Home Blog Page 105

మొన్నటిదాకా నోరేసుకుని అరిచాడు.. మోడీ విషయంలో ట్రంప్ ఎందుకు తగ్గాడు..

G7 Summit France
G7 Summit France

G7 Summit France: ఫ్రాన్స్ దేశంలో జరిగిన జి 7 సమ్మిట్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చాలాసేపు మాట్లాడారు. వాస్తవానికి పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ భేటీ కావడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగించింది. ఈ భేటీ కంటే ముందు ప్రపంచ దేశాల అధినేతలతో నరేంద్ర మోడీ ఆప్యాయంగా కనిపించారు. వారందరినీ ఆలింగనం చేసుకొని ప్రేమను వ్యక్తం చేశారు. ట్రంప్ విషయానికి వచ్చేసరికి జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.. పెద్దగా కుశల ప్రశ్నలు కూడా వేయలేదు.

ట్రంప్ కు అర్థమైంది

ఇటీవల కాలంలో అమెరికా భారత్ మీద వ్యవహరిస్తున్న తీరు
.. ముగ్గురు భారత నావికులు చనిపోవడం.. అర్థం లేని షరతులు.. పాకిస్తాన్ దేశానికి అండగా ఉండడం.. ఇవన్నీ కూడా భారత్ లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. వీటిని పరోక్షంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్రంప్ మీద చూపించారు. దీంతో ట్రంప్ కు సినిమా అర్థమైంది. దీంతో మోడీతో ఆయన భేటీ అయ్యారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. త్వరలో ఇండియాకు వస్తానని ప్రకటించారు. అంతేకాదు ట్రేడ్ డీల్ కూడా కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

యుద్ధం వల్ల అమెరికాలో తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ బలమైన ఓటర్లుగా భారతీయులు ఉన్నారు. వారందరి మనసులో స్థానం సంపాదించాలి అంటే కచ్చితంగా ట్రంప్ ఇండియాకు దగ్గర కావాలి. దీనికి తోడు వాణిజ్యపరంగా ఇండియా అమెరికాకు చాలా అవసరం. అందువల్లే ట్రంప్ పాకిస్తాన్ కు గుడ్ బై చెప్పారు. అవసరాల మేరకే పాకిస్తాన్తో స్నేహం సాగించిన అమెరికా ఆ తర్వాత.. తన అసలు రంగును బయటపెట్టుకుంది. ఇదేమి తెలియని పాకిస్తాన్ అమెరికాతో ఇంతకాలం అంట కాగింది. ఇరాన్ తో యుద్ధం ముగించడం వల్ల అమెరికాలో ధరలు దిగి వస్తాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు ట్రంప్ ప్రభుత్వానికి ఇది ఎంతో ఉపశమనం. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ట్రేడ్ డీల్ వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్యం మరో స్థాయికి వెళ్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎగుమతులు, దిగుమతుల విషయంలో కొంతకాలంగా స్తబ్దమైన వాతావరణం నెలకొంది. అలాంటప్పుడు ట్రంప్ ద్వారాలు తెరిచిన నేపథ్యంలో.. రెండు దేశాలకు అనుకూలంగా వాణిజ విధానాలు రూపొందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా ట్రేడ్ డీల్ పూర్తయితే.. కొన్ని అంశాలపై క్లారిటీ వస్తుందని వ్యాపారవేత్తలు అంటున్నారు. తద్వారా తయారీ రంగాలు ఊపొందుకొనే అవకాశం ఉంటుందని.. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు.. ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమెరికా, ఇరాన్ డీల్.. మనకేంటి లాభం

US Iran Deal
US Iran Deal

US Iran Deal: కొద్ది నెలలుగా సాగుతున్న భీకరమైన యుద్ధం ఎట్టకేలకు తాత్కాలికంగా ముగిసింది.. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిరింది.. ట్రంప్.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ శాంతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫలితంగా మూడున్నర నెలలుగా సాగుతున్న తాత్కాలిక యుద్ధం ముగిసిపోయింది. యుద్ధం తాత్కాలికంగా ముగిసిన నేపథ్యంలో మనకు ఏంటి లాభం అనే చర్చ నడుస్తోంది.

ఈ యుద్ధంలో ఇరాన్ తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఇరాన్ దేశానికి ఏకంగా 30 వేల కోట్ల డాలర్లను ఇస్తామని ప్రతిపాదన వచ్చింది. 13 సంవత్సరాలపాటు అంతయుద్ధంతో ఇబ్బంది పడుతున్న సిరియాకు 215 బిలియన్ డాలర్లు.. గాజాకు 53 బిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేశారు. అయితే ఇరాన్ దేశం ఈ రెండు ప్రాంతాల కంటే ఎక్కువ అనుతిని సొంతం చేసుకోవడం గమనార్హం. విదేశాలలో ఉన్న ఇరాన్ ఆస్తులు కూడా రిలీజ్ అవుతాయి. మరోవైపు ఈ ఫండ్ కు ఒక పైసా కూడా ఇచ్చేది లేదని అమెరికా స్పష్టం చేసింది.

తాత్కాలిక శాంతి ఒప్పందం వల్ల ఇరాన్ దేశానికి ఆర్థికంగా ఊరట లభిస్తుంది.. అమెరికా విధించిన ఆంక్షలు పూర్తిగా తొలగిపోతాయి. గత ఏడాది ఇరాన్ క్రూడ్ ఆయిల్ అమ్మకుల ద్వారా 45 బిలియన్ డాలర్లను సంపాదించింది. అమెరికా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడంతో చైనా దేశానికి అత్యంత రహస్యంగా విక్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆంక్షలు తొలగిన నేపథ్యంలో గ్లోబల్ వ్యాప్తంగా తనకు నచ్చిన రేటుకు క్రూడ్ ఆయిల్ అమ్ముకోవచ్చు.

ఇన్నాళ్లపాటు మూసివేతకు గురైన హార్మోజ్ జల సంధి తీర్చుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్లో ఇది ఐదవ వంతు పాత్ర పోషిస్తుంది. యుద్ధం వల్ల దీనిని తాత్కాలికంగా మూసివేశారు. తాజా డీల్ నేపథ్యంలో అమెరికా తన ఆంక్షలు మొత్తం ఎత్తివేసింది. వచ్చే 60 రోజులపాటు ఈ సంధి మీదుగా కమర్షియల్ షిప్ లు ఉచితంగా రాకపోకలు సాగిస్తాయి.. ఫలితంగా ఇంటర్నేషనల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ఫ్యూయల్ ధరలు చాలా వరకు తగ్గుతాయి. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రకమైన ఊరట. యుద్ధం తెచ్చిన సంక్షోభం వల్ల మనదేశంలో ధరలు పెరిగిపోయాయి. అమెరికాలో కూడా అదే పరిస్థితి. ఇరాన్ తో యుద్ధం అలానే కొనసాగితే.. అమెరికాలో మధ్యంతర ఎన్నికల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఈ యుద్ధంలో ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయాలని.. హౌతి.. హిజ్ బొల్లా వంటి శక్తులను తొక్కి వేయాలని అమెరికా.. ఇజ్రాయిల్ దాడులు మొదలుపెట్టాయి. ఇన్ని రోజులపాటు సాగిన యుద్ధంలో ఇరాన్ రూపొందించుకున్న స్థావరాలు మొత్తం నాశనమయ్యాయి. అయినప్పటికీ ఇరాన్ బలం తగ్గిపోలేదు. మరోవైపు తాత్కాలిక శాంతి ఒప్పందంలో ఇరాన్ మిస్సైల్స్.. ప్రాక్సిల గురించి ఎటువంటి ప్రస్తావన రాకపోవడం విశేషం. ఈ అంశాన్ని పదేపదే ఇరాన్ దాటవేయడం ఇక్కడ గమనార్హం.

యుద్ధం తాత్కాలికంగా ముగిసిపోవడం వల్ల ఇరాన్ నుంచి మళ్లీ మన దేశానికి క్రూడ్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ మొదలవుతుంది. దేశంలో వంట గ్యాస్.. ఫ్యూయల్ ధరలు తగ్గుతాయి. దీనికి తోడు ఇరాన్ దేశంలో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చాబహర్ పోర్ట్ నిర్మాణం మళ్లీ మొదలవుతుంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్యోగాలు చేస్తున్న కోటి మంది భారతీయులకు భద్రత లభిస్తుంది.

ఇలాగైతే తెలంగాణలో బిజెపికి అధికారం కష్టమే..

Telangana BJP
Telangana BJP

Telangana BJP: ఒక్క విమర్శకు సరైన సమాధానం లభించడం లేదు. కనీసం ఆత్మరక్షణకు కూడా పాల్పడే అవకాశం కూడా కనిపించడం లేదు. అంత వీక్ అయిపోయారా.. గట్టిగా వాయిస్ కూడా వినిపించలేకపోతున్నారా.. ఇలా ఎందుకు ఉండిపోతున్నారు.. ఇలా ఎందుకు అయిపోతున్నారు.. ఇదిగో ఇలానే సాగుతోంది బిజెపి నాయకుల గురించి తెలంగాణలో చర్చ.

8 మంది ఎంపీలు

2024 ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో సత్తా చాటింది. ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. ఈ స్థాయిలో స్థానాలు సాధించి.. రెండు సెంట్రల్ మినిస్టర్ పోస్టులు అందుకొని.. తిరుగులేని స్థితిలో ఉండాల్సిన కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఇబ్బంది పడుతూ ఉండడం ఆవేదన కలిగిస్తోంది.. ముఖ్యంగా ఇటీవల కాలంలో మెట్రో లోన్ కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నలకు ఇంతవరకు కిషన్ రెడ్డి నుంచి సరైన స్థాయిలో సమాధానం లభించలేదు. మెట్రో కు సంబంధించి రుణం మంజూరు కాకపోవడానికి కిషన్ రెడ్డి నే కారణమని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఇటీవల అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి ఏదో ఊకదంపుడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి.. అలా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. అంతేతప్ప తెలంగాణ ముఖ్యమంత్రి విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు.

మిగతావారు కూడా

కిషన్ రెడ్డి మీద విమర్శలు వస్తే ఆయన మాత్రమే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి.. కనీసం మిగతా ఎంపీలు గాని.. ఇతర నాయకులు గాని కిషన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి తీరును విమర్శించలేదు. బిజెపి పార్టీ సోషల్ మీడియా కూడా అదే నిర్లక్ష్యంతో ఉంది. కనీసం వివరాలతో.. గణాంకాలతో కౌంటర్ ఇవ్వలేదు. బిజెపి నేతలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 8 మంది ఎంపీలు ఉండి కనీసం.. గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేరా అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ బిజెపి నేతల వ్యవహార శైలి ఎవరికి వారు అన్నట్టుగానే ఉంది. గతంలో బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆయనను మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నేతలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు లేదా విమర్శలు ఎదురైనప్పుడు సమిష్టిగా వాటికి కౌంటర్ ఇవ్వడం లేదు.. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేయడంలో ఇక్కడి నాయకులు విఫలమయ్యారు అని చెప్పుకోవచ్చు.. అందువల్లే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ లో కూడా బిజెపి నేతలు పెద్దగా స్పందించింది లేదు. పైగా కొంతమంది నాయకులు మీడియాకు లీకులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి పదే పదే కిషన్ రెడ్డిని ఉద్దేశించి భారత రాష్ట్ర సమితికి బినామీ లాగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పడంలో కిషన్ రెడ్డి విఫలమవుతున్నారు.. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి స్థాయి రోజురోజుకు పడిపోతుంది. ఈటెల రాజేందర్ పెద్దగా కనిపించడం లేదు. డీకే అరుణ సైలెంట్ గా ఉండిపోయారు. బండి సంజయ్ కేవలం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు.. కిషన్ రెడ్డి అప్పుడప్పుడు తన మీద విమర్శలు వచ్చినప్పుడు విలేకరుల సమావేశం పెడుతూ వెళ్ళిపోతున్నారు. ధర్మపురి అరవింద్.. రఘునందన్ రావు.. ఇలా ఎవరి బౌండరీలో వారు ఉన్నారు. అందువల్లే రేవంత్ రెడ్డి తెలంగాణలో బిజెపిని చెడుగుడు ఆడుకుంటున్నారు.

సమంత 'మా ఇంటి బంగారం' బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టలో తెలుసా?

Maa Inti Bangaram 6 Days Collections
Maa Inti Bangaram 6 Days Collections

Maa Inti Bangaram Break Even: కొంతకాలం విరామం తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను , ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ చిత్రం నుండి విడుదలైన ‘తస్సాదియ్యా’ పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో , కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలో వచ్చింది. ప్రామిసింగ్ కంటెంట్ తో పాటు , మంచి కాంబినేషన్ కూడా అవ్వడం తో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఒకవిధంగా చెప్పాలంటే బయ్యర్స్ రిస్క్ చేసారని చెప్పొచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం , ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. కొంతమంది మీడియం రేంజ్ హీరోలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అవ్వలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉంది అనేది. ఈ బుకింగ్స్ గ్రాస్ చూస్తుంటే , ఈ చిత్రానికి కచ్చితంగా మొదటి రోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవుతుందని అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మాత్రం కచ్చితంగా పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాక్ బాగుంటే మాత్రం , ఈ చిత్రం వారం రోజులు పూర్తి అవ్వకముందే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోగలదు.

ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత నిర్మాతగా కూడా వ్యవహరించింది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి జబర్దస్త్, ఇది కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. కానీ రెండవ చిత్రం ‘ఓ బేబీ’ మాత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమా కారణంగానే, మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది అనగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం లో ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా కీలక పాత్ర పోషించింది. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ చిత్రానికి కథ ని అందించాడు.

అంతా ఆసిమ్ మునీర్ దే.. పరువు తీసుకున్న పాక్ రక్షణమంత్రి

Pakistan Politics
Pakistan Politics

Pakistan Politics:  పాకిస్తాన్‌లో ఎన్నికైన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ సైనిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండటం చాలా దశాబ్దాల నుంచి కనిపిస్తోంది. ఈ వాస్తవం ఇటీవల రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ జాతీయ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో మరింత స్పష్టంగా బయటపడింది. ఆయన మాట్లాడుతూ, గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఈ అసమానతను మరలా నిరూపించాయని తెలిపారు.

జాతీయ అసెంబ్లీలో వ్యాఖ్యలు..
ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడుతూ, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వ కాలంలో గూఢచార విభాగం ఐఎస్‌ఐకి విపరీతమైన స్వేచ్ఛ లభించిందని చెప్పారు. ఆ సమయంలో ఆ సంస్థ అధినేత లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) ఫైజ్‌ హమీద్‌ పంపిన అధికారులు చట్టసభ సంబంధిత చర్చల్లో నేరుగా పాల్గొని, నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చేవారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన రాజకీయ కార్యకర్త ఒప్పుకోలుగా వర్ణించారు.

అసద్‌ ఖైసర్‌ నివాసంలో చర్చలు..
మాజీ స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌ నివాసంలో జరిగిన ముఖ్యమైన సమావేశాల్లో ఐఎస్‌ఐ ప్రతినిధులు హాజరయ్యేవారని, వారు చర్చలను పర్యవేక్షించి, కావాల్సిన దిశలో నడిపించేవారని ఖవాజా ఆసిఫ్‌ వివరించారు. ఈ సమావేశాల్లో పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ సభ్యులు కూడా పాల్గొనేవారని, అక్కడ నిఘా సంస్థ అధికారులు రాజకీయ నాయకుల చర్చలను నిశితంగా గమనించి, అవసరమైన మార్పులు చేసేవారని ఆయన తెలిపారు.

చట్టాలపై నిఘా సంస్థ ఒత్తిడి..
అప్పట్లో మనీలాండరింగ్‌ వ్యతిరేక చట్టంలో సవరణలు, ఇతర కీలక చట్టాలు ఈ ఒత్తిడి వల్లే అమల్లోకి వచ్చాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. రాజకీయ కార్యకర్తలు, శాసనసభ్యులు ఎలా ముందుకు సాగాలో నిర్దేశించబడేవారని, చట్టసభ కార్యకలాపాలు పూర్తిగా ఆ సంస్థ నియంత్రణలో ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ప్రస్తుత హైబ్రిడ్‌ పాలనా విధానం
అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం సైన్యంతో సమన్వయంగా పనిచేస్తోందని, పౌరులు–సైనికుల మధ్య సంయుక్త హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఖవాజా ఆసిఫ్‌ చెప్పారు. ఈ విధానం ఆర్థిక, పరిపాలనా సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడుతోందని, ప్రత్యేక పెట్టుబడి సౌకర్య కౌన్సిల్‌ వంటి వేదికల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఆదర్శ ప్రజాస్వామ్యం కాదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణాత్మకమైన విధానమని ఆయన వివరించారు.

ఖవాజా వ్యాఖ్యలు పాకిస్తాన్‌ రాజకీయాల్లో సైనిక ప్రభావం ఎంత లోతుగా ఉందో మరలా చర్చకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే పాక్‌ నేతలకు తాజాగా మంత్రి వ్యాఖ్యలు అవన్నీ పైకి చెప్పడానికే అన్నది అర్థమవుతుంది.

మూడు ఫార్మాట్లలో మడత పెట్టాడు.. గిల్ కు ఇది ఎలా సాధ్యమైంది..

Shubman Gill
Shubman Gill

Shubman Gill: కొంతమంది ప్లేయర్లు టెస్టులలో అద్భుతంగా ఆడతారు. మరి కొంతమంది ఆటగాళ్లు వన్డేలలో దంచి కొడతారు. ఇంకొంతమంది ప్లేయర్లు టి20 లలో సత్తా చూపిస్తారు. ఈ మూడు ఫార్మాట్ లలో అదరగొట్టే ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ జాబితాలో టీమిండియా కెప్టెన్ ముందు వరుసలో ఉంటాడు.

టీమిండియా కు కెప్టెన్ గా వ్యవహరించడం అంటేనే ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టుకున్నట్టు. విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. క్షణం క్షణం పరిణామాలు మారిపోతూ ఉంటాయి. జట్టుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు ఎదురు తిరుగుతాయి. అలాంటప్పుడు సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. శరీరం.. మెదడు ఏకకాలంలో పని చేయాలి. ఇంత ఒత్తిడిలో కూడా సహజ సిద్ధమైన ఆట తీరు ప్రదర్శించడం అంత సులభం కాదు. కానీ, దానిని సులువుగా చేసి చూపిస్తున్నాడు గిల్.

ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన రెండవ వన్డేలో సెంచరీ చేయడం ద్వారా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది మే 29న ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ జట్టు రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో గుజరాత్ సారథిగా గిల్ అద్భుతమైన సెంచరీ చేశాడు. రాజస్థాన్ జట్టు మీద ఏకంగా 104 రన్స్ కొట్టాడు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో ఈనెల 6న జరిగిన ఏకైక టెస్టులో 126 పరుగులు చేశాడు. అతడి శతకానికి తోడు కేఎల్ రాహుల్ కూడా సెంచరీ చేయడంతో టీమిండియా ఏకంగా 564 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే పూర్తయింది.

ఆఫ్ఘనిస్తాన్ దట్టితో జరిగిన రెండవ వన్డేలో 154 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా సారధిగా మరో మెట్టు ఎక్కేశాడు. ఇతడుతో పాటు కిషన్ కూడా 125 పరుగులు చేసి సత్తా చూపించాడు. వీరిద్దరి దూకుడు వల్ల టీమిండియా ఏకంగా 402 పరుగులు సాధించింది. అయితే ఈ మూడు మ్యాచ్ల్లో కూడా ఆయా జట్లకు సారధిగా గిల్ ఉండడం విశేషం.

గిల్ రెండు నెలలపాటు టి20 ఫార్మాట్ ఆడాడు. ఆఫ్ఘనిస్తాన్ మనకంటే చిన్న జట్టు అయినప్పటికీ.. అందులో ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు.. గుజరాత్ జట్టు తరఫున నాయకుడిగా ఉన్నప్పుడు.. రాజస్థాన్ బౌలర్లను గిల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెస్టులలో.. వన్డేలలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను కూడా అదే స్థాయిలో ప్రతిఘటించాడు. తద్వారా తనకు ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ అని నిరూపించాడు గిల్. 2027 వన్డే వరల్డ్ కప్ ముందు సిసలైన ఫామ్ కొనసాగిస్తున్న నేపథ్యంలో.. గిల్ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. కొద్దిరోజుల క్రితం ఇతడి ఫామ్ మీద చాలామంది సీనియర్ ప్లేయర్లు ఒకింత సందేహం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు అతని ఆట చూసి.. వారెవ్వా అంటూ చప్పట్లు కొడుతున్నారు.

ఈ రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరికి అన్ని విజయాలే..

Today 19 June 2026 Horoscope
Today 19 June 2026 Horoscope

Today 19 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశరాసులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేవారు పెద్దలను సంప్రదిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ప్రత్యర్థులపై దృష్టి పెట్టాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు కెరీర్ విషయంలో కీలకమైన సమాచారం అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి శుభవార్తలో అందుతాయి. కొత్తగా పెట్టుబడును పెట్టే వ్యాపారులు పెద్దలను సంప్రదిస్తారు. అవసరానికి మించి ఖర్చులు చేయకుండా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు ఉంటాయి ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంతోషకరమైన వార్తలను వినాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్లానింగ్ వేస్తారు. ఆరోగ్య విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులకు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు కీలకమైన సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో విద్య కోసం వెళ్లే వారికి శుభవార్తలు అందుతాయి. వాహనాలపై ప్రయాణం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు లాభాలు అధికంగా పొందే అవకాశం ఉంది. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఉద్యోగులకు ఈరోజు అపారమైన లాభాలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులు ప్రత్యర్థులను ఓడించడానికి అవసరమైన వనరులను ఏర్పరచుకుంటారు. ఉద్యోగులు గతంలో కంటే ఇప్పుడు అనుకున్న విజయాన్ని పొందుతారు. తోటి వారి సహాయంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. బంధువుల సహాయంతో అప్పల నుంచి బయటపడతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు ఇదే మంచి సమయం. కొత్త స్నేహితులు కలుస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ఇతరుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధికారుల మద్దతు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం ఎరుగుపడుతుంది. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని పనుల కారణంగా ఉద్యోగులు బిజీగా మారతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి అధికారుల సహాయం తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త పనిని ప్రారంభిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. నాణ్యమైన సమయాన్ని ఇష్టమైన వారితో గడుపుతారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేసిన బండ్ల గణేష్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ట్వీట్..

Bandla Ganesh
Bandla Ganesh

Bandla Ganesh Controversy: రీ రిలీజ్ చిత్రాల విషయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేయడం లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దిట్ట అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రీసెంట్ గానే బండ్ల గణేష్ ఈ నెల 26 న పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ ఈ వార్త పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇన్ స్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను షేర్ చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. ఇలా అభిమానులు జూన్ 26 న థియేటర్స్ లో సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతుండగా, కాసేపటి క్రితమే బండ్ల గణేష్ అభిమానుల గుండెలు బద్దలయ్యే వార్త చెప్పాడు.

ఆయన మాట్లాడుతూ ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం అపూర్వమైన స్పందనతో ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతుండడంతో , ఈ నెల 26 న రీ రిలీజ్ చెయ్యాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను. థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘పెద్ది’ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడకూడదు అనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను , గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. దీనికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇస్తూ ‘నిన్ను ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యమని మేము అడగలేదు , కానీ ఏ చిత్రాన్ని విడుదల చేస్తానని మీరే ఆశపెట్టారు , ఇప్పుడు ఆ ఆశలపై నీళ్లు జల్లుతున్నారు, ఇదెక్కడి న్యాయం’ అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

బండ్ల గణేష్ కి ఇదేమి కొత్త కాదు. 2021 వ సంవత్సరం లో ఆయన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని సెప్టెంబర్ 2 న 100 కి పైగా స్పెషల్ షోస్ తో విడుదల చేస్తానని ప్రకటించాడు. కానీ కట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 షోస్ కూడా పడలేదు. అదే విధంగా ఆయన నిర్మాణం లో తెరకెక్కిన ‘తీన్ మార్’ చిత్రాన్ని కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు , ఇప్పుడు లేటెస్ట్ గా ‘గబ్బర్ సింగ్’ కి కూడా అదే చేశాడు. ఇలా ఎన్ని సార్లు ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేస్తావు , ఈసారి నువ్వు నిజంగా రీ రిలీజ్ చేస్తానని చెప్పినా ఎవ్వరూ నమ్మరు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంబటి రాంబాబు వైసీపీని ఇలా బుక్ చేశాడేంటి..

Ambati Rambabu
Ambati Rambabu

Ambati Rambabu: అధికారంలో ఉన్న వాళ్ళకంటే.. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికార పక్షాన్ని విమర్శిస్తున్నప్పుడు కచ్చితంగా ఆధారాలు చూపించాలి. అప్పుడే జనాలు ఆ నాయకుల మాటలు నమ్ముతారు. అలాకాకుండా నోటికి వచ్చిందే మాట అనే లాగా విమర్శించి.. బట్ట కాల్చి మీద వేస్తామంటే.. చివరికి అభాసుపాలయ్యేది ప్రతిపక్ష నాయకులే.

ఏపీలో ప్రజలు ప్రతిపక్షానికి అవకాశం లేకుండా 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు. 11 స్థానాలు గెలుచుకున్న వైసీపీ నే అక్కడ అనధికారికంగా ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే క్రమంలో వైసిపి ప్రతి సందర్భంలోనూ విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. సొంత మీడియా ముందు తీవ్రంగా రెచ్చిపోతున్నారు. కనీసం ఏ అంశం మీద మాట్లాడుతున్నారో సోయి లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు.

ఏపీలో సాయి కృష్ణ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. ఏమాత్రం కూడా ఓపిక లేని వైసిపి నాయకులు రెచ్చిపోయారు. ముఖ్యంగా వైసిపి రాష్ట్ర నాయకుడు.. మాజీమంత్రి అంబటి రాంబాబు తన నోటికి పని చెప్పారు. అంతేకాదు సాయి కృష్ణ ఫోటోను బయటికి చూపించారు. పోలీసులు దాడి చేయడం వల్లే అతడు చనిపోయాడని సంచలన ఆరోపణలు చేశారు.

రాంబాబు చూపించిన ఫోటోలను నిజమైన నమ్మిన సాక్షి మీడియా గట్టిగా ప్రచారం చేసింది. కానీ లోతుగా విశ్లేషిస్తే ఆ ఫోటో సాయి కృష్ణ ది కాదు. అంబటి రాంబాబు చూపించిన ఫోటో నవీన్ రెడ్డి అనే వ్యక్తిది. స్వయంగా ఈ విషయాన్ని నవీన్ రెడ్డి మేనమామ శీను రెడ్డి బయటపెట్టారు. దీంతో కదా మొత్తం అడ్డం తిరిగింది. ఫలితంగా ఏపీలో మీడియా మొత్తం నవీన్ రెడ్డి వైపు కన్ను పెట్టింది.

ఆ నవీన్ రెడ్డి అమాయకుడు కాదు. అతడి వ్యవహారాలు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూడాల్సిందే. నవీన్ రెడ్డి.. సాయి కృష్ణ దేవినేని అవినాష్ కు ప్రధాన అనుచరులుగా ఉన్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. వీరిద్దరూ రాణి తోట.. కృష్ణలంక ప్రాంతాలలో విచ్చలవిడిగా వ్యవహరించే వారని.. మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించే వారిని అక్కడి మహిళలు అంటున్నారు. సాయి కృష్ణ, నవీన్ రెడ్డి వ్యవహారం తెలిసిన తర్వాత అక్కడి మహిళలు వీధులకు వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరిద్దరు ఇష్టానుసారంగా ప్రవర్తించేవారు. మాదక ద్రవ్యాలు తీసుకొని దారుణంగా ప్రవర్తించేవారు. ఇందులో నవీన్ రెడ్డిని మ్యాడ్ రెడ్డి అని పిలిచేవారంటే.. అతడి చేష్టలు ఎలా ఉండేవో చెప్పాల్సిన పని లేదు. అన్నట్టు వీరి గురించి ఈ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఒకవేళ అవే గనుక నిజమైతే తమ ప్రాంతాలకు పట్టిన శని మొత్తం పోయిందని రాణి తోట.. కృష్ణలంక వాసులు చర్చించుకోవడం విశేషం.

రేవంత్ కూడా కెసిఆర్ మాదిరిగానే.. ఎందుకో తెలుసా..

Telangana Plantation Program
Telangana Plantation Program

Telangana Plantation Program: ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభోత్సవం రోజు తెలంగాణ రాష్ట్రంలో మొక్కలు నాటే కార్యక్రమం అధికారికంగా మొదలవుతుంది. ముఖ్యమంత్రి మొక్కనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించి.. మొక్కలు నాటిస్తారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతుకుతాయి.. ఎన్ని వృక్షాలుగా ఎదుగుతాయి అనే విషయాన్ని పక్కన పెడితే.. మొక్కలు నాటే కార్యక్రమం మాత్రం బృహతరమైనది.

కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొక్కలు నాటి కార్యక్రమానికి హరితహారం అని పేరు పెట్టేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 2023 వరకు హరితహారం కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు కదంబం మొక్కను ఎక్కువగా నాటేవారు. పైగా ఆయన జాతకరీత్యా ఆ మొక్క నాటడం శ్రేయస్కరమని పండితులు చెబితే.. ఆయన అలానే చేసేవారు. కెసిఆర్ జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటారు. అది ఆయన ఇష్టం. కానీ కొంతమంది దానిని విమర్శించేవారు. కొన్ని సందర్భాలలో తన అలవాట్లను విమర్శించే వారికి కెసిఆర్ గట్టిగా సమాధానం చెప్పేవారు.

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన వన మహోత్సవం అని పేరు పెట్టారు. ప్రస్తుత ఏడాది ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుర్రం గూడ అర్బన్ ఎకో పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ఒక మొక్కను నాటారు. ఆయన వెంట అటవీ శాఖ మంత్రి సురేఖ. ఇతర అధికారులు ఉన్నారు.

గుర్రం గూడ ఎకో పార్కులో రేవంత్ రెడ్డి నాటిన మొక్క పేరు నాగలింగం.. దీని పువ్వులు అత్యంత పవిత్రమైనవి. దీని పండ్లు కూడా అత్యంత ప్రాముఖ్యమైనవి. కౌరౌపిటా గుయా నెన్ సిస్ అనేది దీని శాస్త్రీయ నామం. ఈ మొక్క పువ్వులు శివలింగం ఆకారంలో ఉంటాయి. పువ్వు మధ్యలో శివుడి లింగం మాదిరిగా ఒక ఆకారం ఉంటుంది. దానిమీద పాము పడగపినట్టుగా పువ్వు రేకులు ఉంటాయి. అందువల్ల దీనిని నాగలింగ పుష్పం అని పిలుస్తుంటారు. ఈ పూలను శంకరుడికి అలంకరిస్తుంటారు. ఆయనకు ఈ పువ్వులు ఎంతో ప్రీతి పాత్ర మైనవి.

ఈ చెట్టు పువ్వులు పూచే విధానం విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా పువ్వులు కొమ్మలకు పూస్తుంటాయి. కానీ ఈ చెట్టుకు ప్రధాన కాండం నుంచి పువ్వులు పూస్తుంటాయి. ఈ పువ్వులు చూసేందుకు అత్యంత అందంగా ఉంటాయి. సువాసన కూడా అద్భుతంగా వెదజల్లుతూ ఉంటాయి. రాత్రిపూట మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ఈ చెట్టు పండ్లు కూడా ఫిరంగుల మాదిరిగా ఉంటాయి వీటిని ఫిరంగి గుండ్లు అని పిలుస్తుంటారు. సైంటిఫిక్ భాషలో దీనిని కానన్ బాల్ ట్రీ అని పిలుస్తుంటారు.

సాంప్రదాయ ఔషధాలలో ఈ మొక్క పువ్వులు.. ఆకులు.. పండ్లను వాడుతుంటారు. నొప్పి నివారణకు.. ఫంగస్ నివారణకు.. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి దీని పండ్లను ఉపయోగిస్తుంటారు. చర్మానికి సంబంధించిన వ్యాధులు నివారణలో.. కడుపు నొప్పి.. జలుబు.. ఇతర రోగాలను నయం చేయడానికి దీనిని వాడుతారు. ఈ మొక్కను కుండీలలో పెంచుకోవచ్చు. అయితే శాశ్వతంగా పెంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది విపరీతమైన ఎత్తు పెరుగుతుంది. ఖాళీ ప్రదేశాలలో.. పండ్ల తోటలలో ఈ మొక్కను పెంచుకోవచ్చు.

2వ వారం అత్యధిక వసూళ్లను రాబట్టిన టాలీవుడ్ సినిమాలు ఇవే.. నిరాశపర్చిన 'పెద్ది'..

Tollywood Box Office Collection
Tollywood Box Office Collection

Tollywood Box Office Collections: ప్రస్తుత ఓటీటీ యుగంలో ఒక సూపర్ హిట్ సినిమా వీకెండ్ దాటి మామూలు వర్కింగ్ డేస్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకోవడం అంటే అద్భుతం అనే చెప్పాలి. కానీ కొన్ని సినిమాలు మాత్రం 2 వ వారం లో కూడా భారీ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాయి. అందులో రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం కూడా ఉంది. ఈ సినిమాకు రెండవ వారం లో మంచి వసూళ్లే వచ్చాయి కానీ , ఊహించిన వసూళ్లు మాత్రం రాలేదు. 20 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వస్తుందని ఆశించారు. కానీ తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి కేవలం 18 కోట్ల రూపాయిలు మాత్రమే నమోదైంది. అయితే ‘పెద్ది’ తో పాటు , రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలకు మరియు సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రాలకు రెండవ వారం ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది చూద్దాం.

ముందుగా మనం #RRR గురించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రానికి 2 వ వారం లో తెలుగు రాష్ట్రాల నుండి 61 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాతి స్థానం లో ‘బాహుబలి 2’ చిత్రం నిల్చింది. 7 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాకు 2 వ వారం లో తెలుగు రాష్ట్రాల నుండి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రానికి 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అవ్వగా, కల్కి చిత్రానికి 32 కోట్లు , సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి 28 కోట్లు , హనుమాన్ చిత్రానికి 27 కోట్లు , వాల్తేరు వీరయ్య చిత్రానికి 24 కోట్లు , మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి.

అదే విధంగా గత ఏడాది విడుదలైన ‘దేవర’ చిత్రానికి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రెండవ వారం లో నమోదు అవ్వగా, ప్రభాస్ ‘సలార్’ చిత్రానికి 19 కోట్లు , పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి 18 కోట్లు వచ్చాయి. ‘పెద్ది’ చిత్రానికి ఉన్నటువంటి ట్రెండ్ ని చూసి 20 కోట్ల రూపాయలకు పైగా కచ్చితంగా వస్తుందని అనుకున్నారు , ఆదిమవారం రోజున మంచి వసూళ్లు వచ్చాయి, శనివారం రోజున కాస్త వసూళ్లు తగ్గాయి, ఆ కారణం చేతనే ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా పైన చెప్పిన చిత్రాలన్నిటికీ ఫెస్టివల్ హాలిడేస్ బాగా కలిసొచ్చాయి , కానీ పెద్ది చిత్రానికి ఒక్క హాలిడే కూడా కలిసి రాలేదు , అందుకే ఈ సినిమాకు రెండవ వారంలో ఊహించిన వసూళ్లు రాలేదని అంటున్నారు.

కనీవినీ ఎరుగని రీతిలో 'పంజా' రీ రిలీజ్.. పవన్ కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ లేదు..

Panjaa Re Release
Panjaa Re Release

Panjaa Re Release: ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఏ రేంజ్ లో చేస్తారో అందరికీ తెలిసిందే. సేవాకార్యక్రమాలు , కేక్ కట్టింగ్స్ వంటి వాటితో పాటు , ఈమధ్య మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ లో , తమ అభిమాన హీరోకి సంబంధించిన కల్ట్ క్లాసిక్ చిత్రాలను లేటెస్ట్ టెక్నాలజీ కి మార్చి , గ్రాండ్ పద్దితిలో విడుదల చేసి థియేటర్స్ లో సంబరాలు చేసుకోవడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలవాటు అయిపోయింది. అలా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన రీ రిలీజ్ చిత్రాల్లో జల్సా, ఖుషి , గబ్బర్ సింగ్ చిత్రాలు ఆల్ టైం రికార్డ్స్ ని కొల్పాయి. ఆ స్థాయిలో ఈ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘పంజా’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫ్యాన్స్.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రమిది. ఆరోజుల్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు, కానీ నేటి తరం ఆడియన్స్ కి ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ హీరో తరహా లుక్స్ తో , ఎంతో స్టైలిష్ గా , పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో అద్భుతంగా నటించాడు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ‘ఓజీ’ కంటే , ఈ సినిమానే అద్భుతంగా ఉంటుందనే అభిమానులు చాలా మంది ఉన్నారు. మూవీ లవర్స్ లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ సినిమాని వేరే లెవెల్ లో ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని కైలాష్ ఫిలిమ్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది.

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని సెన్సార్ చేయించారు. రేపటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ఈ ట్రైలర్ సెప్టెంబర్ 1 వరకు ప్రదర్శితం కానుంది. అంతే కాదు , సెకండ్ హాఫ్ ని రీ ఎడిటింగ్ కూడా చేయబోతున్నారట. ప్రతీ థియేటర్ లోను ఈ చిత్రానికి సంబంధించిన స్టాండీస్ ని పంపుతారట. అంతే కాకుండా ఇంటర్వూస్ కూడా ఇస్తారట మేకర్స్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మూవీ టీం తో గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారట, రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా కటౌట్ లాంచ్ ఈవెంట్స్ ని కూడా ఏర్పాటు చేస్తారట. ఈ రేంజ్ ప్లానింగ్ ఈమధ్య కాలంలో విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా జరగలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అనిల్ రావిపూడి - వెంకటేష్ - కళ్యాణ్ రామ్ కాంబోలో వచ్చే మూవీ స్టోరీ ఏంటి ఆ సినిమా కథల ఉంది...

Anil Ravipudi And Kalyan Ram
Anil Ravipudi And Kalyan Ram

Anil Ravipudi Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు వరుసగా తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడా లేకుండా వరసగా సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇక ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన ముహూర్తం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కి జోడిగా కృతి శెట్టి నటిస్తుండటం విశేషం… ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు హీరోలుగా చేసిన ‘ఈడోరకం ఆదోరకం ‘ అనే సినిమా లైన్ ను తీసుకొని ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ కథ కూడా కన్ఫ్యూజన్ డ్రామా గా తెరకెక్కుతుందట. అందులోనే ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే ఎలివేషన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అనిల్ రావిపూడి అంటే కామెడీకి పెద్ద పీట వేస్తుంటాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా కామెడీ చాలా డిఫరెంట్ వేలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోసారి 2027 సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ సినిమాతో కూడా సక్సెస్ ను సాధిస్తే వరుసగా 10 విజయాలను సాధించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసినవాడవుతాడు…

టీఆర్ఎస్ లోకి కేసీఆర్..

Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha: శీర్షిక చదివి ఆశ్చర్యపోతున్నారా.. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కదా.. మళ్లీ ఆయన ఆ పార్టీలోకి వెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారు కదూ.. కానీ టిఆర్ఎస్ ఇప్పుడు కేసీఆర్ ది కాదు.. కెసిఆర్ ఆల్రెడీ ఆ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దేశంలో చక్రాలు తిప్పడానికి ఆయన అప్పట్లో అనేక రకాలుగా అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. దేశంలో గత్తర లేపడానికి సిద్ధమయ్యారు. కానీ అది అంత ఈజీ కాలేదు.

చివరికి కేసీఆర్ నాటి ఎన్నికల్లో కామారెడ్డి స్థానం నుంచి ఓడిపోయారు. ఆయన పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలను చవి చూసింది. ఒక స్థానంలో కూడా విజయం సాధించకుండా పరువు తీసుకుంది.. అయినప్పటికీ సోషల్ మీడియాలోనే ఆ పార్టీ మాత్రమే బలంగా ఉంది. కేటీఆర్, హరీష్ రావు వంటి వారు సోషల్ మీడియాలో.. మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఆశాజనకంగా లేవు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్ల తర్వాత గులాబీ పార్టీకి కవిత రూపంలో ఉపద్రవం వచ్చింది. ఆమె పార్టీ లో తన స్థానం గురించి అడిగినందుకు.. ఏకంగా ఆమెను బయటికి పంపించారు. దీంతో ఆమె తెలంగాణ రక్షణ సేన పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లపాటు కేసీఆర్ కు పేటెంట్ రైట్ లాగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఆమె లాక్కున్నారు. దీనిపై గులాబీ పార్టీ నేతలు కోర్టు దాకా వెళ్లారు. చివరికి ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. ఏం చేసినా సరే తెలంగాణ రక్షణ సేన అలియాస్ టిఆర్ఎస్ పేరు కవిత దగ్గర మాత్రమే ఉండేలా కనిపిస్తోంది.

కవిత కూడా టిఆర్ఎస్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక జాతీయ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఓపెన్ గానే మాట్లాడారు. ముఖ్యంగా టిఆర్ఎస్ విషయంలో క్లారిటీగా చెప్పేశారు. తాను భారత రాష్ట్ర సమితిలోకి వెళ్ళేది లేదని.. జీవితానికి సరిపడా అవమానాలు ఆ పార్టీలో తనకు ఎదురయ్యాయని.. ఒకవేళ కెసిఆర్ భారత రాష్ట్ర సమితి నుంచి టిఆర్ఎస్ లోకి వస్తానని చెబితే కచ్చితంగా సాదరంగా ఆహ్వానం పలుకుతామని కవిత అన్నారు. టిఆర్ఎస్ పార్టీ పేరును పోగొట్టుకునే విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి తన తండ్రి కంటే తాను జగ మొండి అని కవిత స్పష్టం చేశారు. ఇప్పుడు ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి ఈ కుటుంబం మధ్య టిఆర్ఎస్ పేటెంట్ వ్యవహారం ఏ స్థాయిలో మంట పెడుతుందో చూడాల్సి ఉంది.

అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్రాస్ ని దాటేసిన సమంత 'మా ఇంటి బంగారం'..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Maa Inti Bangaram Advance Bookings: సమంత ని ట్రేడ్ విశ్లేషకులంతా ఓవర్సీస్ క్వీన్ అని మొదటి నుండి అంటూ ఉంటారు. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా నటించిన ప్రతీ సినిమా దాదాపుగా ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పాయి. అలా అక్కడి ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది చాలా తక్కువే, అయినప్పటికీ కూడా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసినప్పుడల్లా ఓవర్సీస్ ఆడియన్స్ మినిమం గ్యారంటీ ఓపెనింగ్ ఇస్తున్నారు. సమంత రేంజ్ ఏంటో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులను పెట్టి , ఆమె ‘శుభం’ అనే చిత్రం చేసింది. ఇలాంటి సినిమాలకు కనీస స్థాయి వసూళ్లు రావడం కూడా కష్టం, అలాంటిది సమంత బ్రాండ్ ఇమేజ్ మీద ఈ చిత్రం ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అయ్యి , భారీ లాభాలను కూడా సొంతం చేసుకుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం చేసింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రం గా తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ ప్రీమియర్ షోస్ కాసేపట్లోనే మొదలు కాబోతున్నాయి. అక్కడి ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 3 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కంటే ఎక్కువ. పవన్ కళ్యాణ్ కి అత్యంత అవమానకరమైన ప్రీమియర్ గ్రాస్ ఇది. దాన్ని సమంత అవలీలగా లేపేసిందంటే ఆమె బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి.

బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 2 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇది చాలా డీసెంట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్నటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే , ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. పాజిటివ్ టాక్ వస్తే , ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టొచ్చు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత నిర్మాతగా వ్యవహరించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. మరోపక్క సమంత కూడా నాన్ స్టాప్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా గడిపింది. చూడాలి మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు అలరిస్తుంది అనేది.

రీ రిలీజ్ కి సిద్దమైన మంచు విష్ణు 'కన్నప్ప'.. ఈసారి బిజినెస్ టార్గెట్ ఎంతంటే..

Kannappa Re Release
Kannappa Re Release

Kannappa Re Release: టాలీవుడ్ లో మళ్లీ రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది, ఎక్సిభిటర్స్ థియేటర్స్ ని మూయకుండా ఉండాలంటే, కచ్చితంగా మనీ రొటేషన్ ఉండాలి. కానీ అక్కడ చూస్తే కొత్త సినిమాలు లేవు. రేపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం విడుదల కాబోతుంది. రేపు ఒక్క రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు రావొచ్చు , టాక్ బాగుంటే వీకెండ్ వరకు కూడా ఆ జోరు కొనసాగొచ్చు , కానీ ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం నిలబడడం కష్టం. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు ఈ నెల 26 నుండి వరుసగా విడుదల కాబోతున్నాయి. 26 న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు ఒక్కడు చిత్రాలు రీ రిలీజ్ కాబోతున్నాయి.

ఈ రెండు సినిమాలు విడుదలైన మరుసటి రోజే మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ కాబోతుంది. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తూ , నటించిన సినిమా ఇది. ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఇంతటి భారీ హంగులు , ఆర్భాటాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని భాషలకు కలిపి 50 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు , 23 కోట్ల రూపాయిల రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టింది. కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనుకోవచ్చు. కానీ మంచు విష్ణు మార్కెట్ కి అది చాలా ఎక్కువ కలెక్షన్స్. అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు ఈ నెల 27 న విడుదల చేయబోతున్నారు.

ఈ రీ రిలీజ్ ద్వారా కనీసం 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఆశిస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోలకు సైతం ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు ఒక రీ రిలీజ్ కి నమోదు అవ్వడం చాలా కష్టం ఈ రోజుల్లో , అలాంటిది మంచి విష్ణు సినిమాకు 3 కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ సహకరిస్తే ఇది సాధ్యం అవ్వొచ్చు , కానీ ప్రస్తుతానికి అది సాధ్యం అయ్యేలా లేదు , ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాని ప్రోత్సహించే మూడ్ లో లేరు , చూడాలి మరి ఈ చిత్రం రీ రిలీజ్ లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుంది అనేది.

అమెరికా-ఇరాన్ వార్: ఇంతకీ గెలిచిందెవరు ఓడిందెవరు

America Iran War Analysis
America Iran War Analysis

America Iran War Analysis: రక్తపుటేరులు పారుతుంటే.. మాంసం వ్యాపారులకు గిరాకీ ఉంటుంది. ఆ ఏరులు అలాగే పారాలి అని వ్యాపారులు అనుకుంటారు. ఇది ఒక ఆఫ్రికన్ సామెత.. ఇప్పటి నవీన కాలానికి ఇది నూటికి నూరు శాతం సరిపోతుంది. దీనిని అలా చేసింది అమెరికా.. అగ్రరాజ్యంగా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్న అమెరికా.. ప్రతిసారి ఏదో ఒక పెంట చేయడం.. దానిని ప్రపంచం మీద రుద్దడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల మిగతా దేశాలు నరకం చూస్తున్నాయి. ధరలు పెరగడం.. ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోవడం.. ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇంత జరిగినప్పటికీ అమెరికాకు బుద్ధి రావడం లేదు. బుద్ధి తెచ్చుకోవడం లేదు.

అధ్యక్షులు మాత్రమే మారుతున్నారు

అమెరికా తీరు ఎలా ఉందంటే.. ప్రతిసారి అధ్యక్షుడు మారినప్పుడు.. అమెరికా చేస్తున్న యుద్ధ తీవ్రత మారుతుంది. బిల్ క్లింటన్, బుష్, ఒబామా, ట్రంప్, బైడన్, ట్రంప్.. ఇలా ప్రతి సందర్భంలో అమెరికా ఇతర దేశాల మీద యుద్ధాలు చేయడం.. యుద్దాల పేరుతో ఆయుధాల వ్యాపారాలు చేయడం అలవాటుగా మార్చుకుంది. ఒక అవసరాన్ని సృష్టించడం.. దానికోసం ఒత్తిడి తీసుకురావడం.. అవసరం తీరే విధంగా తానే ఏర్పాట్లు చేయడం.. ఇలా త్రిపద సిద్ధాంతాన్ని అమెరికా అమలు చేస్తోంది. దండిగా సంపాదించుకుంటున్నది.

తాజా ఇరాన్ యుద్ధంలో అమెరికాకు సంబంధం లేదు. అసలు అమెరికా వేలు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం న్యూక్లియర్ వెపన్స్ పేరుతో అమెరికా ఇందులోకి ప్రవేశించింది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ చేస్తుంది అనే అంశం మీద ఇప్పటికీ అమెరికాకు ఒక క్లారిటీ లేదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తోంది అనే విషయాన్ని కూడా ఇంతవరకు బయట పెట్టలేకపోయింది. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ వద్ద ఉందని అమెరికా అనేక సందర్భాల్లో ఆరోపించినప్పటికీ.. అది ఆరోపణగానే మిగిలిపోయింది. నిజానికి చైనా.. ఉత్తరకొరియా.. పాకిస్తాన్.. వంటి దేశాల మధ్య న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాటి జోలికి అమెరికా వెళ్లదు. పైగా ఇటీవల ట్రంప్ చైనా వెళ్ళినప్పుడు.. దారుణమైన అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి చైనా ఇచ్చిన బహుమతులను కూడా అనుమానంతో బయట పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇజ్రాయిల్ ఒత్తిడి వల్ల ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేసింది. అయితే ఆ తర్వాత ఇజ్రాయిల్ తెలివిగా పక్కకు తప్పుకుంది. దీంతో అమెరికా యుద్ధం చేయాల్సి వచ్చింది. భారీగా నష్టపోవాల్సి వచ్చింది.. అంతేకాదు ఇప్పుడు ఇరాన్ పెట్టిన ప్రతి కండిషన్ కు అమెరికా ఒప్పుకోవాల్సి వచ్చింది.. వాస్తవానికి ఇరాన్ దేశానికి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని అమెరికా చెప్పినప్పటికీ.. 14 షరతుల జాబితాలో 300 బిలియన్ డాలర్లు ఇరాన్ దేశానికి అమెరికా ఇవ్వాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.. మరోవైపు హార్మోజ్ సంధిని 60 రోజులపాటు తెరిచి ఉంచుతామని ఇరాన్ చెబుతోంది.

ఇరాన్ పట్టుబట్టిన ప్రతి అంశానికి అమెరికా ఓకే చెప్పింది. అలాంటప్పుడు ఈ యుద్ధంలో అగ్రరాజ్యం సాధించింది ఏముందని వార్తలు వస్తున్నాయి. హర్ముజ్ జల సంధిని మూసివేయడం.. తెరిపించడం మాత్రమే ట్రంప్ సాధించిన అచీవ్మెంట్. అంతకుమించి అమెరికాకు ఒరిగింది ఏమీ లేదు.