Homeవింతలు-విశేషాలుIndian Wild Dog: పులులు కాదు.. సింహాలనూ ఈ కుక్కలు కంటపడితే వెంటపడి చంపేస్తాయ్..

Indian Wild Dog: పులులు కాదు.. సింహాలనూ ఈ కుక్కలు కంటపడితే వెంటపడి చంపేస్తాయ్..

Indian Wild Dog: మామూలుగా పులులు ఎలా ఉంటాయి.. ఇది కూడా ఒక క్వశ్చనేనా అనుకోకండి. అంతటి క్రూరమైన పులులను కూడా ఇవి ఒక్క వేటులో వేసేస్తాయి. సింహాలు అడవులకు మృగరాజులు. అవి కూడా వీటిని చూస్తే భయపడిపోతుంటాయి. భయపడ్డమే కాదు ఎదురుపడకుండా జాగ్రత్త పడతాయి. అడవి పందులు, హైనాలు, తోడేళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే క్రూరమైన జంతువుల నుంచి మొదలుపెడితే జింకల వరకు వీటిని చూస్తే చుచ్చు పోసుకుంటాయి. ఇంతకీ ఈ ప్రత్యేకమైన జంతువులు ఎక్కడున్నాయి.. […]

Indian Wild Dog: మామూలుగా పులులు ఎలా ఉంటాయి.. ఇది కూడా ఒక క్వశ్చనేనా అనుకోకండి. అంతటి క్రూరమైన పులులను కూడా ఇవి ఒక్క వేటులో వేసేస్తాయి. సింహాలు అడవులకు మృగరాజులు. అవి కూడా వీటిని చూస్తే భయపడిపోతుంటాయి. భయపడ్డమే కాదు ఎదురుపడకుండా జాగ్రత్త పడతాయి. అడవి పందులు, హైనాలు, తోడేళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే క్రూరమైన జంతువుల నుంచి మొదలుపెడితే జింకల వరకు వీటిని చూస్తే చుచ్చు పోసుకుంటాయి. ఇంతకీ ఈ ప్రత్యేకమైన జంతువులు ఎక్కడున్నాయి.. ఏ ప్రాంతంలో ఉన్నాయి.. అనేకదా మీ డౌటు.. అయితే చదివేయండి ఈ స్టోరీ..

సింహాల నుంచి మొదలు పెడితే జింకల వరకు.. పులుల నుంచి మొదలు పెడితే అడవి పందుల వరకు సింహ స్వప్నం లాగా నిలిచే ఆ జంతువుల పేరు రేచు కుక్కలు. ఇవి ఆసియాలోని అన్ని దేశాలలో ఉంటాయి.. వీటిలో పోరాడే తత్వం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది కేవలం కొన్ని దేశాలలో మాత్రమే కనిపిస్తున్నాయి. వీటి సంఖ్య దాదాపు 60 శాతం వరకు తగ్గింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో ఈ కుక్కలు కనిపించాయి. కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలో ఇవి ఉన్నాయి. ఈ కుక్కలు చూసేందుకు పొడవుగా ఉంటాయి. తలభాగం.. తోక భాగం నక్కను పోలి ఉంటుంది. పెద్దగా అరవవు. సూటిగా చూస్తుంటాయి. అదును కోసం ఎదురు చూస్తుంటాయి. ఒకసారి ఎటాక్ మొదలుపెట్టాయా.. ఇక అంతే సంగతులు. నేరుగా పీకను మాత్రమే పట్టుకుంటాయి. ఇవి గుంపుగా వేటను సాగిస్తూ ఉంటాయి. దుప్పులను.. జింకలను ఇష్టంగా తింటాయి. కొన్ని సందర్భాలలో అడవి బర్రెలు.. అడవి దున్నలను కూడా తినేస్తూ ఉంటాయి.

ఒకప్పుడు వీటి సంఖ్య విస్తారంగా ఉండేది. ఆహారం సరిగ్గా లభించకపోవడం.. జనవాసాలకు వచ్చినప్పుడు చనిపోవడం.. వాతావరణంలో మార్పులు.. ఇంకా అనేక రకాల కారణాల వల్ల వీటి సంఖ్య తగ్గడం ప్రారంభమైంది. గడచిన వంద సంవత్సరాల కాలంలో వీటి సంఖ్య 60 శాతానికి పడిపోయింది. ఈ కుక్కలు అత్యంత విశ్వాసంగా ఉంటాయి. కాకపోతే సమిష్టి జీవితాన్ని ఇష్టపడుతుంటాయి. ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. పైగా వేటాడే సమయంలో సంకేతాలు ఇచ్చుకుంటూ ఉంటాయి. కేవలం వాసన ద్వారా మాత్రమే ఇవి తమ సంతతిని గుర్తిస్తాయి. గట్టిగా అరవవు.. కరిస్తే మాత్రం వదిలిపెట్టవు. దాడి చేస్తే ప్రాణాలు తీసేదాకా ఊరుకోవు. అందువల్ల వీటిని రేచు కుక్కలు అని పిలుస్తుంటారు. వీటి సంతతిని కాపాడేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వీటి సంఖ్య అధికంగా ఉండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper