Britain: “అటువైపుగా వెళ్లకండి. అక్కడికి వెళ్తే మీకు మేము భద్రత కల్పించలేం. వారు మిమ్మల్ని ఏమైనా చేయగలరు. వారి వద్ద మారణాయుధాలు ఉన్నాయి. విస్ఫోటనం కలిగించే పదార్థాలు ఉన్నాయి. దానివల్ల మీ ప్రాణాలు ప్రమాదంలో పడవచ్చు. లేకుంటే ఇంకేదైనా జరగవచ్చు. మీ భద్రత కోసం చెబుతున్నాం. దయచేసి అటువైపుగా వెళ్లకండి” బ్రిటన్ లోని బర్మింగ్ హమ్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో అక్కడి పోలీస్ అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులు ఇవి. వాస్తవానికి బ్రిటన్లో ఈ తరహా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. పైగా ఆ ప్రాంతాలకు వెళ్ళకుండా బ్రిటన్ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది ఇతర దేశస్థుల కోసం కాదు.. స్వయానా బ్రిటన్ దేశస్థుల భద్రత కోరి వారు ఆ చర్యలు తీసుకున్నారు. నిజానికి ఒక దేశంలో.. ఆ దేశ పౌరులను హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేయరు. ఏదైనా అనూహ్య సంఘటన జరిగితే తప్ప. కానీ బ్రిటన్ లో ప్రస్తుతం అంతకుమించి అనేలాగా సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టే.. అక్కడి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంది.
బ్రిటన్ లోని బర్మింగ్ హమ్ అనే సుప్రసిద్ధ ప్రాంతం ఉంది. దాని పరిధిలో అనేక ఉప ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు ఎప్పటినుంచో తలదాచుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ శరణార్థులు బ్రిటన్ ప్రజలపై దాడులకు దిగడం మొదలుపెట్టారు. కాల్పులు జరిపి చంపడం ప్రారంభించారు. అంతేకాదు దోపిడీలకు, దొంగతనాలకు యథేచ్ఛగా పాల్పడుతున్నారు. దీంతో వారిని అదుపు చేయడం అక్కడి పోలీసులకు కష్ట సాధ్యమైంది. దీంతో తమ దేశ పౌరులను రక్షించుకునేందుకు అక్కడ హెచ్చరిక బోర్డులను బ్రిటన్ పోలీసులు ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు మనదేశంలోకి ఈస్టిండియా కంపెనీ ద్వారా బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టారు. వ్యాపారం చేసుకుంటామని చెప్పారు. కానీ ఆ తర్వాత మన దేశంలో పరిపాలకుల మధ్య చిచ్చుపెట్టారు. ఆ తర్వాత మన దేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. చివరికి భారతీయులు సంఘటితంగా పోరాడితే తప్ప మన దేశాన్ని వదిలి వెళ్ళేందుకు ఒప్పుకోలేదు. ఒకనాడు మన దేశాన్ని ఇబ్బంది పెట్టిన బ్రిటిష్ వాళ్ళు.. నేడు అదే ఇబ్బందిని ఎదుర్కోవడం విశేషం. దీనినే కర్మ ఇజ్ బ్యాక్ అంటారేమోనని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
బర్మింగ్ హమ్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇప్పటికే బ్రిటిష్ పోలీసులు కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతాల్లోకి బ్రిటిష్ పౌరులు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులకు ఆ ప్రాంతాలలో బ్రిటిష్ పరిపాలకులు ఆశ్రయం కల్పించారు. కానీ చివరికి ఆ శరణార్థులు ఇప్పుడు బ్రిటిష్ పౌరులపై దాడులకు దిగుతుండడం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మీడియాలోనూ పలు కథనాలు ప్రసారమవుతున్నాయి. అందువల్లే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించే విషయమై బ్రిటన్ ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More