Foreign girl praises India: మనదేశంలో జీవనం బాగుంటుంది. స్వేచ్ఛాయుత వాతావరణం లో మనుషులు సాగించే జీవితం అంతకంటే బాగుంటుంది. ప్రపంచం మొత్తం యుద్ధాలు.. రకరకాల దాడులతో సతమతమవుతుంటే.. మన దేశం మాత్రం శాంతియుతంగా ఉంది. స్వేచ్ఛాయుతంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉంది. ఎక్కడ గొడవలు లేవు. ఎటువంటి ఇబ్బందులూ లేవు.
అందువల్లే భారతదేశాన్ని సందర్శించడానికి విపరీతంగా విదేశీయులు వస్తున్నారు. గతంతో పోటీ చూస్తే మన దేశంలో పర్యాటకంగా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు విదేశీ ప్రాంతాలకు చెందినవారు భారీగా వస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్స్పోజర్ పెరగడంతో చాలామంది మన దేశంలో ఉన్న టూరిస్ట్ ప్రాంతాలను ప్రపంచానికి తెలియజేయడానికి రకరకాల వీడియోలు తీస్తున్నారు. వాటిని ప్రపంచానికి తమదైన శైలిలో చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మన దేశానికి వచ్చే విదేశీ టూరిస్టులలో పోర్చుగీసు ప్రాంతానికి చెందినవారు కూడా ఉన్నారు. ఆ దేశాన్ని చెందిన ఒక ఔత్సాహిక ఫారినర్ మనదేశంలో పర్యటించింది. ఇక్కడి అతిధి మర్యాదలకు ఫిదా అయింది. అన్నిటికంటే ముఖ్యంగా మన దేశంలో లభించే ఔషధాల ద్వారా చూసి ముక్కున వేలేసుకుంది.. ఆ విదేశీ యువతికి ఇటీవల దగ్గు ఎక్కువైంది. దీంతో సమీపంలో ఉన్న ఒక ఔషధాల దుకాణానికి వెళ్ళింది. ఇక్కడ ఆమె ఒక కాఫ్ సిరప్.. గొంతులో దురదను తగ్గించడానికి మాత్రలను కొనుగోలు చేసింది. వాటికి మొత్తం 252 రూపాయలు మాత్రమే అయింది. 252 కరెన్సీలో రెండు యూరోలకు సమానం. అంత తక్కువ వరకు ఔషధాలు లభించడం పట్ల ఆ యువతి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇంత తక్కువ స్థాయిలో ధరలు ఉంటే తాను ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాను అని ఆ యువతి చెప్పింది.
ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. లక్షలాది వీక్షణలను ఈ వీడియో సొంతం చేసుకుంది. సాధారణంగా ఔషధాలు ఇతర దేశాలలో విపరీతమైన ధరతో కూడుకొని ఉంటాయి. పైగా అక్కడ నేరుగా వెళ్తే ఔషధాలు ఇవ్వడానికి ఉండదు. రకరకాల పద్ధతులు పాటించిన తర్వాతనే అక్కడ ఔషధాలు ఇస్తారు. కానీ మనదేశంలో ఇలాంటి నిబంధనలు ఉండవు. ఔషధాలకు ఆస్థాయిలో ధర కూడా ఉండదు. అందువల్లే ఆ విదేశీ యువతికి మనదేశంలో ఔషధాలు లభ్యమవుతున్న తీరు.. వాటికి కంపెనీలు స్వీకరిస్తున్న ధర ఆశ్చర్యంగా అనిపించింది.
View this post on Instagram