Bengaluru: జలగలు ఆకలిగా ఉంటేనే ఎదుటి జంతువు మీదకు వెళ్తుంటాయి. అవసరానికి తగ్గట్టుగానే రక్తాన్ని పీలుస్తాయి. ఒక్కసారి కడుపు నిండిందా.. ఆ జంతువు నుంచి దూరంగా వెళ్లిపోతాయి. కానీ కొంతమంది మనుషులు జలగల కంటే హీనం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పినట్టు బాత్ రూం కమోడ్ మీద ఉండే పురుగుల కంటే దారుణం.. వాస్తవానికి ఈ మనుషులను జలగలు, ఆ తరహా పురుగులతో పోల్చవద్దు. ఎందుకంటే అవి బాధపడతాయి కాబట్టి..
Also Read: సెంచరీ కొట్టినా నో సెలబ్రేషన్స్.. గెలిచేదాకా పోరాటం.. జెమీమా పట్టుదలకు సలాం
వాస్తవానికి ఒక వ్యక్తి బాధలో ఉంటే.. సాటి మనుషులుగా మనం ప్రేమ చూపించాలి. సానుభూతి ప్రదర్శించాలి. అవసరమైతే మన వంతుగా సహాయం చేయాలి. అప్పుడే సాటి మనుషులుగా మన పుట్టుకకు ఎంతో కొంత సార్ధకత ఉంటుంది. కానీ కొంతమంది అలా కాదు.. సాటి మనుషులు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే.. రాక్షసానందం పొందుతుంటారు. ఒక రకంగా స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య మాదిరిగా వ్యవహరిస్తుంటారు. అలాంటి సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యువతీ తండ్రికి నరకం కనిపించింది.
ఆ వ్యక్తి పేరు శివకుమార్. బిపిసిఎల్ లో ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు 34 సంవత్సరాల కూతురు ఉంది. ఇటీవల ఆమె మరణించింది. ఆ సమయంలో ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్లడానికి డ్రైవర్ లంచం అడిగాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు డబ్బులు అడిగారు.. పోస్టుమార్టం నివేదిక ఇవ్వడానికి వైద్యులు కూడా డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి స్మశాన వాటికలో ఆ యువతి మృతదేహాన్ని దహనం చేయడానికి కూడా సిబ్బంది విపరీతంగా డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాలను శివకుమార్ లింక్డ్ ఇన్ లో పేర్కొన్నారు. తన ఆవేదనను మొత్తం అందులో వ్యక్తం చేశారు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి.. ఇదంతా చేశానని.. డబ్బులు లేని వారి పరిస్థితి ఏమిటని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా చూసుకుంటే బెంగళూరు నగరాన్ని నారాయణమూర్తి, అజీమ్ ప్రేమ్ జీ, కిరణ్ మజుందార్ రక్షించే బాధ్యత తీసుకోవాలని కోరాడు. అంతేకాదు లంచాలు వసూలు చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.