Britain: బ్రిటన్.. 200 ఏళ్లు భారత్‌ను పాలించింది. మన వనరులు, సంపద మొత్తం దోచుకుపోయింది. అఖండ భారత దేశాన్ని ముక్కలు చేసింది. ఆఫ్గానిస్తాన్‌ను, బర్మాను మన నుంచి స్వాతంత్య్రానికి ముందే విడగొట్టింది. ఇక స్వాతంత్రం వచ్చాక పాకిస్తాన్ విడిపోయింది. బ్రిటన్ విభజించి పాలించు సిద్ధాంతం కారణంగా అఖండ భారతంలో ముస్లింలు ఒక్కటై ప్రత్యేక దేశం పాకిస్తాన్‌గా విడిపోయారు. అయితే ఇంత చేసిన బ్రిటన్.. ఒకప్పుడు ప్రపంచంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు క్రమంగా దాని స్థానం దిగజారుతోంది. మరోవైపు బ్రిటన్‌లో స్థానికులకన్నా.. స్థానికేతరులు పెరుగుతున్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా గణనీయంగా పెరుగుతోంది.
పాకిస్తానీయుల చేతుల్లో 11 నగరాలు..
బ్రిటన్‌లోని 11 నగరాల్లో ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఉపాధి నిమిత్తం వెళ్లి స్థిరపడినవారు కొందరు అయితే.. తమ వారు ఉన్నారని అక్రమంగా వెళ్లినవారు ఎక్కువ మంది ఉన్నారు. దీంతో క్రమంగా ఈ నగరాల్లో ముస్లిం జనాభా భారీగా పెరిగింది. ఈ నగరాల్లో ఇప్పుడు స్థానికేలే ద్వితీయ పౌరులుగా జీవిస్తున్నారు. స్థానికులు ఏమైనా అంటే వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తారు.
ఇతర దేశాల నుంచి..
ఈ 11 నగరాలే కాకుండా ఇతర ముస్లిం దేశాల నుంచి కూడా వేల మంది బ్రిటన్‌కు వెళ్తున్నారు. అక్కడే స్థిరపడుతున్నారు. దీంతో మరి కొన్ని నగరాల్లో కూడా ముస్లిం జనాభా పెరుగుతోంది. పాకిస్తాన్‌తోపాటు, పాకిస్తానేతర ముస్లింలు ఒక్కటై బ్రిటన్‌లో విస్తరిస్తున్నారు. దీంతో అక్కడ స్థానిక పాలన పగ్గాలు కూడా ముస్లింలు చేపడుతున్నారు. దీంతో స్థానిక సంస్కృతి దెబ్బతింటోందని బ్రిటన్ వాసులు ఆందోళన చెందుతున్నారు. తమకు పాత బ్రిటన్ కావాలని పోరాటం కూడా చేస్తున్నారు.
అడ్డుకోకపోతే ప్రమాదమే..
ముస్లిం జనాభా పెరుగుదలను బ్రినట్ పాలకులు ఇప్పటి నుంచే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా అక్రమ వలసదారులను పంపించి వేయాలి. తర్వాత జనాభా నియంత్రణ చర్యలు చేపట్టాలి. స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలి. లేదంటే 2050 నాటికి ముస్లిం జనాభా గణనీయంగా పెరిగి చివరకు బ్రిటిష్ పాలనా పగ్గాలు కూడా ముస్లింల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.