Homeవింతలు-విశేషాలుSocial Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం ఆక్రమించిన తర్వాత.. సోషల్ మీడియా చుట్టూ జీవితం తిరుగుతున్న తర్వాత సాటి మనుషులతో మాట్లాడాలని.. సాధక బాధకాలు పంచుకోవాలని ఎందుకు అనిపిస్తుంది.. అందువల్లే చాలామంది ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఏకాకి లాగా జీవిస్తున్నారు. ఇటువంటి కాలంలోనే కొత్తకొత్త వ్యాపారాలు తెర […]

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం ఆక్రమించిన తర్వాత.. సోషల్ మీడియా చుట్టూ జీవితం తిరుగుతున్న తర్వాత సాటి మనుషులతో మాట్లాడాలని.. సాధక బాధకాలు పంచుకోవాలని ఎందుకు అనిపిస్తుంది.. అందువల్లే చాలామంది ఒంటరిగా ఉంటున్నారు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఏకాకి లాగా జీవిస్తున్నారు.

ఇటువంటి కాలంలోనే కొత్తకొత్త వ్యాపారాలు తెర మీదకి వస్తున్నాయి. అలాంటి వ్యాపారాలలో ఇది చాలా భిన్నమైనది . రూపాయి పెట్టుబడి లేదు. భారీగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ దీనికి పట్టిన పేరు రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్.. ఎవరో మాట్లాడతారని.. ఎవరో కబుర్లు చెప్తారని ఎదురు చూడకుండా.. గంటకు ఇంతని ఇస్తే చాలు.. తోడు దొరుకుతుంది.. మాట.. మంతి లభిస్తుంది.

ఈ ఆలోచన జపాన్ దేశంలో పుట్టింది. అక్కడ వివిధ వేడుకలకు తోడుగా వచ్చే వ్యక్తులు.. మాట్లాడుతుంటే వినేవాళ్లు.. చెబుతుంటే వినేవాళ్లు.. దానికి అక్కడ రెంటల్ పర్సన్ అనే పేరు పెట్టారు. ఆ సేవలు చాలా సంవత్సరాలుగా జపాన్ దేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత కాలంలో ఇవి రెంటల్ బాయ్ ఫ్రెండ్.. రెంటల్ ఏ గర్ల్ ఫ్రెండ్ లాగా మారిపోయాయి. అయితే ఈ సేవలు మొత్తం సజావుగానే సాగుతాయి. ఎక్కడ కూడా ఇతర ఉద్దేశానికి అవకాశం లేదు. మరోవైపు ఇలా వచ్చేవారు ప్రైవేట్ ప్రదేశాలలో కలవడానికి అవకాశం ఉండదు. వ్యక్తిగత సమాధానాలు పెట్టుకోవడానికి ఆసక్తి ఉండదు. జనం బాగా ఉన్న ప్రదేశాలలో కలుసుకుంటారు. కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. షాపింగ్ వెళ్తూ ముచ్చట్లు పెట్టుకుంటారు. సినిమాలు చూస్తూ పెదవులు కదుపుతుంటారు.

ఇక మనదేశంలో అనేకరకాల సామాజిక మాధ్యమాల వేదికల ద్వారా ఇటువంటి సేవలు అందుబాటులోకి వచ్చేసాయి. మెడికల్ సపోర్ట్.. షాపింగ్ బడ్డీ.. మూవీ పార్ట్నర్.. హ్యాంగ్ అవుట్ కంపానియన్ అనే పేరుతో గంటకు కొంత అమౌంట్ తీసుకొని.. సేవలందిస్తున్నారు. మనదేశంలో పెద్దపెద్ద నగరాలలో చాలామంది ఒంటరిగానే ఉంటున్నారు. ఒక తోడు లేకుండా జీవిస్తున్నారు. కనీసం మాట కూడా మాట్లాడేవారు లేక నిరాశగా ఉంటున్నారు. అటువంటి వారికి ఈ సేవలు ఉపయుక్తంగా ఉంటున్నాయి. అయితే ఇందులో ఎటువంటి చెడు లేదు. అందువల్లే ఈ సేవలు పొందే వారి సంఖ్య.. అందించే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే అవసరాన్ని బట్టి డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper