Homeవింతలు-విశేషాలు32 lakh per night hotel: ఆ హోటల్లో ఒక్క రాత్రికి 32 లక్షలు.. ఎందుకంత...

32 lakh per night hotel: ఆ హోటల్లో ఒక్క రాత్రికి 32 లక్షలు.. ఎందుకంత ఖరీదు? ఏమా కథ

32 lakh per night hotel: మనదేశంలో ఖరీదైన హోటళ్లు చాలా ఉన్నాయి. దేశ రాజధాని నుంచి మొదలు పెడితే మారుమూల నగరం వరకు ప్రతి ప్రాంతంలోనూ ఇప్పుడు హోటళ్లు అందుబాటులోకి వచ్చాయి. పేరుపొందిన కార్పొరేట్ కంపెనీల నుంచి మొదలు పెడితే మామూలు సంస్థల వరకు ఇప్పుడు హోటళ్ల వ్యాపారంలో ఉన్నాయి. హోటల్ స్థాయిని బట్టి అందులో ధరలు ఉంటాయి. సెవెన్ స్టార్ హోటల్ అయితే ఒక రకంగా.. ఫైవ్ స్టార్ హోటల్ అయితే ఒక రకంగా.. […]

32 lakh per night hotel: మనదేశంలో ఖరీదైన హోటళ్లు చాలా ఉన్నాయి. దేశ రాజధాని నుంచి మొదలు పెడితే మారుమూల నగరం వరకు ప్రతి ప్రాంతంలోనూ ఇప్పుడు హోటళ్లు అందుబాటులోకి వచ్చాయి. పేరుపొందిన కార్పొరేట్ కంపెనీల నుంచి మొదలు పెడితే మామూలు సంస్థల వరకు ఇప్పుడు హోటళ్ల వ్యాపారంలో ఉన్నాయి.

హోటల్ స్థాయిని బట్టి అందులో ధరలు ఉంటాయి. సెవెన్ స్టార్ హోటల్ అయితే ఒక రకంగా.. ఫైవ్ స్టార్ హోటల్ అయితే ఒక రకంగా.. 3 స్టార్ హోటల్ అయితే మరొక రకంగా.. సింగిల్ స్టార్ హోటల్ అయితే మరొక రకంగా ధరలు ఉంటాయి. హోటళ్ల లో వెస్ట్రన్, కాంటినెంటల్ రుచులు లభిస్తుంటాయి. మద్యం.. ఇతర డ్రింక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. గెస్టులు కోరుకునే సౌకర్యాలు హోటల్ నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొస్తారు. చేసిన సర్వీస్ ఆధారంగా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు.

మనదేశంలో ప్రత్యేక వేడుకలు.. పండుగల సమయంలో హోటళ్ల గదులకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో గదుల ధరలు అమాంతం పెరిగిపోతుంటాయి. రోజువారీగా చూసుకుంటే ప్రత్యేక రోజులలో హోటల్ గదులు మరింత ప్రియమైపోతుంటాయి. అయితే ఇప్పుడు ఢిల్లీలో ఒక హోటల్లో ఒక్క నైట్ స్టే చేయాలంటే 32 లక్షలు చెల్లించాలి. చదువుతుంటే గుండెలు అదిరిపోతున్నాయి కదూ.. వాస్తవానికి అదేదో ఫిబ్రవరి 14, లేదా మరొక రోజో అనుకునేరు. ఆరోజు పండుగ కాదు. ప్రత్యేకమైన దినం అంతకంటే కాదు.

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఆర్టిఫిషియల్ ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతోంది. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి 35,000 మంది అతిధులు వస్తున్నారు. వచ్చే గెస్టులలో సుందర్ పిచాయ్, ఆల్ట్ మాన్ నుంచి మొదలు పెడితే ఇంకా చాలా వరకు హై ప్రొఫైల్ వ్యక్తులు వస్తున్నారు. దీంతో ఢిల్లీ నగరంలో హోటల్ గదులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఢిల్లీలోని ఓ ప్రముఖమైన హోటల్ గదిలో ఒక నైట్ లగ్జరీ రూం లో స్టే చేయాలంటే అన్ని టాక్స్ లు కలుపుకొని 32 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే అన్ని కలిపి మహా అయితే రెండు లక్షల వరకు ఉంటుంది. ఆరోజున ఆ హోటల్ నిర్వాహకులు ఏకంగా ధరలను 1500% పెంచడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper