Home Blog Page 10

పుష్ప సినిమా రిపీట్.. ఏం ఫీల్ వచ్చింది మామ.. వైరల్ వీడియో

Maharashtra Floods
Maharashtra Floods

Maharashtra Floods: పుష్ప సినిమా చూశారా.. అందులో అల్లు అర్జున్ ఎర్రచందనం దుంగలను పోలీసుల నుంచి కాపాడేందుకు ఏకంగా నీటిలో వేస్తాడు. నీటి ప్రవాహానికి అవి కొట్టుకొని వస్తాయి. ఆ తర్వాత అత్యంత జాగ్రత్తగా వాటిని బయటికి తీస్తాడు. ఆ తర్వాత దొంగ మార్గంలో వేరే ప్రాంతంలోకి పంపిస్తాడు. చూసేందుకు ఆ సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది. ఎర్రచందనం కర్రలను ఇలా దొంగలించడం.. అలా జాగ్రత్తగా దాయడం అంత ఈజీనా.. చివరికి నీటిలో కూడా వాటిని వేసి ఇలా కాపాడుకుంటారా అని అప్పట్లో ఒక చర్చ కూడా సాగింది. అదంతా సినిమా కాబట్టి.. సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది కాబట్టి.. అలా చేశారు. కానీ రియల్ లైఫ్ లో అలా సాధ్యమవుతుందా..

మహారాష్ట్రలో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తాకిడికి నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. రహదారులు కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని రాయ్ గడ్ ప్రాంతంలో పాతాళ గంగ నది కొద్దిరోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిని దాటి ఆ నదిలో నీటి ప్రవాహం ఉంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నదిలో నీరు గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉంచిన కేంద్రాన్ని ముంచెత్తింది. నీటి ప్రవాహానికి ఆ కేంద్రంలో ఉన్న సిలిండర్లు మొత్తం బయటికి వచ్చాయి. ప్రవాహంలో కొట్టుకుపోయాయి. చూస్తుంటే ఆ సన్నివేశం అచ్చం పుష్ప సినిమాను తలపించింది. నీటి ప్రవాహంలో గ్యాస్ సిలిండర్లు వెళ్తున్న తీరు చూసేవాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పుష్ప సినిమాలో నీటి ప్రవాహంలో ఎర్రచందనం దుంగలు ప్రవహించినట్టుగానే.. గ్యాస్ సిలిండర్లు కూడా ఒకదాని వెంట ఒకటి నీటిలో వెళ్లాయి. దాదాపు 3,000 సిలిండర్లు ఇలా నీటిలో కొట్టుకుపోయాయని తెలుస్తోంది. ఈ ప్రవాహ దృశ్యాన్ని కొంతమంది తమ ఫోన్లలో బంధించారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలోకి పంపించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. వాస్తవానికి పుష్ప సినిమా మాదిరిగా ఇటువంటి సన్నివేశం నిజ జీవితంలో చోటు చేసుకుంది అంటే మాటలు కాదని.. ఈ వీడియో సుకుమార్ చూసి ఉంటే మరింత సంతోషిస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

బ్రేకప్ తో ఆ ప్రముఖ నటి మెంటల్ గా డిస్ట్రబ్ అయిపోయిందా...

Telugu Actress Breakup
Telugu Actress Breakup

Telugu Actress Breakup: సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ జీవితాలు ఏరోజు ఎలా ఉంటాయో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు పెళ్లి చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు నెలరోజుల్లోపే వాళ్ళ మధ్య తరచుగా విభేదాలు రావడంతో విడిపోతూ ఉంటారు. అందువల్లే సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఒక వార్త వినాల్సి వస్తుంది. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న వారు విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకున్న వాళ్లు మళ్లీ ఇంకొకరితో కలిసి లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇదంతా చూసే కొంతమంది కొన్ని రకాల ఇబ్బందులను పడుతున్నప్పటికి నటీనటులు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ కెరియర్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు ను సంపాదించుకున్న ఒక తెలుగు నటి గత కొద్ది రోజులుగా మానసికంగా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటుందట. కారణం ఏంటంటే ఆ వెబ్ సిరీస్ లో నటించడం వల్ల ఒక నటుడితో ఆమె చాలా క్లోజ్ గా ఉన్న సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది.

దానివల్ల తన వ్యక్తిగత జీవితంలో తనకు తోడుగా ఉంటాడనుకున్న బాయ్ ఫ్రెండ్ తనని వదిలేశారనే వార్తలు వస్తున్నాయి. దానివల్లే ఆమె ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంది అంటూ కొన్ని కథనాలైతే వెలవడుతున్నాయి. నిజానికి ఆమె వెబ్ సిరీస్ లో నటించినందుకు కాదు కానీ తన పర్సనల్ విషయాల్లో తన బాయ్ ఫ్రెండ్ తనని చాలా వరకు టార్చర్ చేశారంట. దానివల్లే ఆమె డిప్రెషన్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తన బాయ్ ఫ్రెండ్ వల్లే ఆమె చాలా ఇబ్బందులకు గురైందని సినిమాలో నటించినందుకు అయినప్పటికి ఆమె ఇంకా పూర్తిస్థాయిలో కోల్కోవాల్సిన అవసరమైతే ఉందని కూడా చెబుతున్నారు. ఇక నిఖిల్ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఆమె ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది…

మగాళ్లను చంపేస్తున్నారు సార్.. మహిళా కమిషన్ లాగా మగాళ్లకు పురుషుల కమిషన్ కావాలి

Men's Commission India
Men's Commission India

Men’s Commission India: ఇది అత్యంత బాధాకరమైన విషయం.. ఎందుకంటే జరుగుతున్న సంఘటనలు అలా ఉన్నాయి కాబట్టి. గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేదు.. ఇలాంటి సంఘటనలు జరగలేదు. కానీ ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటున్నాయి. ఎలా ఉంటున్నాయి అంటే.. ఒకదాన్ని మించి మరొకటి ఉంటున్నాయి. పైగా భయాన్ని కలగజేస్తున్నాయి. జీవితంలో పెళ్లి అంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేస్తున్నాయి.

పూణేలో కేతన్ అగర్వాల్ ను అతనికి కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ చంపేసిన తర్వాత.. ఆ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఈ కేసు కు సంబంధించిన అనేక సంచలన నిజాలు ఒకదాని వెంట ఒకటి బయటపడుతున్న తర్వాత.. మనదేశంలో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ఆ చర్చ ఏకంగా పార్లమెంట్ దాకా వెళ్ళింది. పైగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా జరుగుతున్న పరిణామాలను చూసి భయపడుతున్నారు. ఇది పద్ధతి కాదు.. ఇది విధానం కాదు.. దీనికి పాడాలి చరమగీతం అన్నట్టుగా మాట్లాడుతున్నారు.

ఇటీవల కాలంలో మగవాళ్ళను ప్రియురాళ్లు, భార్యలు చంపేస్తున్న నేపథ్యంలో.. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పెళ్లి చేసుకోవాలంటే మగవాళ్ళు భయపడిపోతున్నారు. అసలు ఇలా కూడా జరుగుతుందా.. ఇలా ప్రాణాలు తీస్తుంటే ఇక పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాలని మగవాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒంటరి జీవితమే బాగుంటుందని.. ఒంటరిగా మిగిలిపోవడమే గొప్పగా ఉంటుందని భావిస్తున్నారు.

మగవాళ్ళ బాధలు చూడలేక కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకులూ స్పందిస్తున్నారు. తాజాగా అశోక్ కుమార్ అనే రాజ్యసభ సభ్యుడు పెద్దల సభలో కీలక వ్యాఖ్యలు చేశాడు. మగవాళ్ళ మీద రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని.. మగవాళ్ళను చంపేస్తున్నారని.. మగవాళ్ళ ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందని.. చెబుతూ.. మగ వాళ్లకు కూడా కమిషన్ ఏర్పాటు చేయాలని.. ఆడవాళ్ళ నుంచి మగవారిని కాపాడాలని ఆయన సాక్షాత్తు పెద్దల సభలో వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మెజారిటీ ప్రజల నుంచి సానుకూల ప్రకటన రావడం గమనార్హం.
image.png

భారత్ స్ఫూర్తితో..పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కు ఎదురుదెబ్బ. ఇక కోలుకోవడం కష్టమే

Pakistan Army Chief Asim Munir
Pakistan Army Chief Asim Munir

Pakistan Army Chief Asim Munir: ఆ మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాల మీద ఎలా దాడి చేసిందో తెలుసు కదా.. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసింది. ఉగ్రవాదులను కోలుకోకుండా చేసింది.. వీరంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు అత్యంత దగ్గర. వారు అలా నష్టపోవడం మునీర్ కు కోలుకోలేని దెబ్బ. దాని నుంచి కోలుకోవడానికి మునీర్ కు చాలా సమయం పట్టింది. ఇప్పుడు భారత్ స్ఫూర్తితో మునీర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. తగిలిన దెబ్బ కూడా చాలా బలంగా తగిలింది.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కొంతకాలంగా బలుచిస్థాన్ మీద ప్రధానంగా దృష్టి సారించారు. తన పదవి ఉండాలంటే ఆయన ఇలా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే బలూచ్ నిరసనకారులు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో యుద్ధాన్ని సాగిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. సరిహద్దుల్లో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. బలూచ్ నిరసనలు అణచివేయడంలో మునీర్ విఫలమయ్యారని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి.. ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మునీర్ సైన్యాన్ని భారీగా మోహరించి దాడులకు పాల్పడ్డారు. అయితే అక్కడి ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో వెనక్కి వచ్చేశారు.

ఇప్పుడు తాజాగా మునీర్ కు ఊహించని దెబ్బ ఎదురైంది. బలూచ్ ఉద్యమకారుల నిరసనలు తార స్థాయికి చేరాయి. వారంతా కూడా గ్వాదర్ ప్రాంతంలోని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరం మీద ఆత్మహుతి దాడి చేశారు. ఈ సంఘటన లో 30 మంది భద్రతాసిబ్బంది చనిపోయారు. ఈదురు దాడి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు గట్టి దెబ్బ తగిలింది.. బలూచ్ నిరసనకారుల దాడిలో మునీరు బావమరిది కెప్టెన్ మహమ్మద్ జిబ్రాన్ చనిపోయాడు. బెలూచిస్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నందుకు ప్రతీకారకంగా ఈ దాడులు చేస్తున్నామని రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం మీద భవిష్యత్తు కాలంలో రెబల్స్ భారీ ఎత్తున దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ఆర్మీ చేసిన దాడులను స్ఫూర్తిగా తీసుకొని బలూచ్ నిరసనకారులు దాడులు చేసినట్టు తెలుస్తోంది.. పాకిస్తాన్ మీడియా కూడా ఈ విషయాలను విశ్లేషించాయి. ఈ దాడులు భవిష్యత్ కాలంలో మరింత పెరిగితే పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలే.

'Rapido' డ్రైవర్ గా మారిపోయిన హీరో నితిన్.. సంచలనంగా మారిన వీడియో..

Nithiin Rapido Driver
Nithiin Rapido Driver

Nithiin Rapido Driver:  కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాల్లో చీకటిని నింపింది. ఈ మహమ్మారి తర్వాత కొందరి జీవితాలు తల క్రిందలు అయ్యాయి, అందులో సినీ హీరోలు కూడా ఉన్నారు , వారిలో యంగ్ హీరో నితిన్ ఒకరు. కెరీర్ ప్రారంభం లోనే ఇండస్ట్రీ హిట్ తరహా సినిమాల్లో హీరోగా నటించిన ఆయన , ఆ తర్వాత సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడంతో చాలా రోజుల పాటు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకున్నారు. ఇక హీరో గా కెరీర్ ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆయనకు ‘ఇష్క్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తగిలింది. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2020 వరకు కెరీర్ పీక్ రేంజ్ లోనే సాగింది. కానీ ఆ తర్వాత నితిన్ కి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

‘భీష్మ’ చిత్రం తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఈ కారణం చేత ఇప్పుడు నితిన్ కెరీర్ ‘ఇష్క్’ కి ముందు ఎలా ఉన్నిందో , ఇప్పుడు దాదాపుగా అలాగే ఉంది. మరోసారి ఆయనకు భారీ కం బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి మిడిల్ క్లాస్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఒక స్టోరీ ని ఎంపిక చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నారి & సోమశేఖర్ అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైత్యన్య హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి ప్రాంతం లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత కొన్ని రోజుల నుండి జరుగుతోంది. రీసెంట్ గా నితిన్ , వైష్ణవి చైతన్య లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

నితిన్ ఈ సన్నివేశం లో ఒక ‘Rapido’ డ్రైవర్ గా కనిపించారు. ఆయన వెనుక హీరోయిన్ వైష్ణవి చైతన్య కూర్చుంది. చూస్తుంటే ఈసారి నితిన్ కం బ్యాక్ ఇచ్చే స్టోరీ నే ఎంచుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి రూటెడ్ చిత్రాలకు ఆడియన్స్ నుండి ఎల్లప్పుడూ మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే నితిన్ ఈసారి కొట్టే దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఈ చిత్రం తర్వాత కూడా నితిన్ స్క్రిప్ట్స్ ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. వాస్తవానికి నితిన్ కి రీసెంట్ టైం లో పెద్ద అవమానమే జరిగింది. దిల్ రాజు ప్రస్తుతం నిర్మిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో ముందుగా నితిన్ హీరో అనే సంగతి తెలిసిందే. కానీ దిల్ రాజు అంతకు ముందు నితిన్ తో తీసిన ‘తమ్ముడు’ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా నుండి నితిన్ ని తప్పించారు. ఇలాంటి అవమానాలకు నితిన్ ఈ సినిమాతో ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Peddi Harish (@harish.peddi)

మధ్యతరగతి ప్రజల కోసం Motorola మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ధర తెలుసుకోండి..

Motorola Moto G77 Power

Motorola Moto G77 Power: భారత మార్కెట్లో మిడ్ రేంజ్ మొబైల్స్ కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఇలాంటి వారికి అనుగుణంగా ఫోన్లను తీసుకువస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా మోటరోలా కంపెనీ సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అయిన Moto G77 Power ను అధికారికంగా విడుదల చేసింది. ఇందులో అద్భుతమైన బ్యాటరీ లైఫ్, బడ్జెట్ ధరలో లభించే ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్లు మరియు ధర వివరాల్లోకి వెళితె..

మోటో G77 పవర్ ఫోన్ లో 6.72 అంగుళాల Full HD ప్లస్ LCD డిస్‌ప్లే ను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్ , గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉపయోగించారు. దుమ్ము, నీటి తుంపర్ల నుండి తట్టుకునేలా IP64 రేటింగ్‌తో డిజైన్ చేయబడింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 8GB RAMతో పాటు గరిష్టంగా 24GB వరకు పెంచుకునే సదుపాయం ఉంది. ఇందులో 128GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉండగా, మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. దీని కోసం అడ్వాన్స్‌డ్ Sony LYTIA సెన్సార్‌ను ఉపయోగించారు. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను తీయగలదు. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీల కోసం మరియు వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాల ద్వారా 2K క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్‌లోని అతిపెద్ద హైలైట్ దాని 7000mAh భారీ బ్యాటరీ ఉండగా.. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రెండు రోజుల పైనే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ పేర్కొంది. దీనికి వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. భారత మార్కెట్లో మోటో G77 పవర్ స్మార్ట్‌ఫోన్ 8GB RAM ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ. 25,999గా ఉంది. ఇది పాంటోన్ ఇంపెనెట్రబుల్ (గ్రే), పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఫుచ్సియా రెడ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

ఫోన్ పే, గూగుల్ పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి

PhonePe Wrong Transfer
PhonePe Wrong Transfer

PhonePe Wrong Transfer: ప్రస్తుతం అంతా డిజిటల్ మయం అయింది. ఏ పని చేయాలన్న ఆన్ లైన్ లోనే చేస్తున్నాం.. ముఖ్యంగా మనీ ట్రాన్జాక్షన్ అయితే పూర్తిగా మొబైల్ ద్వారానే పంపిస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, భీమ్ వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే తొందరలో లేదా నిర్లక్ష్యంతో కొన్నిసార్లు తప్పు మొబైల్ నంబర్ లేదా UPI ఐడీకి డబ్బులు పంపే ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడకుండా వెంటనే సరైన చర్యలు తీసుకుంటే డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అదెలాగో చూద్దాం..

అనుకోకుండా లేదా పొరపాటున డబ్బు పంపిన వెంటనే ఆ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ తేదీ, సమయం, పంపిన మొత్తం, లబ్ధిదారుడి వివరాలు వంటి సమాచారాన్ని స్క్రీన్‌షాట్ తీసుకుని భద్రపరచాలి. ఫిర్యాదు చేసే సమయంలో ఈ వివరాలు కీలక ఆధారాలుగా ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా మీరు ఉపయోగించిన యూపీఐ యాప్ కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేయాలి. ట్రాన్సాక్షన్ వివరాలను అందించి డబ్బు పొరపాటున వేరే ఖాతాకు వెళ్లిందని తెలియజేయాలి. ఫిర్యాదు నమోదు అయిన తర్వాత రిఫరెన్స్ నంబర్‌ను తప్పనిసరిగా నోట్ చేసుకోవాలి.

ఏ యాప్ ద్వారా డబ్బు పంపారో ఆ యాప్ కు సంబంధించిన వారికి మెసేజ్ తెలియజేయాలి. వీటిలో గూగుల్ పే 1800 419 0157, ఫోన్‌పే: 080-68727374 / 022-68727374, BHIM: 1800 120 1740, Paytm: 0120-4456456 కాల్ చేసి వివరాలు అందించాలి. యాప్ ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే NPCI (National Payments Corporation of India) పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. npci.org.in వెబ్‌సైట్‌లో యూపీఐ ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన వివరాలతో కంప్లైంట్ నమోదు చేస్తే సంబంధిత బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థల ద్వారా సమస్యను పరిశీలించే అవకాశం ఉంటుంది.

అవసరమైతే మీ బ్యాంకు కస్టమర్ కేర్ లేదా బ్రాంచ్‌ను కూడా సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియజేయాలి. ముఖ్యంగా ట్రాన్సాక్షన్ పెండింగ్‌లో ఉన్నా లేదా సాంకేతిక లోపం కారణంగా సమస్య ఏర్పడినా బ్యాంకు సహాయం ఉపయోగపడుతుంది.

అయితే ముందుగానే యూపీఐ ద్వారా డబ్బు పంపే ముందు గ్రహీత పేరు, యూపీఐ ఐడీ, మొబైల్ నంబర్, మొత్తం వంటి వివరాలను రెండుసార్లు పరిశీలించడం మంచిది. కేవలం మొబైల్ నంబర్ ఆధారంగా కాకుండా స్క్రీన్‌పై కనిపించే లబ్ధిదారుడి పేరును నిర్ధారించుకున్న తర్వాతే పిన్ నమోదు చేయాలి. ఇలా చేస్తే పొరపాటున వేరే ఖాతాకు డబ్బులు వెళ్లే ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చు.

రూ.55 తో జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఇక పండుగ చేసుకోండి.. వీరికి బాగా యూజ్ ఫుల్..

Jio Rs 55 Recharge Plan
Jio Rs 55 Recharge Plan

Jio Rs 55 Recharge Plan: తక్కువ ధరలో ఎక్కువ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో Jio తన వినియోగదారుల కోసం కొత్త యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న జియో మొబైల్ ప్లాన్‌కు అదనంగా ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఎంత రీఛార్జ్ చేస్తే ఈ ప్లాన్ పొందవచ్చు? ఎంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది?

ఈ యాడ్-ఆన్ ప్లాన్‌కు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. నెల రోజుల పాటు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ముఖ్యంగా టీవీని మొబైల్‌లోనే చూడాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుందని జియో పేర్కొంది. ఈ ప్లాన్‌లో సాధారణ ఛానళ్లతో పాటు 150కుపైగా ప్రీమియం టీవీ ఛానళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. వినోదం, సినిమాలు, వార్తలు, క్రీడలు, పిల్లల కార్యక్రమాలు, ఆధ్యాత్మికం, సంగీతం, ప్రాంతీయ భాషల ఛానళ్లు వంటి విభిన్న కేటగిరీలలో కంటెంట్‌ను వీక్షించవచ్చు.

యాడ్-ఆన్ ప్లాన్ ద్వారా జియోస్టార్, సోనీ, సన్ టీవీ, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ వంటి ప్రముఖ బ్రాడ్‌కాస్ట్ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానళ్లను యూజర్లు వీక్షించవచ్చని జియో వెల్లడించింది. దీంతో ఒకే ప్లాన్‌లో పలు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, న్యూస్ ఛానళ్లు అందుబాటులోకి వస్తాయి.

వినియోగదారులు ముందుగా రూ. 55 యాడ్-ఆన్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. అనంతరం జియోటీవీ (JioTV) యాప్‌లో తమ జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే ఈ ప్లాన్‌లో ఉన్న ఛానళ్లను వెంటనే యాక్సెస్ చేయవచ్చు. అదనంగా ఎలాంటి సెటప్ అవసరం ఉండదని కంపెనీ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌లోనే లైవ్ టీవీ చూడాలనుకునే వారు, ప్రయాణాల్లో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వినియోగదారులు, తక్కువ ఖర్చుతో ప్రీమియం టీవీ ఛానళ్లను వీక్షించాలనుకునే జియో కస్టమర్లకు ఈ ప్లాన్ మంచి ఎంపికగా నిలవనుంది. ఇప్పటికే యాక్టివ్ జియో మొబైల్ కనెక్షన్ ఉన్నవారు ఈ యాడ్-ఆన్ ప్యాక్‌ను సులభంగా పొందవచ్చు.

గ్రేటర్ రాయలసీమపై జనసేన గురి!

Janasena
Janasena

Janasena: జనసేనలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ఆరు ఉమ్మడి జిల్లాల నుంచి భారీగా వైసీపీ నేతలు జనసేనలో చేరుతారని ప్రచారం ప్రారంభం అయింది. చాలామంది వైసిపి నేతలు అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారంతా జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వారిని పార్టీలోకి రప్పించేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇటీవల 14 మంది జనసేన నేతలతో చేరికల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. ఆయనకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలపై మంచి పట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పని చేశారు. ఆ అనుభవంతోనే పెద్ద ఎత్తున వైసిపి నేతలను ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు గెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి ఉన్నవారు, వీధి లేక పార్టీలో కొనసాగుతున్న వారిని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

* వైసీపీకి పట్టు..
గ్రేటర్ రాయలసీమ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. దాదాపు 70 వరకు నియోజకవర్గాలు ఉంటాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి గ్రేటర్ రాయలసీమ అనుకూలంగా ఉంటూ వస్తోంది. 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ గ్రేటర్ రాయలసీమలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు చాటుకుంది. 2019 ఎన్నికల్లో మాత్రం ఒక ఐదు స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం వైయస్సార్ కాంగ్రెస్ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. మూడు ఎంపీ సీట్లను పొందింది. అందుకే అక్కడ వైసిపిని తక్కువ అంచనా వేయకూడదని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

* ఆ మాజీలంతా..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన సొంత జిల్లా ప్రకాశం నుంచి జనసేన చేరికల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఓ నలుగురు జనసేనలోకి వస్తారని టాక్ నడుస్తోంది. ప్రధానంగా కరణం బలరాం, సిద్ధ రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్ తో పాటు మరొకరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. వారంతా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. నియోజకవర్గాల పునర్విభజన కచ్చితంగా ఉంటుందన్న టాక్ ఉంది. పెరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలతో అవకాశాలు కల్పిస్తామని కూటమి నుంచి వారికి హామీలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో చాలామంది వైసిపి మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన చేరికల కమిటీ చాలా యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించింది. సహజంగానే ఈ పరిణామం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.

ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఇలా అప్లై చేయండి

TGSRTC Conductor Recruitment 2026
TGSRTC Conductor Recruitment 2026

TGSRTC Conductor Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అయోమయం నెలకొంది. అదేంటంటే?

టీఎస్‌ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియలో ప్రస్తుతం గ్రేడింగ్ విధానం, మార్కుల శాతం అంశం కీలకంగా మారింది. గతంలో కండక్టర్ పోస్టుల ఎంపిక పూర్తిగా పదో తరగతిలో సాధించిన మార్కుల శాతం ఆధారంగానే జరిగేది. అభ్యర్థుల మెరిట్‌ను నిర్ణయించి, రీజియన్ వారీగా ఖాళీలు, రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియామకాలు చేపట్టేవారు. అయితే కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ఆ సంవత్సరాల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు మార్కుల బదులుగా గ్రేడ్ పాయింట్లు మాత్రమే నమోదయ్యాయి. ఇటీవల మళ్లీ మార్కుల విధానాన్ని పునరుద్ధరించడంతో ప్రస్తుతం ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల్లో ఒక వర్గం మార్కుల శాతంతో, మరో వర్గం గ్రేడ్ పాయింట్లతో ఉండే పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు విధానాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఒకే మెరిట్ జాబితాలో ఎలా పరిగణనలోకి తీసుకోవాలన్నది ఆర్టీసీకి ప్రధాన సవాల్‌గా మారింది. మార్కులు పొందిన అభ్యర్థులతో గ్రేడింగ్ విధానంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను నేరుగా పోల్చడం సాధ్యం కాకపోవడంతో, అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధానంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇదిలా గ్రేడ్ పాయింట్లను మార్కుల శాతంగా ఎలా మార్చాలనే విషయంపై స్పష్టత కోరుతూ తెలంగాణ ఆర్టీసీ ఎస్సెస్సీ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. గ్రేడింగ్ విధానంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మార్కుల సమానత ఎలా నిర్ణయించాలనే అంశంపై బోర్డు నుంచి మార్గదర్శకాలు వచ్చే అవకాశముంది.గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా మార్చే విధానం ఖరారైన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని అభ్యర్థులను ఒకే ప్రమాణంతో పోల్చి మెరిట్ జాబితా రూపొందించనున్నారు. ఎవరూ నష్టపోకుండా, పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ సాగేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎస్సెస్సీ బోర్డు నుంచి స్పష్టత వచ్చిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతోంది. నోటిఫికేషన్‌లో అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని వేలాది మంది నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వైసిపి కార్యాలయంలోనే కొట్టుకున్నారు.. వీడియో వైరల్!

YSRCP
YSRCP

YSRCP: అసలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. పుంజుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలో బలం పెంచుకోవాల్సింది పోయి.. గొడవలు పడుతున్నారు. బహిరంగంగా కొట్టుకుంటున్నారు. నిన్న ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఏకంగా మహిళా కార్యకర్తలను కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు.. ఆయనకు నివాళులు అర్పించాల్సిన నోటితో తిట్ల దండకం అందుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.

* రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిన్న రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో మెట్లపై వెళ్తున్న ఒక వ్యక్తి కాలిని తొక్కారని ఒక మహిళ నాయకురాలిని తోసేసాడు ఒక యువనేత. వెంటనే అక్కడున్న వారు వచ్చి ఆమెను సముదాయించారు. ఆ యువనేత తీరును తప్పు పట్టారు. దీంతో ఒక్కొక్కరుగా వచ్చి వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా తలెత్తింది. ఈ క్రమంలో సెల్ ఫోన్ లో ఫోటోలు వీడియోలు తీస్తుండగా కొందరు అడ్డగించే ప్రయత్నం చేశారు. అక్కడకు కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పార్టీ హై కమాండ్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

* పార్టీకి ఆదరణ ఉన్న..
ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో ఆదరణ దక్కుతూ వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో సైతం రెండు సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. అటువంటి జిల్లాలో పార్టీని సమన్వయం చేసే సరైన నేత లేరు. గతంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉండేవారు. ఆయన జనసేనలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఆయన సరిగ్గా సమన్వయం చేయలేకపోతున్నారన్న విమర్శ ఉంది. పైగా జిల్లాలో వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా సరే పార్టీ పరిస్థితి గట్టెక్కడం లేదు. ఏకంగా రాజశేఖర్ రెడ్డి జయంతి నాడే పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా కొట్టుకోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇండియన్‌ నేవీలో కొలువులు.. రూ.1.20 లక్షల జీతం.. 275 ఉద్యోగాలు!

Indian Navy SSC Recruitment 2026
Indian Navy SSC Recruitment 2026

Indian Navy SSC Recruitment 2026: దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం ఏటా సైన్యంలో నియామకాలు చేపడుతోంది. ఆర్మీ, బీఎస్‌ఎస్, సీఆర్‌పీఎఫ్, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నేవీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండియన్‌ నేవీ షార్ట్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) విధానం ద్వారా వివిధ బ్రాంచీలలో సుమారు 275 పోస్టులను భర్తీ చేయనుంది. యూజీ/పీజీ డిగ్రీ పూర్తి చేసిన యువతీయువకులకు ఈ అవకాశం లభిస్తోంది. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రారంభ ఎంపిక ఉంటంది. అర్హులైన వారిని శిక్షణకు పిలుస్తారు.

రిక్రూట్‌మెంట్‌ కీలక అంశాలు
ఇండియన్‌ నేవీలో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్‌ వంటి వివిధ ఎంట్రీలలో ఈ పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఎస్‌సీ విధానం కాబట్టి, నిర్ణీత కాలంపాటు సేవ చేసిన తర్వాత పర్మనెంట్‌ కమిషన్‌ అవకాశాలు కూడా ఉండవచ్చు. ఇది యువతకు రక్షణ రంగంలో అధికారి స్థాయిలో నేరుగా ప్రవేశించే మంచి మార్గం.

అర్హతలు, ఎంపిక విధానం..
యూజీ లేదా పీజీ డిగ్రీ పూర్తి చేసిన యువతీయువకులు అర్హులు. డిగ్రీలో మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ జరుగుతుంది. తర్వాత ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులు వంటి దశలు ఉంటాయి. ఈ విధానం వల్ల అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌ బాగా ఉన్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. మహిళలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి.

శిక్షణ, ఉద్యోగ వివరాలు..
ఎంపికైన అభ్యర్థులకు 2027 నుంచి కేరళలోని ఎజిమల ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రారంభ జీతం రూ.1.20 లక్షలు(భత్యాలతో సహా) వరకు ఉంటుంది. దీంతోపాటు వైద్య సౌకర్యాలు, హౌసింగ్, ట్రావెల్‌ అలవెన్సులు, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు వంటి అనేక సౌకర్యాలు లభిస్తాయి.

దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
జూలై 27, 2026 వరకు తుది గడువు.
పూర్తి వివరాలు, బ్రాంచీల వారీగా అర్హతలు, కచ్చితమైన వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.joinindiannavy.gov.in ను సందర్శించండి.

మంచి జీతం, జాబ్‌ సెక్యూరిటీ, హెల్త్‌ బెనిఫిట్స్, పెన్షన్‌ వంటి ప్రయోజనాలు ఉండటం వల్ల ఇది గ్రాడ్యుయేట్లకు ఆకర్షణీయంగా ఉంది. డిగ్రీ మార్కులు ముఖ్యమైనవి కాబట్టి, మంచి అకడమిక్‌ రికార్డ్‌ ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

టిడిపిలోకి ఎన్టీఆర్ మనవడు!

Daggubati Hitesh
Daggubati Hitesh

Daggubati Hitesh: తెలుగుదేశం పార్టీలోకి మరో యువనేత ఎంట్రీకి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నందమూరి తారకరామారావు మనవడు దగ్గుబాటి హితేష్ త్వరలో పార్టీలో చేరుతారని తెలుస్తోంది. ఆయన మాజీ మంత్రులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ల కుమారుడు. ఆయన పూర్తి పేరు హితేష్ చెంచురాం. గతంలో కుటుంబంలో నెలకొన్న విభేదాలు సమసి పోవడంతో చేరికకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ ఎంపీగా కొనసాగుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉన్నారు. దశాబ్దాలుగా చంద్రబాబుతో ఉన్న విభేదాలు సమసిపోవడంతో హితేష్ టిడిపిలో చేరికకు రంగం సిద్ధం అయింది. ఈ మేరకు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో హితేష్ సైకిల్ ఎక్కడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.

* పర్చూరు నుంచి సుదీర్ఘంగా..
దగ్గుబాటి వెంకటేశ్వరరావు నందమూరి తారక రామారావు అల్లుడు. సీఎం చంద్రబాబుకు స్వయానా తోడల్లుడు. 1983 నుంచి 2009 వరకు క్రియాశీలక రాజకీయాల్లో నడిచారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1985, 1989, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 1991లో మాత్రం ఎంపీగా విజయం సాధించారు. 1996లో రాజ్యసభకు ఎంపికయ్యారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలిచారు. సుదీర్ఘకాలం పరుచురు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అక్కడ టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు. అయినా సరే హితేష్ టిడిపిలో చేరి రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు.

* త్వరలో ఎంట్రీ..
పురందేశ్వరి సైతం తన భర్త వెంకటేశ్వరరావుతో కలిసి 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాపట్ల నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రెండోసారి విశాఖ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే ఆమె తర్వాత బిజెపిలో చేరగా.. ఆమె భర్త వెంకటేశ్వరరావు మాత్రం వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వెంకటేశ్వరరావు వైసీపీలో ఓడిపోయిన తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి చంద్రబాబుతో విభేదించి టిడిపి నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అదే చంద్రబాబుతో విభేదాలు పూర్తిగా సమసి పోయాయి. పైగా సోదరుడు లోకేష్ తో హితేష్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే లోకేష్ టీమ్ లో చేరేందుకు హితేష్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రబాబు నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ లభించడంతో త్వరలో హితేష్ టిడిపిలో చేరనున్నారు.

అనసూయను ఈ లుక్ లో చూడతరమా?

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ మూవీ.. ఇదేం ప్లానింగ్ సామీ

Allu Arjun And Lokesh Kanagaraj
Allu Arjun And Lokesh Kanagaraj

Allu Arjun And Lokesh Kanagaraj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి వెళ్లిపోయాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త ఎఫెక్టివ్ గా వర్క్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తనకు సంబంధించినంత వరకు ప్రతి క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.

అతన్ని దర్శకులు ఎలా వాడుకుంటారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో చేస్తున్న రాకా సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇక లోకేష్ తన హీరోని చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడు అనే పేరు అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే యాక్షన్ ఎపిసోడ్స్ లో హై వోల్టేజ్ ఫీల్ ఇచ్చే యాక్షన్ బ్లాక్ లను కొరియోగ్రఫీ చేయిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన బి హ్యాండ్ సీన్స్ ని రిలీజ్ చేయాలని బిటీఎస్ సన్నివేశాలను సైతం రిలీజ్ చేసి ప్రేక్షకులకు హై ఫీల్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ ను ఒక డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేసే ప్రయత్నాలైతే చేస్తున్నాడు. గతంలో ఆయన చేసిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

కాబట్టి అతనికి ఇతర హీరోలెవరు అవకాశాలైతే ఇవ్వము అని చెప్పారట. దాంతో అల్లు అర్జున్ అవకాశం ఇచ్చాడు కాబట్టి దీన్ని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని చేయబోతున్నాడట. మొత్తానికైతే ఈ ప్రాజెక్టుతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేసి ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

పాపం సజ్జల.. జగన్ అంత మాట అన్నారా?!

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ అధినేత, పార్టీ నేతల మధ్య అనుసంధాన కర్తగా ఆయన ఫెయిల్ అవుతున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఆయన పై తరచూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో సజ్జల అన్నట్టు పరిస్థితి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త కూడా ఆయన. అయితే జగన్ ఆదేశాలను సరిగ్గా పాటించడం లేదని సజ్జలపై ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల మావిగన్ రాజధాని ప్రతిపాదనను పార్టీ శ్రేణులకు తీసుకెళ్లడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఫెయిల్ అయినట్లు ఒక ప్రచారం బలంగా ఉంది. సాక్షి మీడియాలో సైతం పెద్దగా ప్రాధాన్యం లేదు మావిగన్ పై. ఈ విషయంలో సజ్జల ఆదేశాలు ఉన్నాయన్నది జగన్కు వెళ్లిన సమాచారం. అయితే రాజధానుల అంశం కావడంతో సజ్జల ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని మందలించినట్లు ప్రచారం సాగుతోంది.

* జర్నలిస్ట్ నుంచి..
స్వతహాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్. ఈనాడులో చాలా ఏళ్ల పాటు పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో అటువైపు అడుగులు వేశారు. కొద్ది రోజులపాటు సాక్షి మీడియా బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఆయనకు భారతీయ రెడ్డితో బంధుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కట్టబెట్టారు. సజ్జల కుమారుడికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను కూడా ఇచ్చారు. అయితే ఐదేళ్ల వైసిపి హయాంలో సజ్జల పార్టీ సీనియర్లకు టార్గెట్ అయ్యారు. మొన్నటి ఓటమికి ఆయనే కారణం అన్నవారు ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో సజ్జలకు రాష్ట్ర సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు.

* కోర్ టీం లేక..
సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పెంచడంలో చాలా కృషి చేశారు. ఆ విషయంలో సందేహించలేము కూడా.. కానీ గతంలో సజ్జల చుట్టూ ఒక కోర్ టీం ఉండేది. జర్నలిస్ట్ రామచంద్ర మూర్తి, ప్రియదర్శిని రామ్ వంటి వారు సజ్జల కోసం పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పైగా పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది సీనియర్లు పెద్ద ఎత్తున సజ్జలపై ఫిర్యాదులు చేశారు. పైగా విజయసాయిరెడ్డి తో పాటు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే రోజురోజుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంక్లిష్టత పెరుగుతోంది. దానిని ఎలా అధిగమించాలో కూడా సజ్జలకు తెలియడం లేదు. తాజాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. కానీ అది పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనుకడుగు వేశారు సజ్జల. సొంత మీడియా సాక్షిలో సైతం మావిగన్ కు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే తరచూ రాజధానుల స్టాండ్స్ మార్చుకుండడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని సజ్జల భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి సజ్జల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.

ఉరుములు, పిడుగులు.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!

AP Rain Alert
AP Rain Alert

AP Rain Alert: ఏపీ వ్యాప్తంగా చల్లటి వాతావరణం కొనసాగుతోంది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో మాత్రం కురవడం లేదు. ఇంకా వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెదర్ అప్డేట్ ఇచ్చింది. నాలుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. అయితే భారీ వర్షాలు నమోదు కావడం లేదు. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఖరీఫ్ అదును దాటుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులపాటు కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. అయితే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో కొంత ఆశలు రేగుతున్నాయి.

* రుతుపవనాల ప్రభావం..
ఐదు రోజులపాటు నైరుతీ రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురు మధురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రైతులతోపాటు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

* ఎల్ నినో ప్రభావం..
ఏపీ పై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం తేలికపాటి వర్షాలు తప్ప.. భారీ వర్షాలు నమోదు కావడం లేదు. నైరుతి రుతుపవనాలు సైతం ఆలస్యం అయ్యాయి. పెద్దగా ప్రభావం సైతం కనిపించడం లేదు. ఖరీఫ్ పంటలపై ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది ఇలానే కొనసాగితే కష్టం అని రైతుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. మరోవైపు ఎల్ నినో హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రత్యామ్నాయ పంటలను సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు ఈ పంటలపై సూచనలు అందిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు ఉంటుందని ముందుగానే అంచనా వేశారు. కానీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఆకాశం మేఘావృతమై కనిపించినా.. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు. ఇది కచ్చితంగా రైతులకు లోటు.