Home Blog Page 111

లగ్జరీ కాదు.. బతకడమే కష్టం.. విదేశం అంటే ఎగేసుకొని వెళ్లేవాళ్లు.. ఓసారి ఈ స్టోరీ చదవండి

Life Abroad Reality Check
Life Abroad Reality Check

Life Abroad Reality Check: అమెరికా అంటే ఆశల స్వర్గం.. యూరప్ అంటే డబ్బుల రాజ్యం.. అక్కడికి వెళ్తే దండిగా సొమ్ములు సంపాదించుకోవచ్చు. ఉన్నత చదువులు చదవచ్చు. ఇంకా చాలా చేయొచ్చు.. అని మనవాళ్లు అనుకుంటారు. అందువల్లే విదేశాలకు వెళుతూ ఉంటారు. అక్కడ ఏం చేస్తారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇక్కడ వాళ్ల గురించి బంధువులు ఇచ్చే బిల్డప్పులు మామూలుగా ఉండవు.

వెస్ట్రన్ దేశాలలో లైఫ్ స్టైల్.. ఎలా ఉంటుందో ఒకప్పుడు తెలిసేది కాదు. ఇప్పుడు మాత్రం మీడియా విస్తృతి పెరిగిపోయిన తర్వాత తెలుస్తోంది. గడిచిన కొంతకాలంగా చాలామంది పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు.. ముఖ్యంగా అమెరికా.. యూరప్ కంట్రీలకు ఎక్కువగా వెళుతూ ఉన్నారు. ఇక్కడ నగదు విలువ మన దేశంతో పోల్చి చూస్తే ఎక్కువ. పైగా వేతనాలు కూడా ఎక్కువగా లభిస్తుంటాయి. అందువల్లే మనవాళ్లు ఈ దేశాలకు వెళ్లడానికి విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అక్కడ సదుపాయాలు.. షరతులు.. ఇవన్నీ కూడా కఠినంగా ఉంటాయి. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అక్కడికి వెళ్లిన వారిని అడిగితే తెలుస్తుంది. అలా అమెరికా వెళ్ళిన వారిలో మన దేశం నుంచి ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. తమ పిల్లల్ని చూసేందుకు వెళ్లిన వారికి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయో.. సోషల్ మీడియాలో పంచుకున్నారు

ఆ దంపతులు తమ పిల్లలు అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో సియాటెల్ ప్రాంతంలో ఉంటే చూసేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లే ముందు అతడు తన భార్యకు శ్వాస కోశ సంబంధిత సమస్య ఉంటే మందులు తీసుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మందులు పూర్తయ్యాయి. మళ్లీ ఆమెకు శ్వాస కోశ సమస్య ఎదురయింది.. అక్కడ మందులు మన మాదిరిగా లభించవు. పైగా పల్మనాలజిస్టును కలవాలి అంటే .. ముందుగా జనరల్ ఫిజిషియన్ ను కలవాలి. డాక్టర్ ను కలవడానికి వారం రోజులపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అపాయింట్మెంట్ దొరికినప్పటికీ.. జనరల్ ఫిజీషియన్ కేవలం వీడియో కాల్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి భార్యాభర్తల మందులను గురించి చెబితే.. దానికి తగ్గట్టుగా మందులు రాశాడు ఆ మందులను మెడికల్ స్టోర్లో తీసుకోవచ్చని సూచించాడు. వీళ్లు ఆ చీటిని పట్టుకొని మందుల షాపుకి వెళ్తే.. అక్కడ మందులు లేవు. పైగా రావడానికి చాలా రోజులు సమయం పడుతుందని చెప్పారు . ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ మందులు వీళ్లకు ఇచ్చారు. అయితే ఆ మందులను సిప్లా కంపెనీ తయారు చేయగా.. దానిపై మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉంది.

ఆ మందుల మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఉండడంవల్ల 50 శాతం రాయితీ వచ్చింది.. అయినప్పటికీ మందులకు వాళ్లు 21000 కట్టాల్సి వచ్చింది.. మన దేశంలో అయితే కేవలం రెండువేలల్లోనే లభించేవి. అమెరికాలో 42 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.. మనదేశంలో చాలామంది వైద్య సదుపాయాలు బాగోవు అంటారు. జీవితాన్ని ఆస్వాదించడం కష్టము అంటారు.. కానీ ఆ వ్యక్తి రాసుకొచ్చిన తన అనుభవాన్ని చదివితే కచ్చితంగా అమెరికా కంటే.. యూరప్ దేశాల కంటే.. భారత్ కొన్ని కోటి రెట్లు మిన్న. అభివృద్ధి చెందిన దేశాలలో అన్ని విపరీతమైన ఖర్చుతో కూడుకొని ఉంటాయి. డాటా కోసం వేలబ్ఖర్చు పెట్టాలి. ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడే అవకాశం ఉండదు. అయితే ఆఫీస్ లేదా ఇల్లు.. ప్రజా రవాణా సదుపాయం ఉండదు. మనుషులు తక్కువ.. భూమి ఎక్కువ.. ఇలాంటి చోట భారతీయులు బతకలేరు. ఒకవేళ వాళ్ళు బతికినా.. జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉండలేరు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.. కాకపోతే నేటి తరం డబ్బు పిచ్చితో వెర్రి వేషాలు వేస్తోంది. కాబట్టి వాళ్లకు ఇండియా కంటే.. వెస్ట్రన్ దేశాలే గొప్పగా ఉంటాయి.

బాలుడి ప్రాణం తీసిన చిప్స్.. జాగ్రత్త తల్లిదండ్రులూ..!

Chips Packet
Chips Packet

Chips Packet: చిన్న పిల్లలను ఆకర్షించడానికి.. వారి ఏడుపును మాన్పించడానికి చిప్స్ ప్యాకెట్స్ హెల్ప్అవుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఒక్కోసారి ఇవి ప్రాణాలను కూడా తీస్తాయని ఇటీవల జరిగిన సంఘటనలను భట్టి తెలుస్తోంది. మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేర్లతో చిప్స్, స్నాక్స్ ప్యాకెట్లు పిల్లలను ఆకర్షించేందుకు రంగురంగుల ప్యాకింగ్‌తో పాటు చిన్న ప్లాస్టిక్ బొమ్మలను కూడా ఉంచుతున్నాయి. అయితే ఈ బొమ్మల కారణంగా ఇటీవల ఓ చిన్నారి ప్రాణం పోయింది. దీంతో పిల్లలకు చిప్స్ కొనుగోలు చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఇవి ఎలా ప్రమాదకరం అంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఐదేళ్ల బాలుడు ఫర్హాన్ చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసి తింటుండగా అందులో ఉన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మను నోట్లో పెట్టుకున్నట్లు సమాచారం. ఆ బొమ్మ ప్రమాదవశాత్తూ గొంతులో ఇరుక్కుపోవడంతో బాలుడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

చిన్నపిల్లలకు వస్తువులను నోట్లో పెట్టుకునే అలవాటు సహజం. ముఖ్యంగా మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు పిల్లలు బొమ్మలు, నాణేలు, చిన్న వస్తువులను నోట్లో పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిప్స్ ప్యాకెట్లలో ఇచ్చే చిన్న ప్లాస్టిక్ బొమ్మలు, ఉంగరాలు, బంతులు లేదా ఇతర ఆకర్షణీయ వస్తువులు పిల్లల చేతికి సులభంగా చేరుతాయి. అవి పొరపాటున గొంతులో ఇరుక్కుపోతే ఊపిరాడక ప్రాణాపాయం ఏర్పడుతుంది.

పిల్లల కోసం స్నాక్స్ కొనుగోలు చేసే సమయంలో తల్లిదండ్రులు ప్యాకెట్‌పై ఉన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న బొమ్మలు లేదా విడి భాగాలు ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు. బొమ్మలను ఉపయోగించే సమయంలో పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి అని చెబుతున్నారు.

ఏదైనా వస్తువు గొంతులో ఇరుక్కుపోతే పిల్లలు అకస్మాత్తుగా దగ్గడం, మాట్లాడలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, ముఖం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం అందించాలి. పిల్లలను ఆకర్షించే ఉత్పత్తుల్లో చిన్న ప్లాస్టిక్ వస్తువులను ఉంచే విషయంలో తయారీ సంస్థలు మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన చిన్న వస్తువులపై స్పష్టమైన హెచ్చరికలు ముద్రించడం, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం అవసరమని సూచిస్తున్నారు.

ఫర్హాన్ మృతి ఒక కుటుంబానికే కాదు సమాజానికే హెచ్చరికగా నిలిచింది. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలు, బొమ్మల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి విషాదాలను చాలావరకు నివారించవచ్చు. పిల్లల భద్రత విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాబేళ్లను ఇంట్లో పెంచుకుంటే ఐశ్వర్యం వస్తుందా?

Keeping Turtles At Home Benefits
Keeping Turtles At Home Benefits

Keeping Turtles At Home Benefits: ప్రకృతిలో ఉండే జీవరాశుల్లో తాబేలు ప్రత్యేకం. మిగతా జంతువలన్నీ దాదాపు హడావుడిగా ఉంటే.. తాబేలు మాత్రం నిదానంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే తాబేలును భారతీయ సంస్కృతిలో కేవలం జీవరాశిగా మాత్రమే కాకుండా కూర్మ(తాబేలు) అవతారం ఎత్తిన విష్ణువుగా భావిస్తారు. దీంతో ఇంట్లో తాబేలును పెంచుకుంటే ధనం, ఐశ్వర్యం, అదృష్టం వస్తాయని నమ్ముతుంటారు. కానీ తాబేలును ఇంట్లో పెంచుకోవడం కంటే పర్యావరణంలో దానిని సంరక్షించడం వల్ల ఎంతోపుణ్యం వస్తుందని కొందరు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అసలు తాబేలుకు సాయం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం వస్తుంది? పురాణాల్లో తాబేలుకు ఎటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి? పూర్తి వివరాల్లోకి వెళితె..

హిందూ పురాణాల్లో తాబేలుకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ముఖ్యంగా మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారమైన ‘కూర్మావతారం’ తాబేలు రూపంలోనే అవతరించిందని చెబుతారు. ఈ కారణంగా తాబేలును పవిత్ర జీవిగా భావిస్తారు. స్థిరత్వం, రక్షణ, ఓర్పు వంటి లక్షణాలకు ఇది ప్రతీకగా నిలిచింది.

క్షీరసాగర మథనంలో తాబేలు పాత్ర:
దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు భారీ సమస్య ఎదురైంది. మథనానికి ఉపయోగించిన మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుండటంతో మథనం కొనసాగడం కష్టమైంది. అప్పుడు మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి, తన భారీ తాబేలు రూపాన్ని సముద్రం అడుగున ఉంచి, మందర పర్వతాన్ని తన వీపుపై మోశాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పర్వతం స్థిరంగా నిలిచి, క్షీరసాగర మథనం విజయవంతంగా పూర్తయింది.

క్షీరసాగర మథనంలో కీలక పాత్ర పోషించిన కారణంగా తాబేలు స్థిరత్వం, భారం మోయగల శక్తి, ఓర్పు, ధైర్యానికి ప్రతీకగా మారింది. కష్టసమయంలో ఆధారంగా నిలిచే జీవిగా పురాణాలు దీనిని చిత్రీకరించాయి. అందుకే అనేక దేవాలయాల్లో కూడా తాబేలు ఆకారాలను చూడవచ్చు. భక్తి సంప్రదాయాల్లో ఇది ఆధ్యాత్మిక స్థిరత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఇంట్లో తాబేలు పెంచుకోవాలా?
కొంతమంది తాబేలును ఇంట్లో పెంచుకుంటే అదృష్టం వస్తుందని నమ్మి కొనుగోలు చేస్తుంటారు. కానీ జీవ తాబేళ్లను పెంచడం అంత సులభం కాదు. వాటికి ప్రత్యేక ఆహారం, నీటి వాతావరణం, తగిన ఉష్ణోగ్రత, వైద్య సంరక్షణ అవసరం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి అనారోగ్యానికి గురవుతాయి. కేవలం అదృష్టం కోసం ఒక జీవిని బంధించడం సరైన పద్ధతి కాదని జంతు సంరక్షణ నిపుణులు చెబుతున్నారు.

తాబేళ్లు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం, కొన్ని రకాల జలచరాల సంఖ్యను నియంత్రించడం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం వంటి పనుల్లో అవి సహాయపడతాయి. సముద్ర తాబేళ్లు సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే తాబేళ్లు ఉండే ప్రాంతాల్లో వాటిని సంరక్షించడం మంచింది. వాటికి అవసరైమన నీటి సౌకర్యాన్ని అందించడం వల్ల పర్యావరణాన్ని కాపాడగలుగుతామని చెబుతున్నారు.

వాహనదారులకు అలర్ట్.. ఇంకా కొన్ని రోజులే.. ఇలా చేయకపోతే సమస్యలు..

Vehicle Owners Alert
Vehicle Owners Alert

Vehicle Owners Alert: వాహనదారులకు ప్రభుత్వానికి సంబంధించిన సేవలను సులభంగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన్ (VAHAN) అనే పోర్టల్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో తమ వివరాలను పొందుపరచుకోవాలని వాహనదారులకు ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ గడువు త్వరలో ముగియనుంది. ఆ గడువు చివరి తేదీ ఏదో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం చాలా మంది వాహన యజమానులు వాహనం కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన పాత మొబైల్ నంబర్లు లేదా ఈమెయిల్ ఐడీలనే కొనసాగిస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఈ-చలాన్లు జారీ అయినా, వాటి సమాచారం సకాలంలో చేరడం లేదు. దీంతో జరిమానాలు పెరగడం, చెల్లింపుల్లో ఆలస్యం జరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.

వాహన్ పోర్టల్‌లో తాజా మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు నమోదు చేస్తే ట్రాఫిక్ చలాన్లు, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు, పన్నులు, ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ గడువు వంటి ముఖ్యమైన సమాచారం SMS, వాట్సాప్, ఈమెయిల్ రూపంలో నేరుగా అందుతుంది. దీంతో వాహనదారులు ముందుగానే అప్రమత్తమై అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

వివరాల అప్‌డేట్ కోసం వాహనదారులు అధికారిక VAHAN సేవల పోర్టల్‌ను సందర్శించి, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలను సరిచేసుకోవచ్చు. అవసరమైతే సమీప రవాణా శాఖ కార్యాలయం (RTO) లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ సేవను పొందవచ్చు.ఈ ప్రక్రియకు జూన్ 30 వరకు మాత్రమే గడువు ఉండగా, ఇంకా కేవలం 15 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

జూన్ 30 తర్వాత వివరాలు అప్‌డేట్ చేయని వాహన యజమానులకు ముఖ్యమైన నోటిఫికేషన్లు చేరడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రతి వాహనదారుడు వెంటనే తమ వివరాలను ధృవీకరించి, తాజా సమాచారంతో వాహన్ పోర్టల్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

పెళ్లి బాజా.. వివాహాలపై 'యుద్ధం' ఎఫెక్ట్!

War Impact On Weddings
War Impact On Weddings

War Impact On Weddings: తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సీజన్ మళ్లీ మొదలైంది. అధిక జేష్ట మాసం ముగిసింది. దీంతో శుభకార్యాలు మొదలయ్యాయి. జూలై 9 వరకు వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలకు సంబంధించి అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయి. దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైంది. ఈనెల 15 నుంచి జూలై 9 వరకు పరిమిత శుభ ముహూర్తాలు ఉండడంతో.. వివాహాలు, గృహప్రవేశాలకు ముహూర్తాలు డిసైడ్ చేస్తున్నారు. జూలై 15 నుంచి ఆషాడమాసం, గురు మూఢం ప్రారంభం అవుతుంది. మళ్లీ ఆగస్టు 15 వరకు ముహూర్తాలు లేవు. మళ్లీ శ్రావణమాసంలోనే ముహూర్తాలు ఉన్నాయి.

ముహూర్తాలు ఇవే
జూలై 9లోపు వేలాది వివాహాలు నిశ్చయం అయినట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. జూన్ తో పాటు జూలై నెలలో ఈ ముహూర్తాలు కొనసాగనున్నాయి. ప్రధానంగా జూన్ 19, 20, 21, 22, 24, 25, 26, 27, 28 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. మరోవైపు జూలైలో 1, 6, 7, 9 తేదీలు కూడా ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. పరిమిత ముహూర్తాలు కావడంతో అటు పురోహితులు, ఫంక్షన్ హాల్, క్యాటరింగ్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా పురోహితులను ముందే మాట్లాడుకుంటున్నారు.

* మార్కెట్లో అన్ని రకాల ధరలు పెరిగాయి. దానికి కారణం యుద్ధం గా చూపుతున్నారు. ఇప్పుడు వివాహాలకు సంబంధించిన అన్ని రకాల ధరల పెరుగుదలకు యుద్ధం కారణమని చెబుతున్నారు. డెకరేషన్ తో పాటు ఇతర ఖర్చులు కూడా పెరిగాయి. డీజిల్ తో పాటు పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనాల కిరాయి పెంచేశారు. నిత్యవసర వస్తువులతో పాటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడంతో.. క్యాటరింగ్ నిర్వాహకులు తమ ధరలను పెంచేశారు. ఇక ప్లేటు భోజనం ధర కూడా పెరిగింది. గతంలో ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు పది లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

* శుభకార్యాలు అంటేనే ప్రధానంగా బంగారం కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. కానీ సామాన్యులు కొనలేని స్థితిలో బంగారం ధరలు ఉన్నాయి. సాధారణంగా ఒక వివాహానికి ఐదు నుంచి పది తులాల బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఆ లెక్కన కూడా దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది వివాహాలకు. ఇలా ఎలా చూసుకున్నా శుభకార్యాలకు సైతం యుద్ధం ఎఫెక్ట్ తప్పడం లేదు..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై వైసీపీ న్యాయ పోరాటం!

YSRCP Legal Battle
YSRCP Legal Battle

YSRCP Legal Battle: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీ నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ సోషల్ మీడియా సంస్థ మెటా వైసీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీని తొలగించింది. భారత దేశ డిజిటల్ మీడియా నిబంధనలకు విరుద్ధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీ ఉండడంతోనే ఈ చర్యలకు దిగినట్లు మెటా స్పష్టం చేసింది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో మెటా ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు దానిపై న్యాయ పోరాటానికి దిగింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టులో పిటీషన్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫేస్బుక్ అకౌంట్ ను ప్రభుత్వ ఆదేశాలతో బ్లాక్ చేసినప్పుడు.. సదరు ఆదేశాల కాపీని ఖాతాదారుడికి ఇవ్వాల్సి ఉంది అని వాదించారు. అందుకే ఈ పిటిషన్ లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, ఇతర అధికారులను, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఒక విధంగా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ వ్యవహారం సంచలనమే. అత్యంత సాహసమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినంత పనిచేస్తూ న్యాయపోరాటం ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో తప్పు పట్టింది వైసిపి. దానికి కూటమి ప్రభుత్వం ధీటుగానే స్పందించింది. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరింది. ఇప్పుడు అదే పని చేసింది వైసిపి.

పెద్ద ఎత్తున ఫిర్యాదులతోనే..
అంతర్జాతీయంగా సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలు చూస్తోంది మెటా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో పెడుతున్న పోస్టులు అభ్యంతరకరంగా, అశ్లీలతగా ఉన్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. భారత ప్రభుత్వ డిజిటల్ మీడియా నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఫేస్బుక్ పేజీ ఉంటుందంటూ అభ్యంతరాలు వెళ్లడంతో మెటా ఆ ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేసింది. ఒక విధంగా ఆ పార్టీకి ఇది షాకింగ్ పరిణామమే. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏకంగా న్యాయపోరాటానికి ఆ పార్టీ దిగడం చూస్తుంటే.. ఆ పార్టీ సోషల్ మీడియాకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం అవుతోంది. ఈరోజు కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

త్రిబుల్ ఆర్ లో జరిగిన తప్పు వారణాసి చేయడం లేదా..?

Varanasi Movie
Varanasi Movie

Varanasi Movie Latest News: దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా తెలుగు సినిమా స్థాయి ఏంటో ప్రపంచ స్థాయికి తెలిసేలా చేశాడు. అలాంటి రాజమౌళి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ని పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆ సినిమా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ భారీ రికార్డులను క్రియేట్ చేసేది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేశారు.

కానీ ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా కూడా ఆ సినిమాకి 1300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది నిజంగా చాలా బాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి 2 సినిమాతో ప్రభాస్ 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు హీరోలు ఉన్నా కూడా అంతటి కలెక్షన్స్ రాలేదు. నిజానికి సినిమా స్క్రిప్ట్ లో గాని డైరెక్షన్ లో గాని కొంతవరకు తేడా జరిగిందనే విషయాన్ని రాజమౌళి అబ్జర్వ్ చేశాడు.

వారణాసి విషయంలో అలాంటివేమి జరగకుండా ఉండడానికే ఆయన తీవ్రమైన కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే వారణాసి సినిమాని టాప్ లెవెల్లో నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న జక్కన్న హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కలిసి సినిమాని చేస్తుండటం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ విషయంలో కూడా రాజమౌళి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు.

అసలు ఏది సీజీ ఏది ఒరిజినల్ గా చేశారో తెలుసుకోలేనంత రియాల్టీలో సీజీ వర్క్ అనేది చేయిస్తున్నాడట. ఈ సినిమాతో 3000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా రాబడతాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ సినిమాతో ప్రపంచం మొత్తం మన సినిమాల వైపు చూసేలా చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

శ్రీకాంత్ ఓదెల ప్లాన్ ఏంటి..? ప్యారడైజ్ బజ్ తగ్గిపోతుందా..?

Srikanth Odela Paradise
Srikanth Odela Paradise

Srikanth Odela Paradise: దసరా సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… మొదటి సినిమాతోనే పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన ప్రస్తుతం నానితోనే ‘ప్యారడైజ్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ప్యారడైజ్ నుంచి గ్లింప్స్ వచ్చినప్పుడు సినిమా మీద భారీ బస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ బజ్ రోజురోజుకీ తగ్గిపోతుంది. ఆగస్టు 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని చెప్పిన దర్శకుడు ఇప్పుడు సినిమా షూటింగ్ లేటవుతుండడం వల్ల ఈ సినిమాని అనుకున్న డేట్ కి తీసుకు రాలేకపోతున్నారనే విషయాన్ని తొందర్లోనే ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పటివరకైతే ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు… కానీ సినిమా యూనిట్ నుంచి ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దాంతో కొన్ని సినిమాలు సైతం ఇప్పటికే ప్యారడైజ్ వాళ్ళు ఇచ్చిన ఆగస్టు 21 డేట్ నా వాళ్ల సినిమాలను అనౌన్స్ చేసుకున్నారు. ఇక ప్యారడైజ్ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందనేది తెలియాల్సి ఉంది…

ఇక ప్యారడైజ్ సినిమాతో నాని కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తే చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని అభిమానులైతే ఈ సినిమాతో నాని టైర్ హీరోగా మారిపోతాడు అనే రేంజ్ లో ఊహించుకుంటున్నారు. కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…

ఇక మొత్తానికైతే నాని శ్రీకాంత్ ను నమ్మి తనతో రెండు సినిమాలు చేయడం ఆ రెండు సినిమాలతో శ్రీకాంత్ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. దసరా మూవీ నానికి ఒక మంచి మాస్ హీరో ఇమేజ్ ను తీసుకొచ్చింది. ప్యారడైజ్ అంతకు మించిన గుర్తింపును తీసుకొస్తుందా? లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

చిరంజీవి ఒప్పుకుంటే ఆయనతో అలాంటి సినిమా చేస్తానంటున్న సందీప్ రెడ్డి వంగ...

Chiranjeevi Sandeep Reddy Vanga Movie
Chiranjeevi Sandeep Reddy Vanga Movie

Chiranjeevi Sandeep Reddy Vanga Movie: చిరంజీవి గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. మెగాస్టార్ అనే హోదాను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… చిరంజీవి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. గత 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఇంకా సోలో హీరోగా రాణిస్తున్నాడు అంటే చిరంజీవికి ఎంతటి క్రేజీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తనకు సినిమాలంటే చాలా పిచ్చి అని తను పలు సందర్భాల్లో తెలియజేశాడు. అలాగే తన చివరి శ్వాస వరకు సినిమాలతోనే మమేకమై ఉంటానని కూడా చెప్పడం విశేషం… ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు తన అభిమానులైన కొంతమంది దర్శకులు అతనితో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే సందీప్ రెడ్డి వంగ సైతం చిరంజీవికి వీరాభిమాని అనే విషయం మనందరికి తెలిసిందే. ప్రస్తుతం సందీప్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నాకు డేట్స్ ఇస్తే ఆయనతో ఒక సినిమా చేయాలని ఉందని చెప్పాడు.

దానికి తగ్గట్టుగానే ఒక కథను కూడా రెడీ చేసుకున్నానని చిరంజీవి టైం ఇస్తే మాత్రం ఆ కథని తనతోనే చేస్తానని చెబుతుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు చాలా హానెస్ట్ మేజర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. తను ఏదైతే అనుకుంటాడో దాన్ని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుడు కూడా తనే కావడం వల్ల అతనితో ప్రతి ఒక్క హీరో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే అతను మాత్రం చిరంజీవి అవకాశం ఇస్తే అతనితో సినిమా చేయడం నాకు కల అంటూ చెప్పుకోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ప్రస్తుతం ఉన్న టైమ్ లో చిరంజీవి తనకు డేట్స్ ఇస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక సందీప్ రెడ్డి వంగా తన సినిమాలో చిరంజీవిని ఒక పవర్ ఫుల్ విలన్ గా చూపించాలనే ప్రయత్నం చేయబోతున్నారట. ఆయన విలినిజం ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తారట. చిరంజీవి దానికి ఒప్పుకుంటాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

చిన్నారి కోరికని నెరవేర్చిన పవన్ కళ్యాణ్.. వరంగల్ లో హృదయాలను హత్తుకునే ఘటనలు..

Pawan Kalyan Fan Niranjan
Pawan Kalyan Fan Niranjan

Pawan Kalyan Fan Niranjan: గత కొన్నేళ్ల నుండి జన్యుపరమైన ఇబ్బందులతో తీవ్రమైన అనారోగ్య పరిస్థితులను ఎదురుకుంటున్న నిరంజన్ అనే వరంగల్ ప్రాంతానికి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని , తనకు పవన్ కళ్యాణ్ ని చూడాలని ఉందని, అదే తన చివరి కోరిక అంటూ ఒక వీడియో ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వీడియో పవన్ కళ్యాణ్ వరకు చేరింది , ఆయన హృదయం కలిచివేయడం తో , ఢిల్లీ టూర్ ముగియగానే , వరంగల్ కి చేరుకొని ఈ చిన్నారి కోరిక నెరవేర్చాడు. అతని ఆరోగ్య పరిస్థితి పై కుటుంబ సభ్యులతో చర్చించి, ఆర్ధిక పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని మాట ఇచ్చారు. అంతే కాకుండా భావంతుడి తీర్థప్రసాదాలు కూడా ఆ బాలుడికి అందించారు పవన్ కళ్యాణ్. అనంతరం నిరంజన్ తల్లితండ్రులైన రాంగోపాల్ , మానస లతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, ఎక్కడ ఈ బాలుడికి చికిత్స అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ఏమి చేస్తే ఈ చిన్నారి ప్రాణాలు నిలుస్తాయో వివరాలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, తక్షణమే వైద్యానికి అవసరమయ్యే 1 లక్ష రూపాయిలను అందించాడు. ధైర్యం గా ఉండాలని , భగవంతుడి ఆశీస్సులు నిరంజన్ పై కచ్చితంగా ఉంటాయని, భవిష్యత్తులో ఈ బాలుడికి అవసరమయ్యే వైద్యం ఖర్చుల బాధ్యత మొత్తం తానే తీసుకుంటానని భరోసా ఇచ్చాడు పవన్ కళ్యాణ్. వరంగల్ లో విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయాళం లో ప్రత్యేకంగా నిరంజన్ పేరిట పూజలు కూడా చేయిస్తానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇంట్లోకి రాగానే పైకి లేచి కూర్చోలేని పరిస్థితిలో ఉన్న నిరంజన్ దయనీయమైన పరిస్థితి ని చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. అట్నాని మంచం పై కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. చిన్నతనం నుండి మీరంటే విపరీతమైన అభిమానం అని ఆ కుర్రాడు చెప్పడం తో , పవన్ కళ్యాణ్ కదిలిపోయారు.

అనంతరం తిరుమల నుండి తీసుకొచ్చిన వస్త్రాన్ని అతనికి కప్పి , కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. తనకు ఒక కుక్కపిల్లని పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా , కచ్చితంగా కొని పంపుతానని మాట ఇచ్చాడు. కుక్క పిల్లని పెంచుకోవడానికి ఇంటి ఓనర్లు ఒప్పుకోవడం లేదని చెప్పగా, ఇంటి ఓనర్లను పిలిపించి మాట్లాడాడు. అంతే కాకుండా, ఈ కుటుంబం జీవనోపాధి కోసం వీళ్ళతో ఒక క్యాంటీన్ పెట్టించాలని పవన్ కళ్యాణ్ తన జనసేన నాయకులకు ఆదేశించాడు. అభిమాని పట్ల, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ, తన విలువైన సమయాన్ని కేటాయించి చూపించిన ప్రేమాభిమానాలు చూసి , పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకే కదా పవన్ కళ్యాణ్ ని అందరూ ఇంతలా ఆరాదించేది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా కథ ఆ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందా..?

Buchi Babu Next Movie
Buchi Babu Next Movie

Buchi Babu Next Movie: సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో మెలుకువలు నేర్చుకున్న బుచ్చిబాబు ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘ఉప్పెన’ సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే బుచ్చిబాబు తన తదుపరి సినిమా విషయంలో కూడా సరైన క్లారిటితో వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఒక పిరియాడికల్ డ్రామా సినిమాని తన నెక్స్ట్ సబ్జెక్టుగా ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో కూడా ఒక స్టార్ హీరో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోలను కలిసి బుచ్చిబాబు కథనైతే వినిపించాడట. మరి వాళ్ళందరు కూడా ఈ సినిమా విషయంలో ఇంట్రెస్ట్ గా ఉన్నప్పటికి ఇందులో ఏ హీరో ఫైనల్ అవుతాడానే విషయంలో మాత్రం సరైన క్లారిటి రావడం లేదు. బుచ్చిబాబు సినిమా అంటే హీరో బాడీ లో ఏదో ఒక పార్ట్ కట్ అయిపోవడం పక్కా అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతుంది.

మరి తదుపరి సినిమా విషయంలో కూడా అలాంటిదే ఏదైనా ఉంటుందా? లేదంటే హీరో ను పూర్తి ఫిట్ గా చూపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే బుచ్చిబాబు ప్రస్తుతం ఉన్న దర్శకులలో చాలా డిఫరెంట్ వే లో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…తన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటి ఇవ్వడం లేదు కానీ పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని తన సన్నిహిత వర్గాల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

బుచ్చిబాబు సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ప్రొడ్యూసర్స్ కి ఎక్కువ భారం పడకూడదనే ఉద్దేశ్యంతో వీలైనంత తొందరగా సినిమాని స్టార్ట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సినిమా సినిమాకి ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోవడం అనేది తనకు నచ్చదట. అందుకోసమే వీలైనంత త్వరగా సినిమాను పట్టాలెక్కించే పనిలో తను బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

పాకిస్తాన్ గో బ్యాక్ నినాదాలతో మార్మోగుతున్న ఆక్రమిత కాశ్మీర్

Pakistan Occupied Kashmir

Pakistan Occupied Kashmir : పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్.. దీన్ని ఆక్రమించిన పాకిస్తాన్ .. దీన్ని ‘అజాద్ కశ్మీర్’గా పిలుస్తారు. అక్టోబర్ 24, 1947లో ఏర్పడింది. గిల్గిట్ బాల్టిస్టాన్, అజాద్ కశ్మీర్ ను పాక్ ఆక్రమించింది. ఇది 77 ఏళ్లుగా పాకిస్తాన్ కాలనీగా ఉంది. పేరుకు స్వతంత్ర ప్రాంతం.. కానీ పాకిస్తాన్ పాలనలోనే మగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వారు భారత్ లో జమ్మూకశ్మీర్ ఎలా మారుతుందో చూస్తున్నారు.

2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు కశ్మీర్ లో పరిస్థితులు మారాయి. ఐఐటీలు, ఐఐఎంలు లాంటి 10 అత్యున్నత సంస్థలు వచ్చాయి. రోడ్లు, మౌళిక వసతులు, బాగా వచ్చాయి. భారత్ ఏమో శత్రుదేశంగా చూస్తే కశ్మీరీలకు భారత్ వల్లే మేలు జరిగింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మాత్రం అక్కడ నష్టం జరిగిందని ఇతర దేశాల్లో ఉన్న కశ్మీరీలు గ్రహించి ఇప్పుడు పీఓకే లో ఆందోళనలు చేపడుతున్నారు.

ఒకనాడు కేవలం ఆర్థిక డిమాండ్ల వరకే ఉన్నాయి. గత 10 రోజుల ఆందోళనలో ఈరోజు రాజకీయ డిమాండ్ గా మారింది. మా కశ్మీర్ లో మీరు ఎవరు అంటూ పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. మీ పాక్ సైన్యం ఇక్కడ ఎందుకు అంటూ నినదిస్తున్నారు.

పాక్ ఆర్మీ, పాక్ అధికారులు వెళ్లిపోవాలని నినాదాలు చేస్తున్నాడు. ఆడవారు, వేలాది మంది పబ్లిక్ ర్యాలీలు తీస్తున్నారు. మా దేశం వేరు.. మీది వేరు అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఉగ్రవాదానికి ఊతం ఇచ్చి పెంచి పోషించిందే పాక్ ఆక్రమిత కశ్మీర్. కానీ ఇవ్వాల హిందుస్తాన్ తో అయినా కలుస్తాం అని అంటున్నారు.

పాకిస్తాన్ గో బ్యాక్ నినాదాలతో మార్మోగుతున్న ఆక్రమిత కాశ్మీర్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

ఏపీ 'సర్' గుబులు.. భయపడుతున్న ఆ రెండు పార్టీలు!

Andhra Pradesh Voter Survey
Andhra Pradesh Voter Survey

Andhra Pradesh Voter Survey: తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ప్రక్షాళన చేస్తోంది. ఈనెల 15 నుంచి ఇంటింటా సర్వే ప్రారంభం అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితిలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది . ఓట్ల తొలగింపు కోసం అధికారపక్షాలు అక్రమాలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో ఆ రెండు పార్టీలు అధికారంలో ఉండేవి. అందుకే అంతలా కంగారు పడుతున్నాయి అనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ తమకు అనుకూలమైన ఓట్లు జాబితాలో ఉంచి.. తమకు ప్రతికూలమైన ఓట్లను తొలగించారు. అటువంటి ఓట్లు ఇప్పుడు తొలగిస్తారు అన్న భయం ఆ రెండు పార్టీలకు వెంటాడుతోంది. ఆ కారణంగానే ఆ రెండు పార్టీలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి.

* ఇంటింటా సర్వే..
ఈనెల 15 నుంచి ఇంటింటికి వెళ్తున్న బూత్ లెవెల్ అధికారులు సమగ్ర సర్వే చేపడుతున్నారు. అత్యంత పారదర్శకంగా, డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా సాగుతోంది ఈ ప్రక్రియ. అర్హత ఉన్న ఈ ఓటరును కూడా తొలగించరు. కేవలం చనిపోయిన వారు, ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటు ఉంటే అటువంటి వారిని తొలగిస్తున్నారు. డబుల్ ఎంట్రీలు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను మాత్రమే నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తొలగిస్తారు. ఇది సాధారణ, చట్టబద్ధమైన ప్రక్రియ కూడా. అయితే గతంలో బెంగాల్లో మమతా బెనర్జీ నానా హడావిడి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అక్రమ ఓటరు గుర్తింపు పొందిన వారు లేనిపోని హడావిడి చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. అటువంటి చొరబాటుదారులకు ఛాన్స్ లేదు. అయితే గతంలో చాలా రకాల విన్యాసాలు చేశాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి. అందుకే ఇప్పుడు కంగారు పడిపోతున్నాయి.

* ఆ ఓట్లు పోతాయని భయం..
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేలాదిగా దొంగ ఓట్లు చేర్పించారన్న విమర్శలు ఉన్నాయి. అటువంటి ఓట్లు ఇప్పుడు గల్లంతు కాక తప్పవు. ఈ డిజిటల్ స్క్రూట్నీలో అడ్డంగా బుక్ కావడం ఖాయం. సర్వే ప్రక్రియపై పౌరులు, పార్టీలు అప్రమత్తంగా ఉండి తమ ఓట్లను వెరిఫై చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అసలు ఓట్లు పూర్తిగా తొలగించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం వెనుక మాత్రం వారి భయం వారికి ఉంది. కేవలం ఎన్నికల సంఘం మార్గదర్శకాలను మాత్రమే బూత్ లెవెల్ అధికారులు అమలు చేస్తారు. దీనిని ఎప్పటికప్పుడు పరిశీలించి తప్పులు జరిగితే అడ్డుకోవచ్చు. కానీ రెండు తెలుగు పార్టీలు మాత్రం ఇప్పటినుంచే ఓటమికి కారణాలు వెతుకుతున్నట్టు స్పష్టమవుతోంది.

టీ, కాఫీలు తాగితే బరువు తగ్గుతారా.. ఎలా తీసుకోవాలి..

Tea For Weight Loss
Tea For Weight Loss

Tea For Weight Loss: కాఫీ, టీలు ఆరోగ్యానికి మంచివి కావని చాలామంది భావిస్తారు. అయితే తాజా అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, టీని సరైన పద్ధతిలో తీసుకుంటే బరువు నియంత్రణలో సహాయపడే అవకాశం ఉందని.. అందులోనూ టీ తాగే సమయం, అందులో కలిపే పదార్థాలు, అలాగే దానికి తోడు తీసుకునే ఆహారపు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అసలు టీ తాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? టీ లేదా కాపీని ఏ యే పద్ధతిలో తీసుకోవాలి?

చాలామందికి ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ నిపుణుల ప్రకారం నిద్రలేచిన తర్వాత కనీసం 60 నుంచి 90 నిమిషాల వరకు కెఫీన్ ఉన్న పానీయాలను తీసుకోకపోవడం మంచిది. ఈ సమయంలో శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగానే అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఇది మనల్ని మెలకువగా ఉంచడంతో పాటు రోజంతా ఎదురయ్యే ఒత్తిడులను ఎదుర్కొనేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది.

ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉన్న వారిపై నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. నిద్రలేచిన మొదటి గంటన్నరలోనే టీ తాగినవారిలో కొద్దిసేపటికే శక్తి స్థాయులు తగ్గడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. కార్టిసాల్ స్థాయులు సహజంగా పెరిగే సమయంలో అదనంగా కెఫీన్ తీసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉండొచ్చని వారు చెబుతున్నారు.

అయితే లేచిన గంటన్నర తర్వాత టీ తాగినవారిలో మాత్రం కెఫీన్ ప్రభావం మరింత సమర్థంగా పనిచేసినట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీరిలో చురుకుదనం పెరగడం, ఏకాగ్రత మెరుగుపడటం, ఆకలి కొంత మేర తగ్గడం వంటి ప్రయోజనాలు కనిపించాయి. ఆకలి నియంత్రణలో ఉండటం వల్ల అనవసరంగా ఎక్కువ తినే అలవాటు తగ్గి, బరువు తగ్గే అవకాశాలు పెరుగుతాయి.

టీని చక్కెర లేకుండా లేదా తక్కువ చక్కెరతో తీసుకుంటే అందులో కెలోరీలు చాలా తక్కువగా ఉంటాయి. పండ్ల రసాలు, కొన్ని రకాల కాఫీ పానీయాల్లో చక్కెర, క్రీమ్, ఇతర పదార్థాల వల్ల కెలోరీలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పోలిస్తే సాధారణ టీ బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకునే వారు టీలో అధిక కొవ్వులు ఉండే పూర్తి కొవ్వు పాలను ఉపయోగించకుండా బాదం పాలు వంటి తక్కువ కెలోరీల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో టీ రుచి తగ్గకుండా కెలోరీల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. టీ తాగుతున్నామనే కారణంతో పాటు బిస్కెట్లు, చిప్స్, సమోసాలు, ఇతర అధిక కెలోరీల చిరుతిళ్లు తీసుకుంటే బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి టీతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, సరిపడ నిద్ర కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలని అనుకునేవారు టీ ఒక్కటే అద్భుత ఔషధం కాదు. అయితే సరైన సమయంలో, సరైన విధంగా తీసుకుంటే ఆకలి నియంత్రణ, చురుకుదనం పెంపు, తక్కువ కెలోరీల వినియోగం వంటి ప్రయోజనాల ద్వారా బరువు నిర్వహణకు తోడ్పడుతుంది. అందుకే ఉదయం లేవగానే కాకుండా కొంత సమయం తర్వాత టీ తాగడం, చక్కెరను తగ్గించడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

బాలయ్య కోసం కథ రెడీ చేసిన పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్...కానీ అదొక్కటే అడ్డంకి...

Balakrishna
Balakrishna

Balakrishna: సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి సీనియర్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంలో చాలావరకు హెల్ప్ చేశారు. ముఖ్యంగా వీళ్ళ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా భారీ బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పాయి. ఇక ఈ ఏజ్ లో కూడా వాళ్ళు వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ సినిమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో పాటుగా కొరటాల శివ దర్శకత్వంలో కూడా మరో మాస్ సినిమాని చేయడానికి కమిట్ అయ్యాడు. ఇక వీళ్లిద్దరితో పాటు మరో పాన్ ఇండియా డైరెక్టర్ తో కూడా సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇంతకీ ఆ పాన్ ఇండియా దర్శకుడు ఎవరంటే పూరి జగన్నాథ్ కావడం విశేషం…వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు ‘పైసా వసూల్’ అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించకపోయిన కూడా బాలయ్య బాబును చాలా కొత్తగా చూపించిన క్రెడిట్ పూరి జగన్నాథ్ కి దక్కింది. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్లిద్దరు కలిసి మరో సినిమా చేయాలని అప్పుడే అనుకున్నారు.

కానీ ఇన్ని సంవత్సరాల పాటు అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ స్లమ్ డాగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి బాలయ్య బాబుతో పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందా? లేదా అనే విషయంలో క్లారిటి రానుంది…

ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాధ్ ఈ మధ్య కాలంలో పూర్తిస్థాయిలో సినిమాలను చేయలేకపోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. పూరి జగన్నాధ్ మాత్రం బాలయ్య బాబుతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటింపజేయాలనే విధంగా కథనైతే రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే బాలయ్యను కలిసి ఆ కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది. ఇక పూరి జగన్నాధ్ స్లమ్ డాగ్ సినిమా సక్సెస్ మీదనే ఈ సినిమా ఆధారపడి ఉంది…

తెర మీదకు సుభాష్ చంద్రబోస్ బయోపిక్.. హీరో ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు..

Subhas Chandra Bose Biopic
Subhas Chandra Bose Biopic

Subhas Chandra Bose Biopic: మన భారత దేశానికీ స్వాతంత్రం తీసుకొని రావడం లో ప్రధాన పాత్ర పోషించిన సమర యోధుల్లో ఒకరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి , మన దేశాన్ని వదిలి పారిపోయేలా చేసిన ఘనుడు సుభాష్ చంద్ర బోస్. అలాంటి అమరుడి చరిత్ర గురించి నేటి తరం ఆడియన్స్ కి చాలా తక్కువ మాత్రమే తెలుసు. అసలు సుభాష్ చంద్ర బోస్ చరిత్ర ఏంటి?, స్వతంత్రం తీసుకొని రావడంలో ఆయన ఎలాంటి వ్యూహాలు రచించాడు?, ఆయన అకస్మాత్తుగా ఎందుకు మాయం అయ్యాడు?, ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారని కొందరు నమ్ముతున్నారు, అందులో నిజమెంత?, ఇలాంటి విషయాలను ఆధారంగా తీసుకొని ఆయన బయోపిక్ ని తీసేందుకు సౌత్ ఇండియా లో ప్రముఖ నిర్మాణ సంస్థ గా పేరు తెచ్చుకున్న ‘జెమినీ ఫిలిం సర్క్యూట్’ ముందుకొచ్చింది. ఈ చిత్రంలో సుభాష్ చంద్ర బోస్ గా ఆర్యన్ శ్యామ్ నటించనున్నారు.

చూసేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ లాగా కనిపిస్తున్న ఈ ఆర్యన్ శ్యామ్ , సుభాష్ చంద్రబోస్ గెటప్ లో అదిరిపోయాడు. ఈ చిత్రానికి ‘సుభాష్’ అనే టైటిల్ ని లాక్ చేశారు. ఆనంద్ వీ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు రీసెంట్ గానే యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్ర సమరంలో ఆయన పోషించిన పాత్ర, పోరాట లక్ష్యం వంటి విషయాలను పరిశోధించి వివరంగా ఈ సినిమాలో చూపించబోతున్నాము. భారత సైనిక దళం కి కెప్టెన్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత, ఆయనకు ఎదురైనా సవాళ్లు, వాటిని అధిగమించి చేసిన సేవలు , ఈ తరం లో చాలా మందికి తెలియదని , వాటిని మేము వెండితెర పై అద్భుతంగా ఆవిష్కరించి చూపిస్తామని, పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషల్లోనూ విడుదల చేస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు.

ఈ చిత్రంలో సుభాష్ చంద్రబోస్ గా నటించడం నా జీవితం లో ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నానని , ఇది ఒక బాధ్యత గా తీసుకొని నటిస్తానని, హీరో ఆర్యన్ శ్యామ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ ఆర్యన్ శ్యామ్ మరెవరో కాదు, ఇండియా లో బ్యాంకింగ్ వ్యవస్థకు ఆజ్యం పోసిన వీ.కృష్ణ స్వామి అయ్యర్ మనవడు అట. సినిమాల్లోకి ఇలాంటి గొప్ప చరిత్ర కారుడి బయోపిక్ తో రావడం ఆయన అదృష్టం అనే చెప్పాలి. బయోపిక్స్ ని పర్ఫెక్ట్ గా తీస్తే , బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ అవుతున్న రోజులివి, మరి ‘సుభాష్’ చిత్రం తో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

వైసిపి ట్రాప్.. అడ్డంగా బుక్కైన చింతమనేని!

Chintamaneni Prabhakar
Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులను రెచ్చగొట్టి మాట్లాడించడం ఒక అలవాటైన విద్య. ఒక విషయాన్ని వివాదాస్పదం చేయడం కూడా ఆ పార్టీకి తెలిసినంతగా మరో పార్టీకి తెలియదు. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయంలో అలానే చేసింది ఆ పార్టీ. ఆయనను రెచ్చగొట్టి.. రహదారిపైకి వచ్చేలా చేసి.. దానిపై వ్యతిరేక ప్రచారం చేయించి.. రాజకీయ లబ్ధి పొందాలని చూసింది. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యింది కూడా. చింతమనేని ప్రభాకర్ కు వ్యతిరేకంగా లాయర్ ఈడుపుగంటి శ్రీనివాసరావు తో వైసిపి ఆడిన హైడ్రామా.. నిజంగా పక్కా పొలిటికల్ స్క్రీన్ తో చేసినదే. ప్రెస్మీట్లో లాయర్ ఈడుపుగంటి శ్రీనివాసరావు చింతమనేని ప్రభాకర్ రావు కుటుంబ సభ్యులకు విమర్శలు చేశారు. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ.. చింతమనేని లో ఉన్న ఆగ్రహాన్ని బయటకు తీసేలా చేసి రెచ్చగొట్టారు. అనుకున్నది సాధించగలిగారు.

* ఇమేజ్ ను దెబ్బతీసేందుకు..
దెందులూరు లో గెలిచారు చింతమనేని ప్రభాకర్ రావు వైసీపీ నేత కొఠారు అబ్బయ్య చౌదరిపై. సహజంగానే మాస్ ఇమేజ్ ఉంది చింతమనేని ప్రభాకర్ కు. దానిని దెబ్బతీసేందుకు టిడిపి ముసుగు వేసుకొని ఉన్న లాయర్ ఈడుపుగంటి శ్రీనివాసరావును ఆశ్రయించారు. చింతమనేని ప్రభాకర్ ను ఆయనతో తిట్టించారు. చింతమనేని అనుచరులపై లేనిపోని ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా చింతమనేని కుటుంబ సభ్యులు, కుమార్తెలపై కూడా పరోక్ష వ్యాఖ్యలు చేసి ప్రభాకర్ లో ఉన్న ఆగ్రహాన్ని తట్టి లేపారు. ఈ మొత్తం ఒక పొలిటికల్ అజెండాగా సాగించారు అబ్బయ్య చౌదరి. లాయర్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అబ్బయ్య చౌదరితో కలిపి చేసిన రాజకీయాన్ని టిడిపి హై కమాండ్ సైతం గుర్తించింది. అందుకే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.

* అబ్బయ్య చౌదరితో చేతులు కలిపి..
మొన్నటి ఎన్నికల్లో దెందులూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు చింతమనేని ప్రభాకర్. ఓడిపోయిన అబ్బయ్య చౌదరి ఎలాగైనా నియోజకవర్గంలో నిలదొక్కుకోవాలని చూశారు. కూటమి ప్రభుత్వంతో పాటు చింతమనేని డిఫెన్స్ లో పడేయాలని ఒక లోతైన వ్యూహాన్ని రచించారు. చింతమనేని దెబ్బ కొట్టేందుకు ఆయనకు అత్యంత ఆప్తుడిగా ఉంటూ… లోగుట్లు తెలుసుకున్న ఈడుపుగంటి శ్రీనివాసరావు వాటిని అస్త్రంగా మలుచుకున్నారు. చింతమనేని ఆర్థిక మూలాలను, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రెస్ మీట్ లు పెట్టడానికి వైసీపీ బ్యాక్ అండ్ సపోర్ట్ తీసుకున్నారు. అలా ఆడిన వ్యవహారంలో చింతమనేని చిక్కుకున్నారు. చింతమనేనిని మానసికంగా దెబ్బతీసేందుకు ఆయన కుటుంబ సభ్యులను సైతం వివాదాల్లోకి లాగారు. అబ్బయ్య చౌదరి తవ్విన గొయ్యిలో చింతమనేని ప్రభాకర్ ఆవేశంతో పడిపోయారు. దీనిని శాంతిభద్రతల సమస్యగా చూపి వైసిపి ప్రచారాస్త్రంగా మార్చుకుంటుంది. కానీ వైసీపీతో చేతులు కలిపిన ఈడుపుగంటి శ్రీనివాసరావును టిడిపి హై కమాండ్ సస్పెండ్ చేసి కొంత దిద్దుబాటు చర్యలకు దిగింది..