Homeవింతలు-విశేషాలుGujarat Lion Sighting Viral Video: రోడ్డు వెంట వెళ్తున్నారు.. ఉన్నట్టుండి వాటిని చూసి ఆగారు.....

Gujarat Lion Sighting Viral Video: రోడ్డు వెంట వెళ్తున్నారు.. ఉన్నట్టుండి వాటిని చూసి ఆగారు.. లేకపోతే తెల్లారి పేపర్లో కనిపించేవారు!

Gujarat Lion Sighting Viral Video: అది బిజీగా ఉంటే ఒక రోడ్డు. ఆ రోడ్డుమీద వాహనాలు రాకపోకలు జోరుగా సాగుతూ ఉంటాయి. పండుగ సమయంలో ఆ రోడ్డు మీద సందడి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు పండుగలు లేకపోయినప్పటికీ.. ఆ రోడ్డు మీద వాహనాల రాకపోకలు జోరుగానే సాగుతున్నాయి. ఆ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు ఇటీవల చూస్తుండగానే ఆగిపోయాయి. ఆ వాహనాలు అలా ఆగిపోవడానికి కారణం లోపం కాదు.. మరి ఏదైనా సమస్య కాదు. ఆ […]

Gujarat Lion Sighting Viral Video: అది బిజీగా ఉంటే ఒక రోడ్డు. ఆ రోడ్డుమీద వాహనాలు రాకపోకలు జోరుగా సాగుతూ ఉంటాయి. పండుగ సమయంలో ఆ రోడ్డు మీద సందడి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు పండుగలు లేకపోయినప్పటికీ.. ఆ రోడ్డు మీద వాహనాల రాకపోకలు జోరుగానే సాగుతున్నాయి.

ఆ రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు ఇటీవల చూస్తుండగానే ఆగిపోయాయి. ఆ వాహనాలు అలా ఆగిపోవడానికి కారణం లోపం కాదు.. మరి ఏదైనా సమస్య కాదు. ఆ రోడ్డు మీద ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 11 సింహాలు నడుచుకుంటూ వెళ్తున్నాయి. దీంతో ఆ రోడ్డు మీదుగా వాహనాలు నడుపుకుంటూ వెళ్లేవారు ఒక్కసారి ఆగిపోయారు. అంతేకాదు సమీపంలో ఉన్న చెట్లు ఎక్కి కర్రలు సేకరించారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఆమ్రేలి దారి అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. 11 సింహాలు రోడ్డు మీద నుంచి వెళ్తున్న నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అటు వాహనాలను అటు.. ఇటు వాహనాలను ఇటు నిలిపివేశారు. ఆ సమయంలో ప్రయాణికుల మీద సింహాలు దాడి చేయకుండా ఉండడానికి కర్రలు పట్టుకొని ఉన్నారు.

సింహాలు అత్యంత క్రూరమైన జంతువులు. బలంగా ఉంటాయి కూడా. ఎంతటి ప్రత్యర్థులను అయినా సరే ఓడిస్తాయి. పంజా దెబ్బతో చంపేస్తాయి. చీల్చి చీల్చి తినేస్తాయి. అందువల్లే సింహాలకు దూరంగా ఉండాలి అంటారు. అలాంటిది ఆ రోడ్డు మీద వెళ్తున్న వారికి సింహాలు మీటర్ల దూరంలోనే కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఇటీవల కాలంలో ఆమ్రేలీ ప్రాంతంలో సింహాల తాకిడి ఎక్కువైంది. సమీపంలో ఉన్న అడవులలో ఆహార లభ్యత లేకపోవడంతో సింహాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. అంతేకాదు, కొన్ని సందర్భాలలో జంతువుల మీద కూడా దాడి చేస్తున్నాయి. సమీపంలో ఉన్న మనుషులను కూడా చంపేస్తున్నాయి. ఆమ్రేలి ప్రాంతంలో రోడ్డు మీదుగా 11 సింహాలు నడుచుకుంటూ వెళ్లడం స్థానికులకే కాదు ప్రయాణికులకు కూడా వెన్నులో వణుకు పుట్టించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది..

గుజరాత్ రాష్ట్రంలో క్రూర మృగాలు అధికంగా ఉంటాయి. పులులు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. అక్కడ సింహాలు కూడా విస్తారంగా ఉంటాయి. ఇటీవల కాలంలో సింహాలు రోడ్లమీదకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అడవుల సంఖ్య తగ్గిపోవడం.. ఉన్న అడవులలో సరైన స్థాయిలో ఆహారం లభ్యం కాకపోవడంతో సింహాలు ఇలా గ్రామాల సమీపంలోకి వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by BBC News Telugu (@bbcnewstelugu)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper