Lokesh Kanagaraj Allu Arjun Movie: ఒక సినిమాని డైరెక్షన్ చేయడం అంటే అంత ఆషామాషీ వవ్యహరమైతే కాదు. దర్శకుడికి 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండాలి. ఆ సినిమా ఏ జానర్ లో తెరకెక్కుతుందో ఆ జానర్ కి సంబంధించిన పూర్తి అవగాహన దర్శకుడికి ఉండాలి. అలాగే ప్రతి క్రాఫ్ట్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకు రాగలిగే కెపాసిటి తనకి ఉన్నప్పుడే ఒక దర్శకుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారుతాడు. అలాంటి దర్శకులు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగుతారు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో చాలామంది దర్శకులు ఉన్నప్పటికి లోకేష్ కనకరాజుకి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఆయన సినిమాలు అద్భుతంగా ఉండడమే కాకుండా మేకింగ్ విషయంలోను తను చాలా కేర్ తీసుకుంటాడు. ప్రతి సీన్ ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. కచ్చితంగా సినిమాలో ప్రతి ఎలిమెంట్ ని హైలైట్ చేసి చూపించడానికి ఆయన ఎప్పుడు ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు.
అందుకే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం లోకేష్ కనకరాజు తో సినిమా చేస్తున్నాడు. ఇక లోకేష్ చేసిన కూలీ సినిమా ఫ్లాప్ అయినప్పటికి ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు.
మొదట ఈ సినిమా కథని వేరే హీరో కోసం రాసుకున్నాడట. ఆ హీరో హ్యాండ్ ఇవ్వడంతో అల్లు అర్జున్ తో ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు లోకేష్ కనకరాజు ఈ సినిమాని సూర్య తో చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల సూర్య తో ఈ ప్రాజెక్టు వర్కౌట్ కాకపోవడంతో ఆ కథను అల్లు అర్జున్ తో చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది లోకేష్ కనకరాజుకి భారీ విజయాన్ని కట్టబెడుతుందా? ఇంతకుముందు ఆయన కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాను మైమరపింపజేసే విధంగా ఈ సినిమా ఉండబోతుందా? ఆయన మార్కెట్ సైతం అమాంతం పెరుగుతుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…