Homeవింతలు-విశేషాలుEthiopia Traditional Belly Contest: ఇది మామూలు పోటీ కాదు..పొట్ట పెంచినోడే మొగోడు..

Ethiopia Traditional Belly Contest: ఇది మామూలు పోటీ కాదు..పొట్ట పెంచినోడే మొగోడు..

Ethiopia Traditional Belly Contest: మనలో చాలామందికి పొట్ట ఉంటుంది. పొట్ట కాస్త పెరిగితే చాలు ఆందోళన మొదలవుతుంది. పెరిగిన పొట్టను ఎలా తగ్గించుకోవాలి.. ఆ కొవ్వును ఎలా కరిగించుకోవాలని చాలామంది ఆలోచిస్తుంటారు. జిమ్ లలో తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం చాలా దూరం నడిచి వస్తుంటారు. అప్పటికి తగ్గకపోతే ఆహార నియమాలు పాటిస్తారు. పొట్టను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఈ కాలంలో.. పొట్ట ఉంటే చాలు ప్రపంచాన్ని గెలిచినట్టు భావించే వారున్నారు. […]

Ethiopia Traditional Belly Contest: మనలో చాలామందికి పొట్ట ఉంటుంది. పొట్ట కాస్త పెరిగితే చాలు ఆందోళన మొదలవుతుంది. పెరిగిన పొట్టను ఎలా తగ్గించుకోవాలి.. ఆ కొవ్వును ఎలా కరిగించుకోవాలని చాలామంది ఆలోచిస్తుంటారు. జిమ్ లలో తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం చాలా దూరం నడిచి వస్తుంటారు. అప్పటికి తగ్గకపోతే ఆహార నియమాలు పాటిస్తారు.

పొట్టను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యే ఈ కాలంలో.. పొట్ట ఉంటే చాలు ప్రపంచాన్ని గెలిచినట్టు భావించే వారున్నారు. పైగా ఎంత పొట్ట పెరిగితే అంత స్థాయిలో వారికి గౌరవం లభిస్తుంది. అంతేకాదు ఇంకా అదనపు సౌలభ్యాలు కూడా వారికి అందుతాయి.

ఆఫ్రికాలోని ఇథియోపియాలో బోడి అనే తెగ నివసిస్తూ ఉంటుంది. వీరు సామూహిక జీవనం సాగిస్తూ ఉంటారు. వేట.. ఆహార ఉత్పత్తులను అమ్ముకోవడం వీరి ప్రధాన అలవాట్లు. వీరు పశువులను మేపుతూ ఉంటారు. పశువులను సాకడం గొప్ప అదృష్టంగా భావిస్తుంటారు. బోడి తెగలో ప్రతి ఏడాది పొట్ట పోటీలు జరుగుతుంటాయి. యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు ఏడాది వ్యవధిలో పొట్టను పెంచాల్సి ఉంటుంది. ఇలా భారీగా పొట్ట ఉన్న వ్యక్తి విజేతగా నిలుస్తాడు. ఇలా పొట్ట పెంచడానికి బోడి తెగవారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ఆవు మాంసాన్ని తింటుంటారు. ఆవును వధించి దాని ద్రవరూప కణజాలాన్ని తాగుతూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటారు. ముఖ్యంగా ఏడాదిలో విపరీతంగా మాంసాన్ని ఆరగిస్తూ ఉంటారు. అందులో ఆవు మాంసానికి విపరీతమైన ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత జరిగే పోటీలలో పాల్గొంటారు. ముందుగా పోటీలలో ఉన్న వారంతా పరుగు పందెంలో పాల్గొంటారు. ఆ తర్వాత పొట్ట పరిమాణాన్ని అంచనా వేసే పోటీలలో పాల్గొంటారు. అందులో ఎవరికి ఎక్కువ పొట్ట ఉంటే వారు విజేతగా నిలుస్తారు.

భారీ పొట్ట ఉన్న వారు ఆ ఏడాది మొత్తం ఛాంపియన్ గా గౌరవాన్ని అందుకుంటారు. కన్నెపిల్లలతో ఛాంపియన్ హాయిగా గడపవచ్చు. నచ్చితే వివాహం చేసుకోవచ్చు. నచ్చకపోతే వేరే యువతికి దగ్గర కావచ్చు. ఛాంపియన్ కు గౌరవ మర్యాదలు మాత్రమే కాకుండా.. ఇక అనేకం లభిస్తుంటాయి. అందువల్లే ఈ పోటీలలో పాల్గొనడానికి పెళ్లి కాని యువకులు విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper