Jagan Stay In Bengaluru: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) పూర్తిగా రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. ఏదో ఏపీలో ఉన్నానంటే ఉన్నాను అన్నట్టు ఉన్నారు. బెంగళూరులో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపించింది. వీలైనంతవరకూ ఆయన బెంగళూరులోనే గడిపేందుకు ఇష్టపడుతున్నారు. రాజకీయాల్లోకి రాకముందు బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు మొదలుపెట్టారు. దీంతో అక్కడ స్థిరాస్తులు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరుకి ఎక్కువగా అలవాటు పడ్డారు కూడా. రాజకీయంగా కలిసి వచ్చిన రోజుల్లో బెంగళూరు వైపు వెళ్లేవారు కాదు కానీ.. ఎప్పుడైతే తెలంగాణలో కెసిఆర్ అధికారానికి దూరమయ్యారో.. ఏపీలో తాను ఓడిపోయిన తరువాత బెంగళూరు మకాం మార్చారు. హైదరాబాద్ వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. సొంత రాష్ట్రంలో ఉండడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు.
* రాజకీయాల్లోకి రాకముందు..
రాజకీయాల్లోకి రాక మునుపు బెంగళూరులోనే( Bangalore) ఎక్కువగా ఉండేవారట జగన్మోహన్ రెడ్డి. అయితే కడప ఎంపీ అయిన తర్వాత హైదరాబాద్కు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదులో తన కార్యకలాపాలను విస్తరించారు. జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండే లోటస్ పాండ్ ల్యాండ్ మార్క్ అయింది. ఏపీ విభజన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో తాడేపల్లికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. సొంత ఇంటిని నిర్మించుకోవాల్సి వచ్చింది. 2014-19 మధ్య మాత్రం కెసిఆర్ అధికారంలో ఉండడంతో.. తన ఆత్మీయ మిత్రుడు కావడంతో హైదరాబాదులో ఉండేందుకు ఆసక్తి చూపించారని అర్థమవుతోంది.
* అప్పట్లో తాడేపల్లికి పరిమితం..
జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో మాత్రం ఇతర ప్రాంతాల వైపు ఆయన చూడలేదు. పూర్తిగా తాడేపల్లికి( Tadepalli) పరిమితం అయ్యారు. ఆ ఐదేళ్లపాటు హైదరాబాద్ కానీ.. బెంగళూరు కానీ పేర్లు వినిపించేవి కావు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ దంపతులు ఎక్కువగా బెంగళూరు వెళ్లి వస్తున్నారు. దానినే హైలెట్ చేస్తోంది టిడిపి సోషల్ మీడియా. వారంలో రెండు మూడు రోజులు తాడేపల్లిలో, మిగిలిన కాలమంతా బెంగళూరులో జగన్ గడుపుతుండడం విశేషం. దీనినే ఇప్పుడు హైలెట్ చేస్తోంది టిడిపి. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ విషయంలో ఇలాంటి ప్రచారమే చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే తరహా ప్రచారానికి దిగడం విశేషం.