Homeవింతలు-విశేషాలు102-year-old Woman Longevity Secrets: రోజూ మందు తాగుతుంది.. మాంసం తింటుంది.. ఈ బామ్మ 102...

102-year-old Woman Longevity Secrets: రోజూ మందు తాగుతుంది.. మాంసం తింటుంది.. ఈ బామ్మ 102 నాటౌట్..

102-year-old Woman Longevity Secrets: వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో చాలా వరకు మార్పులు వస్తాయి. చర్మం ముడుతలు పడుతుంది.. ఒకప్పటి మాదిరిగా ఉత్సాహం ఉండదు. నీరసం ఆవహిస్తూ ఉంటుంది. పని చేయడానికి శక్తి ఉండదు. ఎప్పటికీ విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. కొందరికి అయితే ఏజ్ పెరుగుతున్నా కూడా.. వారి శరీరం ఎప్పటిలాగే ఉంటుంది. ఇంకా చర్మం ముడతలు పడదు. పైగా మరింత యంగ్ గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా సాగిపోతుంటారు. వయసు […]

102-year-old Woman Longevity Secrets: వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో చాలా వరకు మార్పులు వస్తాయి. చర్మం ముడుతలు పడుతుంది.. ఒకప్పటి మాదిరిగా ఉత్సాహం ఉండదు. నీరసం ఆవహిస్తూ ఉంటుంది. పని చేయడానికి శక్తి ఉండదు. ఎప్పటికీ విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుంది. కొందరికి అయితే ఏజ్ పెరుగుతున్నా కూడా.. వారి శరీరం ఎప్పటిలాగే ఉంటుంది. ఇంకా చర్మం ముడతలు పడదు. పైగా మరింత యంగ్ గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా సాగిపోతుంటారు.

వయసు జరిగినప్పటికీ శరీరం ఉత్సాహంగా ఉండాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మాంసాహారాన్ని మానేస్తుంటారు. ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. సాధ్యమైనంతవరకు అన్నానికి దూరంగా ఉంటారు. ఫైబర్ ఫుడ్.. మల్టీ విటమిన్.. ప్రోటీన్.. లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు. సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్ లు పరిమితంగా తీసుకుంటారు.

చాలామంది యంగ్ గా కనిపించాలని అనేక రకాల కసరతులు చేస్తూ ఉంటారు. ఇష్టం ఉన్నప్పటికీ మద్యం తాగరు. మాంసాన్ని ముట్టరు. తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. యోగ.. జిమ్.. వంటివి చేస్తుంటారు. అందువల్లేవారు నిత్య యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు.

అయితే చైనా దేశానికి చెందిన జిన్ బావోలింగ్(102*) మహిళ చరిత్ర సృష్టించింది. ఎటువంటి ఆహార నియమాలు పాటించకుండానే.. శరీరానికి ఏ విధమైన ఇబ్బందులను పెట్టకుండానే సెంచరీ దాటేసింది. ఇప్పటికి అదే ఉత్సాహంతో కనిపిస్తోంది. చక్కటి జీవనశైలితో ఎక్కువ కాలం జీవిస్తారని సిద్ధాంతానికి ఆమె సవాల్ విసురుతోంది..

జిన్ వయసు 102 సంవత్సరాలు. ఆమె ప్రతిరోజు పంది మాంసం తింటుంది. కేక్స్ ఆరగిస్తుంది. బ్రెడ్లను అవలీలగా తినేస్తూ ఉంటుంది. బ్రౌన్ షుగర్ కలిపిన కాఫీ తాగుతుంది. అంతేకాదు సాయంత్రం పూట మందు కూడా తాగుతుంది. ప్రతిరోజు 15 గంటల పాటు నిద్ర పోతుంది. అరుదుగా మాత్రమే కూరగాయల భోజనం తింటుంది. ఇప్పటికీ ఆమె శారీరకంగా చాలా స్ట్రాంగ్. మానసికంగా విపరీతమైన ఫిట్. గడచిన 50 సంవత్సరాల లో ఆమె ఒక రోజు కూడా ఆసుపత్రి వెళ్లలేదు. కనీసం జలుబు కూడా చేయలేదు. పైగా తన పిల్లలతో.. వారి పిల్లలతో.. వారి వారి పిల్లలతో ముచ్చటిస్తూ ఉంటుంది. సరదాగా గడుతూ ఉంటుంది.

ఈ వృద్ధురాలు సోషల్ మీడియా కూడా చూస్తూ ఉంటుంది. దీనిని బట్టి ఆనందంగా జీవించడానికి ఎటువంటి ఆహార నియమాలు అవసరం లేదని.. జస్ట్ సంతోషంగా ఉంటే చాలని
.. పాజిటివ్ యాటిట్యూడ్ కొనసాగించాలని జిన్ నిరూపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper