Fahad Fazil
Fahad Fazil : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని సుకుమార్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాన్ ఇండియా వైడ్ గా ‘పుష్ప 2’ సినిమాకి భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబడుతుంది అంటూ సినిమా మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడానికి రెడీగా ఉందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శక నిర్మాతలు వాళ్ళ సినిమా బిజినెస్ అవ్వడానికి ఇలాంటి మాటలను చెబుతూనే ఉంటారు. మరి సినిమా రిలీజ్ అయ్యేంతవరకు కూడా ఏది నిజం అనేది తెలియడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయితేనే అప్పుడు ఆ హీరోకి దర్శకుడికి మంచి పేరు అయితే వస్తుంది… ఇదిలా ఉంటే పుష్ప మొదటి పార్ట్ లో బైరవసింగ్ షెకావత్ గా నటించి మెప్పించిన ఫాహద్ ఫజిల్ సెకండ్ పార్ట్ లో కూడా విలన్ గా రాణించడానికి సిద్దమయ్యాడు.
అయితే పుష్ప సినిమా విషయంలో ఆయన చాలా వరకు అసంతృప్తిగా ఉన్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే తనకు సుకుమార్ మొదట కథ చెప్పినప్పుడు తన క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుందని సుకుమార్ చెప్పారట.
కానీ మొదటి పార్ట్ లో ఆయన చివరలో వచ్చి కొంతవరకు ప్రేక్షకులు అలరించే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ పార్ట్ లో ఆయన క్యారెక్టర్ చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆయనకి సుకుమార్ ఒక షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే ఫాహాద్ ఫజిల్ పాత్రను తగ్గించి స్టోరీ ని కొంచెం చేంజ్ చేసి సుకుమార్ రాసుకున్నారట. దానివల్ల ఈ సినిమా మీద పెద్దగా ఆసక్తిని చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి.
కారణం ఏదైనా కూడా ఈ సినిమా సక్సెస్ వల్ల సుకుమార్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఫాహాద్ ఫజిల్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడానికి పుష్ప సినిమాకి కమిట్ అయ్యాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసే పాత్రకి పెద్దగా వాల్యూ లేనప్పుడు ఆయన క్రేజ్ కూడా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: What is the reason fahad fazil is not satisfied with pushpa 2