spot_img
HomeNewsDhoom 4 : ధూమ్ 4 పై క్రేజ్ అప్డేట్... విలన్ గా ఆ స్టార్...

Dhoom 4 : ధూమ్ 4 పై క్రేజ్ అప్డేట్… విలన్ గా ఆ స్టార్ హీరో!

Dhoom 4 : ధూమ్ సిరీస్ కి ఇండియా వైడ్ అభిమానులు ఉన్నారు. 2004లో యష్ రాజ్ ఫిల్మ్స్ ధూమ్ ఫస్ట్ పార్ట్ ని నిర్మించింది. జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ఈషా డియోల్, రిమి సేన్ ప్రధాన పాత్రలు చేశారు. యాక్షన్ థ్రిల్లర్ ధూమ్ భారీ విజయం అందుకుంది. అభిషేక్ బచ్చన్ ఏసీపీ రోల్ చేయగా, జాన్ అబ్రహం దొంగగా అలరించాడు. అనంతరం 2006లో ధూమ్ 2 తెరకెక్కింది. పార్ట్ 2లో హృతిక్ రోషన్ జాయిన్ అయ్యాడు. క్రేజీ దొంగగా ఆయన ఆకట్టుకున్నారు.

మరోసారి ఏసీపీగా అభిషేక్ బచ్చన్ నటించారు. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించడం విశేషం. పార్ట్ 1 కి మించి భారీ విజయం పార్ట్ 2 నమోదు చేసింది. ఇక 2013లో ధూమ్ 3 విడుదలైంది. అమిర్ ఖాన్ ఈ ఫ్రాంచైజ్ లో అడుగు పెట్టాడు. ధూమ్ 3 సైతం విజయం అందుకుంది. దాదాపు పదేళ్ల అనంతరం ధూమ్ 4కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో విలన్ రోల్ చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు రన్బీర్ కపూర్. యానిమల్ హీరో ధూమ్ 4 లో ప్రతినాయకుడు పాత్ర చేస్తున్నాడట. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి ధూమ్ సిరీస్లో విలన్ అంటే… ప్రధాన హీరో అని చెప్పొచ్చు. పోలీసులను ముప్పతిప్పలు పెట్టే దొంగనే ధూమ్ సినిమాకు హీరో అవుతాడు.

జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమిర్ ఖాన్ ఈ సిరీస్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశారు. సెకండ్ హీరోగా అభిషేక్ బచ్చన్ నటించాడు. అదన్నమాట సంగతి. ధూమ్ 4 కి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం రన్బీర్ కపూర్ రామాయణం మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రెండు మూడు భాగాలుగా ఈ సిరీస్ తెరకెక్కనుందట. సౌత్ ఇండియన్ బ్యూటీ సాయి పల్లవి రామాయణం చిత్రంలో సీతగా నటించడం విశేషం.

కాగా గత ఏడాది యానిమల్ చిత్రంతో రన్బీర్ కపూర్ భారీ విజయం నమోదు చేశాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అనిల్ కపూర్, రష్మిక మందాన, పృథ్విరాజ్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేశారు. యానిమల్ మూవీపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ప్రేక్షకులు ఆదరించారు.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper