హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోవాలంటే అందం ఒక్కటే సరిపోదు.. ప్లానింగ్ కూడా ఉండాలి. వచ్చిన అవకాశాలను వాడుకునే తెలివితేటలూ ఉండాలి. అవసరం అనుకుంటే.. అవకాశాలను కూడా సృష్టించుకునే తెగువ, ఓపిక కూడా ఉండాలి. ఇన్ని ఉంటేనే హీరోయిన్ గా కెరీర్ ఉంటుంది, స్టార్ డమ్ ఉంటుంది. అయితే, కొంతమందికి అదృష్టం కలిసొచ్చి అవకాశాలు మొదట్లో విపరీతంగా వచ్చినా.. ఆ తరువాత కెరీర్ పరంగా తీసుకున్న కొన్ని రాంగ్ డెసిషన్స్ కారణంగా ఆ హీరోయిన్ క్లిక్ అవ్వలేక మధ్యలోనే ట్రాక్ తప్పుతుంది.
Also Read: ఆ హీరోయిన్ మళ్ళీ ప్రేమలో పడిందట !
అలా మధ్యలోనే ట్రాక్ తప్పి.. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న హీరోయిన్ ‘నందినీ రాయ్’. స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్న టైంలో చేసిన తప్పులు కారణంగా.. చాల గ్యాప్ వచ్చేసింది. తీరా వయసు ముదురిపోయాక ఇప్పుడు తీరిగ్గా నలుగుర్ని ఆకర్షించేందుకు నందినీరాయ్ అందాల ఆరబోతనే నమ్ముకుని.. అవసరం ఉన్నా లేకపోయినా ఫుల్ ఎక్స్ పోజింగ్ తో ముందుకు వెళ్తుంది. బోల్డ్ పాత్రలు దొరకనప్పుడు ఎవరైనా ఇదే చేస్తారు. కాకపోతే నందినీరాయ్ పాత్ర బోల్డ్ కాకపోయినా.. తానూ బోల్డ్ అంటుంది.
Also Read: పాపం.. నయనతారకు మళ్ళీ పెళ్లి !
కాకపోతే నందిని రాయ్ అందాలు ఇప్పుడు అడవి కాచిన వెన్నెల మాదిరి తయారయ్యాయి. ఇదే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ఆ మధ్య స్వయంగా నందినీ రాయ్ నే చెప్పుకొచ్చింది. ‘కొన్ని తప్పులు వల్ల అవకాశాలను దూరం చేసుకున్నాను. ఆ టైమ్ లో నేను డీప్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. మళ్లీ కోలుకొని ఇప్పుడిలా మీ ముందుకు వచ్చాను’ అంటూ విన్నవించుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఆమె చేస్తున్న కొత్త ప్రయత్నాలు మాత్రం బొత్తిగా కలిసిరావడం లేదట. విప్పడంలో పీక్స్ చూపిస్తోన్నా ఆఫర్లు మాత్రం పలకరించడం లేదట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: No offers for nandini rai
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com