Political Scandals : ఒక మనిషిని గెలవాలంటే నేరుగా తలపడాలి. యుద్ధక్షేత్రంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ముందుగా మన సత్తా ఏమిటో చూపించాలి. అలాకాకుండా వెన్నుపోటు పొడిచి.. దొడ్డి దారి ప్రణాళికలు రూపొందిస్తే దానిని యుద్ధ రీతి అనరు. ఇటువంటి విధానాన్ని అమలు చేసిన ఓ రాజకీయ నాయకుడు ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. విపరీతమైన విమర్శలను చవిచూస్తున్నాడు. తట్టుకోలేక రాష్ట్రానికి దూరంగా ఉంటున్నాడు.
ఆ రాజకీయ నాయకుడికి బలమైన నేపథ్యం ఉంది. ఆయన తండ్రి మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆ నాయకుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఉంది. ఆ నియోజకవర్గ ప్రజలు దీవించారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మరోసారి ఆయన గెలవాలంటే గొప్ప పనులు చేయాలి. ప్రజల మనసులో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలి. అవసరమైతే తనకు శత్రుత్వం అనేది లేకుండా.. ప్రత్యర్థి అనే వ్యక్తి ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే ముందుగా ఆ రాజకీయ నాయకుడిలో మంచితనం ఉండాలి. కానీ ఎమ్మెల్యే గా గెలిచిన ఆ నాయకుడిలో మంచితనం అనేది లేకుండా పోయింది. ముంచేతనం అనేది పెరిగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా తనకు ప్రత్యర్థిగా ఉన్న ఒక మహిళపై పైశాచికత్వాన్ని ప్రదర్శించిన తీరు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది.
ఆమె ఉన్నత విద్యావంతురాలు. తన నియోజకవర్గానికి సేవ చేయడానికి రాజకీయాలలోకి వచ్చారు. అంతేకాదు సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేశారు. డబ్బు కూడా భారీగా ఖర్చు పెట్టారు. ఆమె భర్త కూడా ఇందుకు సహకరించారు. అయితే ఆమెకే టికెట్ అనుకుంటున్న క్రమంలో.. ఊహించిన విధంగా పొత్తు ఏర్పడింది.. దీంతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా భాగస్వామ్య పార్టీకి సపోర్టు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆమెకు ఎమ్మెల్యే యోగ్యం దక్కలేదు. సరే తమతో పొత్తు కుదుర్చుకున్న పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని ఆమె గొప్పగా చెప్పుకుంది. అంతేకాదు అధికారంలోకి తమ పార్టీ భాగస్వామిగా ఉన్న సమూహం రావడంతో ఆనందపడింది. కానీ ఇక్కడే ఆమె ఆనందం ఆవిరైంది. దానికి ప్రధాన కారణం ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నే.
ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ నాయకుడి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి తనకు రాజకీయ శత్రుత్వం ఉండకూడదని ఆయన భావించాడు. అందువల్లే తమ సమూహంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకురాలికి అసలు రాజకీయ జీవితంలో లేకుండా చేయాలని అనుకున్నాడు. ఆమె దగ్గర పని చేస్తున్న ఒక వ్యక్తిని దగ్గరికి తీసుకున్నాడు. డబ్బు ఆశ చూపించాడు. అయితే ఆ నాయకురాలికి మరొక వ్యక్తితో సంబంధం ఉండేది. ఇదే అదునుగా భావించిన ఆ ఎమ్మెల్యే ఆ నాయకురాలి వద్ద పనిచేస్తున్న వ్యక్తితో చేయకూడని కార్యక్రమాలు చేయించాడు. ఆ నాయకురాలు పడకగదిలో సీసీ కెమెరాలు పెట్టించాడు.. దీంతో ఆ నాయకురాలు తన ప్రియుడితో సాగించే సరసాలు అందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియోలు మొత్తం కూడా ఆ వ్యక్తి సదరు ఎమ్మెల్యేకు పంపించాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని సదరు నాయకురాలిని బెదిరించేందుకు ఆ ఎమ్మెల్యే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ ఇంతలోనే ఆ నాయకురాలు తన వద్ద పనిచేసే వ్యక్తి వీడియోలు పంపిస్తుండగా చూసింది.. ఆ తర్వాత ఈ విషయాన్ని తన భర్తకు వేరే విధంగా చెప్పింది. దీంతో ఆమె భర్త.. తన అనుచరులతో కలిసి ఓ ప్రణాళిక రూపొందించాడు. అంతేకాదు తమ వద్ద పనిచేస్తున్న ఆ వ్యక్తిని అంతం చేశాడు. ఈ వ్యవహారంలో అతడు ప్రస్తుతం జైల్లో ఉంటున్నాడు. ఆవుల మంద పోట్లాడుకుంటే దూడల కాళ్ళు విరిగినట్టు.. ఎమ్మెల్యే, ఓ నాయకురాలు మధ్య ఏర్పడిన వివాదం చివరికి ఒక మనిషి ప్రాణం పోవడానికి కారణమైంది. అతని కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళను చేసింది. అందుకే సాధ్యమైనంతవరకు పెద్దల వ్యవహారాలలో వేలు పెట్టకపోవడమే మంచిది.