Home Blog Page 104

అందాల రమ్య.. నిన్ను బి*కి*నీలో చూడతరమా?

Sai Ramya Pasupuleti photos
Sai Ramya Pasupuleti photos

విజయసాయిరెడ్డిని జగన్ పిలవక తప్పదా!

Vijaya Sai Reddy
Vijaya Sai Reddy

Vijayasai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నమ్మకస్తులైన నేతల అవసరం ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు బయటకు వచ్చాయి. తన తెర వెనుక అవినీతి జరిగి ఉంటుంది కానీ… ఎంత స్థాయిలో ఉంటుందా అన్న అనుమానం జగన్మోహన్ రెడ్డిలో కలిగిందట. అందుకే తన చుట్టూ ఉన్న టీం పై ఆయన పూర్తి అసహనంతో ఉన్నారు. అయితే ఇక్కడే ఒక లాజిక్ పాయింట్ ఉంది. ఏపీలో మద్యం కుంభకోణంలో అసలు గుట్టును బయటపెట్టారు విజయసాయిరెడ్డి. ఆయన మాట్లాడిన తరువాతనే ఈ కేసులో అరెస్టులు జరిగాయి. కీలక నిందితులు తెరపైకి వచ్చారు.. ఇలా సిట్ తో పాటు ఈడి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది. తన చుట్టూ తనకు తెలియకుండా ఇంత జరిగిందా అన్న అనుమానాలు ఆయనలో ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియాలనే విజయసాయిరెడ్డి మద్యం గుట్టును విప్పినట్లు విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డికి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతర్గత వ్యవహారాలు బహిర్గతం అవుతూ వస్తున్నాయి. విజయసాయి రెడ్డి లేని లోటు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా కనిపిస్తోంది.

* నత్వాని గెలుపులో కీలక పాత్ర..
తాజాగా జాతీయస్థాయిలో విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి కారణం జార్ఖండ్ నుంచి పరిమల్ నత్వాని అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడమే. బిజెపి అండదండలతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు నత్వాని. కాంగ్రెస్ అభ్యర్థి పై అద్భుత విజయం సాధించారు. నత్వానికి వైసీపీ గతసారి ఛాన్స్ ఇచ్చింది బిజెపి కోటాలో. కానీ ఈసారి ఆ సమీకరణలు కలిసి రాక తన పాత ఝార్ఖండ్ కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. దీని వెనుక ఉన్నది మాత్రం విజయసాయిరెడ్డి అని ఇప్పుడు తెలుస్తుండడం విశేషం. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి విజయసాయిరెడ్డి రాంచీ వేదికగా తెరవెనుక చక్రం తిప్పారు. బిజెపికి 24 మంది సభ్యులు ఉండగా మరో నలుగురు కాంగ్రెస్ సభ్యులను బిజెపి వైపు టర్న్ చేయడంలో విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం వహించారన్నది ఇప్పుడు ప్రధాన వార్త. సంక్లిష్టమైన రిసార్ట్ రాజకీయాలు నడిపి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు విజయసాయిరెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఈ తరహా రాజకీయాలు అందించి ఎంతగానో ప్రయోజనం చేకూర్చారు. అటువంటి విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారు. ఇప్పుడు చుట్టూ ఉన్న కోటరితో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. అదే విజయసాయి రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే తన లోటును తెలియజెప్పేందుకే విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి.

* కోటరీని పక్కనపెట్టి..
ప్రస్తుతం ఏపీలో తనను గట్టెక్కే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తనను పిలవాల్సిన అనివార్య పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు విజయ్ సాయి రెడ్డి. ఇప్పుడు తాజా పరిణామాలు నేపథ్యంలో జాతీయస్థాయిలో విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతుండడంతో ఆయనను జగన్ పిలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరి గురించి పార్టీలోనే వ్యతిరేకత ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డికి లాభం కంటే నష్టం అధికం. అందుకే ఆ భజన బృందాన్ని పక్కనపెట్టి.. విజయసాయిరెడ్డి లాంటి వారిని మళ్లీ తెచ్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలోనే ఉంది. నత్వాని లాంటి కార్పొరేట్ శక్తులనే గెలిపించుకున్న చరిత్ర ఇప్పుడు విజయసాయిరెడ్డి సొంతమయ్యింది. మరి జగన్ మోహన్ రెడ్డి పిలుస్తారా లేదా అన్నది చూడాలి.

విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు' ట్విట్టర్ టాక్ ఇదే.. ఆడియన్స్ కి ఊహించని సర్ప్రైజ్..

Vandha Devullu Twitter Talk
Vandha Devullu Twitter Talk

Vandha Devullu Twitter Talk: విభిన్నమైన స్టోరీలతో ప్రేక్షకులకు ఎల్లప్పుడూ ఒక కోతరకమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని తపన పడే హీరోల్లో ఒకరు విజయ్ ఆంటోనీ. మొదటి సినిమా నుండి , ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ చిత్రం ప్రత్యేకమే. కమర్షియల్ గా వర్కౌట్ అయినా , అవ్వకపోయిన, నిజాయితీగా ఒక కథ ని ఆడియన్స్ కి అందించడం లో విజయ్ ఆంటోనీ ని మించిన వారు తమిళంలో మరొక యంగ్ హీరో లేరేమో. లేటెస్ట్ గా ఆయన ‘వంద దేవుళ్ళు’ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. తనకు ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన శశి అనే దర్శకుడితో విజయ్ ఆంటోనీ చేసిన రెండవ చిత్రమిది. అందుకే ఈ సినిమాకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రొమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. నేడు తెలుగు , తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం గురించి ట్విట్టర్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో ఈ రివ్యూ లో చూద్దాం.

ముందుగా విజయ్ ఆంటోనీ ఇలాంటి కథని ఎంచుకొని , ఆడియన్స్ కి అందించాలి అనుకున్నందుకు ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే ఇది ఒక తల్లి కథ , ఒక్క మాటలో చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకోండి. విజయ్ ఆంటోనీ స్క్రీన్ టైం తక్కువ గానే ఉంటుంది, కానీ నటన మాత్రం అదరగొట్టేశాడని , ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన కెరీర్ లో కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్తుందని ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం లో ‘శ్వాసిక’ అద్భుతంగా నటించిందని అంటున్నారు. ఆరంభం నుండి చివరి వరకు ఆమె నటన ప్రేక్షకులు కొన్నేళ్లు గుర్తించుకునేలా ఉంటుందని, ఈమధ్య కాలంలో ఇలాంటి నటన ఎవ్వరూ చెయ్యలేదని అంటున్నారు.

ఇక డైరెక్టర్ శశి రాసిన డైలాగ్స్ కొన్ని ఆణిముత్యాలు లాగా ఉన్నాయని, స్క్రిప్ట్ ని అతను డీల్ చేసిన విధానం చాలా బ్రిలియంట్ గా ఉందంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం మనం థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుందట, ఆ రేంజ్ లో తెరకెక్కించాడు శశి. ముఖ్యంగా ఆయన రైటింగ్ చాలా గొప్పగా ఉందని, ఈమధ్య కాలం లో ఈ రేంజ్ రైటింగ్ ఏ డైరెక్టర్ కూడా అందించలేకపోయాడని అంటున్నారు. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాలని , కానీ వెళ్ళేటప్పుడు మీ అమ్మ ని వెంటపెట్టుకొని వెళ్ళండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ట్విట్టర్ లో నెటిజెన్స్ ఇంకా ఈ సినిమా గురించి ఏమేమి అనుకుంటున్నారో క్రింద అందిస్తున్నాము చూడండి.

జగన్ కుల రాజకీయం.. వర్కౌట్ అనుమానమే!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ.. లేనప్పుడు మరో స్ట్రాటజీ అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు అన్నారు. ఇప్పుడు మాత్రం నా కాపులు అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాపుల కోసం ప్రత్యేక పథకం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు ఇచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసేందుకు కూడా సాహసించలేదు. ఆయన కుమారుడిని అమానుషంగా పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కాపులను చాలా హీనంగా చూశారు. ఇప్పుడు సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యం కావడం, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏకంగా ఆయన కోసం పరితపించడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. కూటమి ప్రభుత్వం పై ఒక రాయి వేసి.. ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

* అప్పట్లో కాపులపై చులకన..
కాపులు రాజకీయంగా ఏం చేస్తారులే అన్నట్టు ఉండేవారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళిపోతే వెళ్లిపోని అన్నట్టు ఉండేది ఆయన ఆలోచన. తనకు బీసీలు ఉన్నారని, ఎస్సీలు ఉన్నారని, వారంతా తనకే ఓటు వేస్తారని పెద్ద ఎత్తున కలలు కన్నారు. అంతకుముందు కాపులకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు కల్పించారు చంద్రబాబు. ఆ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. దీంతో అసలైన రిజర్వేషన్లు ఇస్తారని కాపులు భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వారి గాలిని తీసేశారు. కాపుల కోసం, కాపు నేతల కోసం వైసిపి కాపు నేతలతోనే అమానుషంగా మాట్లాడించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.. అటువంటి వ్యక్తి ఇప్పుడు కాపుల కోసం మళ్లీ గేమ్ ప్రారంభించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కానీ ప్రయత్నం వదలని విక్రమార్కుడిలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాపుల గురించి ఏ చిన్న అంశం తెరపైకి వస్తున్నా వాలిపోతున్నారు. ఇప్పుడు కృష్ణలంకలో సాయి కృష్ణ ఇంటిపై అలానే వాలిపోయారు.

* శృతిమిస్తున్న ప్రచారం..
సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారని సాక్షి మీడియా ఒకవైపు రాసేస్తోంది. కనీసం స్మశానంలో ఆడవాళ్లు లేకుండా కాల్చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో శవం అనే మాట వినిపిస్తే అరక్షణం ఆగను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ ఇంటి వద్ద వాలిపోయారు. సాయి కృష్ణ పై కేసులు ఉన్నాయని ఆయన బంధువులే చెబుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ కేసులను చిన్న నేరాలుగా చూపుతున్నారు. బాధిత కుటుంబంగా సంఘీభావం తెలిపితే పరవాలేదు కానీ.. ఆ తప్పులను సైతం ఒప్పులుగా చూపే అధికారం మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. పోలీసులు ఈ ఘటనలో వ్యవహరించిన తీరు కూడా సహేతుకం కాదు. అలాగని ఇదేదో కాపు రాజకీయం చేసి కాక రేపాలని భావిస్తున్నారు. అసలు పోలీస్ శాఖలో దర్యాప్తులు లేవా? నిందితులు లేరా? వైసీపీ హయాంలో కారు డ్రైవర్ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు ఆయన పార్టీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా? దళితుల ఆర్తనాదాలు వినిపించలేదా? అర్జెంటుగా ఇప్పుడు కాపులు కూటమికి వ్యతిరేకం కావాలి. పవన్ కళ్యాణ్ కు దూరం కావాలి. ఆ ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డికి.

ఏపీ మాదిరిగా తెలంగాణలో.. పవన్ ఆలోచన అదే!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకంపనలు సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆయన తలపెట్టిన సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు కవితతో పాటు భారత రాష్ట్ర సమితి నేతలు సైతం టార్గెట్ చేసుకున్నారు. వారిలో ఒక రకమైన భయం కనిపించింది పవన్ కళ్యాణ్ ద్వారా. ఇప్పుడు అదే నిజం చేస్తున్నారు పవన్. తెలంగాణ రాజకీయాల వైపు తొంగి చూస్తున్నారు. అక్కడే ఉండి రాజకీయాలు చేయనున్నారు. హైదరాబాదులో పార్టీ తెలంగాణ కార్యాలయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఐటీ కారిడార్ మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు పొత్తు ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలంగాణలో ప్రాభవాన్ని చాటుకున్న జనసేన.. పార్టీ కార్యాలయాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయ ప్రస్తానానికి.. అధికారికంగా శ్రీకారం చుట్టబోతుందన్నమాట.

* తెలంగాణ నేతల్లో ఆ భయం..
తెలంగాణ రాజకీయ పార్టీల నేతలకు పవన్ కళ్యాణ్ విషయంలో ఒక ఆందోళన ఉంది.. ఏపీలో సైతం పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా పోరాడి శత శాతం విజయం సాధించారు. ఇక్కడ కూడా అటువంటి ప్రణాళిక రూపొందిస్తే తమకు ఇబ్బందులు తప్పవు అని భయపడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినం నాడు హైదరాబాదులో ప్రెస్మీట్లో గట్టిగానే సంకేతాలు పంపారు పవన్. రాబోయే ఎన్నికల్లో జనసేన పూర్తిస్థాయిలో బరిలో దిగుతుందని.. ఇక్కడి క్యాడర్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సీరియస్ గా దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు.

* ప్రజల వైఖరిలో మార్పు..
గతం కంటే తెలంగాణ ప్రజల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రత్యేక రాష్ట సెంటిమెంట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అభివృద్ధికి, సమకాలిన అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. పైగా తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. దానిని భర్తీ చేయడమే అజెండాగా జనసేన పని చేయనుంది. భారత రాష్ట్ర సమితి వరుస అపజయాలతో ఇబ్బంది పడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. బిజెపి బలం పుంజుకున్నప్పటికీ నాయకత్వం సమస్య వెంటాడుతోంది. ఇటువంటి తరుణంలో ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం జనసేన ప్రత్యేక ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని చూస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సెటిలర్స్, ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో జనసేన బలం పెంచుకోవాలని భావిస్తోంది. యువతతో పాటు విద్యార్థుల ఓట్లపై గురిపెడుతోంది.

* సమయం కేటాయింపు..
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాదులో నివాసం ఉన్న దృష్ట్యా అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే వారంలో ఒకరోజు తెలంగాణ కార్యకలాపాలకు కేటాయించే అవకాశం ఉంది. వారాంతంలో షెడ్యూల్ తెలంగాణ కార్యాలయానికి కేటాయిస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

గేమ్ చేంజర్ సినిమాకి పెద్ది మూవీ కి మధ్య తేడా అదేనా..?

Game Changer Vs Peddi
Game Changer Vs Peddi

Game Changer Vs Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్ లో నిల్చోబెట్టాయి. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక రంగస్థలం సినిమాతో తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీసిన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకువ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో డివైడ్ టాక్ తో రన్ అవుతుంది. మొత్తానికైతే సినిమా రిలీజ్ అయి 15 రోజులు అవుతున్నప్పటికి ఈ సినిమాకి కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. దానికి తోడుగా ఈ సినిమాను రిపీటెడ్ గా చూసే జనాల సంఖ్య కూడా పెరుగుతుంది. కొత్త సీన్లు కూడా యాడ్ చేశారు కాబట్టి మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సినిమా యూనిట్ అయితే భావిస్తున్నారు…

రామ్ చరణ్ గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. నిజానికి గేమ్ చేంజర్ సినిమాకి పెద్ది సినిమాకి మధ్య తేడా ఏంటి అంటే గేమ్ చేంజర్ సినిమాలో కథ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నప్పటికి దానికి సరైన పే ఆఫ్ ఇవ్వలేదు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.

ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ పోషించిన పాత్ర అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ చివర్లో ఈ సినిమా చాలావరకు ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. అయినప్పటికి ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది అంటే రామ్ చరణ్ చరిష్మా ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు 400 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. తన కెరీర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందా? లేదంటే భారీగా డిజాస్టర్ ను మూట గట్టుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరో వారం రోజులకు గడిస్తే కానీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రిజల్ట్ ఏంటి అనేది చెప్పలేము…

చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే రాజమౌళి ఆ కథతో మూవీ చేస్తాడా..?

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఆయన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. మెగాస్టార్ అనే ట్యాగ్ కి ఆయన తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరించగలిగే ఏకైక హీరో కూడా తనే కావడం విశేషం… ముఖ్యంగా చిరంజీవి సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అతని సినిమాని చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అందువల్లే చిరంజీవికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన సాధించిన సక్సెస్ లు ఆయన అందుకున్న అవార్డులే దానికి నిదర్శనం. ఇక ఇప్పుడు ఆయన కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు.

మరోసారి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన వయసు గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. దర్శకదీరుడి గా పేరు సంపాదించుకున్న రాజమౌళి చిరంజీవితో ఒక సినిమా చేయడానికి గతంలో సన్నాహాలు చేసుకున్నాడు. చిరంజీవి డేట్ ఇస్తే చాలు తనతో అదిరిపోయే సినిమా చేస్తాను అంటూ గతంలో చెప్పిన రాజమౌళి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం వల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన సినిమా అయితే రాలేదు.

ఆ తర్వాత రాజమౌళి పాన్ ఇండియా బాట పట్టి పెద్ద సినిమాలను చేస్తుండటం చిరంజీవి కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైపోతుండడం వల్ల వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చి ఉంటే మాత్రం రాజమౌళి చిరంజీవిని ఒక సమురాయ్ లాగా చూపించవారట. దానికి సంబంధించిన కథను కూడా తను రెడీ చేసి పెట్టుకున్నాడు.

అది కేవలం చిరంజీవితో మాత్రమే చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆయన అయితేనే దానికి పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలరని రాజమౌళి భావించారట. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇక ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఒక ఇంటర్వ్యూ తెలియజేయడం విశేషం…

రాజమౌళి కొడుకు కార్తికేయ ఇలా చేస్తే తప్ప జక్కన్న మీద పడ్డ మచ్చ తొలిగిపోదా..?

Karthikeya Rajamouli
Karthikeya Rajamouli

Karthikeya Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. రాజమౌళి లాంటి దర్శకుడు సైతం భారీ విజయాలను సాధిస్తూ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయడానికి చాలామంది కుర్రాళ్ళు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి దగ్గర చాలామంది వర్క్ చేసినప్పటికి వాళ్లందరు బయటికి వచ్చి డైరెక్షన్ చేసిన కూడా ఆ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కారణం ఏదైనా కూడా రాజమౌళి దగ్గర శిష్యరికం చేసిన వారు ఎందుకని సక్సెస్ కాలేకపోతున్నారు అనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇక ఇంటి క్రమంలోనే సుకుమార్, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు టాప్ డైరెక్టర్లుగా ముందుకు దూసుకెళ్తున్నారు. కేవలం రాజమౌళి శిష్యులు మాత్రమే ఎందుకని టాప్ పొజిషన్ కి రావడం లేదు. ఎందుకని వాళ్ళు ఒక సక్సెస్ ఫుల్ సినిమా చేయలేకపోతున్నారు. అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న…

ఇక వీటన్నింటికి చెక్ పెట్టాలంటే రాజమౌళి కొడుకు అయిన కార్తికేయ రంగంలోకి దిగి ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి రాజమౌళి దగ్గర వర్క్ చేసే వాళ్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

దీనివల్ల చిన్న కాన్సెప్ట్ లతో వచ్చినా కూడా చాలా మంచి కథలను తెరమీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆయన శిష్యులు కూడా ముందుకు దూసుకెళ్లే అవకాశమైతే దక్కుతుంది… అలా అయితే జక్కన్న శిష్యులు సక్సెస్ అవ్వరు అనే మచ్చ కూడా తొలగిపోతుందని కొందరు అంటున్నారు. కార్తికేయకు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన ప్రొడక్షన్ సైడ్ పనులను కూడా చూసుకుంటూ ఉంటాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ను సైతం కరెక్ట్ గా చూసుకోగలిగే కెపాసిటి అతనికి ఉంది.

ఇక సినిమా మొత్తాన్ని దగ్గరుండి తనే చూసుకుంటూ రాజమౌళి కి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూసుకుంటుంటాడని రాజమౌళి కార్తికేయ గురించి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలో కార్తీకేయ రాజమౌళి శిష్యులను పరిచయం చేస్తే బాగుంటుంది అని ధోరణిలో కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కార్తికేయ ఈ విషయం గురించి ఏమనుకుంటున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

పాదయాత్ర పై తేల్చేసిన జగన్!

YS Jagan Padayatra
YS Jagan Padayatra

YS Jagan Padayatra: ప్రతిపక్షం అంటే జనాల్లో ఉండాలి. జనంతో మమేకం కావాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలి. కానీ తాను మాత్రం ఆ పని చేయనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయిందని.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని పిలుపునిస్తున్నారు పార్టీ శ్రేణులకు. రెండేళ్ల సమయం దాటిపోయింది. ఇంకా మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఏడాదిన్నర కాలంలో పాదయాత్ర ప్రారంభం అవుతుంది అని చెబుతున్నారు. అంటే 2029 వేసవిలో ఎన్నికలు ఉండగా.. చివరి ఏడాది 2028 లో పాదయాత్ర ఉంటుందని తాజాగా ఏంటి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే 2027 ద్వితీయార్థంలో పాదయాత్ర అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు షాక్ తప్పడం లేదు.

* చివరి ఏడాదిలో వస్తారట..
2019 ఎన్నికలకు ముందు అంటే 2017లో పాదయాత్ర మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అలా కాదు. చివరి ఏడాదిన్నర ఉందనగా పాదయాత్ర మొదలు పెడతానని చెబుతున్నారు. అప్పటివరకు మీరే ప్రజా పోరాటాలు చేయండి అని బదులిస్తున్నారు. అంటే ఇప్పట్లో పాదయాత్ర ఉండదు అని సంకేతాలు పంపుతున్నారు. తాను రెస్ట్ మోడ్ లో ఉంటానని.. బెంగళూరు నుంచి తాడేపల్లికి షటిల్ సర్వీస్ తప్పదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు జిల్లాల పర్యటన పై కానీ.. పార్టీ ప్లీనరీ గురించి కానీ ఆయన ప్రస్తావించడం లేదు. కేవలం కూటమి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను బలంగా నమ్ముతున్నారు. ప్రజల్లో బలమైన వ్యతిరేకత కూటమిపై ఉందని చెబుతున్నారు. కూటమిపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉన్నందున తన అవసరం ఇప్పుడే రాదని.. చివరి నిమిషంలో తాను వస్తే చాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

* జిల్లాల పర్యటనలేవి?
ఎప్పుడో 2025 సంక్రాంతి ముందే జిల్లాల పర్యటన అని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ జిల్లాల పర్యటన మాట లేదు. కనీసం ఆ ప్రస్తావన కూడా లేదు. అలా ప్రకటించి ఏడాదిన్నర అవుతోంది. పార్టీ క్యాడర్ మాత్రం కళ్ళు కాయలు కాచేలా చూస్తోంది. కానీ ఇంతవరకు ఆయన వచ్చింది లేదు. 2027 ద్వితీయార్థంలో పార్టీ ప్లీనరీ, ఆపై పాదయాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు ఎంతో ఆశలు పెట్టుకున్నాయి. కానీ అంత సీన్ లేదు. చివరి ఏడాది మాత్రమే తాను సీన్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. కూటమి పట్ల వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళండి.. నేను క్లైమాక్స్ లో వచ్చి కలుస్తా అని బదులిస్తున్నారు. అయితే అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కూడా తెలుసు. అందుకే కక్కలేక మింగలేక వారు బాధపడుతున్నారు.

ఏపీలో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్!

Andhra Pradesh Local Body Elections
Andhra Pradesh Local Body Elections

Andhra Pradesh Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరోసారి క్లారిటీ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. స్థానిక సంస్థలకు సంబంధించి పంచాయతీలతో పాటు మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ సైతం సన్నాహాలు చేసింది. సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. అయితే హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బీసీ గణన పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఒక పిటిషన్ దాఖలు అయింది కోర్టులో. పాలకవర్గాల గడువు ముగిసిన నేపథ్యంలో తక్షణం ఎన్నికల నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని మరో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన క్రమంలో ప్రభుత్వం తరపు న్యాయవాది ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కుటుంబాల సర్వే తో పాటు బీసీ రిజర్వేషన్ అధ్యయన కమిటీ నివేదిక వస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు.

* పంచాయతీలకు ప్రత్యేక అధికారులు..
రాష్ట్రంలో 13 వేల పంచాయితీలకు పైగా పాలకవర్గాల పదవీకాలం గడువు ఏప్రిల్ 4 తో ముగిసింది. దీంతో పంచాయితీలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. వీలైనంత త్వరగా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యాంగబద్ధమైన ఆర్థిక సంఘం నిధులు కేటాయించే పరిస్థితి ఉంది. ఇటీవల 16వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి ఏపీకి కేంద్ర ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు చేసింది. గత 15వ ఆర్థిక సంఘం కంటే దాదాపు ఓ నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు కేటాయింపులు జరిపింది. అయితే పాలకవర్గాలు ఉంటేనే ఈ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు సంబంధించిన పాలకవర్గాల పదవీకాలం గడువు మార్చి 17 తో ముగిసింది. వాటికి సైతం ప్రత్యేక అధికారులు కొనసాగుతున్నారు.

* ఆ ప్రక్రియలు అన్నీ కొలిక్కి
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్థానిక సంస్థలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ వచ్చింది. బీసీ గణన చేపట్టిన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కొంతమంది కోరుతూ వచ్చారు. అటువంటి వారి తరఫున ఒక న్యాయవాది కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు పంచాయతీలకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు అయింది. ఈ రెండు పిటీషన్లు విచారణకు వచ్చిన క్రమంలో.. కుటుంబాల సమగ్ర సర్వే, బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ అధ్యయనం తుది దశకు చేరుకుంది. అందుకే వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రక్రియలన్నీ ముగిసిన వెంటనే రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో పాక్‌ జలాంతర్గాములు.. చైనా సాంకేతికతతో కొత్త వ్యూహం

India Pakistan Naval Tension
India Pakistan Naval Tension

India Pakistan Naval Tension: 1971లో జరిగిన భారత–పాకిస్తాన్‌ యుద్ధంలో భారత నౌకాదళం బంగాళాఖాతంలో చూపిన బలం పాకిస్థాన్‌ను ఆ ప్రాంతం నుంచి పారిపోయేలా చేసింది. ఆ దెబ్బ తర్వాత దాయాది దేశం ఆ జలాల్లోకి అడుగు పెట్టే ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్‌ తన నౌకాదళంలో హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. చైనా నుంచి మొత్తం ఎనిమిది ఈ రకమైన నౌకలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. వాటిలో ఒకటి ఇటీవల ఆ దేశం చేతుల్లోకి వచ్చింది. దాన్ని తీసుకొచ్చే ఫ్లోటిల్లా కమాండర్‌ కమోడోర్‌ ఒమర్‌ ఫరూఖీ శ్రీలంకలో ఆగి మీడియాతో మాట్లాడుతూ, ఈ నౌకలు అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతంలోకి సైనిక శక్తిని విస్తరించేందుకు సహాయపడతాయని చెప్పారు. వీటిని ఆయన ‘గేమ్‌ చేంజర్‌’గా అభివర్ణించారు.

బంగాళాఖాతం వ్యూహాత్మక ప్రాముఖ్యత
ఈ జలాలు ఏ ఒక్క దేశానికి ప్రత్యేకంగా చెందవు. భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక వంటి దేశాలు దీని తీరాల్లో ఉన్నాయి. 12 నాటికల్‌ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలు, 200 నాటికల్‌ మైళ్ల వరకు ఆర్థిక మండలం ఉంటాయి. దాని తర్వాత అంతర్జాతీయ జలాలు. భారత్‌కు ఇది చాలా కీలకమైన ప్రాంతం. తూర్పు నావెల్‌ కమాండ్, అణు జలాంతర్గాముల తయారీ కేంద్రం, నౌకల నిల్వ స్థావరం విశాఖపట్నంలోనే ఉన్నాయి. ఇక్కడ వాణిజ్య మార్గాలు, కమ్యూనికేషన్‌ లైన్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.

పాక్‌ నేవీ బలహీనతలు
పాకిస్తాన్‌ నౌకాదళం భారత నేవీ ముందు చాలా వెనకబడి ఉంది. భారత్‌ వద్ద అణు జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు ఉండగా, పాక్‌ చైనా, టర్కీ వంటి దేశాలపై ఆధారపడుతోంది. చైనా తయారీ ఫ్రిగేట్లు, టర్కీ నిర్మిత కార్వెట్లు దాని ప్రధాన ఆధారం. ఇప్పుడు కొత్తగా వస్తున్న హంగోర్‌ శ్రేణి నౌకలు బంగాళాఖాతంలో పెద్ద మార్పు తీసుకురావడం కష్టమే అని నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి మోహరింపులు భారత్‌కు ఎప్పటికీ అసౌకర్యం కలిగించేవే.

హంగోర్‌ శ్రేణి విశేషాలు
చైనా అభివృద్ధి చేసిన ఈ జలాంతర్గాములు ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ సాంకేతికతతో రూపొందించబడ్డాయి. సాధారణ డీజిల్‌–ఎలక్ట్రిక్‌ నౌకల కంటే ఎక్కువసేపు నీటి అడుగున ఉండగలవు. దీంతో వాటిని గుర్తించడం, ట్రాక్‌ చేయడం కష్టతరం అవుతుంది. 1971 తర్వాత అరేబియా సముద్రానికి మాత్రమే పరిమితమైన పాక్‌ నేవీ ఇప్పుడు ఈ నౌకల సాయంతో మరింత విస్తరించాలని చూస్తోంది.

బలపడుతున్న పాక్‌–బంగ్లాదేశ్‌ సంబంధాలు..
ఇటీవలి కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. 2024లో షేక్‌ హసీనా ప్రభుత్వం ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ వేగం పుంజుకుంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, వాణిజ్యం, సైనిక సహకారం పెరిగాయి. కరాచీ–ఛట్టోగ్రామ్‌ మధ్య సముద్ర మార్గంలో వాణిజ్యం మొదలైంది. గతేడాది పాక్‌ యుద్ధనౌక ఛట్టోగ్రామ్‌ తీరంలో మోహరించడం కూడా గమనార్హం.

1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన పీఎన్‌ఎస్‌ హంగోర్‌ టార్పెడో దాడితో భారత్‌కు చెందిన ఐఎన్‌ఎస్‌ ఖుక్రీని ముంచేసింది. భారత స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక యుద్ధనౌక మునిగిపోవడం అదే మొదటిసారి. అయితే భారత నేవీ తిరిగి దాడి చేసి పాక్‌ యుద్ధనౌక పీఎన్‌ఎస్‌ ఘాజీని ధ్వంసం చేసింది. 13 రోజుల్లోనే యుద్ధం ముగిసి పాక్‌ వెనక్కి తగ్గింది. ఆ తర్వాత బంగాళాఖాతంలో పాక్‌ నేవీ కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ నౌకలు ఆ పరిస్థితిని మార్చగలవా లేదా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.

మొన్నటిదాకా నోరేసుకుని అరిచాడు.. మోడీ విషయంలో ట్రంప్ ఎందుకు తగ్గాడు..

G7 Summit France
G7 Summit France

G7 Summit France: ఫ్రాన్స్ దేశంలో జరిగిన జి 7 సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చాలాసేపు మాట్లాడారు. వాస్తవానికి పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. ఈ భేటీ కంటే ముందు ప్రపంచ దేశాల అధినేతలతో నరేంద్ర మోడీ ఆప్యాయంగా కనిపించారు. వారందరినీ ఆలింగనం చేసుకొని ప్రేమను వ్యక్తం చేశారు. ట్రంప్ విషయానికి వచ్చేసరికి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.. పెద్దగా కుశల ప్రశ్నలు కూడా వేయలేదు.

ట్రంప్ కు అర్థమైంది

ఇటీవల కాలంలో అమెరికా భారత్ మీద వ్యవహరిస్తున్న తీరు
.. ముగ్గురు భారత నావికులు చనిపోవడం.. అర్థం లేని షరతులు.. పాకిస్తాన్ దేశానికి అండగా ఉండడం.. ఇవన్నీ కూడా భారత్ లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. వీటిని పరోక్షంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ మీద చూపించారు. దీంతో ట్రంప్ కు సినిమా అర్థమైంది. దీంతో మోడీతో ఆయన భేటీ అయ్యారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. త్వరలో ఇండియాకు వస్తానని ప్రకటించారు. అంతేకాదు ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

యుద్ధం వల్ల అమెరికాలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బలమైన ఓటర్లుగా భారతీయులు ఉన్నారు. వారందరి మనసులో స్థానం సంపాదించాలి అంటే కచ్చితంగా ట్రంప్ ఇండియాకు దగ్గర కావాలి. దీనికి తోడు వాణిజ్యపరంగా ఇండియా అమెరికాకు చాలా అవసరం. అందువల్లే ట్రంప్ పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పారు. అవసరాల మేరకే పాకిస్తాన్తో స్నేహం సాగించిన అమెరికా ఆ తర్వాత.. తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఇదేమి తెలియని పాకిస్తాన్ అమెరికాతో ఇంతకాలం అంట కాగింది. ఇరాన్ తో యుద్ధం ముగించడం వల్ల అమెరికాలో ధరలు దిగి వస్తాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఎంతో ఉపశమనం. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ట్రేడ్ డీల్ వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం మరో స్థాయికి వెళ్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతుల విషయంలో కొంతకాలంగా స్తబ్దమైన వాతావరణం నెలకొంది. అలాంటప్పుడు ట్రంప్ ద్వారాలు తెరిచిన నేపథ్యంలో.. రెండు దేశాలకు అనుకూలంగా వాణిజ విధానాలు రూపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ట్రేడ్ డీల్ పూర్తయితే.. కొన్ని అంశాలపై క్లారిటీ వస్తుందని వ్యాపారవేత్తలు అంటున్నారు. తద్వారా తయారీ రంగాలు ఊపొందుకొనే అవకాశం ఉంటుందని.. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు.. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా, ఇరాన్ డీల్.. మనకేంటి లాభం

US Iran Deal
US Iran Deal

US Iran Deal: కొద్ది నెలలుగా సాగుతున్న భీకరమైన యుద్ధం ఎట్టకేలకు తాత్కాలికంగా ముగిసింది.. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిరింది.. ట్రంప్.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫలితంగా మూడున్నర నెలలుగా సాగుతున్న తాత్కాలిక యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం తాత్కాలికంగా ముగిసిన నేపథ్యంలో మనకు ఏంటి లాభం అనే చర్చ నడుస్తోంది.

ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఇరాన్ దేశానికి ఏకంగా 30 వేల కోట్ల డాలర్లను ఇస్తామని ప్రతిపాదన వచ్చింది. 13 సంవత్సరాలపాటు అంతయుద్ధంతో ఇబ్బంది పడుతున్న సిరియాకు 215 బిలియన్ డాలర్లు.. గాజాకు 53 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేశారు. అయితే ఇరాన్ దేశం ఈ రెండు ప్రాంతాల కంటే ఎక్కువ అనుతిని సొంతం చేసుకోవడం గమనార్హం. విదేశాలలో ఉన్న ఇరాన్ ఆస్తులు కూడా రిలీజ్ అవుతాయి. మరోవైపు ఈ ఫండ్ కు ఒక పైసా కూడా ఇచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది.

తాత్కాలిక శాంతి ఒప్పందం వల్ల ఇరాన్ దేశానికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది.. అమెరికా విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోతాయి. గత ఏడాది ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్మకుల ద్వారా 45 బిలియన్ డాలర్లను సంపాదించింది. అమెరికా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడంతో చైనా దేశానికి అత్యంత రహస్యంగా విక్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంక్షలు తొలగిన నేపథ్యంలో గ్లోబల్ వ్యాప్తంగా తనకు నచ్చిన రేటుకు క్రూడ్ ఆయిల్ అమ్ముకోవచ్చు.

ఇన్నాళ్లపాటు మూసివేతకు గురైన హార్మోజ్ జల సంధి తీర్చుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్లో ఇది ఐదవ వంతు పాత్ర పోషిస్తుంది. యుద్ధం వల్ల దీనిని తాత్కాలికంగా మూసివేశారు. తాజా డీల్ నేపథ్యంలో అమెరికా తన ఆంక్షలు మొత్తం ఎత్తివేసింది. వచ్చే 60 రోజులపాటు ఈ సంధి మీదుగా కమర్షియల్ షిప్ లు ఉచితంగా రాకపోకలు సాగిస్తాయి.. ఫలితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ధరలు చాలా వరకు తగ్గుతాయి. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రకమైన ఊరట. యుద్ధం తెచ్చిన సంక్షోభం వల్ల మనదేశంలో ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో కూడా అదే పరిస్థితి. ఇరాన్ తో యుద్ధం అలానే కొనసాగితే.. అమెరికాలో మధ్యంతర ఎన్నికల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఈ యుద్ధంలో ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయాలని.. హౌతి.. హిజ్ బొల్లా వంటి శక్తులను తొక్కి వేయాలని అమెరికా.. ఇజ్రాయిల్ దాడులు మొదలుపెట్టాయి. ఇన్ని రోజులపాటు సాగిన యుద్ధంలో ఇరాన్ రూపొందించుకున్న స్థావరాలు మొత్తం నాశనమయ్యాయి. అయినప్పటికీ ఇరాన్ బలం తగ్గిపోలేదు. మరోవైపు తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఇరాన్ మిస్సైల్స్.. ప్రాక్సిల గురించి ఎటువంటి ప్రస్తావన రాకపోవడం విశేషం. ఈ అంశాన్ని పదేపదే ఇరాన్ దాటవేయడం ఇక్కడ గమనార్హం.

యుద్ధం తాత్కాలికంగా ముగిసిపోవడం వల్ల ఇరాన్ నుంచి మళ్లీ మన దేశానికి క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. దేశంలో వంట గ్యాస్.. ఫ్యూయల్ ధరలు తగ్గుతాయి. దీనికి తోడు ఇరాన్ దేశంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చాబహర్ పోర్ట్ నిర్మాణం మళ్లీ మొదలవుతుంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్యోగాలు చేస్తున్న కోటి మంది భారతీయులకు భద్రత లభిస్తుంది.

ఇలాగైతే తెలంగాణలో బిజెపికి అధికారం కష్టమే..

Telangana BJP
Telangana BJP

Telangana BJP: ఒక్క విమర్శకు సరైన సమాధానం లభించడం లేదు. కనీసం ఆత్మరక్షణకు కూడా పాల్పడే అవకాశం కూడా కనిపించడం లేదు. అంత వీక్ అయిపోయారా.. గట్టిగా వాయిస్ కూడా వినిపించలేకపోతున్నారా.. ఇలా ఎందుకు ఉండిపోతున్నారు.. ఇలా ఎందుకు అయిపోతున్నారు.. ఇదిగో ఇలానే సాగుతోంది బిజెపి నాయకుల గురించి తెలంగాణలో చర్చ.

8 మంది ఎంపీలు

2024 ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో సత్తా చాటింది. ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. ఈ స్థాయిలో స్థానాలు సాధించి.. రెండు సెంట్రల్ మినిస్టర్ పోస్టులు అందుకొని.. తిరుగులేని స్థితిలో ఉండాల్సిన కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఇబ్బంది పడుతూ ఉండడం ఆవేదన కలిగిస్తోంది.. ముఖ్యంగా ఇటీవల కాలంలో మెట్రో లోన్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు ఇంతవరకు కిషన్ రెడ్డి నుంచి సరైన స్థాయిలో సమాధానం లభించలేదు. మెట్రో కు సంబంధించి రుణం మంజూరు కాకపోవడానికి కిషన్ రెడ్డి నే కారణమని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇటీవల అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి ఏదో ఊకదంపుడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. అలా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అంతేతప్ప తెలంగాణ ముఖ్యమంత్రి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు.

మిగతావారు కూడా

కిషన్ రెడ్డి మీద విమర్శలు వస్తే ఆయన మాత్రమే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి.. కనీసం మిగతా ఎంపీలు గాని.. ఇతర నాయకులు గాని కిషన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి తీరును విమర్శించలేదు. బిజెపి పార్టీ సోషల్ మీడియా కూడా అదే నిర్లక్ష్యంతో ఉంది. కనీసం వివరాలతో.. గణాంకాలతో కౌంటర్ ఇవ్వలేదు. బిజెపి నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 8 మంది ఎంపీలు ఉండి కనీసం.. గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ బిజెపి నేతల వ్యవహార శైలి ఎవరికి వారు అన్నట్టుగానే ఉంది. గతంలో బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆయనను మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు లేదా విమర్శలు ఎదురైనప్పుడు సమిష్టిగా వాటికి కౌంటర్ ఇవ్వడం లేదు.. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడంలో ఇక్కడి నాయకులు విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు.. అందువల్లే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ లో కూడా బిజెపి నేతలు పెద్దగా స్పందించింది లేదు. పైగా కొంతమంది నాయకులు మీడియాకు లీకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి పదే పదే కిషన్ రెడ్డిని ఉద్దేశించి భారత రాష్ట్ర సమితికి బినామీ లాగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పడంలో కిషన్ రెడ్డి విఫలమవుతున్నారు.. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి స్థాయి రోజురోజుకు పడిపోతుంది. ఈటెల రాజేందర్ పెద్దగా కనిపించడం లేదు. డీకే అరుణ సైలెంట్ గా ఉండిపోయారు. బండి సంజయ్ కేవలం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు.. కిషన్ రెడ్డి అప్పుడప్పుడు తన మీద విమర్శలు వచ్చినప్పుడు విలేకరుల సమావేశం పెడుతూ వెళ్ళిపోతున్నారు. ధర్మపురి అరవింద్.. రఘునందన్ రావు.. ఇలా ఎవరి బౌండరీలో వారు ఉన్నారు. అందువల్లే రేవంత్ రెడ్డి తెలంగాణలో బిజెపిని చెడుగుడు ఆడుకుంటున్నారు.

సమంత 'మా ఇంటి బంగారం' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టలో తెలుసా?

Maa Inti Bangaram 6 Days Collections
Maa Inti Bangaram 6 Days Collections

Maa Inti Bangaram Break Even: కొంతకాలం విరామం తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను , ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ చిత్రం నుండి విడుదలైన ‘తస్సాదియ్యా’ పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో , కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో వచ్చింది. ప్రామిసింగ్ కంటెంట్ తో పాటు , మంచి కాంబినేషన్ కూడా అవ్వడం తో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఒకవిధంగా చెప్పాలంటే బయ్యర్స్ రిస్క్ చేసారని చెప్పొచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కొంతమంది మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అవ్వలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంది అనేది. ఈ బుకింగ్స్ గ్రాస్ చూస్తుంటే , ఈ చిత్రానికి కచ్చితంగా మొదటి రోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవుతుందని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మాత్రం కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాక్ బాగుంటే మాత్రం , ఈ చిత్రం వారం రోజులు పూర్తి అవ్వకముందే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోగలదు.

ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత నిర్మాతగా కూడా వ్యవహరించింది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి జబర్దస్త్, ఇది కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. కానీ రెండవ చిత్రం ‘ఓ బేబీ’ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా కారణంగానే, మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్ర పోషించింది. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథ ని అందించాడు.

అంతా ఆసిమ్ మునీర్ దే.. పరువు తీసుకున్న పాక్ రక్షణమంత్రి

Pakistan Politics
Pakistan Politics

Pakistan Politics:  పాకిస్తాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ సైనిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండటం చాలా దశాబ్దాల నుంచి కనిపిస్తోంది. ఈ వాస్తవం ఇటీవల రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ జాతీయ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మరింత స్పష్టంగా బయటపడింది. ఆయన మాట్లాడుతూ, గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఈ అసమానతను మరలా నిరూపించాయని తెలిపారు.

జాతీయ అసెంబ్లీలో వ్యాఖ్యలు..
ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడుతూ, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వ కాలంలో గూఢచార విభాగం ఐఎస్‌ఐకి విపరీతమైన స్వేచ్ఛ లభించిందని చెప్పారు. ఆ సమయంలో ఆ సంస్థ అధినేత లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఫైజ్‌ హమీద్‌ పంపిన అధికారులు చట్టసభ సంబంధిత చర్చల్లో నేరుగా పాల్గొని, నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చేవారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన రాజకీయ కార్యకర్త ఒప్పుకోలుగా వర్ణించారు.

అసద్‌ ఖైసర్‌ నివాసంలో చర్చలు..
మాజీ స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌ నివాసంలో జరిగిన ముఖ్యమైన సమావేశాల్లో ఐఎస్‌ఐ ప్రతినిధులు హాజరయ్యేవారని, వారు చర్చలను పర్యవేక్షించి, కావాల్సిన దిశలో నడిపించేవారని ఖవాజా ఆసిఫ్‌ వివరించారు. ఈ సమావేశాల్లో పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ సభ్యులు కూడా పాల్గొనేవారని, అక్కడ నిఘా సంస్థ అధికారులు రాజకీయ నాయకుల చర్చలను నిశితంగా గమనించి, అవసరమైన మార్పులు చేసేవారని ఆయన తెలిపారు.

చట్టాలపై నిఘా సంస్థ ఒత్తిడి..
అప్పట్లో మనీలాండరింగ్‌ వ్యతిరేక చట్టంలో సవరణలు, ఇతర కీలక చట్టాలు ఈ ఒత్తిడి వల్లే అమల్లోకి వచ్చాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. రాజకీయ కార్యకర్తలు, శాసనసభ్యులు ఎలా ముందుకు సాగాలో నిర్దేశించబడేవారని, చట్టసభ కార్యకలాపాలు పూర్తిగా ఆ సంస్థ నియంత్రణలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత హైబ్రిడ్‌ పాలనా విధానం
అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సైన్యంతో సమన్వయంగా పనిచేస్తోందని, పౌరులు–సైనికుల మధ్య సంయుక్త హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఖవాజా ఆసిఫ్‌ చెప్పారు. ఈ విధానం ఆర్థిక, పరిపాలనా సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతోందని, ప్రత్యేక పెట్టుబడి సౌకర్య కౌన్సిల్‌ వంటి వేదికల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆదర్శ ప్రజాస్వామ్యం కాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణాత్మకమైన విధానమని ఆయన వివరించారు.

ఖవాజా వ్యాఖ్యలు పాకిస్తాన్‌ రాజకీయాల్లో సైనిక ప్రభావం ఎంత లోతుగా ఉందో మరలా చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే పాక్‌ నేతలకు తాజాగా మంత్రి వ్యాఖ్యలు అవన్నీ పైకి చెప్పడానికే అన్నది అర్థమవుతుంది.