Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) కి సంబంధించిన టీజర్ ని నిన్న శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేయగా, అభిమానుల నుండి, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి అనేది అందరికీ తెలుసు. ‘పెద్ది’ చిత్రం రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలకు మించే టీజర్ ఉండడం తో కచ్చితంగా రామ్ చరణ్ ఈ చిత్రం తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసిస్తాడని అభిమానులు బలమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇకపోతే యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ కి 24 గంటల్లో 31 మిలియన్ల వ్యూస్, 4 లక్షల 63 వేల లైక్స్ వచ్చాయి.
Also Read : పెద్ది vs ప్యారడైజ్ పోటీ లో గెలిచేది ఎవరు..?
ఇది సాధారణమైన విషయం కాదు. ఇదంతా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసి సాధించడం మరో అరుదైన ఘనత. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్ (Glimpse videos) లో ‘పెద్ది’ టీజర్ అత్యధిక వ్యూస్ ని సాధించిన టీజర్ గా నిల్చింది. ‘పెద్ది’ తర్వాతి స్థానంలో దేవర చిత్రం 26 మిల్లియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకోగా, ఆ తర్వాతి స్థానం లో ‘పుష్ప2’ చిత్రం నిల్చింది. కానీ పాన్ ఇండియా లెవెల్ లో మాత్రం అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకున్న టీజర్ (Glimpse Video) గా కన్నడ సూపర్ స్టార్ యాష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రం మొదటి స్థానంలో నిల్చింది. ఈ టీజర్ వీడియో కి 24 గంటల్లో 37 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘పెద్ది’ టీజర్ కాస్త పెద్ద యూట్యూబ్ ఛానల్ లో విడుదల అయ్యుంటే, ఈ రికార్డు కూడా బద్దలు అయ్యేదని అంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన హిందీ టీజర్ ని విడుదల చేసారు. నిన్న హిందీలో తప్ప అన్ని ప్రాంతీయ భాషల్లో పెద్ది టీజర్ విడుదల అయ్యింది. నేడు 290 మిలియన్ Subscribers ఉన్నటువంటి T సిరీస్ యూట్యూబ్ ఛానల్ లో విడుదలైంది. హిందీ లో మొదటి నుండి రామ్ చరణ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక ఇంత మంచి టీజర్ ని అంత పెద్ద ఛానల్ లో అప్లోడ్ చేయడంతో ఆ టీజర్ కి భవిష్యత్తులో ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా టీజర్ లోని చివరి షాట్ నార్త్ ఇండియా లో బాగా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే క్రికెట్ ఆటగాళ్లు ఎంతో మంది ‘పెద్ది షాట్’ ని ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. IPL సీజన్ కావడంతో రాబోయే రోజుల్లో ఈ టీజర్ కి వచ్చే రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండనుంది.
Also Read : అక్షరాలా 3 కోట్ల వ్యూస్..మొదటి షాట్ తోనే ప్రభంజనం సృష్టించిన ‘పెద్ది’