Rakul Preet Singh : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిన నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). తమిళంలో గిల్లీ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగట్రం చేసిన రకుల్ ప్రీత్ సింగ్, తెలుగు ఆడియన్స్ కి కెరటం అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఆమె సందీప్ కిషన్ తో కలిసి నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో రకుల్ ప్రీత్ సింగ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ, అతి తక్కువ సమయంలోనే సౌత్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. కానీ మధ్యలో వరుస ఫ్లాప్స్ ఎదురు అవ్వడంతో ఈమె మన సౌత్ సినిమాలకు బాగా దూరమైంది. ఈమధ్య కాలంలో ఎక్కువగా ఆమె బాలీవుడ్ లోనే కనిపిస్తుంది.
Also Read : పెళ్లి తర్వాత అతన్ని బాగా మిస్ అవుతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్!
సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రకుల్ ప్రీత్ సింగ్ కి 16 ఏళ్ళు కావొస్తుంది. ఈ సందర్భంగా ఆమె బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘ఏ రంగం లో అయినా జయాపజయాలు రావడం సహజం. సినీ ఇండస్ట్రీ లో అయితే ఇవి సర్వ సాధారణం. కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు. కానీ మనం నమ్మిన పనిని చేసుకుంటూ ముందుకు పోవాలి. నా వరకు మాత్రం నిరంతరం బిజీ గా ఉంటేనే ప్రశాంతతకు ఉంటాను. నా జీవితం కెమెరాలకు అలవాటు అయిపోయింది. షూటింగ్ లేకపోతే చాలా ఒత్తిడికి గురి అవుతాను. నిరంతరం పని చేస్తూ ఉంటేనే నా మనసుకు ఆనందం. అదే నన్ను ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇకపోతే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ‘ఇండియన్ 3’, ‘దే దే ప్యార్ దే 2’ వంటి సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ లో కూడా ఈమె నటిస్తుంది. ఇందులో ఆమె సూర్పనక్క క్యారక్టర్ లో కనిపించబోతుంది. సూర్పనక్క రామాయణం లో విలన్ క్యారక్టర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. కెరీర్ లో మొట్టమొదటిసారి ఆమె విలన్ రోల్ లో కనిపించనుంది. ఇక పోతే ఈ సినిమాలో శ్రీ రాముడి క్యారక్టర్ లో రణబీర్ కపూర్, సీత క్యారెక్టర్ లో సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణాసురిడిగా కన్నడ సూపర్ స్టార్ యాష్ నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది. ఇక తెలుగు లో ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.
Also Read : జాక్పాట్ కొట్టేసిన రకుల్ ప్రీత్ సింగ్..ఇదే చివరి అవకాశం..మిస్ అయితే కెరీర్ ముగిసినట్టే!