Home Blog Page 103

అంట్లుంటది జైశంకర్‌తో.. పాకిస్తాన్‌ జర్నలిస్టుకు గువ్వ గుయ్‌మనిపించిన విదేశాంగ మంత్రి!

S Jaishankar
S Jaishankar

S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అనుభవజ్ఞుడైన రాజనీతిజ్ఞుడు. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఎక్కడ, ఎలా ప్రతిస్పందించాలో స్పష్టంగా తెలిసిన నేత. ట్రంప్‌ వంటి ప్రపంచ నాయకులకు కూడా నేరుగా సమాధానాలు ఇచ్చి షాక్‌ ఇచ్చినవాడు. చైనా వంటి దేశాలతో సంబంధాల్లో భారత స్థావరాన్ని బలంగా నిలబెట్టిన నాయకుడు కూడా. ఇటీవల ఒక పాకిస్తాన్‌ జర్నలిస్టు జైశంకర్‌ను ప్రశ్నించాడు. దక్షిణాసియా తీవ్రవాదంతో ఇబ్బంది పడుతోందని, ఢిల్లీ మరియు కాబూల్‌ నుంచి వచ్చే తీవ్రవాదులను ఎంతకాలం భరించాలని అడిగాడు.

చెంప పగిలే సమాధానం..
ఈ ప్రశ్నకు జైశంకర్‌ చెంప చెళ్లుమనిపించే సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న ద్వారా ఆయన భారత్‌పై ఆరోపణలు మోపడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. దీంతో తెలివిగా తిప్పి వేశారు. ‘‘ఈ ప్రశ్న నన్ను అడగాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్‌ మంత్రిని అడగండి’’ అని సూచించారు. పాకిస్తాన్‌ ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోందని స్పష్టం చేశారు. ఈ సమాధానం విని ఆ జర్నలిస్టు ఆశ్చర్యపోయాడు. ఇలాంటి దాపరికాలను ఆపి, ముందుగా మంచి పొరుగు దేశంగా ప్రవర్తించాలని సూచించారు. ఇది భారత్‌ యొక్క స్థిరమైన వైఖరిని ప్రతిబింబిస్తుంది.

తీవ్రవాదం, ప్రాంతీయ భద్రత
దక్షిణాసియాలో తీవ్రవాదం ఒక పెద్ద సమస్య. ఇది శాంతి, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. భారత్‌ తీవ్రవాదాన్ని ఎక్కడి నుంచి∙వచ్చినా వ్యతిరేకిస్తుంది. జైశంకర్‌ సమాధానం ద్వారా ఈ సమస్యకు మూల కారణాలను నేరుగా ఎత్తి చూపించారు. ఇటువంటి స్పష్టమైన ప్రకటనలు ఇతర దేశాలను తీవ్రవాద వ్యతిరేకత వైపు మరింత బాధ్యతాయుతంగా మార్చడానికి సహాయపడతాయి.

దౌత్యం శక్తికి నిదర్శనం..
ఈ సంఘటన జైశంకర్‌ దౌత్య నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. కష్టమైన ప్రశ్నలను నేరుగా ఎదుర్కొని, వాటిని తిప్పి వేసి, భారత స్థావరాన్ని బలపరచడం ఆయన శైలి. ఇలాంటి ప్రతిస్పందనలు భారత్‌ యొక్క అంతర్జాతీయ ప్రతిష్టను పెంచుతాయి. అదే సమయంలో, పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపడాలంటే తీవ్రవాదం, దాపరికాలను వదిలి, సహకారం, నమ్మకం పెంచుకోవాలని ఇది సంకేతం ఇస్తుంది.మొత్తంమీద, జైశంకర్‌ ఇటువంటి సందర్భాల్లో భారత దౌత్య వ్యూహాన్ని బలంగా నిలబెడతారు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాలు తీవ్రవాదాన్ని వ్యతిరేకించి, నిజమైన సహకారంతో ముందుకు సాగాలి. ఇది ప్రాంతీయ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అవసరం. జైశంకర్‌ వంటి నాయకుల దౌత్యం ఈ దిశగా మార్గం సుగమం చేస్తుంది.

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. సగం భారతంలో తీవ్ర కరువు!

El Nino Effect India
El Nino Effect India

El Nino Effect India: ఎల్‌నినో.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ అంశం. ఇది ఈసారి భారతదేశంలోని నైరుతి రుతుపవనాలను బలహీనపరుస్తూ, వర్షపాతాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకారం, ఈసారి ఎల్‌ నినో బలంగా వ్యాపించే అవకాశం ఉంది. ఇది సూపర్‌ ఎల్‌నినో స్థాయికి చేరుకోవచ్చని, 2015లో జరిగినట్లు తీవ్రమైన పరిస్థితులు పునరావృతం కావచ్చని అంచనా వేస్తోంది. దీని వల్ల దేశవ్యాప్తంగా వర్షపాతం సుమారు 10 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉంది. ఖరీఫ్‌ సీజన్‌తోపాటు రబీ సీజన్‌పై కూడా ఈ ప్రభావం పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నేలలో తేమ తగ్గి, పంటలు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఐఎండీ ఈ మార్పులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రభావిత రాష్ట్రాలు..
భారత వ్యవసాయ శాఖ విశ్లేషణ ప్రకారం.. ఎల్‌నినో వల్ల 12 రాష్ట్రాల్లో అధికంగా నష్టం ఉంటుందని అంచనా. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని 326 జిల్లాలు అధిక ముప్పులో ఉన్నాయని గుర్తించబడ్డాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు సకాలంలో రాకపోవడం వల్ల అనావృష్టి ఏర్పడి, పంటలు పండకపోవడం, పొలాలు బీడు అవ్వడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాలు దేశంలోని సగం భూభాగాన్ని కవర్‌ చేస్తాయి కాబట్టి, దేశవ్యాప్త వ్యవసాయ ఉత్పత్తిపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది.

వ్యవసాయంపై తీవ్ర ప్రభావం..
ఈ కరువు పరిస్థితులు ఖరీఫ్‌ సీజన్‌లో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు వంటి ప్రధాన పంటలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. రబీ సీజన్‌లో గోధుమ, ఆవాలు, చన్నగి వంటి పంటలు కూడా ప్రభావితమవుతాయి. రైతులకు ఆదాయం తగ్గడం, రుణ భారం పెరగడం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్‌లో ధరలు పెరగవచ్చు. వ్యవసాయ రంగ నిపుణులు రైతులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ పరిస్థితులు రైతు ఆత్మహత్యలు, వలసలు వంటి సామాజిక సమస్యలను కూడా పెంచవచ్చు.

ప్రభుత్వం చర్యలు…
ఈ సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లా స్థాయిలో అత్యవసర కంటింజెన్సీ ప్రణాళికలు రూపొందిస్తోంది. వాతావరణ అంచనాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలను సిద్ధం చేస్తూ, కరువును తట్టుకునే రకాల పంటలు (మిల్లెట్స్, జొన్న, సజ్జలు వంటివి) వేయాలని సలహా ఇస్తోంది. పంటల బీమా పథకాలు (ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన), రైతు సహాయక చర్యలు, నీటి నిర్వహణ పథకాలు అమలు చేస్తోంది. ఐఎండీ నుంచి వచ్చే నిత్య హెచ్చరికలను అనుసరించి రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచనలు జారీ అవుతున్నాయి. రాష్ట్రాలు కూడా స్థానిక స్థాయిలో వర్షాభావ నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్‌ఐఏ దాడులు.. వణికిపోతున్న అరాచక శక్తులు

West Bengal NIA Raids
West Bengal NIA Raids

West Bengal NIA Raids: పశ్చిమ బెంగాల్‌లో సువేందు అధికారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఉన్న కొన్ని వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నారు. ఈ పరిణామాలు ప్రజా ఆగ్రహం, అక్రమ కార్యకలాపాలపై చర్యలు, జాతీయ భద్రతా సంస్థల దర్యాప్తు వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి.

ప్రజా ఆగ్రహం..
గతంలో కొందరు వ్యక్తులు ప్రజలను బెదిరించి, డబ్బులు వసూలు చేసి, పనులు చేయించేవారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ప్రజల్లో వ్యాపించిన అసంతృప్తి ఈ వ్యక్తులపై దాడుల రూపంలో బయటపడుతోంది. ఇది గత పాలనలో ఉన్న అన్యాయాలకు ప్రజలు ఇచ్చిన ప్రతిస్పందనగా చూడవచ్చు. అయితే, ఇటువంటి సంఘటనలు చట్టం పరిధిలోనే ఉండాలి, వ్యక్తిగత దాడులు చట్ట వ్యవస్థను బలహీనపరుస్తాయి.

పారిపోతున్న వలసదారులు..
అక్రమంగా రాష్ట్రంలో నివసిస్తున్న బంగ్లాదేశీయులు రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఇది గతంలో ఉన్న మద్దతు వ్యవస్థకు సంకేతంగా భావించవచ్చు. అక్రమ వలసలు స్థానిక వనరులు, భద్రత, సామాజిక సమతుల్యతపై ప్రభావం చూపుతాయి. కొత్త ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి పెట్టడం వల్ల ఈ పరిణామం కనిపిస్తోంది.

లెఫ్ట్‌ లిబరల్‌ ఎకో సిస్టమ్‌పై ఒత్తిడి..
మమతా బెనర్జీ పాలనలో మద్దతు పొందిన లెఫ్ట్, లిబరల్‌ వర్గాలు, సంస్థలు ఇప్పుడు కష్టకాలం ఎదుర్కొంటున్నాయి. వారు ప్రజల హక్కులు, ప్రజా సంఘాల పేరుతో ఆందోళనలు, నిరసనలు, పోరాటాలు నిర్వహించేవారు. ఈ వ్యవస్థ గతంలో బంగ్లాదేశ్‌ వలసవాదుల మద్దతుతో కూడా పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వారిపై చర్యలు మొదలవడంతో ఈ ఎకో సిస్టమ్‌లో ఆందోళన నెలకొంది.

ఎన్‌ఐఏ దాడులు…
తాజాగా ఆర్‌ఎఫ్‌ఎస్‌ సంస్థపై ఎన్‌ఐఏ దాడి చేసింది. సంస్థ జనరల్‌ సెక్రెటరీ తథాగత రాయ్‌ చౌదరీ ఇంటిపై దాడి జరిగింది. జాలం రాయ్‌తో ముడిపడిన ఫెమినిస్ట్స్‌ ఇన్‌ రెసిస్టెన్స్‌ వంటి సంస్థలు, జోగిలిలోని సుకుమార్‌ కయాల్‌ టీచర్‌ ఇంటిపై దాడి, సంగ్రామీ త్రిషన్‌ మంచ్‌ వంటివి కూడా ప్రభావితమయ్యాయి. దాడి తర్వాత క్యాంపెయిన్‌ ఎగనెస్ట్‌ స్టేట్‌ రిప్రెషన్, అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డెమోక్రసీ అండ్‌ రైట్స్‌ వంటి సంస్థలు నిరసనలు తెలిపాయి. మీడియా కూడా ఈ సంఘటనలపై హడావుడి చేస్తోంది. ఇవి 2022 రాంచీ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా జరుగుతున్నాయి.

కేసులు, అరెస్టులు..
అమన్‌ శ్రీవాస్తవను 2023లో అరెస్టు చేశారు. అతనిపై 30 కేసులు ఉన్నాయని, డబ్బులు వసూలు చేసి మావోయిస్టు సంస్థలకు పంపినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 2025లో కొన్ని సంస్థలు హిడ్మా, మల్లోజుల వంటి వ్యక్తుల కోసం ఉద్యమాలు చేశాయి. ఇప్పటి దాడులతో ఈ సంస్థల్లో టెన్షన్‌ మొదలైంది. దీంతో అర్బన్‌ నక్సల్స్‌ అని పిలువబడే వ్యక్తులు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. వారి నెట్‌వర్క్‌ దేశమంతా వ్యాపించి ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో హింసకు పాల్పడ్డారని, నోయిడాలో అల్లర్లు, దహనాలు, లూటీలు చేశారని సమాచారం. అదిత్య ఆనంద్‌ వంటి వ్యక్తులు పారిపోయి తమిళనాడులో దాక్కున్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా దాడులు, నిరసనలు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. సత్యం వర్మ వంటి వారు లక్నోలో అరెస్టు అయ్యారు.

దేశవ్యాప్త ప్రక్షాళన అవసరం..
మమతా బెనర్జీ పాలనలో ఈ రకమైన ఎకో సిస్టమ్‌ ఇష్టారాజ్యంగా నడిచినట్లు కనిపిస్తోంది. ఉద్యమాల ముసుగులో అల్లర్లు, అరాచకాలు, ఎక్స్‌టార్షన్, మావోయిస్టు నిధుల సంబంధాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి నెట్‌వర్క్‌లు రాష్ట్ర సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా పనిచేయడం జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుంది. కేంద్ర ఏజెన్సీలు ఇటువంటి కేసుల్లో దర్యాప్తు చేయడం, చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం అవసరం. నిజమైన ప్రజా హక్కుల ఉద్యమాలను గుర్తించి, అరాచక శక్తులను వేరు చేయడం చాలా ముఖ్యం. దేశవ్యాప్తంగా ఇటువంటి వ్యవస్థలను ప్రక్షాళన చేయడం వల్ల చట్టం పాలన, జాతీయ భద్రత బలపడుతుంది. గతంలో ఉన్న లోపాలను సరిదిద్ది, పారదర్శక పరిపాలనను నెలకొల్పడం రాష్ట్రం, దేశం రెండింటికీ మంచిది.

ఈ పరిణామాలు రాజకీయ మార్పులు ఎలా సామాజిక, భద్రతా సమస్యలను ప్రభావితం చేస్తాయో చూపిస్తున్నాయి. చట్టం ప్రకారం, పారదర్శకంగా దర్యాప్తు కొనసాగడం అవసరం.

ఇక కొడాలి నాని వంతు!

Kodali Nani
Kodali Nani

Kodali Nani: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు బిగుస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అప్పట్లో మంత్రిగా ఉంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కొడాలి నాని పై ఉన్నాయి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడే గుడివాడ నియోజకవర్గంలో అప్పటి అధికారులపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని… వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అదే జరిగితే మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాయి కూటమి పార్టీల శ్రేణులు. ఎట్టకేలకు కొడాలి నాని పై విచారణ ప్రారంభం కానుండడంతో సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంటాయని అంచనా వేస్తున్నారు.

* ఇళ్ల స్థలాల్లో అవినీతి..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ తన తొలి క్యాబినెట్ లోనే కొడాలి నాని కి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను అందించారు. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో సైతం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కానీ అప్పటి గుడివాడ ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ భారీ అవకతవకలకు పాల్పడ్డారని.. ఈ విషయంలో కొడాలి నాని రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేశారంటూ అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. కొంతమంది ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ పై ఫిర్యాదులు కూడా చేశారు. కానీ అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే అప్పటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ప్రత్యేక అధికారి రమేష్ పై విచారణ చేపట్టడమే కాదు ఈ విషయంలో కొడాలి నాని నుంచి ఎదురైన రాజకీయ సిఫారసులపై కూడా దర్యాప్తు చేయాలని… నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.

* వరుసగా కేసులు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలపై వరుసగా కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్టయ్యారు కూడా. అయితే ఆ వంతు కొడాలి నాని వరకు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు. అయితే కేసులతో ఉక్కు పాదం మోపుతారని భావిస్తున్న వేళ కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ముంబాయిలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ బైపాస్ సర్జరీ జరిగింది. తరువాత చాలా రోజులు హైదరాబాద్ కి పరిమితం అయ్యారు. ఇటీవల పార్టీలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై పాత కేసులు మళ్లీ తెరపైకి వచ్చాయి. మున్ముందు ఆయనపై గతంలో వ్యవహరించిన అనుచిత వైఖరిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ మోహన్ తరహాలో.. కొడాలి నానికి సైతం ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

'పెద్ది' లో హీరో సాయి కుమార్ సన్నివేశాలు డిలీట్ చేయడానికి కారణం అదేనా..!

Peddi Movie
Peddi Movie

Peddi Movie: ‘ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యింది , అయినప్పటికీ కూడా ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందులకంటే ఈ చిత్రం లో బుధవారం నుండి సరికొత్త సన్నివేశాలను జత చేశారు, వాటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముందే ఈ సన్నివేశాలను జత చేసుంటే , సినిమాకు ఇంకా గొప్ప పాజిటివ్ టాక్ వచ్చేది జాన్వీ కపూర్ పాత్రపై ఇన్ని విమర్శలు వచ్చేవి కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో ఇంకా చాలా సన్నివేశాలను తొలగించారు. అందులో ప్రముఖ సీనియర్ హీరో సాయి కుమార్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 30 నుండి ఈ సినిమా వాయిదా పడినప్పుడు , మేకర్స్ ఐటెం సాంగ్ తో పాటు , కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయడం , అదే విధంగా కొన్ని కొత్త సన్నివేశాలను తెరకెక్కించడం వంటివి చేశారు. ఆ సన్నివేశాల్లో సీనియర్ హీరో సాయి కుమార్ కూడా ఉన్నాడు. ఆయన షూటింగ్ లో పాల్గొన్న వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక అభిమాని తో సరదాగా ముచ్చటించిన వీడియో కూడా ఉంది. అయితే ఆయన సన్నివేశాలను చిత్రీకరించినప్పటికీ సినిమా నుండి తొలగించడానికి కారణం , మూవీ రన్ టైం అని అంటున్నారు. సినిమా నిడివి దృష్ట్యా , ఈ సన్నివేశం ఉన్నా లేకపోయినా పర్వాలేదని, పెద్ద ప్రభావం చూపదని , అందుకే చిత్రం నుండి తొలగించారని అంటున్నారు.

రీసెంట్ గా జత చేసిన కొత్త సన్నివేశాల్లో , సాయి కుమార్ సన్నివేశాలను కూడా జత చేయొచ్చు కదా అని సోషల్ మీడియా లో రామ్ చరణ్ నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఇకపోతే ఈ చిత్రం 200 కోట్ల షేర్ మార్కుకి చాలా దగ్గరగా ఉంది. ఈ వీకెండ్ తో ఆ మార్కుని కచ్చితంగా అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఓవరాల్ గా క్లోజింగ్ లో అన్ని వెర్షన్స్ కి కలిపి 345 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని , రామ్ చరణ్ కి కీలకమైన సమయం లో మంచి హిట్ గా నిలిచిందని , కానీ ఇది ఆయన స్థాయికి తగ్గ బ్లాక్ బస్టర్ కాదని అంటున్నారు. ఎందుకంటే ఓవర్సీస్, కర్ణాటక , తమిళనాడు మార్కెట్స్ లో పెద్ద డిజాస్టర్ గా నిల్చింది ఈ చిత్రం. అదే విధంగా నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం.

ఏపీలో వైసిపి కుల రాజకీయాలు.. కూటమి చేయాల్సింది అదే..

YSRCP Caste Politics
YSRCP Caste Politics

YSRCP Caste Politics: తప్పు చేసిన వాడిని తప్పుడు వాడు అనకూడదు. గంజాయి.. ఇతర దుర్మార్గాలకు పాల్పడేవాడిని దుర్మార్గుడు అనకూడదు. వారు హత్యలు చేసినా సరే నిశ్శబ్దంగా ఉండాలి. ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసినప్పటికీ మౌనంగా ఉండాలి. పైగా వారికి సెల్యూట్ చేస్తూ.. గొప్ప వ్యక్తులుగా కీర్తించాలి.. ఇదిగో ఇలానే ఉంది వైసీపీ సూత్రీకరణ. ఆ పార్టీలో ఉన్న నేతల వ్యవహార శైలి రోజురోజుకు దిగజారిపోతుంది. చివరికి రౌడీ షీటర్లకు.. మాదకద్రవ్యాలను విక్రయించే వారికి ఆ పార్టీ నేతలు సంఘీభావం పలుకుతున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆ రాజకీయాలు స్టార్ట్

2024 ఎన్నికల్లో 11 స్థానాలు వచ్చిన తర్వాత.. ఎందుకు ఈ స్థాయిలో దిగజారిపోయాము.. సాక్షి పేపర్ ద్వారా భజన కొట్టుకున్నప్పటికీ ప్రజలు ఎందుకు నమ్మలేదు.. అనే విషయాలను జగన్ పట్టించుకోవడం లేదు. పైగా తనని ఓడించి ప్రజలు తప్పు చేశారని అంటున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించకుండా.. రౌడీలకు.. దుర్మార్గులకు అందలమెక్కించి.. ప్రజలను హింసించిన జగన్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమని టిడిపి నేతలు అంటున్నారు. పైగా సాయి కృష్ణ ఉదంతాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకొని జగన్ మళ్ళీ కుల రాజకీయాలు మొదలుపెట్టాడని టిడిపి నేతలు అంటున్నారు.

ఈరోజు సాక్షి పత్రికలో ఏపీలో కులాలను రెచ్చగొట్టే విధంగా కథనాలు ప్రసారమయ్యాయి. అందులో సాయి కృష్ణ కులాన్ని కాపు.. మరో వ్యక్తి కులాన్ని మాదిగగా ప్రస్తావించిన ఆ పత్రిక.. కులాల కుంపట్లు రగిలించే విధంగా కథనాలు రాసింది. ఇప్పటికే ఈ వ్యవహారాల మీద ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. బాధ్యులైన అధికారుల మీద చర్యలకు ఉపక్రమించింది. అయినప్పటికీ అంబటి రాంబాబు వంటి వారు చనిపోయిన నవీన్ రెడ్డి ఫోటోను సాయి కృష్ణ గా పేర్కొనడం.. ఏపీ పోలీసుల మీద అడ్డగోలుగా విమర్శలు చేయడం.. సొంత పత్రికలో నీచాతి నీచంగా రాయించడం విశేషం. చివరికి పోలీసు దర్యాప్తులో చనిపోయింది నవీన్ రెడ్డి అని.. అతడు సాయి కృష్ణ చేతిలో చనిపోయాడని తేలింది. ఇప్పుడు వైసిపి కొత్తగా ఆ విషయాన్ని పక్కన పెట్టి కుల రాజకీయాలు ప్రారంభించింది.

కాపు, మాదిగ కులాల పేరు తెరపైకి తెస్తూ.. ఏపీలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోందని టిడిపి నేతలు అంటున్నారు. ఇప్పటికే వైసిపి అధికారిక ఫేస్ బుక్ ఖాతాను మెటా కంపెనీ బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదు. ఆ పార్టీ అధినేత కుల రాజకీయాలు మానుకోవడం లేదు. ఇలాంటప్పుడే కూటమినేతలు జాగ్రత్తగా ఉండాలి. ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పోలీసులను పకడ్బందీగా వ్యవహరించాలని సూచించాలి. ఏ మాత్రం అవకాశం దొరికినా సరే జగన్ అండ్ కో రెచ్చిపోవడం ఖాయం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో దళిత డాక్టర్ సుధాకర్.. దళిత విద్యార్థి హత్య.. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన దారుణం.. ఇవన్నీ లెక్కేసుకుంటే దళితులకు జీవితాంతం పాద పూజ చేసిన సరే వైసీపీ చేసిన దుర్మార్గాలు పరిహారం కావని టిడిపి నేతలు అంటున్నారు.

రాజమౌళి తో మరో సినిమా ఒప్పుకొని రామ్ చరణ్ పొరపాటు చేశాడా ..? కారణం ఏంటంటే..

Ram Charan New Film
Ram Charan New Film

Ram Charan New Film: ఎలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినప్పటికీ, రాజమౌళి తో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలని పరితపిస్తుంటారు. ఎందుకంటే రాజమౌళి తో సినిమా చేసిన తర్వాత , ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోతారని చాలా బలంగా నమ్ముతారు సూపర్ స్టార్స్. అందుకు బెస్ట్ ఉదాహరణ ప్రభాస్. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ఆయన రేంజ్ ఎలా మారిపోయిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పాన్ ఇండియా లెవెల్ లో ఏ డైరెక్టర్ అయినా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే , ప్రభాస్ తో సినిమా చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకుంటారు. ఆ రేంజ్ కి ప్రభాస్ ని తీసుకెళ్లాడు రాజమౌళి. అలాంటి రాజమౌళి తో ఎన్టీఆర్ కి నాలుగు సినిమాలు , రామ్ చరణ్ కి రెండు సినిమాలు చేసే అదృష్టం కలిగింది. అయితే ఇప్పుడు రాజమౌళి తదుపరి చిత్రం పై సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా పెద్ద చర్చ సాగుతోంది.

ప్రస్తుతం ‘వారణాసి ‘ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్న రాజమౌళి , తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో తియ్యబోతున్నాడని , ఇప్పటి వరకు ప్రపంచం లోనే ఏ డైరెక్టర్ ముట్టుకోనటువంటి కాన్సెప్ట్ తో, ఈ చిత్రాన్ని ఆయన్ని తెరకెక్కించబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా సాగుతున్న చర్చ. అయితే రామ్ చరణ్ అనవసరం గా రాజమౌళి తో సినిమా ఒప్పుకున్నాడని , రాజమౌళి ఏళ్ళ తరబడి చెక్కుతాడని , రామ్ చరణ్ ప్రైమ్ టైం వేస్ట్ అవుతుందని , రాజమౌళి తో చేసేబదులు , రామ్ చరణ్ వేరే టాప్ డైరెక్టర్స్ తో రెండు మూడు సినిమాలు చేసేయొచ్చని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి లో రామ్ చరణ్ ఒక సినిమా కోసం రెండు మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించడం సరికాదని అంటున్నారు ఫ్యాన్స్.

అయితే రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని అనుకున్న దానికంటే తక్కువ సమయం లోనే తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి రామ్ చరణ్ తో కూడా తక్కువ సమయం లోనే షూటింగ్ చేస్తాడని , భయపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు మరికొంతమంది ఫ్యాన్స్. ఈ కాంబినేషన్ ‘రంగస్థలం’ మూవీ షూటింగ్ సమయంలోనే సెట్ అయ్యిందని, #RRR తర్వాత ఈ ప్రాజెక్ట్ నే ముందుకు సెట్స్ మీదకు వెళ్లాల్సిందని, కానీ పదేళ్ల నుండి మహేష్ బాబు ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉండడం, ఈసారి ఆయన బలంగా రిక్వెస్ట్ చేయడం తో ‘వారణాసి’ ని ముందుగా సెట్స్ మీదకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక మాట వినిపిస్తోంది.

మమతకు ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి... కంటపడగానే సువెందు అధికారి ఏం చేశాడో తెలుసా

West Bengal Politics
West Bengal Politics

West Bengal Politics: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి గతంలో హింస లేదా దాడులు లేదా బంగ్లాదేశ్ నుంచి చోటుచేసుకుంటున్న అక్రమ వలసల గురించి వార్తలు వచ్చేవి. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారుల మీద దాడులు.. ప్రతిపక్ష నాయకుల మీద దాడులు.. ప్రభుత్వ పథకాలలో టీఎంసీ నేతల దోపిడీ.. ఇటువంటి అంశాల గురించే స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకు వార్తలు వచ్చేవి. కానీ ఇప్పుడు బెంగాల్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అక్కడ మమతా బెనర్జీ అధికారం కోల్పోయిన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో సంపూర్ణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఆర్జీ కార్ ఆస్పత్రిలో..

ఆర్జీ కార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో వైద్య విద్యార్థిని కన్ను మూసింది. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోవడంలో నాటి మమతా ప్రభుత్వం విఫలమైంది. విచారణలో జాప్యం చేసింది. దీనిని నిరసిస్తూ నాడు బెంగాల్ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది. నిరసనలు అణిచివేయడానికి బెంగాల్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. చివరికి నిరసనకారుల మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడానికి కూడా వెనకాడ లేదు. నాడు పోలీసులను నిరసిస్తూ బలరాంబోసు అనే సాధువు.. జాతీయ జెండాను చేతుల్లో పట్టుకుని ఆందోళన నిర్వహించాడు. అతడు చేసిన ఆందోళన అప్పట్లో సంచలనం కలిగించింది. పోలీసులు ఏ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ అతడు ఏమాత్రం వెనకాడ లేదు. దానికి సంబంధించిన వీడియోలను తొక్కివేయడానికి మమత చేయని ప్రయత్నం అంటూ లేదు. కాని చివరికి ఆ వీడియోలు బయటికి రావడంతో మమత ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.

అతడి పేరు బలరాంబోస్

పోలీసులకు వ్యతిరేకంగా అభ్యసన వ్యక్తం చేసిన ఆ వ్యక్తి పేరు బలరాంబోస్. అతడు చేసిన నిరసన సంచలనం కలిగించడం మాత్రమే కాదు… మమత ప్రభుత్వానికి అంతిమ ఘడియలను తీసుకొచ్చింది. ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఒక సమావేశంలో మాట్లాడుతుండగా.. బలరాం బోస్ ముందు వరుసలో కూర్చున్నారు. ఆయనను గుర్తుపట్టి సువేందు కుర్చీ దిగి కిందికి వచ్చారు. బోస్ చేతులను పట్టుకున్నారు. గట్టిగా ఆలింగణం చేసుకున్నారు. ఆ తర్వాత శాలువా కప్పి సన్మానించారు. తనకు ఈ సన్మానాలు వద్దని.. ప్రభుత్వపరంగా గొప్పగా పరిపాలించి.. మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. మమత మాదిరిగా దుర్మార్గపు విధానాలకు పాల్పడకుండా.. ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం కలిగించాలని సూచించారు.

ఆ పాఠశాలను లోకేష్ నిలబెట్టిన తీరు హాట్సాఫ్!

Nara Lokesh Mangalagiri
Nara Lokesh Mangalagiri

Nara Lokesh: విశాఖ ఉక్కు నగరంలోని విమల విద్యాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ పాఠశాల వివిధ కారణాలతో మూతపడింది. ఆర్ సి ఎం డయాసిస్ భాగస్వామ్యంతో ఈ పాఠశాల నడిచేది. ఉన్నట్టుండి ఆ సమస్త ఆర్థిక సహకారం నిలిపివేయడంతో పాఠశాలకు తాళం పడింది. దాదాపు రెండు వేల మందికి పైగా విద్యార్థుల చదువులు ప్రశ్నార్ధకంగా మారాయి. వందలాది మంది ఉపాధ్యాయులు, సిబ్బంది వీధిన పడ్డారు. అయితే ఈ విషయం మంత్రి నారా లోకేష్ కు తెలిసింది. ఆయన ప్రత్యేక చొరవ చూపడంతో ఆ పాఠశాల తిరిగి తెరుచుకుంది. వందలాదిమంది అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి మధ్యాహ్నం భోజనం పథకం సైతం మొదలైంది. నిజంగా ఈ విషయంలో మంత్రి నారా లోకేష్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిధుల కొరతతో నిలిచిపోయిన ఓ పాఠశాలను.. ప్రభుత్వమే బాధ్యతలు తీసుకొని పున: ప్రారంభించేలా చేయడంలో లోకేష్ చూపిన చొరవ మాత్రం నిజంగా అభినందనీయం.

* ఆ సంస్థ ఆర్థిక సహకారంతో..
1984లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్.. విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితుల ఉచిత విద్యుత్ అందించేందుకు ఆర్ సి ఎం డయాసిస్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు స్కూలును ప్రారంభించింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు నిరుపేదల విద్యా నిలయంగా వెలుగొందింది. అయితే రెండేళ్ల కిందట 2024 జూన్ లో ఈ విద్యాలయానికి ఆర్ ఐ ఎన్ ఎల్ సంస్థ ఆర్ధిక సాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాఠశాలకు తాళం పడింది. స్థానిక ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించారు. దశాబ్దాలనాటి విద్యా వారసత్వాన్ని కాపాడేందుకు నడుం బిగించారు.

* ప్రభుత్వమే బాధ్యత తీసుకుని..
అంతటి సుదీర్ఘ చరిత్రను కలిగిన ఆ పాఠశాలను కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు కచ్చితంగా తీసుకుంటారు. కానీ మరోసారి ఆ పాఠశాల ప్రమాదంలో పడకుండా మంత్రి నారా లోకేష్ పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వమే ఈ పాఠశాల పూర్తి నిర్వహణ బాధ్యతలను తీసుకునేలా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ వ్యాలీ స్కూల్ మోడల్ లో.. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఒక ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో విమలా విద్యాలయం కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ ఆయన చేసిన నిరంతర పర్యవేక్షణలో ఈ నెల 12న పాఠశాల ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. అదే రోజు యూకేజీ నుంచి పదో తరగతి వరకు ఏకంగా 778 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అంతటితో ఆగకుండా పేద విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ పాఠశాలను కాపాడడంలో మంత్రి నారా లోకేష్ పాత్ర మరువరానిది.

'వంద దేవుళ్ళు' ఫుల్ మూవీ రివ్యూ...హిట్టా.? ఫట్టా..?

Vanda Devullu Review
Vanda Devullu Review

Vanda Devullu Review: ‘ కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో విజయ్ అంటోని తన సత్తా ఏంటో చూపించాడు. ఇక అప్పటినుంచి ఆయన చేసిన ప్రతి సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నాడు. అయితే అందులో కొన్ని విజయాలను సాధిస్తే, మరికొన్ని అపజయాలుగా మారుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే బిచ్చగాడు సినిమాతో తనకు సక్సెస్ ని అందించిన శశి దర్శకత్వంలో మరోసారి ‘వంద దేవుళ్ళు’ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

కథ

వాసవి (శ్వాసిక) అనే ఆవిడ పాతికేళ్ల వయసులోనే పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది. ఇక ఆ వెంటనే తన భర్త చనిపోవడంతో పిల్లలను ఎలాగైనా సరే బాగా చదివించి ప్రయోజకులను చేయాలనే ఉద్దేశ్యంతో మరో పెళ్లి చేసుకోకుండా పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. పొద్దంతా కష్టం చేస్తూ పనిచేసి తమ పిల్లలను కాపాడుకోవడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది. ఇక ఈ క్రమంలోనే ఊర్లో ఉండే కొంతమంది ఆకతాయి ఆమెను ఉద్దేశించి కొన్ని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినప్పటికి ఆమె ఎవరికీ భయపడకుండా ఒంటరిగా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటుంది…

పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ ఇన్ని సంవత్సరాల పాటు ఒంటరిగా ఉంటూ మా కోసం ఆమె జీవితాన్ని త్యాగం చేసిందని ఆలోచించి అమ్మకి మరో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ నిర్ణయాన్ని వాసవి ఎలా స్వీకరించింది. ఏడు కొండలు (విజయ్ ఆంటోనీ) అనే ఒక పర్సన్ తన జీవితంలోకి ఎలా వచ్చాడు. వాసవి పిల్లలు తనకి పెళ్లి చేశారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు శశి ఈ సినిమాని పూర్తిగా భావోద్వేగాలతో నిండిన కథగా మలిచాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఎమోషన్స్ ని కనెక్ట్ చేస్తూ స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నాడు. అమ్మ పాతికేళ్లకే పెళ్లి చేసుకొని పిల్లలకు జన్మనిచ్చినంత మాత్రాన తన సర్వస్వాన్ని కోల్పోయి పిల్లల కోసమే తన జీవితాన్ని త్యాగం చేయాలా తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా… ఆమె స్వేచ్ఛ ను ఎందుకు కోల్పోవాలి పురాతన కాలం నుంచి వచ్చిన కట్టుబాట్లకు లోబడి ఇలాంటి ఒక నిర్ణయాలను అందరు అనుసరిస్తున్నారని ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుందని వాళ్లని కూడా వాళ్లకు తగ్గట్టుగా బ్రతకనివ్వాలి అనే ఒక గొప్ప పాయింట్ ను ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశాడు.

ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్లిన ఆయన సెకండ్ హాఫ్ లో బాధ్యతలు విలువలకు సంబంధించిన కొన్ని విషయాలను చాలా స్ట్రాంగ్ గా చూపించాడు. క్లైమాక్స్ విషయంలో చాలా ఎమోషనల్ గా మలుస్తాడని అందరు అనుకున్నప్పటికి అది చాలా కామెడీ వే లో తీసుకెళ్లాడు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో క్లైమాక్స్ అంటే పెద్ద పెద్ద డైలాగులు క్లాసులు పీకడాల్లాంటివి ఉంటాయి. కానీ ఆయన మాత్రం ఇది రొటీన్ గా కాకుండా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఇక సెకండాఫ్ లో వచ్చే కొన్ని యూట్యూబ్ ఎపిసోడ్లు కామెడీని పండిస్తూ ఉంటాయి. దాని వల్ల కూడా సినిమాను చూసే ప్రేక్షకుడు కొంతవరకు ఎంగేజ్ అవుతూ ఉంటాడు… ఇక విజయ్ ఆంటోని వాసవి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రతి సన్నివేశం కూడా స్క్రీన్ మీద అద్భుతంగా పేలింది… కొన్ని సన్నివేశాల్లో బ్యా గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు హెల్ప్ అయ్యింది… ఇక సెకండాఫ్ లో మాత్రం సీన్ కి సీన్ కి ఫ్లో బాగా సెట్ అయింది. ప్రతి సీన్లో కూడా ఏదో ఒక డిటెలింగ్ ను చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు సినిమా కోసం చాలా వరకు హార్డ్ వర్క్ చేసిన విషయం అయితే మనకు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది…

ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్

అజయ్ ఆంటోనీ కనిపించింది చాలా తక్కువసేపే అయినా కూడా ఆయన చాలా ఎఫెక్టివ్ గా నటించాడు. తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇంతకుముందే అతను చాలా సినిమాల్లో తన నట విశ్వరూపం చూపించాడు. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలోని ఇంటెన్స్ చెడిపోకుండా తన క్యారెక్టర్ యొక్క పరిధిని తెలుసుకొని మరి అందులోనే నటించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు… ఇక శ్వాసిక అయితే తన పాత్రలో ఒదిగిపోయి నటించింది… బరువు బాధ్యతలను మోస్తున్న ఒక అమ్మాయి ఎలా ఉంటుంది. ఆమె నడవడిక ఎలా ఉంటుంది. ఇతరులతో మాట్లాడినప్పుడు ఆమె భావోద్వేగాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆమె స్పష్టంగా నటించి మెప్పించింది.

మరి దీనికోసం ఆమె స్పెషల్ గా ఏమైనా కసరత్తులు చేసిందా లేదా అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా న్యాయం చేసింది… ఇక విజయ్ ఆంటోనీ ఏడుకొండలు పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఆయన చెప్పిన దైపగుపు కూడా ప్రేక్షకులకు బాగా కి ఇస్తున్నాయి… ఇక మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

ప్లస్ పాయింట్స్

శ్వాసిక యాక్టింగ్
ఎమోషనల్ సన్నివేశాలు
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

కొన్ని సన్నివేశాలు లాగ్ అయ్యాయి…
ఫస్టాఫ్ ఇంకెంచెం బెటర్ గా ఉంటే బాగుండేది..

రేటింగ్ : 2.5/5

చివరి లైన్ : ఎమోషనల్ సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది…

అందాల రమ్య.. నిన్ను బి*కి*నీలో చూడతరమా?

Sai Ramya Pasupuleti photos
Sai Ramya Pasupuleti photos

విజయసాయిరెడ్డిని జగన్ పిలవక తప్పదా!

Vijaya Sai Reddy
Vijaya Sai Reddy

Vijayasai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నమ్మకస్తులైన నేతల అవసరం ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కళ్ళు బైర్లు కమ్మేలా నిజాలు బయటకు వచ్చాయి. తన తెర వెనుక అవినీతి జరిగి ఉంటుంది కానీ… ఎంత స్థాయిలో ఉంటుందా అన్న అనుమానం జగన్మోహన్ రెడ్డిలో కలిగిందట. అందుకే తన చుట్టూ ఉన్న టీం పై ఆయన పూర్తి అసహనంతో ఉన్నారు. అయితే ఇక్కడే ఒక లాజిక్ పాయింట్ ఉంది. ఏపీలో మద్యం కుంభకోణంలో అసలు గుట్టును బయటపెట్టారు విజయసాయిరెడ్డి. ఆయన మాట్లాడిన తరువాతనే ఈ కేసులో అరెస్టులు జరిగాయి. కీలక నిందితులు తెరపైకి వచ్చారు.. ఇలా సిట్ తో పాటు ఈడి ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయింది. తన చుట్టూ తనకు తెలియకుండా ఇంత జరిగిందా అన్న అనుమానాలు ఆయనలో ప్రారంభమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియాలనే విజయసాయిరెడ్డి మద్యం గుట్టును విప్పినట్లు విశ్లేషణలు ఉన్నాయి. అదే సమయంలో విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డికి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతర్గత వ్యవహారాలు బహిర్గతం అవుతూ వస్తున్నాయి. విజయసాయి రెడ్డి లేని లోటు జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా కనిపిస్తోంది.

* నత్వాని గెలుపులో కీలక పాత్ర..
తాజాగా జాతీయస్థాయిలో విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి కారణం జార్ఖండ్ నుంచి పరిమల్ నత్వాని అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడమే. బిజెపి అండదండలతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు నత్వాని. కాంగ్రెస్ అభ్యర్థి పై అద్భుత విజయం సాధించారు. నత్వానికి వైసీపీ గతసారి ఛాన్స్ ఇచ్చింది బిజెపి కోటాలో. కానీ ఈసారి ఆ సమీకరణలు కలిసి రాక తన పాత ఝార్ఖండ్ కు షిఫ్ట్ అయ్యారు. అక్కడ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. దీని వెనుక ఉన్నది మాత్రం విజయసాయిరెడ్డి అని ఇప్పుడు తెలుస్తుండడం విశేషం. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి విజయసాయిరెడ్డి రాంచీ వేదికగా తెరవెనుక చక్రం తిప్పారు. బిజెపికి 24 మంది సభ్యులు ఉండగా మరో నలుగురు కాంగ్రెస్ సభ్యులను బిజెపి వైపు టర్న్ చేయడంలో విజయసాయిరెడ్డి మధ్యవర్తిత్వం వహించారన్నది ఇప్పుడు ప్రధాన వార్త. సంక్లిష్టమైన రిసార్ట్ రాజకీయాలు నడిపి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు విజయసాయిరెడ్డి. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఈ తరహా రాజకీయాలు అందించి ఎంతగానో ప్రయోజనం చేకూర్చారు. అటువంటి విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి వదులుకున్నారు. ఇప్పుడు చుట్టూ ఉన్న కోటరితో జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. అదే విజయసాయి రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అయితే తన లోటును తెలియజెప్పేందుకే విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి.

* కోటరీని పక్కనపెట్టి..
ప్రస్తుతం ఏపీలో తనను గట్టెక్కే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు తనను పిలవాల్సిన అనివార్య పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నారు విజయ్ సాయి రెడ్డి. ఇప్పుడు తాజా పరిణామాలు నేపథ్యంలో జాతీయస్థాయిలో విజయసాయిరెడ్డి చక్రం తిప్పుతుండడంతో ఆయనను జగన్ పిలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరి గురించి పార్టీలోనే వ్యతిరేకత ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యూహాలు జగన్మోహన్ రెడ్డికి లాభం కంటే నష్టం అధికం. అందుకే ఆ భజన బృందాన్ని పక్కనపెట్టి.. విజయసాయిరెడ్డి లాంటి వారిని మళ్లీ తెచ్చుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీలోనే ఉంది. నత్వాని లాంటి కార్పొరేట్ శక్తులనే గెలిపించుకున్న చరిత్ర ఇప్పుడు విజయసాయిరెడ్డి సొంతమయ్యింది. మరి జగన్ మోహన్ రెడ్డి పిలుస్తారా లేదా అన్నది చూడాలి.

విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు' ట్విట్టర్ టాక్ ఇదే.. ఆడియన్స్ కి ఊహించని సర్ప్రైజ్..

Vandha Devullu Twitter Talk
Vandha Devullu Twitter Talk

Vandha Devullu Twitter Talk: విభిన్నమైన స్టోరీలతో ప్రేక్షకులకు ఎల్లప్పుడూ ఒక కోతరకమైన థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలని తపన పడే హీరోల్లో ఒకరు విజయ్ ఆంటోనీ. మొదటి సినిమా నుండి , ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతీ చిత్రం ప్రత్యేకమే. కమర్షియల్ గా వర్కౌట్ అయినా , అవ్వకపోయిన, నిజాయితీగా ఒక కథ ని ఆడియన్స్ కి అందించడం లో విజయ్ ఆంటోనీ ని మించిన వారు తమిళంలో మరొక యంగ్ హీరో లేరేమో. లేటెస్ట్ గా ఆయన ‘వంద దేవుళ్ళు’ అనే చిత్రం తో మన ముందుకొచ్చాడు. తనకు ‘బిచ్చగాడు’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన శశి అనే దర్శకుడితో విజయ్ ఆంటోనీ చేసిన రెండవ చిత్రమిది. అందుకే ఈ సినిమాకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రొమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. నేడు తెలుగు , తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం గురించి ట్విట్టర్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో ఈ రివ్యూ లో చూద్దాం.

ముందుగా విజయ్ ఆంటోనీ ఇలాంటి కథని ఎంచుకొని , ఆడియన్స్ కి అందించాలి అనుకున్నందుకు ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే ఇది ఒక తల్లి కథ , ఒక్క మాటలో చెప్పాలంటే లేడీ ఓరియెంటెడ్ సినిమా అనుకోండి. విజయ్ ఆంటోనీ స్క్రీన్ టైం తక్కువ గానే ఉంటుంది, కానీ నటన మాత్రం అదరగొట్టేశాడని , ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన కెరీర్ లో కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్తుందని ట్విట్టర్ లో ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు అంటున్నారు. ముఖ్యంగా ఈ చిత్రం లో ‘శ్వాసిక’ అద్భుతంగా నటించిందని అంటున్నారు. ఆరంభం నుండి చివరి వరకు ఆమె నటన ప్రేక్షకులు కొన్నేళ్లు గుర్తించుకునేలా ఉంటుందని, ఈమధ్య కాలంలో ఇలాంటి నటన ఎవ్వరూ చెయ్యలేదని అంటున్నారు.

ఇక డైరెక్టర్ శశి రాసిన డైలాగ్స్ కొన్ని ఆణిముత్యాలు లాగా ఉన్నాయని, స్క్రిప్ట్ ని అతను డీల్ చేసిన విధానం చాలా బ్రిలియంట్ గా ఉందంటున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశం మనం థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా వెంటాడుతుందట, ఆ రేంజ్ లో తెరకెక్కించాడు శశి. ముఖ్యంగా ఆయన రైటింగ్ చాలా గొప్పగా ఉందని, ఈమధ్య కాలం లో ఈ రేంజ్ రైటింగ్ ఏ డైరెక్టర్ కూడా అందించలేకపోయాడని అంటున్నారు. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాలని , కానీ వెళ్ళేటప్పుడు మీ అమ్మ ని వెంటపెట్టుకొని వెళ్ళండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ట్విట్టర్ లో నెటిజెన్స్ ఇంకా ఈ సినిమా గురించి ఏమేమి అనుకుంటున్నారో క్రింద అందిస్తున్నాము చూడండి.

జగన్ కుల రాజకీయం.. వర్కౌట్ అనుమానమే!

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ.. లేనప్పుడు మరో స్ట్రాటజీ అన్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు అన్నారు. ఇప్పుడు మాత్రం నా కాపులు అంటూ కొత్త పల్లవి అందుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం కాపుల కోసం ప్రత్యేక పథకం కూడా అమలు చేయలేదు. చంద్రబాబు ఇచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసేందుకు కూడా సాహసించలేదు. ఆయన కుమారుడిని అమానుషంగా పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కాపులను చాలా హీనంగా చూశారు. ఇప్పుడు సాయి కృష్ణ అనే యువకుడు అదృశ్యం కావడం, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఏకంగా ఆయన కోసం పరితపించడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. కూటమి ప్రభుత్వం పై ఒక రాయి వేసి.. ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి.

* అప్పట్లో కాపులపై చులకన..
కాపులు రాజకీయంగా ఏం చేస్తారులే అన్నట్టు ఉండేవారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళిపోతే వెళ్లిపోని అన్నట్టు ఉండేది ఆయన ఆలోచన. తనకు బీసీలు ఉన్నారని, ఎస్సీలు ఉన్నారని, వారంతా తనకే ఓటు వేస్తారని పెద్ద ఎత్తున కలలు కన్నారు. అంతకుముందు కాపులకు ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు కల్పించారు చంద్రబాబు. ఆ రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. దీంతో అసలైన రిజర్వేషన్లు ఇస్తారని కాపులు భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి వారి గాలిని తీసేశారు. కాపుల కోసం, కాపు నేతల కోసం వైసిపి కాపు నేతలతోనే అమానుషంగా మాట్లాడించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.. అటువంటి వ్యక్తి ఇప్పుడు కాపుల కోసం మళ్లీ గేమ్ ప్రారంభించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డిని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కానీ ప్రయత్నం వదలని విక్రమార్కుడిలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కాపుల గురించి ఏ చిన్న అంశం తెరపైకి వస్తున్నా వాలిపోతున్నారు. ఇప్పుడు కృష్ణలంకలో సాయి కృష్ణ ఇంటిపై అలానే వాలిపోయారు.

* శృతిమిస్తున్న ప్రచారం..
సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారని సాక్షి మీడియా ఒకవైపు రాసేస్తోంది. కనీసం స్మశానంలో ఆడవాళ్లు లేకుండా కాల్చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో శవం అనే మాట వినిపిస్తే అరక్షణం ఆగను అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ ఇంటి వద్ద వాలిపోయారు. సాయి కృష్ణ పై కేసులు ఉన్నాయని ఆయన బంధువులే చెబుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ కేసులను చిన్న నేరాలుగా చూపుతున్నారు. బాధిత కుటుంబంగా సంఘీభావం తెలిపితే పరవాలేదు కానీ.. ఆ తప్పులను సైతం ఒప్పులుగా చూపే అధికారం మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేదు. పోలీసులు ఈ ఘటనలో వ్యవహరించిన తీరు కూడా సహేతుకం కాదు. అలాగని ఇదేదో కాపు రాజకీయం చేసి కాక రేపాలని భావిస్తున్నారు. అసలు పోలీస్ శాఖలో దర్యాప్తులు లేవా? నిందితులు లేరా? వైసీపీ హయాంలో కారు డ్రైవర్ను హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారు ఆయన పార్టీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదా? దళితుల ఆర్తనాదాలు వినిపించలేదా? అర్జెంటుగా ఇప్పుడు కాపులు కూటమికి వ్యతిరేకం కావాలి. పవన్ కళ్యాణ్ కు దూరం కావాలి. ఆ ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డికి.

ఏపీ మాదిరిగా తెలంగాణలో.. పవన్ ఆలోచన అదే!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రకంపనలు సృష్టించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఆయన తలపెట్టిన సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు కవితతో పాటు భారత రాష్ట్ర సమితి నేతలు సైతం టార్గెట్ చేసుకున్నారు. వారిలో ఒక రకమైన భయం కనిపించింది పవన్ కళ్యాణ్ ద్వారా. ఇప్పుడు అదే నిజం చేస్తున్నారు పవన్. తెలంగాణ రాజకీయాల వైపు తొంగి చూస్తున్నారు. అక్కడే ఉండి రాజకీయాలు చేయనున్నారు. హైదరాబాదులో పార్టీ తెలంగాణ కార్యాలయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ ఐటీ కారిడార్ మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కేంద్ర కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు పొత్తు ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలంగాణలో ప్రాభవాన్ని చాటుకున్న జనసేన.. పార్టీ కార్యాలయాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా తెలంగాణ గడ్డపై సరికొత్త రాజకీయ ప్రస్తానానికి.. అధికారికంగా శ్రీకారం చుట్టబోతుందన్నమాట.

* తెలంగాణ నేతల్లో ఆ భయం..
తెలంగాణ రాజకీయ పార్టీల నేతలకు పవన్ కళ్యాణ్ విషయంలో ఒక ఆందోళన ఉంది.. ఏపీలో సైతం పవన్ కళ్యాణ్ చాలా సుదీర్ఘంగా పోరాడి శత శాతం విజయం సాధించారు. ఇక్కడ కూడా అటువంటి ప్రణాళిక రూపొందిస్తే తమకు ఇబ్బందులు తప్పవు అని భయపడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినం నాడు హైదరాబాదులో ప్రెస్మీట్లో గట్టిగానే సంకేతాలు పంపారు పవన్. రాబోయే ఎన్నికల్లో జనసేన పూర్తిస్థాయిలో బరిలో దిగుతుందని.. ఇక్కడి క్యాడర్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఇప్పుడు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో సీరియస్ గా దృష్టి పెట్టబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు.

* ప్రజల వైఖరిలో మార్పు..
గతం కంటే తెలంగాణ ప్రజల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రత్యేక రాష్ట సెంటిమెంట్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు అభివృద్ధికి, సమకాలిన అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. పైగా తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. దానిని భర్తీ చేయడమే అజెండాగా జనసేన పని చేయనుంది. భారత రాష్ట్ర సమితి వరుస అపజయాలతో ఇబ్బంది పడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. బిజెపి బలం పుంజుకున్నప్పటికీ నాయకత్వం సమస్య వెంటాడుతోంది. ఇటువంటి తరుణంలో ఏపీ మాదిరిగా తెలంగాణలో సైతం జనసేన ప్రత్యేక ఓటు బ్యాంకు కొల్లగొట్టాలని చూస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సెటిలర్స్, ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో జనసేన బలం పెంచుకోవాలని భావిస్తోంది. యువతతో పాటు విద్యార్థుల ఓట్లపై గురిపెడుతోంది.

* సమయం కేటాయింపు..
ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. అయితే హైదరాబాదులో నివాసం ఉన్న దృష్ట్యా అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అందుకే వారంలో ఒకరోజు తెలంగాణ కార్యకలాపాలకు కేటాయించే అవకాశం ఉంది. వారాంతంలో షెడ్యూల్ తెలంగాణ కార్యాలయానికి కేటాయిస్తారని సమాచారం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

గేమ్ చేంజర్ సినిమాకి పెద్ది మూవీ కి మధ్య తేడా అదేనా..?

Game Changer Vs Peddi
Game Changer Vs Peddi

Game Changer Vs Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్ లో నిల్చోబెట్టాయి. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక రంగస్థలం సినిమాతో తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీసిన రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కాబట్టి ఈ సినిమా ప్రేక్షకువ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో డివైడ్ టాక్ తో రన్ అవుతుంది. మొత్తానికైతే సినిమా రిలీజ్ అయి 15 రోజులు అవుతున్నప్పటికి ఈ సినిమాకి కలెక్షన్స్ మాత్రం బాగానే వస్తున్నాయి. దానికి తోడుగా ఈ సినిమాను రిపీటెడ్ గా చూసే జనాల సంఖ్య కూడా పెరుగుతుంది. కొత్త సీన్లు కూడా యాడ్ చేశారు కాబట్టి మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సినిమా యూనిట్ అయితే భావిస్తున్నారు…

రామ్ చరణ్ గత సంవత్సరం చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. నిజానికి గేమ్ చేంజర్ సినిమాకి పెద్ది సినిమాకి మధ్య తేడా ఏంటి అంటే గేమ్ చేంజర్ సినిమాలో కథ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నప్పటికి దానికి సరైన పే ఆఫ్ ఇవ్వలేదు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి.

ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ పోషించిన పాత్ర అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ చివర్లో ఈ సినిమా చాలావరకు ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. అయినప్పటికి ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది అంటే రామ్ చరణ్ చరిష్మా ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకు 400 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. తన కెరీర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా నిలుస్తుందా? లేదంటే భారీగా డిజాస్టర్ ను మూట గట్టుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరో వారం రోజులకు గడిస్తే కానీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రిజల్ట్ ఏంటి అనేది చెప్పలేము…