అయితే హెబ్బా పటేల్ కి ‘కుమారి 21F’ చిత్రం తర్వాత, అదే స్థాయి గుర్తింపు,క్రేజ్ ని తెచ్చిపెట్టిన చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్'(Odela Railway Station). ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల అవ్వకపోవడం హెబ్బా పటేల్ దురదృష్టం. కరోనా లాక్ డౌన్ సమయంలో ‘ఆహా’ మీడియా లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హెబ్బా పటేల్ తన నట విశ్వరూపం చూపించింది అనే చెప్పాలి. ఎంతో క్యూట్ గా మాట్లాడుతూ, సాఫ్ట్ క్యారెక్టర్స్ లో కనిపించే హెబ్బా పటేల్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయిన క్షణాలవి. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2′(Odela 2 Movie) తెరకెక్కింది. తమన్నా(Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. ఈ నెల 17వ తారీఖున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హెబ్బా పటేల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నాకు తమన్నా గారికి కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో తమన్నా నాకు అక్క పాత్రలో కనిపించనుంది. అయితే నేను ఈ చిత్రం లో ఎక్కువ శాతం జైలు సన్నివేశాల్లోనే కనిపిస్తాను. మొదటి భాగం లో నా క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ ఇంప్యాక్ట్ ని చూపించిందో, ‘ఓదెల 2’ లో కూడా అదే రేంజ్ ఇంప్యాక్ట్ చూపిస్తుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రాన్ని అప్పట్లో మేము ఒక ప్రయోగం లాగా తెరకెక్కించాము. దానికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఓదెల 2′ మొదటి భాగం కంటే పెద్ద స్కేల్ లో తెరకెక్కిన సినిమా. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read : కేవలం డబ్బు కోసమే చేశాను: హెబ్బా పటేల్