Homeలైఫ్ స్టైల్Bhavitha Mandava: అమెరికాలో మన కుందనపు బొమ్మ.. ఫ్యాషన్ ప్రపంచం మొత్తం షేక్!

Bhavitha Mandava: అమెరికాలో మన కుందనపు బొమ్మ.. ఫ్యాషన్ ప్రపంచం మొత్తం షేక్!

Bhavitha Mandava: ఆ అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే బాపు బొమ్మలాగా కనిపిస్తూ ఉంటుంది. చూడ చక్కని రూపం.. అంతకుమించిన ఆత్మవిశ్వాసం.. వెరసి ఆ అమ్మాయి ఏకంగా అమెరికా గడ్డపై ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతోంది. న్యూయార్క్ సిటీలో జరిగిన “షనెల్ మెతీర్స్ దార్ 2026” కలెక్షన్ లో సంచలనం సృష్టించింది..

సాధారణంగా ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త వాళ్లకు అవకాశాలు తక్కువగా లభిస్తాయి. ఒకవేళ అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో కొత్త వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ తెలుగు అమ్మాయి మందవ భవిత ఏమాత్రం భయపడకుండా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతోంది. 25 సంవత్సరాల వయసులోనే అద్భుతాలు సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ షోలలో అడుగుపెట్టి.. తెలుగు గడ్డకు విశ్వవిఖ్యాతమైన కీర్తిని అందిస్తోంది.. షనెల్ మెతీర్స్ దార్ కలక్షన్ షో ను ఆమె ఓపెన్ చేసింది. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ మోడల్ గా ఆమె రికార్డు సృష్టించింది. బ్రాండ్ నమ్మకాన్ని పొందడం ద్వారా ఆమె ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇలా ఒక ఫ్యాషన్ షో ప్రారంభం ఒక మోడల్ ద్వారా కావడాన్ని అద్భుతమైన గౌరవంగా భావిస్తుంటారు.

ఇదీ భవిత నేపథ్యం

భవిత న్యూయార్క్ యూనివర్సిటీలో అసిస్టివ్ టెక్నాలజీని అభ్యసించడానికి అమెరికా వెళ్ళింది. చదువులో ఆకట్టుకుంటూనే ఫ్యాషన్ రంగం మీద దృష్టి పెట్టింది.. ఈకరంలోని ఆమె ఒక సబ్వే స్టేషన్లో కనిపించగా.. స్కౌటింగ్ టీం చూసింది. స్ప్రింగ్ సమ్మర్ 2025 సీజన్ కు ఒక అమ్మాయి కావాలని ఆ టీం తెగ వెతుకుతోంది. కౌటింగ్ టీం కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకొస్తుంది. మోడల్స్.. యాక్టర్లు.. ప్లేయర్లను వెతికి పట్టుకొని.. ఎంపిక చేస్తుంది.. భవిత ను ఎంపిక చేసిన స్కౌటింగ్ టీం ఆమెకు అపారమైన అవకాశాలు కల్పించడానికి ముందడుగు వేసింది. దానికంటే ముందు ప్రఖ్యాత ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీతో ప్రత్యేక దుస్తులు రూపొందించింది. ఆ దుస్తులను భవిత వేసుకుంది.. బ్లేజి బోటేగా వినేట అనే ఫ్యాషన్ బ్రాండ్లో క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయనకు డిజైనర్ గా కూడా విపరీతమైన అనుభవం ఉంది.

ఇక భవిత బోటేగా వెనేటా బ్రాండ్ కోసం క్యాంపెయిన్ చేసింది. బ్లేజి సూచనలు ఇవ్వడంతో భవితకు తిరుగులేకుండా పోయింది. ఇటీవల నిర్వహించిన స్ప్రింగ్ 2026 కలెక్షన్ లో తొలి షనెల్ లో ఆమె నడిచింది. ఆ తర్వాత మెతీర్స్ దార్ షోలో కూడా ర్యాంపును ఆమె ఓపెన్ చేయడం విశేషం. ఈ కార్యక్రమం న్యూయార్క్ సిటీ ట్రైన్ స్టేషన్లో జరిగింది.

గత ఏడాది డిసెంబర్ 3న భవిత టీవీలలో కనిపించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ వీడియోను భవిత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భవిత బోవరి స్టేషన్ మెట్ల పైనుంచి దిగుతూ రాంప్ మీదికి అడుగుపెడుతుండగా.. ఆమె తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోను భవిత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by @ideservecouture

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular