమెరాలు పెడుతారో , ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు , మేము చెప్పే సమాధానాలను ఎలా వక్రీకరించి చూపిస్తారో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రెస్ మీట్ అంటేనే వణుకు పుట్టే పరిస్థితి’ అంటూ నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఇక ‘లెనిన్’ విషయానికి వస్తే , ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన కుర్ర హీరోలు కూడా భారీ హిట్స్ ని అందుకొని , మార్కెట్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం ఎక్కడ మొదలెట్టాడో , అక్కడే ఆగిపోయాడు , ఆయన కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. అందుకే లెనిన్ తో ఎలా అయినా హిట్ కొట్టి తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఇక నాగార్జున కూడా తన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి , కేవలం ‘లెనిన్’ మీదనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమా ఔట్పుట్ పై ఆయన చాలా నమ్మకం తో ఉన్నారు. మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.